Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

4, జూన్ 2013, మంగళవారం

కుమారీ శతకం - 6


6. పరపురుషు లన్న దమ్ములు
వరుఁడే దైవంబు,తోడి పడుచులు వదినెల్
మఱదండ్రు నత్తమామలు
థరఁ దల్లియుఁ దండ్రియనియుఁ దలఁపు కుమారీ! 

భావం:-
ఓ కుమారీ!అన్యులను (ఇతరులను)అన్నదమ్ములుగా భావింపుము. పతియే ప్ర్యత్యక్షదైవమని;తోడికోడళ్ళు,మఱదళ్ళు,అత్తమామలు-వీరంతా తల్లిదండ్రులని తలంపుము. 

3, జూన్ 2013, సోమవారం

కుమారీ శతకం - 5

5. పెనిమిటి వలదని చెప్పిన
పని యెన్నఁడుఁను జేయరాదు బావల కెదుటన్
కనఁబడఁగ రాదు కోపము
మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!
భావం:-
ఓ కుమారీ!భర్త చెప్పిన మాట జవదాటరాదు.ఆయన వద్దని జెప్పిన పనిని ఎన్నడునూ చేయరాదు.బావలకెదురుగా కనబడరాదు.మనస్సునందు,కోపము ఉంచుకొనరాదు.ఎల్లప్పుడు అట్లే మెలుగుము.





2, జూన్ 2013, ఆదివారం

కుమారీ శతకం - 4


4. మగనికి నత్తకు మామకుఁ
దగ సేవ యెనర్చోటఁ దత్పరిచర్యన్
మిగుల నుతిఁ బొందుచుండుట
మగువలకుం బాడి తెలిసి మసులు కుమారీ!

భావం:-
ఓ కుమారీ!మెట్టినింట్లో మగనికి,అత్తమామలకు సపర్యలు జేయుచూ,వారిచే మెప్పుపొందునట్లు స్త్రీలు నడుచుకోవాలి.ఈ విషయము మదినందుంచుకొని మెలుగుము. 

1, జూన్ 2013, శనివారం

కుమారీ శతకం - 3


3. ఆటలఁ బాటలలో నే
మాటయు రాకుండఁ దండ్రి మందిరమందున్
బాటిల్లుఁ గాఁపురములో
వాట మెఱిఁగి బాల!తిరుగ వలయుఁ గుమారీ!

 భావం:-
ఓ కుమారీ!ఆటపాటలయందు ఏ విదమైన పరుషవాక్యములు పలుకక, మాటపడక,పుట్టింట్లో ఉండేటపుడు తల్లిదండ్రులకు మంచిపేరుతెచ్చే విదంగా నడుచుకొనుము.


31, మే 2013, శుక్రవారం

కుమారీ శతకం - 2


2. చెప్పెడి బుద్దులలోపలఁ
దప్పకు మొక టైన సర్వ ధర్మములందున్
మెప్పొంది యిహపరంబులఁ
దప్పింతయు లేక మెలగఁ దగును కుమారీ! 
 భావం:-
ఓ కుమారీ!నేను చెప్పునట్టి మంచి గుణములనొక్కటినైనను వదలక ఆచరింపుము.ధర్మయుక్తముగా మెప్పు పొంది ఇహపరదోషమిసుమంతైననూ లేకుండా మసులుకొనుము.నీకు శుభములు కలుగును. 



30, మే 2013, గురువారం

కుమారీ శతకం - 1


1. శ్రీ భూ నీళా హైమవ
భారతు లతుల శుభవ తిగ నెన్ను చు స
త్సౌభాగ్యము నీ కొసఁగఁగ
లో భావించెదరు ధర్మ లోల కుమారీ! 
 ావు:- 

ధర్మపరురాలైన ఓ కుమారీ!శ్రీదేవియు,భూదేవియు,నీళాదేవియు,పార్వతిదేవియు,సరస్వతీదేవియు,నిన్ను మిక్కిలి సుగుణవంతురాలిగా ఎన్నుకొని మంచిముత్తైదవతనమును,మనస్సులందు తమ తమ ఆశీర్వచనములను నీకు ఇచ్చెదరుగాక!

29, మే 2013, బుధవారం

కుమారీ శతకం - పరిచయము - పక్కి వెంకట నరసింహ కవి


కుమారీ శతకం కర్త శ్రీ పక్కి వెంకట నరసింహ కవి. వీరి గురించి వివరములు లభ్యము కాలేదు (ఔత్సాహికులు పంపవచ్చును)
యవ్వన దశలో ఉన్న పడతులకు మార్గ దర్శకముగా చెప్పబడినవి ఈ పద్యాలు. కవి ఈ పద్యములను ఆనాటి పడతులు చదివిన సద్గుణములు, వివాహ సౌఖ్యము, పతిభక్తీ అలవడునట్లు మార్గదర్శకముగా రాసారని చెప్పవచ్చు. పుట్టింటినందు, మెట్టింటినందు ఎలా మసలుకోవాలో తెలియబర్చేవిగా ఉంటాయి. ఈ పద్యముల ఫలశ్రుతిగా పై విషయములను చెప్పుకోవచ్చును.
ఈ పద్యాలకు మకుటం, కుమారీ అన్న పదమే. భాష కొంచం గ్రాంధికంగా, చందోలంకార బద్ధంగా ఉంటుంది. చాలా పద్యాల భావం నేటి కాలం యువతికి మార్గదర్శకంగా ఉంటాయి.

10, ఏప్రిల్ 2013, బుధవారం

5, ఏప్రిల్ 2013, శుక్రవారం

విజ్ఞాన సర్వస్వము - తెలుగు సంస్కృతి

విజ్ఞాన సర్వస్వము - తెలుగు సంస్కృతి
Encyclopedia - Telugu Culture


తెలుగు వారి చరిత్ర, సంస్కృతి,భాష, సాహిత్యాలను గూర్చి వివరించే విజ్ఞాన సర్వస్వము ఇది.




దీన్ని మీరు దిగుమతి చేసుకోవాలి అంటే......

విజ్ఞాన సర్వస్వము - తెలుగు సంస్కృతి
పై నొక్కండి.




DROPBOX లో పుస్తకాలు పెట్టడం వల్ల సులువుగా అన్ని యంత్రాల్లో దిగుమతి చేసుకోవచ్చని అందులో పెడుతున్నాము.
మీకు  DROPBOX లేకుంటే మేము ఇచ్చే లింక్ ద్వారా దిగుమతి చేసుకుని, Instal చేసుకొండి. దానివల్ల మాకు కొంత స్థలం పెరుగుతుంది. మరిన్ని పుస్తకాలు పెట్టడానికి అవకాశం కలుగుతుంది.

Drop box Download ...........       http://db.tt/efW3G2hY

8, మార్చి 2013, శుక్రవారం

నిర్వచన ధర్మపత్ని - పరాక్రిజయ

                                  నిర్వచన  ధర్మపత్ని
                                                                             - పరాక్రిజయ


శ్లో||   కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా
      రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, షట్ధర్మ యుక్తా కుల ధర్మపత్నీ ||

                                   ( స్వేఛ్ఛానువాదం )

     సీ||      సేవలందించు  సంక్షేమ వర్తియై  
                             భావనా స్ఫూర్తితో భవిత  కొ
కు 
              అన్న పూర్ణాంబయై ఆకలి దీర్చుచు
                             రతికామ  రసరాజ్య  రంభయగుచు
              ముగ్ధ మోహన నీదు ముఖవిలాసజూచి
                             రూప లక్ష్మిగ నిన్ను రూఢి గొలుతు
              ఓర్పులో వసుధవై  నేర్పుగా  కూర్మితో
                                  జన్మ సార్ధకతను  చాటినావు

   గీ||        జాతి  జాగృతి పథ సంచార కతన
              గత  చరిత్రలు సాక్షమౌ  గాజులమ్మ
              నీదయా వర్ష సారపు నియమ మిదియె
              ఆరు ధర్మంబులొప్పెడి దాలి యగును   

30, జనవరి 2013, బుధవారం

s.s.c. telugu part - A model paper

extra matiral for 10th class students in all subjects  

"http://apteachers9.blogspot.in/p/10th-class-material.html " 

"http://www.teachersdata.com/search/label/10th%20Class%20Material "





28, జనవరి 2013, సోమవారం

64 కళలు

  1.   ఇతిహాసము
  2.     ఆగమము
  3.     కావ్యము
  4.     అలంకారము
  5.     నాటకము
  6.     గాయకత్వము
  7.     కవిత్వము
  8.     కామశాస్త్రము
  9.     దురోదరము
  10.     దేశ భాషా లిపి జ్ఞానము
  11.     లిపికర్మము
  12.     వాచకము
  13.     అవధానము
  14.     స్వర శాస్త్రము
  15.     శాకునము
  16.     సాముద్రికము
  17.     రత్న శాస్త్రము
  18.     రథాశ్వ గజ కౌశలము
  19.     మల్ల శాస్త్రము
  20.     సూదకర్మము
  21.     దోహదము
  22.     గంధ వాదము
  23.     ధాతు వాదము
  24.     ఖని వాదము
  25.     రస వాదము
  26.     జల వాదము
  27.     అగ్ని స్తంభము
  28.     ఖడ్గ స్తంభము
  29.     వాక్ స్తంభము
  30.     వయ స్తంభము
  31.     వశ్యము
  32.     ఆకర్షణము
  33.     మోహనము
  34.     విద్వేషణము
  35.     ఉచ్చాటనము
  36.     మారణము
  37.     కాల వంచనము
  38.     పరకాయ ప్రవేశము
  39.     పాదుకా సిద్ధి
  40.     వాక్సిద్ధి
  41.     ఐంద్రజాలికము
  42.     అంజనము
  43.     దృష్టి వంచనము
  44.     స్వర వంచనము
  45.     మణి సిద్ధి
  46.     చోరకర్మం
  47.     చిత్ర క్రియ
  48.     లోహ క్రియ
  49.     ఆశ్వ క్రియ
  50.     మృత్క్రియ
  51.     దారు క్రియ
  52.     వేణు క్రియ
  53.     చర్మ క్రియ
  54.     అంబర క్రియ
  55.     అదృశ్య కరణము
  56.     దూతే కరణం
  57.     వాణిజ్యము
  58.     పాశుపాల్యము
  59.     కృషి
  60.     ఆసవ కర్మం
  61.     ప్రాణి ద్యూత కౌశలము
  62.     జలస్తంభము
  63.     మంత్రసిద్ధి
  64.     ఔషధసిద్ధి