అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !

ప్రబంధములు సంపుటిపారిజాతాపహరణం

- నంది తిమ్మన

ఇష్టదేవతా స్తుతి

శ్రీమదికిం బ్రియం బెసఁగఁ
జేర్చిన యుయ్యెల లీల వైజయం
తీ మిళితాచ్చ కౌస్తుభము
నిద్దపుఁ గాంతిఁ దనర్చి యాత్మ వ
క్షోమణి వేదిఁ బొల్పెసఁగఁ
జూడ్కుల పండువు సేయు వేంకట
స్వామి కృతార్థుఁ జేయు నర
స క్షితినాథుని కృష్ణరాయనిన్

పొలఁతుల్ కౌఁగిటఁ గ్రుచ్చి యెత్తి తలఁబ్రా ల్వోయించు నవ్వేళ నౌఁ
దల గంగం దన నీడఁ దాన కని మౌగ్ధ్యం బొప్ప వేఱొక్క తొ
య్యలి యంచున్మది నెంచు పార్వతి యసూయావాప్తికిన్నవ్వు క్రొ
న్నెలపూ దాలుపు కృష్ణరాయనికి సంధించు న్మహైశ్వర్యముల్ |మ| [2]

తన దంతాగ్రముచేతఁ దీక్ష్ణమతి, నుద్య త్కుంభయుగ్మంబుచే
త నితాంతోన్నతి, దాన విస్ఫురణ నుత్సాహంబు, శుండా ముఖం
బున దీర్ఘాయువు నిచ్చుఁ గావుత గుణాంభోరాశికిం గృష్ణరా
యనికి న్వారణ రాజ వక్తృఁడు కృపాయత్తైక చిత్తాబ్జుఁడై |మ| [3]

సరసపు టల్కఁ దీర్చుతఱి శార్ఙ్గ సుదర్శన నంద కాబ్జ సం
భరణ గుణాప్తి నెన్నడుముపైఁ గటిపై జడపై గళంబుపై
హరి నలుగేలుఁ బైకొన సుఖాంబుది నిచ్చలు నోలలాడు నిం
దిరి కృపఁ జూచుఁ గాత నర దేవ శిఖా మణిఁ గృష్ణరాయనిన్ |చ| [4]

తన మృదు గీతికా పరిణత ధ్వని వైఖరిఁ బల్కు మంచు నిం
చిన రహిఁ జేతివీణియకుఁ జెక్కులు గీఁటుచు నేర్పు లీల నొ
య్యన నఖరాంకురంబుల నయమ్మునఁ దంత్రులు మీటి గాన మిం
పొనరఁగఁ జేయు వాణి ప్రతిభోన్నతుఁ జేయుతఁ గృష్ణరాయనిన్ |చ| [5]

వలిమల యల్లువాఁడు తలవాఁక ధరించిన పూవుగుత్తి, వే
ల్పులగమి జీవ గఱ్ఱ, యుడివోవని చల్వల టెంకి, వెన్నెల
ల్మొలచిన పాదు, పాల్కడలి ముద్దులపట్టి నృసింహ కృష్ణరా
యలఁ గరుణారసంబు నినుపారెడి చూపులఁ జూచుఁ గావుతన్ |చ| [6]

 కృతిపతి వంశ ప్రశస్తి, శౌర్య ప్రతాపములు, షష్ట్యంతములు, వగైరా….

అవతారిక

జనమేజయ జనవల్లభుఁ
డను దినమును హరికథా సుధాస్వాదనమునం
దనివి సనక వైశం
పాయన మునికిట్లనియెఁ, గౌతుకాయత్త మతిన్ |క| [35]

హరివంశ కథ లెల్ల నానుపూర్విగ నిట్టు
-విని కృతార్థుఁడ నైతి మునివరేణ్య!
యాదానవారాతి యమరులఁ బ్రోవంగఁ
-బూని యా యదువంశమున జనించె
నతఁడు గ్రమ్మఱ వారి కాధార మగు పారి
-జాతంబు పుడమి కేరీతిఁ దెచ్చె?
ననుమతి నిచ్చిరో! యా వేల్పు, లొండేని,
-బలిమిఁ జేకొనియెనో! పాడి దొఱఁగి, |సీ|
తెలియ నానతి యిమ్ము సందియము దీఱ
వినఁగ వేడుక యయ్యె సవిస్తరముగ
ననిన నా వ్యాసముని శిష్యుఁడతనితోడ
నధిప! విను మని పలికె నత్యాదరమున |తే| [36]

శ్రీ కృష్ణుని సంసార విభూతి

హరి నరకాసురుం గెలిచి యద్దనుజేంద్రుని యింట నున్న య
చ్చరల కొలంబు వారి, నెలజవ్వనముం బొలివోని వారిఁ, ద
న్వరునిఁగఁ గోరు వారి, లలనామణులం బదియాఱు వేవురం
బరిణయ మయ్యె నారదుని పంపున సౌఖ్య రసైక లోలుఁడై |చ| [38]

మఱియు రుక్మిణి, సత్య, జాంబవతి, మిత్ర
వింద, భద్ర, సుదంత, కాళింది, లక్ష
ణ యనఁగా మున్న కల రబ్జనాభునకును
మహిషు లెనమండ్రు సమతాభిమానవతులు |తే| [38]

ఆ రమణీ లలామల నందఱఁ గూడి యదూద్వహుండు త
ద్ద్వారవతీ పురోపవన వాటికలం, గ్భతకాద్రి సీమల
న్వారిధి తీర కుంజ నద నదంబులఁ, గేళి తరంగిణీ తటీ
కైరవిణీ సహాయ మణికల్పిత సౌధముల న్వసించుచున్ |ఉ| [39]

ఏయేవేళల నేసరోజముఖి యేయేలీలలం గోరుఁ దా
నాయావేళల నాసరోజముఖి నాయాలీలలం దేల్చి, యే
చాయం జూచినఁ దానయై మెలఁగుచున్ సౌఖ్యాబ్ధి నోలాడు భో
గాయత్తుండయి పెక్కు రూపముల మాయా కల్పనా చాతురిన్ |శా| [40]

హరి యిట్లు సతుల నందఱ
సరిగాఁ జూచియును, భోజ జనపాల సుతం,
దరుణీమణి సాత్రాజితి
నిరువుర మన్నించి మిగుల నిచ్చుం జనవుల్ |క| [41]

కులమును రూపము న్మగని కూరిమియుం గలదాన నంచునీ
వల నల రుక్మిణీ రమణి వాసిఁ బెనంగఁగ, సత్యభామయుం
గులమును రూపము న్మగని కూరిమియుం గలదాన నంచునా
వలఁ బచరింపఁగా, రవరవ ల్వొడమె న్మది వారి కెంతయున్ |చ| [42]

అంతట నొక్కనాఁడు ధవళాంబుజ నేత్రుఁడు వచ్చి రుక్మిణీ
కాంత గృహంబులోన శశికాంత శిలామయ వేదిక మీఁద నే
కాంతమునందుఁ గొందఱు మృగాయతనేత్రలు గొల్వ, జూద మ
త్యంత వినోద కేళిమెయి నాడుచు నుండఁగ నద్భుతంగన్, |ఉ| [43]

నారదాగమన వర్ణనము

స రి గ మ ప ద ని స సంజ్ఞస్వరంబుల
-మహతి నభో వాయు నిహతి మొఱయ,
భాగీరథీ పయః పరిపూర్ణ మణి కమం
-డలువు హస్తంబునఁ జెలువు మిగులఁ,
బ్రణవ మంత్రావృత్తి పావన స్ఫటికాక్ష
-వలయంబు కర్ణ శష్కులిక వ్రేల,
సమర నృత్యోచిత చమరవాలంబును
-గక్షపాలయు భుజాగ్రమున మొఱయ, |సీ|

దేహకాంతు లకాల చంద్రికల నీన,
జడలు మోక్షద్రు పల్లవ శంక సేయ,
గగనమున నుండి వచ్చె నాకస్మికముగ
నారివేరంపుఁ దపసి దైత్యారికడకు |తే| [44]

నారదునకు రుక్మిణీ కృష్ణుల యాతిథ్యము

వచ్చిన మునిపతి కెదురుగ
వచ్చి, నమస్కృతి యొనర్చి, వనితయుఁ దానుం
బొచ్చెంబులేని భక్తి వి
యచ్చర రిపు భేది సలిపె నాతిథ్యంబున్ |క| [45]

అపుడు రుక్మిణి కనుసన్న నబ్జముఖులు
రత్న సింహాసనంబు నారదున కిడిరి,
హరియు నమ్మౌని యనుమతి నర్హ పీఠ
మున సుఖాసీనుఁడై కరంబులు మొగిడ్చి |తే| [46]

సురసంయమివర! ంఈరిట
కరుదేరఁగ నిప్పుడేఁ గృతార్థుఁడ నయితిన్
నిరతంబు మీరు నాపయిఁ
గరుణ గలిగి యునికి యిది యకారణము సుఁడీ |క| [47]

నావుడు శౌరికి నిట్లను
నా వేలుపుఁ దపసి "మర్త్యుఁ డాడెడి రీతిన్
నీవిట్లు పలుక నుచితమె!
ఏ విశ్వజనీన చరిత! Yఎఱుఁగనె నిన్నున్! |క| [48]

నారదుఁడు శ్రీకృష్ణుని
దశావతారముల నుతించుట

ప్రామినుకుల దొంగఁ బాతాళ కుహరంబుఁ
-జొరఁ బాఱి చీఱిన చోఱ వీవ,
తరిగొండ వెన్నుపైఁ దాల్చి వేల్పులఁ గూటి
-చవి దేల్చినట్టి కచ్చపమ వీవ,
నీటిలో మునిగిన నేలచేడియఁ గొమ్ము
కొన నుబ్బ నెత్తిన ఘోణివీవ,
మునిమాపు బలు గంబమునఁ ముట్టి బంటు న
-క్కఱఁ గాచినట్టి సింగంబ వీవ, |సీ|

దితిజు మెట్టిన యా పొట్టి దిట్ట వీవ,
పుడమిఱేఁడుల నడఁచిన ప్రోడ వీవ,
కడలిఁ గోలకుఁ దెచ్చిన గబ్బి వీవ,
యిపుడు ద్వారక వసియించు నీవు నీవ! |తే| [49]

రక్కసిమగువల యీలువు
మొక్కపఱిచె దీవ, పాపముల గమి కాలం
ద్రొక్కెదవు నీవ, యింకిట
నిక్కముగా నిన్నుఁ బొగడ నేర్తునె! కృష్ణా! |క| [50]

ద్వారక వైకుంఠపురం,
బీ రుక్మిణి లక్ష్మి, మీర లిచ్చట నునికిన్
సారెకుఁ గొల్వఁగ వత్తును
గోరికతోఁ గంసహర! ముకుంద! మురారీ!" |క| [51]

నారదుఁడు పారిజాత ప్రసూనమును
శ్రీ కృష్ణున కర్పించుట

అని యిట్లు బహు ప్రకారంబులం బ్రశంసించి యవ్విరించి నందనుం డమందానందంబు డెందంబునం గ్రందుకొన నిజ వాసనా బిరుద గాథా కథన వందిబృందాయమా నేందిందిరంబును, నుచితోపయోగ జని తానంద బాష్ప సందోహ శంకావహ మకరంద బిందు తుందిలంబును, నపూర్వకంబును, నిఖిల మనోరథ ప్రదాన కీర్తి శంకాకర విశద ప్రభా నిచుళితంబును నగు పారిజాతంపుఁ గ్రొన్నన మిన్నేటి పసిండి నెత్తమ్మి చిగురుటాకునం బొదివి యిచ్చిన, |వ| [52]

వినయంబు విస్మయంబును
మనమునఁ బెనఁగొనఁగ నపుడు మాధవుఁ డా క్రొ
న్ననఁ గయికొని భీష్మక నం
దనఁ గనుగొని సత్యభామ తలఁపున నిలువన్ |క| [53]

"యిది భోజాత్మజ కిచ్చినం, గినుకతో నేమంచు నూహించునో
మది సాత్రాజితి; దాని కే నిపుడు ప్రేమం బంపినన్ దీని నె
ల్లిదముం జేసినజాడ దోఁచునొకొ! యౌలె మ్మిందు నేనున్కిఁ జె
లాదువో యేరికిఁ బంపగా" ననుచు లీలన్ రుక్మిణీ కాంతకున్ |మ| [54]

కృష్ణుఁడు పారిజాతమును రుక్మిణి కొసఁగుట

కనుగవఁ బిన్న నవ్వు దొలఁక, న్మునినాథుని కన్ను సన్న ని
చ్చినఁ, దగ భోజనందనయుఁ జేకొని మౌనికి మ్రొక్కి యవ్విరిం
దన నెఱి కొప్పునం జెరివిన న్వలిగుబ్బలి ముద్దుపట్టి లేఁ
త నెల ధరించిన ట్లమరెఁ దద్దయు మోహన కాంతి సంపదన్ |చ| [55]

మగమీల నగఁజాలు తెగఁ గీలుకొను వాలుఁ
గనుఁగవ కొక వింత కాంతి యొదవె,
వలిజక్కువల పెక్కువలు దక్కువగ నిక్కు
చనుదోయి కొక వింతచాయ దోఁచె,
నెల తుమ్మెదల దిమ్ము వెలిఁజిమ్ము చెలువమ్ము
గల వేణి కొక వింత నలుపు మీఱె,
నల చెందొవల విందు చెలువెందు వెద చిందు
మొగమున కొక వింత జిగి దొలంకెఁ, |సీ|

జక్కఁదనమున కొక వింత చక్కఁదనము,
జవ్వనంబున కొక వింత జవ్వనంబు,
విభ్రమంబున కొక వింత విభ్రమంబు
గలిగె నద్దివ్య కుసుమంబు కతన సతికి| |తే| [56]

కలకంఠకంఠి యీగతిఁ
బులుగడిగిన ముత్తియంపుఁ బొలు పొందంగా
నెల నవ్వొలయఁగఁ బలికెను
జలజాసను పట్టి కలహ సంభ్రమ పరుఁడై| |క| [57]

నారదుఁడు పారిజాతమహిమను వివరించుట

జలజాక్షి! యిది పారిజాత ప్రసూనంబు
నరులకు ధరియింప నరిది సూవె!
పౌలోమి పార్వతి పద్మ పద్మజురాణి
యును శిరంబునఁ దాల్తు రనుదినంబు,
హరి బహిః ప్రాణంబ వగుట నేఁ డెఱుఁగంగ
వచ్చె, నీకిపు డిది యిచ్చెఁ గాన,
వెలఁదులు పదియాఱు వేవురలో నెన్న
సరిలేరు సౌభాగ్య గరిమ నీకు, |సీ|

నీవు దాల్చిన కతన నీపూవు నేఁడు
భాగ్యము వహించె నుచితోప యోగ్య లీల
నీప్సితార్థంబు లొడఁ గూర్చు నిది లతాంగి!
దీని మహిమంబు చెప్పెదఁ దెలియ వినుము| |తే| [58]

పరిమళము సెడదు, వాడదు,
పరువము తప్పదు, పరాగ భర భరితంబై
నిరతము జగదేక మనో
హర మగు నీ కుసుమరాజ మంబుజ వదనా! |క| [59]

అళి నీలాలక! నీవు నీపతి రహస్య క్రీడ వర్తించు వే
ళలతాంతాయుధు సంగరంబునకు నుల్లాసంబు గల్పించు ను
జ్జ్వల దీపాంకురమై, రతి శ్రమ తనూ సంజాత ధారాళ ఘ
ర్మ లవంబు ల్దొలఁగింపఁగా సురటియై రంజిల్లు, నిచ్చాగతిన్| |మ| [60]

అడిగిన యంతలోన సరసాన్నములన్ సమకూర్చు నాఁకటన్
బడలికఁ జెందనీక; యశుభంబులడంచు; జగత్త్రయంబునం
బడయఁగరాని సర్వగుణ భవ్యము సుమ్మిది; దీనిఁ దాల్చి యి
ప్పడఁతులలోఁ గనుంగొను మపార మహా మహి మానుభావముల్| |చ| [61]

కువలయ పత్ర నేత్ర! నెఱికొప్పున నీ కుసుమంబు దాల్చుటన్
సవతులు వచ్చి నీచరణ సారస యుగ్మము నాశ్రయింపగా,
ధవుఁ డఱిలేని కూర్మి జవదాఁటక నీపలు కాదరింపఁగా,
నవిరళ భోగభాగ్య మహిమాన్వితవై విహరింతు గావుతన్ |చ| [62]

నెలకొని వేసవిఁ జలువయుఁ,
జలివేళల నుష్ణగుణము, సముచిత భంగిన్
గలిగించు నీలతాంతము,
కొలఁదులు చెప్పంగ నిచ్చ క్రొత్తలు సుమ్మీ! |క| [63]

అలరుంబోఁడుల లోపల
నలరుం బోఁడుములు నీకు నగ్గల మగుచున్,
దలపూవాడక యుండుము
తలపూవు ధరించి వికచ తామరసాక్షీ! |క| [64]

రుక్మిణిపైఁ గృష్ణ ప్రేమాతిశయ ప్రశంస

ఇన్ని దినంబులున్ సవతు లిందఱలో నల సత్యభామ కన్
సన్నలఁ ద్రిమ్మరున్ హరి వశంవదుఁడై యన విందుఁ; గాని యో
కన్నియ! నీయెడం గలుగు గారవ మెయ్యెడఁ జూచి కాన; లే
కున్న ననర్ఘ కుసుమోత్తమ మేరికైన నిచ్చెనే! |ఉ| [65]

చక్కనిదాన నంచు, నెలజవ్వని నంచు, జగంబులోనఁ బే
రెక్కినదాన నంచు, బతి యెంతయు నా కనురక్తుఁడంచుఁ దా
నిక్కుచు విఱ్ఱవీఁగుచు గణింపదు కాంతల సత్య; యింతకున్
స్రుక్కక యున్నె! నీ మహిమ సూచిన బోటులు విన్నవించినన్ |ఉ| [66]

ధరియించిన మొదలొక వ
త్సర మాత్రము తావకీన ధమ్మిల్లములో
నిరవుకొని మగుడ నివ్విరి
తరుణీ! యల పారిజాత తరువున కరుగున్ |క| [67]

అనుచు నారదుఁ డాడిన యట్టి పలుకు
లచటి వృత్తాంత మంతయు నరసి పోయి
వేఱు వేఱన సఖులు దేవేరులకును
విన్నవించిన వారును జిన్నవోయి| |తే| [68]

అందరలోనఁ బెద్ద, మహిమాన్విత రుక్మిణి; గానఁ బూవు గో
విందుఁడు దానికిచ్చెఁ దగవేయని లక్షణ యోర్చె; సైఁచెఁ గా
ళింది; శమించె భద్ర; యవులెమ్మని యూరడిలెన్ సుదంత; లోఁ
గుందుట మానె జాంబవతి; కోప మడంచెను మిత్రవిందయున్ |ఉ| [69]

వారిలోపల సౌందర్యవతియు మాన
వతియు మహనీయ సౌభాగ్యవతియు నైన
సత్య యంతట నేమొకో? శౌరి కడకుఁ
బోయి రాదయ్యెఁ జెలి, ప్రొద్దువోయె ననుచు |తే| [70]

తన శృంగార వనంబులోన గిరి [నగరి]పొంతం, జక్కఁగా దిద్ది తీ
ర్చిన పూఁదేనియ యేటి కాలువ దరిం, జెంగల్వ పుప్పొళ్ళు నిం
చిన చంద్రోపల వేదిపై సరస గోష్ఠిన్ బోటియందాను న
వ్వనజా తాయత నేత్ర శౌరిగుణముల్ వాక్రుచ్చి వర్ణించుచున్ |మ| [71]

అలికుల రావముల్ కిసల యాకుల కోకిల కాకు కాకలీ
కలకల నాదముల్ సెలఁగఁ, గమ్మని తమ్మికొలంకు తెమ్మెరల్
వొలయఁగఁ, దొంటి చందమున బుద్ధికి నేమియు నింపు గామికిం
గలఁగుచు సత్యభామ చెలిఁ గన్గొని యించుక సంశయించుచున్ |చ| [72]

అకట! యిదేమియో యెఱుఁగ నయ్యెడుఁ దొయ్యలి! దక్షిణాంస చూ
చుక నయన ప్రకంపగుణ సూచన లేమియు వల్లగావు; సా
రెకు మది జాలి వొంది యొక రీతిఁ దలంకెడుఁ; బ్రాణనాయకుం
డొక చపలాక్షిఁ గూడి నను నొల్లని చెయ్దము లేమి చేసెనో! |చ| [73]

అని సత్యభామ తనవిధ
మునుఁగుం దొయ్యలికిఁ జెప్పు నవసరమునఁ జ
య్యన వచ్చి యొక్క నెచ్చెలి
కనుఁగవ నెఱసంజ వొడమఁగా నిట్లనియెన్ |క| [74]

సత్యకుఁ జెలికత్తె పారిజాత వృతాంతము సెప్పుట

అమ్మా! యేమని చెప్పుదు,
నెమ్మి న్నీ విభుఁడు రుక్మిణీసతి మణి సౌ
దమ్మున నుండఁగ సురముని
క్రమ్మఱ నాకస్మికమ్ముగా నచ్చటికిన్ |క| [75]

చనుదెంచి యమ్మురారికి
ననఘమ్మమరైక యోగ్య మతి సౌఖ్య కర
మ్మనితర సులభ మ్మిది యని
కొనియాడుచు నొక్క దివ్య కుసుమ మ్మొసఁగెన్ |క| [76]

మిన్నంది వేగఁ గైకొని
కన్నుల నొత్తికొని మ్రొక్కి గారవ మెసఁగన్
వెన్నుఁడు రుక్మిణి కొసఁగిన;
నన్నెలఁతయుఁ గొప్పులోన నవ్విరిఁ దాల్చెన్ |క| [77]

అంతలోనన యద్భుతం బావహిల్లఁ
గొలఁది యిడరాని యొక వింత చెలువు గలిగి
రాజ బింబాస్య రుక్మిణి తేజరిల్లె
సాన పట్టిన మకురాంకు శస్త్రమనఁగ |తే| [78]

ఆ కుసుమంబు దాల్చిన మహా మహిమంబునఁ దోడి కామినీ
లోకము మచ్చరంబు మదిలోనఁ దొఱంగి భజించుచుండ, న
స్తోక నిజ ప్రభావములు సూపెడు గద్దియ మీద నెక్కి ము
ల్లోకము దాన యేలు గతి లోలవిలోచన! యేమి సెప్పుదున్ |ఉ| [79]

ఎంతకు లేఁడు నారదమునీంద్రుఁడు; శౌరి వినంగ, రుక్మిణీ
కాంత వినంగ, నేను వినఁగాఁ, బలికెం "బతిఁ గూర్చుదాన నా
యంతటి వారు లేరని యహంకృతి నెప్పుడు విఱ్ఱ వీఁగుచున్
వంతున వచ్చు సత్య గరువంబిఁకఁ జెల్ల" దటంచు మానినీ! |ఉ| [80]

ఆ రణభోజను మతకము,
లా రుక్మిణి నటన, లా మురాంతకు చెయ్వుల్
చేరి కనుంగొనుచో నె
వ్వారికిఁ గోపంబు రాదు! వారిజనేత్రా! |క| [81]

సత్యభామ యాగ్రహోదగ్రత

అనవిని వ్రేటు వడ్డ యురగాంగనయుం బలె, నేయి వోయ భ
గ్గున దరి కొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి, హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కులఁ గుంకుమ పత్ర భంగ సం
జనిత నవీన కాంతి వెదచల్లఁగ గద్గద ఖిన్న కంఠియై |చ| [82]

ఏమేమీ! కలహాశనుం డచటికై యేతెంచి యిట్లాడెనా!
యామాట ల్చెవియొగ్గి తా వినియెనా యాగోపికావల్లభుం
డేమే మాడెను రుక్మిణీ సతియు? నీ వింకేటికిన్ దాఁచెదే!
నీ మోమోటలు మాని నీరజముఖీ! నిక్కం బెఱింగింపవే! |శా| [83]

అతుల మహానుభావ మని యవ్విరిఁ దానొక పెద్ద సేసి య
చ్యుతునకు నిచ్చకంబొదవ సూడిద యిచ్చిన నిచ్చెఁగాక తా,
నతఁడు ప్రియంబు గల్గునెడ కర్పణ సేసినఁ జేసెఁగాక, యా
మతకరి వేలుపుం దపసి మమ్ముఁ దలంపఁగ నేల యచ్చటన్? |చ| [84]

పలు దెఱఁగు ముళ్ళ మాటలు
కలహమె కల్యాణ మని జగంబుల వెంటన్
మెలఁగెడు మౌనికి సహజము;
వలదని వారింపవలదె వల్లభుఁ డతనిన్? |క| [85]

ముని యేమి సేయు! రుక్మిణిఙ్
గొనఁ గారణ మేమి! ధూర్త గోపాలుఁడు సే
సిన చెయిద మేమి చెప్పుదు!
మన మెరియదె! ప్రాణమైన మగఁడిట్లయినన్ |క| [86]

పరికింపరు తమజాడలు,
తరుణుల తగులములు నమ్మఁ దగ దండ్రు మదిన్
శర దంబుద చలచిత్తులు
పురుషులె పో; వారి నమ్మఁ బోలునె! చెలియా! |క| [87]

ఇన్ని దినంబులున్ సవతు లిందఱలోఁ గడు గారవంబునం
గన్నియ! నన్ను వల్లభుఁడు కన్నులఁ గప్పుకొనంగ నుండి యా
వన్నెయు వాసియుం దొలఁగి వారు ననుం దల లెత్తి చూడఁగా
సన్నలఁ జాయలం బలుక సైఁతునె! ప్రాణము లెంత తీపొకో! |ఉ| [88]

నామొగ మోటకై వలసి నాటకముల్ ఘటియించి, రుక్మిణీ
కామిని మీఁదటం గలుగు గౌరవముం గృపయుం బ్రియంబుఁ దా
నేమియుఁ గాననీక, యిట నిన్ని దినంబులు నన్నుఁ దేల్చెనో
తామరసాక్షి! మెచ్చవలదా! మురదానవ భేది కృత్యముల్ |ఉ| [89]

ఓ చెలి! శౌరి కిచ్చెనఁట యొక్కలతాంతముఁ దెచ్చి నారదుం
డా చపలాక్షి కిచ్చెనఁట యాతఁడు నవ్విరి, యిట్టిమాట లా
హా! చెవుల న్వినఁబడియుఁ బ్రాణము దాల్చెద మేన; నింతగా
నోఁచితి, నింక నెట్టివి కనుంగొన నెమ్మెయి నున్న దాననో! |ఉ| [90]

పూనుకొని మేలు గీళ్ళకు
లోనయి విహరించువారి లోక మెఱుఁగదో!
యా నరకాసుర దమనుఁడు
తా నెఱుఁగఁడొ! భోజకన్య తా నెఱుఁగదొకో! |క| [91]

ఆ సరసీరుహాక్షి నిలయంబునఁ బంకజనాభుఁ డుండుటం
జేసి యొసంగెఁబో! చనవు సేకొని యొక్క లతాంత, మింతలో
వాసియు వన్నెయుం దగవు వైభవముం జలము న్వివేకమున్
బో సవతు ల్భజించుటకుఁబో వెఱఁగయ్యెడు, నేమి సెప్పుదున్! |ఉ| [92]

కలకాల మొక్కగతిఁ బూ
సలలో దారంబు మాడ్కి సతి మదిలోనన్
మెలఁగెడు పురుషుఁడు గలుగుట
తొలుజన్మము నోముఫలము తోయజనేత్రా! |క| [93]

కలలోన నైన నవ్వుల కైన నామాట
జవదాఁట వెఱచు నో చంద్రవదన!
యేపదార్థంబు నాయెదుటఁ బెట్టక మున్న
యెవ్వారి కొసఁగఁడో యిగురుఁబోఁడి!
చెలులు నాతో నేమి చెప్పుదురో యని
లంచంబు లిచ్చు నో చంచలాక్షి!
తోడిచేడియలు నాతోడి వంతులకు రా
సయిరింపఁ జాలఁడో సన్నుతాంగి! |సీ|

యరమరలు లేని కూరిమి ననఁగి పెనఁగి
కొదలు తీఱని కోర్కులఁ గూడి మాడి
కపట మెఱుఁగని మమతలఁ గలసి మెలసి
యున్న విభుఁడిట్లు సేయునే యో లతాంగి! |తే| [94]

కృత కాద్రి కందరా కేళీ నిగూహన
వేళా పరస్పరా న్వేషణములు,
పోషిత మాధవీ పున్నాగ పరిణయో
త్సవ కల్పి తానేక సంభ్రమములు,
చాతురీ నిర్జిత ద్యూత పణాదాన
కలిత చేలంచలా కర్షణములు,
సాయం సమారంభ చక్రవాక ద్వంద్వ
విర హావలోకన విభ్రమములు, |సీ|

సాంద్రతర చంద్రికా కేశి చంక్రమములు,
విధు శిలామయ వేదికా విశ్రమములు,
ఫలక చిత్రిత నిజరూప భావనములు,
మఱచెనో కాక! రుక్మిణి మాయఁ దగిలి |తే| [95]

పతి ప్రాణ సదృశ బంధువు,
పతి దైవం, బేడుగడయుఁ బతి సతులకు, న
ప్పతియె కడు మేర తప్పిన
గతి కులకాంతలకు వేఱు గలదే చెపుమా! |క| [96]

ధనమిచ్చి పుచ్చుకొన్నను
మనమున నోర్వంగ వచ్చు; మగఁ డింతులకున్
జన విచ్చి పుచ్చుకొన్నను
మన వచ్చునె? యింక నేటి మాటలు చెలియా! |క| [97]

సత్య కోప గృహ ప్రవేశము

అని వగల మిగులఁ బొగులుచు
జని తామర్షమునఁ గోప సదనంబునకున్
జనియెను లతాంగి హరిచం
దన కోటరమునకు నాగ తరుణియుఁ బోలెన్ |క| [98]

మాసిన చీర కట్టుకొని మౌనము తోడ నిరస్త భూషయై
వాసెన కట్టు కట్టి నిడువాలిక కస్తురి పట్టు పెట్టి లో
గాసిలి చీఁకటింటికడఁ గంకటి పై జలదాంత చంద్ర రే
ఖా సదృశాంగియై పొరలె గాఢ మనోజ విషాద వేదనన్ |ఉ| [99]

బిసరుహ పత్ర లోచనకుఁ బెల్లగు మోహము సంఘటిల్లె, వె
క్కసమగు నెవ్వగ ల్వొడమెఁ, గంపము పుట్టెఁ, జెమర్చె మేను, మా
నసమున విన్నఁబాటొదవె, నాటెఁ గడుం బరితాపవేదనల్,
మసకపుఁ బాము కాటు గతి మచ్చరమ న్విస మగ్గలింపఁగన్ |చ| [100]

వెడ వెడ కన్ను మూయుఁ, గను విచ్చు, నగుం, దలయూఁచుఁ, బాన్పు పైఁ
బడు, నుసురంచు లేచుఁ, దడఁబాటును దత్తఱముం జలంబు లో
నడరఁగఁ గోపవేగమున నగ్గలమైన మనోజుబాధలం
బడి మద హస్తి హస్తగత పద్మినియుం బలె సొంపు పెంపగన్ (పెంపఱన్) |చ| [101]

ఈ పగిదిన్ సాత్రాజితి
కోపోద్వేగమున వగల కుందుచు ఘన సం
తాపంబు పేర్మి నితర
వ్యాపారము మాని యుండె హరియును యటచన్ |క| [102]

శ్రీ కృష్ణుఁడు సత్య సౌధమున కరుగుట

ముని నాకిచ్చిన పూవు చందమును నే మున్నాడి యా భోజ నం
దనకర్పించిన జాడయున్ దెలియ చెంతన్నిల్చి వీక్షించి పో
యిన సాత్రాజితి బోటి నా వలన తా నేమేమి కల్పించెనో
యని ప్రద్యుమ్నుని మౌని దండ నిడి చింతాయత్త చిత్తంబుతోన్ |మ| [103]

అరదము నెక్కి కేతన పటాంచల చంచల మైన తాల్మితోన్
తురగ జవంబు ముంగడవ త్రోచి కడంగెడు తత్తరంబుతోన్
తిరిగెడు బండి కండ్ల పగిదిన్ భ్రమియించు మనంబు తోడ శ్రీ
హరి సనుదెంచె సత్య సముదంచిత కాంచన సౌధ వీధికిన్ [104]

వచ్చి యరదంబు డిగ్గి తద్ద్వార సీమ
దారకుని నియమించి __ తాన యొకడు
కమలనాభుండు కక్ష్యాంతరములు కడచి
యలబలము లేని నగరెల్ల యరసి చూచి |తే| [105]

కనక పంజర శారికలకుఁ జక్కెర వెట్టి
చదివింప రేలకో సకియ లిపుడు!
కరతాళ గతుల మందిర మయూరంబుల
నాడింప రేలకో యతివ లిపుడు!
క్రొవ్వాఁడి గోళ్ళఁ దంత్రులు మీటి వీణియ
ల్వలికింప రేలకో భామ లిపుడు!
కలికి రాయంచ బోదల నల్ల నెలయించి
నడిపింప రేలకో పడఁతు లిపుడు! |సీ|

ఇన్ని దినముల వలె నుండ దేమి నేఁడు!
చిన్నవోయిన దీ మేడ చెన్ను తఱిఁగి;
పద్మ ముఖి తోడ నెవ్వరేఁ బారిజాత
పుష్ప వృత్తాంత మెఱిగింపఁ బోలు నొక్కొ! |తే| [106]

అని యనుమానించుచు నొ
య్యన కోప గృహంబు జేరి యా సాత్రాజిత్
తనయ ముసుంగిడి యుండగ
అనువు మెరయ జొచ్చి మాయ యచ్చు పడంగన్ |క| [107]

కొందర మంతనంబులను కొందర జంకెన వాడి చూపులన్
కొందర చేతి సన్నల దగుల్బడ జేయుచు మీర బోయి మ
ధ్యందిన భాను మండల కరావళి హావళి వాడి యున్న తీ
గందలపించు నమ్ముగువ కన్గొని యెంతయు విస్మితాత్ముడై |ఉ| [108]

శ్రీ కృష్ణుఁడు సత్యభామ ననునయించుట

ఈ లలితాంగి చంద మొక యించుక జూచెద నంచు ధూర్త గో
పాలుడు తాలవృంత __ భామిని సత్య పిరుంద నుండి మం
దాలస లీలమై విసరె నాదట గైకొని వీచె తద్వపుః
కీలిత పంచశాయక శిఖిన్ దరి కొట్టుచు నున్న కైవడిన్ |ఉ| [109]

అంతట పారిజాత కుసుమాగత నూతన దివ్య వాసనల్
వింతలు సేయ తావి యిది విస్మయమంచు ముసుంగు త్రోచి య
క్కాంత గృహంబు నల్గడలు కన్గొని సంభృత తాలవృంతునిన్
కాంతుని జూచి బాష్ప కణికా తరళీకృత లోచనాంతయై |ఉ| [110]

తలవంచి మగుడ ముసిగిడి
కొలకుల డిగజార జాలుకొను బాష్పంబుల్
పలుచని చెక్కుల లవలీ
దళ పతిత మరంద బిందు తతి పురుడింపన్ |క| [111]

ఓర్పొకయింత లేని విక చోత్పల లోచన చిత్త వీథిఁ జ
ల్లార్పఁగ నీల నీరద శుభాంగుఁడు వే చనుదెంచె నంచుఁ గం
దర్ప హుతాశను న్వెలికిఁ దార్చు సఖుండును బోలె వేఁడి ని
ట్టూర్పు దళంబుగా నిగిడె నున్నమి తావర ణాంశు కాంతమై |ఉ| [112]

వనిత కుచద్వయంబు పయి వ్రాసిన కుంకుమ పత్ర భంగముల్
జనిత నితాంత ఘర్మ కణజాలముచేతఁ గరంగి మెల్ల మె
ల్లన వెలిపట్టు పయ్యెద కెలంకుల జాఱుట యొప్పె మానసం
బున నెలకొన్న క్రోధరసము న్వడవెట్టుచు నున్న కైవడిన్ |చ| [113]

మానవతి ఇట్లు మానని
మాన క్రోధములచే కుమారిలి చింతా
ధీన గతి నుండ మదిలో
నూనిన ప్రేమమున నంబుజోదరుడనియెన్ |క| [114]

ఇందునిభాస్య మైతొడవులేల ధరింపవు నున్న కావులీ
వెందును మాన లేవు తెలుపేటికి కట్టితి వీటికా రుచుల్
కెందలిరాకు మోవి తులకింపగ జేయక నున్కి యేమి నీ
చందము వింత యయ్యెడు నిజంబుగ నాకు నెఱుంగ జెప్పుమా |ఉ| [115]

మనమరయన్ దలంచి యొక మార్గము పన్నితొ నవ్వులాటకున్
నను వెరపించెదో యకట నా యెడ నిక్కము తప్పు గల్గెనో
వనజ దళాయతాక్షి పగ వాడనె నన్నిటు యేల జూడ వొ
క్క నిమిషమైన నీవు దయ కన్గొన కుండిన నిల్వ నేర్తునే |చ| [116]

పలుకులఁ దేనె లుట్టిపడఁ బల్కవు నేఁ డిదియేమి? వాలుఁ గ
న్నుల నునుసిగ్గు నూల్కొనఁ గనుంగొన వేల? యురః స్థలంబుఁ జ
న్నుల నెదురొత్తి మక్కువ ననుం బిగికౌఁగిటఁ జేర్ప వేటికే?
చిలకల కొల్కి! యెవ్వ రెడ సేసిరి? నీకిటు లేల చింతిలన్ |చ| [117]

మనమున మాటలం గ్రియల మన్నన లీ నొకనాఁదు నెట్టి కా
మినులకు, గారవంబు మెఱమెచ్చులకై పచరింతుఁ గాని, పా
యని యనురక్తి నీ యెడనె యగ్గలమై కను పట్టు నాకు నీ
పనిచిన పంపు చేయుటయ ప్రాభవమౌటది నీవెరుంగవే ? |చ| [118]

పడతీ నీ మధురాధరామృతము నీ బహా పరీరంభమున్
పడయన్ ధన్యుడ కాక యుండిన ననున్ పాటించి యొక్కింత నీ
నిడువాలున్ కడ కంట చూడుమనుచున్ నిల్వోపమిన్ పైచెరం
గొడియన్ చేవిరి దమ్మి వేయుటకునై యుంకించి జంకించినన్ |మ| [119]

పాటల గంధి చిత్తమున పాటిలు కోప భరంబు దీర్ప నె
ప్పాటును పాటు గామి మృదు పల్లవ కోమల తత్పద ద్వయీ
పాటల కాంతి మౌళి మణి పంక్తికి వన్నియ వెట్టఁ నా జగ
న్నాటక సూత్ర ధారి యదు నందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్ |ఉ| [120]

సత్య తనకు మ్రొక్కెడు పతి శిరమును
బాదమునఁ దొలఁగఁ ద్రోయుట

జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి సిరమచ్చో వామ పాదంబునన్
తొలగన్ ద్రోచె లతాంగి ! యట్ల యగు నాధుల్ నేరముల్ సేయ పే
రలుకన్ జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే? |మ| [121]

కోపన పద హతి కుహనా
గోపాలుడు కాంచి మెయి గగుర్పొడవగ ను
ద్దీపిత మన్మధ రాజ్య
ప్రాపితుడై పలికె కూర్మి బయట పడంగన్ |క| [122]

రసికావతంసుఁడగు శ్రీ కృష్ణుని లాలనము

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్క బూని తా
చిన యది నాకు మన్ననయ ! చెల్వగు నీ పద పల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
నని యెద నల్క మానవు గదా యికనైన నరాళ కుంతలా! |చ| [123]

అన విని మానినీ తిలక మప్పుడు మెయ్యర తోప నిక్కి వీ
డిన కచ పంక్తి పల్మరు ముడిన్ పెడ త్రోపుచు పై చెరంగు గ్ర
క్కన చను దోయి చేర్చుచు మొగంబున లేఁజెమటంకురింప జం
కెన నెఱ జూపు జూచి పలికెం జలితాధర పల్లవాగ్రయై |చ| [124]

కోప వివశయై సత్య శ్రీ కృష్ణుని బరుషోక్తులాడుట

ఈ నయగారపున్ బ్రియములీ పస లీ మెర మెచ్చు మాటలే
లా నిను నమ్మి యుండిన ఫలంబిదె తోడన నాకు గల్గె నీ
యాన జుమా ననుంజెనకి యారడి బెట్టిన నవ్వు వారలన్
గానవెరుంగునే పసుల కాపరి భావజ మర్మ కర్మముల్? |ఉ| [125]

ఇంకిటు నిన్ను నమ్మ నను యేమిటికిన్ కెరలించెదెంతయున్
పొంకము కాని ఈ వలని బొంకులు మా చవి గావు రుక్మిణీ
పంకజ పత్ర నేత్రకవి ప్రాణ పదంబులు గాని వల్లకీ
కింకర చాలుజాలు యుడికింపకు నింపకు లేని కూరుముల్ |ఉ| [126]

గట్టివ చేతలున్ పసలు కల్ల తనంబులు నీవు పుట్టగా
పుట్టినవెందు లేని పలు పోకల మాయలు నీకు వెన్నతో
పెట్టినవౌ టెరింగియును బేల తనంబున నిన్ను నమ్మి నా
గుట్టును తేజమున్ మిగుల కోల్పడి పోయితినేమి జేయుదున్ |ఉ| [127]

మునిపతి వచ్చి పూవొసగి మోదము తోడ భవత్ప్రియాంగనన్
వినుతి యొనర్పగా వినిన వీనులు మా చవిగాని మాటలన్
విన వలసెంగదా యిపుడు నీవిట వచ్చుట పారిజాత వా
సన ప్రకటించి నాకు నెకసక్కెము చేయన కాదె జెప్పుమా? |చ| [128]

మానంబె తొడవు సతులకు
మానమె ప్రాణాధికంబు మానమఖిల స
మ్మానములకు మూలంబగు
మాన రహితమైన బ్రతుకు మానిని కేలా? |క| [129]

తనదు కోడండ్రలోనఁ బెద్దయుఁగ నన్ను
దేవకీ దేవి మన్నించు; నీవు నాకుఁ
జనవు లిచ్చుటఁజేసి; యా సాధ్వి సేవ
సేయఁ బోవంగ నా కింక సిగ్గు కాదె! |తే| [130]

ఉవిద యెవ్వతె నోఁచి యున్నదో! యీ శమం
తక రత్న మింక నౌఁదల ధరింప?
నీ రైవతక శైల చారు కూట విటంక
కేళి కిం కెవ్వతె పాలుపడునొ?
యెవ్వతె కబ్బునో! యీ వసంతారామ
కర్పూర కదళి కాగార వసతి?
లీల నీ మణి సౌధ జాలకంబుల నిన్నుఁ
గూడి యెవ్వతె వార్ధిఁ జూడఁ గలదొ? |సీ|

యకట! నేఁ బెంపఁ బెరిఁగిన శుక మయూర
శారికా బృంద మెవ్వతెఁ జేరునొక్కొ!
నన్ను నాతోడి సవతులు నగక మున్న
పంత మలరంగ నిన్ను మెప్పింతుఁ గాన |తే| [131]

నను యెవ్వెత గాఁ జూచితి
వని యంతర్బాష్ప యగుచు యవనత ముఖియై
ఘనతర గద్గదికా ని
స్వనమున మరి మాటలాడ శక్యము కామిన్ |క| [132]

సత్య విలాప మోహనత

ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోక దవానలంబుచేఁ
గాసిలి యేడ్చె ప్రాణ విభు కట్టెదుటన్ లలితాంగి పంకజ
శ్రీ సఖమైన మోము పయి చేల చెరంగిడి బాలపల్లవ
గ్రాస కషాయ కంఠ కల కంఠ వధూ కల కాకలీ ధ్వనిన్ |ఉ| [133]

ఆ రమణీ లలామ మదినంటిన కోపభరంబు నిల్పగా
నేరక నెవ్వగన్ బొగుల నీరజ నాభుడు నిండు కౌగిటన్
జేరిచి బుజ్జగించి నును జెక్కుల జాలుకొనంగ జారు క
న్నీరు కరంబునన్ దుడిచి నెయ్యము తియ్యము దోప యిట్లనెన్ |ఉ| [134]

పారిజాత వృక్షమునే తెచ్చియిచ్చెదనని
కృసత్య విలాప మోహనతష్ణుని ప్రతిన

ఓలలితేంద్రనీల శక లోపమ కైశిక! యింత వంత నీ
కేల లతాంతమాత్రమున కేఁ గలుగ న్విను: నీకు దేవతా
కేళి వనంబు సొచ్చి, యనికి న్బలసూదనుఁడెత్తి వచ్చినన్
డీలు పడంగఁ దోలి, యిటఁ దెచ్చెద నిచ్చెదఁ బారిజాతమున్ |ఉ| [135]

వామలోచన నీ కేలి వనములోన
చలువ వెదజల్లు చెంగల్వ కొలని కెలన
సరస కర్పూర కదళికా తరుల నడుమ
పెరటి జెట్టుగ నాటింతు పెంపు గనుమ |తే| [136]

సత్య యూరడిల్లుట

అని పలుకు నంబుదశ్యా
ముని గర్జిత మధుర వాక్యముల సత్యమా
నిని నీప లతిక వోలెం
గనుపట్టె సఖీ మయూరికలు సెలరేఁగన్ |క| [137]

ఆశ్వాసాంతము

దమయా నాక్షివిలోక! లోక హితకృత్ప్రారంభ! రంభా కుచ
ద్వయ దుర్గాధిపతి ద్విష తృఠిత గాథా వ్యక్త దోస్సార! సా
రయశ స్సాంద్ర దిశాంత! శాంత హృదయారజ్యన్న యాచార; చా
రయుతోపాయ విచార! చారణ గణ ప్రస్తూయమానోదయా! |మ| [138]

ప్రతివర్ష వసంతోత్సవ
కుతు కాగత సుకవి నికర గుంభిత కావ్య
స్మృతి రోమాంచ విశంకిత
చతురాంతఃపుర వధూ ప్రసాదన రసికా! |క| [139]

ప్రసృతి విలోచనా కుసుమబాణ! దిశా లలనా
ఘుసృణ పటీర లేపకృతి కోవిద! బాహుతటీ
విసృమర కీర్తిజాల! రణ వీక్షిత వైరినృప
త్యసృ గతిపంకి లాసిముఖ! యైందవ {యాదవ} వంశ మణీ! |నర్కుటము| [140]

గద్యము

ఇది శ్రీమదుమామహేశ్వర వర ప్రసాద లబ్ధ సార సారస్వతాభినంది నంది సింగయామాత్య పుత్త్ర కౌశిక గోత్ర పవిత్ర సుజన విధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన పారిజాతాపహరణంబను మహా ప్రబంధమునందుఁ బ్రథమాశ్వాసము

                                   విజయ విలాసము
                                                                -చేమకూర వేంకట కవి
అవతారిక

ఇష్టదేవతా స్తుతి

శ్రీ లెల్లప్పుడొసంగ, నీ సకల ధా
త్రీ చక్రమున్ బాహు పీ
ఠీ లగ్నంబుగఁ జేయ, దిగ్విజయ మీన్
డీకొన్న చందాన నే
వేళన్ సీతయు, లష్మణుండుఁ దను సే
వింపంగ విల్ పూని చె
ల్వౌ లీలన్ దగు రామమూర్తి రఘునా
థాధీశ్వరుం బ్రోవుతన్ [1]

శ్రీ కలకంఠకంఠియు, ధరిత్రియు దషిణ వామ భాగముల్
గైకొని కొల్వ, వారిఁ గడఁకన్ గడకన్నుల కాంతిఁ దేల్చి, తా
నా కమలాప్తతం గువలయాప్తతఁ దెల్పెడు రంగ భర్త లో
కైక విభుత్వ మిచ్చు దయ నచ్యుతు శ్రీ రఘునాథ శౌరికిన్ |ఉ| [2]

"శ్రీ రుచిరాంగి నీ భవన సీమ ధ్రువంబుగ నిల్చు; నేలు దీ
ధారుణి నీవ" యన్న క్రియ దక్షిణపాణి నెఱుంగఁజేయు శృం
గార రసాబ్ధి వేంకటనగ వేంకటనగ స్థిరవాసుఁడు పూర్ణదృష్టి నెం
తే రఘునాథ భూరమణదేవు గుణంబుల ప్రోవుఁ బ్రోవుతన్ |ఉ| [3]

ధీయుతుఁ డటంచు నలువ దీర్ఘాయు వొసఁగి
కాయు రఘునాథ విభు వజ్రకాయుఁ గాఁగ;
వీరవరుఁ డని హరుఁ డత్యుదార కరుణఁ
జేయు నెప్పుడు విజయు నజేయుఁ గాఁగ |తే| [4]

మొగుడుం దమ్ముల విప్పునప్పుడు రజంబున్, జక్రవాళంపుఁ గొం
డ గడిన్ దేఱుగ డైన పట్లఁ దమమున్, మందేహులన్ దోలి వా
సి గడల్కొన్ తఱియందు సత్త్వముఁ ప్రకాశింపన్ ద్రిమూర్త్యాత్మకుం
డగు తేజోనిధి వేడ్కఁ జేయు రఘునాథాధీశుఁ దేజోనిధిన్ |మ| [5]

మాద్యద్దంతి ముఖార్చనా నియమమున్ బాటించు నెల్లప్పుడున్;
సద్యహ్పూర్ణ ఫలాప్తిచే మనుచు నంతర్వాణులన్ మామనో
హృద్యుం డౌ రఘునాథశౌరి యని కూర్మిన్ సాటికిన్ బోటికిన్
విద్యా బుద్ధు లొసంగి ప్రోతు రతనిన్ విఘ్నేశుఁడున్, వాణియున్ |శా| [6]

ప్రాగల్భ్యంబున విష్ణు శంభు మతముల్ పాటించి, సర్వంసహా
భాగం బందు సమప్రధాన గతి యొప్పన్ రాజలోకంబులోఁ
దా గణ్యుం డని యచ్యుతేంద్ర రఘునాథ షోణిభృన్మౌళికిన్
శ్రీ గౌరుల్ సమకూర్తు రాహవజయ శ్రీ గౌరులన్ నిత్యమున్ |శా| [7]

ప్రకట శ్రీహరి యంఘ్రిఁ బుట్టి, హరు మూర్ధం బెక్కి యాపాద మ
స్తకమున్ వర్ణన కెక్కు దేవి సహజోదంచ త్కులో త్పన్న నా
యక రత్నం బని యచ్యుతేంద్ర రఘునాథాధీశ్వర స్వామికిన్
సకలైశ్వర్యములున్ నిజేశువలనన్ దాఁ గల్గఁగాఁ జేయుతన్! |మ| [8]

కృతిపతి వంశ ప్రశస్తి

ఆ రాజ శేఖర ప్రియ
వారిజముఖి తోడు గాఁగ వర్ధిలు విమల
శ్రీరుచిర వర్ణమున ధా
త్రీరంజన సుకృతి చెవ్వనృపతి జనించెన్ |క| [9]

ఆ చెవ్వ నృపాలాగ్రణి
యాచంద్రార్కముగఁ గాంచి, నరుణాచల, వృ
ద్ధాచలములఁ గట్టించె, మ
హాచతుర సమీర గోపురావరణంబుల్ |క| [10]

ఠీవి నచ్యుత రాయల దేవి యైన
తిరుమలాంబకు ననుజయై (ఁ జెలియలై) తేజరిల్లు
మూర్తమాంబను బెండ్లియై కీర్తి వెలయఁ
జెవ్వ విభుఁడు మహోన్నత శ్రీఁ జెలంగె |తే| [11]

ఆ మూర్తమాంబ కఖిల మ
హీ మండల నాథుఁ డచ్యుతేంద్రుఁడు, సుగుణో
ద్ధాముఁడు జన్మించెన్; ద
ద్భూమీపతి రంగధాము పూజన్ మించెన్ |క| [12]

శ్రీ రంగేశుఁడె వచ్చి, యచ్యుత ధరిత్రీభర్త యై, భాగ్య రే
ఖారూఢిన్ విలసిల్లి, తానె తనకున్ గైంకర్యముల్ చేసెఁగా
కే రాజైనను జేయఁగాఁ గలిగెనే? యిట్లీ విమానం బహో!
భూరి స్నిగ్ధముగా, మహా మణి మయంబుల్ గాఁ గిరీటాదులున్? |శా| [13]

గెలిచిన గెల్పు, లర్థితతికిన్ దిన మిచ్చిన యీవులున్ వహు
ల్దలఁచిన విక్రమార్కు లొక లషయుఁ, గర్ణులు కోటియున్, గదా!
కలిగిన నీడు వత్తు రనఁగాఁ దగు సాహస దాన సద్గుణం
బులు ధర యందుఁ బుట్టఁగనె పుట్టిన వచ్యుత భూమి జానికిన్ |చ| [14]

వీరాగ్రేసరుఁ, డర్థి పోషణ గుణావిర్భూత భాస్వ ద్యశో
ధౌరేయుండు, మణీతులాదిక మహా దానావళుల్ సేయఁ దా
నౌరా! మార్గము వెట్టినట్టి ఘనుఁ, డాహా! లోకమం దచ్యుత
ష్మారాణ్మౌళి యొనర్చు పుణ్య మహిమల్ శక్యంబె లెక్కింపఁగన్? |శా| [15]

రఘునాథ నాయకుని రమణీయ గుణగణములు

ఆ పుణ్య ఫలంబుననె ద
యా పాథో రాశి యైన యల యచ్యుత భూ
మీ పతికిన్ రఘునాథ
ష్మా పాలుం డుదయ మయ్యె జైవాతృకుఁడై |క| [16]

పుట్టిన దాదిగాఁ దనదు పుణ్యమె దాదిగ, వైరిభూమి భృ
ద్ధట్ట మదంబు దాదిగ, సదా దిగధీశ నుత ప్రతాపుఁడై
పట్టమహాభిషేక బహుభాగ్య ధురంధరుఁడై యయోధ్య య
న్పట్టణ మేలు సామియొ యనన్ రఘునాథ విభుండు వర్ధిలున్ |ఉ| [17]

రసికుండౌ రఘునాథు కీర్తిసతి యౌరా! తొల్త వాగ్బంధమున్,
రసవాదంబును, రాజవశ్యవిధి నేరంబోలుఁ; గాకున్న వె
క్కసపుం బ్రౌఢి వహించి శేషఫణి మూఁగం జేయఁ, దారాద్రి ను
ల్లసముల్ వల్కఁగ, ఛత్ర చామర మహా లష్ముల్ నగన్ శక్యమే? |మ| [18]

నలువగ నెన్న నైన రఘునాథ నృపాలుఁడు గల్గఁగా మహీ
స్థలి నిఖిలైక ధర్మములుఁ దామర తంపరలై చెలంగెఁ; గొ
ల్లలుగ నశేష సజ్జన కులంబు సుఖంబు గనెన్; సమస్త వి
ద్యలుఁ గసటెల్లఁ బాసి మెఱపై వెలపెట్టె సభాంతరంబులన్ |చ| [19]

శైలము లెక్కి, యష్ట మద సామజ మౌళుల మీఁదుగా, మహా
కోలకులేంద్రు వాడి, బలు కొమ్ము మొనం బడి, సర్వదా విష
జ్వాలలు గ్రమ్ము శేషు తల చాయనె యోడక వచ్చి కూడె నౌ;
భూ లలితాంగి కెంత వలపో రఘునాథ నృపాలమౌళిపై? |ఉ| [20]

రత్నాకరాం తోర్వరా విహారుం డౌట
నగ్రహారము లసంఖ్యముగఁ జేసె;
నమిత దానవినోది యౌటఁ గక్ష్యాంతర
భద్రకుంభీషణ పరతఁ దనరె;
దషిణ నాయకోత్తముఁ డౌట మేలైన
మలయజగంధి మండలము నేలె;
భరత విద్యా ధురంధరుఁడౌట రంగస్థ
లంబు రామాలంకృతంబు చేసె; |సీ|
నౌర! కర్ణాట సింహాస నాధి రాజ్య
భరణ నిపుణ రణోద్దండ బాహుదండ
జనిత సాపత్న్య సంవాద జయరమా మ
హీ లలిత కేళి రఘునాథ నృపతిమౌళి |తే| [21]

రాజున్, భోగియు, సౌమ్యుఁడున్, గవియు, సర్వజ్ఞుండు నీ డౌననన్,
దేజః ప్రౌఢవచో వివేక నయ భూతి శ్లాఘలన్ మించు నౌ,
రాజున్, భోగియు, సౌమ్యుఁడున్, గవియు, సర్వజ్ఞుండు నెబ్భంగులన్,
యోజింపన్ రఘునాథ భూరమణ వర్యుండే ధరామండలిన్ |శా| [22]

అరిది సింగపుఁబల్ల మమరించె నే రాజు
మేలుఁ దేజికిఁ బదివేలు సేయఁ
జికిలి బంగరు దిండ్ల పికిలి కుచ్చుల యంద
లంబెక్కె నే రాజు లష సేయఁ;
గనక మయంబుగాఁ గట్టించె నే రాజు
సాటిలేని నగళ్ళు కోటి సేయఁ
గంఠమాలిక మొదల్ గాఁ బెట్టె నే రాజు
గొప్ప సొమ్ములు పదికోట్లు సేయ; |సీ|

నతఁడు విభుమాత్రుఁడే! బహుళాగ్రహార
నిత్య సత్త్ర మహాదాన నిరత పోషి
తాహిమాచల సేతు ద్విజాభిగీర్ణ
పుణ్యవిభవుండు రఘునాథ భూవిభుండు |తే| [23]

త్రికరణ శుద్ధి నచ్యుతుని శ్రీరఘునాథ నృపాలు వైఖరిన్
సకల మహీసురావళికి సత్త్రము లెప్పుడుఁ బెట్టలేఁడకా
యొకదొర, యందు లెక్క విని యొక్కొక నాఁటికె యింత రొక్క! మిం
తకుఁ దెగసాగెనా! యనక తా ముద మందినఁ జాలు నెమ్మదిన్ |చ| [24]

అడుగుమాత్రమె కాక యంత కెక్కుడుగ నీఁ
జాలెనే యల బలిచక్రవర్తి?
యా వేళ కటు దోఁచినంత మాత్రమె కాక
కోర్కి కెచ్చిచ్చెనే యర్కసూతి?
తూఁగిన మాత్ర మిత్తు ననెఁగా కిచ్చ వ
చ్చినది కొమ్మనియెనే శిబి విభుండు?
కలమాత్ర మపు డిచ్చెఁ గాక కట్టడ గాఁగ
ననిశంబు నిచ్చెనే యమృతకరుఁడు? |సీ|

వారి నే రీతిఁ బ్రతి సేయవచ్చు నెల్ల
యర్థులఁ గృతార్థుల నొనర్చునట్టి యప్ర
తీప వితరణికి, మహా ప్రతాప తిగ్మ
ఘృణికి, నచ్యుత రఘునాథ నృపతి మణికి? |తే| [25]

తప్పులు వేయుఁ గల్గినను దాళును నమ్మిన వారిపట్లఁ; దాఁ
జెప్పినమాట యూర్జి తము సేయు; నొకండొరుమీఁదఁ గొండెముల్
సెప్పిన వానికై మనవి చెప్పిన రీతిగ నెంచు; నీడు గా
రిప్పటి రాజు లచ్యుత నరేంద్రుని శ్రీ రఘునాథ శౌరికిన్ |ఉ| [26]

ఆకారమున నలునంతవాఁడౌనె కా
హయ సమ్యగారూఢి నంతవాఁడె!
యతి దయామతి రాము నంతవాఁ డౌనె కా
యసమాన గురుభక్తి నంతవాఁడె!
యమృషోక్తి ధర్మజు నంతవాఁ డౌనె కా
యన్నసత్త్ర ఖ్యాతి నంతవాఁడె!
యాలంబునఁ గిరీటి యంతవాఁడౌనె కా
యమిత నాట్య ప్రౌఢి నంతవాఁడె! |సీ|

రసికమాత్రుండె యంతఃపుర ప్రవీణ
సార సారస్వ తాధార శౌరి కాశు
కవన కృత ముఖ శుక కళా కలన హృష్ట
బుధజ నాస్థాని రఘునాథ భూమిజాని? |తే| [27]

మాటల నేర్పులా! సరస మార్గములా! కొలు వుండు రీతులా!
పాటల గంధులా! కళలభాగ్యములా! బహు దాన లీలలా!
నాటకశాలలా! యొకటనన్ వల దెన్నిటఁ జూడ నన్నిటన్
మేటియుఁ, గీర్తిలోలుఁడు జుమీ! రఘునాథ నృపాలుఁ డిమ్మహిన్|ఉ| [28]

అని రఘునాథ మహీకాంతు ననంత శోభన గుణమ్ములలోన
గొన్ని నభివర్ణించి |వచనం| [29]

నన్ను నడిపిన బహుళ సన్మాన మెంచి
యఖిల విద్యా విశారదుఁ డగుటఁ గాంచి
"యవని నింతటి రాజెవ్వఁ" డని నుతించి
కృతులొసఁగఁ గీర్తి కలదని మతిఁ దలంచి |తే| [30]

తా రసపుష్టిమైఁ బ్రతిపదంబున జాతియు వార్తయున్ జమ
త్కారము నర్థగౌరవముఁ గల్గ ననేకకృతుల్ ప్రసన్న గం
భీరగతిన్ రచించి మహి మించినచో నిఁక శక్తు లెవ్వ ర
య్యా! రఘునాథభూప రసికాగ్రణికిన్ జెవి సోఁకఁ జెప్పఁగన్? |ఉ| [31]

కలిగెంగా తన సమ్ముఖం బనియు, సత్కారంబు తాఁజేయ నా
తల నెందే శిరసా వహింతు రనియుం, దాఁగాక లేదెందు సా
ధులకున్ దిక్కనియున్, దయన్ మనుపు రీతుల్ గాక శక్యంబె వి
ద్యల మెప్పింపఁగ నచ్యుతేంద్ర రఘునాథస్వామి నెవ్వారికిన్? |మ| [32]

అని గణియించి యైనను, గుణాంశ మొకించుక కల్గినన్ బళా
యను; నదిగాక మిక్కిలి నిజాశ్రిత పషము కల్గు సత్కృపా
ఖని, యణుమాత్ర మైన నొక కానుక దెచ్చినఁ గొండగాఁ గనున్;
మనమున నచ్యుతేంద్ర రఘునాథుఁడె శ్రీరఘునాథుఁ డెన్నఁగన్ |చ| [33]

కావున నే నొనరించిన
యీ "విజయవిలాస" మనెడి కృతి రత్నంబున్
గేవల భక్తిని గానుక
గావించెద నని నితాంత కౌతూహలినై |క| [34]

కృతి సమర్పణము

శుభ వాసరమున, సయ్యెడ,
నిభ వాజిముఖోపదా నిరీషేచ్ఛ మహా
విభ వాభిరాముఁ డై భా
వభ వాకృతి భద్రపీఠ వాసోజ్జ్వలుఁడై |క| [35]

కుందనంపుఁ బసిండి కుళ్లాయి జగలపైఁ
జౌకట్ల నిగనిగల్ చౌకళింప;
హురుముంజి ముత్యాల యరచట్టపై గొప్ప
పతకంపు హారముల్ పరిఢవిల్ల;
వెల చెప్పరాని కెంపుల వంక జముదాడి
పీతాంబరంబుపైఁ బెరిమె నెఱప;
గబ్బి మన్నె కుమార గండపెండేరంపు
జిగి పదాగ్రంబుపైఁ జెంగలింప; |సీ|

దొరల మంత్రులఁ గవుల నాదరణ సేయు
కరము కంకణకాంతి నల్గడల నిండ,
నిండు కొలు వుండెఁ గన్నుల పండువుగను
ఠీవి నచ్యుత రఘునాథ భూవిభుండు |తే| [36]

అట్టు లొడ్డోలగం బున్న యవసరమున
వినయ భయ సంభ్రమములు నా వెంట నంట
ననుఁ గృపాదృష్టిఁ జల్లఁగాఁ గనుచు నుండ
సమ్ముఖమ్మున కరిగి, యంజలి ఘటించి |తే| [37]

"ఏలిక మాత్రమే? మహిమ నీశ్వరుఁడే తలపోసి చూడ, నా
పాలిటి రామభద్రుఁ" డని బంగరుఁబూవులఁ బూజ చేసి, నేఁ
జాల నలంకృతిం బొసఁగు సత్కృతి కానుక చేసి, కీర్తి భూ
శ్రీ లలితాంగులన్ వలవఁ జేసిన శ్రీ రఘునాథ శౌరికిన్ |ఉ| [38]

శ్రీ రస భావముల్ వెలయఁ జెప్పి ప్రబంధము లెన్నియేని మీ
పేరిట నంకితం బిడిన బిడ్డల నెందఱఁ బేరు పెట్టినన్
దీరునె మీ ఋణం? బయినఁ దెచ్చితిఁ గాన్క పరిగ్రహింపు మ
య్యా! రఘునాథ భూప రసికాగ్రణి! మామక కావ్య కన్యకన్ |ఉ| [39]

ఘోటక ఖుర పుట షుణ్ణ ధరా జాత
పాంసువు పై నుల్లభంబు గాఁగ,
భట సింహ విక్రమోద్భట సింహనాదముల్
స్వస్తి వాదంబుల చంద మొందఁ,
బది దిక్కు లొక్కటఁ బగిలి బీఁటలువాఱఁ
భేరీ నినాదముల్ బూరటిల్ల,
విజయ సమారబ్ధ వేళఁ గౌతుకమున
మొగమున గరువంపు మురువు దోఁప, |సీ|

నౌర! పెండ్లికి నేఁగిన ట్లనికి నేఁగి
యష తంత్రంబు లివి యేటి లష మనుచు
రేక మోవక గెల్చుట నీకె చెల్లు
సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! |తే| [40]

ఎంచి రంటివి గాని యీ సారి గట్టిగాఁ
దెగుఁ గార్య మను వార్తఁ దెలుపవైతి;
మించి రంటివి గాని మేదిని యదరంగ
నడిచె సైన్యం బని నుడువ వైతి;
వంటి రంటివి గాని యాభీలతర భటో
ద్భట సంగరం బని పలుక వైతి;
మొగిసి రంటివి గాని ముకుటముల్ గల రాజ
శేఖరుల్ పడుట సూచింప వైతి; |సీ|

వనుచు నీధాటి కెరవాఱు నహితవీరు
లదరునను మాట వెడలక బెదరి పల్కు
చారుఁ గని నేర మెంతురు సారె సారె
సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! |తే| [41]

భిన్న కటంబులై పేరు పెంపును లేక
గంధనాగంబు లెక్కడ నడంగె?
బాహ్లిక శక సింధు పారసీ కోద్భవ
హయ ధట్ట మే గొందియందు డిందెఁ?
బోటు గంటులఁ దూఱిపోవు దారుణ మైన
మాస్టీల గమి యెందు మ్రగ్గిపోయె?
గర్వంబు మేనులు గన్నట్టు లుండెడు
దొరల యామిక లెందుఁ దొలఁగి పోయెఁ? |సీ|

బరుల పాళెంబు లీ రీతిఁ బన్న మొంద
మాయ వన్నెను నీ ఖడ్గ మంత్రవాది
గెలిచినను నేమి మేలైన గెలుపు గంటి!
సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! |తే| [42]

రంభ వాకిటను దోరణములు గట్టెడు
తీవర మొక కొంత దీ దీలుపడియె;
మేనక యింటిలో మేల్కట్లు సవరించు
సంరంభ మొక కొంత సడలువాఱెఁ;
గనకాంగి యింటిలోఁ గర్పూరవేదికల్
సవరించు టొక కొంత జాగుపడియె;
హరిణి బంగరు మేడ నరవిరి సెజ్జలు
నిర్మించు టొక కొంత నిలుక డయ్యె; |సీ|

మబ్బు గొబ్బున నీ శౌర్యమహిమ వినక,
తెగువ తోడుత నెదిరించి, తిరిగి, విఱిగి
పాఱిపోయిన మన్నీల పాటు సూచి
సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! |తే| [43]

అతుల భూరి ప్రతాపార్క దీధితిచేత
గట్టిగాఁ గాఁకలు పుట్టు పిదప,
ఘోరారి గళరక్త ధారాళ వృష్టిచే
నాని దుక్కికిఁ బద నైనపిదప,
హయ ధట్ట ఖుర పుట హల్యా ముఖంబున
నంతట దున్నిన యట్టిపిదప,
మొలచిన నీ కీర్తి మొలకలు తఱుచుగా
వెదపెట్టి పైరు గావించుపిదపఁ, |సీ|

గాపు నిలుపవె బేతాళ గణమునెల్ల
నట్టి పట్టుల కరిగి నీ వరుల నోదె
పాటు చేసితి వనుట యేపాటి తలఁప
సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! |తే| [44]

ఒకరు వోయిన దెస కొకరు వోవక పాఱ

నరివీరులకు దాహగరిమ మించె;
గడగడ వడఁకి నల్గడల కేఁగక భీతిఁ
జెందిన వారిపైఁ జెమట పుట్టె;
మున్నాడి యెలగోలు మూఁకలఁ బోట్లాడు
పరుల మైఁ బాటల ప్రభలు మీఱెఁ;
జేగ దెచ్చుక కొంత సిగ్గున నెదిరించు
రాజుల యొప్పు బీరము తొలంగెఁ; |సీ|

దెగువతోడుత ధరియించి తీవ్ర కోప
భరిత రూక్షాక్షి నియమిత ప్రభల పేర
నీవు ఘర్మార్క విస్ఫూర్తి నెఱపునపుడు
సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! |తే| [45]

తలలు వీడఁగఁ బాఱు ధరణీశ్వరులఁ జూచి
యంటి వెన్నాడని యట్టి మహిమ,
పడిన యేనుంగుల ప్రక్కల కొదిగిన
రాజులఁ జూడని రాజసంబు,
జళిపించు చంద్రహాసములు పాఱఁగ వైచి
మ్రొక్కువారల మీఁద మొనపు కరుణ,
నెత్తురు గనుపట్ట హత్తిన భీతిచేఁ
గలవరించినవారిఁ గాచు గరిమ, |సీ|

మెన్నఁ దనమీఁద బలముతో నెనసి మొనసి
విఱుగు రాణువఁ బొమ్మను వీరవరుని
కీర్తిఁ గంటివి జగదేక కీర్తనీయ
సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక! |తే| [46]

అని విన్నవింపఁ జిత్తము
నన లొత్తఁ బరిగ్రహించి నాపై నింతం
తనరాని వత్సలత్వము
కనిపింపఁగ హర్షభర వికస్వర ముఖుఁడై. |క| [47]

"కల నయిన మిమ్ముఁ గా కన్యుఁ గొలువ నంటి,
కృతు లొకరి కీను మీకె యంకితము లంటి,
పలికిన ప్రతిజ్ఞ చెల్లింప వలదె యిట్లు?
వాఙ్నియమ రూఢి నీయంత వాఁ డిఁ కేఁడి? |తే| [48]

వాసించుఁ గవిత చెప్పిన
వీసర వో వొకట; భక్త విశ్వాసంబుల్
నీ సొమ్ములు; సామాన్యుఁడ
వే? సూర్యవరప్రసాది విజ్జగ మెఱుఁగన్ |క| [49]

ప్రతి పద్యమునందుఁ జమ
త్కృతి గలుగం జెప్ప నేర్తు; వెల్లెడ బెళు కౌ
కృతి వింటి మపారము గా
క్షితిలో నీ మార్గ మెవరికిన్ రాదు సుమీ! |క| [50]

క్షత్ర ధర్మమ్మె కద నీకుఁ గలది మొదలఁ
దమ్ములు సుతుల్ హితులు గూడ మమ్ముఁ గొలిచి;
తిపుడు కృతియును జెప్పి మా కిం పొనర్చి;
తొకటఁ గా దన్నిటను బ్రయోజకుఁడ వీవు." |తే| [51]

అని సుధా మధు రోక్తుల నాదరించి
మంజుల పదార్థ భూషణాంబర కదంబ
కరి తురంగాది వాహనోత్కరము లిచ్చి
న న్నసాధారణముగ మన్నన యొనర్ప| |తే| [52]

అభినవ భోజరాజ బిరుదాంకుఁడు శ్రీ రఘునాథ శౌరి నన్
శుభమతి నేలినందులకు సూడిద చేసితి, నౌర! మిక్కిలి
న్సభల గణింప మన్నన లొనర్చెఁ, బ్రబంధము నింతయుత్తమ
ప్రభునకు నంకితం బొనరుపం గలిగెం గద! యంచు వేడుకన్ |చ| [53]

ఆనతి యిచ్చెనా, యది శిలాక్షర; మెవ్వని నేని మెచ్చెనా,
వానిఁ గృతార్థుఁ జేయుఁ; బగవాఁ డయినన్ శరణంబుఁ జొచ్చెనా,
యా నరు నేర మెంచక తనంతటివాని నొనర్చు; నిచ్చెనా,
యేనుఁగుపాఁడి; యీడు గలదె రఘునాథ నృపాలమౌళికిన్? |ఉ| [54]

ఎందును విద్య మేలెఱుఁగ రెవ్వ; రెఱింగినఁ గొంతమాత్రమే;
యందును సాహితీ రస మహత్త్వ మెఱుంగ; రెఱింగిరేని యా
యంద మెఱుంగలే; రెఱిఁగినప్పటికిన్ విని మెచ్చి యీయ; రె
న్నం దగు నచ్యుతేంద్ర రఘునాథ విభుండె ప్రవీణుఁ డన్నిఁటన్ |ఉ| [55]

ఏ రాజు భుజశౌర్య మేదులఖా నాది
వజ్రీల చెలిమికి వశ్య విద్య,
యే రాజు విక్రమసారంబు విద్వేషి
మహిమ పలాయన మంత్రశక్తి,
యే రాజు వీక్ష సమీహిత కర్ణాట
రమ నాట్య విద్యకు రంగభూమి,
యే రాజు చరితంబు వారాశి వేష్టిత
మేదినీ పతులకు మేలుబంతి, |సీ|

యతఁడు చెలువొందుఁ జినచెవ్వ యచ్యుతేంద్ర
బహు జనన పుణ్య పరిగణ్య ఫలనిభాత్మ
పుత్త్రభావ ప్రమోద సంపూర్ణ హృదయ
పంకజాక్షుండు రఘునాథ పార్థివుండు| |తే| [56]

సింహాసనము మాట శిథిల మౌటలు విని
గట్టిగా నిలుపఁ గంకణము గట్టెఁ;
గోటిసంఖ్యలు మీఱఁ గూర్చిన ధనరాశిఁ
గొల్చు వారల కిచ్చెఁ గొల్చు వలెనె;
తుండీర పాండ్యాది మండలేశ్వరులపై
దండెత్తి విడిసె నుద్దండ మహిమ;
నేల యీనినయట్లు నిలిచిన వైరులఁ
బంచబంగాళమై పాఱఁ దఱిమె; |సీ|

గర్వి తారాతి మస్తక ఖండనోత్థ
రక్తధా రానుషం గాతిరక్త ధార
నిజ కృపాణికఁ గావేరి నీటఁ గడిగె
నిఖిల గుణశాలి రఘునాథ నృపతిమౌళి| |తే| [57]

ఘన ఘనా ఘనముల కాల సంకెలఁ బెట్టు
పాండ్యుని వెన్నాడి పాఱఁ దఱిమెఁ;
దుండీర నాథుండు దురమునఁ బఱవంగఁ
జూచి ప్రాణము దయఁ గాచి విడిచెఁ;
గయ్యాన వెనుకఁ ద్రొక్కని రాజు లెదిరింపఁ
జేరిన రాజ కౌశికులఁ బట్టెఁ;
బోరాడఁగా రాని వైరుల కోటలు
పంఫులచే లగ్గపట్టి తినిచె; |సీ|

నితఁడు సామాన్యుఁడే ధర నెంచి చూడ
విజయ నిస్సాణ రావ నిర్విణ్ణహృదయ
భీత రాజన్య సైన్య నిర్భీతిదాన
బిరుద నిజపాణి రఘునాథ బిదురపాణి. |తే| [58]

ఇచ్చునెడన్ బదార్థ మడి గిచ్చునొ; తా దయసేయఁ గాదనన్
వచ్చునొ; మించి యొక్కఁ డన వచ్చినఁ దా నది యిచ్చగించునో
యిచ్చిన నిచ్చెనే; సరిగ నెవ్వరిపై దయచేసెఁ జేసెనే;
యచ్చతురాస్యుఁడున్ దెలియఁ డచ్యుతు శ్రీరఘునాథుని చిత్తమున్ |ఉ| [59]

షష్ట్యంతములు

ఏతాదృగ్గుణ ఖనికిన్,
సీతాదృఙోహ నాంఘ్రి సేవా ధనికిన్,
శాతాసికలిత బాహా
న్వీతాసిక విమతరాజ నిఖిలావనికిన్ |క| [60]

సాక్షా న్మనోజునకు, క్షో
దక్షమ రస భావ సుకవితా భోజునకున్,
దాక్షిణ్య గణేయునకున్,
దక్షిణ సామ్రాజ్య విభవ ధౌరేయునకున్ |క| [61]

సుస్థిర లక్ష్మీ మహిత మ
ణిస్థగిత గృహాంగణునకు, నేపాళ నృపా
ల స్థాపన చణునకు, సక
లాస్థాన ప్రణుత వర గుణాభరణునకున్ |క| [62]

కీర్త్యౌదా ర్యాధరి తా
మర్త్య మహీరుహ సుధాబ్ధి మహికా ఘృణికిన్
ధౌర్త్యవ దరి కరి సృణికిన్
మూర్త్యంబా గర్భశుక్తి ముక్తామణికిన్ |క| [63]

అఘటన ఘటనా చాతు
ర్య ఘనోర్జిత కార్య నిర్వహణ ధూర్వహ ధీ
మఘ వాచార్యున కచ్యుత
రఘునాథ వసుంధరాధిరా డ్వర్యునకున్ |క| [64]

అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన విజయ
విలాసంబను శృంగార ప్రభంధమ్మునకుఁ గథాక్రమం బెట్టి దనిన;
నైమిశారణ్య మహర్షులకు రౌమహర్షణి యిట్లని చెప్పం దొడంగె. |వ|

ప్రథమాశ్వాసము

ఇంద్రప్రస్థపురీ వైభవము

చంద్రప్రస్తర సౌధ ఖేలనపర శ్యామా కుచ ద్వంద్వ ని
స్తంద్ర ప్రత్యహ లిప్త గంధ కలనా సంతోషిత ద్యోధునీ
సాంద్ర ప్రస్ఫుట హాట కాంబురుహ చంచ చ్చంచరీ కోత్కరం
బింద్రప్రస్థ పురంబు భాసిలు రమా హేలా కళావాసమై| |శా| [1]

ద్వారక ముద్దుఁజెల్లె లఁట తన్నగరీమణి; సృష్టి యన్నిటం
దేరుగ డైనచో నిదియ నేర్పుల మే రని యెంచి చేసెఁ బో
ధారుణి విశ్వకర్మ; గుఱి దానికి నెక్కడ నీడు లేని సిం
గారము గల్గు టందు వెనుకన్ సృజియింపక యుండుటే సుమీ| |ఉ| [2]

వెండియుఁ బైఁడియుఁ దడఁబడు
చుండుం బురి నెందుఁ జూడ; సుగ్రాణములై
యుండంగా వలె నందలి
యిండులఁ గైలాస మేరు పృథ్వీధరముల్| |క| [3]

తడఁబాటు గలదు వేదముల నాతని కంచుఁ
బరమేష్ఠి మెచ్చరు ధరణిసురులు;
కడమాటు పగవానిఁ గని చేమఱచె నంచు
భార్గవు మెచ్చరు బాహుజనులు;
పనికి రా కొకమూలఁ బడియె నాతనివస్తు
లని కుబేరుని మెచ్చ రర్యజనులు;
*వీటిపా టైన నాఁగేటి పాటున నేమి
యని హలాయుధు మెచ్చ రంఘ్రిభవులు;
{*అందు నాలవజాతి హలము ఖైశ్వర్యంబు
చే వృషధ్వజుని వంచింపఁ దలఁచు;} |సీ|

**పాడి దప్పక, ధర్మంబు పట్టువిడక,
లక్షలకు నమ్మఁ జాలి, నల్గడల భూమి
వరులు మే లనఁ దగి, యిట్లు పురిఁ బొలుతురు
చదువు సాముల ధన ధాన్య సంపదలను|

{**నౌర మేలనఁ దగినట్టు లా పురమునఁ
జదువు సాముల ధన ధాన్య సంపదలను
సమత నొందుచు వర్ణాశ్రమముల వార
లెలమి నుందురు కల్యాణ కలితు లగుచు|} |తే| [4]

"నీ సరి యైన దేవతటినిన్ గలఁగించెద నీ వడంపుమా
నాసరి శేషపన్నగ ఫణానివహంబు" నటంచు నప్పురిన్
బాసలు సేసికొన్న వన భాసిలు సాలశిఖాళి ఖేయముల్
మోసమె యైన విష్ణుపదమున్ బలిపీఠము ముట్ట నేటికిన్? |ఉ| [5]

రే లమృతాంశులో శశము రెమ్ముద మంచుఁ దలంచి జాళువా
మేలి పసిండి సోయగపు మేడల గుజ్జెనగూళ్ళ సందడి
నాలిక లుండి, యావలఁ జనం గని చింతిలి 'వంటయింటి కుం
దే లిది యెందుఁ బోఁగలదు నేఁటికి నే" మని యందు రందులన్| |ఉ| [6]

పున్నమరేలఁ దత్పురము పొంతనె పో శిఖరాళి దాఁకి, వి
చ్ఛిన్నగతిన్ సుధారసము చింది పయిన్ దిగువాఱ నంతనుం
డి న్నెల సన్నగిల్లు; నది నిక్కము గా దనిరేని యా పదా
ర్వన్నె పసిండి మేడలకు రాఁ బని యే మిల సౌధనామముల్? |ఉ| [7]

వేడుక నప్పురీహరుల వేగముఁ గంగొని లేళ్ళు గాడ్పుతోఁ
గూడి చనన్ వలెన్ మనము; గూడఁగ నోపక యోడినట్టి వా
రోడనివారి మోచు టని యొద్దికఁ బందెము వైచి కూడలే
కోడెనొ కాక, మోయఁగఁ బ్రయోజన మే మనిలున్ గురంగముల్? |ఉ| [8]

చుట్టును గట్టియుండు నొకచో నెడ మించుక లేకయుండఁ ద
త్పట్టణ బాహ్యభూముల మదావళ మండల మేమి చెప్ప! ని
ట్టట్టుఁ దెమల్పరా కరి భయంకర మై దివితోడ రాయు; నౌఁ;
బెట్టనికోట గాదె గజబృందము లెందును రాజధానికిన్| |ఉ| [9]

గాళకు లాపురీ భటశిఖామణు లెక్కటి యుక్కుతుంక; లా
భీలత రాశనుల్ చిదిమి పెట్టిన బంటులు వైరి కెల్ల; బే
తాళుఁడు వచ్చి డగ్గఱిన దబ్బర గా దొకదెబ్బ తీయఁగాఁ
జాలుదు; రేమి చెప్ప మఱి సాదన నేటును సాహసంబునున్? |ఉ| [10]

ఆరామ సీమలయందు నుండి పవళ్లు
ముద మెసంగ వసంతుఁ డెదురుచూచు;
మునిమాపుకడలఁ గ్రొన్ననవింటి నెఱజోదు
కేళిమందిరముల కెలనఁ జూచుఁ;
బ్రొద్దు వోయిన వేళ రోహిణీప్రాణేశుఁ
డుదిరి మేఁడల మీఁద వెదకి చూచుఁ;
దెలతెలవాఱంగ మలయ గంధవహుండు
సోరణగండ్లలోఁ జొచ్చి చూచు; |సీ|

నా పురి విలాసవతుల యొయ్యారములకుఁ
గడు సొగసి, వారి రాకలు కాచి కాచి
విరహులఁ గలంచువారె యివ్విధము గాఁగ
నున్నవారల నిఁక వేఱె యెన్న నేల? |తే| [11]

మగవానిని మగవాఁడును,
మగువను మగువయును వలచు; మఱి యే మన న
న్నగరపు రాజకుమారుల
జిగిబిగి సోయగము, చెలుల సింగారంబుల్! |క| [12]

పొలయలు*కల్ వహించి, వలపుల్ మొలిపించు పిసాళి గబ్బి గు
బ్బల జవరాండ్రు మై గగురుపాటున "నేటికి వచ్చెనమ్మ? యీ
పిలువనిపేరఁటం" బనుచు బెగ్గిలి, నాథులఁ గౌఁగిలింపఁగాఁ
బొలుపుగ నందుఁ బెండ్లి నడుపుల్ నడుచున్ వలినాలి తెమ్మెరల్| |చ| [13]
{* కాని యున్న పువుఁబోణులు ఖండిత నాయికా లలా, మలు మది
నియ్యకోల్ వలయు మానినులే}

ప్రాయపు నాయకుల్ వెల నెపాన నెగాదిగఁ జూడ "నేర్పు లౌ
రా యివి దండ మీఁద గొసరం దొరఁకొంటిరి; మంచి సాములే
పో యటు లైనచో సరసముల్ గద మీ కిపు!" డంచు నప్పురిన్
గాయజు తూపు లమ్ముదురు కందువ మాటలఁ బుష్పలావికల్| |ఉ| [14]

గొప్పలై మిన్నందు చప్పరా లెక్కి లాఁ
గులు వైచుచోఁ జంద్రకళ లనంగఁ,
గనకంబు వర్షించు ఘనుల మ్రోల నటించి
మెఱయుచోఁ దొలకరి మెఱపు లనఁగ,
మాటికిఁ జూపర మది కాస గొల్పుచోఁ
బ్రతిలేని బంగారు ప్రతిమ లనఁగఁ,
గుపిత నాథులఁ గూర్మిఁ గొసరు జంకెన నాటఁ
గనుచో మరు శిలీముఖము లనంగఁ, |సీ|

జెలఁగి యింపుగ నగఁ, బాడఁ, జెప్పఁ, జదువ,
వలవ, వలపింప నేర్చిన యలరుఁబోండ్లు
విపుల భరత కళాశాస్త్ర నిపుణ లైన
బిరుదుపాత్రలు గలరు తత్పురమునందు| |తే| [15]

అతివినోదము గాఁగ రతుల మెప్పించు నీ
పచ్చల కడియాల పద్మగంధి;
చక్కెర మో విచ్చి చవులఁ దేలించు నీ
ముత్యాల కమ్మల మోహనాంగి;
తృణముగా లోఁజేయు నెంతటివాని నీ
నీలాల ముంగఱ నీలవేణి;
వెలలేని పొందిక విడివడి మెఱయు నీ
కెంపులబొగడల కీరవాణి; |సీ|

యనుచుఁ దమలోన నెఱజాణతనము మీఱ,
వారకాంతామణుల మేలు వార్త లెల్లఁ
దెలుపుచును వెన్నెల బయళ్ళఁ గలసి నగుచు
విటులు విహరింతు రప్పురి వీథులందు| |తే| [16]

పోఁక మ్రాఁకుల మహిమ, కప్పురపు టనఁటి
యాకుఁదోఁటల సౌభాగ్య మందె కలదు;
ప్రబలు మౌక్తిక సౌధ సంపదల గరిమ
వీటి రహి మెచ్చ వలయుఁ బో వేయు నోళ్ళ| |తే| [17]

ఆణి మెఱుంగు ముత్తెపు టొయారపు మ్రుగ్గులు, రత్నదీపికా
శ్రేణులు, ధూపవాసనలు, హృద్య నిరంతర వాద్య ఘోషము
ల్రాణఁ బొసంగఁ బ్రోలు మిగులన్ గనువిం దొనరించు నిత్య క
ల్యాణముఁ బచ్చతోరణమునై జను లందఱు నుల్లసిల్లంగన్| |ఉ| [18]

ధర్మరాజు ధర్మ పరిపాలనము

ఆ పుర మేలు 'మేలు! బళి!" యంచుఁ బ్రజల్ జయవెట్టుచుండ నా
జ్ఞా పరిపాలన వ్రతుఁడు, శాంతి దయాభరణుండు, సత్య భా
షా పరతత్త్వ కోవిదుఁడు, సాధుజ నాదరణుండు, దాన వి
ద్యా పరతంత్ర మానసుఁడు ధర్మతనూజుఁ డుదగ్రతేజుఁడై| |ఉ| [19]

దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు, ప్రియ వక్తృత్వంబు కాణాచి, వి
ద్యావైదుష్యము దిక్కు, ధర్మమునకున్ దార్కాణ, మర్యాదకున్
ఠా, వౌచిత్యము జీవగఱ్ఱ, హిత శిష్ట వ్రాత సంతోషణ
శ్రీ వజ్రాంగి యజాతశత్రుఁడు మహీభృన్మాత్రుఁడే చూడఁగన్! |శా| [20]

అవలఁ బోయిన వెంక నాడు టెన్నఁడు లేదు,
మొగము ముందఱ నంట మొదలె లేదు,
మనవి చెప్పినఁ జేయకునికి యెన్నఁడు లేదు,
కొదవగా నడుపుట మొదలె లేదు,
చనవిచ్చి చౌక చేసినది యెన్నఁడు లేదు,
పదరి హెచ్చించుట మొదలె లేదు,
మెచ్చినచోఁ గొంచె మిచ్చు టెన్నఁడు లేదు,
మొక మిచ్చకపు మెచ్చు మొదలె లేదు, |సీ|

మఱియుఁ దొల్లిటి రాజుల మహిమ లెన్న
నితఁడె పో సార్వభౌముఁ డప్రతిముఁ డనఁగఁ
బ్రజలఁ బాలించె సకల దిగ్భాసమాన
కీర్తి విసరుండు పాండ వాగ్రేసరుండు| |తే| [21]

ఎంత లెస్సగ నున్న నంత వేడుకె కాని
ప్రజల కల్మి కసూయపడుట లేదు;
తనుఁ గొల్వవలె నంద ఱను ప్రియంబే కాని
మానిసి వెగ టించుకైన లేదు;
నిచ్చ వేఁడిన నర్థి కిచ్చు చిత్తమె కాని
మును పింత యిచ్చితి ననుట లేదు;
రే వగల్ ధర్మ మార్జించు దృష్టియె కాని
న్యాయంబు తప్పిన నడక లేదు; |సీ|

'కలఁడె యిటువంటి రాజు లోకమున నెందు?
జలధి వలయిత వసుమతీచక్ర మెల్ల
నేలవలె శాశ్వతముగాఁగ నీ ఘనుండె;
యేల వలె నన్యు?" లన నా నృపాలుఁ డలరు| |తే| [22]

కోప మొకింత లేదు; బుధకోటికిఁ గొంగుఁబసిండి; సత్యమా
రూపము; తారతమ్యము లెఱుంగు; స్వతంత్రుఁడు; నూతనప్రియా
టోపము లేని నిశ్చలుఁ డిటుల్ కృతలక్షణుఁడై చెలంగఁగా
ద్వాపర లక్షణుం డనఁగ వచ్చునొకో యల ధర్మనందనున్? |ఉ| [23]

దుర్జయ విమ తాహంకృతి
మార్జన యాచనక దైన్య మర్దన చణ దోః
ఖర్జులు గల రతనికి భీ
మార్జున నకుల సహదేవు లను ననుజన్ముల్| |క| [24]

పంచామర తరులో! హరి
పంచాయుధములొ! గిరీశు పంచాస్యములో!
యంచున్ సకల జనంబులు
నెంచన్ బాండవులు వెలసి రేవురు ఘను లై| |క| [25]

ఒరిమయు, భక్తియున్, నెనరు, నోర్పుఁ గనంబడఁ బెద్ద పిన్న యం
తరువు లెఱింగి, మాట జవదాఁటక, చెయ్వుల వేఱు లేక, యొం
డొరుల మనమ్ములో మెలఁగుచుండిరి "పాండు కుమారు లెంత నే
ర్పరు? లిల నన్నదమ్ముల సరాగము వారలదే సుమీ!" యనన్| |చ| [26]

అర్జునుని సౌశీల్యాదులు

అన్నలపట్లఁ, దమ్ముల యెడాటమునన్ సముఁ డంచు నెన్నఁగా
నెన్నిక గన్న మేటి, యెదు రెక్కడ లేక నృపాల కోటిలో
వన్నెయు వాసియున్ గలుగి వర్తిలు పౌరుషశాలి సాత్త్వికుల్
దన్ను నుతింపఁగాఁ దనరు ధార్మికుఁ డర్జునుఁ డొప్పు నెంతయున్| |ఉ| [27]

అతని నుతింప శక్యమె? జయంతుని తమ్ముఁడు సోయగమ్మునన్
బతగ కులాధిప ధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్,
క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతి జోదు సమిజ్జయమ్మునం,
దతని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్| |చ| [28]

పాఱఁ జూచినఁ బరసేన పాఱఁ జూచు,
వింటి కొరగిన రిపురాజి వింటి కొరగు,
వేయు నేటికి? నల పాండవేయు సాటి
వీరుఁ డిల లేఁడు; ప్రతి రఘువీరుఁ డొకఁడు| |తే| [29]

అతిలోక సమీక జయో
న్నతిచే ధర్మజున కింపొనర్చుచు వినయా
న్వితుఁడై సమస్తజన స
మ్మతుఁడై నరుఁ డుండె నిటు ల(స)మానుష చర్యన్| |క| [30]

అంతట నొక్కనాఁడు గదుఁడన్ యదువంశభవుండు రుక్మిణీ
కాంతుఁడు కూరిమిన్ బనుపఁగాఁ, గుశలం బరయంగ వచ్చి, యే
కాంతపువేళ ద్వారవతి యందలి వార్తలు దెల్పుచున్ దటి
త్కాంతి మనోహ రాంగు లగు కన్నెల చక్కఁదనంబు లెన్నుచున్| |ఉ| [31]

గదుఁడు గావించిన సుభద్రా సౌందర్య ప్రశంస

కనన్ సుభద్రకున్ సమంబు గాఁగ నే మృగీ విలో
కనన్; నిజంబు గాఁగ నే జగంబునందుఁ జూచి కా
కనన్; దదీయ వర్ణనీయ హావ భావ ధీ వయః
కన న్మనోజ్ఞ రేఖ లెన్నఁగాఁ దరంబె గ్రక్కనన్? |పంచచామరము| [32]

ప్రాయపుఁ డెక్కునన్ జెలువ పల్కులు చిల్కల గారవించుఁ; గ
న్దోయి చకోరపాళి దయతోఁ బెనుచున్; జనుకట్టు మచ్చిక
ల్సేయు సదా రథాంగ యుగళిన్; నడ లంచల బుజ్జగించు; నౌ
నే యెడ నింపు గావు గణియింప నవీన వయో విలాసముల్? |ఉ| [33]

అతివ కుచంబులున్, మెఱుఁగుటారును, వేనలియున్, ధరాధిపో
న్నతియు, నహీనభూతి కలనంబు, ఘనాభ్యుదయంబు నిప్పు డొం
దితి మని మాటిమాటికిని నిక్కెడు, నీల్గెడు, విఱ్ఱవీఁగెడున్;
క్షితి నటు గాదె యొక్కొకరికిన్ నడమంత్రపుఁ గల్మి కల్గినన్! |చ| [34]

కేళికా సరసిలోఁ దేలియాడుటఁ జేసి
శైవాల లత కొంత సాటి వచ్చుఁ;
బుష్పమాలికలతోఁ బొందు సల్పుటఁ జేసి
యెలదేఁటి గమి కొంత యీడు వచ్చుఁ;
గంటి కింపగు రేఖ గలిగియుండుటఁ జేసి
మినుకుఁ గాటుక కొంత దినుసు వచ్చుఁ;
బిఱుఁద నొయ్యారంబు మెఱయుచుండుటఁ జేసి
చమరి వాల మొకింత సమము వచ్చుఁ; |సీ|

గాక నీలత్వమున సరి గావు తెలియ
నెఱి గలిగి, యొక్క మొత్తమై, నిడుదలై, ద
ళమ్ములై, మెర్గు లై, కారు క్రమ్ముచున్న
వికచకమలాక్షి నును సోగ వెండ్రుకలకు| |తే| [35]

నలిన లీల సంచు నలినలి గావించు
నించుమించు లాడు నించు మించు
లేమ నగవుఁజూపు లేమన నగు బాపు!
జగ మెఱుంగు దాని జగ మెఱుంగు| |ఆ| [36]

జలరుహ గంధి వీనుల పసల్ నవసంఖ్య నదేమి లెక్కనున్;
జెలువ నభాంకురాళి నెల చేడియ సైకముఁ దాను చుక్కనున్;
బొలఁతుక గబ్బి చన్నుఁగవ పువ్వుల చెండ్లను లేదు బంతనున్;
గలికి ముఖారవింద మల కల్వలరాయనిఁ ద్రోసి రాజనున్| |చ| [37]

అయ్యారే చెలు వెక్కడ?
న య్యారే గెలువఁ జాలు నంగజు నారిన్
వెయ్యాఱులలో సరి లే
రయ్యా రుచి రాంగ రుచుల నయ్యంగనకున్| |క| [38]

కడు హెచ్చు కొప్పు; దానిన్
గడవన్ జనుదోయి హెచ్చు; కటి యన్నిటికిన్
గడు హెచ్చు; హెచ్చులన్నియు;
నడు మే పసలేదు గాని నారీ మణికిన్| |క| [39]

అంగము జాళువా పసిఁడి యంగము; క్రొన్నెలవంక నెన్నొసల్;
ముంగురు లింద్రనీలముల ముంగురు; లంగజు డాలు వాలుఁ జూ
పుంగవ; యేమి చెప్ప నృపపుంగవ! ముర్జిగ మేలఁజేయు న
య్యంగనఁ బోలు నొక్క సకియన్ గన; నెన్నఁగ మించు నన్నిటన్| |ఉ| [40]

ఎక్కడఁ జెప్పినాఁడఁ దరళేక్షణ చక్కఁదనమ్ము? నింక న
మ్మక్క! యదే మనంగ నిపు డందు శతాంశము దెల్పలేదు నే;
నొక్కొకయంగ మెంచవలయున్, బదివేల ముఖంబు లాయెఁబో;
చొక్కపుఁ జూపులో సొలపు చూచినఁ గాక యెఱుంగ వచ్చునే? |ఉ| [41]

అని బహుభంగులం బొగడ నంగన ముంగల నిల్చినట్లుఁ దాఁ
గనుగొని నట్లు నై నృపశిఖామణి డెందమునందుఁ బట్టఁజా
లని యనురక్తి 'నవ్వర విలాసిని నెన్నఁడు చూడఁ గల్గునో"
యని తమకించుచున్న సమయంబున గ్రక్కున దైవికంబునన్| |చ| [42]

సమయభంగమునకై యర్జునుఁడు తీర్థయాత్ర కేఁగుట

ఒక భూమీదివిజుండు చోరహృత ధేనూత్తం సుఁడై వేఁడికొం
టకుఁ రా ధర్మజు కేళిమందిరము దండం బోయి కోదండ సా
యకముల్ దెచ్చుటఁ బూర్వక్జప్త సమయ న్యాయాను కూలంబుగా
నొక యేఁ డుర్వి ప్రదక్షిణం బరుగు నుద్యోగంబు వాటిల్లినన్| |మ| (43)

అన్నకు మ్రొక్కి, "తీర్థ భజనార్థముగాఁ బనివిందు" నంచుఁ దా
విన్నప మాచరించుటయు, "విప్రహితంబున కన్న ధర్మమే
మున్నది? గోప్రదక్షిణమె యుర్విప్రదక్షిణ, మంచు నిట్టు లే
మన్నను మాన కన్నరుఁడు ప్రార్థన సేయఁగ నెట్టకేలకున్| |ఉ| (44)

తనదు పురోహితుం డయిన ధౌమ్యుని తమ్ముని గారవంపు నం
దనుని విశారదున్ సకలధర్మ విశారదు వెంట నంటఁగా
నొనరిచి, కొందఱన్ బరిజనోత్తములన్ నియమించి, యాదరం
బెనయ సమస్త వస్తువులు నిచ్చి యుధిష్ఠిరుఁ డంపె వేడుకన్| |చ| (45)

పరిణయ మౌట కేఁగుగతిఁ బౌరు లనేకులు వెంటరా శుభో
త్తరముగ నయ్యెడన్ గదలి, తద్దయుఁ దాలిమి మీఱ ధర్మత
త్పరుఁడయి, యందు నందు నులుపాలు నృపాలు రొసంగఁగా నిరం
తరమును బుణ్యతీర్థములఁ దానము లాడుచు నేఁగి యవ్వలన్| |చ| (46)

అర్జునుఁడు గంగాభవానిని నుతించుట

సునాసీర సూనుండు సూచెన్ నిమజ్జ
జ్జనౌ ఘోత్పత త్పంక శంకాక రాత్మో
ర్మి నిర్మగ్న నీరేజ రేఖోన్నమ ద్భృం
గ నేత్రోత్సవ శ్రీని గంగా భవానిన్| |భుజంగ ప్రయాతము| (47)

సంతోష బాష్ప ధారలు
దొంతరగాఁ జూచి, మ్రొక్కి, తోయధి వరసీ
మంతిని, నా త్రిజగ ద్దీ
వ్యంతిని, భాగీరథీ స్రవంతిని బొగడెన్| |క| (48)

తా సైరింప కపర్ణ యుండఁగ భవ ద్గర్భంబునన్ దాల్చి, తే
జోऽసహ్యున్ శరజన్ముఁ గాంచి, యల నీహార క్షమాభృత్కుమా
రీ సాపత్న్యముఁ గన్న మోహపుఁ బురంధ్రీరత్నమౌ దీవ కా
దే; సర్వజ్ఞుఁడు నిన్ను నేల తలపై నెక్కించుకో జాహ్నవీ! |శా| (49)

పెల్లు సెగఁ జల్లు విస మా
తెల్లని దొర కుతికమోవఁ దివి బ్రతుకుట నీ
చల్లఁ దనంబునఁ గాదే?
కల్లోలవతీ మతల్లి గంగమ తల్లీ! |క| (50)

పువ్వారుఁబోణివై, సరి
యెవ్వా రన, భీష్ముఁ గాంచి యిం పొందితి వీ;
వవ్వావి యెఱుఁగుదువె? మా
యవ్వా! పోషింపఁ బాడి యగు నను నీకున్| |క| (51)

సకల శుభమ్ము లి మ్మనుచు సన్నుతు లీగతిఁ జేయ నా స్రవం
తిక దయఁ దెల్పఁ బంచిన గతిం జనుదెంచె నుదంచ దూర్మికా
నికర విలోల ఖేల దళినీ కలగాన లస త్ప్రఫుల్ల హ
ల్లక సుఖడోలికా విహృతి లాలస బాలసమీర మయ్యెడన్| |చ| (52)

చనుదెంచిన హా! యని, య
జ్జననాయకుఁ డలరుచున్ విశారదుఁ గని, "యీ
యనుకూల మారు తాగతిఁ
గనుఁగొన నామోద సూచకం బైనది గా| |క| (53)

తల నీ గంగాతీర్థము
చిలికినవాఁ డీశ్వరుండు; చేరెడు లోఁ గోఁ
గలిగినఁ, దరఁగలఁ దేలం
గలిగినఁ దన్మహిమ లెన్నఁగాఁ దర మగునే? |క| (54)

మునుకలు గంగానదిలో
నొనరించుటకన్న భాగ్య మున్నదె? యనుచున్
మును కలుగంగా దిగి పరి
జనములు కైలా గొసంగ స్నానోన్ముఖుఁడై| |క| (55)

తమి నిగుడ గుడాకేశుం
డమరనదీ విమలవారి నాడుచు నుండన్
యమునానదిఁ గూడిన తో
యమునా నది తనరెఁ ద త్కచామేచకమై| |క| (56)

దానము లెన్నియే నచటి తైర్థిక భూసుర సంఘ మెల్ల డెం
దాన ముదంబు చెందఁగ నొనర్చి, దృఢవ్రతచర్య నిత్యమున్
దానము చేయుచున్, హరికథా శ్రవణం బొనరించుచుండే నం
దా నముచిద్విషత్తనయుఁ డాశ్రిత కల్పమహీరుహం బనన్| |ఉ| (57)

గంగా తీరమున నాగకుమారి యులూచి యర్జనుని గాంచి మరులు గొనుట

భోగవతి నుండి యెప్పుడు
భాగీరథి కడకు వచ్చి భాసిలు మున్నే
నాగకుమారిక యయ్యెల
నాగ యులూచి తమి నొక్కనాఁ డటఁ జెంతన్| |క| (58)

హిమ రసైక సైకతమునందు విహరించు
కైరవేషు వేషు ఘన నిభాంగు
నెనరు దవుల దవులనే చూచి క్రీడిగా
నెఱిఁగి యౌర! యౌర గేందువదన| |ఆ| (59)

మును ద్రౌపదీ స్వయంవర
మున కేఁగిన కామరూప భోగులవలనన్
వినియున్న కతనఁ దమకము
మనమునఁ బెనఁగొనఁగఁ జేరి మాయాన్వితమై| |క| (60)

గు ట్టసియాడ గబ్బి చను గుట్టలపైఁ బుల కాంకు రావళుల్
తెట్టువ గట్టఁ, గోరికలు తేటలు వెట్టఁగ, వేడుకల్ మదిన్
దొట్టికొనంగ, నచ్చెరువు తొంగలి ఱెప్పల వీఁగ నొత్తఁగాఁ
బెట్టిన దండ తీయక విభీత మృగేక్షణ చూచె నాతనిన్| |ఉ| (61)

ఏణాక్షి నపుడు వెడ సిం
గాణిన్ గొని యలరుఁ దూపుగమిఁ జక్కెరయే
ఖాణముగాఁ గలిగిన కం
ఖాణపు దొర పింజపింజ గాడఁగ నేసెన్| |క| (62)

పై పయిఁ గౌతుకంబు దయివాఱి యిటుండఁగ నంత మజ్జనం
బై పువుఁ జప్పరమ్మున నొయారముగాఁ గయిసేసి, దానలీ
లా పరతంత్రుఁ డై కలకలన్ నగుచుండెడి సవ్యసాచి, నిం
ద్రోపలరోచిఁ జూచి, తలయూఁచి యులూచి రసోచితంబుగన్| |ఉ| (63)

ఉలూచి యర్జునుని సోయగమును మెచ్చుట

"సిగ సంపెఁగ పూ, లొసపరి
వగ, కస్తురి నామ, మొఱపు వలెవా టౌరా!
సొగ సిటు లుండఁగ వలె"నని
సొగసి, లతాతన్వి యతని సొగసు నుతించెన్| |క| (64)

రాకొమరు నెఱులు నీలపు
ఱాకొమరు నిరాకరించు; రాకాచంద్రున్
రాకొట్టు మొగము; కెంజిగు
రాకుఁ గని పరాకు సేయు నౌర పదంబుల్! |క| (65)

తీరిచినట్టు లున్నవి గదే కనుబొమ్మలు; కన్ను లంటిమా
చేరలఁ గొల్వఁగా వలయుఁ; జేతుల యందముఁ జెప్ప గిప్ప రా;
దూరులు మల్చివేసినటు లున్నవి; బాపురె! ఱొమ్ములోని సిం
గారము, శేషుఁడే పొగడఁగావలె నీతని రూపరేఖలన్| |ఉ| (66)

అకటా! న న్నితఁ డేలిన
నొకటా? నచ్చికము లేక యుండఁగ వచ్చున్
నికటామృత ధారలు మరు
ని కటారి మెఱుంగు లీతని కటాక్షంబుల్| |క| (67)

ఆ దరహాస చంద్రికల యందము, నాప్తులమీఁదఁ జిల్కు న
త్యాదర శీతలేక్షణ సుధారస ధారయుఁ జూడఁ జూడ నా
హ్లాదము గొల్పఁగాఁ గల కలా మహిమంబుఁ దలంచి చూచిన
న్మాదిరి సేయవచ్చు జననాథు మొగంబును జంద్రబింబమున్| |ఉ| (68)

ఊఁదుకపోవు శంఖము నహో గళరేఖ! శరాసనంబులన్
వాదుకుఁ బట్టుఁ గన్బొమల వైఖరి; వంకలు దీరుచున్ గటా
క్షోదయలీల సాయక సమూహములన్; విషమాస్త్రుఁ గెల్చుఁబో;
యే దొర సాటి యీ నరున కన్నఁగ వీరవిలాస సంపదన్? |ఉ| (69)

కమ్మని జాళువా నొరయఁ గల్గిన చెక్కుల టెక్కువాఁడు, చొ
క్కమ్మగు జాతికెంపు వెలగాఁ గొను మోవి మెఱుంగువాఁడు, స
త్యమ్మగు రూప సంపద ధనాధిపసూనుని ధిక్కరించువాఁ
డమ్మక చెల్ల! నా హృదయ మమ్మక చెల్లదు వీని కియ్యెడన్| |ఉ| (70)

ముద్దాడ వలదె యీ మోహనాంగుని మోము
గండ చక్కెర మోవి గల ఫలంబు?
రమియింపవలదె యీ రమణు పేరురముపై
వలి గుబ్బ పాలిండ్లు గల ఫలంబు?
శయనింపవలదె యీ ప్రియుని సందిటిలోనఁ
గప్పు పెన్నెఱికొప్పు గల ఫలంబు?
వసియింప వలదె యీ రసికు నంకమునందుఁ
జెలువంపు జఘనంబు గల ఫలంబు? |సీ|

రాజసము తేజరిల్లు నీ రాజుఁ గూడి
యింపు సొంపులు వెలయఁ గ్రీడింప వలదె
నాకలోకంబు వారికి నైన లేని
యలఘుతర భోగభాగ్యముల్ గల ఫలంబు? |తే| (71)

అని యిటు లువ్విళ్లూరెడు
మనమునఁ గొనియాడి యంత మాపటి వేళన్
గనుఁబ్రామి, చొక్కుఁ జల్లిన
యనువున నందఱు వితాకులై యుండంగన్| |క| (72)

"ఇటు జపియించినన్ విడుతునే నిను నేనిఁక" నంచు జాహ్నవీ
తటమున సంధ్యవార్చి జపతత్పరుఁడై తగువాని యామినీ
విటకుల శేఖరున్ గొనుచు వే పురికిన్ జని నిల్పె నట్టెయు
న్నటులనె మాయ యిచ్చుపడ నల్ల భుజంగి నిజాంగణంబునన్ |చ| (73)

నిలిపిన జప మెప్పటివలెఁ
జలిపినవాఁ డగుచుఁ బాకశాసని యంతన్
దళుకుం బిసాళి వాలుం
దెలి గన్నులు విచ్చి చూచె నివ్వెఱతోడన్| |క| (74)

భోగవతిలో నర్జునుఁడు ఉలూచి విభ్రమము చూచి సంభ్రమాశ్చర్యముల నొందుట

దట్టంపుఁదెలి నీటి తరఁగచాల్ కడ కొత్తి
నెలఱాల జగిలెఁ {*జగతి} దా నిలుచు టేమి?
కొలఁకుఁ దెమ్మెర గందములఁ గ్రిందఁ బడవైచి
కపురంపుఁ దాఁవిఁ దాఁ గవియు టేమి?
చివురు జొంపపు మావి జీబు మాయము సేసి
పసిఁడి యుప్పరిగఁ దాఁ బ్రబలు టేమి?
నిద్దంపు టిసుము తిన్నియ పాన్పు దిగ ద్రోచి
యలరుల పాన్పుఁ దా హత్తు టేమి? |సీ|
మసమసక సంజ కెంజాయ మఱుఁగువెట్టి
మిసిమి కెంపుల కాంతిఁదా మెఱఁయు టేమి?
మొదల నే గంగతటి నున్న యదియు లేదొ
మాయయో కాక యిది? యంచు మరలఁజూడ| |తే| (75)

బెళుకుఁ గాటుకకంటి సొలపుఁ జూ పెదలోనఁ
బట్టియుండెడి ప్రేమఁ బట్టి యీయఁ
జికిలి బంగరువ్రాఁత జిలుగు టొయ్యారంపుఁ
బైఁట గుబ్బల గుట్టు బైటవేయ
సొగసుఁ గుచ్చెల నీటు వగలు కన్నుల పండు
గలుగ మాయపుఁ గౌనుఁ గలుగఁజేయ
నిడుద సోగ మెఱుంగు జడకుచ్చు గరువంపుఁ
బిఱుఁదు రేఖకు గెల్పుబిరుదు చాటఁ |సీ|

గంటసరి నంటు కస్తురి కమ్మవలపు
కప్పురపు వీడియపుఁ దావి గలసి మెలఁగ
నొఱపులకు నెల్ల నొజ్జయై యుండె నపుడు
భుజగ గజగామిని మిటారి పొలుపు మీఱి| |తే| (76)

అటులున్న కొమరుఁ బ్రాయపుఁ
గుటిలాలకఁ జూచి, మదన గుంఫిత మాయా
నటనంబో యది! గంగా
ఘటనంబో! యని విచార ఘట నాశయుఁడై| |క| (77)

తియ్యని వింటివాని వెనుతియ్యక డగ్గఱఁ జాలు నయ్యసా
హాయ్య తనూవిలాసి దరహాసము మీసముఁ దీర్ప నప్పుడా
తొయ్యలి వంకఁ గన్గొని "వధూమణి! యెవ్వరిదాన నీవు? పే
రెయ్యది నీకు? నొంటి వసియింపఁగఁ గారణ మేమి?" నావుడున్| |ఉ| (78)

మేలి పసిండి గాజుల సమేళపుఁ బచ్చల కీల్కడెంపు డా
కేలు మెఱుంగు గబ్బి చనుఁగ్రేవకుఁ దార్చుచు సోగ కన్నులన్
దేలగఁ జూచి, "యో మదవతీ నవ మన్మథ! యీ జగంబు పా
తాళము; నే నులూచి యనుదాన, భుజంగమరాజ కన్యకన్| |ఉ| (79)

"సరిలేని విలాసము గని
వరియిం చిటఁ దోడికొనుచు వచ్చితి నిన్నో
కురువీర! వసింపఁగ నీ
కుఱువీర దృఢాంకపాళిఁ గోరినదానన్| |క| (80)

"మంపెసఁగన్ గటాక్ష లవ మాత్రము చేతనె ముజ్జగంబు మో
హింపఁగఁ జేయు భార మిఁక నీవు వహించితి గానఁ గేళినీ
చంపకగంధి బిత్తరపుఁ జన్నుల మీఁద సుఖించుచుండు నా
సంపెఁగమొగ్గ ముల్కిగడ సామరి సోమరి గాక యుండునే?" |ఉ| (81)

అను నచ్చెలి వాక్యంబులు
విని యచ్చెరువొంది, "రూప విభ్రమ రేఖా
ఖను లెందు నాగకన్యలె"
యని విందుము; నేఁడు నిక్క మయ్యెన్ జూడన్| |క| (82)

అన్నన్న! మొగము వెన్నుని
యన్నన్న జయించుఁ; గన్ను లన్నన్ నలినా
సన్నములు; నడుము మిక్కిలి
సన్నము; మాటలు సుధా ప్రసన్నము లెన్నన్ |క| (83)

నువ్వుఁ బువ్వు నవ్వు జవ్వని నాసిక,
చివురు సవురు జవురు నువిదమోవి,
మబ్బు నుబ్బు గెబ్బు బిబ్బోకవతి వేణి,
మెఱపు నొఱపుఁ బఱపుఁ దెఱవ మేను| |ఆ| (84)

రవరవలు నెఱపు నీలపు
రవ రవణముతోడఁ జెలి యరాళ కచంబుల్;
కవకవ నవ్వున్ వలి జ
క్కవ కవఁ గలకంఠ కంఠి కఠిన కుచంబుల్| |క| (85)

చెక్కుల యందమున్, మొగము చెల్వముఁ, జన్గవ నీటు, వేణి తీ
రెక్కడఁ జూడ; మన్నిటికి నెక్కువ దే మన సైకతంబుతో
నెక్కటి కయ్యముల్ సలుపు నిక్కటి యొక్కటి చాలదే మరున్
డక్కగొనన్ రతిన్ గెలిచి డక్కగొనన్ నవమోహనాంగికిన్| |ఉ| (86)

అని మది మెచ్చి యొచ్చె మొకయందును లేని మనోహరాంగముల్
గనుఁగొని, "యౌనెకా! వ్రతము గైకొని యుండెడి నన్ను నేల తో
డ్కొని యిటఁ దెచ్చె నీ వెడఁగుఁ గోమలి? భూజగ మేడ, మారుతా
శనజగ మేడ? యెంత ఘనసాహస మింతుల?" కంచు నెంచుచున్| |చ| (87)

ఉలూచి యర్జునుల సరస సంవాదము

"కాముకుఁడఁ గాక వ్రతినై
భూమి ప్రదక్షిణము సేయఁ బోయడి వానిన్
గామించి తోడి తేఁ దగ
వా? మగువ! వివేక మించుకైనన్ వలదా?" |క| (88)

నావుడు మోమునన్ మొలక నవ్వొలయన్, వలి గబ్బి గుబ్బ చన్
ఠీవికిఁగా నటించుక నటించు కవున్ గనిపింపఁ బల్కె రా
జీవదళాక్షి; "యో రసికశేఖర! యో జన రంజనైక లీ
లావహరూప! యో నుతగుణా! తగునా యిటు లాన తీయఁగన్? |ఉ| (89)

నిను గీతి సాహితీ మో
హన వాణులు చెవులు వట్టి యాడింపంగాఁ
గని యుండి "కాముకుఁడ గా"
నని పల్కిన నాకు నమ్మి కౌనె నృపాలా! |క| (90)

అతులిత విలాస రేఖా
కృతులన్ వలపించి యిటులఁ ద్రిభువన లీలా
వతుల వలయించుటేనా
వ్రత మనఁగా నీకు? రూపవంచిత మదనా! |క| (91)

తెలియనిదానఁ గాను జగతీ వర! ద్రౌపదియందు ముందు మీ
రల సమయంబు సేయుట, ద్విజార్థము ధర్మజు పాన్పుటింటి ముం
గలఁ జని, శస్త్రశాల విలు గైకొను, టందునిమిత్త మీవు ని
శ్చలమతి భూప్రదక్షిణము సల్పఁగ వచ్చుట, నే నెఱుంగుదున్| |చ| (92)

చెఱుకువిలుకాని బారికి వెఱచి నీదు
మఱుఁగుఁ జేరితిఁ; జేపట్టి మనుపు నన్నుఁ;
బ్రాణ దానంబు కన్నను వ్రతము గలదె?
యెఱుఁగవే, ధర్మపరుఁడవు నృపకుమార! |తే| (93)

నాఅమె నీకు మేల్పడిన నాతి నలంచుట? యంత్ర మత్స్యము
న్మాయఁగఁ జేసి మున్ ద్రుపదనందన నేలవె? యంగభూ పతా
కాయత యంత్రమత్స్య మిపు డల్లనఁ ద్రెళ్ళఁగ నేసి యేలుకో
తీయఁగఁ బంచదార వెనుతీయఁగఁ బల్కి ననున్ ద్వితీయఁగన్| |ఉ| (94)

అనుడు నుడురాజ కుల పా
వనుఁడు "సమస్తమ్ము నెఱుఁగు వలఁతివి గద; యీ
యనుచితము తగునె? పరసతి
నెనయుట రాజులకు ధర్మమే యహి మహిళా?" |క| (95)

అన విని పాఁప పూప జవరా లెదలో వల పాప లేక, యా
తని తెలిముద్దు నెమ్మెగముఁ దప్పక తేట మిటారి కల్కి చూ
పునఁ దనివారఁ జూచి, "నృపపుంగవ! యన్నిట జాణ; వూరకే
యనవల సంటిగా; కెఱుఁగవా యొకమాటనె మర్మకర్మముల్? |చ| (96)

"కన్నియఁ గాని వేఱొకతెఁ గాను మనోహరరూప! నీకు నే
జన్నియ పట్టియుంటి నెలజవ్వన మంతయు నేఁటిదాఁక; నా
కన్నుల యాన; నా వలపుఁ గస్తురినామము తోడు నమ్ము; కా
దన్నను నీదు మోవి మధురామృత మానియు బాస సేసెదన్| |ఉ| (97)

"ఇలపయి మత్స్యయంత్ర మొక యేటున నేసి, సమస్త రాజులన్
గెలిచిన మేలువార్త లురగీ వరగీతిక లుగ్గడింప వీ
నుల నవి చల్లఁగా విని, నినున్ వరియింప మనంబు గల్గి, నీ
చెలువము వ్రాసి చూతు నదె చిత్తరువందు ననేక లీలలన్| |చ| (98)

"చెప్పెడి దేమి నా వలపు చేసినచేఁతలు? కొల్వులోన ని
న్నెప్పుడు గంటి నప్పుడ పయింబడ నీడిచె, నిల్వఁ బడ్డ పా
టప్పు డ దెంత యైనఁ గల; దట్టి హళాహళి కింతసేపు నీ
నొప్పెడిదాఁకఁ దాళుట కయో! మది మెచ్చవుగా నృపాలకా!" |ఉ| (99)

అనిన "ఫణిజాతి వీ, వేను మనుజజాతి;
నన్యజాతిఁ బ్రవర్తించు టర్హ మగునె?
యేల యీకోర్కి?" యనిన రాచూలి కనియెఁ
*జిలువచెలువంపుఁ బల్కులఁ జిలువ చెలువ| |తే| (100)
{*జెలువు చెలువంపు}

"ఏ మనఁ బోయెదన్ దగుల మెంచక నీ విటు లాడఁ దొల్లి శ్రీ
రాము కుమారుఁ డైన కుశరాజు వరింపఁడె మా కుముద్వతిన్?
గోమల చారుమూర్తి పురుకుత్సుఁడు నర్మదఁ బెండ్లియాడఁడే?
నీ మన సొక్కటే కరఁగనేరదు గాని నృపాలకాగ్రణీ"! |ఉ| (101)

'ఈ కలహంసయాన నను నెక్కడి కెక్కడ నుండి తెచ్చె? నా
హా కడుదూర మిప్పు!' డని యక్కునఁ జేర్పక జంపుమాటలన్
వ్యాకులపెట్టు టేల? విరహాంబుధి ముంపక పోదు నన్ జలం
బే కద నీకు, మంచి, దిఁక నీఁతకు మిక్కిలి లోఁతు గల్గునే?" |ఉ| (102)

అని వచియించునప్పుడు ముఖాబ్జము నంటెడి విన్నఁబాటు, చ
క్కని తెలి సోగ కన్నుఁగవఁ గ్రమ్ముచు నొండెడి బాష్పముల్ గళం
బునఁ గనిపించు గద్గదిక ముప్పిరిగొన్‌వలవంతఁ దెల్ప ని
ట్లని మదిలోఁ గరంగి రసికాగ్రణి యా కరభోరు భోరునన్| |చ| (103)

"చక్కెరబొమ్మ! నా వ్రతము చందముఁ దెల్పితి; నంతె కాక నీ
చక్కఁదనంబుఁ గన్న నిముసం బయినన్ నిలు పోప శక్యమే
యక్కునఁ జేర్ప?" కంచు దయ నానతి యీఁ, దల వంచె నంతలో
నెక్కడినుండి వచ్చెఁ దరళేక్షణకున్ నునుసిగ్గు దొంతరల్! |ఉ| (104)

అర్జునుఁ డులూచిని సుఖసాగరమునఁ దేల్చుట

అంకి లెఱింగి యా సరసుఁ డంత "వివాహ విధిజ్ఞుఁ డైన మీ
నాంకుఁ డొనర్చినాఁ డిది శుభైక ముహూర్తము, ర"మ్మటంచుఁ బ
ర్యంకముఁ జేర నచ్చెలిఁ గరగ్రహణం బొనరించెఁ దన్మణీ
కంకణ కింకిణీ గణ వికస్వర సుస్వరముల్ సెలంగఁగన్| |ఉ| (105)

ఒక మాణిక్యపు బొమ్మ యెట్టి వగ కీలో జాళువా జాలవ
ల్లిక బాగాల్ కపురంపు టాకుమడుపుల్ వే తెచ్చి రాజున్న చా
యకు నందీయ, నతండు లేనగవుతో నా వేళ నా వ్యాళ క
న్యక కెంగేల నొసంగి కైకొనియె సయ్యాటంబు వాటిల్లఁగన్| |మ| (106)

శయ్యకుఁ దార్పఁగాఁ దుఱుముజాఱెఁ దనంతటఁ జక్కదిద్దఁబోఁ
బయ్యెద జాఱె; నయ్యదిరిపాటునఁ గ్రక్కున నీవి జాఱె; రా
జయ్యెడ నవ్విలాసిని యొయారముఁ జూచి కవుంగిలించె; నౌ,
నెయ్యెడ మేలె చూతురు, గ్రహింపరు జాణలు జాఱుపాటులన్| |ఉ| (107)

కౌఁగిటఁ జేర్చునప్పటి సుఖంబె లతాంగికిఁ బారవశ్యము
న్మూఁగఁగఁ జేసె; మోవి పలునొక్కు లు రోజ నఖాంకముల్ మొద
ల్గాఁగల కంతుకేళి సుఖలక్షణముల్ పయిపెచ్చులయ్యె, న
ట్లౌ గద యెట్టి వారలకు నగ్గలపుం దమి గల్గియుండినన్| |ఉ| (108)

చనుఁగవ సాముకండెపుఁ బిసాళి యురంబున సారెఁ గాననే
మన సునుపున్; సుధారసము మాటికిఁ గ్రోలనె చూఁచు; జొక్కుఁ గీ
ల్కొను సరసోక్తులన్ విననె కోరు సదా; యిటు లాదిసంగమం
బుననె విభుండు మూఁడువలపుల్ వలచెన్ ఫణిరాజకన్యకన్| |చ| (109)

నాగరిక ముద్ర గల మంచి బాగరి యఁట!
నాగవాసములో వింత నటనల దఁట!
కులుకు గుబ్బల ప్రాయంపుఁ గోమలి యఁట!
వలచి వలపింపదే యెంతవాని నైన! |తే| (110)

ఇలావంతుని జననము

ఈ గతి రతి కేళీ సుఖ
సాగరమునఁ దేలియున్న సమయంబునఁ, ద
ద్యోగం బెటువంటిదొ, స
ద్యోగర్భంబున సుపుత్త్రుఁడొకఁ డుదయించెన్| |క| (111)

ఆ చక్కని బాఁలుడు వాక్
ప్రాచుర్యముఁ గాంచునని శుభగ్రహ దృష్టుల్
చూచి యిలావంతుండని
యా చతురుఁడు నామకరణ మలరిచి యంతన్| |క| (112)

కామినిఁ జూచి "రమ్ము గజగామిని! యిక్కడ నొక్కవాఁడిఁకన్
దామస మైన నక్కడ హిత వ్రతి తైర్థికకోటి యాత్మలో
నేమని యెంచునో? యిపుడ యేఁగవలెన్, దరువాత నీసుత
గ్రామఱి, నీవు వచ్చెదరు గా!" కని యాఱడిలంగఁ బల్కినన్| |ఉ| (113)

ఉలూచి యర్జునునకు వీడ్కోలొసఁగుట

అంటిన ప్రేమ జాహ్నవికి నప్పుడ తోడ్కొని వచ్చి, యల్ల వా
ల్గంటి నిజేశ్వరున్ దనదు గబ్బి చనుంగవఁ జేర్చి, బాష్పముల్
కంటఁ దొరంగుచుండఁ దిరుగం దిరుగం గనుఁగొంచుఁ గ్రమ్మఱెన్
జంట దొఱంగి సంజను వెసం జను జక్కవ పెంటియుం బలెన్| |ఉ| (114)

అంతట రాజురాకఁ గని యాప్త పురోహిత భృత్య వర్గ మ
త్యంత ముదమ్ము చెంది "యిటు లార్తులఁ గాచుట కేమొగాక యే
కాంతము గాఁగ నేఁగుదురె? యంచుఁ దలంచితి; మీరు వచ్చు ప
ర్యంతము మమ్ము మే మెఱుఁగ; మందఱ ప్రాణము లీవ భూవరా!" |ఉ| (115)

అర్జునుఁడు తన నెచ్చెలి విశారదునితో నులూచీ ప్రణయ ప్రసంగమును వర్ణించుట

అని పలుకన్ బ్రసన్నముఖుఁడై విభుఁ డిష్టసఖున్ విశారదున్
గని "యొక వింత వింటె! ఫణికన్య యులూచి యనంగ నోర్తు నన్
గొని తమ నాగలోకమునకున్ జని తన్ను రమించు మంచుఁ జె
ప్పని ప్రియ మొల్లఁజెప్పి యొడఁబా టొనరించి కరంచెడెందమున్| |చ| (116)

"చెప్పెడిదేమి! కన్నుఁగవ చేరల కెక్కుడు చంద్రబింబమే
తప్పదు మోము, మోవి సవతా చివు రెక్కడిమాట? గొప్పకున్
గొప్ప పిఱుందు, గబ్బి చనుగుబ్బలు కౌఁగిటి కెచ్చు జాళువా
యొప్పులకుప్ప మేను, నడు మున్నదొ లేదొ యెఱుంగ నింతకున్| |ఉ| (117)

"చంగున దాఁటు చూపు లిరు చక్కని బేడిస లేమొ? మీటినన్
ఖంగన వాఁగు గుబ్బలు చొకారపుఁ దాళము లేమొ, చూడనౌ
నంగున మించు చెక్కిళు లొయారపుటద్దము లేము, చొక్క మౌ
రంగున మీఱు దాని యధరంబును గెంపగునేమొ, నెచ్చెలీ! |ఉ| (118)

"ఆ యెలనాగ వేణి మెఱుఁగారు కటారికి మాసటీఁ డగున్
బోయన వచ్చు; నమ్మెఱుఁగుఁబోఁడి పిఱుందు సమస్త భూమికిన్
రాయ లనంగవచ్చు; నల రాజనిభాస్య యెలుంగు గట్టివా
కోయిల కంచుకుత్తికలకున్ బయకాఁ డనవచ్చు నెచ్చెలీ! |ఉ| (119)

"మదిరాక్షి మోవి జిగి ప్రతి
వదనము గావించు గీర వదనముతోడన్
మదనుని విలు గొనవచ్చున్
సుదతీమణి కన్నుబొమల సుద తీరెంచన్| |క| (120)

"అల జడ యందమున్, మెఱుఁగు టారు మిటారము నాకు ముందుగాఁ
జిలువ కొలం బటంచుఁ జెలి చెప్పక తొల్తనె చెప్పెఁ, దత్తనూ
విలసన మెన్నఁ గన్నదియు విన్నది గా, దిలలో లతాంగు లా
పొలఁతుక కాలిగోరులకుఁ బోలరు, పోలునొ యేమొ తారకల్! |చ| (121)

"మరుని గెల్పుల కథా మహిమమ్ము విలసిల్లు
నొఱపుఁ జిత్తరువుల నుల్లసిల్లు
వీనుల కమృతంపు సోనలై వర్తిల్లు
శారికా ముఖ సూక్తి సందడిల్లుఁ
గస్తూరి కాది సద్వస్తుల బ్రభవిల్లుఁ
పరిమళమ్ముల జోకఁ బరిఢవిల్లుఁ
జెప్పఁ జూపఁగ రాని సింగారము ఘటిల్లు
పెక్కుశయ్యల సొంపు పిక్కటిల్లు |సీ|

"వింత హరువుల పసులచే విస్తరిల్లు
దివ్య మాణిక్య కాంతులఁ దేజరిల్లు
నందముల కెల్ల నందమై యతిశయిల్లుఁ
బాఁప జవరాలి బంగారు పడకటిల్లు| |తే| (122)

"ఆ భోగము, తద్వస్తు చ
యాభోగము నెందుఁగన్నయవి గావు సుమీ!
నాభోగపురము సరి యౌ
నా భోగవతీ పురంబు సార్థంబయ్యెన్| |క| (123)

"ఆ మదిరాక్షి భోగవతి యన్ నదిఁ గ్రుంకఁగఁజేసి, తత్పుర
స్థేములి హాటకేశ్వరు భజింప నొనర్చిటు తోడి తెచ్చి న
న్నీమహినిల్పి యేఁగె నిదె యిప్పుడె; నన్నెడఁబాయలేని యా
ప్రేమది యింత యంత యని పేర్కొనరా" దని తెల్పెఁ; దెల్పినన్| |ఉ| (124)

మౌఖరి మించ నిట్టులను మంత్రిశిఖామణి "చోద్య మయ్యె నా
వైఖరి విన్న నే మనఁగవచ్చు? నహో! మనుజేంద్ర చంద్రమ
శ్శేఖర! చిల్వరా కొలము చేడియ నొక్కతెఁ జెప్పనేల? నీ
రేఖఁ గనుంగొనన్ వలవరే ఖచరీ ముఖ సుందరీమణుల్?" |ఉ| (125)

అని పలుక నలరి బలరిపు
తనయుండటఁ గదలి మొదలి తైర్థికులను దా
నును మంచుఁగొండ యండకుఁ
జని తచ్ఛిఖ రావలోక జని తాదరుఁడై| |క| (126)

అర్జునుని యనంతర తీర్థయాత్రా ప్రకారము

పదియాఱు వన్నె గుబ్బలి రాచకూఁతురు
పట్టంపు రాణిగాఁ బరఁగు జాణ
పతి యర్ధదేహంబు సతి యంట నిజముగాఁ
బ్రబలు కన్నియఁ గన్న భాగ్యశాలి
ముజ్జగమ్ముఁ బవిత్రముగఁజేయు తీర్థమ్ముఁ
గొనసాగఁ జేసిన యనఘమూర్తి
భూమిధ రారాతిచే మొక్క వోవని
యరిది బిడ్డను గాంచినట్టి మేటి |సీ|
యోషధుల మొలపించిన యుత్తముండు
చల్లఁదనముల కెల్ల దీక్షాగురుండు
సకల మాణిక్య రాశికి జననసీమ
యీ నగస్వామి సద్గుణాస్థానభూమి| |తే| (127)

అని బహుప్రకారమ్ముల హిమగిరి ప్రభావమ్ము వక్కాణించుచుఁ దత్ప్రదేశంబున శాఖాశిఖోల్లిఖిత గ్లావృక్షం బగు నగస్త్య వట వృక్షంబుఁ గనుంగొని, యచట నికట విశంకట కటక కమనీయ మణిశృంగంబగు మణిశృంగంబుంగని, యగణ్య పుణ్యాగమ సమర్థంబగు హిరణ్యబిందు తీర్థమ్మునఁ గృతావగాహుండై గోహిరణ్య ధరణ్యాది దానమ్ము లనేకంబులు గావించి, ప్రాగ్భాగమున కరిగి, యనేక పట్టణారణ్య గిరి సమూహములు గడచి, యఖిల నరశరణ్యం బగు నైమిశారణ్యంబు సొచ్చి, యచటం గోటి గుణి తాంగీకృతానత జనతా సమర్పిత నారాయణుండగు బదరీనారాయణుంబూజించి, మనీషి మనీషిత ఫలప్రదాన శుచి ప్రయాగం బగు ప్రయాగంబున కేఁగి, ముముక్షు జనహృదయంగమంబగు త్రివేణీ సంగమంబునఁ దానంబులుం దానంబులుం గావించి, యచ్చట మాధవు నారాధించి, భవ రసానుభవ భీరుసానుక్రోశం బగు పంచక్రోశంబుఁ బ్రవేశించి, యభ్యర్ణ మణి కర్ణిక యగు మణికర్ణికం గ్రుంకి, యన్నపూర్ణా విశాలాక్షీ సనాథుఁగాశీ విశ్వనాథుం దర్శించి, తైర్థిక సమాహిత సమ్య గయకు గయకుం జని, యచట నుచిత కృత్యంబులు నిర్వర్తించి, శ్రీపురుషోత్తమ క్షేత్రంబునకుఁ జని, యింద్రద్యుమ్న సరస్సున శిరస్సు మజ్జనంబై నమజ్జన దృక్చకోర జ్యోత్స్నానాథుని జగన్నాథుని గొలిచి, యాతల గౌతమీ తటినీతోయ స్నాతుండై, జగన్మోహన మనోజ మనో వశీకరణ కారణ కళా ప్రావీణ్య లావణ్య హావభావ ప్రకటన నటన రేఖా శ్లాఘా దూరీకృత రంభోర్వశీ రంభోర్వశీత కిరణ కిరణ నిభ విభారంగ న్మణిరంగ మంటపోజ్జ్వలాసికా కృత లక్షణకటాక్ష వీక్షణ సుధారసధారా సేచన కాసేచి తాసేచన కాంగుండై, పాపాటవీ విపాటన పాటవ సంసూచన దీక్షారామ పరమేశ్వరుం డగు ద్రాక్షారామ భీమేశ్వరుం జేరి, జోహారులు నుపహారంబులు సమర్పించి, సంతతానంత కాంతి రంహుండగు నంతర్వేది నృసింహు సేవించి, యందు భవసాగర తరణియగు సాగర సంగమంబునఁ దీర్థంబాడి, కృష్ణవేణ్యాది పుణ్యతరంగిణుల మునింగి, యుత్తుంగ శృంగ విలోకి లోక సాత్కృత సుపర్వ పర్వతంబగు శ్రీపర్వతంబు లోచనపర్వంబుగాఁ జూచి, ప్రణమిల్లి, మల్లికార్జును సమ్మోదమునఁ బ్రణుతించి, తన్మనోజ్ఞ భ్రమరీ విభ్రమ రమ్యయగు భ్రమరాంబం బ్రశంసించి, భక్తశోభన పరంపరా సంపాదక పాదకమల రజోలేశు నహోబలేశు భజించి, నిజభజనరత జన ప్రతిపాది తానశ్వర పదంబులగు శ్రీ వేంకటేశ్వర పదంబులకు నమస్కృతులు విస్తరించి, దుస్తరాంహ స్తూలికా సందోహ దాహ దోహల నిజాహ్వయ స్మరణ విస్ఫులింగం బగు శ్రీకాళహస్తి లింగంబు నంతరంగంబున హర్షతరంగంబు లుప్పొంగంగాంచి, కాంచీపురంబున కరిగి, కరిగిరీశ్వరుండై విరాజిలు వరద రాజుల నమ్రజన కమ్రఫల దాయకు నేకామ్రనాయకుం బూజించి, యవులఁగావేరి కావేరి కాంతరిత కాంతాంతరీపంబునఁ బ్రసన్న రూపంబునం బాటిల్లు కోటి హరిత్తురంగ ధాముని రంగధాముని సేవించి, కుంభఘోణ చంపకారణ్యాది పుణ్యక్షేత్రమ్ము లీక్షించి, దక్షిణ నీరాకర వీచికా నికరశీకర తుందిల మందానిల స్సంద నాతి శీతల సికతాతల పిహిత యాతాయాత నిరవధిక పథిక నికాయ కాయమా నాయమాన లవల్యేలా వల్లీ వేల్లిత క్రముక ప్రముఖాఖిల శాఖి శాఖా శిఖా లతాంతర కుహర విహరమాణ వివిధ గరుద్రథ కుల కలకలోద్వేల వేలా మనోజ్ఞ మార్గంబున నపవర్గ రామేశ్వరంబగు రామేశ్వరంబునకుం బోయి, సేతు సందర్శనం బొనర్చి, విధూత స్నాతృ పంచజన వృజిన జనుష్కోటి యగు ధనుష్కోటిం గృతస్నానుండై, పాండు సూనుం డందులందులాపురుషాది మహాదానంబు లాచరించి, రఘువీర భూభుజ భుజాదర్ప దర్పణం బగు రామాయణంబు పారాయణంబు చేసి, భూసురాశీర్వాద సంపదలం బొదలి, యచ్చోటుఁ గదలి, పదుమూఁడవ నెలఁ బాండ్య మహీమండలాఖండలుం డగు మలయధ్వజుం డేలు మణిపురంబుఁ జేరం బోవు సమయంబున| |వచనం| (128)

అర్జునుఁడు పాండ్యరాజ సుత చిత్రాంగదను జూచి విరాళిగొనుట

మంగళస్నాన సంభ్రమముఁ దెల్పెడి రీతిఁ
గెలనఁ గెందామర కొలనఁ దేలి,
ధవళముల్ విని చొక్కు హవణుఁ దెల్పెడు లీల
హాళిఁగోయిల పల్కు లాలకించి,
తలఁబ్రాలు వోయు బిత్తరముఁ దెల్పెడు చాయఁ
గ్రొన్ననల్ దోయిళ్ళ కొలఁది నొసఁగి
బువ్వాన భుజియించు పొలుపు దెల్పెడి జాడ
గుమిఁ గూడికొని మరందములు గ్రోలి, |సీ|

తనకుఁ దోడ్తోడ నగు పెండ్లి కనఁబడంగఁ
జేయునటువలె గారాబుఁ జెలులఁగూడి
వనవిహారంబు గావించి చనెడు పాండ్య
రాజ సుతఁ జూచి యాపాండురాజ సుతుఁడు| |తే| (129)ఈ వెలంది యొడల్ పై ఁడిలో వెలంది
యీ నెలంత లలాటంబు లే నె లంత;
యీ సుపాణి రదశ్రేణియే సుపాణి;
యీ బి డారు మృగీమద శ్రీబిడారు| |తే| (130)

వాతెఱకు నమృతమే తుల;
మే తులకింపుల పిసాళి మిసిమికిఁ గ్రొమ్మిం
చే తుల; చేతుల కబ్జము
లే తుల; లేతుల వెలందు లీ చెలి తులయే? |క| (131)

కన్నె నగుమోము తోడన్
బున్నమ చందురుని సాటిఁ బోలుప వచ్చున్,
నెన్నుదురుతోడ మార్కొని
ము న్నందఱుఁ జూడ రేక మోవక యున్నన్| |క| (132)

కమలముల నుజ్జగించున్,
గుముదంబుల బుజ్జగించుఁ గొమ చూపులు; పు
న్నమ చందమామ వెలుఁగుల
కొమ రంతయుఁ బుణికి పుచ్చుకొనఁ బోలుఁ జుమీ| |క| (133)

చెండ్లా గుబ్బలు! జాళువా తళుకులా చెక్కిళ్ల డాల్! సింగిణీ
విండ్లా కన్బొమ! లింద్రనీల మణులా వేణీరుచుల్! తమ్మి లేఁ
దూండ్లా బాహువు! లింత చక్కఁదన మెందుం గాన! మీ జవ్వనిం
బెండ్లాడంగలవాఁడు చేసినది సుమ్మీ భాగ్య మూహింపఁగన్| |శా| (134)

అని "కన్గొంటె విశారదా?" యనిన "నాహా! యే మనన్వచ్చు నో
జననాథాగ్రణి! యీ వినూతన తనూ సౌందర్య మీక్షించినన్
దనుఁ దా మెచ్చు విధాత చిత్తమున; నీ తన్వంగితోఁ బోల్పఁగా
నెన లే; దెచ్చటఁ జూడమా తుహిన భూభృ త్సేతు పర్యంతమున్| |మ| (135)

"మలయధ్వజ బాహుజను
స్తిలకుని గారాబుఁబట్టి చిత్రాంగద పే
రలఘు కుల శీల గుణములు
గల దీకన్య" యని చెప్పఁగా వింటి నృపా! |క| (136)

అన విని మనమునఁ గోర్కులు
కొనసాగఁగ "నీ నృపాలకునితో నెయ్యం
బొనరింప వలయు నేఁ డి
వ్వని నుండుద" మనుచుఁ జొచ్చి వచ్చుచు నుండన్| |క| (137)

పద్మ రేఖలఁ బొల్చు బాలికా తిలకంబు
చరణంబు లూఁదిన తెరువుఁ జూచి
మలయధ్వజతనూజ కొలువు సేసిన జీవ
దంతపుఁ జవికెఁ జిత్తరువుఁ జూచి
పొన్న గున్నల నీడఁ గన్నె పుప్పొడి తిన్నె
మరుని బూజించిన హరువుఁ జూచి
కొమ్మ కౌఁగిటఁ బూచు గోరంట నంటిన
మొనగుబ్బ కస్తూరి మురువుఁ జూచి, |సీ|

యీ వనము చేసినదికా యదృష్ట మనుచు
రాజసుతుఁడు చిత్రాంగద మై జవాది
కమ్మతావి గుబాళించు తమ్మి కొలని
కెలఁకులకుఁ జేరి, యంతంత వలపు మీఱి| |తే| (138)

"తనకున్ గౌఁగిలి యీ వొకప్పుడును నాథా! నీ కరస్పర్శనం
బున గిల్గింతలె" యంచుఁ బద్మిని కరాం భోజమ్మునన్ మందమం
ద నట ద్వాయుచల ద్దళాంగుళులు కన్పట్టంగ న వ్వెల్గురా
యని రా! రా! యని పిల్చె నాఁ దగె *ద్విరే ఫాద్యంత దీర్ఘధ్వనుల్| |మ| (139)
{*ద్విరేఫాత్యంత}

నా విని హావ భావ పరిణామ విదుండు విశారదుం "డగున్
దేవరవార లిందు నరుదే శకునమ్ములు మంచి వయ్యె; వే
రావలె శోభ నోత్సవ పరంపర లిప్పుడు; చూడుఁ" డంచు నె
త్తావుల దీవులై తనరు తామర మొగ్గలు రెం డొసంగినన్| |ఉ| (140)

అదియు నొక శకునంబుగా నధిపుఁ డంది
"చేతి కందిచ్చి నట్లనె చేకుఱంగఁ
గలదు వలిగుబ్బి *గుబ్బల చెలిమి" యనుచు
నాత్మలో నెంచి యా భావ మపనయించి |తే| (141)
{*గుబ్బెత}

"నెల యుదయించునప్పు డల నీరజముల్ కుముదంబు లౌను రేల్,
కలువలదాయ రాకకుఁ బగల్ కుముదంబులు నీరజంబు లౌఁ,
దలఁపఁగ నింత వింత గలదా!" యని కందువ మాట లాడుచున్,
"బళిర! కిరీటి" మీఱెఁ దన ప్రౌఢి విశారదుఁ డెన్నుచుండఁగన్| |చ| (142)

అంగజరాజు పాంథ నిచయంబులపై విజయం బొనర్ప నేఁ
గంగఁ దలంచునంత మును గల్గఁగ దాసులు వట్టు జాళువా
బంగరు టాలవట్టముల భంగిఁ గనంబడెఁ బూర్వ పశ్చిమో
త్తుంగ మహీధ రాగ్రములఁ దోయజ శాత్రవ మిత్ర బింబముల్| |ఉ| (143)

సాయంకాల శోభ

ఒక మెట్టు తరణి డిగ్గిన
నొక మెట్టు శశాంకుఁ డెక్కు; నుర్వీ స్థలిలో
నొక రాజు సన్నగిల్లిన
నొక రా జంతంతకున్ మహోన్నతిఁ గనఁడే! |క| (144)

క్షితిపయి వట్టి మ్రాఁకులు చిగిర్ప, వసంతుఁడు తా రసోపగుం
ఫిత పదవాసనల్ నెఱప, మెచ్చక, చంద్రుఁడు మిన్నునం బ్రస
న్నతయును, సౌకుమార్యముఁ గనంబడ ఱాల్ గరఁగంగఁజేసె; నే
గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా! |చ| (145)

వెడ విలుకానికిన్ జెఱకు విల్లును, గల్వల కోరి, కోరికల్
గడలుకొనంగ నామనియుఁ, గల్వలరాయఁడు నిచ్చి మన్ననం
బడయుడు, వాని కెక్కుడుగ మౌర్వులు తామును గాన్క తెచ్చెనా
బడిబడి గంధలుబ్ధ మధుపంబులు రాఁజనుదెంచెఁ దెమ్మెరల్| |చ| (146)

ఒక చిగురాకుఁగొమ్మఁ బిక, మొక్క ప్రసూన లతాగ్రసీమఁ దేం,
ట్లొక ఫలశాఖ రాచిలుకయున్ రొద సేయఁగ, గాడ్పు పొందు వా
యక పయి వెన్నెలల్ పొలయ నామని సొంపుల నింప జొంప మౌ
నొక యెలమావిక్రింద మరుఁడో యనఁగా నరుఁడుండె నయ్యెడన్| |చ| (147)

విధు చకచకలును, బుండ్రే
క్షు ధనుర్ధరు నంప సెకలు, శుక పిక శారీ
మధులిట్టులు మలయానిల
మధు లిట్టులు తనదు ధైర్యమహిమఁ గలంపన్| |క| (148)

"చందన గంధి నెన్నుదురు చందురులో సగఁబాల; బాల ము
ద్దుం దెలి చూపు లంగజుని తూపుల లోపల మేల్తరంబు; లిం
దిందిరవేణి మోవి యెలదేనియలో నికరంపుఁ దేట యే
మందము! మందయాన మొగ మందము మీఱు నవారవిందమున్| |చ| (149)

బంగరు బొంగరాల పరిపాటి చనుంగవ; మీల సూటి త
ళ్కుఁ గనుదోయి; చంద్రు ప్రతికోటి మొగం; బెలదేఁటి ధాటిక
న్నంగడు మేటి వేణి; పులినంబుల సాటి పిఱుం; దయారె! చి
త్రాంగద పాటి జోటి గలదా?" యని మెచ్చుఁ గిరీటి మాటికిన్| |ఉ| (150)

ఈ కరణి దలంచుచు నా
ళీక నిభానన నెదన్ నిలిపి రే గడపెన్;
లే కెటుల నిద్ర వచ్చు
న్రేకగు నయ్యువిద నెదను నిల్పిన దాఁకన్? |క| (151)

అపుడు నృపుఁడు ప్రఫుల్ల నవాంబుజ ప్ర
సన్న ముఖుఁడయి "మలయధ్వజ క్షితీశ
కమలహితునకు మామ కాగమన వార్తఁ
దెలుపు" మనుచు విశారదుఁ బిలిచి పనిచె| |తే| (152)

విశారదుఁడు పెండ్లి రాయబారము నడపుట

పనిచిన నేఁగి, యాతఁడు, నృపాలుని మంత్రి ముఖాంతరంబునం
గనుఁగొని "యంత్ర మత్స్యము జగం బెఱుఁగన్ భుజశక్తి నేసి జ
వ్వనిఁ గయికొన్న యర్జునుఁడు వచ్చిన వాఁడిదె తీర్థయాత్రగా,
జనవర!" యంచు విన్నపము సల్ప ససంభ్రమ చిత్తుఁడై తగన్| |చ| (153)

తన నగరు వంటిదేచ
క్కని నగ రొక టాయితంబు గావించి పురం
బు నలంకరింపఁగాఁ జే
సినవాఁడై యపుడు సకల సేనలు గొల్వన్| |క| (154)

ఎదురుగ వచ్చి పాండ్య ధరణీశ్వరుఁ డర్జునుఁ గాంచి "నేఁడుగా
సుదినము! మీరు రాఁ గలుగు శోభన మెన్నఁడు గల్గుఁ; బ్రోలికిం
బదుఁ" డని యిద్దఱున్ దొఱసి భద్రగజంబుల నెక్కి వచ్చి రిం
పొదవ హళాహళిం గడకు నొత్తెడు ఫౌఁజుల దిక్కు సూచుచున్| |చ| (155)

రాజ వీథుల నెసఁగ నీరాజనములు,
కటికవా రెచ్చరింప నైకటిక భూమి,
వంది జనములు పొగడఁ జెల్వంది మిగులఁ
బురము సొత్తెంచె విజయుఁ డబ్బురము గాఁగ| |తే| (156)

నెట్టుకొని నరుని గనుచోఁ
బట్టణమునఁ గల సమస్త భామల కాహా!
యెట్టి విచిత్రమొ! మనసునఁ
బుట్టినవాఁ డపుడు మనసుఁ బుట్టించెఁ జుమీ! |క| (157)

"చక్కఁదనంబు రూపునఁ బొసంగుటె కాదు; గుణంబులందునున్
జక్కఁదనంబు గల్గు నెఱజాణ; జగంబుల నీడు లేని నా
చక్కని కూఁతునుం దొఱయఁ జాలినవాఁ; డితఁడల్లుఁడైనఁగా
మిక్కిలి కీర్తి గల్గు?" నని మెచ్చు మనంబున రాజు సారెకున్| |ఉ| (158)

అడు గడుగందునున్ మణిపురాధిపుఁ డిట్లుచితోపచారముల్
కడు నొనరించి యుద్వహన కౌతుక హేతు కళావిశేషమౌ
విడిదికిఁ దెచ్చి, నిల్పి, యతివిస్మయ మందఁగ విందు, వీడుకో,
లుడుగరలున్ ధనంజయుని యుల్లము రంజిలఁ జేసె నెంతయున్| |చ| (159)

ఆశ్వాసాంతము

సరసాగ్రేసర! వాసరప్రభు తనూజ స్థూలలక్షా! పురం
దర జిద్భోగ ధురంధరా! భరతశాస్త్ర ప్రౌఢ మార్గైక లా
స్య రసాస్వాదన కోవిదా! శ్రవణ భూషా దివ్యరత్న త్విషా
తరణి శ్రీకర గల్లభా! విభవ భృత్తంజాపురీ వల్లభా! |మ| (160)

యాచనక వినుత! వనితా
సేచనక! మనోహరాంగ శృంగార కళా
సూచన! కమ్ర కవిత్వా
లోచన కందళిత హర్ష లోలుప హృదయా! |క| (161)

తరుణీ మన్మథ! యాశ్రిత
భరణ గుణాభరణ! శౌర్య బహు రాజ్య ధురం
ధర! సత్యాదిమ చక్రే
శ్వర! యభినవ భోజరాజ వర బిరుదాంకా! |క| (162)

అతులాగమ శాస్త్ర నిరస్త సురే
జ్య! తులాధిక విద్వ దవాప్త శత
క్రతు లాభ! శుభోదయ కారణ ర
త్న తులాపురుషాదిక దాన చణా! |తోటకవృత్తము| (163)

గద్యము

ఇది శ్రీ సూర్యనారాయణ వరప్రసాద లబ్ధ ప్రసిద్ధ సారస్వత సుధాసార జనిత యశోలతాంకూర చేమకూర లక్ష్మణామాత్యతనయ వినయ ధురీణ సకల కళాప్రవీణాచ్యుతేంద్ర రఘునాథ భూపాల దత్త హస్తముక్తాకటక విరాజమాన వేంకట కవిరాజ ప్రణీతంబయిన విజయవిలాసంబను మహా ప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము|

ద్వితీయాశ్వాసము

శ్రీధుర్య శౌర్య! ధైర్య
క్ష్మాధర మూర్ధన్య! యాది గర్భేశ్వర! వి
ద్యాధిక! వితరణ దీక్షా
రాధాసుత! యచ్యుతేంద్ర రఘునాథ నృపా! [1]

అవధరింపు కథా కర్ణ నాతివేల
హర్షు లై నట్టి దివ్య మహర్షులకును
దత సమస్త పురాణ కథా శతాంగ
సూతుఁడై విలసిల్లెడు సూతుఁ డనియె| |తే| [2]

విశారదుఁడు మలయధ్వజుని యాశయము నర్జునునకు విన్నవించుట

ఆ చెలువంపు రాకొమరుఁ డంత వయస్యుని జూచి యింపుతో
"నీ చతురత్వ, మీ వినయ, మీ యుచితజ్ఞత యెందునేనియుం
జూచితె? మైత్రికిం దగిన చో టగు; శోభనపుం బ్రసంగమున్
సూచన చేసి రాజు మది చొ ప్పెఱుఁగన్‌వలదా విశారదా?" |ఊ| [3]

అనినన్"మీ మదిలోఁ దలంచినది మేలౌ; సిద్ధసంకల్పు లీ"
రని యావేళనె చిత్రవాహనుఁడు కొల్వై యుండఁగాఁ బోయి యా
యన "రా రమ్మ"ని గారవించి సుముఖుండై "రాజుగా రిప్పు డే
మనినా? రెయ్యది వార్త?" యంచుఁ బయిపై నాసక్తితోఁ బల్కఁగన్| |మ| [4]

"అవనితలేంద్ర! మా విభుని హర్ష మ దే మని విన్నవింతు? సం
స్తవ మొనరించి రింతవడి సామిచరిత్రమె వేయినోళ్ళ; న
ర్ణవపతితోడ బాంధవ మొనర్చిన మాధవు లీలఁ దారు బాం
ధవ మొనరింపఁ జిత్త మిడినారు గుణాంబుధు లీరు గావునన్|" |చ| [5]

నా విని సంతోషము మది
నావిర్భవ మొంద "నా మహారాజునకున్
దేవేరిగ నా కన్నెన్
బావన గుణ నీయఁ గనుట భాగ్యము గాదే? |క| [6]

"కల దొకమాటఁ దెల్పఁగల కార్యము; తొల్లి ప్రభాకరుండు నాఁ
గలఁ డొకఁ డస్మదీయ కులకర్త; యతం డనపత్యుఁడై యచం
చలమతి శంకరుం గుఱిచి చాలఁ దపం బొనరింప నంతటన్
'గలుగుఁ గుమారుఁ డొక్కొకఁడుగా' నని యిచ్చె వరంబు వేడుకన్| |చ| [7]

"అంగజ హరుని ప్రసాదము
నం గలుగుచు వచ్చె సుతుఁడు నాఁ డాదిగ మా
వంగడమున; నది యిప్పుడు
వెంగడమై కూఁతు రుద్భవించెను నాకున్| |క| [8]

"ఆ దుహితఁ గుమారుని మ
ర్యాదగఁ జూచికొని యుందు; నా కన్నియకున్
బ్రాదుర్భవించు వానిన్
నాదు కులంబునకు వలయు నాథుని జేయన్| |క| [9]

"కా దనరా దీకార్యము;
జాదులును బ్రసాదమౌ విశారద! నాకున్
నాదు హితం బొనఁగూరిచి
నా దుహితం బెండ్లి సేయు నరనాథునకున్|" |క| [10]

అని యతనిఁ బంచె; నా మాట కర్జునుండు
సమ్మతించె; ముహూర్త నిశ్చయము నయ్యె;
హితుఁ డన విశారదుఁడె కాక యెందుఁ గలరె?
కోర్కి వెలయంగ దొరఁ బెండ్లికొడుకుఁ జేసె| |తే| [11]

చిత్రాంగదా వివాహ మహోత్సవము

సుత్రామ నిభుఁడు పాండ్య ధ
రిత్రీ విభుఁ డానతీయ, శృంగార కళా
చిత్రాంగద యుత యగు నా
చిత్రాంగదఁ బెండ్లికూఁతుఁ జేసిరి కాంతల్| |క| [12]

గరిత లలంకృతి సేయఁగ
గరువపు మురు వపుడు హెచ్చి కన్నియ దనరెన్;
బరిణయపుం గై సేఁతల
నరపతి యొఱ పతిశయిల్లు నటనఁ జెలంగెన్| |క| [13]

తన వంశంబు నృపాలు పెండ్లిఁ గను తాత్పర్యంబునన్‌వచ్చేనో
యనఁ జంద్రుం డలరెన్; గిరీటి సుముఖుండై యంతఁ గైసేసి తె
చ్చిన భద్రేభము నెక్కి ఠీవిమెయి వచ్చెన్‌బాండ్యభూపాలు లో
చనముల్ చల్లఁగఁ, గ్రొత్త ముత్తియపు సేసల్ జవ్వనుల్ చల్లఁగన్| |మ| [14]

నలుగడ హృద్య వాద్య నటనం బొలయన్, గపురంపు టారతుల్
వెలయ, ద్విజశ్రుతుల్ చెలఁగ, విప్ర వధూ శుభ గాన లీల శో
భిలఁగ వివాహవేదికకుఁ బెండ్లికుమారుఁడు వచ్చె నిట్టు; లా
వల నల పెండ్లి కూఁతురును వచ్చె రణ చ్చర ణాంగదంబులన్| |చ| [15]

పంకేజాతములన్‌దిసంతు లడచున్‌బాలామణీ పాదముల్;
వంకల్ దీర్చు మనోజ సాయకములన్‌వాల్చూపు; లేణాంకునిన్
శంకల్ సేయు మొగంబు; జక్కవకవన్‌జక్కట్లు దిద్దుం గుచా
హంకారంబు; మదాళిమాలికల నూటాడించు వేణీ రుచుల్| |శా| [16]

హరిపతి నడుమున కోడెన్;
గరువపు నడకలకు నోడె గజపతి; యిఁక నీ
నరపతి లోనగు టరుదే
వరవర్ణిని మెఱుఁగు వాఁడి వాల్చూపులకున్? |క| [17]

"చక్కని కన్యకామణికిఁ జక్కనివాఁ డగు ప్రాణనాథుఁడున్,
జక్కని శోభనాంగునకుఁ జక్కని యింతియుఁ గల్గు టబ్బురం
బెక్కడ, నిట్టు లుండవలదే! రతిదేవికి సాటి వచ్చుఁ బో
యి క్కనకాంగి; మన్మథున కీ డితఁ డీడిత రూపసంపదన్|" |ఊ| [18]

అని రూప కళలఁ జూపఱు
గొనియాడఁగఁ, బేరఁటాండ్రు గొందఱు తేర వం
చినఁ జూచె నతివ నర్జునుఁ
డనురాగాంబుధి తటాన నటఁ దెర యెత్తన్| |క| [19]

కలదు లే దన నసియాడు కౌను తీరుఁ,
దళుకు మొగమున కెగయు గుబ్బల బెడంగుఁ
జూచి, యాతని నిడువాలుఁ జూపు లపుడు
నిండు వేడుక మిన్నంది కొండఁ దాఁకె| |తే| [20]

చిలకలకొల్కి కన్గొనియెఁ జేర లఁ గొల్వఁగ రాని కన్నులున్,
మొలక మెఱుంగు నీలముల ముద్దులు గాఱు నొయారి మీసముల్,
గలకల నవ్వు చక్కని మొగంబు, వెడంద యురంబు, సింగమున్
గలచు రువాణపుం గవును గల్గిన యా కురువీర పుంగవున్| |చ| [21]

అంగజ రాజ్యం బేలుట
కుం గట్టిన తోరణం బొకో యన, నతఁ డా
శృంగారవతికిఁ గట్టెన్
మంగళసూత్రంబు చతురిమంగళ సీమన్| |క| [22]

అనురక్తిం దలఁబ్రాలు వోసె విజయుం డావేళ బంగారు కుం
డన రం గౌ నలినీలవేణిపయి ముత్యాల్ దోయిటన్‌ముంచి చ
య్యనఁ బాల్పొంగిన కై వడిన్‌సిరులు పెంపైఁ బూలు రేకెత్తిన
ట్లనె వర్ధిల్లు మటన్న దీవనల కెల్లన్‌దావలం బై తగన్| |మ| [23]

తామ్రపర్ణీ నదీతీర ధరణి నేలు
దొరతనముఁ దెల్పఁగా రాశి దొరలఁ బోసె,
ముదిత చేతులఁ దలఁబ్రాలు ముత్తియములు
ముదిత చేతులగుచు సభాసదులు వొగడ| |తే| [24]

ఈ చందంబునఁ గల్యా
ణోచిత కృత్యంబు లెల్ల నొనరిచి యంతన్
రాచూలి భోగ్యవస్తు
ప్రాచుర్య మనోజ్ఞ కేళిభవనమునందున్| |క| [25]

చిత్రాంగదార్జునుల పడకటింటి ముచ్చటలు

మినుకుఁ గడాని జీనిపని మేలిమి మంచముపై వసించి యుం
డినయెడ నొయ్యనన్‌సఖులు నేర్పునఁ దోడ్కొని వచ్చి మ్రోల జ
వ్వని నిడి తోడి చూపులకు వచ్చినవారును బోలె వెనక్కుం
జని; రవుఁ గాదె పై నతను సంగర మా నవమోహనాంగికిన్| |చ| [26]

చంచలనేత్రఁ గాంచి నృపచంద్రుఁడు మోహము నిల్పలేక చే
లాంచల మంటి, శయ్య కపు డల్లనఁ దార్చి, కవుంగిలింప నుం
కించుఁ; బయంట నంట గమకించుఁ; జెలించు ట దెప్పు డెప్పు డం
చించుక సేపులోన మెఱయించు ననేక మనోవికారమున్| |ఉ| [27]

"కానుక గాఁగ నిత్తు బిగి కౌఁగిలి, పల్కవె కీరవాణి! నీ
దౌ నుడి తేనె నా చెవుల నానఁ, గృపారస ధార నాన న
న్నానన మెత్తి చూడు నలినానన! గోలతనాన నేల లో
నానఁ జలంబు నీకు? మరు నాన సుమీ! విడు నాన యింతటన్| |ఊ| [28]

"చక్కెరవింటి దేవర ప్రసాదముఁ గైకొను మిప్పు; డింద మో
చక్కెరబొమ్మ!" యంచు విలస న్మణికంకణ హస్త మంటి పే
రక్కఱఁ గప్పురంపు విడె మా నెఱజాణ యొసంగి నిక్కి లేఁ
జెక్కిలి ముద్దు వెట్టుకొనెఁ; జెప్పెడి దే మిఁక నా వినోదముల్! |ఊ| [29]

ఇగ్గెడు వెనక్కుం బయికి నీడ్చినఁ; బైఁటఁ దొలంగఁ జేయఁ గే
లొగ్గెడు; రెమ్మి పోఁకముడి యూడ్చినఁ గ్రుంగిలి రెండు కొంగులున్
బిగ్గ నడంచి చే విడిచిపెట్టదు; బాల ననం బనేమి? యా
సిగ్గుకు సిగ్గు లే దిటులు సేసిన పిమ్మట నుండవచ్చునే? |ఊ| [30]

"కోర్కి వెలయంగ నిను దెచ్చి కూర్చినట్టి
తియ్య విలుకాని ఋణ మెందుఁ దీర్చుకొందు
నివిద! నీ చేయి చూచుక యున్న నాకు
నింద మని వేగ నీవి నీ వియ్యకున్న? |తే| [31]

"మకరకేతనుఁ గూర్చి మకరికా లతలు నీ
చెక్కుల వ్రాయంగ మ్రొక్కుకొంటిఁ;
గుసుమాకరుని గూర్చి కుసుమ మాలికలు నీ
వేనలిఁ దుఱుమంగ వేఁడుకొంటి;
గంధవాహనుఁ గూర్చి గంధసారంబు నీ
గుబ్బలఁ బూయంగఁ గోరుకొంటి;
మృగలాంఛనుని గూర్చి మృగమదంబున నీకుఁ
దిలకంబు దిద్దఁ బ్రార్థించుకొంటి; |సీ|

"నిన్ను వరియించు నప్పుడే యిన్ని చేయు
వాఁడ నని మున్ను శృంగార వనములోన;
వల పెఱిఁగి యేలుకోగదే కలికి!" యనుచుఁ
గేళి కెలయించె న మ్ముద్దరాలి నపుడు| |తే| [32]

పొక్కిలి పొంతఁ గరం బిడి,
చెక్కిలి చెంత నొక కొంత చిఱున వ్వొలయన్|
జక్కిలిగింతలు గొలిపెన్
మిక్కిలి వింతలుగ రతికి మేకొన నంతన్| |క| [33]

డాసిన నింగితం బెఱిఁగి డాయఁగ నేరక, తత్తరంబునన్
జేసిన సేఁతకున్‌బదులు సేయ నెఱుంగక, మేను మేనితో
రాసినయంతనే కళలు రంజిలి కౌఁగిట బాల యుండెఁ బో;
యా సుఖ మింత యంత యన నైనది గాదు గదయ్య క్రీడికిన్| |ఊ| [34]

అంగజరాజ్య వైభవ సుఖాంబుధి నీ గతి నోలలాడి, చి
త్రాంగద సేవఁ జేయ మలయధ్వజు నిల్లట పల్లుఁ డై, తదీ
యాంగబలంబు గొల్వ నరుఁ డందుల రాజ్యము సేయుచుండ నా
సింగపుఁ జిన్ని లే నడుము చెల్వకు గర్భము నిల్చె; నంతటన్| |ఊ| [35]

మించెన్ బోరచి కోరికల్; కడు విజృంభించెన్‌దనూగ్లాని; కా
న్పించెన్‌మేచక కాంతి చూచుకములన్; జెక్కిళ్లపైఁ దెల్పు రె
ట్టించెన్; గూర్కులు సందడించె; నడ చండించెన్; *మృదామోదము
న్గాంచెన్‌వాతెఱ; యోసరించెఁ ద్రివశుల్ నానాఁటికిన్‌బోటికిన్| |శా| [36]
{*నవామోదము}

బభృవాహన జననము

సీమంతవతీ మణికి
న్సీమంతముఁ జేసి రపుడు నెల లెనిమిది గా
శ్రీ మంతు కెక్కు గర్భ
శ్రీమంతుం డీతఁ డనుట సిద్ధము గాఁగన్| |క| [37]

ప్రొద్దుల నెలలన్‌వేవుర
నుద్దులుగాఁ జేయఁ దగు మహో యశములు గా
ముద్దుల బాలుని గనియెను
బ్రొద్దుల నెల యెడల నిందుముఖి శుభ వేళన్| |క| [38]

ధనము లసంఖ్యముల్ హిత బుధ ద్విజకోటికి నిచ్చి, యప్పు డా
తనయుని బభ్రు వర్ణ హయధట్టము నేలెడు నంచు బభ్రువా
హనుఁ డను పేరు వెట్టి చెలువందఁగ బంగరుఁదొట్లఁ బెట్టి, శో
భన విభవాప్తి రంజిలిరి పాండవ పాండ్య వసుంధరాధిపుల్| |చ| [39]

"తన కులస్వామి తండ్రిని సుధాంబుధిఁ బోలుఁ
బాల బుగ్గల మించు లీలఁ గనుటఁ,
దన పితామహుని బృందారకాధిపుఁ బోలు
రెప్ప వేయక చూచు రీతిఁ గనుటఁ,
దన వంశకర్త నుత్పల బాంధవుని బోలుఁ
గరము లర్మిలిఁ జాఁచి గారవిలుటఁ,
దన తాత యనుఁగుఁ దమ్ముని నుపేంద్రుని బోలు
నల్ల నల్లనఁ దప్పుటడుగు లిడుట |సీ|

"ధరణి గాంభీర్య, వైభవ, దాన, కృపలు
గల వని కనంబడఁగ వేఱ తెలుప నేల?"
యని గురుజనంబు లెంతయు నాదరింపఁ
జిన్ని బాలుండు ముద్దులు చిలుకుచుండె| |తే| [40]

ఆడితప్పని ధర్మజు ననుఁగుఁ దమ్ముఁ
డా కుమారకుఁ జిత్రవాహనున కపుడు
వంశకరుఁగా నొసఁగి వేడ్క వారిచేత
నంపకముఁ గాంచెఁ దీర్థ యాత్రాభిరతిని| |తే| [41]

సౌభద్ర తీర్థమందలి మకరముల శాప మోక్షణము

చని యా దక్షిణ పుణ్యభూమిఁ గనుచున్‌సౌభద్ర తీర్థంబునం
దును స్నానం బొనరింపఁ బోవ నట మౌనుల్ కొంద "ఱోహో! నిలుం
*డన ఘైతన్ముఖ పంచతీర్థములయం దత్యుగ్ర నక్రంబు లుం
డును నూఱేఁడులనుండి; యిందు నొకనాఁడున్‌జేరరా దేరికిన్| |మ| [42]
{*డనఘానన్ముఖ}

"'మోక్షమునకుఁ బోవ మొస లెత్తుకొనిపోయే
ననెడు వార్త నిక్క మగు నటంచుఁ
గ్రుంక వెఱతు రెవ్వరును; మీర లటు పోకుఁ"
డనిన నవ్వుకొనుచు నర్జునుండు| |ఆ| [43]

"ఏను తీర్థము లాడఁగ నేఁగుదెంచి
యేను తీర్థ లాడక యివలఁ జనుట
పౌరుషమె?" యంచుఁ గ్రుంకుచో వారిచరము
పట్టెఁ, బట్టిన న మ్మహా బాహుబలుఁడు| |తే| [44]

ఎడమ కరంబుననే యా
యెడ మకరముఁ బట్టి బయటి కీడిచి వైవన్
వడి భూమికఁ జూపిన కై
వడిఁ దొల్లిటి రూపు వాసి వాసి *యెసంగన్| |క| [45]
{*యెసంగెన్|}

వట్రువ గుబ్బలున్, దొగరు వాతెఱయున్, జిఱునవ్వు వెన్నెల
ల్తొట్రిలు ముద్దుమోమును, దళుక్కను మేను, వెడంద సోగ యై
వట్రిలు కన్నుదోయి, నిడువాలుఁ గురుల్, బటువౌ పిఱుందు, లేఁ
గుట్ర నునుంగవున్‌గలుగు కోమలియై యది మ్రోల నిల్చినన్| |ఊ| [46]

ఆ లోలనయనఁ గనుఁగొని
యాలోచన చేసె నృపతి యద్భుత మతియై
యాలో 'నిది యచ్చర ప్రో
యాలో, కా కల్ల మరుని యాలో' యనుచున్| |క| [47]

'ఈ బాల మోమునకు నా
జాబిల్లికి నెంత దవ్వు? సరి వచ్చునొకో
యీ బిడ చనుగవ కొక మె
ట్టా బంగరు గట్టు; తక్కు వౌ నెంచంగన్| |క| [48]

'నడు మెంత సైక? మోహో,
పిడికిటిలో నణఁగు; బెళకుకు బేడిస మీలన్
గడ కొత్తుఁ గన్ను; లౌరా!
జడ యందముఁ జూపఁ బాఁపజగతిన్‌గలదే?' |క| [49]

అని యా క్రీడి మనంబునన్‌బొగడి "యుగ్రాకార నక్రంబ వై
మును పట్లుండిన దేమి? మేలు చెలువంపుం గల్కివై యిప్పుడొ
ప్పిన దే? మెవ్వరి భామినీమణివి? నీపేరేమి?" నా నిట్లనున్
"విను మో భూవర! యానుపూర్విగఁ బురావృత్తాంత మాద్యంతమున్| |మ| [50]

నంద మొదలగు నచ్చరకాంతల చరిత్ర

"ఏ నంద యనెడు నచ్చర
చానన్; దరుణేందు ధరుని సఖుని యనుంగన్;
నా నెచ్చెలులు త్రిలోకీ
యానేచ్ఛలు గలరు నల్వు రతుల శుభాంగుల్| |క| [51]

"వారు లలిత, పద్మ, సౌరభేయి, సమీచి
యనెడు పేర్లు గలుగు నట్టివారు;
జగము లెల్లఁ జూచి చను దెంచుచో మేము
వనధి కాంచి నొక్క వనము కాంచి| |ఆ| [52]

"'విహరించున్‌మలయానిలం బిచటఁ; దావిం జిల్కి నెమ్మేని యా
విహరించున్; బిక నాదముల్ చెవికిఁ గావించుం జవుల్; పోద మా
సహకారాళి పదంబుఁ జూడఁగ వయస్యా! హాళి వాటిల్లెడున్
సహకారాళి పదంబుఁ జూడఁగ వయస్యా హాళి! యౌనే కదా!' |మ| [53]

"అని యితరేతర చతురో
క్తి నిగుంఫన మెఱయ నరిగి తేఁకువ నందున్
ముని యొకఁడు తపము సేయం
గని, యది విఘ్నంబు సేయఁ గడఁగి, కడంకన్| |క| [54]

"నెఱి కురులు, కేలుఁజిగురులు,
నిఱి చన్నులు, విరివి కన్ను, లించుక కౌనుల్,
*చిఱుఁదొడలును బలు పిఱుఁదులు నె;
న్మెఱపుల యొఱపులు ఘటింప నిలిచి నటింపన్| |క| [55]
{చిఱుఁదొడలు, నంచ నడలు}

"మా పొలు పొకింత గనుఁగొని
తాపసుఁడట వలపు పేరు దైవ మెఱుంగున్,
శాప మొసఁగె మకరులుగాఁ
గోప రసావేశ రూక్ష కుటిలేక్షణుఁడై| |క| [56]

"అందులకుఁ జాల భయపడి,
యందఱ మడుగులకు వ్రాలి, యతి దీనతతోఁ
గొందలపడ, నపు డాతని
డెందము గై కొనియె నక్కటికపుం బెంపున్| |క| [57]

"శీతల దృష్టిఁ జూచి మునిసింహుఁడు 'నా వచనం బమోఘ మో
భీతమృగాక్షులార! మది బెగ్గిల నేల? యిఁకన్‌వినుండు మీ
చేత గృహీతుఁడై సలిలసీమను నెవ్వఁడు వెల్వరించు మి,
మ్మాతఁడె శాపమోక్షకరుఁ డయ్యెడుఁ; బొం' డని పంచెఁ, బంచినన్| |ఊ| [58]

"'ఇలఁ గల వీళ్లు చూడ మన మేటికిఁబోవలెఁ?బోయినన్‌వనిన్
నిలువఁ బనేమి? నిల్చిన మునింగని త్రుళ్ళఁగ నేల? యంతలో
నలిగి శపింప నేమిటికి నాతఁడు? వ్రాఁతఫలంబు దప్పునే?
కలిగినవే కదా మకరికల్ మన కెప్పుడు వ్రాసి యుండుటల్!' |చ| [59]

"అనుచు ననుతాపమునఁ ద్రోవఁ జనుచు నుండ
నారదుఁడు చూచి 'యచ్చరలార! మీరు
చిన్నవోయిన మొగముల నున్నవార
లే?' మనినఁ బూర్వవృత్తాంత మెల్లఁ దెలిపి| |తే| [60]

'ఋషితిలక! కంటివే మా యదృష్టరేఖ?
కుడిచి కూర్చుండి యిదె యొక బెడఁదఁ దెచ్చు
కొంటి; మే మేడ? మకరులై యుంట యేడ?
యర్హమే యిట్టి బాధ బింబాధరలకు?' |తే| [61]

"అన విని యనిమిష ముని 'యో
వనితా తిలకంబులార! వసుధా గీర్వా
ణుని శాపము విధికృత; మే
ఘనునకుఁ దప్పింప నలవి గా; దటు లగుటన్| |క| [62]

"'మీరలు దక్షిణాంబుధి సమీపమునం దగు పంచతీర్థముల్
చేరియు, గ్రాహ రూపములఁ జెంది, శతాబ్దము లున్నఁ దీర్థ సే
వారతి భారతాన్వయుఁడు, వాసవనందనుఁ, డర్జునాఖ్యుఁ డే
తేరఁగలం; డతండు కడతేర్చు మిమున్‌దృఢ సాహసంబునన్| |ఊ| [63]

"'చనుఁ డచటికి నిపు డిం పెన
య; 'న దుఃఖం పంచభి స్సహా యనంగా మున్
విని యుందురె కద! యేటికి
మనమున నుమ్మలికఁ జెంద మదవతులారా!' |క| [64]

"అంచున్‌మమ్ముల నూఱడించ విన యాహ్లాదంబు లెంతే విజృం
భించన్‌మ్రొక్కి "జగంబులందును మిముం బేర్కొన్న మాత్రం బటా
పంచం బై దురితంబు లెల్లఁ జనఁగా భక్తిన్‌మిమున్‌నేఁడు ద
ర్శించన్‌ఖేదము వోయి మోదము మదిం జె న్నారదా నారదా! |శా| [65]

"మీ కతమున నూఱేం డ్లని
మాకున్‌మితి యెఱుక వడియె; మంటి; మటంచున్
లోకేశ్వర సుతు దీవనఁ
జేకొని, యిట వచ్చి, నిలిచి చిత్తములోనన్| |క| [66]

"'దుర్జనన విసర్జనముగ
నిర్జరలోకాధినాథుని సుతుం డగు నా
యర్జును సర్జన సముదా
యర్జునుఁ గనుఁగొనెడి భాగ్య మది యెన్నఁటికో?' |క| [67]

"అని తలపోయుచున్‌మకరికాకృతు లూని యి టుండఁగా, నిదే
పనిగ మదీయ పుణ్య పరిపాక మనం జనుదెంచి నీవు న
న్మనిచితివే కదా! కడమ నా చెలు లౌ జలచారి చారులో
చనలకు శాపమోచనము సల్పి కృతార్థలఁ జేయు పార్థివా!" |చ| [68]

అని నంద వేఁడినం, ద
క్కిన తీర్థము లాడి, వారికిన్‌శాప విమో
చన మొనరింపఁగ, నేవురుఁ
జనుదెంచి శుభాంగ లీల సన్నిధి నిలువన్| |క| [69]

'కలలో నెఱుంగ మే గణి
కలలో నీ చెలువమున్; సకల లోకములన్
గల లోలాక్షుల గరగరి
కల లోఁగొనినారొ? చంద్రకలలో వీరల్?' |క| [70]

అని 'తనచే నిజరూపముఁ
గనిరి గదా!' యనుచు వేడుకం దగు నృపతిం
గని యా యచ్చర లి ట్లని
కొనియాడఁ దొడంగి రధిక కుతు కాన్వితలై| |క| [71]

వేలుపు మించుఁబోణు లర్జునుని బలవైభవాదుల నభినందించుట

"బల వైభవంబుచే గెలుచు మాత్రమె కాదు
గమన లీలను గెల్చు గంధకరిని
గీర్తి విస్ఫూర్తిచే గెలుచు మాత్రమె కాదు
నగు మొగమ్మున గెల్చుఁ దొగలఱేని
బలు సాహసంబుచే గెలుచు మాత్రమె కాదు
మినుకుఁ గౌనున గెల్చు మృగకులేంద్రు
నలఘు దానంబుచే గెలుచు మాత్రమె కాదు
నెఱుల కాంతిని గెల్చు నీరదమును |సీ|

"సకల సద్గుణ సౌందర్య సార మూర్తి
యనియు మును నారదుఁడు దెల్ప వినియ యుంటి
మి మ్మహా భుజు, నిప్పుడో కొమ్మలార!
కంటిమి గదమ్మ కన్నుల కఱవు దీర! |తే| [72]

"బాపు! వలరాజు గర్వంబుఁ బాపు రూపు;
చాఁగు! రేరాజు కళల మిం చాఁగు రేఖ;
మేలు! నలరాజు సోయగ మేలుఁ జెలువ;
మమ్మ! యీ రాజు ప్రతి గాన మమ్మ యెచట! |తే| [73]

"అందఱును నింద్రనీల నిభాంగుఁ డందు
రింద్రనీల నిభాంగుఁడే యితఁడు గానఁ;
దండ్రిఁ బోలిన రూపు మాత్రంబె కా ద
యారె! భూలోక దేవేంద్రుఁ" డంచుఁ బొగడి| |తే| [74]

"నీకుఁ గల్యాణ మౌ రమణీయ రూప!
నీకు వంశాభివృద్ధి యౌ నృపకలాప!
నీకు జయ మగు సాహస నీతి భరిత!
నీకు సామ్రాజ్య మౌ మహనీయ చరిత!" |తే| [75]

అంచున్‌వేలుపు మించుఁబోణులు శుభోదర్కంబు గాన్పించ దీ
వించన్‌వారిఁ బ్రియానులాపములచే వీడ్కొల్పి, గోకర్ణ భూ
ప్రాంచ ద్ధూర్జటిఁ గొల్చి పశ్చిమ సముద్ర ప్రాంత పుణ్యస్థలుల్
కంచున్‌బోయి ప్రభాస తీర్థమున వేడ్కం గ్రీడి క్రీడించుచున్| |శా| [76]

ద్వారకాపుర మచటికిఁ జేరు వనుచుఁ
జెప్పఁగా విని కడు సంతసిల్లి కలదు
గా! యిఁక సుభద్ర రూప రేఖా విలాస
విభ్రమంబులు గనఁ జూడ్కివిందు కాఁగ| |తే| [77]

'అర చందమామ నేలిన
దొరగా నెన్నుదురు నె న్నుదురు బిత్తరికిన్;
బరువంపు మొల్ల మొగ్గల
దొరగాఁ బల్కుదురుఁ బ ల్కుదురు జవ్వనికిన్| |క| [78]

'అలకలు నీలము, లధరం
బల పగడము, గోళ్లు ముత్తియంబు లటంచున్
దెలుప మును విందుఁ జిలుకల
కొలికి తెఱం గెల్లఁ బూసఁ గ్రుచ్చిన రీతిన్|' |క| [79]

అనుచు నా కన్యఁ గైకొను నాసఁ దగిలి,
యతులకు విధేయు లగుదురు యాదవు లని,
తను నెఱుఁగ కుండవలె నన్యు లనియుఁ దలఁచి
యనుచర జనంబు నందంద పనిచి యంద| |తే| [80]

అర్జునుని కపటసన్న్యాస స్వీకారము

మృగనాభి తిలకంబు బుగబుగల్ గల లలా
టముపై మృదూర్ధ్వ పుండ్రంబు దీర్చి,
తపనీయ కౌశేయ ధౌరేయ మగు కటీ
రమునఁ గాషాయ వస్త్రము ధరించి,
శరణాగ తాభయ సంధాయకం బైన
దక్షిణపాణిఁ ద్రిదండ మూని,
రణ చండ కోదండ గుణ కిణాంకం బైన
డాకేల నునుఁ గమండలువు దాల్చి |సీ|

యుండెఁ బో శాంతరస మెల్ల నుట్టి పడఁగ
'నంగనల పొందు రోసి సన్న్యాసి యగుట
గద యుచిత మెందూ నా నవ మదన మూర్తి
యంగనామణిఁ గోరి సన్న్యాసి యయ్యె| |తే| [81]

ఇటు లుండి "తనదు కోరిక
ఘటియింప హలాయుధుండు గాఁ డనుకూలుం;
డటు లైన నేమి? యఘటన
ఘటనా చతురుండు గలఁడ కా హరి" యనుచున్| |క| [82]

గోపాల నందనుం డా
గోపాలక చక్రవర్తి కోమల దివ్య
శ్రీపాద పద్మములు దన
లోపలఁ దలపోయ నంత లోపల వేగన్| |క| [83]

సొన్నపు సన్నసాలుఁ గటిఁ జుట్టి, కిరీటము మౌళిఁ దాల్చి, రే
మన్నియతోడఁ బుట్టు పెను మానిక మక్కునఁ జేర్చి, వచ్చి చెం
త న్నిలిచెన్, దయారస మెదం బొదువన్‌యదువంశ దుగ్ధవా
రాన్నిధి పూర్ణిమా విశదరశ్మి దరస్మిత చారు వక్త్రుఁడై| |ఊ| [84]

అప్పుడు సామి తాఁ దలఁచి నంతనె వచ్చె నటంచు విస్మయం
బుప్పతిలంగ వేడ్క నన లొత్తఁగఁ గన్నుల హర్ష బాష్పముల్
చిప్పిలఁ జక్రి పాదసరసీజములం బ్రణమిల్లి, తద్రుచు
ల్రెప్పల నప్పళించుచును లేవక యుండఁగ సంభ్రమంబునన్| |ఊ| [85]

కృష్ణుఁ డర్జునుని రైవత పర్వతమున నిలుపుట

గ్రుచ్చి కవుంగిలించుకొని, కూరిమితోఁ గుశలంబు వేఁడి, తా
వచ్చిన రాక లోఁ దెలిసి, "ద్వారక రైవతకాద్రి పొంతనే,
యిచ్చటికిన్‌సమీప" మని కృష్ణుఁడు తెల్పుచుఁ, దోడితేరఁగా
వచ్చె రథంబుపై నపుడు వాసవి వేసవి యేఁగునంతటన్| |ఊ| [86]

వచ్చి రైవత కారామ వాటి నిల్చి
కృష్ణుఁ డం దిష్ట గోష్ఠి నా రేయి కడపి
"యిచట నుండుము, తావ కాభీష్ట మిపుడు
చేయుదు" నటంచుఁ బై తృష్వసేయు నిలిపి| |తే| [87]

యాదవుల రైవతకోత్సవ సన్నాహములు

ద్వారక కేఁగి యందు బుధవర్గము బంధుజనంబు లాప్తులున్
గోరి భజింప నుండి యొకకొన్ని దినంబుల మీఁద భక్త మం
దారుఁడు వాసుదేవుఁడు ముదంబున రైవత కాచలోత్సవ
శ్రీ రచియింపఁగా వలయు రే పని మంత్రులఁ జూచి పల్కినన్| |ఊ| [88]

అప్పుడె వారుఁ దీర్పరుల నందులకున్‌సమకూర్ప జాళువా
యొప్పుల కుప్ప లై మెఱయుచుండెడు మేరువులుం గురుంజులున్
జప్పరముల్ వితానములు సర్వము నాయితపెట్టి కానుకల్
దెప్పలుగా నమర్చి రతి తీవ్రత రైవత కాచలంబునన్| |ఊ| [89]

అపు డొక మాట కంసరిపుఁ డానతి యిచ్చెనొ లేదొ మంచి చొ
క్కపుఁ గపురంపు గిన్నియలు కస్తురివీణెలు రాశిగాఁగఁ గొం
డ పొడవు దెచ్చి వైచి రచటన్; మఱి తక్కిన వస్తు లంటిమా
యపరిమితంబు; లే మనఁగ నవ్విభు పట్టణ భాగ్య సంపదల్! |చ| [90]

గంధ మా ల్యాభరణ వస్త్ర కలితు లగుచుఁ
గామినీ రత్నములుఁ దారుఁ గలసి మెలసి
చనిరి రైవత కోత్సవంబునకు నపుడు
వీరు వారన క య్యదువీరు వారు| |తే| [91]

కలయఁగఁ జెంద్రకావి ఱవికం బలెఁ గుంకుమఁ బూసి 'చూడు మో
పొలఁతుక! నాదు నే' ర్పనినఁ 'బూసిన యట్లనె లెస్స యున్నదే,
బళి!' యని కేళినీ రమణి పల్కిన నవ్వుచు శంబరారి య
ర్మిలిఁ గయిసేసి యేఁగిరి గిరిం గన నా రుచిరాంగు లిర్వురున్| |చ| [92]

రేవతి గుబ్బచంటి మకరీమయ రేఖ లురఃస్థలంబునన్
భావజ చిహ్న ముద్ర లయి భాసిల, మేలిమి కందు దుప్పటిన్
బై వలెవాటు వైచి, నును మైజిగి గందపుఁ బూఁతయై తగన్
రైవత కాద్రి కేఁగె బలరాముఁడు కేళి కళాభిరాముఁ డై| |ఊ| [93]

నగధరుని వెంట నడచిరి
మిగులం గై సేసి, యటఁ దమిం గస్తూరీ
భుగభుగలు నుదిరి బంగరు
నిగనిగ నెఱ యందె రవలు నెఱయం దెఱవల్| |క| [94]

పురజను లింపునం గనఁగఁ, బొంతల రుక్మిణి సత్యభామయున్
దొరయఁగఁ, దక్కు నార్వురును దోఁ జన, నా వెనుకం బదాఱువేల్
తరుణులు గొల్చి రాఁగఁ, బ్రమదంబునఁ గృష్ణుఁడు వట్టివేళ్ల చ
ప్పరముల నీడనే యరిగెఁ బట్టిన కానుక లెల్లఁ జూచుచున్| |చ| [95]

ఆ గతి నరిగి సమస్త జ
నాగతి రైవతకగిరి మహా మహ లీలా
భోగము కన్నుల పండువ
యై గాఢ కుతూహలంబు నడరం జేయన్| |క| [96]

ము న్నతిభక్తిఁ బూజలు సమున్నతిఁ దా నొనరించి, మించి యో
షి న్నికరంబులం బిదప సేవ లొనర్పఁగఁ జేయుచుండె, నం
త న్నవరత్న హేమ రచితం బగు పల్లకి నెక్కి వేడ్క తో
నన్నలు రామకృష్ణులు రయమ్మున రమ్మని గారవింపఁగన్| |ఊ| [97]

చెలియలు సుభద్ర వచ్చెన్
జెలియలు వేయాఱులు నిరుచెంతలఁ గొలువన్;
'దొలకరి మెఱపో యిదీ యని
తొలకరిదొర బిడ్డ వెఱఁగుతోడం జూడన్| |క| [98]

యౌవత చూళికాభరణ మప్పుడు కొందఱు బోంట్లు ముంగల
న్రైవత కోత్స వాగత జనంబు బరాబరి సేయుచుండఁ, ద
ద్దేవత కర్చనా నతు లతి ప్రమదంబునఁ జేసెఁ బై పయి,
న్దైవతరాజ నందను ధనంజయునిం బతిగాఁ దలంచుచున్| |ఊ| [99]

ఈ కరణిఁ బూజ లొనరించి, యిష్ట సఖులఁ
గూడి, య గ్గిర కందరా కూట తడ వి
నోద వైఖరు లెల్లఁ గన్గొనుచు సరస
గోష్ఠి నుండెడు పద్మరాగోష్ఠిఁ జూచి| |తే| [100]

గద్యము

ఇది శ్రీ సూర్యనారాయణ వరప్రసాద లబ్ధ ప్రసిద్ధ సారస్వత సుధాసార జనిత యశోలతాంకూర చేమకూర లక్ష్మణామాత్యతనయ వినయ ధురీణ సకల కళాప్రవీణాచ్యుతేంద్ర రఘునాథ భూపాల దత్త హస్తముక్తాకటక విరాజమాన వేంకట కవిరాజ ప్రణీతంబయిన విజయవిలాసంబను మహా ప్రబంధంబునందుఁ ద్వితీయాశ్వాసము|                                   విజయ విలాసము