Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
కుమారీ శతకము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కుమారీ శతకము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జూన్ 2013, గురువారం

కుమారీ శతకం - 22

22 . దనవంతుఁడైన యప్పుడు
పెనిమిటి చిత్తం బెఱింగి పెండ్లాము మెలం
గును లేమి మెలఁగ నేర్చిన
వనితకు లోకమును వన్నె వచ్చుఁగుమారీ! 

భావం:-
ఓ కుమారీ!భర్త భాగ్యవంతుడైనపుడు యాతని మనస్సు నెరింగి నడుచుకోవలెను.ఒక వేళ భాగ్య హీనుడైనచో (డబ్బులేనివాడు)అతని చిత్తము నెరింగి నడుచుకొన్న స్త్రీ ఇహపరలోకములలో కీర్తి గడించును.

19, జూన్ 2013, బుధవారం

కుమారీ శతకం - 21

21. ధనహీనుఁడైన గడు దు
ర్జనుఁడైనఁ గురూపియైన జారుండైనన్
విను పాపియైన నెప్పుడుఁ
దనపతియే తనకు దైవ తంబు కుమారీ!

భావం:-
ఓ కుమారీ!భర్త భాగ్యవంతుడు కానివాడైననూ (పేదవడైననూ)మిక్కిలి చెడ్డవడైననూ(దుర్మార్గుడైననూ)అందము లేనివడైననూ(కురూపి), వ్యభిచారుడైననూ, పాపిష్ఠివాడైననూ,తన మగడే తనకు దేవుడని తెలుసుకొమ్ము!పతియే ప్రత్యక్షదైవమని కదా పురాణాలు ప్రవచిస్తున్నాయి.

18, జూన్ 2013, మంగళవారం

కుమారీ శతకం - 20

20 . తన బావల పిల్లల యెడఁ
దన మఱఁదుల పిల్లలందు దనపిల్లల కం
టెను మక్కువ యుండవలెన్
వనితల కటులైన వచ్చుఁ గుమారీ!

భావం:-
ఓ కుమారీ! తన బావల,మరుదుల పిల్లలను తమకన్నబిడ్డలకంటే ఎక్కువగా చూచుకొన్న ఆడుదానికి కీర్తి వచ్చుననుటలో సందేహము లేదు.

17, జూన్ 2013, సోమవారం

కుమారీ శతకం - 19

19 . అమ్మకు రెండబ్బకు రెం
డిమ్మహిఁ దిట్టంచు కూఁతు రెందుకు ధర నా
ద్రిమ్మరి పుట్టకపోయిన
నిమ్మళమని యండ్రు జనులు నిజము కుమారీ!

భావం:-
ఓ కుమారీ ! తల్లిదండ్రులను రెండేసిమార్లు తిట్టించు కూతురెందులకు? అపఖ్యాతి తెచ్చు మాతాపితురలను అపహాస్యం పాలుజేసే కూతురు పుట్టకబోయిననూ సంతోషమేయని ప్రజలనుట సత్యము.

16, జూన్ 2013, ఆదివారం

కుమారీ శతకం - 18

18. కూతురు చెడుగై యుండిన
మాతది తప్పన్నమాట మది నెఱుగుదుగా
నీ తల్లిదండ్రులకు నప
ఖ్యాతులు రానీయఁ గాడ దమ్మ!కుమారీ!

భావం:-
ఓ కుమారీ! కూతురు తప్పు చేయుట తల్లి దప్పుయని నీకు దెలుసు కదా! కావున నీ కన్న తల్లిదండ్రులకు అపఖ్యాతి తీసుకురావద్దు.

15, జూన్ 2013, శనివారం

కుమారీ శతకం - 17

17. ఇరుగు పొరుగిండ్లు కైనను
వరుఁడో,కాకత్తగారొ,వదినెయొ,మామో
మఱఁదియొ సెల విడకుండఁగఁ
దరుణీ స్వతంత్రించి పోవఁ దగదు కుమారీ!

భావం:-
ఓ కుమారీ!యవ్వనవతీ!నీ భర్త,వదినె,మామ,మరుదులు వెళ్ళమని జెప్పితేనే దప్ప పొరబాటునైననూ పొరుగిండ్లకు పోవద్దు.ఎవరి ఆజ్ఞ లేకుండా నీకు నీవై పొరుగిండ్లకు పోవుట పాతివ్రత్యలక్షణము కాదు.

14, జూన్ 2013, శుక్రవారం

కుమారీ శతకం - 16

16. జపములు,గంగాయాత్రలు,
దపములు,నోములును,దానదర్మంబులు,పు
ణ్యపురాణము పతిభక్తికి
నుపమింపను సాటి రాక యుండు కుమారీ!

భావం:-
ఓ కుమారీ!పత్నికి పతియే ప్ర్యత్యక్షదైవము కావున జపతపాలు,గంగా తీర్దయాత్రలు,నోములు,దానధర్మాలు,పుణ్యపురాణకథా శ్రవణములు, మొదలగు పుణ్య కార్యములన్నియు నీ పతి తర్వాతనేయని దెలిసికొనుము. కారణం నీ మగని పుణ్యములలో కొంత భాగమునకు నీవు అర్హురాలవయనావు కావున జ్ఞానమెరిగి మసులుకొనుము. పతిభక్తే గొప్పదని తెలిసికొనుము.


13, జూన్ 2013, గురువారం

కుమారీ శతకం - 15

15.  పతి భుజియించిన పాత్రను
మెతు కొక్కటియైన భార్య మెసఁగుటికై తా
హిత మూనకున్న నది యొక
సతియే?కడుఁ బాపజాతి జగతి కుమారీ! 

భావం:-
ఓ కుమారీ ! భర్త భుజించిన పాత్రలో అతడు వదిలిన ఒకా మెతుకైననూ భార్య దినుట పతివ్రతా లక్షణమనబడును.దీనినే భర్త చేసుకొన్న పుణ్యములలో భాగమును గ్రహించుటయని అర్థము. భార్య దినిన పాత్రలో భర్త దినుటయనే ప్రశ్న లేదు గావున భార్య చేసుకొన్న పుణ్యములలో భాగమునకు భర్త రాడు. భార్య చేసికొన్న పుణ్యములు ఆమెకే చెందునని భావము.పతివ్రతా స్త్రీలు ఈ విదంగా నడుచుకొనవలెను. అట్లు ఆడుది ప్రపంచములో చెడ్డజాతి స్త్రీలతో చేరును. అనగా పాపిష్టురాలగును.

12, జూన్ 2013, బుధవారం

కుమారీ శతకం - 14


14 .  దబ్బరలాడకు కదిమిన
బొబ్బలు పెట్టుకుము మంచి బుద్దిగలిగి యెం
దెబ్బెఱికము బూనక కడు
గొబ్బున జిత్తమున వాని గూర్పు కుమారీ!

భావం:-
ఓ కుమారీ!అబద్దములు చెప్పకు.నీ భర్త కొట్టబోయినచో కేకలు పెట్టి అల్లరి పాలు కావలదు.ఏ పనినైనా అసహ్యించుకొనక మంచి బుద్దితో వెంటనే ఆయాపనులను నెరవేర్పుము.

11, జూన్ 2013, మంగళవారం

కుమారీ శతకం - 13


13. తిట్టిన దిట్టక,కొట్టిన
గొట్టక,కోపించెనేనిఁ గోపింపక,నీ
పుట్టినయింటికి,భాదము
పెట్టినయింటికిని వన్నె పెట్టు కుమారీ!

భావం:-
ఓ కుమారీ! నీ భర్త నిన్ను తిట్టినచో నీవు మరల తిట్టకూడదు,కొట్టినచో ఎదురు తిరిగి కొట్టకూడదు.ఒక వేళ నీపై కోపించిన తిరిగి కోపపడుకుము కుమారీ!పుట్టింటికి,నీ అత్తవారింటికీ కీర్తి వచ్చునట్లు నడుచుకో!

10, జూన్ 2013, సోమవారం

కుమారీ శతకం - 12

12.  పతి పాపపు బనిజెప్పిన
బతిమాలి మరల్పవలయుఁబతి వినకున్నన్
హిత మనుచు నాచరింపుము
మతిలోపల సంశయంబు మాని కుమారీ! 

భావం:-
ఓ కుమారీ! నీ మగడు చెప్పిన చెడుపనులను వలదని నెమ్మదిగా ప్రార్థించి, వారించి ఆ పని మానునట్లు చేయుము.నీ పతి వినకున్నచో అంతా మన మంచికేననుకొని సందేహాలను వదిలి పనిని నిర్వర్తించుము.

9, జూన్ 2013, ఆదివారం

కుమారీ శతకం - 11

11 .  పతి పర కాంతలతో సం
గతి జేసిన నాదు పుణ్య గతి యిట్లనుచున్
మతి దలపవలయు లేదా
బతిమాలగవలయు గలహ పడక కుమారీ! 

భావం:-
ఓ కుమారీ! నీ పతి పరస్త్రీలతో తిరుగుచున్నపుడు తెలివితేటలతో సౌమ్యముగా నీ దారికి తెచ్చుకొనుట నీ విది.అంతేగాని కొట్లాడరాదు. "నా పూర్వపుణ్యఫలమిట్టిది"అని మనసున దలంచి ఓర్పు వహించాలి.

8, జూన్ 2013, శనివారం

కుమారీ శతకం - 10

10.  నోరెత్తి మాటలాడకు
మాఱాడకు కోపపడిన మర్యాదలలో
గోరంత తప్పి తిరుగుకు
మీఱకుమీ యత్తపనుల మెలగు కుమారీ! 

భావం:-
ఓ కుమారీ!సలక్షణ యువతి నోరెత్తి మాట్లాడరాదు.కోపము వచ్చిననూ బదులు పలుకరాదు.మర్యాదలను అతిక్రమింపరాదు.అత్తగారు చెప్పు పనులు నిర్వర్తించుట మిక్కిలి శ్రేయస్కరము.కావుననట్లే చరింపుము.


7, జూన్ 2013, శుక్రవారం

కుమారీ శతకం - 9

9. మఱఁదండ్రు వదినె లత్తలు
మఱఁదులు బావల కొమాళ్ళూ మఱి పెద్దలు రా
నురవడిఁ బీటలు మంచము
లరుఁగులు దిగుచుండవలయు నమ్మ కుమారీ!
భావం:-
ఓ కుమారీ!ఇంటికి మఱదళ్ళు,వదినెలు,అత్తమామలు,మఱుదులు, బావలపిల్లలు, పెద్దలు వచ్చినట్లైన గౌరవముతో దిగ్గున మంచము పైనుండి లేవవలెను సుమీ!

6, జూన్ 2013, గురువారం

కుమారీ శతకం - 8


  8. తెచ్చినఁ దేకుండిన నీ
కిచ్చిన నీకున్న మగని నెగాడకు మీ
యొచ్చెము నీపైఁ దేలును
రచ్చల కామాట లెక్కు రవ్వ కుమారీ! 

 భావం:-
ఓ చినదానా!నీ మగడు నీకు బెట్టిననూ, పెట్టకపోయిననూ,తెచ్చిననూ,తేకున్ననూ,అతనిని దూషించుట మిక్కిలి తప్పు.మగని దిట్టుట మగువకు మంచిది కాదు.ఐదవతనము హరించును.అందరిలో అపహాస్యంపాలు కాక దప్పదు.కావున దిట్టక చరించుట మగువల విధి.






5, జూన్ 2013, బుధవారం

కుమారీ శతకం - 7


7. పదములపైఁ జెయివేయక
మదమతి పతిచెంత నిద్ర మరిగినఁ జేతుల్
గదలంగనీక కట్టుచు
గదఁ గొని శిక్షించు యముఁడు కాంక్ష గుమారీ! 

భావం:-
ఓ కుమారీ!పతికి సేవచేయక,ఆయనకాళ్ళు వత్తక,యాతని వద్ద నిద్రించే పత్నుల చేతులను యముడు గట్టిగా కట్టి,గదతోమోది శిక్షిస్తాడు.




4, జూన్ 2013, మంగళవారం

కుమారీ శతకం - 6


6. పరపురుషు లన్న దమ్ములు
వరుఁడే దైవంబు,తోడి పడుచులు వదినెల్
మఱదండ్రు నత్తమామలు
థరఁ దల్లియుఁ దండ్రియనియుఁ దలఁపు కుమారీ! 

భావం:-
ఓ కుమారీ!అన్యులను (ఇతరులను)అన్నదమ్ములుగా భావింపుము. పతియే ప్ర్యత్యక్షదైవమని;తోడికోడళ్ళు,మఱదళ్ళు,అత్తమామలు-వీరంతా తల్లిదండ్రులని తలంపుము. 

3, జూన్ 2013, సోమవారం

కుమారీ శతకం - 5

5. పెనిమిటి వలదని చెప్పిన
పని యెన్నఁడుఁను జేయరాదు బావల కెదుటన్
కనఁబడఁగ రాదు కోపము
మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!
భావం:-
ఓ కుమారీ!భర్త చెప్పిన మాట జవదాటరాదు.ఆయన వద్దని జెప్పిన పనిని ఎన్నడునూ చేయరాదు.బావలకెదురుగా కనబడరాదు.మనస్సునందు,కోపము ఉంచుకొనరాదు.ఎల్లప్పుడు అట్లే మెలుగుము.





2, జూన్ 2013, ఆదివారం

కుమారీ శతకం - 4


4. మగనికి నత్తకు మామకుఁ
దగ సేవ యెనర్చోటఁ దత్పరిచర్యన్
మిగుల నుతిఁ బొందుచుండుట
మగువలకుం బాడి తెలిసి మసులు కుమారీ!

భావం:-
ఓ కుమారీ!మెట్టినింట్లో మగనికి,అత్తమామలకు సపర్యలు జేయుచూ,వారిచే మెప్పుపొందునట్లు స్త్రీలు నడుచుకోవాలి.ఈ విషయము మదినందుంచుకొని మెలుగుము. 

1, జూన్ 2013, శనివారం

కుమారీ శతకం - 3


3. ఆటలఁ బాటలలో నే
మాటయు రాకుండఁ దండ్రి మందిరమందున్
బాటిల్లుఁ గాఁపురములో
వాట మెఱిఁగి బాల!తిరుగ వలయుఁ గుమారీ!

 భావం:-
ఓ కుమారీ!ఆటపాటలయందు ఏ విదమైన పరుషవాక్యములు పలుకక, మాటపడక,పుట్టింట్లో ఉండేటపుడు తల్లిదండ్రులకు మంచిపేరుతెచ్చే విదంగా నడుచుకొనుము.