అడివి బాపిరాజు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
అడివి బాపిరాజు | |
జననం | అక్టోబరు 8, 1895 భీమవరం |
---|---|
మరణం | సెప్టెంబరు 22, 1952 |
ఇతర పేర్లు | బాపిబావ |
వృత్తి | కవి, చిత్రకారుడు, పాత్రికేయుడు, దర్శకుడు |
తండ్రి | కృష్ణయ్య |
తల్లి | సుబ్బమ్మ |
బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పని చేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పని చేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది.
1922లో సహకార నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.
సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించాడు.
విషయ సూచిక
చిత్రకళ
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన శబ్ద బ్రహ్మ అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్‍కూరు మ్యూజియంలో వున్నాయి. 1951లో అప్పటి మద్రాసుప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.రచనలు
నవలలు
- నారాయణరావు
- తుఫాన్
- గోనగన్నారెడ్డి
- కోనంగి
- హిమబిందు (నవల)
- కోణంగి
- అడవి శాంతిశ్రీ
- అంశుమతి
- మధురవాణి
రేడియో నాటికలు
- దుక్కిటెద్దులు
- ఉషాసుందరి
- bhogiraloya ?
ప్రసిద్ధి చెందిన కథలు
- తూలికా నృత్యం
- హంపి శిథిలాలు
- శైలబాల
- వీణ
- నాగలి
- నేలతల్లి
- బొమ్మలరాణి
- సోమసుత
- సూర్యసుత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి