Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

18, అక్టోబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 28

 కమలములు నీటబాసిన
 గమలాప్తునిరశ్మిసోకి కమలిన భంగిన్ 
 తమతమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.

 భావం:-
కమలములు తమ స్థానమగు నీటిని వదిలిన యెడల తమకు మిత్రుడగు సూర్యుని వేఁడిచేతనే వాడిపోవును.అట్లే ఎవరుగాని తమ తమ యునికిపట్లు విడిచినచో తమ స్నేహితులే విరోధులగుట తప్పదు.

1 కామెంట్‌:

  1. పద్యం ఇవ్వడం మంచిదే కాని ,రెండు తప్పులున్నాయి.బహుశా టైపు పొరబాట్లు కావచ్చును.మొదటి పాదంలో ''నీట బాడిన '' కాదు. ''నీటబాసిన ''అనిఉండాలి.మూడవపాదంలో '' శమదమ ''కాదు ''తమతమ '' అనిఉండాలి.

    రిప్లయితొలగించండి