![]() |
http://prasthanam.com/sahithivettalu |
బుచ్చిబాబుగా పేరుపడిన ఈయన అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు (1916 - 1967). ఈయన ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడు. ఈయన తెలుగు రచనలలో 'బుచ్చిబాబు' అన్న కలంపేరుతోనూ, ఆంగ్ల రచనలలో 'సంతోష్ కుమార్' అన్న పేరుతోనూ రచనలు చేశారు.
బుచ్చిబాబు జూన్ 14, 1916లో ఏలూరులో సూర్య ప్రకాశరావు మరియు వెంకాయమ్మ దంపతులకు జన్మించాడు. అక్షరాభ్యాసం కంకిపాడులో జరిగింది. పాలకొల్లులో ఎస్.ఎస్.ఎల్.సి.లో ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ మరియు బి.ఏ. పట్టాలు గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదివారు. తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. ఆనర్సులో ఉత్తీర్ణులై, నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఎం.ఏ. పట్టా పొందారు.
ఈయన కొన్నాళ్ళు అనంతపురం మరియు విశాఖపట్నంలలో ఆంగ్ల ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 1945 నుండి 1967లో మరణించేవరకు ఆలిండియా రేడియోలో పనిచేశాడు.
బి.ఏ. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆంధ్ర క్రైస్తవ కళాశాల వార్షిక సాహిత్య సంచికలో (1936) వీరి ప్రప్రథమ రచనలు - 'జువెనిలియా', 'బ్రోకెన్ వయోలిన్' అనే ఆంగ్ల కవితలు, 'పశ్చాత్తాపం లేదు' అనే తెలుగు కథానిక ప్రచురించబడ్డాయి.
ఈయన ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. ఈయన వ్రాసిన చిన్న కథలు సాధారణంగా చాలా పొడవుగా ఉండి, పాత్ర చిత్రణలోనూ, కథ నెరేషన్‌లో విన్నూతమైన శైలి కలిగి ఉంటాయి. బుచ్చిబాబు ఆలోచనా స్రవంతిపై సోమర్‌సెట్ మామ్, ఓ హెన్రీ తదితర ఆంగ్ల రచయితల ప్రభావం మెండుగా కనిపిస్తుంది.[1] కొన్ని నవలలే వ్రాసినా మంచి నవలా రచయితగా కూడా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు రచయితలు, కవులందరూ జాతీయవాదులు, మార్క్సిస్టులు లేదా ఏదో ఒక సంఘసంస్కరణ ఉద్యమానికి చెందిన వారైన కాలంలో అతికొద్ది మంది ఆధునిక అభ్యుదయ రచయితల్లో బుచ్చిబాబు ఒకడు.[2]
వీరు 1967 సంవత్సరంలో పరమపదించారు.
రచనలు
బుచ్చిబాబు మొత్తం మీద సుమారు 82 కథలు, నవల, వచన కావ్యం, 40 వ్యాసాలు, 40 నాటిక-నాటకాలు, పరామర్శ గ్రంథం, స్వీయ చరిత్రకు చెందిన మొదటి భాగం, కొన్ని పీఠికలు, పరిచయాలు - ఇతని లేఖిని నుండి వెలువడ్డాయి. ఈయన రచనలలో అత్యంత పేరు పొందినవి.- చివరకు మిగిలేది (నవల)
- అజ్ఞానం (వచన కావ్యం)
- ఆశావాది
- ఆద్యంతాలు మధ్య రాధ
- నా అంతరంగ కథనం
- షేక్ స్ఫియర్ సాహిత్య పరామర్శ
- మేడమెట్లు (కథా సంపుటి)
ప్రఖ్యాత సందేశాలు
- "ప్రతి తెలుగువాడూ తెలుగుభాషను తన ప్రాణంతో సమానంగా చూసుకుంటాడు. దేనినైనా మార్చుకుంటాడుగానీ మాతృభాష మాత్రం మార్చుకోడు"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి