Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

12, నవంబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 52

తనవారు లేనిచోటును
జనమించుక లేనిచోట జగడము చోటన్,
అనుమానమయిన చోటను,
మనజున కట నిలువఁదగదుఁ మహిలో సుమతీ. 

 భావం:-
తన బంధువులు లేని తావునను,తనకు మచ్చికలేని తావునను,తనపై ననుమానమయిన తావునను మనుష్యుడు నిలవక్కూడదు. 

10, నవంబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 51

తన కలిమి యింద్రభోగము,
తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్,
తన చావు జగత్ప్రళయము
తను వలచిన యదియెరంభ తథ్యము సుమతీ.

 భావం:-
తనభాగ్యము ఇంద్రవైభవము వంటిదిగాను,తన పేదరికమే ప్రపంచమున గొప్ప దారిద్ర్యము వంటిదిగాను,తన చావే యుగాంత ప్రళయము వంటిదిగాను,తాను వలచిన స్త్రీయే చక్కదనము గలిగినటువంటిదుగాను మనుజులెంచుదురు.

9, నవంబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 50

తనయూరి తపసితనమును
దనబుత్రుని విద్యపెంపుఁ,దన సతి రోపున్,
దన పెరటిచెట్టు మందును,
మనసున వర్ణీంపరెట్టి మనుజులు సుమతీ. 

 భావం:-
తన గ్రామములో జేయు తపోనిష్ఠయు,తన కుమారుని విద్యావైభోగమును,తన భార్య యొక్క సౌందర్యమును,తన పెరటి లోని చెట్టు మందును,యెటువంటి మనుజులైనను పొగడరు.

8, నవంబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 49

తనకోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష,దయ చుట్టంబౌఁ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు,తథ్యము సుమతీ.

 భావం:-
తనయొక్క కోపము శత్రువు వలె బాధయును.నెమ్మదితనము రక్షకునివలె రక్షణయును,కరుణ చుట్టమువలె ఆదరమును, సంతోషము స్వర్గమువలె సుఖమును,దుఃఖము నరకము వలె వేదనను కల్గించునని చెప్పుదురు.

7, నవంబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 48

తడవోర్వక యొడలోర్వక
కడువేగం బడచిపడిన గార్యంబుగానే
తడవోర్చిన నొడ లోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్లఁ జేకురు సుమతీ.

భావం:-
ఆలస్యమును,శ్రమను సహింపక,వెంటనే త్వరపడినచో ఏ కార్యమును కానేరదు.ఆలస్యమును,శ్రమను సహించి ఓపికపట్టినచో చెడిపోయిన కార్యమంతయును సమకూరును.

6, నవంబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 47

చేతులకు తొడవు దానము
భూతలనాథులకుఁదొడవు బొంకమి,ఠఃఅరలో,
నీతియే తొడ వెవారికి.
నాతికి మానంబు తొడవు,నయముగ సుమతీ.

భావం:-
చేతులకు దానమును,రాజుల కబద్ధమాడకుండుటయును,ధరణిలో నెవ్వరికయినని న్యాయమును,స్త్రీకి పాతివ్రత్యమును అలంకారము.

5, నవంబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 46

చుట్టములు గానివారలు
చుట్టములముఁ నీకటంచు సొంపుదలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ. 

భావం:-
బంధువులు కానివారు సహితము ధనము కలిగినపుడు నీకు మేము చుట్టాలమని ఉల్లాసముతో బలాత్కారముగా వచ్చి మిగుల ధృడముగా నాశ్రయింతురు. 

4, నవంబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 45

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుఁడుదగన్
హేమంబుఁ గూడఁ బెట్టిన
భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీ. 

భావం:-
చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైన విధముగానే,లోభి దాచిపెట్టిన ధనము రాజులపాలగును. 

3, నవంబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 44

చింతింపకు కడచినపని
కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో
నంతఃపుర కాంతులతో
మంతనములు మానుమిదియే మతముర సుమతీ. 

 భావం:-
జరిగిపోయిన పనికి విచారింపకుము,స్త్రీలు ప్రేమింతురని నమ్మకుము.రాణివాస స్త్రీలతో రహస్యాలోచనములు చేయుకుము.ఇదియే మంచి నడవడి సుమా. 

2, నవంబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 43

గడనగల మగనిఁ జూచిన
నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలోఁ
గడనుడుగు మగనిఁజూచిన
నడపీనుగు వచ్చెననుచు నగుదురు సుమతీ. 

భావం:-
స్త్రీలు సంపాదన గల పతిని జూచి యడగలకు క్రింద వస్త్రపు మడతలు వేసినట్లు తమలో భావించుచూ గౌరవింతురు.సంపాదన లేని పతిని జూచిన నడచెడు పీనుగుగా తమలో భావించుచూ పరిహాసము చేయుదురు. 

1, నవంబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 42

కోమలి విశ్వాసం బునూ
బాములతో జెలిమిఁ యన్య భామల వలపున్,
వేముల తియ్యదనంబును,
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ.

భావం:-
స్త్రీలయొక్క నమ్మకమును,పాములతో స్నేహమును,పర్సస్త్రీల యొక్క మోహమును,వేపచెట్టు తియ్యదనమును,రాజుల విశ్వాసమునకు కల్లలు.

31, అక్టోబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 41

కొఱగాని కొడుకు పుట్టినఁ
గొఱగామియెగాదు తండ్రి గుణములఁజెఱచున్
జెఱకుతుద వెన్ను పుట్టినఁ
జెఱ్కునఁ తీపెల్ల జెరచు సిద్దము సుమతీ. 

భావం:-
చెఱకుకొనయందు వెన్నుపుట్టి ఆ చెఱకునందలి తియ్యదనమెల్ల యెట్లుపాడుచేయునో అట్లే నిష్ప్రయోజకుండగు కొడుకు పుట్టినచో వాడు నిష్ప్రయోజకుడగుటయేగాక తండ్రి యొక్క మంచి గుణములు గూడ చెఱచును. 

30, అక్టోబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 40

కొక్కోక మెల్ల జదివిన
చక్కనివాఁసైన రాజ చంద్రుండైనన్
మిక్కిలి రొక్కము నీయక
చిక్కదురా వారకాంత సిద్దము సుమతీ.

భావం:-
రతిశాస్త్రమంతయు చదివినవాడనైనను,అందము గలవడైనను,రాజులలొ శ్రేష్టుడైనను,మిక్కిలి ధనమీయకుండా వేశ్య లభించదు.

29, అక్టోబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 39

కొంచెపు నరుసంగతిచే
నంచితముఁగ గీడువచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి కఱచిన
మంచమునకుఁ బెట్లువచ్చు మహిలో సుమతీ. 

 భావం:-
చిన్ననల్లి కఱచినచో మంచమునకే విధముగా దెబ్బలు తగులునో అట్లే నీచునితో స్నేహము చేసినవాడికి కీడు కలుగును. 

28, అక్టోబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 38

కూరిమిగల దినములలో
నేరములెన్నఁడునుఁ గలుగ నేరవు మఱి యా
కోరిమి విరిసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ. 

భావం:-
స్నేహముగల దినములలో యెప్పుడునూ తప్పులు కనబడవు.ఆ స్నేహము విరోధమైనచో ఒప్పులే తప్పులుగా నగపడుచుండును. 

27, అక్టోబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 37

కులకాంతతోడ నెప్పుడుఁ
గలహింపకుఁ వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంటి కన్నీ
రొలికిన సిరి యింటనుండ దొల్ల దు సుమతీ.

 భావం:-
భార్యతో ఎప్పుడును జగడమాడరాదు.లేనితప్పులు మోపరాదు.పతివ్రతయైన స్త్రీయొక్క కంటినీరు పడినచో ఇంటి యందు సంపద ఉండదు.

26, అక్టోబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 36

కారణము లేని నగవునుఁ
బేరణములేని లేమ పృథివీస్థలిలోఁ
బూరణము లేని బూరెయు
వీరణాములు లేని పెండ్లి వృధరా సుమతీ.

భావం:-
కారణములేని నవ్వును,రవికెలేని స్త్రీయును,పూరణములేని బూరెయను,వాద్యములులేని పెండ్లియును,గౌరవములేక యుండును.

25, అక్టోబర్ 2013, శుక్రవారం

జీవన సురభి అక్టోబరు సంచిక

తెలుగులో ఒక చక్కటి భక్తి - ఆధ్యాత్మిక - సాంస్కృతిక పత్రిక: జీవన సురభి.
డిజిటల్ ఎడిషన్లు ఇక్కడ దొరుకుతున్నాయి.
http://issuu.com/mediahub/docs/jeevanasurabhioct13

భారతదేశంలో ఉన్నవారు చందా కట్టడం ద్వారా ప్రింటు పత్రికని పొందవచ్చు. వివరాలకి Mani Bhushan గారిని సంప్రదించండి.




సుమతీ శతకం - 35

కాముకుడు దనిసి విడిచినఁ
కోమలిఁ బరవిటుఁడు గవయఁ గోరుటయెల్లన్
బ్రేమమునఁ జెఱుకు పిప్పికిఁ
జీమలు వెస మూగినట్లు సిద్దము సుమతీ.

భావం:-
కాముకుడు తాను తృప్తియగునంతువరకుననుభవించి విడిచిన స్త్రీని మఱియొకవిటగాడనుభవింపగోరుట చెరుకురసము పీలిచికొనగా మిగిలిన పిప్పిని చీమలాసతో ముసురుకొన్నట్లుపయోగములేనిదిగా నుండును.



24, అక్టోబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 34

కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తి కాంత పొందిన పిదపన్
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ. 

భావం:-
 దుర్జన స్నేహము కూడదు.కీర్తి సంపాదించిన తరువాత తొలగిఁపోదు.అప్పునిచ్చుట కలహముకు మూలము.స్త్రీలకు ప్రేమ కోంచమైనను యుండదు.

23, అక్టోబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 33

కవి గానివాని వ్రాతయు
నవరసభావములు లేని నాతులవలపున్
దవిలి చని పంది నేయని
విధధాయుధకౌశలంబు వృధరా సుమతీ.

 భావం:-
కవిత్వ శక్తిలేనివాడు వ్రాసిన వ్రాతయు,తొమ్మిదిరసముల యొక్క అనుభవములేని స్త్రీలయొక్క మోహమును,వెంబడించి పరుగెత్తి పందిని కొట్టలేనటువంటివాని నానా విధాయుధముల నేర్పరితనమును వ్యర్థములు.


22, అక్టోబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 32

కసుగాయఁ గఱాచి చూచిన
మసలకఁతగు యొగరుఁగాక మదురంబగునా?
పస గలుగు యువతులుండగఁ
బసిబాలలఁబొందువాడు పశువుర సుమతీ.

భావం:-
పండినపండు తినక పచ్చికాయ కొరికినచో వెంటనే వగరు రుచితోచునుగాని మధురమెట్లుగలుగదో,అట్లే యౌవనముగల స్త్రీలుండగా పసిబాలికలతో గూడినచో వికటముగా నుండును.చిన్న బాలిక పొందు గూడినవాడు పశువుతో సమానుడు.


21, అక్టోబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 31

కరణము సాదైయున్ననుఁ
గరి మదముడిగిననుఁ,బాము గఱవకయున్నన్
ధరఁ దేలు మీటకున్ననుఁ
గరమరుదుగ లెక్కగొనరు గదరా సుమతీ. 

 భావం:-
 కరణము మెత్తని తనమును గలిగియుండినను,ఏనుగుమదము విడిచినను,పాము కఱవకుండిన,తేలు కుట్టకుండినను జనులు లక్ష్యము చేయరు.

20, అక్టోబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 30

కరణముల ననుసరింపక
విరసంబునఁ దిన్నతిండి వికటించుఁజుమీ,
యిరుసునఁ గందెన బెట్టక
పరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ.

భావం:-
పరమేశ్వరునిబండి యయినప్పటికిని యిరుసులో కందెనను బెట్టనిదే పరుగెత్తనియట్లే,కరణ్మతో నౌసరింపక యున్నయెడల కష్టములు సంభవించును.

19, అక్టోబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 29

కరణముఁగరణము నమ్మిన
మరణామ్తక మౌనుగాని మనలేడు సుమీ
కరణము దనసరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ.

భావం:-
కరణము మరియొక కరణమును నమ్మిన యెడల ప్రాణాపాయమైన యాపదగల్గును గాని బ్రతుకఁలేడు.కావున కరణము,తనతో సాటియైన కరణమును నమ్మక,మఱియు,రహస్యమును దెలుపక జీవించవలయును.

18, అక్టోబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 28

 కమలములు నీటబాసిన
 గమలాప్తునిరశ్మిసోకి కమలిన భంగిన్ 
 తమతమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.

 భావం:-
కమలములు తమ స్థానమగు నీటిని వదిలిన యెడల తమకు మిత్రుడగు సూర్యుని వేఁడిచేతనే వాడిపోవును.అట్లే ఎవరుగాని తమ తమ యునికిపట్లు విడిచినచో తమ స్నేహితులే విరోధులగుట తప్పదు.

17, అక్టోబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 27

కప్పకు నొరగాలైనను,
సప్పమునకు రోగమైన,సతి తులువైనన్,
ముప్పున దరిద్రడైనను
తప్పదు మఱి దుఃఖమగుట తధ్యము సుమతీ.

 భావం:-
కప్పకు కుంటికాలైననూ,పాముకు రోగమైననూ,భార్య చెడ్డదైనను,ముసలితనమున దరిద్రము వచ్చినను,తప్పకుండా దుఃఖము కలుగును.

16, అక్టోబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 26

కనకపు సింహాసమున
శునకముఁ గూర్చుండఁబెట్టి శుభలగ్నమునన్
వొనరగఁ బట్టముఁ గట్టిన
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ.

భావం:-
బంగారపు గద్దెయందు కుక్కను కూర్చొండజేసి మంచి ముహూర్తాన పట్టభిషేకము చేసిననూ దానికి సహజమైన యల్పగుణము మానదు.అట్లే నీచుఁడయిన వానిని ఎంత గౌరవించిననుఁ వాని నీచగుణము వదలడు.

4, అక్టోబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 25


కడు బలవంతుడైననుఁ
బుడమినిఁ బ్రాయంవుటాలిఁ పుట్టిన యింటన్
దడవుండ నిచ్చెనేనియుఁ
బడుపుగఁ నంగడికిఁదానె బంపుట సుమతీ.

 భావం:-
ఎంత బలవంతుడైనను పడుచు పెండ్లామును ఆమె పుట్టింటి దగ్గర చిరకాలముండనిచ్చిన యెడల,తానే దానిని జారిణిగా దుకాణమునకు పంపినట్లు యగును.

3, అక్టోబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 24

ఓడలఁ బండ్లును వచ్చును
ఓడలు నాబండ్లమీదఁ నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుఁ గలిమిలేమి వసుధను సుమతీ.

భావం:-
ఓడలమీద బండ్లును,బండ్లమీద ఓడలను వచ్చును,ఇట్లే ఐశ్వర్యము వెంట దారిద్ర్యమును,దారిద్ర్యము వెంట ఐశ్వర్యమును వచ్చును.

2, అక్టోబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 23


ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్ల నివాఁడే
గొల్లండుఁ గాక ధరలో
గొల్లండుఁను గొల్లడౌనెగుణమున సుమతీ.

 భావం:-
ఇష్టపడని భార్యను,విశ్వాసములేని యజమానిని, ఇష్టపడని స్నేహితుని విడుచుట కిష్టపడనివాఁడే గొల్ల కాని,ఆ కులమందుపుట్టిన మాత్రమున గొల్లకాడు.

1, అక్టోబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 22


ఒక యూరికి నొక కరణము
నొక తీర్పరియైనగాఁక నొగిఁదఱుచైనన్
గకవికలు గాక యుండునె?
సకలంబునుఁగొట్టుపడక సహజము డుమతీ.

భావం:-
ఒక గ్రామమునకు ఒక కరణమును,ఒక న్యాయాధికారియునుగాక.క్రమముగా ఎక్కువమంది యున్నచో,పన్నులన్నియూ చెడిపోయి చెల్లాచెదురుగాక యుండునా?(ఉండవు)


30, సెప్టెంబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 21

ఏఱకుమీకసుగాయలు
దూఱకుమీ బంధుజనులఁ,దోషము సుమ్మీ!
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువులాజ్ఞ,మేదిని సుమతీ.

భావం:-
లేతకాయలను కోయరాదు.చుట్టములను నిందింపరాదు. యుద్ధమునందు పాఱిపోరాదు.గురువుల ఆజ్ఞను అతిక్రమించరాదు. 


28, సెప్టెంబర్ 2013, శనివారం

ఉత్తర రామాయణ కధలు

సుమతీ శతకం - 20

ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
దెప్పలుగఁ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ. 

 భావం:-
చెఱువులో తెప్పలాడునట్లు నీరు నిండుగా నున్నచో కప్పలనేకములు చేరును.అట్లే భాగ్యము ఎప్పుడు గలుగునో అప్పుడే చుట్టములు వత్తురు.

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

అరుణ - చలం నవల

సుమతీ శతకం - 19

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషునిఁ గొల్వఁగూడ దది యెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
గప్పవడించు విధంబు గదరా సుమతీ. 

 భావం:-
 ఎప్పుడునూ తప్పులు వెదుకు మనష్యుని సేవించుటకూడదు.ఎందుచేతననగా,కప్ప తన్ను జంపునట్టి పాముయొక్క పడగ క్రింద నివసించిన నెంత హానికరమో ఆ సేవకుని స్థితి కూడా అంతే హానికరము.

26, సెప్టెంబర్ 2013, గురువారం

అల్పజీవి

సుమతీ శతకం - 18

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుఁవాఁడె దన్యుఁడు సుమతీ. 

 భావం:-
ఏ సమయమునకు ఏది తగినదో,అప్పటికి ఆ మాటలాడి ఇతరుల మనస్సుల నొప్పింపక,తాను బాధపడక,తప్పించుకొని నడుచుకొనువాడే కృతార్థుడు. 

25, సెప్టెంబర్ 2013, బుధవారం

ఆముక్తమాల్యద (విష్ణుచిత్తీయము)

సుమతీ శతకం - 17

ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను జెఱకు కై వడినే పో
నెపములు వెదుకునుఁ గడపటఁ
అపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ. 

 భావం:-
ఆలోచించి చూడగా చెఱకుగడ మొదలు తియ్యగా నుండి నడుమ నడుమ తీపి తగ్గి చివరకు చప్పిడియైపోవునట్లే చెడ్డవారి స్నేహము మొదట నింపుగాను,నడుమ నడుమ వికటముగానూ నుండి చివరకు చెఱుపు గలిగించినదిగా నుండును సుమా! 

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

తిక్కన భారతము - రసపోషణము

సుమతీ శతకం - 16

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ.

భావం:-
మేలు చేసినవారికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు.కీడు చేసిన వానికి,తప్పు తలంపక మేలు చేయువాడే నేర్పరితనము గలవాడు.

23, సెప్టెంబర్ 2013, సోమవారం

తెలుగు సాహిత్య కోశము

సుమతీ శతకం - 15

ఉదకముఁ ద్రావెడు హయమును,
మదమున నుప్పంగుచుండు మత్తేభబున్,
మొదవుకడ నున్న వృషభముఁ
జదువని యా నీచకడకుఁ జనకుర సుమతీ. 

 భావం:-
నీరు త్రాగుచున్న గుఱ్ఱము దగ్గరకునూ,మదము చేత ఉప్పొంగుచున్న మదపటేనుగు దగ్గరకునూ,ఆవు దగ్గరనున్న ఎద్దు దగ్గరకునూ,చదువు రాని హీనుని వద్దకును వెళ్ళకుము. 

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

సంస్కృత సాహిత్య చరిత్ర

సుమతీ శతకం - 14

ఉత్తము గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యెడలన్ దా
నెత్తెచ్చి కఱఁగి పోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ. 

 భావం:-
ఈ భూమిలో ఎచ్చ్టటనైననూ బంగారములో సరి యెత్తున ఇత్తడిని తూచి కఱగించి పోసినను బంగారము కాజాలదు.అట్లే నీచునకు యే విధముగనైననూ ఉత్తముని గుణములు కలగవు.

21, సెప్టెంబర్ 2013, శనివారం

తెలుగు పర్యాయపద నిఘంటువు

సుమతీ శతకం - 13

ఉడుముండదె నూఱేండ్లునుఁ
బడియుండదె పేఱ్మిఁబాము పదినూఱేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
కడునిలఁ బురుషార్దపరుఁడు గావలె సుమతీ. 

 భావం:-
ఉడుము నూఱేండ్లును,పాము వెయ్యేండ్లును,కొంగ మడుగులో బహుకాలమును జీవించును.కాని,వాటివలన ప్రయోజనమేమి?మంచి పనులు యధాశక్తి చేయగలవా డుండిన ప్రయోజనమగును.