Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

14, నవంబర్ 2015, శనివారం

x class TELUGU Video Classes

Select Class :  x class
 Select Subject : TELUGU

001 SE-10TH-TEL-NENERIGINA BOORGULA-P1.flv    Click Here
001 SE-10TH-TEL-NENERIGINA BOORGULA-P2.flv    Click Here
010 SE-10TH-TEL-NAGARAGEETAM-P1.flv    Click Here
010 SE-10TH-TEL-NAGARAGEETAM-P2.flv    Click Here
011 SE-10TH-TEL-YAKSHUDI APPU-P1.flv    Click Here
011 SE-10TH-TEL-YAKSHUDI APPU-P2.flv    Click Here
012 SE-10TH-TEL-CHANDASSU ALAMKARAM-P1.flv    Click Here
012 SE-10TH-TEL-CHANDASSU ALAMKARAM-P2.flv    Click Here
016 SE-10TH-TEL--BASAVESWARA PARINAYAM 1-P1.flv    Click Here
016 SE-10TH-TEL--BASAVESWARA PARINAYAM 1-P2.flv    Click Here
022 SE-10TH-TEL-BASAVESWARA PARINAYAM 2-P1.flv    Click Here
022 SE-10TH-TEL-BASAVESWARA PARINAYAM 2-P2.flv    Click Here
025 SE-10TH-TEL-MA PRAYATNAM 1-P1.flv    Click Here
025 SE-10TH-TEL-MA PRAYATNAM 1-P2.flv    Click Here
033 SE-10TH-TEL-PADYAM PRATHI PADARADHAM-P1.flv    Click Here
033 SE-10TH-TEL-PADYAM PRATHI PADARADHAM-P2.flv    Click Here
aparichitha padyam-gadyam-Part1.flv-1324.flv    Click Here
aparichitha padyam-gadyam-Part2-1324.flv    Click Here
chaaredu mallelu.flv-1322.flv    Click Here
chandhassu-jati upajati padyaalu-Part1-100.flv    Click Here
chandhassu-jati upajati padyaalu-Part2-100.flv    Click Here
telugu, 10th class, gorantha deepalu kadha.flv    Click Here
Telugu, 10th class, Maanikyaveena.flv    Click Here
telugu- ampakalu-10thclass1315.flv    Click Here
telugu- geethanjali-10thclass-1314.flv    Click Here
telugu- samasamulu-10thclass-309.flv    Click Here
telugu- thamasi-2-10thclass-1313.flv    Click Here
TELUGU- VRUTTA PADYALU 10th CLASS-42.flv    Click Here
telugu-barister parvathisham patralu,swabavalu-10thclass -1327.flv    Click Here
Telugu-savarnadheerga,gunasandhi-10thclasss -180.flv    Click Here

1, జులై 2015, బుధవారం

10th class Telugu Lesson Plan

పదవ తరగతి తెలుగు ప్రథమ భాష పాఠ్యాంశ పిరియడ్ ప్లాన్


 ‍6th telugu lesson plan         7th telugu lesson plan          8th telugu lesson plan

7th class Telugu Lesson Plan

ఎడవ తరగతి తెలుగు ప్రథమ భాష పాఠ్యాంశ  పిరియడ్ ప్లాన్


 ‍6th telugu lesson plan         7th telugu lesson plan          8th telugu lesson plan

4, మే 2015, సోమవారం

తెలుగు కవులు - తిరుమల రామచంద్ర

తిరుమల రామచంద్ర

వికీపీడియా నుండి
తిరుమల రామచంద్ర
Tirumala Ramachandra.png
తిరుమల రామచంద్ర
జననం తిరుమల రామచంద్ర
1913, జూన్ 17
అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగటిపల్లె
వృత్తి ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తా
"భారతి" మాసపత్రిక ఇన్ చార్జ్ ఎడిటర్
ప్రసిద్ధి ప్రసిద్ధిచెందిన తెలుగు కవి మరియు సంపాదకులు
తిరుమల రామచంద్ర సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రకరకాల వృత్తులు చేసి, వివిధ అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవశాలి ఐన రామచంద్ర తనను తాను వినమ్రంగా భాషాసేవకుడు అని అభివర్ణించుకునేవారు.

విషయ సూచిక

బాల్యం, విద్యాభ్యాసం

అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగటిపల్లె లో జన్మించిన రామచంద్ర హంపీ శిథిలాలలోని గ్రామమైన కమలాపురంలో తన బాల్యం గడిపారు. వీరు సాక్షాత్తూ విజయనగరసామ్రాజ్యంలో కానవచ్చే తాతాచార్యుల వంశీయులు.సంస్కృత భాష, శాస్త్రాలను గురుశుశ్రూష చేసి నేర్చుకోవడం ప్రారంభించాకా కారణాంతరాల వల్ల తిరుపతిలోని కళాశాలలో చేరారు. తెలుగు,సంస్కృతాలలో విద్వాన్ గా హిందీలో ప్రభాకరగా పట్టాలు పొందారు.

ఉద్యమరంగం

స్వాతంత్ర్య సమరయోధునిగా మద్రాసు కుట్ర కేసులో ముద్దాయిగా స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకున్నారు. తిరుపతిలో చదువుతున్నపుడు వ్యష్టి సత్యాగ్రహం లో పాల్గొని ఏడాది జైలు శిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ సభల కోసం మార్చింగ్ సాంగ్స్ రాశారు.

విస్తృత లోకానుభవం

ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తాగా ఆప్ఘనిస్థాన్, బెలూచిస్థాన్, సరిహద్దుల్లో పనిచేశారు. ఆ ఉద్యోగాన్ని ఆత్మాగౌరవానికి భంగం కలిగిన కారణంగా విడిచిపెట్టిన రామచంద్ర ఆ సమయంలోనే ఉత్తర భారతదేశంలో విస్తృతమైన పర్యటన చేశారు. ఉమ్మడి పంజాబులో భాగమైన లాహోర్ పట్టణంలో కొందరు మహాపండితులను, పంజాబు పల్లెల్లో భారతీయ గ్రామీణ జీవితం, మొహెంజదారో, హరప్పా ప్రాంతాల్లో ప్రాచీన నాగరికతా చిహ్నాలను దర్శించారు.

పత్రికా రంగం

వేటూరి ప్రభాకర శాస్త్రికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకుంటున్న తిరుమల రామచంద్ర విద్వాన్ విశ్వం వంటి సహాధ్యాయులతో పనిచేశాడు. అనంతరం ఢిల్లీ వచ్చి డెయిలీ టెలిగ్రాఫ్ ఆంగ్ల పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డాడు. 1944 లో పత్రికా రంగంలో పనిచేశాడు. తొలుత తెలంగాణా పత్రికలో పనిచేసి తర్వాత మీజాన్ లో చేరి ఆ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు శిష్యరికంలో రాటుదేలాడు.
సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి , బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల దంపతులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సోషలిష్టు భావజాలానికి దగ్గరయ్యాడు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక,ఆంధ్రభూమి,హిందుస్తాన్ సమాచార్ లలో వివిధ హోదాలలో పనిచేశాడు. భారతి మాసపత్రిక ఇన్ చార్జ్ ఎడిటర్ గా పనిచేసిన కాలంలో దేవరకోండ బాలగంగాధర తిలక్ వ్యాసం ప్రచురించిన కారణంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో రాజీనామా చేశాడు. నార్ల వెంకటేశ్వరరావు తో విభేధించి ఆంధ్రప్రభలో ఉద్యోగం వదులుకున్నాడు.
పరిశోధన అనే ద్వైమాసపత్రికకు సంపాదకత్వం వహించి 1953-1956 మధ్యకాలంలో ప్రచురించాడు.

రచన రంగం

  • పదమూడవ యేట ఒక శృంగార రచన చేసినా మానపల్లి రామకృష్ణ కవి మందలింపుతో దేశ భక్తి గీతాలవైపు మళ్ళారు రామచంద్ర. కొన్ని వందల వ్యాసాలు సమీక్షలు రాశారు. "హైదరాబాద్ నోట్ బుక్" వంటి 15 శీర్షికలు నిర్వహించారు."సత్యాగ్రహ విజయం" నాటకం, రణన్నినాదం గీతాన్ని సంస్కృతంలో రాశారు.
  • తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవితంలో అర్ధ శతాబ్ది పత్రికా రచనకే అంకితమైనారు. తెలుగు నాట, భారతావనిలో ప్రసిద్ధులైన కవిపండితులు, కళాకారులు, భాషావేత్తలు, తత్వ్త చింతకులు అయిన ప్రతిభాశాలురు అనేక మందిని ఆయన ఇంటర్వ్యూ చేశారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచ్చైనాయి.
  • రాహుల్ సాంకృత్యాయన్‌ను స్వయంగా కలుసుకున్నారు.బహుభాషా కోవిదుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా సహాయ సహకారాలు అర్థించగా, జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూపలేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినది కాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.
  • 'మన లిపి - పుట్టు పూర్వోత్తరాలు' భాషా చరిత్రకే తలమానికం.ఇతర భాషలలో కూడా ఇలాంటి రచన లేదనిఆంధ్ర విశారద తాపీ ధర్మారావు అన్నారు.

వ్యక్తిత్వం

చిన్నతనంలోనే భారతదేశపు సాంస్కృతిక వైశాల్యాన్ని దర్శించిన రామచంద్ర ఆ కారణంగా తన దృక్పథంలో ఏర్పడ్డ సమ్యక్ దృష్టి, సంస్కృతి పట్ల ప్రేమను జీవితాంతం నిలబెట్టుకున్నారు. నార్ల వెంకటేశ్వరరావుతో విభేదాలు, "భారతి" పత్రికలో ఒక వ్యాసం గురించిన వివాదాలు వంటి సందర్భాల్లో రాజీనామాలు చేసి తన ఆత్మగౌరవాన్ని ప్రదర్శించారు. గాంధీని దర్శించారు. వారితో హరిజనోద్యమంలో పాల్గొన్నారు. ఖద్దరు దుస్తులు కట్టేవారు. నాస్తికునిగా, హేతువాదిగా ప్రకటించుకున్న వీరే దేవాలయంలో పూజ చేయడం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వద్ద సహాయకునిగా పౌరోహిత్యం చేయడం వంటివి చేశారు. ప్రతి ఉత్తరంలోనూ ఇట్లు భాషాసేవకుడు తిరుమల రామచంద్ర అంటూ సంతకం చేసే రామచంద్ర భాషాసేవలోనే జీవితాన్ని గడిపారు.

పుస్తకాలు

ఆయనకు ఎనలేని కీర్తి ఆర్జించి పెట్టిన పుస్తకాలు "మన లిపి-పుట్టుపూర్వోత్తరాలు" , "నుడి నానుడి" , "సాహితీ సుగతుని స్వగతం" , "గాధా సప్తసతిలో తెలుగు పదాలు" , "తెలుగు పత్రికల సాహిత్య చరిత్ర" ఇందులో సాహితీ సుగతుని స్వగతం" గ్రంధానికి 1970 లో రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ సాహిత్య విమర్శ పురస్కారం , "గాధా సప్తసతిలో తెలుగు పదాలు" కు 1986 లో సాహిత్య అకాడమీ నుండి అవార్డు, లభించాయి.రెండువేల ఏళ్ళనాటి భారతీయుల సాంఘిక జీవనాన్ని కమనీయంగా వ్యాఖ్యానించడమే కాక, గాధా సప్తసతిలో ఏయే సందర్భాలలో ఏయే అర్థాల్లో తెలుగు పదాలు కనబడతాయో వివరించారు.కాళిదాసుపై గాధా సప్తసతి ప్రభావం ఉందని తేల్చి చెప్పారు.

కొన్ని రచనలు

హంపి నుంచి హరప్పా దాక ముఖచిత్రం
  1. సాహితీ సుగతుని స్వగతం : రామచంద్ర గారు, చాలా చిన్న వయసులోనే భారతి పత్రిక కు వ్యాసాలు రాసే వారట. అప్పట్లో భారతి పత్రికలో వ్యాసం పడ్డం అంటే, అదో గొప్ప గౌరవమట. ఆ వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. ఇందులో కొన్ని అద్భుతమైన వ్యాసాలు.
    1. ఆంధ్రచ్చందో విశేషములు : "ఎసగు , ఒసగు" అన్న పదాల చర్చకు సంబంధించి శ్రీ వజ్ఘల చిన సీతారామశాస్త్రి గారి వాదనను ఆక్షేపిస్తూ వ్రాసినది. ఈ వ్యాసం చదివిన పండితుడొకాయన ప్రభాకర శాస్త్రి గారి వద్ద ప్రస్తావిస్తూ, భారతి లో ఎవరో గొప్ప వ్యాసం రాసేరని అన్నాట్ట. శాస్త్రి గారు పక్కనున్న రామచంద్ర గారిని చూపించేరట. ఆ పండితుడు విస్తుపోయి, "ఎవరో శాలువా పండితుడనుకున్నాను. ఈ కుర్ర వాడా?" అని మెచ్చుకున్నారుట. ఈ ప్రస్తావన "హంపి నుండి..." లో ఉన్నది.
    2. నువ్వులు కొట్టిన ఇడి నూటిడి : నన్నెచోడుడి కుమారసంభవం పరిష్కరిస్తూ, వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఓ చోట, "నూటిడి" అన్న భక్ష్య విశేషాన్ని, "నూబిడి (నువ్వు + పిడి -> పిడికిలి మేర నువ్వులు)" గా పేర్కొంటే, రామచంద్ర గారు, "నూటిడి" పదాన్ని అన్నమయ్య కీర్తనలోనూ, శ్రీనాథుని హరవిలాసం లోనూ వాడినట్టు ఋజువు చేశారు. ఇదో అత్యద్భుతమైన వ్యాసం.
    3. బుద్ధుడికి ముందే ఉన్న ధూమపానం : ధూమపానం పైని వివరణ. ఇంకా ఇందులో ఆఫ్రికా కాల్పనిక సాహిత్యం, అనువాద సమస్యలు వంటి అద్భుతమైన వ్యాసాలున్నాయి. సాహితీ ప్రేమికులు మరువకూడని అద్భుతమైన పుస్తకం ఇది. విశాలాంధ్ర ప్రచురణ. ఇప్పుడు దొరకం లేదు!
  2. మనలిపి - పుట్టుపూర్వోత్తరాలు : లిపి పైన తెలుగులో కానీ, మరే భాషలో కానీ ఇంత సాధికారికమైన, సమగ్రమైన గ్రంథం వెలువడలేదు అంటే అతిశయోక్తి కాదు. రామచంద్ర గారు ప్రాకృతం పరిష్కరింపబడి, సంస్కృతం గా మారిందని, సంస్కృత, ప్రాకృతాల మధ్య జన్య జనక సంబంధం లేదని ఎన్నో ఋజువులు (ఆచార్య హేమచంద్రుడు, గాథా సప్తశతి వగైరా) చూపించారు. ఈ రచనలో పాళీ నుండి సాగిన లిపి ప్రస్థానం ప్రస్తుత తెలుగు లిపి పరిణామం వరకు ఎంతో అద్భుతంగా వివరించబడింది. లిపి గురించి తెలుసుకోవాలన్న వారు ఈ గ్రంథం చదవకపోతే, వారి ఆసక్తి, అనురక్తి, అసమగ్రం అని చెప్పడానికి సందేహించనక్కరలేదు. ఇంకో గొప్ప విషయం. ఈ రచన వ్యవహార భాషలో సాగటం. ఇలాంటి గ్రంథం వ్యవహార భాషలో అదీ అప్పటి కాలంలో రాయడం ఓ నేర్పు.ఇదీ విశాలాంధ్ర ప్రచురణే.
  3. మనవి మాటలు : ఇదో చక్కని వ్యాస సంకలనం. ఇందులో కేరళ వారి "ఓణం" గురించీ, మాఘుని జ్యోటిశ్శాస్త్ర పాండిత్యం మీద, వినాయక చవితి మీద చక్కటి వ్యాసాలు.
  4. అహం భో అభివాదయే : రామచంద్ర గారు ఆంధ్ర ప్రభ లో పని చేస్తున్నప్పుడు, ఎందరో ప్రముఖులను ముఖాముఖి జరిపారు, మరెందరి మీదో అద్భుతమైన వ్యాసాలు రాసారు. అప్పటి ప్రముఖుల మీద రాసిన వ్యాస సంకలనం ఇది. విశ్వకవి రవీంద్రుడు, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, దాలిపర్తి పిచ్చిహరి, విస్సా అప్పారావు గారు, చిలుకూరి నారాయణరావు గారు.. ఇలా ఎందరో గొప్ప వ్యక్తుల గురించి ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది.
  5. ప్రాకృత వాఙ్ఞ్మయంలో రామకథ : పైన ఇందాక చెప్పినట్టుగా, ప్రాకృతం అన్నది జనపదాల్లో వాడుకలో ఉన్న భాష కాగా, సంస్కృతం సంస్కరింపబడి, సమాజంలో ఉన్నత వర్గాల ఆదరణకు నోచుకున్న భాష. పల్లె సీమల్లో ఉన్న జీవన రామణీయత, వారి గాథలు మొట్టమొదట సంకలనం చేసిన సహృదయుడు హాలుడు. ఆ గాథలు గాథా సప్తశతి గా పొందుపరుచబడ్డాయి. ఈ పుస్తకంలో కొన్నివ్యాసాలు : వజ్జాలగ్గంలో తెలుగు పదాలు, ప్రాకృత ప్రకృతి (ఇది చాలా అద్భుతమైన వ్యాసం), వివిధ ప్రాకృత కవులు, బౌద్ధ రచనలు మొదలైనవి. ఇది ఓ అందమైన పుస్తకం.
  6. నుడి-నానుడి : మహీధర నళినీమోహన్ గారి ఓ చిట్టి రచన, పిడుగుదేవర కథ. ఇందులో పిడుగు గురించి చాలా విషయాలు చెప్పారాయన. అందులో ఓ చోట తెలుగు పదాలు ఎలా మొదలయ్యాయి అని ఆసక్తి ఉన్న వారికి నుడి - నానుడి పుస్తకం సూచించారు. ఇదో శీర్షిక, ఆంధ్రజ్యోతి వారపత్రికలో. ఈ పాకెట్ సైజు పుస్తకం లో అనేక తెలుగు పదాలకు మూలాలు వెతికారాయన. ఇది కేవలం వ్యాసం రాస్తున్నట్టుగా, మధ్యమధ్యలో పిట్టకథలు చెబుతూ, కావ్యాల్లో ఉదాహరణలు పేర్కొంటూ, అందంగా సాగుతుంది. తెలుగు భాషా ప్రియులకు ఇదో ఆవకాయ. ఇందులో పేర్కొన్న కొన్ని పదాలు : గోంగూర, మిరపకాయ, నాచకమ్మ, చారు, సేపు వగైరా వగైరా...
  7. లలిత విస్తరం : ఇది బుద్ధ మహానుభావుని జీవితం. బౌద్ధపురాణం. దీన్ని, ఈయన, బులుసు వెంకటరమణయ్య గారు తెనిగించారు.
  8. హంపీ నుంచి హరప్పా దాక: కేంద్ర సాహిత్య అకాడమీ (2002) పురస్కారం పొందిన పుస్తకం . తిరుమల రామచంద్ర రచనా వ్యాసంగంలో ప్రముఖమైన స్వీయచరిత్ర . దీని తొలి ముద్రణ ఆయన పరమపదించిన రెండునెలలతరువాత ప్రచురించబడింది. దీనికి ముందు మాట రాసిన అక్కిరాజు రమాపతిరావు ఈ పుస్తకం నవలకన్నా వేగంగా , ఆకర్షకంగా, ఉత్తేజభరితంగా చదివిస్తుంది అని పేర్కొన్నాడు. దీనిలో బొమ్మలు జి.వి.అమరేశ్వరరావు ఆకర్షణీయంగా వున్నాయన్నాడు. కరుణం, శుచిరుజ్జ్వలమైన శృంగారం, సుకుమార హాస్యం, పరమ మనస్విత ఈ గ్రంథం నిండా పాఠకులు పూలతోటలో విహరించేంత సంతోషాన్ని కలిగిస్తాయని పేర్కొన్నాడు. [1]
  9. చెప్పుడు మాటలు నాటికల సంపుటిని కన్నడంలో శ్రీరంగ ఎన్.కస్తూరి రాశారు. ఆ పుస్తకాన్ని తిరుమల రామచంద్ర తెలుగులోకి అనువాదం చేశారు.
ఇంకా తెలుగు పత్రిక సాహిత్య సేవ, బృహదారణ్యకం, మరపురాని మనీషులు,గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు - పర్వాలు, హాల గాథలు, వీరగాథలు, దక్షిణాంధ్రవీరులు, కాటమరాజు కథ,శశాంకవతి, ధర్మదీక్ష మొదలైన పుస్తకాలు వ్రాశాడు. సంస్కృతంలో సత్యాగ్రహవిజయం, సుమతీశతకం వ్రాశాడు. అనువాదకుడిగా కన్నడనవల శాంతల, తమిళం నుండి రాజాజీ కథలు,ఆంగ్లం నుండి భక్తి వేదాంతస్వామి కమింగ్ బ్యాక్, హిందీనుండి సుశీలా నయ్యర్ వ్రాసిన గాంధీజీ కారాగారగాథ, సంస్కృతం నుండి క్షేమేంద్రుని బృహత్కథామంజరి, ప్రాకృతం నుండి లీలావతి కావ్యం తెలుగులోనికి అనువదించాడు.

బిరుదులు

  • పత్రకార శిరోమణి
  • కళాసరస్వతి
  • మహామహోపాధ్యాయ

మూలాలు


  1. హంపి నుంచి హరప్పాదాక- శ్రీతిరుమల రామచంద్ర, అభో విజోకందాళం ప్రచురణ, నాలుగవ ముద్రణ, ఆగష్టు, 2010 పేజీ. vii-xiv

యితర లింకులు

2, మే 2015, శనివారం

తెలుగు కవులు - తాపీ ధర్మారావు

వికీపీడియా నుండి
(తాపీ ధర్మారావు నుండి దారిమార్పు చెందింది)
తాపీ ధర్మారావు నాయుడు
Tapi Dharmarao.jpg
తాపీ ధర్మారావు నాయుడు
జననం తాపీ ధర్మారావు నాయుడు
1887 , సెప్టెంబరు 19
ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు
మరణం 1973 మే 8
ఇతర పేర్లు తాతాజీ
వృత్తి కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులు
ప్రసిద్ధి తెలుగు రచయిత
తెలుగు భాషా పండితుడు
హేతువాది
నాస్తికుడు
మతం హిందూ
పిల్లలు కుమార్తెలు (లక్షుమమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య)
Notes
తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”
తాపీ ధర్మారావు నాయుడు (Tapi Dharma Rao Naidu) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.

విషయ సూచిక

జీవిత చరిత్ర

ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబరు 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం )లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాధమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పని చేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను 1973 మే 8న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.

జీవితంలో ముఖ్య ఘట్టాలు[1]

1887 - సెప్టెంబరు 19 జననం - గంజాం జిల్లా, బరంపురం
1903 - మెట్రిక్ పరీక్షకెళ్ళే యత్నం విఫలం
1904 - మెట్రిక్ పరీక్షలో మొదటి శ్రేణిలో కృతార్థత - విజయ నగరం
1904 - గురజాడను సుదూరంగా దర్శించడం
ఎఫ్.ఎ. పర్లాకిమిడి రాజా కళాశాలలో ప్రవేశం, పర్లాకిమిడి
1904 -

సినిమా జీవితం

విశేషాలు

  • ఉమ్మడి రాష్ట్రంగా వున్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు- ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.
  • ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు.
  • 'మాలపిల్ల' (1938) సినిమాకు కథ అందించినది- గుడిపాటి వెంకటచలం.
  • తాపీని గౌరవంగా 'తాతాజీ' అని పిలిచేవారు.

రచనలు

  1. ఆంధ్రులకొక మనవి
  2. దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936
  3. పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960
  4. ఇనుపకచ్చడాలు
  5. సాహిత్య మొర్మొరాలు
  6. రాలూ రప్పలూ
  7. మబ్బు తెరలు
  8. పాతపాళీ
  9. కొత్తపాళీ
  10. ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ
  11. విజయవిలాసం వ్యాఖ్య
  12. అక్షరశారద ప్రశంస
  13. హృదయోల్లాసము
  14. భావప్రకాశిక
  15. నల్లిపై కారుణ్యము
  16. విలాసార్జునీయము
  17. ఘంటాన్యాయము
  18. అనా కెరినీనా
  19. ద్యోయానము
  20. భిక్షాపాత్రము
  21. ఆంధ్ర తేజము
  22. తప్తాశ్రుకణము

పురస్కారములు

  • శృంగేరీ పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు,
  • చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము.
  • మరెన్నో సాహిత్య పురస్కారములు.

ఇవి కూడా చూడండి

మూలాలు


  1. ఏటుకూరి, ప్రసాద్. తాపీ ధర్మారావు జీవితం-రచనలు.

వనరులు

20, ఏప్రిల్ 2015, సోమవారం

తెలుగు కవులు - సురవరం ప్రతాపరెడ్డి

సురవరం ప్రతాపరెడ్డి

వికీపీడియా నుండి
సురవరం ప్రతాపరెడ్డి
SuravaraM prataapareddi.jpg
సురవరం ప్రతాపరెడ్డి
జననం సురవరం ప్రతాపరెడ్డి
1896 మే 28
మహబూబ్ నగర్ జిల్లా లోని ఇటిక్యాలపాడు గ్రామం
మరణం 1953 ఆగష్టు 25
నివాస ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లా లోని ఇటిక్యాలపాడు గ్రామం
ఇతర పేర్లు సురవరం ప్రతాపరెడ్డి
వృత్తి హైదరాబాద్ రాష్ట్రం శాసన సభ్యులు-వనపర్తి,(1952
పత్రికా సంపాదకుడు
పరిశోధకుడు
పండితుడు
రచయిత
ప్రేరకుడు
క్రియాశీల ఉద్యమకారుడు
ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడు(1944)
ప్రసిద్ధి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత
అమూల్య గ్రంథ సూక్ష్మ వ్యాఖ్యాత
SuravaraM pratapareddi text.jpg

తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు.[1] నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు.[2]జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను "కేంద్ర సాహిత్య అకాడమి" అవార్డు లభించింది.
సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటం

విషయ సూచిక

జీవిత విశేషాలు

సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు లో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించిండు. మంచి పండితుడు. 1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టిండు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించిండు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.

తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934 లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పాడు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. 1942 లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు. 1943 లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944 లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు.

1951 లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించాడు. 1952 లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరపున వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభ కు ఎన్నికయ్యాడు. న్యాయవాదిగా ఆయన జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నాడు. 1953 ఆగష్టు 25న ఆయన దివంగతుడైనాడు.

రచనా వ్యాసంగం

సురవరం రచించిన గ్రంథాలలో "గోల్కొండ కవుల సంచిక" ప్రఖ్యాతి చెందినది. నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యులు అనే నిందావాక్యాన్ని సవాలుగా తీసుకొని 354 కవులకు చెందిన రచనలు, జీవితాలతో కూడిన గ్రంథాన్ని ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు ప్రతాపరెడ్డి. ఇందులో అత్యధికంగా పాలమూరు జిల్లాకు చెందిన 87 కవుల వివరాలున్నాయి.[3] ప్రతాపరెడ్డి భావుకుడైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించిండు. ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంస పొందింది. సురవరం ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. హైందవ ధర్మ వీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలను రచించిండు. భక్త తుకారాం, ఉచ్ఛల విషాదము అనే నాటకాలు రాసాడు. రాజకీయ సాంఘీక ఉద్యమంగా సంచలనం కలిగించిన ఆంధ్రమహాసభ మొట్టమొదటి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి.

రాజకీయాలు

సురవరంకు రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయిననూ సన్నిహితుల ప్రోద్బలంతో 1952లో జరిగిన తొలి ఎన్నికలలో వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ప్రముఖ న్యాయవాది వి.రామచంద్రారెడ్డి పై విజయం సాధించి హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు. కాని ప్రారంభం నుంచి రాజకీయాలకు దూరంగా ఉండటం, గ్రూపు రాజకీయాలు చేయకపోవడంతో జిల్లా వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్ననూ ఇతనికి మంత్రిపదవి కూడా లభించలేదు. ఈ విషయంపై సురవరం స్వయంగా ఆయన ఆప్తుడైన రంగాచార్యులకు లేఖ వ్రాస్తూ "ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నా వంటివారు ఏమియును పనికి రారు" అని స్పష్టంగా పేర్కొన్నాడు.

విశేషాలు

  • 1926లో తెలంగాణలో తెలుగు భాషా వికాసానికి దోహదపడే విధంగా ‘గోల్కొండ పత్రిక’ను తీసుకొచ్చారు. అప్పుడు రాజభాషగా,పాలనా భాషగా,వ్యవహారభాషగా ఉర్దూ ఉన్నది.అప్పటి రాజభాష ఉర్దూ భాషలోనే మీజాన్, జామీన్, రయ్యత్ పత్రికలు వచ్చేవి.అప్పటికి రెండు తెలుగు వార పత్రికలు మాత్రమే ‘నీలగిరి’నల్లగొండ జిల్లా నుండి,‘తెలుగు’ వరంగల్ జిల్లా నుంచి వెలువడుతుండేవి.
  • 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ‘ఆంధ్ర మహాసభ’కు అధ్యక్షత వహించారు.ఆంధ్ర మహాసభ కార్యాకలాపాలన్ని తెలుగులోనే జరగాలంటూ తీర్మానం చేయించారు.
  • తెలంగాణలో కవులే లేరన్న ముడంబ వెంకట రాఘవాచార్యుల ప్రశ్నకు సమాధానంగా ‘గోల్కొండ పత్రిక’ ద్వారా 354 మంది తెలంగాణ కవుల శ్లోకాలను, పద్యాల ను సేకరించి ‘గోల్కొండ కవుల సంచిక’ పేరుతో వెలువరించారు.
సురవరం ప్రతాపరెడ్డి[4].

వనరులు, మూలాలు

  • అమరావతి పబ్లికేషన్సు వారి తెలుగు వెలుగులు పుస్తకం

బయటి లింకులు