అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !

Wednesday, May 2, 2012

కృష్ణ శతకము                                కృష్ణ శతకము


అక్రూర వరద, మాధవ,
చక్రాయుధ, ఖడ్గపాణి, శార్‌ఙ్గి (శౌరి), ముకుందా,
శక్రాది దివిజ సన్నుత,
శుక్రార్చిత నన్నుఁ గరుణఁ జూడుము కృష్ణా! |క|కుంభీంద్ర వరద, కేశవ,
జంభాసురవైరి, దివిజ సన్నుత చరితా,
యంభోజనేత్ర, జలనిధి
గంభీరుడ, నన్నుఁ గావు కరుణను కృష్ణా! |క|చుక్కల నెన్నగ వచ్చును,
గ్రక్కున భూ రేణువులను గణుతింపనగున్,
జొక్కపు నీ గుణజాలము
నక్కజమగు లెక్క పెట్ట నజునకు కృష్ణా! |క|దండమయా విశ్వంభర!
దండమయా పుండరీకదళ నేత్ర హరీ!
దండమయా కరుణానిధి!
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా! |క|దివిజేంద్ర సుతుని జంపియు
రవి సుతు రక్షించినావు రఘురాముఁడవై;
దివిజేంద్ర సుతుని గాచియు
రవి సుతుఁ బరిమార్చి తౌర రణమున కృష్ణా! |క|దిక్కెవ్వరు ప్రహ్లాదుకు,
దిక్కెవ్వరు పాండుసుతుల, దీనుల కెపుడున్
దిక్కెవ్వర య్యహల్యకు
దిక్కెవ్వరు, నీవె నాకు దిక్కవు కృష్ణా! |క|నారాయణ, పరమేశ్వర,
ధారాధర, నీలదేహ, దానవవైరీ,
క్షీరాబ్ధిశయన, యదుకుల
వీరా, ననుగావు కరుణవెలయగ కృష్ణా! |క|నారాయణ లక్ష్మీపతి!
నారాయణ వాసుదేవ, నందకుమారా!
నారాయణ నిను నమ్మితి,
నారాయణ నన్నుఁ బ్రోవు నగధర కృష్ణా! |క|నీవే తల్లివి, తండ్రివి,
నీవే నా తోడు నీడ, నీవే సఖుడౌ,
నీవే గురుడవు, దైవము,
నీవే నా పతియు, గతియు నిజముగ కృష్ణా! |క|మడుగుకుఁజని కాళింగుని
పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయం
గడు వేడుకతో నాడెడు
నడుగులు నేమదిని దాల్తు నచ్యుత కృష్ణా! |క|హరి ! నీవే దిక్కు నాకును!
సిరితో యేతెంచి మకరి శిక్షించి దయన్
పరమేష్ఠి, సురలు బొగడఁగఁ,
గరిఁ గాచిన రీతి నన్నుఁ గావుము కృష్ణా! |క|హరియను రెండక్షరములు
హరియించును పాతకంబు లంబుజనాభా,
హరి నీ నామ మహత్వము,
హరి హరి, పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా! |క|
No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...