Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
కుమారీ శతకము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కుమారీ శతకము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, జులై 2013, ఆదివారం

కుమారీ శతకం - 60

వడి దనిపించుకొనుటకున్
గడె యైనను బట్టకుండుఁ గాంతలలో నె
క్కుడు గుణవతి యనిపించెడి
నడవడి నేర్చుటయె కడు ఘనంబు కుమారీ! 

 భావం:-
ఓ సుకుమారీ!శౌర్యవంతురాలనిపించుటకొనుటకు నిమిషమైనను పట్టదు.కాని సాదుసద్గుణవతి,స్త్రీలలోమిక్కిలి గుణవంతురలనెడు గుణములనలవరచుకొనుటయే మిక్కిలి గొప్పది. 

27, జులై 2013, శనివారం

కుమారీ శతకం - 59

తనకడుపు కట్టుకొని యై
నను జుట్టుమ్మునకు బెట్టి నను గీర్తి వహిం
చును భుక్తి ముక్తు లబ్బును
దన కెవ్వరు సాటిరారు ధరణి గుమారీ! 

 భావం:-
ఓ సుకుమారీ!తను పస్తులున్ననూ(తను తినకుండా ఉండుట)భందువులకు పెట్టవలెను.అపుడే నీకు కీర్తి కలుగును.భోగమోక్షములు సిద్దించును.అట్లు చేసిన యెడల నీ కెవ్వరును సరిరారు. 

26, జులై 2013, శుక్రవారం

కుమారీ శతకం - 58

ఆపదల కోర్చి సంపద
లాపయి భోగించు ననెడి హర్షొక్తుల నీ
లోపల దలచుచు లాంతరు
దీపముచందమున వెలుఁగ దివురు కుమారీ! 

భావం:-
ఓ సుకుమారీ!కష్టసుఖాలన్నారు గాని సుఖకష్టాలనలేదమ్మా!కావున మొదట కష్టములనుభవించిన తర్వాతే సుఖము,ఐశ్వర్యము ప్రాప్తించునని తెలియుము.లాంతరు దీపము మాదిరిగా ప్రకాశింపుము.(లాంతరు తనలోని నూనెను ఖర్చు చేస్తూలోకానికి అంతటికి వెలుగును ప్రసాదించుటలేదా?)అట్లే నీవు గూడ మసలుకొని మహిలో మహోన్నతురాలివై మసలుకొనుమమ్మా! 

25, జులై 2013, గురువారం

కుమారీ శతకం - 57

ఎంగలి పరులకుఁ బెట్టకు
క్రంగున మ్రోయంగనీకు కాల్మెట్టియలన్
బంగారులాభ ముండిన
దోంగతనము సేయబుద్ది దొలఁచు కుమారీ! 

 భావం:-
ఓ కుమారీ!ఇతరులకుఎంగిలి పెట్టరాదు.నీ కాలి మట్టెలను కంగుమని శబ్దమువచ్చునట్లు చరించరాదు.బంగారము దొరుకుతున్ననూదొంగతనము చేయరాదు.అటువంటి బుద్ది మానుకొనుము. 

24, జులై 2013, బుధవారం

కుమారీ శతకం - 56

చెప్పినఁ జెప్పక యుండినఁ
దప్పక సేయంగవలయుఁ దనపనులెల్లన్
మెప్పొదవఁగాను లేదా
ముప్పొదవును గాదె యెందు ముద్దు కుమారీ!

 భావం:-
ఓ సుకుమారీ! చేయవలసినపనులను చెప్పినను,చెప్పక పోయిననూ పరిశుభ్రముగా జనులు మెచ్చుకొనునట్లు చేయుమమ్మా!అట్లునడుచుకొనకపోతే నష్టము వాటిల్లును. 

23, జులై 2013, మంగళవారం

కుమారీ శతకం - 55

సరకులయెడ జాగ్రత్తయుఁ
జుఱుకు పనులయందు భక్తి సుజనులయందున్
గరుణ యనాథుల యెడలం
దరుణికిఁ జెలువారవలయు ధరణిఁ గుమారీ! 

 భావం:-
ఓ సుకుమారీ!వస్తువులనందు జాగ్రత్త వహింపుము.పనులలో చురుకుదనము వహింపుము.మంచివారిని ఆదరించు.వారి యెడల భక్తిభావముతోనుండవలెను.దిక్కులేనివారికి నీవే దిక్కువై మసులుకొనుము. 

22, జులై 2013, సోమవారం

కుమారీ శతకం - 54

దీపము వెలిగింత చెడిచోఁ
జీపురుపుడ కుంచవలయుఁ జేతుల నేతం
బాపము పాలౌదువు మది
లోపల నిది తలఁపవలయు రూఢిం గుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!దీపమును వెలిగించునపుడు చీపురుపుల్లను ఉపయోగించుము.చేతులతో వెలిగించినచో ఎంత నూనె చేతికి అంటుకున్నదో అంత పాపమును మూటకట్టుకుంటావు.ఈ సంగతి మనస్సులోనుంచుకొని మసులుకొనుము. 

21, జులై 2013, ఆదివారం

కుమారీ శతకం - 53

సన్నెకలుం బొత్రమ్మును
తన్నుకపోరాదు కాలఁ దగిలిన యెడలన్
గన్నుల నద్దుకొన న్వలె
గ్రన్నన సిరి యందు నిలుచు గాదె కుమారీ! 

 భావం:-
ఓ చినదానా!సన్నెకల్లును,రోకళ్ళు పొత్రములను,ఆకులను కాలికి దగిలినచో తన్నుకుంటూపోరాదు.అవి లక్ష్మీవాసములు గదా!వాటిని కన్నులకద్దుకొని ప్రక్కన పెట్టాలి. 

20, జులై 2013, శనివారం

కుమారీ శతకం - 52

మాసినతల మాసిన యిలు
మాసిన వలువలు దరిద్ర మార్గంబులు నెం
తెసి ధనవంతులైనను
గాసిల్లుదు రల్పదశల గ్రాఁగి కుమారీ! 

 భావం:-
ఓ చినదానా!మాసిన ఇల్లు,మాసిన గుడ్డలు,మాసినతల దరిద్రమునకు కారణములని తెలుసుకో!ఎంతటి దనవంతుల వరైననూ నీచముగా (బ్రతికినచో)కష్టనష్టములు బొందుదురు. 

19, జులై 2013, శుక్రవారం

కుమారీ శతకం - 51

బంతులను బక్షపాత మొ
కింతైనను జేయరాదు హీనదశుల సా
మంతుల నొక భంగి నిరీ
క్షింతురు బుదులెల్ల సంత సిల్లం గుమారీ! 

 భావం:-
ఓ సుగుణవతీ!వడ్డనయందు పక్షపాతము చూపరాదు (అందరినీ సమానముగా చూడాలి).భాగ్యవంతులు ,పండితులు,ఎల్లరు సంతోషించునట్లు ఒకే విదముగా మసులుకొనుము. 

18, జులై 2013, గురువారం

కుమారీ శతకం - 50

వేళాకోళంబులు గ
య్యాళితనంబులును జగడ మాడుటలును గం
గాళీపోకలుఁ గొండెము
లాలోచించుటయుఁ గూడదమ్మ కుమారీ! 

 భావం:-
ఓ కుమారీ!అనవసరపు వేళాకోళములు,గయ్యాళితనములు,కొట్లాటలు,చిన్నపెద్ద తారతమ్యము అరయక మాట్లాడుటలు,ఫిర్యాదులు చేయుటయు తప్పుయని దెలుసుకొనుమమ్మా! 

17, జులై 2013, బుధవారం

కుమారీ శతకం - 49

విసువకు పని తగిలినయెడఁ
గసరకు సేవకుల మిగులఁ గాంతునితోడన్
రొసరొస పూనకు మాడకు
మసత్యవచనంబు లెన్నఁ డైన గుమారీ! 

 భావం:-
ఓ చినదానా!మిక్కిలిగా పని ఒత్తిడి కలదనివిసుగు చెందరాదు.పనివాండ్రను నెక్కువగా కసురుకొనరాదు.భర్తను ఈసడించరాదు.అసత్యము చెప్పరాదు. 

16, జులై 2013, మంగళవారం

కుమారీ శతకం - 48

చెడుఁగుతో లంజెలతో
గుడిసేటులతోడు బొత్తు కూడదు మది నె
ప్పుడు నిల నుత్తమ కాంతల
యడుగులకు న్మడుగులొత్తు మమ్మ కుమారీ! 

 భావం:-
ఓ సౌభాగ్యవతీ!చెడ్డవారి(పోకిరీస్త్రీలు)స్నేహమును చేయరాదు.సౌశీలురును,మంచివారునైన స్త్రీలకు సేవ చేయుట వలన నీకు మంచి జరుగును.

15, జులై 2013, సోమవారం

కుమారీ శతకం - 47

తొడవులు మిక్కిలి గలిగినఁ
గడుఁ ప్రేమన్ మగఁడు మిగుల గారా మిడినన్
పడఁతుక పసుపుం గుంకుమ
గడియైనను విడువ రాదు గాదె కుమారీ! 

  భావం:-
ఓ కుమారీ!ఎంత భాగ్యవంతురాలివైనను,మగడెంత బ్రీతితో నిన్ను జూచుకొనుచున్నాను ఆడది పసుపు కుంకుమలను నిమిషమైననూ వీడరాదు సుమా! 

14, జులై 2013, ఆదివారం

కుమారీ శతకం - 46

నవ్వంగ రాదు పలుమఱు
నవ్వినఁ జిఱునవ్వుగాని నగరా దెపుడున్
గవ్వలవలె దంతంబులు
జవ్వునఁ గానంగఁ బడెడి జాడ గుమారీ! 

 భావం:-
ఓ చినదానా!ఇంటి ఇల్లాలు అనసరంగా ఇకిలించరాదు.(నవ్వరాదు).చిరునవ్వు చింతలను బారద్రోలును.పండ్లు కనుబడునట్లు పకపకా నవ్వరాదు.నవ్వు నాలుగు విదాల చేటుయని మరువకుము. 

13, జులై 2013, శనివారం

కుమారీ శతకం - 45

నడకలలో నడుగుల చ
ప్పుడు వినబడకుండవలయును భువి గుంటలు క
న్పడరాదు మడమనొక్కులఁ
బడఁతుల మర్యాద లెఱిఁగి బ్రతుకు కుమారీ! 

 భావం:-
ఓ కుమారీ!నీ అడుగుల చప్పుడు వినబడకుండునట్లు నడువవలెను.నీ కాలి మడముల గుర్తులు పడకుండా నడవవలెను.స్త్రీల సద్గుణములు తెలుసుకొని జీవింపుమమ్మా! 

12, జులై 2013, శుక్రవారం

కుమారీ శతకం - 44

పొంతఁ బని సేయ కెన్నఁడు
పంతంబులు పలుకఁబోకు ప్రాజ్మఖముగ నీ
దంతంనులు దోమకు మే
కాంతంబులు బయలుపఱుప కమ్మ!కుమారీ! 

  భావం:-
ఓ కుమారీ!ఎవ్వరితోనూ కలిసి మెలిసి పని చేయక,ఊరికినే పరుషమైన మాటలు మాట్లాడరాదు.తూర్పు దిశగా పండ్లుతోముకోవద్దు.రహస్యాలు వెల్లడించవద్దు. 

11, జులై 2013, గురువారం

కుమారీ శతకం - 43

కొన్నాళ్ళు సుఖము కష్టము
కొన్నాళ్ళు భుజింపకున్న గొఱగాదు సుమీ
పున్నమ దినముల వెన్నెల
యెన్నంగ సమాసలందు నిరులు కుమారీ! 

 భావం:-
ఓ కుమారీ!కష్టసుఖాలను,రెండిటినీ అనుభవిస్తేనేజీవిత విలువ తెలియును.పున్నమి నాడు వెన్నెలయు,అమావాస్యనాడు చీకట్లు ఉండుట సహజము కదా! 

10, జులై 2013, బుధవారం

కుమారీ శతకం - 42

 వారికి వీరికి గలిగెను
గోరిన వస్తువులు మాకుఁ గొదవాయె నటం
చూరక గుటకలు మ్రింగుట
నేరముగాఁ దలఁపవలయు నెలఁత కుమారీ! 

భావం:-
ఓ సుకుమారీ!వారికి వీరికీ ఉందని ,తనకు లేశని చింత పడరాదు.ఇరుగు పొరుగువారి యొక్క భాగ్యమును జూసి ఈర్ష్య పడరాదు.సంతృప్తినలవర్చుకొనవలెను.తనకున్న దానితో తృప్తి పడుట మిక్కిలి యత్తమము.కోరికలతో చింతపడుట మిక్కిలి తప్పు.

9, జులై 2013, మంగళవారం

కుమారీ శతకం - 41

తలవాకిట నెల్లప్పుడు
నిలువఁగ రా దెప్పు డెంత నిద్దురయైనన్
మెలఁకువ విడరాదు సుమీ
తల నడుచుచు విప్పికొనున్ట తగదు కుమారీ! 

భావం:-
ఓ కుమారీ!ఇంటిముంగిట్లో అలంకరించుకోని నిలబడరాదు.మొద్దు నిద్ర పనికి రాదు.నిద్రలో కూడా కొంచెం మగతగా మెలుకువ గలిగి ఉండవలెను.నడుస్తున్నప్పుడు (జుట్టుముడి)తల వెంట్రుకలు విప్పరాదు.(నిత్యము తల విప్పుకొని ఉండరాదని భావము)