ఆత్రేయ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ఆత్రేయ | |
జన్మ నామం | కిళాంబి వెంకట నరసింహాచార్యులు |
---|---|
జననం | 1921 మే 7 మంగళంపాడు సూళ్ళూరుపేట మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,ఆంధ్రప్రదేశ్ |
మరణం | సెప్టెంబర్,131989 |
నివాసం | చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | ఆత్రేయ |
వృత్తి | కవి, రచయిత నిర్మాత మరియు సినిమా దర్శకుడు |
మతం | బ్రాహ్మణ హిందూ |
తండ్రి | కృష్ణమాచార్యులు |
తల్లి | సీతమ్మ |
విషయ సూచిక
జీవిత సంగ్రహం
1921 మే 7 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', 'ఎన్.జి.వో' నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'కప్పలు' బాగా ప్రాచుర్యమ్ పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం మరియు విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ' మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు. ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబందించిన ప్రస్తావన ఉండటం వలన ఆయన మనసు కవి, మన సుకవి అయ్యాడు. దీక్ష (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారి కథా రచన చేసారు. వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు.చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 13 న స్వర్గస్తులయ్యారు.
ఆత్రేయ పాటలు గురించి
- చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ.. గొల్లుమన్నాము...
చిత్రం : భార్యాబిడ్డలు, గానం : పి.సుశీల, సంగీతం : కె.వి.మహాదేవన్[1]
- నేనొక ప్రేమ పిపాసిని
నా దాహం తీరనిది
నీ హృదయం కదలనిది
తలుపు మూసిన తలవాకిటనే
పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక
అలసి తిరిగి వెళుతున్నా...
చిత్రం : ఇంద్రధనుసు (1970's), గాత్రం : యస్.పి.బాలు, సంగీతం : కె.వి.మహదేవన్[1]
- మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఆ ఒక్కటీ చిక్కెనీ గుప్పిటిలో
హా...
చిత్రం : దాగుడు మూతలు (1964), గాత్రం : ఘంటసాల, పి.సుశీల, సంగీతం : కె.వి.మహదేవన్[1]
- నీవు లేక వీణా పలుకలేనన్నదీ
జాజి పూలు నీకై రోజు రోజు పూచె
చూసి చూసి పాపం సొమ్మసిల్లి పోయె
చిత్రం : డా.చక్రవర్తి (1964) గాత్రం : పి.సుశీల సంగీతం : యస్.రాజేశ్వర్ రావ్[1]
- పులకించని మది పులకించు
అనిపించని ఆశల వించు
మనసునే మరపించు గానం
మనసునే మరపించు...
చిత్రం : పెళ్ళికానుక, గానం : జిక్కి, సంగీతం : ఏ.ఎం.రాజా[1]
ఆత్రేయ గురించి
- రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు ఆత్రేయ. నిర్మాతలను తిప్పుకునేవాడు. రాయక నిర్మాతలనూ రాసి ప్రేక్షకులనూ ఏడిపిస్తాడని ఆయనపై ఓ ఛలోక్తి. కానీ ఆయన ఏమనే వారంటే రాస్తూ నేనెంత ఏడుస్తానో ఎందరికి తెలుసు అనేవారు.
- తన పాటల్లో అత్యున్నత భావాలను పలికించినట్లే, ద్వంద్వార్థాలనూ, చవకబారు అర్థాలనూ ప్రతిఫలించాడు. అంచేత ఆయనను బూత్రేయ అనీ అన్నారు.
- ఒకసారి ఏదో చిత్రానికి పాట రాయవలసివచ్చినప్పుడు చాలా సమయం తీసుకోవడంతో నిర్మాత గొల్లుమన్నాడు. తను ఆ పాట కోసం బస చేసిన హోటల్ పేరు "చోళ" అందుకే "పల్లవి" తట్టడంలేదని చెప్పి వేరే హోటల్ కి మార్పించుకుని వెంటనే ఆ పాటను పూర్తి చేసారు. ఇంతకీ విషయమేమిటంటే చోళులకీ, పల్లవులకీ పడదు. ఇదే విషయాన్ని శ్లేషగా చెప్పారు.
- తెలుగు సినిమా పాటలను మామూలు వాడుక మాటలతోనే రాయగలిగిన ఘనాపాటీ ఆత్రేయ. ఉదాహరణకి, తేనె మనసులు సినిమాలో ఈ రెండు పాటలు "ఏవమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు," "నీ ఎదుట నేను వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు." అలాగే ప్రేమనగర్ సినిమాలో "నేను పుట్టాను ఈలోకం మెచ్చింది,, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది." పాట, మరియు "తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా" పాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా అనంతమే అవుతుంది.
- మరోచరిత్ర సినిమాకి రాసిన పాటలు
ఏ తీగ పువ్వునో...ఏ కొమ్మ తేటినో...
పదహారేల్లకు...నీలో నాలో
బలే బలే మగాడివోయ్ ...నీ అన నీ దానినోయ్...అనే పాటలు ఇప్పటికి శ్రోతలని అలరిస్తూనే వున్నాయి.
- కృష్ణ, శారద లు నటించిన "ఇంద్రధనుస్సు" సినిమాలోని పాట "నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి" అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. ఆయనే ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట నా జీవితానికి సంబంధించిన పాట అని చెప్పారు.
- ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడయ్యుంటాడు. అందుకనే ఆయన రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో. ఇంతకీ మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, డాక్టర్ చక్రవర్తి సినిమాలోని "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి శ్రీశ్రీ గా లబ్ధప్రతిష్టుడైన శ్రీరంగం శ్రీనివాసరావు.
- వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే ...... సినిమాలో "కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిచాన" పాటని శ్రీ.శ్రీ. రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.
- ఆత్రేయ పాటల రచయిత మాత్రమే కాకుండా, అనేక సినిమాలకు మాటల రచయితగా కూడా
ఉన్నారు. ముఖ్యంగా ప్రేమనగర్ సినిమా విజయంలో ఆత్రేయ రాసిన పాటలు, మాటలు
ముఖ్యభూమిక వహించిందంటే అతిశయోక్తి కాదు. అందులో, మచ్చుకు ప్రేమ్ నగర్
సినిమాకు రాసిన మాటలు కొన్ని :
- డోంట్ సే డ్యూటీ. సే బ్యూటీ. బ్యూటీని చెడగొట్టేదే డ్యూటీ.
- నిలకడ కోసం, ఏ మాత్రం నిలకడ లేని వా దగ్గర కొచ్చారా ? (ఇంటర్వ్యూ సన్నివేసం)
- ఇక్కడనుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఇక్కడి వందల వేల ఎకరాల స్ధలం అంతా మాదే. కాని, చివరకు మనిషికి కావలసింది అటు ఆరడుగులు. ఇటు రెండడుగులు.
చిత్ర సమాహారం
సినీ రచయిత
- ముద్దుల మొగుడు (1983) (writer)
- ఎస్.పి.భయంకర్ (1983) (dialogue)
- గుప్పెడు మనసు (1979) (dialogue)
- జీవన తరంగాలు (1973) (screenplay and dialogue)
- కన్నెమనసులు (1966) (screen adaptation)
- డాక్టర్ చక్రవర్తి (1964) (dialogue and screen adaptation)
- మురళీకృష్ణ (1964) (dialogue)
- వెలుగు నీడలు (1964) (writer)
- మూగ మనసులు (1963) (writer)
- వాగ్దానం (1961) (screenplay and dialogue)
- పెళ్ళి కానుక (1960) (dialogue)
- శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (1960) (adaptation) (dialogue)
- జయభేరి (1959) (story and dialogue)
- మాంగల్య బలం (1958) (dialogue)
- తోడి కోడళ్ళు (1957) (adaptation) (dialogue)
- అర్ధాంగి (1955) (writer)
- గుమస్తా (1953/II) (dialogue) (story)
- కన్నతల్లి (1953) (writer)
నిర్మాత:దర్శకుడు
- వాగ్దానం (1961)
ఆత్రేయ రచనలు, అయన పాటలతో కూడిన పుస్తకాలు
- మనసు గతి ఇంతే (2007)
పుస్తకం పేరు | రచయిత పేరు | ప్రచురణ మరియు ఇతర వివరాలు |
---|---|---|
cell | ఆత్రేయ పాటలని 2007 వ సంవత్సరంలో ఒక పుస్తక రూపంలో [2] విడుదల చేసారు.ఎవికేఎఫ్.ఆర్గ్ వెబ్సైట్ నుండి ఆన్ లైన్ ద్వారా కొనవచ్చు.లింకు | |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి