దీపము వెలిగింత చెడిచోఁ
జీపురుపుడ కుంచవలయుఁ జేతుల నేతం
బాపము పాలౌదువు మది
లోపల నిది తలఁపవలయు రూఢిం గుమారీ!
భావం:-
ఓ సుకుమారీ!దీపమును వెలిగించునపుడు చీపురుపుల్లను ఉపయోగించుము.చేతులతో
వెలిగించినచో ఎంత నూనె చేతికి అంటుకున్నదో అంత పాపమును మూటకట్టుకుంటావు.ఈ
సంగతి మనస్సులోనుంచుకొని మసులుకొనుము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి