Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

25, జనవరి 2015, ఆదివారం

తెలుగు కవులు - శ్రీశ్రీ


శ్రీశ్రీ
వికీపీడియా నుండి
(శ్రీ శ్రీ నుండి దారిమార్పు చెందింది)
శ్రీరంగం శ్రీనివాసరావు
Srisri.jpg
శ్రీ శ్రీ
జననం 1910 ఏప్రిల్ 30
విశాఖపట్నం
మరణం 1983 జూన్ 15
మద్రాసు
మరణ కారణము క్యాన్సరు వ్యాధి
ఇతర పేర్లు శ్రీ శ్రీ
వృత్తి సినిమా పాటల రచయిత
ప్రసిద్ధి విప్లవ కవి
భార్య / భర్త వెంకట రమణమ్మ
సరోజ
పిల్లలు ముగ్గురు కుమారులు,ఒక కుమార్తె
Website
http://www.mahakavisrisri.com/
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.

విషయ సూచిక

జీవిత గమనం

శ్రీశ్రీ ట్యాంకుబండ్ పై
శ్రీశ్రీ ట్యాంకుబండ్ పై

బాల్యం, విద్యాభ్యాసం

శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు - 1910 సంవత్సరం పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీశ్రీ జన్మించింది 1910 అన్నది నిర్ధారణ అయిన విషయమే అయినా ఆయన ఏ తేదీన పుట్టారన్న విషయంపై స్పష్టత లేదు. శ్రీశ్రీ తాను ఫిబ్రవరి 1, 1910 న జన్మించానని విశ్వసించారు. ఐతే పరిశోధకులు కొందరు సాధారణ నామ సంవత్సర చైత్రశుద్ధ షష్ఠినాడు జన్మించారని, అంటే 1910 ఏప్రిల్ 15న జన్మించారని పేర్కొన్నారు. విశాఖపట్టణం పురపాలక సంఘం వారు ఖరారు చేసిన తేదీ ఏప్రిల్ 30, 1910 అని విరసం వారు స్పష్టీకరించారు.[1] శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు. 1925 లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం లో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.

1935 లో విశాఖ లోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్‌ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.

1947 లో మద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత 1949 లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956 లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.

1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్‌ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన అరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.

వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పని చేసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.

కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.
విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.అదెవిధంగా ఆయన ఇంటిని మహ సంగ్రామ సమర యీచారు

సాహితీ వ్యాసంగం

శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు. తన 18 వ ఏట 1928 లో "ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పధ్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం - ఇది గురజాడ అడుగుజాడ అని ఆయన అన్నారు - మొదలు పెట్టి గొప్ప కావ్యాలను రచించాడు.

1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవి చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకు తెలియదు. 1981 లో లండన్‌ లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో ఆయన ఈ విషయం స్వయం గా రాసాడు. అందులో ఇలా రాసాడు:

"..ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజిక వాస్తవికత ' అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాల లోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహా యాదృఛ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది."

తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన "తెలుగు వీర లేవరా.." అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజ తో కలిసి సినిమాలకు మాటలు రాసాడు.

ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు. ప్రగతి వారపత్రిక లో ప్రశ్నలు, వాబులు (ప్రజ) అనే శీర్షిక ను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.
శ్రీశ్రీ చిత్రపటం

రచనలు

శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించాడట. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసి పారేశేవాడు [1].
శ్రీశ్రీ రచనల జాబితా ఇక్కడ ఇవ్వబడింది
  • ప్రభవ - ప్రచురణ: కవితా సమితి, వైజాగ్ - 1928
  • వరం వరం - ప్రచురణ: ప్రతిమా బుక్స్, ఏలూరు - 1946
  • సంపంగి తోట - ప్రచురణ: ప్రజా సాహిత్య పరిషత్, తెనాలి - 1947
  • మహాప్రస్థానం - ప్రచురణ: నళినీ కుమార్, మచిలీపట్నం - 1950
  • మహాప్రస్థానం - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ (20 ముద్రణలు)- 1952-1984 మధ్యకాలంలో
  • మహాప్రస్థానం - శ్రీ శ్రీ స్వంత దస్తూరితో, మరియు స్వంత గొంతు ఆడియోతో - లండన్ నుండి - 1981
  • అమ్మ - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు సోషలిస్ట్ పబ్లిషర్స్, విజయవాడ - 1952 - 1967
  • మేమే - ప్రచురణ: త్రిలింగ పబ్లిషర్స్, విజయవాడ - 1954
  • మరో ప్రపంచం - ప్రచురణ: సారధి పబ్లికేషన్స్, సికందరాబాదు - 1954
  • రేడియో నాటికలు - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు - 1956
  • త్రీ చీర్స్ ఫర్ మాన్ - ప్రచురణ: అభ్యుదయ పబ్లిషర్స్, మద్రాసు - 1956
  • చరమ రాత్రి - ప్రచురణ: గుప్తా బ్రదర్స్, వైజాగ్ - 1957
  • మానవుడి పాట్లు - ప్రచురణ:విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1958
  • సౌదామిని (పురిపండా గేయాలకు ఆంగ్లానువాదం) - ప్రచురణ: అద్దేపల్లి & కో, రాజమండ్రి - 1958
  • గురజాడ - ప్రచురణ: మన సాహితి, హైదరాబాదు - 1959
  • మూడు యాభైలు - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1964
  • 1 + 1 = 1 (రేడియో నాటికలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1964-1987
  • ఖడ్గసృష్టి - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1966-1984
  • వ్యూలు, రివ్యూలు - ప్రచురణ: ఎమ్.వీ.ఎల్.మినర్వా ప్రెస్, మచిలీపట్నం - 1969
  • శ్రీశ్రీ సాహిత్యం - ప్రచురణ: షష్టిపూర్తి సన్మాన సంఘం, వైజాగ్ (5 ముద్రణలు) - 1970
  • Sri Sri Miscellany - English volumes - ప్రచురణ: షష్టిపూర్తి సన్మాన సంఘం, వైజాగ్ - 1970
  • లెనిన్ - ప్రచురణ: ప్రగతి ప్రచురణ, మాస్కో - 1971
  • రెక్క విప్పిన రివల్యూషన్ - ప్రచురణ:ఉద్యమ సాహితి, కరీంనగర్ - 1971
  • వ్యాస క్రీడలు - ప్రచురణ: నవోదయ పబ్లిషర్స్, విజయవాడ - 1980
  • మరో మూడు యాభైలు - ప్రచురణ:ఎమ్.ఎస్.కో, సికందరాబాదు - 1974
  • చీనా యానం - ప్రచురణ: స్వాతి పబ్లిషర్స్, విజయవాడ - 1980
  • మరోప్రస్థానం - ప్రచురణ: విరసం - 1980
  • సిప్రాలి - (అమెరికాలో ఫొటోకాపీ) 1981
  • పాడవోయి భారతీయుడా (సినిమా పాటలు)- ప్రచురణ:శ్రీశ్రీ ప్రచురణలు, మద్రాసు - 1983
  • శ్రీ శ్రీ వ్యాసాలు - ప్రచురణ: విరసం - 1986
  • New Frontiers - ప్రచురణ: విరసం - 1986
  • అనంతం (ఆత్మకథ) - ప్రచురణ: విరసం - 1986
శ్రీశ్రీ తన ఆత్మ కథను అనంతం అనే పేరుతో వ్రాశాడు. దీనిలో శ్రీశ్రీ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించాడు. అతడి సమకాలీన కవులు, రచయితలు, ప్రసిద్ధ వ్యక్తులు మనకు ఈ పుస్తకంలో పరిచయం చేశాడు.
  • ప్రజ (ప్రశ్నలు జవాబులు) - ప్రచురణ: విరసం - 1990
  • తెలుగువీర లేవరా (సినిమా పాటలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1996
  • విశాలాంధ్రలో ప్రజారాజ్యం - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1999
  • ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
  • ఖబర్దార్ సంఘ శత్రువు లారా - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001

ప్రముఖ సినిమా పాటలు

  1. మనసున మనసై (డాక్టర్ చక్రవర్తి)
  2. హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు)
  3. నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన)
  4. తెలుగువీర లేవరా (అల్లూరి సీతారామరాజు)
  5. పాడవోయి భారతీయుడా (వెలుగు నీడలు)

మహాప్రస్థానం

మరో ప్రపంచం,మరో ప్రపంచం,మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! పదండి ముందుకు పదండి అని ఉవెత్తున లేచి గర్జించిన సింహం వలె అరిచాడు.

వ్యక్తిత్వం

శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుధ్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు కనిపిస్తాయి. ఆయన మొత్తంగా బహిర్ముఖుడు. తీవ్రవిమర్శలకు, పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి ఆయన అభిప్రాయాలు అత్యంత వేగంగా, అతితక్కువ హేతుబద్ధంగా మారుతూండేవి. ఉద్యోగాల్లో ఇమడలేకపోవడం, మొదటి వివాహంలో పిల్లలు కలగకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ళ వయసు దగ్గరపడ్డాకే రెండో భార్యతో పిల్లలు పుట్టడం, సినిమాల్లో సంపాదించి, మొత్తం కోల్పోవడం, తన అస్థిరత వల్ల సాహితీసంఘాల్లో వివాదాలు రావడం ఇలా ఎన్నెన్నో ఒడిదుడుకులు ఆయన జీవితాన్ని తాకాయి. ఆయన గురించి జీవితచరిత్రకారుడు బూదరాజు రాధాకృష్ణ శ్రీశ్రీతో ఏ కొంతకాలమైనా పరిచయం గల వారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడనీ, అమాయకుడైనా చురుకైనవాడనీ, అహంకారి అయినా తలవంచుతుంటాడనీ, విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతాడనీ, ఆకర్షకుడైనా ఏడిపించనూగలడనీ అంగీకరిస్తారు. కొన్ని అభిప్రాయాల విషయంలో అతడు జగమొడి. సరదా పడ్డప్పుడు అతణ్ణి అదుపుచేయడం కష్టం. విపరీతాలోచనా ధోరణిలో ఉన్నప్పుడు అతడు క్రమశిక్షణకు లొంగడు. దాపరికం లేకపోవడం, ఆలోచనలోనూ స్వభావంలోనూ చాటూమరుగూ లేకపోవడం విస్పష్టం. మాటల్లో మాత్రమే అతడు భయంకరుడు. మరో విధంగా పోరాడలేడు. వాస్తవజీవితంలో అతడు సమస్త సాంప్రదాయిక పద్ధతులకూ కట్టుబడ్డాడు. కానీ తన విప్లవభావాలతో వాటినెప్పుడూ వ్యతిరేకిస్తుండేవాడు అంటూ స్వభావాన్ని గురించి వ్యాఖ్యానించారు.
దాపరికంలేని స్వభావం వల్ల, అదొక చమత్కార ధోరణి అనుకోవడం వల్ల శ్రీశ్రీ స్వపర భేదం లేకుండా కఠోరమైన విమర్శలు, అనవసర వివాదాలకు కారణమైన వ్యాఖ్యలు ఎన్నో చేశారు. పైగా ఆయన రాసిన ఆత్మకథ అనంతం సాధారణ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని, పాఠకులకు మింగుడు పడని విడ్డూరమైన ప్రసంగాలతో నింపారు. సమాచారం కూడా ఏ సందర్భశుద్ధీ లేకుండా నింపిన రచన అది. ఇవన్నీ కలిసి అతని వ్యక్తిత్వంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు వేసినా ఆయన ఆకర్షణను ఇసుమంతైనా తగ్గించలేదు.

శ్రీశ్రీ పలుకులు

తనకేది తోస్తే అది నిర్భయంగానే కాక సందర్భశుద్ధి కూడా పట్టించుకోకుండా మాట్లాడడం అటుంచితే శ్రీశ్రీ మాటల్లో ఒకవిధమైన శబ్దాలంకారాలు, చమత్కారాలు దొర్లుతూండేవి. చమత్కార సంభాషణల లోను, శ్లేషల ప్రయోగం లోను శ్రీశ్రీ ప్రసిధ్ధి చెందాడు. ఆయన చెణుకులు ఎన్నో లోకంలో వ్యాప్తిలో ఉన్నాయి. మచ్చుకు కొన్ని:
  • ఒక మారు గోరాశాస్త్రి శ్రీ శ్రీ తో,"శ్రీ శ్రీ! నువ్వేమిటన్నా అనుకో.నా ఉద్దేశం మాత్రం ఇది! ఈ నాడు ఇండియాలోని రచయితలందరికన్నా నేనే గొప్పవాణ్ని" అన్నాడు."నా ఉద్దేశం కూడా అదే!" అన్నారు శ్రీ శ్రీ
  • రైల్వే స్టేషనులో కనపడిన ఒక స్నేహితుడు ఆయనను అడిగాడు, "ఊరికేనా?" అని. దానికి శ్రీ శ్రీ ఇలా అన్నాడు - "ఊరికే".
  • ఒక నాటిక ఏదైనా రాయమని అడిగిన మిత్రుడితో ఇలా అన్నాడు: "ఏ నాటికైనా రాస్తాను మిత్రమా"
  • "వ్యక్తికి బహువచనం శక్తి"
  • స్నేహితులతో కలిసి మద్రాసు లో హోటలు కెళ్ళాడు. ఒకాయన అట్టు చెప్తానని అన్నాడు. దానికి శ్రీ శ్రీ "అట్లే కానిండు" అన్నాడు.
  • ఒకసారి ఆయనతొ విసిగిన రచయత ఇలా అన్నాడు "శ్రీశ్రీ నీ నిర్వచనాలు ఒట్టి విరోచనాలు" వెంటనె శ్రీశ్రీ "అవి(విరోచనాలు)నీ నోటెమ్మట రావటం నా అదృస్టం
తెలుగు భాష గురించి
తెలుగే మన జాతీయ భాష కావాలనేది నా అభిమతం.ఇది భాషా దురభిమానంతో అంటున్న మాటకాదు. తెలుగు భారతదేశం అంతకీ జాతీయభాష కాగల అర్హత గలదని జె.బి.యస్.హాల్డేన్ అన్నారు. సంస్కృత పదాలను జీర్ణించుకున్న కారణంచేత అటు ఉత్తరాదివారికీ, ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటి కావడంవల్ల ఇటు దక్షిణాది వారికీ తెలుగు నేర్చుకోవడం చాలా సులభమని హాల్డేన్ పండితుని వాదన. దేశంలో హిందీ భాషదే మొదటిస్థానమయినా, ఆ భాష మాట్లాడే వాళ్ళంతా కలిపి నలభై శాతానికి మించరు. అంతేకాక హిందీ ఒక చిన్నచెట్టుకు పరిమితం! రెండవ భాష అయిన తెలుగు సుమారు ఆరుకోట్ల మంది ఆంధ్రులకు మాతృభాష! పైగా తెలుగువారు దేశమంతటా, అన్ని రాష్ట్రాలలోనూ వ్యాపింఛి ఉన్నారు.
తెలుగు కవిత్రయం గురించి 
తెలుగు భాషకు కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ.
తెలుగు లిపి గురించి
ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని నా నిశ్ఛితాభిప్రాయం. ప్రపంచ తెలుగుమహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేననుకుంటున్నాను.
--ప్రజాతంత్ర (18.4.1976) "అనంతం" పేజీ196.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తో స్పర్థ

శ్రీశ్రీకి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణకు మధ్య గల స్పర్థ ప్రసిద్ధమైనది. విశ్వనాథ సత్యనారాయణ అంటే శ్రీశ్రీకి ఒకవిధమైన గురుభావం ఉండేది. శ్రీశ్రీ కవిత్వం ప్రారంభించిన సమయంలో ఆయనపై విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం చాలా గాఢంగా ఉంది. ఆయన శైలిలో కవిత్వం రాయాలని తీవ్రమైన ప్రయత్నం చేసేవారు. తాను మద్రాసులో ఉన్న రోజుల గురించి చెప్తూ:మదరాసులో ఉన్న రోజుల్లో నన్ను బ్రతికించినవారు ఇద్దరే. ఒకరు మున్సిపాలిటీ కుళాయి వాళ్లు, రెండోది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు అని చెప్పుకున్నారు. 1934లో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు వ్రాస్తున్న సమయంలో కవిత్వాన్ని గురించి, కవి గురించి గొప్ప తాత్త్వికత, వాస్తవికత మేళవించి వ్రాసిన ఆత్మాశ్రయ గేయం కవితా ఓ కవితా నవ్యసాహిత్య పరిషత్ వేదికపై చదివారు. అప్పటి అధ్యక్షుడు, అప్పటికే కవిగా సుప్రఖ్యాతుడు అయిన విశ్వనాథ నాటి వర్థమాన కవి అయిన శ్రీశ్రీని ఆనందబాష్పాలతో వేదికపైన నడిచివచ్చి గుండెలకు హత్తుకున్నారు. ఆ గీతాన్ని ఎంతగానో పొగడి శ్రీశ్రీ కవితా సంకలనాన్ని(మహాప్రస్థానంగా వెలువడింది) తానే ప్రచురిస్తానని, దీనికి ముందుమాట రాయాలని చలాన్ని కోరారు. ముందుమాట వ్రాయించేందుకు చింతా దీక్షితుల మధ్యవర్తిత్వాన్ని కూడా నెరిపారు. కానీ అప్పటికి విశ్వనాథ పేరున్న కవే అయినా ఆర్థికంగా ఏ ఆధారంలేక దేశమంతా వాగ్మిగా తిరుగుతున్న నిరుద్యోగి. వేరొకరి పుస్తకం ప్రచురించగల సమర్థుడు కాదు. ఏవో కారణాల వల్ల మహాప్రస్థానాన్ని ఆయన ప్రచురించలేదు. నళినీమోహన్ అని సాహిత్యాభిలాషి ముద్రించారు.
విశ్వనాథ శ్రీశ్రీపై ఇంతగా ఆప్యాయత చూపినా, శ్రీశ్రీకి విశ్వనాథ కవితాశక్తిపై చిన్ననాటి నుంచి ఎంతో అభిమానం (కొన్నేళ్ళు హీరోవర్షిప్) ఉన్నా వారిద్దరి వ్యతిరేక భావాలు విభేదాలు తీసుకుచ్చాయి. భావాలకు మించి విశ్వనాథకున్న కుండబద్దలు గొట్టే మాట, శ్రీశ్రీలోని మాట తూలే లక్షణం మరింత ఆజ్యం పోశాయి. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షం గొప్ప రచన కాదని శ్రీశ్రీ అభిప్రాయం. నిజానికి తన అన్ని రచనల్లోనూ విశ్వనాథకు రామాయణంపైనే అభిమానం ఒక పాలు ఎక్కువ. దీనిని వెక్కిరిస్తూ ఒక్కడైనా రామాయణ కల్పవృక్షం చదివానంటే విశ్వనాథ పొంగిపోతాడనీ, సంస్కృతం రాకున్నా వాల్మీకం అర్థమైంది గానీ తెలుగు వచ్చినా కల్పవృక్షం అర్థంకాలేదని చాలాచాలా మాటలే మాట్లాడారు. విశ్వనాథకు సంస్కృతం అంత బాగా రాదని చెప్పడం కోసం, 'సంస్కృతంలో విశ్వనాథ కంటే గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప పండితుడు' అని ప్రకటించాడు శ్రీశ్రీ. దీనిపై శ్రీశ్రీ జీవితచరిత్రకారుడు శ్రీశ్రీకి విశ్వనాథ సంస్కృత పాండిత్యం ఈర్ష్య పుట్టించిందనిపిస్తుందని, లేని పక్షంలో దీనికి మరోకారణం కనిపించదని వ్యాఖ్యానించారు. తనంతటి మహాకవి వెయ్యేళ్ళ వరకూ పుట్టడని విశ్వనాథ తన గురించి తానే ప్రకటించుకోగా, శ్రీశ్రీ నిజానికాయన వెయ్యేళ్ళ కిందటే పుట్టాడని అన్నాడు.
ఈ వాగ్వాదాలకు పరాకాష్టగా మొదటి తెలుగు మహాసభల వివాదం సాగింది. దీనిలో విశ్వనాథ, శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఆ మహాసభలకు విశ్వనాథ హాజరుకాగా, శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్రచేశారు. ఈ ఆరోపణ ప్రత్యారోపణలు వారిద్దరి నడుమ సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతీశాయి. మళ్ళీ విశ్వనాథను నన్నయ ఉన్నంతకాలం ఉంటారని, ఐతే తిక్కన-వేమన-గురజాడ అనే కవిత్రయంలో మాత్రం చేరరని వ్యాఖ్యలూ చేశారు. విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలను చివరి వరకూ ప్రశంసించారు. ఆయన మరణానంతరం విశ్వనాథను గొప్పగా ప్రశంసిస్తూ కొండవీటి పొగమబ్బు/తెలుగు వాడి గోల్డునిబ్బు/మాట్లాడే వెన్నెముక/పాటపాడే సుషుమ్న/మాట్లాడే ద్విపద/సత్యానికి నా ఉపద అంటూ రాసిన కవిత సుప్రఖ్యాతం. చివరి వరకూ వారిద్దరి నడుమ ఒకరు మరొకరి కవితా శక్తులను కొన్ని పరిమితులకు లోబడి ప్రశంసించుకోవడమూ, ఒక్కోమారు బయటపడి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడమూ, తుదకీ అనురాగం-ద్వేషాల దాగుడుమూతలాట సాగింది.

శ్రీశ్రీ గురించి ప్రముఖుల పలుకులు

  • "మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహా కావ్యం" - పురిపండా అప్పలస్వామి
  • "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ" - చలం, యోగ్యతా పత్రంలో
  • "కొవ్వొత్తిని రెండువైపులా ముట్టించాను. అది శ్రీశ్రీలా వెలిగింది" - పురిపండా అప్పలస్వామి
  • ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ ఇలా రాసాడు: "కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది"[1]

యోగ్యతా పత్రం

యోగ్యతా పత్రం - మహాప్రస్థానం పుస్తకానికి 1940 లో చలం రాసిన పీఠిక. తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికలలో ఇది ఒకటి. ఆ పుస్తకం ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో వివరించే పీఠిక అది. "రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల షడ్జధ్వానం" విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి." అంటూ పుస్తకం చదవడానికి పాఠకుడిని సమాయత్త పరచే పీఠిక అది. యోగ్యతాపత్రంలో చలం రాసిన కొన్ని వాక్యాలు మచ్చుకు:
ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథం లోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురు మని, నమ్మిన కాళ్ళ కింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమేనయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.
తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. "తూచవద్దు, అనుభవించి పలవరించ" మన్నాడు శ్రీ శ్రీ.
శ్రీశ్రీ నిర్వహించిన ప్రజ శీర్షిక లో పిచ్చయ్య అనే పాఠకుడు ఇలా ప్రశ్నించాడు "యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కరలేదని నేను అంటాను, మీరేమంటారు". అతిశయోక్తి అయినా, అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది.
అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు: "మీరు సార్ధక నామధేయులంటాను"
  • శ్రీశ్రీ పుట్టుకతొ మనిషి, వృద్దాప్యంలొ మహరిషి, మద్యలొ మాత్రమె కవి, ఏప్పటికీ ప్రవక్త. ( శ్రీశ్రీ గారి మరణానంతరం ఈనాడు దిన పత్రికకు వేటూరి గారు వ్రాసిన వ్యాసం నుండి.)

మూలాలు, వనరులు


  1. రాధాకృష్ణ, బూదరాజు (1999). మహాకవి శ్రీశ్రీ (ప్రథమ ముద్రణ ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. ISBN 81-260-0719-2.

ఇవి కూడా చూడండి



16, డిసెంబర్ 2014, మంగళవారం

తెలుగు కవులు - రెంటాల గోపాలకృష్ణ



వికీపీడియా నుండి
Rentala gopalakrishna.jpg
రెంటాల గోపాలకృష్ణ
జననం రెంటాల గోపాలకృష్ణ
సెప్టెంబరు 5, 1922
గుంటూరు జిల్లా రెంటాల
మరణం జూలై 18, 1995
ఇతర పేర్లు రెంటాల గోపాలకృష్ణ
రెంటాల గోపాలకృష్ణ (సెప్టెంబరు 5, 1922 - జూలై 18, 1995) ప్రముఖ పత్రికా రచయిత, కవి, అనువాదకులు మరియు నాటక కర్త. కవిగా, నాటక కర్తగా, రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, వక్తగా ఆయన లబ్ధ ప్రతిష్ఠులు.

జీవిత విశేషాలు

వీరు గుంటూరు జిల్లా రెంటాల గ్రామంలో జన్మించారు. తెలుగునాట తొలితరం అభ్యుదయ కవితా వైతాళికులలో రెంటాల గోపాలకృష్ణ ఒకరు. ఆయన 1920వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ, కృష్ణాష్టమి నాడు గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామంలో జన్మించారు. పాండిత్యం, ప్రతిభ గల కుటుంబం వారిది. చిన్నప్పటి నుంచీ రెంటాలలో సాహిత్య సృజనాభిలాష ఎక్కువ. వివిధ గ్రంథాలు, పురాణాలు, శాస్త్రాలను అధ్యయనం చేశారు. సమకాలీన సాహిత్య, సామాజిక, రాజకీయ ధోరణులకు ఆయన స్పందించేవారు.

సాహితీ సేవ

స్కూలు ఫైనల్ లో ఉండగానే 1936లో పదహేరేళ్ళ ప్రాయంలో 'రాజ్యశ్రీ’ అనే చారిత్రక నవలను రాశారు. మిత్రుల సాయంతో 1939లో ప్రచురించి, సంచలనం రేపారు. ఈ చారిత్రక నవలకు ప్రముఖ పండితులు, చరిత్ర శాస్త్ర అధ్యాపకులు శ్రీమారేమండ రామారావు ముందుమాట రాశారు. పాఠశాల ప్రాంగణంలో ఉండగానే రెంటాల ఛందస్సును క్షుణ్ణంగా నేర్చుకొని, వివిధ వృత్తాలు, గీతాలలో పద్యరచన చేశారు. 1937లో స్కూల్ ఫైనల్ వరకు నరసరావుపేటలోని మునిసిపల్ హైస్కూల్ లో చదువుకున్నారు. ఆనాడే ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, గంగినేని వెంకటేశ్వరరావు లాంటి సాహితీ మిత్రుల సాహచర్యం రెంటాలకు సిద్ధించింది. ప్రముఖ కవి - ప్రధానోపాధ్యాయుడు శ్రీనాయని సుబ్బారావు శిష్యరికం అబ్బాయి. తరువాత గుంటూరులోని కళాశాలలో బి.ఏ. (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు.
కళాశాలలో చదువుకుంటూనే ఈ సాహితీ మిత్రులంతా కలసి, నరసరావుపేటలో 'నవ్యకళాపరిషత్’ అనే కవిత్వ, సాహితీ చర్చ వేదికను ప్రారంభించారు. ఆ రోజుల్లోనే సాహితీ చర్చలు జరుపుతూ, నవ్యకవితా ధోరణికి నాంది పలికారు. 1943లో రెంటాల విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మార్క్సిజమ్ అధ్యయనం, శ్రీశ్రీతో సన్నిహితత్వం, అభ్యుదయ సాహిత్యోద్యమం - వీటితో ఆయన రచనల్లో నూతన దృష్టి మొదలైంది. 1943లో ఆంధ్ర అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ జరిగాక వెలువడిన తొలి అభ్యుదయ కావ్యం ‘నయాగరా’. అభ్యుదయ కవితా ఉద్యమానికి మేనిఫెస్టోగా చెప్పదగిన ‘నయాగరా' కవితా సంపుటి ప్రచురణలో రెంటాల సహాయకుడిగా పాలుపంచుకొన్నారు. ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండలకు చేదోడువాదోడుగా ఉన్నారు. అలా ‘నయాగరా' కవి మిత్ర బృందంలో ముఖ్యుడిగా నిలిచారు. మిత్రులతో కలసి తొలినాళ్ళలోనే అభ్యుదయ రచయితల సంఘంలో చేరి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కొనసాగారు.

పాత్రికేయ జీవితం

ఉదరపోషణార్థం ఉద్యోగం చేయడం తప్పనిసరైనా, సాహిత్యాభిలాష కారణంగా రైల్వే, తదితర ప్రభుత్వ ఉద్యోగాలను రెంటాల కాలదన్నారు. 1942 ప్రాంతంలో కొంతకాలం చల్లా జగన్నాథం గారి సంపాదకత్వంలోని 'దేశాభిమాని' పత్రికలో గుంటూరులో పనిచేశారు. చదలవాడ పిచ్చయ్య గారి సంపాదకత్వాన వెలువడిన 'నవభారతి' మాసపత్రికలో మరికొంతకాలం కర్తవ్యనిర్వహణ చేశారు. అనంతరం 1960 ప్రాంతంలో అవసరాల సూర్యారావు, బెల్లంకొండ రామదాసు లాంటి మిత్ర రచయితలతో కలసి నీలంరాజు వెంకట శేషయ్య గారి సంపాదకత్వంలో వెలువడుతున్న 'ఆంధ్రప్రభ' దినపత్రికలో ఉపసంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు అదే సంస్థలో వివిధ స్థాయుల్లో ఉద్యోగ నిర్వహణ చేశారు. 'ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదక మండలి సభ్యుడిగా గురుతర బాధ్యతలు నిర్వహించారు.
పాత్రికేయ వృత్తిలో ఉంటూనే, 'పంచకల్యాణి - దొంగల రాణి', 'కథానాయకురాలు' లాంటి కొన్ని చలనచిత్రాలకు రెంటాల మాటలు, పాటలు సమకూర్చారు. 'ఆంధ్రప్రభ'దినపత్రికలో సినీ విశేషాల వారం వారీ అనుబంధం 'చిత్రప్రభ'కు నిరంతరాయంగా సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. కొత్త సినిమాలపై వారం వారం ఆయన రాసే సమీక్షలు పాఠకులకు ఆసక్తికరమయ్యాయి. సుప్రసిద్ధ సినీ విమర్శకుడిగా ఆయనకు పేరు తెచ్చాయి. సినీ - సాంస్కృతిక రాజధానిగా వెలిగిన విజయవాడలో అప్పట్లో జరిగే సినిమా సమావేశాలు, కార్యక్రమాల్లో గురుపీఠం రెంటాల గారిదే.
పత్రికా రచనలో భాగంగా ఆయన సాంస్కృతిక, జ్యోతిష, కళా రంగాలపై ఎన్నో వ్యాసాలు, సమీక్షలు రాశారు. ఆయన రాసిన సంపాదకీయాలు కూడా కోకొల్లలు. యాంత్రికంగా, గడియారం వంక చూసుకుంటూ మొక్కుబడిగా పనిచేసే చాలామంది జర్నలిస్టులకు రెంటాల భిన్నమైన వారు. నిబద్ధతతో, నిర్దేశిత పని గంటల సమయానికి అతీతంగా నిరంతరం శ్రమించేవారు. తనదైన శైలిలో దగ్గరుండి ఎడిషన్ వర్కును పూర్తి చేయించేవారు. జర్నలిస్టుగా రెంటాలకున్న ఆ విశిష్ట గుణం ఆ తరం పాత్రికేయులకు సుపరిచితం.
పత్రికా రచనను చేపట్టినప్పటికీ, రెంటాల తన సాహితీ సేద్యాన్ని ఏనాడూ ఆపలేదు. 'అభ్యుదయ', 'మాతృభూమి', 'సోవియట్ భూమి', 'ఆనందవాణి', 'విజయవాణి', 'విజయప్రభ', 'నగారా' లాంటి ఆనాటి ప్రముఖ పత్రికలలోనూ, 'ఆంధ్రప్రభ' సచిత్ర వారపత్రిక, 'ఆంధ్రజ్యోతి' దిన, వార పత్రికల్లోనూ, 'స్వాతి' వార, మాసపత్రికల్లోనూ, 'బాలజ్యోతి' పిల్లల మాసపత్రికలోనూ రెంటాల రచనలు, ధారావాహికలు అనేకం ప్రచురితమయ్యాయి.

రచనలు

  • యక్ష ప్రశ్నలు - జాతీయాల పుట్టుపూర్వోత్తరాలు.
  • మన నగరాలు - భారతదేశంలోని ప్రసిద్ధ నగరాల కథలు.
  • ఈసపు నీతికథలు (రెండు భాగాలు)
  • ఆనందభూపతి కథలు
  • చెడిపోయిన రైతు
  • మేడి పళ్ళు
  • బొమ్మలు చెప్పిన కమ్మని కథలు (విక్రమార్కుని కథల్లోని సాలభంజికల కథలు)
  • సంఘర్షణ
  • సర్పయాగం
  • టాల్ స్టాయి
  • సమరము - శాంతి
  • కుప్రిన్
  • యమకూపం
  • కిరాతార్జునీయం
  • శిక్ష

11, డిసెంబర్ 2014, గురువారం

తెలుగు కవులు - రాయప్రోలు సుబ్బారావు



వికీపీడియా నుండి
రాయప్రోలు సుబ్బారావు
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (1892 - 1984) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణకంకణము తో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.

కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు.

అయితే రాయప్రోలుది గ్రుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవిత కు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి.

ఈయన రచనలు ప్రధానంగా ఖండ కావ్యాలు
  • తృణకంకణము
  • ఆంధ్రావళి
  • కష్టకమల
  • రమ్యలోకము
  • వనమాల
  • మిశ్రమంజరి
  • స్నేహలతా దేవి
  • స్వప్నకుమారము
  • తెలుగు తోట
  • మాధురీ దర్శనం
అనువాదాలు
  • అనుమతి
  • భజగోవిందము
  • సౌందర్య లహరి
  • దూతమత్తేభము
  • లలిత
  • మధుకలశము
వంటి లఘు కావ్యాలెన్నో రచించాడు.
రాయప్రోలు కవితల నుండి ఉదాహరణలు:
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!
వేదశాఖలు పెరిగె నిచ్చట
ఆదికావ్యం బందె నిచ్చట

అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు
ఓరుగల్లున రాజ వీర లాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు
విద్యానగర రాజవీధుల గవితకు పెండ్లి పందిళ్ళు కప్పించునాడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమెత్తించునాడు
ఆంధ్ర సంతతి కే మహితాభిమాన
దివ్య దీక్షా సుఖ స్ఫూర్తి తీవరించె
నా మహాదేశ మర్థించి యాంధ్రులార
చల్లుడాంధ్రలోకమున నక్షితలు నేడు

తృణ కంకణమునుండి:
అడుగుల బొబ్బలెత్త, వదనాంచలమందున చిన్కు చెమ్మటల్
మడుగులు గట్ట, మండు కనుమాలపుటెండ పడంతియోర్తు జా
ఱెడు జిలుగుంబయంట సవరించుచు, చొక్కిన యింపుతోడ కా
ల్నడకన బోవుచుండె నెడలన్ కనుపించెడి పచ్చతోటలకున్
నిమ్మచెట్టు లేగొమ్ము పందిళ్ళకింద
పుస్తకపు పేటికలను, నా హస్తముదిత
చిత్రసూత్రమునను వసియించియున్న
దోయి!యిందాక మన ప్రేమయును సఖుండ!
రాయప్రోలు వారి తృణకంకణమునకు కట్టమంచి రామలింగారెడ్డి వ్రాసిన సందేశము:
MAHARAJA'S COLLEGE, Mysore. 26th May 1916.

Though I have not known Mr. Rayaprolu Subbarao personally, I have been in touch with him by correspondence, common friends, and above all, his own splendid writings in prose and verse. He holds a high rank amongst modern Telugu Poets, and I think he is almost entitled to be acclaimed as the founder of a new school of poetry which is bound to mark a new epoch in the development of the Andhra literature. His imaginative gifts are of a high order and his power of phrase is remarkable, almost unique. He will bring name and fame to any institution with which he may be connected. And I, therefore, confidently recommend him as a man of genius who has every title to the admiration and encouragement of the Telugu people.

[Signed] C.R.REDDY, M.A.(Cantab)- Principal, Maharaja's College,Mysore.

వనరులు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.


1, డిసెంబర్ 2014, సోమవారం

తెలుగు కవులు - రాచమల్లు రామచంద్రారెడ్డి



వికీపీడియా నుండి
రారా గా ప్రసిద్ధుడైన రాచమల్లు రామచంద్రారెడ్డి (Rachamallu Ramachandra Reddy) బహుముఖప్రజ్ఞాశాలి. ఆయన తెలుగు సాహిత్యానికి తన విమర్శతో, అనువాదాలతో, పాత్రికేయ రచనలతో ఎంతో దోహదం చేశాడు. ఆయన రాసిన అనువాద సమస్యలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన మరో ప్రసిద్ధ గ్రంథం 'సారస్వత వివేచన'. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది. మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకునిగా ఆరేళ్ళు పనిచేసి ఎన్నో విలువైన గ్రంథాలను అనువదించినాడు. కడప నుంచి 1968 - 1970 ల మధ్య వెలువడిన 'సంవేదన' త్రైమాసిక పత్రిక సంపాదకుడిగా తెలుగు సాహిత్య విమర్శకు ఒరవడి దిద్దాడు. 1959 - 1963 మధ్యకాలంలో కడప నుంచే 'సవ్యసాచి' అనే రాజకీయ పక్ష పత్రిక కూడా నడిపాడు. చలం, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.), మహీధర రామమోహనరావు లాంటి రచయితలపై ఆయన చేసిన మూల్యాంకనం లోతైనది. ఆయన వాదోపవాదాల్లో దిట్ట. ఆయన్ను శ్రీశ్రీ 'క్రూరుడైన విమర్శకుడు' అన్నా నిజజీవితంలో రారా చాలా స్నేహశీలి.

జీవిత విశేషాలు

వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెం గ్రామంలో 1922 ఫిబ్రవరి 28న జన్మించాడు.తల్లిదండ్రులు ఆది లక్షుమ్మ, బయపు రెడ్డి. రారా వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని డిస్ట్రిక్ట్ బోర్డు హైస్కూల్లో చదువుకున్నాడు. ఇంటర్మీడియేట్ అనంతపురంలోని ఆనాటి దత్త మండలాల కాలేజీ (ఇప్పటి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల)లో చదివాడు. తర్వాత చెన్నై లోని గిండీ ఇంజినీరింగ్ కళాశాలలో చేరాడు కానీ 1941లో గాంధీజీ జైలులో చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా సమ్మె చేసినందుకు ఆయనను, మరికొందరు విద్యార్థులను కళాశాలనుంచి బహిష్కరించారు. క్షమాపణ చెప్పినవారిని తిరిగిచేర్చుకున్నారు కానీ రారా, చండ్ర పుల్లారెడ్డి క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. 1944లో రారా విజయవాడనుంచి వెలువడే 'విశాలాంధ్ర' దినపత్రికలో ఉపసంపాదకుడుగా చేరాడు. కానీ అక్కడ ఎక్కువ కాలం ఇమడలేక పోయాడు. తర్వాత కొండాపురం (వైఎస్ఆర్ జిల్లా)లో మకాం పెట్టి ఎర్రగడ్డ (ఉల్లిపాయ)ల వ్యాపారం చేశాడు. 1950ల నుంచి మార్క్సిజమ్ పట్ల మొగ్గు ఏర్పడింది.

1962 నాటికి కేతు విశ్వనాథరెడ్డి, నల్లపాటి రామప్ప నాయుడు, బంగోరె (బండి గోపాల రెడ్డి), ఉద్యోగరీత్యా కడపలో ఉండేవారు. వీరే కాకుండా నర్రెడ్డి శివరామిరెడ్డి, నంద్యాల నాగిరెడ్డి తదితరులంతా ప్రతి ఆదివారం రారా ఇంట్లో చేరి కావ్యపఠనం, సాహితీచర్చలు చేసేవారు. అలా ఆర్వీయార్, కేతు విశ్వనాథరెడ్డి, వై.సి.వి.రెడ్డి, కొత్తపల్లి రవిబాబు (ప్రజాసాహితి సంపాదకులు), తదితరులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సంవేదన పత్రిక ప్రారంభించాడు. ఇది యుగసాహితి ప్రచురణ. 1968 ఏప్రిల్ లో తొలి సంచిక విడుదలైంది. ఆవిష్కరణ సభ మార్చి 28 న శ్రీశ్రీ, కొ.కు. ల సమక్షంలో జరిగింది. మొత్తం వెలువడింది ఏడు సంచికలే అయినా అది చరిత్ర సృష్టించింది.

1970లలో ఆరేళ్లపాటు మాస్కోలో అనువాదకుడిగా పనిచేశాడు. తిరిగొచ్చిన తర్వాత కొన్నాళ్లపాటు ఈనాడు పత్రికకు సంపాదకీయాలు రాశాడు. చివరిదశలో ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడిన రారా 1988, నవంబరు 25న కన్నుమూశాడు.
  • కార్ల్ మార్క్స్, ఏంగెల్స్‌ల ముందూ అందరూ దిగదుడుపేనన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం.
  • కన్యాశుల్కం' గొప్ప నాటకమే అయినా అందులో ఒక పరిష్కారం లేదు ,నాచ్ సమస్య నవ్వులపాలయ్యింది.వితంతు సమస్య అల్లరిపాలయ్యింది,సంస్కరణోద్యమం అభాసుపాలుఅయ్యింది అంటారు.
  • ఎవరికైనా జీవితం పట్ల ఒక తీవ్రమైన, నిరంతరమైన, పరిష్కారం సాధ్యం కాని అసంతృప్తి ఉన్నప్పుడే తాత్విక చిత్తవృత్తి ఏర్పడుతుందన్న భావాన్ని శ్రీశ్రీ గురించి వ్యక్తం చేశారు.
పుట్టపర్తి నారాయణా చార్యుల వారితో వీరికి చిక్కని సాన్నిహిత్యం ఉండేది.. పుట్టపర్తి వారు వీణి గదాఘాతం నుంచీ తప్పించుకున్న వాణ్ణి బహుశా నేనొక్కణ్ణే నేమో అనేవారు నవ్వుతూ..

సాహిత్య కృషి

రారా మార్క్సిజాన్ని సాహిత్యానికి అన్వయించి సాహిత్యానికున్న శక్తిని - సమాజాన్ని మార్చే శక్తిని విశదీకరించినాడు. రాసినవి ఎక్కువ భాగం సమీక్షలే ఐనా గొప్ప విమర్శకుడిగా పేరు పొందాడు. పుస్తక సమీక్షలను ప్రామాణికమైన విమర్శవ్యాసాలుగా రూపొందించడం ఆయన ప్రత్యేకత. గియోర్గి లూకాచ్ అనే హంగేరియన్ సౌందర్య శాస్త్రవేత్త 'చారిత్రక నవల' అనే గ్రంథంలో చేసిన సూత్రీకరణల ఆధారంగా కొల్లాయి గట్టితేనేమి నవలను సమీక్షించినాడు రారా. తెలుగులో ఇలాంటి విమర్శ అంతకు ముందు రాలేదు.

కథలు

1957-59 మధ్యకాలంలో ఈయన రాసిన కథలు 1960లో అలసిన గుండెలు పేరిట పుస్తకరూపంలో వచ్చాయి. కావ్యచిత్ర అనే పెద్దకథ ఆయన మరణానంతరం సాహిత్యనేత్రం త్రైమాసిక పత్రికలో ప్రచురితమైంది. ఇవి కాక ఈయన సృజించిన బాలసాహిత్యం: చంద్రమండలం-శశిరేఖ, విక్రమార్కుని విడ్డూరం, అన్నం పెట్టని చదువు.

ఇతర గ్రంథాలు

  • సారస్వత వివేచన
  • వ్యక్తి స్వాతంత్ర్యం - సమాజ శ్రేయస్సు
  • రారా లేఖలు
  • అనువాద సమస్యలు

అనువాదాలు

  • మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు
  • లెనిన్ సంకలిత రచనలు
  • పెట్టుబడిదారీ అర్థశాస్త్రం
  • గోర్కీ కథలు
  • చెహోవ్ కథలు మొదలైనవి.

మూలాలు, వనరులు

30, నవంబర్ 2014, ఆదివారం

తెలుగు కవులు - రాచకొండ విశ్వనాథ శాస్ర్తి




వికీపీడియా నుండి
(రాచకొండ విశ్వనాథ శాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
రాచకొండ విశ్వనాధశాస్త్రి
రాచకొండ విశ్వనాధశాస్త్రి వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు.

తొలి జీవితము

రావి శాస్త్రి, నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922 జూలై 30న శ్రీకాకుళంలో జన్మించాడు. ఈయన స్వస్థలము అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామము. ఈయన తండ్రి, న్యాయవాది తల్లి, సహితీకారిణి.

రావి శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (ఆనర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి 1946 లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని 1950లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు. ఆరంభములో కఠోర కాంగ్రేసువాది అయినా 1960లలో మార్క్సిష్టు సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు.

1947 ప్రాంతంలో లో న్యాయవాది వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం , విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగాడు. పట్టణ జీవితంలో వస్తున్న పెనుమార్పులను గమనించాడు. గురజాడ అప్పారావు, శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న నమాజంలో గిలగిలలాడే వారి ఆరాటాలను తన రచనలలో చిత్రించాడు. రావిశాస్త్రి కథా కథన పద్థతి చాలా పదునైనది, కాపీ చేస్తే తప్ప అనితరసాథ్యం.

రచనలు

తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. జేమస్ జాయిస్ "చైతన్య స్రవంతి" ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది. జేమస్ జాయిస్ రచనా పద్థతిని మొదటిసారిగా తెలుగు కథలకు అన్వయించినది కూడా రావిశాస్త్రినే. ఇది ఆయన మొట్టమొదటి నవల.

ఈ నవలను ఆయన 1952 లో రచించాడు. తరువాత రాజు మహిషీ,రత్తాలు-రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించిచాడు. ఈయన జీవిత చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా ఈ అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే.

ఆంధ్రలో మధ్యపాన నిషేధ చట్టం తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ఆరుసారా కథలు తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేసాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఆయన నిజం నాటకంలో వ్యక్తం చేసాడు.

రచనల జాబితా

విశాఖపట్నం బీచ్ రోడ్ లో రావిశాస్త్రి విగ్రహం.
  • కథాసాగరం(1955)
  • ఆరుసారా కథలు (1961)
  • రాచకొండ కథలు (1966)
  • ఆరుసారో కథలు (1967)
  • రాజు మహిషి (1968)
  • కలకంఠి (1969)
  • బానిస కథలు (1972)
  • ఋక్కులు (1973)
  • రత్తాలు-రాంబాబు (1975)
  • సొమ్ములు పోనాయండి
  • గోవులోస్తున్నాయి జాగ్రత్త
  • బంగారం
  • ఇల్లు
నాటకం / నాటికలు
  • నిజం నాటకం
  • తిరస్కృతి నాటిక
  • విషాదం నాటిక

రావిశాస్త్రి విశిష్టత

1983లో ఆంథ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణను ప్రకటిస్తే దానిని తిరస్కరించాడు. అంతే కాకుండా 1966 లో తీసుకున్న సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చివేసాడు. కేంద్ర సాహిత్య అకాడమీ

ఆయన కథకుడే కాదు నటుడు కూడా . ఆయన వ్రాసిన నిజం నాటకంలోను, గురజాడ కన్యాశుల్కం నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆరోజుల్లోనే, అంటే 1962 ప్రాంతంలో, వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.

"రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చేడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను" అన్నాడు రావిశాస్త్రి. 1922 జూలై 30న పుట్టి, పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాల నెదిరించి నెలల తరబడి జైలుపాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం.. తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993 నవంబర్ 10 న రావిశాస్త్రి పెన్ను, కన్నుమూశాడు.

బయటి లింకులు

29, నవంబర్ 2014, శనివారం

తెలుగు కవులు - పుట్టపర్తి నారాయణాచార్యులు




వికీపీడియా నుండి
పుట్టపర్తి నారాయణాచార్యులు
Puttaparti.jpg
పుట్టపర్తి నారాయణాచార్యులు
జననం పుట్టపర్తి నారాయణాచార్యులు
1914, మార్చి 28
అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు
మరణం 1990 సెప్టెంబర్ 1
ఇతర పేర్లు పుట్టపర్తి నారాయణాచార్యులు
సుపరిచితుడు తెలుగు కవి.
మతం హిందూమతం
పిల్లలు 6; 5 కుమార్తెలు; 1 కుమారుడు
ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట
పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.

జీవిత విశేషాలు

పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి(ķóndamma) గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. [[శ్రీకృష్ణదేవరాయలరాజగురువు) తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది.
నారాయణాచార్యులు చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆయన తిరుపతి సంస్కృత కళాశాలలో సంస్కృతం నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డి.టి. తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం, ఛందస్సు, తదితరాలు నేర్చుకున్నారు. పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరత నాట్యం నేర్చుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం ఆయనలో త్రివేణీ సంగమంలా మిళితమయ్యయి. చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేయడమే గాక సన్నివేశాల మధ్య తెర లేచేలోపు నాట్యం చేసే వారు.
ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. మొదట ఆయన పని చేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివితీరా పొగడడం, గాంధీ వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి ఆయనతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరు లోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది.
ఆయన బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు. తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. హృషీకేశ్ లో ఆయన పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి ఆయనకు "సరస్వతీపుత్ర" బిరుదునిచ్చారు. ఆయనకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి ఆయన ఉంచుకున్నారు.
పుట్టపర్తి ఆనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ కావ్యాలను తెలుగులోనికి అనువదించారు."లీవ్స్ ఇన్ ది విండ్", దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన "ది హీరో" ఆంగ్లంలో ఆయన స్వంత రచనలు. ఆయన ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే. ఆయనకు ఆంగ్లం నేర్పిన వి.జె. పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది. అప్పట్లోనే ఈయన వ్రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ కావ్యం చూసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు.
అయితే పిట్ దొరసాని మాత్రం "ఇంగ్లీషులో వ్రాయడానికి అనేక మంది ఇండియన్స్ ప్రయత్నించి ఫెయిలైనారు. మీరెంత కష్టపడినా మిమ్మల్ని క్లాసికల్ రైటర్స్ ఎవరూ గౌరవించరు. అందుకే బాగా చదువుకో. కానీ ఇంగ్లీషులో వ్రాసే చాపల్యం పెంచుకోవద్దు." అని చెప్పింది. దాంతో ఆయన చాలా రోజులు ఆ ప్రయత్నమే చేయలేదు. అయితే ఆ తర్వాత చాలా కాలానికి భాగవతాన్ని ఇంగ్లీషులోకి అనువదించడంతో బాటు ది హీరో నాటకాన్ని వ్రాశారు. కథంతా స్వీయ కల్పితమే.
ఆయన చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే చరిత్రకారులకు ఆయన్ను పట్ల గొప్ప గౌరవముండేది. ఒకసారి ఆయనకు కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశమున్న మల్లంపల్లి సోమశేఖరశర్మ "ఆయన్ను కవిగా కంటే చారిత్రకునిగా గౌరవిస్తానని" సందేశం పంపాడు. తర్వాత పుట్టపర్తి చారిత్రకులను ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ "సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?" అని అడిగి, ఆయన దిగ్భ్రాంతుడై నిలబడి పోతే, తనే సమాధానం చెప్పాడు~: "కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్ళూ" అని.
భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది. ఆయితే ఆయన నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్నివిధాలా అర్హులనీ, ఆయనకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమనీ పలువురు పండితులు భావిస్తారు. గుర్రం జాషువా "పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు?" అని ప్రశ్నించాడు. దేశంలోని అన్ని ప్రాంతాలలో, హైదరాబాదు, చెన్నై, కలకత్తా లాంటి అన్ని నగరాలలో ఆయన సత్కారాలు పొందారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి. ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పని చేసి 1990 సెప్టెంబర్ 1న స్వర్గస్థులయ్యారు.
వీరి కాంశ్య విగ్రహం ప్రొద్దుటూరు పట్టణంలో 2007 సంవత్సరంలో ప్రతిష్టించబడినది.[1]
పుట్టపర్తి నారాయణాచార్యులు
'సాధనా సంపత్తి.. పుట్టపర్తి సాహితీ సుధ'బొద్దు పాఠ్యం
సాహిత్యాకాశంలో పుట్టపర్తి ధృవతారగా ఎలా నిలిచారో సాధనాపరంగానూ వారిస్థాయి అంతే ఎత్తులో వుంది..కేవలం యే ఆధ్యాత్మిక అనుభూతి కలగలేదని సంసారాన్ని విడచి సాధువులను వెతుక్కుంటూ హిమాలయాల దారి పట్టి అక్కడ స్వామి శివానంద సరస్వతిని భగవత్సంకల్పితంగా కలిసి వారిచే సరస్వతీ పుత్రా అనిపించుకుని నడిచేదైవం కంచి పరమాచార్యులు చంద్రశేఖరులచే అమితంగా ప్రేమింపబడి నీ అంత్యకాలంలో కృష్ణ దర్శనమౌతుంది అని వారిచే ఆశీర్వాదమందిన పుణ్య చరితులు పుట్టపర్తి..
నా గత జన్మ యేమిటి
ఈ జన్మలో నా స్థితి యేమి కృష్ణ సాక్షాత్కారం అవుతుందా..ఇదే ప్రశ్న పుట్టపర్తి తోటే పుట్టి పెరిగి పుట్టపర్తిని నడిపించి చివరికి తనలోనే కలిపేసుకుంది.. ఈ వివరాలు భవిష్యత్తులో పుట్టపర్తిపై పరిశోధన చేసేవారికీ,ఆరాధించేవారికీ, ఎంతో మార్గదర్శకంగా ఉంటాయి ఎవ్వరి జేవితం లోనూ కనిపించని వైవిధ్యాలు పుట్టపర్తి లో ఉన్నాయి జ్యోతిష్య పండితులు పుట్టపర్తి పాండిత్యానికీ 'సంగీత నాట్య సాహిత్య ఇవే కాక మరెన్నో కళలలో అభినివేశానికీ ముఖ్యంగా వారి జీవన సూత్రమైన సాధనమయ ప్రపంచంలోని రహస్యాలను కనుగొనడానికి శ్రీవారి జాతకం బయల్పరచటం జరిగింది పుట్టపర్తి వారి జాతక వివరాల కోసం మీరు ఈ లింక్ ను దర్శించవలసి వుంటుంది..
http://puttaparthisaahitisudha.blogspot.in/2013/10/blog-post_8836.html
తప్పకుండా వారు వారి గమ్యాన్ని చేరారని మేము వారి ప్రియ శిష్యులూ భావిస్తున్నాము వారి నిర్యాణ సమయంలో దగ్గరున్న గోవిందు అనే శిష్యుడు అయ్య ఇచ్చామరణం పొందినట్లు మాకనిపించిందమ్మా..వారి సహస్రారం నుంచీ ఆత్మ నిర్గమించిందనిమేము కనుగొన్నాము అని వివరించాడు..ముఖ్యంగా ఇంకో విషయం పుట్టపర్తి అంత్య సమయంలో వారి ఆధ్యాత్మ శిష్యులు మాత్రమే చుట్టూ వుండటం..భాగవతం దశమ స్కందం తీయమని బాబయ్య తదితరులకు చెప్పి వ్యాఖ్యానిస్తూ దాదాపు అరగంట గంట పాటు తెల్లవారి నాలుగ్గంటల నుంచీ.. ఏకాదశీ తిధి నాడు' ' 'శ్రీనివాసా..' అని పడకపై ఒరిగిపోవటం యేవో రహస్యాలను విప్పీ విప్పక చెప్పటం లేదూ..
పుట్టపర్తి జాతకం వారి స్వహస్తాలతో
సేకరణ : శ్రీ రామావఝుల శ్రీశైలం సమర్పణ : పుట్టపర్తి అనూరాధ

రచనలు

కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా "పెనుగొండ లక్ష్మి" అనే గేయ కావ్యం రాశాడు. చిత్రంగా తర్వాత ఆయన విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం "పెనుగొండ లక్ష్మి" కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు "పూర్తి" మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో ఆయన పాస్ కాలేకపోయారు. ఆయన బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.
తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ నవల ఏకవీర ను మలయాళం లోనికి అనువదించాడు. పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు. కాని పుట్టపర్తివారి విషయంలో మాత్రం దీనికి విరుద్దం. ఒక సారి విజయవాడలో పుట్టపర్తి తన "శివతాండవం" గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై ఆయనను భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరాడు. ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం ఐపోయాక ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు.
తెలుగులో ఆయన వ్రాసిన "శివతాండవం" ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. దీనిని అనేకమంది పండితులు ఆధునిక మహా కావ్యంగా అభివర్ణిస్తారు. ఇది ఆరు భాగాలుగా ఉంది. దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం చేయమనే వారు. తెలుగు అర్థం కాని వారు సైతం ఆ మాత్రాచ్ఛందస్సు లోని శబ్దసౌందర్యానికి పరవశులయ్యేవారు. ఆయన గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని ఆయన స్వయంగా గానం చేయగా విన్న వాళ్ళు "ఆ శివుడు ఆడితే చూడాలి-ఆచార్యులవారు పాడితే వినాలి" అని భావించేవారు.
మచ్చుకు :
కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!
ఆయన 140 పైగా గ్రంధాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల ఆయన రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మ తో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.

ఆయన వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.
తెలుగులో స్వతంత్ర రచనలు.
పెనుగొండ లక్ష్మి, షాజీ, మేఘదూతము, సాక్షాత్కారము, పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్), శ్రీనివాస ప్రబంధమ్, ఆగ్నివీణ, ప్రబంధ నాయకులు, పాద్యము, సిపాయి పితూరీ, గాంధీ ప్రస్థానం, క్రాంతి సందేశం, అనురాగం, ఆశ, స్మృతి, ఓదార్పు, ఎడబాటు, వీడుకోలు, ఆంధ్ర భారతోపన్యాసాలు, భాగవతోపన్యాసాలు, రామకృష్ణుని రచనా వైఖరి, వసుచరిత్ర విమర్శనమ్, విజయనగర రాజ్య సాంఘిక చరిత్ర, మొదలైనవి 7,000 కృతులు
ఆంగ్లంలో స్వతంత్ర రచనలు
  • లీవ్స్ ఇన్ ది విండ్.
  • ది హీరో
మలయాళంలో స్వతంత్ర రచనలు
  • మలయాళ నిఘంటువు
సంస్కృతంలో స్వతంత్ర రచనలు
  • త్యాగరాజ స్వామి సుప్రభాతం.
  • చెన్నకేశవ సుప్రభాతం.
  • శివకర్ణామృతం

అనువాదాలు

  • హిందీ నుండి:కబీర్ గీతాలు(కబీర్ వచనావళి,ఎన్.బి.టి ప్రచురణ)
  • మరాఠీ నుండి:భగవాన్ బుద్ధ
  • మలయాళం నుండి:స్మశానదీపం
  • మలయాళం లోకి:ఏకవీర
  • ఇంగ్లిషు లోకి:భాగవతం

వ్యక్తిత్వం

నారాయణాచార్యులు అహంభావిగా కనిపించే ఆత్మాభిమాని. తన కవిత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే నేను వ్రాసే తరహా కవిత్వం వారికి నచ్చ లేదు అనుకుని ఊరుకునే వాడు. కానీ తనకు పాండిత్యం తక్కువంటే మాత్రం సహించే వాడు కాదు. నిజంగా తన సాహితీ కృషికి అవసరమైన అంశాల్లో తనకు తెలియనిదేదైనా ఉంటే పట్టుదలతో నేర్చుకునే వాడు. అందుకే "నేను పెద్ద పండితుణ్ణి. ఇందులో సందేహం లేదు. నేను ఏ పరీక్షకు నిలబడడానికైనా తయారే. అయితే వినయపరుణ్ణి. నన్ను రెచ్చగొడితే మాత్రం భయంకరుణ్ణౌతా." అనేవాడు.
ఒకసారి ఆయన అనంతపురంలో జరిగిన సాహిత్యోపన్యాసాలకు వెళ్ళినప్పుడు కడపలో ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ జరిగింది. గంటి జోగి సోమయాజి సభాధ్యక్షుడు. ఆ సభలో పుట్టపర్తి గురించి "ఆయనకు తెలుగు తప్ప ఏ భాషా రాదు. పధ్నాలుగు భాషలు వచ్చని ప్రచారం చేసుకుంటాడు." అని విమర్శలు చేశారు. ఆ రాత్రే తిరిగి వచ్చిన ఆయన మరునాడు సభకు వెళ్ళి "14 భాషల్లో ఎవరు ఏ భాషలో నైనా ఏ ప్రశ్నైనా వేయవచ్చు.మీరు అడగండి. ఏ భాషలోనైనా సరే ఆశు కవిత్వం చెబుతాను." అని సాహిత్యంలో అహంకారం అనే విషయం మీద రెండున్నర గంటలు మాట్లాడి "నాకు అహంకారముంది. దీంట్లో న్యాయముంది." అన్నారు.

ప్రముఖుల అభిప్రాయాలు

  • పుట్టపర్తి వారిలాగ బహుభాషల్లో, బహుశాస్త్రాల్లో పండితులైన వారు, కవిత్వంతో బాటు విమర్శనారంగంలో కూడా అనన్యమైన ప్రతిభ చూపిన వారు నేటితరంలో కనిపించరు. జ్ఞానపీఠం వంటి గౌరవానికి వారు నిజంగా అర్హులు. కానీ అది తెలుగువారి దురదృష్టం వల్ల వారికి లభించలేదు. -భద్రిరాజు కృష్ణమూర్తి
  • శివతాండవం విన్నప్పుడు తుంగభద్రాప్రవాహంలో కొట్టుకు పోతున్నట్లనిపించింది. తర్వాత మేఘదూతం చదివాను. ఇది నా దృష్టిలో శివతాండవం కంటే గొప్ప రచన. -రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
  • ఆధునిక సారస్వతమున శివతాండవం వంటి గేయకృతి ఇంకొకటి లేదు. -తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి
  • కవిత్వాన్నీ, పాండిత్యాన్నీ కలగలిపి ఔపోశన పట్టిన అగస్త్యుడు. -సి. నారాయణ రెడ్డి
  • ఎవని పదమ్ములు శివ తాండవ లయాధిరూపమ్ములు
ఎవని భావమ్ములు సుందర శివాలాస్య రూపమ్ములు
అతడు పుట్టపర్తి సూరి! అభినవ కవితా మురారి!!
...
పుట్టపర్తి ధిషణకు జైకొట్టగ మనసాయె నాకు.
కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు
వెలితి ఎరుగలేని కడలి పొలుపు తెలుపు అతని తలపు
వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు
రక్తికి భక్తికి సేతువు రచియించిన రసికుడతడు!!! -సి. నారాయణ రెడ్డి

మూలాలు

బయటి లింకులు