Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

29, అక్టోబర్ 2014, బుధవారం

తెలుగు కవులు - జ్వాలాముఖి



వికీపీడియా నుండి
వీరవెల్లి రాఘవాచార్య
Jwalamukhi.jpg
జ్వాలాముఖి
జననం వీరవెల్లి రాఘవాచార్య
1938 ఏప్రిల్ 12
మెదక్ జిల్లా ఆకారం
మరణం 14 డిసెంబరు 2008
మరణ కారణము కాలేయ వ్యాధి, గుండెపోటు
ఇతర పేర్లు జ్వాలాముఖి
వృత్తి విరసం సభ్యుడు
ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో
సుపరిచితుడు ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు
భార్య / భర్త యామిని
జ్వాలాముఖి ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకడు. విరసం సభ్యుడు. శరత్ జీవిత చరిత్రను 'దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు' పేరుతో హిందీ నుంచి అనువదించాడు.

వ్యక్తిగత జీవితం

మెదక్ జిల్లా ఆకారం గ్రామంలో 1938 ఏప్రిల్ 12 న జన్మించిన ఆయన అసలు పేరు వీరవెల్లి రాఘవాచార్య. తల్లిదండ్రులు నరసింహాచార్యులు, వెంకటలక్ష్మీనర్సమ్మ. హైదరాబాద్‌లోని మల్లేపల్లి, నిజాం కళాశాలలో విద్యాభాస్యాన్ని పూర్తి చేసుకున్న ఆయన నిజాం కళాశాలలో ఎల్.ఎల్‌.బీ. పూర్తిచేశాడు. ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో 12 ఏళ్లు విధులు నిర్వహించాడు. తరువాత హైదరాబాద్‌లోని ఎల్.ఎన్‌.గుప్తా సైన్స్, కామర్స్ కళాశాలలో24 ఏళ్లు అధ్యాపకుడిగా పనిచేసి 1996లో పదవీ విరమణ చేశాడు. మొదట్లో నాస్తికవాదం, పిదప మానవతా వాదం, అనంతరం మార్కిస్టు ఆలోచన విధానం వైపు మొగ్గు చూపాడు. 1958లో 'మనిషి' దీర్ఘకవితకు గుంటూరు రచయితల సంఘంవారు కరుణశ్రీ చేతులమీదుగా ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందజేశారు. 1965-70 మధ్య దిగంబర కవుల పేరుతో కవితా సంపుటాలు రాశాడు. ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (ఓ.పీ.డీ.ఆర్) సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు సార్లు చైనాకు వెళ్లారు. 1971లో విరసం సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద నిఖిలేశ్వర్, చెరబండరాజులతో ముషీరాబాద్ జైల్లో యాభై రోజులున్నాడు.[1] 1975 ఎమర్జెన్సీ కాలంలో 15 రోజులు జైల్లో ఉన్నారు. ఈయన పై మఖ్దూం మొహియుద్దీన్ ప్రభావం ఉంది. 14 డిసెంబరు 2008 న కాలేయ వ్యాధి, గుండెపోటుతో మరణించాడు.

జ్వాలాముఖి రచనలు

  • 'వేలాడిన మందారం' నవల
  • హైదరా'బాధ'లు
  • 'ఓటమి తిరుగుబాటు' కవితా సంకలనం
  • 'రాంగేయ రాఘవ' జీవిత చరిత్ర హిందీ నుంచి తెలుగు అనువాదం

జ్వాలాముఖి గురించి నిఖిలేశ్వర్

కాలేజీలో జరిగే డిబేటింగ్ లో విద్యార్థుల మధ్య వాగ్వివాదాలలో జ్వాలాముఖి ఆవేశంగా మాట్లాడేవాడు. నేనేమో తడబడుతూ గందరగోళంలో పడిపోయేవాణ్ణి! 1960లలో జ్వాల ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటలకే సైకిల్‌పై బయలుదేరి మల్లేపల్లిలోని సీతారామ్ దేవాలయం నుంచి దాదాపు పదిహేను మైళ్లు ప్రయాణం చేసి సెంటర్‌కు చెమటలు కక్కుతూ ఎనిమిది గంటలకల్లా మారేడ్‌పల్లిలోని ఏ.ఓ.సి స్కూల్ కు చేరేవాడు. నేనేమో ముషీరాబాద్ నుంచి సైకిల్ తొక్కుతూ రోజు 10 మైళ్లు అదే అవస్థలో ఉద్యోగానికి హాజర్! నా ప్రేమ వివాహం 1963లో! కులాంతర వివాహం, పైగా అమ్మాయి ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది.. ఇక ఆ రహస్య వివాహానికి జ్వాలాముఖి అన్నివిధాలా తోడ్పడి యాకుత్‌పురాలోని ఆర్యసమాజ్ మందిర్‌లో వివాహం జరిపించాడు. విజయవాడ దాకా తోడు వచ్చి నన్ను-యామినిని బెంగుళూర్ హానిమూన్‌కు పంపించేసాడు. ఆ తర్వాత మా కుటుంబాల ఆత్మీయ సంబంధాలు ఎంతో ఆప్యాయంగా సాగిపోయిన దశలోనే మా పిల్లల కులాంతర వివాహాలకు ఆయన నిర్వాహకుడు. ఆయన పిల్లల కులాంతర- మతాంతర వివాహాలకు నేను నిర్వాహకుడిగా..! మమ్మల్ని కాలేజీ ఉపన్యాసాలకు పిలిస్తే బాంబులతో వస్తారని ఆర్ఎస్ఎస్ అనుయాయులు (ఎబివిపి) కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసారు. అప్పుడు జ్వాల ప్రిన్సిపాల్ సమక్షంలోనే తనదైన శైలిలో ప్రసంగిస్తూ జేబుల్లోంచి కవితలు తీస్తూ, మేము బాంబులతో వస్తే పరిణామాలు మరో విధంగా వుండేవని చమత్కరించాడు. సభలు-సమావేశాలు- ఉపన్యాసాల మూలంగా తన పుస్తక ప్రచురణను నిర్లక్ష్యం చేసాడు. 1971లో వచ్చిన 'ఓటమి తిరుగుబాటు' తర్వాత మళ్లీ మరో సంపుటిని ప్రచురించలేదు. 'వేలాడిన మందారం' నవల, హైదరాబాద్ కథలు వున్నాయి. ఆయన నిశిత వివేచనతో రాసిన సాహిత్య వ్యాసాలు సంపుటిగా రావలసి వుంది.స్నేహశీలీ, ఆర్ద్ర హృదయుడు, భోజన ప్రియుడు, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిస్పందించిన సాహితీవేత్త. సభలు - సమావేశాలు - ఉపన్యాసాల మూలంగా తన పుస్తక ప్రచురణను నిర్లక్ష్యం చేసాడు.

ఉత్ప్రేరక జ్వాలాముఖి కి అక్షర నివాళులు

స్వతహాగా తీవ్రంగా స్పందించే గుణదాముడు. కవి పండితుడిగా ఎదిగిన క్రమంలో దిగంబర కవుల్లో' దిట్ట. విరసం వ్యవస్థాపక సభ్యుల్లో విశిష్టునిగా పేరు పొందాడు. జీవనానికి తొలినాళ్ళలో స్టోర్స్ పర్చేజ్ అండ్ స్టేషనరీ డిపార్ట్ మెంటులో అతి కొద్దికాలం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసాడు. ఆ మీదట ఉపాధ్యాయునిగా, కాలేజీలో ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే ఉద్యోగ క్రాంతి అనే పత్రిక వ్యవస్థాపక సభ్యులకు సమకాలికంగా ఉద్యోగుల ఉద్యమాల్లో పాల్గొన్న ఐక్యవిప్లవోద్యమాభిలాషి.
"బాల్యానికి రక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వార్ధక్యానికి పరిరక్షణ కల్పించగల వ్యవస్తే సోషలిస్టు సమాజం" అని విశదీకరించేవాడు. కిటికీలు, తలుపులు, బార్లాగా తెరిచి వుంచిన ఇంట్లోకి చేరిన దుమ్ము, ధూళిని చీపురుతో చిమ్మి ఆరోగ్యాన్ని కాపాడుకున్న క్రమంగా చైనా తియాన్‌మీన్ స్క్వేర్ ఘటనను అభివర్ణించాడు. ఒక నాస్తికుడిగా, మార్క్సిస్ట్ మేధావిగా, 'ప్రత్యామ్నాయ సంస్కృతి'ని అభివృద్ధి చేయడానికి గాను, హైదరాబాదు వంటి నగరంలో "ప్రత్యామ్నాయ సాంస్కృతిక కేంద్రం" ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి పలుమార్లు మిత్రులతో చెప్పుతుండేవాడు.

జ్వాలాముఖి పై మార్క్సిస్టుల విమర్శలు

జ్వాలాముఖి 1975 వరకు విప్లవ రచయితల సంఘంలో పనిచేశాడు. ఆ తరువాత ఆయన విరసం నుంచి బయటకి వచ్చి జన సాహితి సంస్థలో చేరాడు. నాస్తికులలో ఎక్కువ మందికి మార్క్సిస్ట్ గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రాలు తెలియవు. కనుక జన సాహితి సంస్థ సభ్యులు నాస్తిక హేతువాద సంఘాలకి దూరంగా ఉండాలని జనసాహితి సంస్థ తీర్మానించింది. మొదట జ్వాలాముఖి అందుకు అంగీకరించాడు కానీ తరువాత జ్వాలాముఖి నాస్తిక హేతువాద కార్యక్రమాలకు వెళ్ళి నాస్తిక ఉద్యమాన్ని పొగడడం విమర్శలకి దారి తీసింది. [2] జ్వాలాముఖిని విమర్శిస్తూ రంగనాయకమ్మ రెండు పుస్తకాలలో వ్యాసాలు వ్రాసారు. ఈ ఉద్యమాలలో మార్క్సిస్ట్ వ్యతిరేక స్వభావం కూడా ఉందని రంగనాయకమ్మ వాదన. స్త్రీవాద వివాదాలు పుస్తకంలో కూడా జ్వాలాముఖి పై ఇతర మార్క్సిస్టులు చేసిన విమర్శలు ప్రచురితమయ్యాయి.

అవార్డులు

  • ఝాన్సీ హేతువాద మెమోరియల్ అవార్డు
  • దాశరథి రంగాచార్య పురస్కారం
  • హిందీలో వేమూరి ఆంజనేయ శర్మ అవార్డు

28, సెప్టెంబర్ 2014, ఆదివారం

తెలుగు కవులు - ఇల్లెందుల సరస్వతిదేవి



ఇల్లిందల సరస్వతీదేవి

వికీపీడియా నుండి
ఇల్లిందల సరస్వతీదేవి(1918-1998) ప్రముఖ తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రి.

వ్యక్తిగత జీవితం

ఇల్లిందల సరస్వతీదేవి 1918లో జన్మించారు. ఆమెకి చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యవృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో ఆమె మెట్టినింట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.

రచన రంగం

ఇల్లిందల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలు రచించారు. దరిజేరిన ప్రాణులు, ముత్యాల మనసు మొదలైన 5 వ్యాససంపుటాలు, జీవితచరిత్రలు రచించారు. బాలసాహిత్యకారిణిగా నాటికలు, రేడియో నాటికలు రచన చేశారు. కృష్ణాపత్రికలో ఇయంగేహేలక్ష్మీ, ఆంధ్రపత్రికలో వనితాలోకం శీర్షికలు నిర్వహించారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు. స్వర్ణకమలాలు, తులసీదళాలు, రాజహంసలు వంటి కథాసంకలనాలు వెలువరించారు.[1]

సామాజికరంగం

తెలుగు మహిళల కోసం 1934లో యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి 1934లో హైదరాబాదులో ఆంధ్ర యువతి మండలిని స్థాపించి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు మూడేళ్ళపాటు జైలు విజిటరుగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర సినిమా అవార్డు కమిటీల్లో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

పురస్కారాలు, గౌరవాలు

మూలాలు

  1. సామాజిక సాహిత్యవేత్త:తె.వె.బృందం:తెలుగు వెలుగు:మార్చి 2014:పే.22,23

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

తెలుగు కవులు - గుర్రం జాషువా





జాషువా

వికీపీడియా నుండి
(గుర్రం జాషువా నుండి దారిమార్పు చెందింది)
గుర్రం జాషువా
Jashuva.jpg
గుర్రం జాషువా
జననం 1895 సెప్టెంబర్ 28
గుంటూరు జిల్లా వినుకొండ
మరణం 1971 జూలై 24
గుంటూరు
నివాస ప్రాంతం గుంటూరు జిల్లా వినుకొండ
ఇతర పేర్లు జాషువా
వృత్తి రచయిత
కవి
సాహితీకారుడు
సాధించిన విజయాలు నవయుగ కవి చక్రవర్తి
మతం హిందూ
జాషువా
గబ్బిలము పుస్తకము పై పేజి
ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (1895 - 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

జీవిత విశేషాలు

జాషువా 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ లో జన్మించాడు.యాదవ తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ, ఈ ఒక్క విషయం చాలు, మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు..

అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పని చేసాడు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసాడు. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడు.
ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభ లోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే. అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు.
జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి లో సభ్యత్వం లభించింది. 1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించాడు. [1].

సాహితీ వ్యవసాయం

చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడూ, తరువాతి కాలంలో రచయితా అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం,రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు. వాటిలో ప్రముఖమైనవి:
గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.
1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.
1948 లో రాసిన బాపూజీ - మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి.
సంవత్సరాల వారీగా జాషువా రచనల జాబితా
  • 1919 - రుక్మిణీ కళ్యాణం
  • 1922 - చిదానంద ప్రభాతం, కుశలవోపాఖ్యానం
  • 1924 - కోకిల
  • 1925 - ధ్రువ విజయం, కృష్ణనాడి, సంసార సాగరం
  • 1926 - శివాజీ ప్రబంధం, వీరాబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారతమాత
  • 1927 - భారత వీరుడు, సూర్యోదయం, చంద్రోదయం, గిజిగాడు
  • 1928 - రణచ్యుతి, ఆంధ్రుడను, తుమ్మెద పెండ్లికొడుకు
  • 1929 - సఖి, బుద్ధుడు, తెలుగు తల్లి, శిశువు, బాష్ప సందేశం
  • 1930 - దీర్ఘ నిశ్వాసము, ప్రబోధము, శిల్పి, హెచ్చరిక, సాలీడు, మాతృప్రేమ
  • 1931 - భీష్ముడు, యుగంధర మంత్రి, సమదృష్టి, నేల బాలుడు, నెమలి నెలత, లోక బాంధవుడు, అనసూయ, శల్య సారథ్యము, సందేహ డోల
  • 1932 - స్వప్న కథ, అనాధ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, సింధూరము, బుద్ధ మహిమ, క్రీస్తు, గుంటూరు సీమ, వివేకానంద, చీట్లపేక, జేబున్నీసా, పశ్చాత్తాపం.
  • 1933 - అయోమయము, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, స్మశానవాటిక,
  • 1934 - ఆంధ్ర భోజుడు
  • 1941 - గబ్బిలము
  • 1945 - కాందిశీకుడు
  • 1946 - తెరచాటు
  • 1948 - చిన్న నాయకుడు, బాపూజీ, నేతాజీ
  • 1950 - స్వయంవరం
  • 1957 - కొత్తలోకం
  • 1958 - క్రీస్తు చరిత్ర
  • 1963 - రాష్ట్ర పూజ, ముసాఫిరులు
  • 1966 - నాగార్జునసాగరం, నా కథ
అవార్డులు
  • 1964లో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
  • 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నియమితుడయ్యాడు.
  • 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
  • 1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం అందజేసింది.

గుఱ్ఱం జాషువా చిత్రపటం

చెణుకులు

ఒకసారి జాషువాకు, మరో ప్రముఖ కవికి కలిపి ఒక సాహిత్య బహుమతి ఇవ్వడం జరిగింది. జాషువా అంటే అంతగా పడని ఆ కవి "గుర్రాన్నీ గాడిదనీ ఒకే గాట కట్టేశారు" అని అన్నాడు. అప్పుడు గుర్రం జాషువా "నిజమే, ఈ ఒక్కసారికి మాత్రం ఆయనతో ఏకీభవించకుండా ఉండలేకపోతున్నాను. నేను గుర్రాన్ని, మరి ఆయన ఏమిటో ఆయనే చెప్పాలి" అని అన్నాడు.
ఈ పద్యంలో కవిలోకానికి జాషువా సనముచిత స్థానం కల్పించేరు.
"రాజు మరణించెనొక తార రాలిపోయె సుకవి మరణిమంచెనొక తార గగనమెక్కె రాజు జీవించు రాతివిగ్రహములయందు సుకవి జీవించు ప్రజల నాల్కలయందు"

బిరుదులూ, పురస్కారాలూ

జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు.
ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు. పద్మభూషణ [2], ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, క్రీస్తుచరితకు 1964 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు [3],1970 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.

పుస్తకాలు

1వ సంపుటం: గబ్బిలం
2వ సంపుటం: స్వప్నకథ, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, బాపూజీ, నేతాజీ
3వ సంపుటం : స్వయంవరం, కొత్తలోకం, ,క్రీస్తు చరిత్ర, ముసాఫరులు, నా కథ రెండు భాగాలు, నాగార్జునసాగర్
4వ సంపుటం : ఖండకావ్యాలు
  • సలుపజాలినదీ నా సత్యవాణి (కవితలు)

జాషువా పై పరిశోధనలు

ఎండ్లూరి సుధాకర్ జాషువా సాహిత్యం దృక్పథం-పరిణామం అనే గ్రంథాన్ని రాశారు.

జాషువా స్మతిచిహ్మంగా పురస్కారాలు

జాషువా కుమార్తె హేమలతా లవణం నెలకొల్పిన జాషువా ఫౌండేషన్ ద్వారా భారతీయ భాషలలో మానవవిలువలతోకూడిన రచనలు చేసిన సాహిత్యకారులకు జాషువా సాహిత్య పురస్కారం అందజేయబడుతున్నది. 2002 లో ఏడవ సంచికగా స్సామీ కవి నిల్మనీ ఫుఖాన్ కు పురస్కారమివ్వబడింది. [4]
28 సెప్టెంబరు 2013 న తెలుగు అకాడమీ జాషువా పురస్కారాల సమావేశం
తెలుగు అకాడమీ లో జాషువా పరిశోధనాకేంద్రం కవులకు రచయితలకు మూడు పురస్కారాలు సెప్టెంబరు 28, 2013 న (118 వ జన్మతిథి రోజున) అందజేసింది. ఈ పురస్కారం 2 లక్షల రూపాయాల నగదు, శాలువా, ప్రశంసాపత్రంతో కూడుకున్నది. దాశరధి రంగాచార్య కు జాషువా జీవిత సాఫల్య పురస్కారము మరియు కొలకలూరి స్వరూప రాణికి జాషువా విశిష్ట మహిళా పురస్కారము బహుకరించారు. దళిత సాహిత్యములో విశేష కృషిచేసినందులకు కాలువమల్లయ్యకు జాషువా సాహిత్య విశిష్ట పురస్కారము బహుకరించారు. [5][6][7]

వనరులు

బయటి లింకులు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.


25, సెప్టెంబర్ 2014, గురువారం

తెలుగు కవులు - గురజాడ అప్పారావు



గురజాడ అప్పారావు

వికీపీడియా నుండి
గురజాడ అప్పారావు
Gurajada Apparao.JPG
గురజాడ అప్పారావు
జననం 1862 సెప్టెంబర్ 21
విశాఖపట్నం జిల్లా ,ఎలమంచిలి తాలూకా, రాయవరం (ఎలమంచిలి) గ్రామం
మరణం 1915 నవంబర్ 30
నివాస ప్రాంతం విశాఖపట్నం జిల్లా ,ఎలమంచిలి తాలూకా, రాయవరం (ఎలమంచిలి) గ్రామం
వృత్తి రచయిత
సంఘ సంస్కర్త
సాహితీకారుడు
హేతువాది
అభ్యుదయ కవి
సుపరిచితుడు గురజాడ కన్యాశుల్కం
సాధించిన విజయాలు తెలుగు భాష మహా కవి
మతం హిందూ
భార్య / భర్త నరసమ్మ
పిల్లలు ఓలేటి లక్ష్మి నరసమ్మ
వెంకట రామదాసు
పులిగెడ్డ కొండయ్యమ్మ
ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను పునర్లిఖిస్తుందీ
- గురజాడ అప్పారావు
తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌
గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
గురజాడ అప్పారావు గారు (1862-1915) తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు.గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.
వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలోముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు.

బాల్యం-విద్యాభ్యాసం

విశాఖ జిల్లా, ఎలమంచిలిలో, మేనమామ ఇంట్లో సెప్టెంబరు21, 1862 న, వెంకట రామదాసు మరియు కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. వీరికి శ్యామల రావు అనే తమ్ముడు ఉన్నారు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది.. అప్పారావు గారి తండ్రిగారు విజయనగరం సంస్థానంలో పెష్కారుగా, రెవిన్యూ సూపర్వసరు మరియు ఖిలేదారు గాను పనిచేసారు. తన పదవ ఏట వరకు అప్పారావు గారు చీపురుపల్లి లో చదువుకున్నారు. తర్వాత, వారి తండ్రిగారు కాలం చెయ్యటంతో, విజయనగరంకి వచ్చారు. ఇక్కడ చాల పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో ఏం. ఆర్. కాలేజి, అప్పటిప్రిన్సిపాల్ సి. చంద్రశేఖర శాస్త్రి గారు ఈయనను చేరదీసి ఉండడానికి చోటిచ్చారు. 1882 లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884 లో ఎఫ్. ఎ చేసారు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. హై స్కూలులో టీచరు గా చేరారు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.

వివాహం-సంతానం

1885 లో అప్పారావు గారు అప్పల నరసమ్మగారిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు. 1887 లో సంవత్సరంలో మొదటి కుమార్తె ఓలేటి లక్ష్మి నరసమ్మ పుట్టారు. 1890 లో కుమారుడు వెంకట రామదాసు, 1902లో రెండవ కుమార్తె పులిగెడ్డ కొండయ్యమ్మ జన్మించారు.

ఉద్యోగాలు

అప్పటి కళింగ రాజ్యం గా పేరుపొందిన విజయనగరంలోనే అప్పారావుగారు ఉండడం జరిగింది. విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో మంచి సంబంధాలు ఉండేవి. 1887 లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వీరు మొదట ప్రసంగించారు. ఇదే సమయంలో సాన్గిక సేవకై "విశాఖ వలంటరి సర్వీసు" లో చేరారు. 1889 లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు వైస్ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు.
ఇదే సమయంలో తమ్ముడు శ్యామల రావు తో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాసారు. వీరు రాసిన ఆంగ్ల పద్యం "సారంగధర" "ఇండియన్ లీషర్ అవర్" లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అప్పుడే కలకత్తా లో ఉన్న "రీస్ అండ్ రోయిట్" ప్రచురణకర్త శ్రీ శంభుచంద్ర ముఖర్జీ విని, అప్పారావు గారిని తెలుగులో రచన చేయడానికి ప్రోత్సహించారు. ఆంగ్లంలో యెంత గొప్పగా వ్రాసినా అది పరభాషేనని, తన మాతృ భాషలో వారు ఇంకా గొప్పగా వ్రాయగలరనిఅన్నారు. గుండుకుర్తి వెంకట రమణయ్యగారు, "ఇండియన్ లీషర్ అవర్"ఎడిటరు కూడా అతనిని ఇదే త్రోవలో ప్రోత్సహించారు. 1891 లో విజయనగర సంస్థానంలో సంస్థానశాసనపరిశోధకునిగా నియామకం పొందారు.
1897లో మహారాజ ఆనంద గజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు, రీవా మహారాణి, అప్పల కొండమాంబ గారికి వ్యక్తిగత కార్యదర్శిగా నియమితులయ్యారు.
1884 లో మహారాజ కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1886 లో డిప్యూటీ కలెక్టరు ఆఫీసులో హెడ్‌ క్లర్కు పదవినీ, 1887 లో కళాశాల లో అధ్యాపక పదవిని నిర్వహించారు. 1886 లో రాజా వారి ఆస్థానంలో చేరారు. 1911 లో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ లో సభ్యత్వం లభించింది.

కన్యాశుల్కం

గిడుగు రామమూర్తి తో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు (ఖచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892 లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చాడు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909 లో రచించాడు.
1892 లో గురజాడ వారి "కన్యాశుల్కం" నాటిక వేయబడింది. అది మొదటి సారే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రజోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. ఈ నాటకం సాంఘిక ఉపయోగం తో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడచ్చని నిరూపించింది. దీని విజయంతో , అప్పారావు గారు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెదకసాగారు. ఈ సరళికి అతని చిన్ననాటి స్నేహితుడు చీపురుపల్లిలో తన సహాధ్యాయి అయిన గిడుగు రామమూర్తి గారు ముఖ్యులు. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రసంసించడంతో అప్పారావు గారికి ఎంతో పేరు వచ్చింది.1896 లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టారు. 1897 లో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ , మద్రాసు వారు ప్రచురించారు. ఇది అప్పారావు గారు - మహారాజ ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు. 1909 ఆరోగ్యం కుదుట పడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో "కన్యాశుల్కం" తిరిగి వ్రాసారు. 1910 లో "దేశమును ప్రేమించుమన్నా" అన దేశ భక్తీ గీతాన్ని వ్రాసారు, ఇది ఎంతో పేరు పొందింది. 1911 లో మద్రాస్ విశ్వవిద్యాలయం "బోర్డు అఫ్ స్టడీస్" లో నియమించబడ్డారు . అదే సంవత్సరంలో, స్నేహితులతో కలిసి "ఆంధ్ర సాహిత్యపరిషత్తు" ప్రారంభించారు.

అస్తమయం

1913 లో అప్పారావు గారు పదవీ విరమణ చేసారు. అప్పటినుండి అనారోగ్యంతో బాధపడేవారు. ఇదే సమయంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు "ఫెలో" తో గౌరవించారు. చివరికి, 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గరజాడ అప్పారావు మరణించాడు.

సాహితీ చరిత్ర

కన్యాశుల్కం

గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం (నాటకం)
గురజాడ రచనల్లో కన్యాశుల్కం (నాటకం) అగ్రగణ్యమైనది. కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన ఉత్తమోత్తమమైన రచనలలో ఒకటి. 1892 లో ప్రచురించిన మొదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1909 లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది.

గురజాడ మరణం తరువాత కన్యాశుల్కం పై ఎన్నో వివాదాలు రేగాయి. అది అసలు ఆయన రాయనేలేదనీ, వేరెవరో రాస్తే, తన పేరు వేసుకున్నారని ఒకటి; ఆయన ఇంగ్లీషులో రాస్తే, వేరే ఒకాయన దానిని తెలుగు లోకి అనువదించారని మరొకటి, ఇలాగ కొన్ని వివాదాలు రేగాయి. చివరికి ఆ వాదనలన్నీ అసత్యాలని తేలిపోయాయి. ఈ వివాదాలన్నీ గురజాడ మరణం తరువాత వచ్చినవే. ఇన్ని వివాదాల మధ్యా కన్యాశుల్కం కొన్ని వందల ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న మొదటి తెలుగు సాంఘిక నాటకమదే!
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా అనే సుప్రసిధ్ద గేయం ఆయన రచనల్లో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కం దురాచారమే.
కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యంలోని చివరి పద్యం ఇది:
కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్‌
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా

దేశమును ప్రేమించుమన్నా

ఆయన రాసిన ప్రముఖ గేయం లోని ఒక భాగం ఇది:
పూర్తి గేయాన్ని కూడా చదవండి.
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్
గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌

ఇతర రచనలు

కన్యాశుల్కం కర్తృత్వం పై వివాదం

1955 మార్చి 13 న (అప్పారావు మరణించిన దాదాపు 40 ఏళ్ళ తరువాత) జయంతి కుమారస్వామి ఆంధ్ర పత్రికలో రాసిన ఒక వ్యాసంతో ఒక పెద్ద వివాదం చెలరేగింది. పూర్తి వివరాలను కన్యాశుల్కం (నాటకం) పేజీలో చూడండి.

ఎవరెవరు ఏమన్నారు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
  • "కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహితంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు" - శ్రీశ్రీ
  • "కన్యాశుల్కం బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం"-శ్రీ శ్రీ
  • "కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ" - శ్రీశ్రీ
  • "గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించాడు" - దేవులపల్లి కృష్ణశాస్త్రి

20, సెప్టెంబర్ 2014, శనివారం

తెలుగు కవులు - గుంటూరు శేషేంద్రశర్మ



వికీపీడియా నుండి
(గుంటూరు శేషేంద్రశర్మ నుండి దారిమార్పు చెందింది)
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra.jpg
గుంటూరు శేషేంద్ర శర్మ
జననం అక్టోబర్ 20, 1927
నాగరాజుపాడు, నెల్లూరుజిల్లా
మరణం మే 30, 2007
హైదరాబాదు
భార్య/భర్త జానకి [1]
సంతానం వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
జన బాహుళ్యంలో శేషేంద్ర గా సుపరిచుతులైన గుంటూరు శేషేంద్రశర్మ, ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు.ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి.[2] "నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది.

విద్యార్హతలు: బి.ఎ, బి.ఎల్
ఉద్యోగం: పురపాలక శాఖలో కమిషనర్ గా, జనవాణి పత్రికలో పాత్రికేయుడిగా

రచనలు

అవార్డులు

  • 1993 - సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం
  • 1999 -సాహిత్య అకాడమీ అవార్డు
  • రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం
  • 1994 - తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్

మరణం

శేషేంద్రశర్మ మే 30, 2007వ తేదీ రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు. కడసారి దర్శించేందుకు వీలుగా శేషేంద్ర భౌతిక కాయాన్ని ఆయన నివాసమైన పాన్‌మండీలోని ధన్రాజ్‌గిరి ప్యాలెస్‌లో ఉంచారు. ఆయన భౌతిక కాయానికి మే 31న అంబర్‌పేట శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవం వందనం సమర్పించారు. శేషేంద్ర కుమారుడు సాత్యకి చితికి నిప్పటించాడు. ఈ కార్యక్రమానికి అనేకమంది సాహితీప్రియులు, అధికారులు, రాజకీయవేత్తలు, సామాజిక సేవాసంస్థల ప్రతినిధులు హాజరైనారు. శేషేంద్ర మొదటి భార్యద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. .[3]

విశేషాలు

శేషేంద్ర శర్మ, 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ముత్యాలముగ్గులో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాట రాశాడు[1]. ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞానబాగ్ పాలెస్ లో చిత్రీకరించబడింది. ఇది ఈయన సినిమాలకోసం రాసిన ఒకేఒక్క పాట.

మూలాలు

  1. http://seshendrasharma.weebly.com/