Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

1, నవంబర్ 2014, శనివారం

తెలుగు కవులు - కందుకూరి వీరేశలింగం



వికీపీడియా నుండి
(కందుకూరి వీరేశలింగం నుండి దారిమార్పు చెందింది)
గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.
కందుకూరి వీరేశలింగం పంతులు
Kandukuri Viresalingam.jpg
నవయుగ వైతాళికుడు
జననం 1848, ఏప్రిల్ 16
రాజమండ్రి
మరణం 1919, మే 27
సుపరిచితుడు సంఘసంస్కర్త, రచయిత
సాధించిన విజయాలు రావుబహద్దూర్
భార్య / భర్త బాపమ్మ

జీవిత విశేషాలు

వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లా లోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రి కి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది.
వీరేశలింగంకు నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. చిన్నప్పటినుండి, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.
చదువుకునే రోజుల్లో [కేశుబ్ చంద్ర సేన్] రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు. 1867 లో పెదనాన్న మరణంతో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు, కాని లంచం ఇవ్వనిదే రాదని తెలిసి, ప్రభుత్వోద్యోగం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. న్యాయవాద పరీక్ష వ్రాసి, న్యాయవాద వృత్తి చేపడదామని భావించినా, అందులోనూ అవినీతి ప్రబలంగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అని గ్రహించి, అదీ మానుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు.
ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించాడు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి 1874 అక్టోబరు లో వివేకవర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. “సంఘం లోని అవకతవకలను ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి, అవినీతిపరులను సంఘం ముందు పెట్టడం” వివేకవర్ధని లక్ష్యాలని ఆయన మొదటి సంచికలో తెలియజేసాడు. చెప్పడమే కాదు, అలాగే నడిపాడు కూడా. వివేకవర్ధని అవినీతిపరుల పాలిట సింహస్వప్నమయింది.
కందుకూరికి సమకాలిక ప్రముఖుడైన కొక్కొండ వెంకటరత్నం పంతులు తో స్పర్ధ ఉండేది. కందుకూరి వివేకవర్ధని స్థాపించిన తరువాత కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనే హాస్య పత్రికను ప్రారంభించాడు. తెలుగులో మొదటి ప్రహసనం కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించాడు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురించాడు.
ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన.
యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27 న మరణించాడు.

సంఘ సంస్కరణ కార్యక్రమాలు

వీరేశలింగం హేతువాది . ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషి లతో పెనవేసుకు పోయింది; ఒకదానినుండి మరో దానిని విడదీసి చూడలేము. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణాభిలాషను నిరూపించుకున్నాడు.
వివేకవర్ధని పత్రిక ద్వారా అవినీతిపరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు. సంఘంలోని ఇతర దురాచారాలపై ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి పత్రికను ఆయుధంగా వాడుకున్నాడు. సంఘసంస్కరణ కై ప్రవచనాలు మాత్రం చెప్పి ఊరుకోలేదు, స్వయంగా అందుకై నడుం కట్టి కార్యరంగంలోకి దూకాడు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. తానే స్వయంగా చదువు చెప్పేవాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, కుల నిర్మూలన కు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసాడు. వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధని లో వ్యాసాలు రాసాడు.
ఆయన చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు. 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు. తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మ తిరువూరు తాలూకా రేపూడి కి చెందిన పిల్ల. వరుడు గోగులపాటి శ్రీరాములు . ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, మరియు ఆయన విద్యార్ధులు వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (పెళ్ళయ్యాక బాపమ్మ కు అత్తగారు రాజ్యలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నారు) భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి, పెళ్ళివారికి వంట చేసిపెట్టింది. స్త్రీల కొరకు సతీహిత బోధిని అనే పత్రికను కూడా నడిపాడు.

విప్లవాత్కమైన మార్పు:

చిన్ననాటి నుండి అతనికి అలవడిన స్వాభావిక లక్షణములే కార్యదీక్ష,సాహసము,విజ్ఞానత్రుష్ణలు.రామమోహనరాయ్,దేవేంద్రనాద్ ఠాగూర్,కేశవ చంద్రసేన్,ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ల బోధనలు,రచనలు ఇతని ఆద్యాత్మిక చింతనలో విప్లవాత్కమైన మార్పును గోనితెచ్చెను.1887 సం,,లో సంఘ సంస్కరణ సమాజము స్తాపించి,మతమనే ముసుగులో అదోగతిలో ఉన్న హైందవ సమాజములోని దురాచారములపై విప్లవ ద్వాజమేత్తేను.అతడు మూడ విశ్వాసములు,సనాతనాచారములపై జరిపిన పోరాటము చిరస్మరణీయమైనది.

సాహితీ వ్యాసంగం

సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకడు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి.
ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. ఆన్ని గ్రంధాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్ర ను కూడా ప్రచురించాడు.
సంగ్రహ వ్యాకరణం వ్రాసాడు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.

కందుకూరి రచనల జాబితా

పద్య కావ్యాలు

  • "మార్కండేయా" మకుటంతో శతకం (తొలినాళ్ళ రచన)
  • "శ్రీరాజమహేంద్ర పురవర గోపాలా" మకుటంతో శతకం (తొలినాళ్ళ రచన)
  • శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధం (నల చరిత్ర) - మూడు ఆశ్వాసాల కావ్యం
  • రసికజన రంజనం (ప్రబంధం) - 1870 - చిత్ర కవిత్వం, శృంగారం ప్రధానంగా ఉన్నాయి. ఇటువంటివి రచించడం సరి కాదని కాలక్రమాన మానివేశానని స్వీయరచనలో పేర్కొన్నాడు
  • అభాగ్యోపాఖ్యానము - హేళనా పూర్వకమైన సంఘ సంస్కార దృష్టితో కూడిన వ్యంగ్య కావ్యం
  • శుద్ధాంధ్ర భారత సంగ్రహము - అచ్చతెలుగులో మూడు ఆశ్వాసాల కావ్యం
  • సరస్వతీ నారద విలాపము (1895) - పద్యాత్మకమైన వ్యంగ్య ప్రహసనం - భాషా ప్రయోగం పట్ల కందుకూరి దృక్పథంలో వచ్చిన మార్పును ఈ కావ్యంలో చూడవచ్చును. అర్ధ సారస్యం లేని ఊహలతో, పాండిత్య ప్రకర్షతో ఇటు సరస్వతిని, అటు నారదుని అవమానిస్తున్నారని ఇందులో చూపాడు.
  • నీతి పద్యాలు
  • స్త్రీ నీతి దీపిక
  • జాన్ గిల్పిన్ - ఆంగ్లంలో "విలియమ్ కౌపర్" వ్రాసిన కావ్యానికి తెలుగు సేత
  • పథిక విలాసము - ఆంగ్లంలో "ఆలివర్ గోల్డ్‌స్మిత్" వ్రాసిన "ది ట్రావెలర్" కావ్యానికి తెలుగు సేత

నాటకాలు

  • చమత్కార రత్నావళి - "కామెడీ ఆఫ్ ఎర్రర్స్" అనే షేక్స్‌పియర్ నాటకాన్ని తెలుగులో వ్రాసి విద్యార్ధులచే ప్రదర్శింపజేశాడు.
  • కాళిదాసు శాకుంతలం - తెలుగులో
  • రత్నావళి - సంస్కృత రూపకానువాదం
  • దక్షిణ గోగ్రహణం
  • సత్య హరిశ్చంద్ర
  • మాళవికాగ్ని మిత్రం వంటి 12 నాటకాలు

నవలలు

  • రాజశేఖర చరిత్రము - తొలి తెలుగు సాంఘిక నవల. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్‌స్మిత్ వ్రాసిన "వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్" అనే నవలకూ దీనికీ కొన్ని పోలికలున్నాయి. అయితే ఆ నవల కొంత ఉపకరించిందనీ, కాని ఇది అనువాదం కాని అనుకరణ కాని కాదని వీరేశలింగం చెప్పాడు. "పంతులుగారి మహాయశస్సునకు శరత్కౌముది వంటిది" అని అక్కిరాజు రమాపతిరావు అన్నాడు. ఇందులో రచయిత సాంఘిక దురాచారాలను, మూఢ నమ్మకాలను విమర్శించాడు. చక్కని తెలుగు సామెతలను, లోకోక్తులను ప్రయోగించి ముందుతరం నవలలకు మార్గదర్శకంగా నిలచాడు.
  • సత్యరాజా పూర్వదేశ యాత్రలు - ఆంగ్లంలో "జోనాథన్ స్విఫ్ట్" వ్రాసిన "గల్లివర్స్ ట్రావెల్స్" ఆధారంగా వ్రాశాడు. ఇందు సమాజపు వికృత సంఘటనలను అవహేళన చేశాడు. "ఆడ మళయాళం" అనే పదం ఇందులోంచే ప్రసిద్ధమయ్యింది.
  • సత్యవతీ చరిత్రము (1883) - స్త్రీ విద్యాభివృద్ధిని, ప్రాముఖ్యతను బోధించే నవల - ఆ రోజులలో ఇది మంచి ప్రాచుర్యాన్ని పొందింది.
  • చంద్రమతీ చరిత్రము (1884) - మత విషయాలను, ధర్మాలను, స్త్రీ అభ్యుదయాన్ని ప్రోత్సహించే నవల.

ప్రహసనాలు

సాంఘిక దురాచారాలను సంభాషణాత్మకంగా, వినోదాత్మకంగా విమర్శించే ఇటువంటి ప్రయోగానికి వీరేశలింగమే ఆద్యుడు. చాలా ప్రహసనాలను "వివేక వర్ధిని" పత్రికలో ప్రచురించాడు. "ప్రహసనము ఆయన కరములకు ఉచితపరికరమయ్యెను. శైలి సొంపులతోను, హాస్యంపుదళులతోను శోభిల్లెడి ఈ ప్రహసనావళియందు దుష్టాంగమును ఖండించి శేషాంగ స్ఫూర్తికి రక్షణ చేయు శస్త్ర చికిత్సకునివలె ఈ రచయిత సాంఘిక అనర్ధములను దునుమాడెను" అని "రాయసం వెంకట శివుడు" ప్రశంసించాడు. సుమారు 50 కి పైగా వ్రాసిన ప్రహసనాలలో 10 వరకు ఆంగ్లమూలాలపై ఆధారపడినాయి. తక్కినవి స్వతంత్ర రచనలు. ప్రహసనాలు "హాస్య సంజీవని" పేరుతో మూడు భాగాలుగా ప్రచురితమయ్యాయి. కొన్ని ప్రసిద్ధ ప్రహసనాలు
  • పెళ్లి వెళ్ళిన తరువాత పెద్ద పెళ్ళి, లోకోత్తర వివాహము - వేశ్యాభిమానం, చాదస్తపుటాచారాలు, శాఖా భేదాలు, అజ్ఞానం, అమాయకత్వం, స్వార్థం వంటి అంశాలు కలగలిపినవి.
  • జమా బందీ, యోగాభ్యాసము - కులాచారాన్ని నిరసిస్తూ
  • వేశ్యా విషయ సంవాదము
  • చంద్ర గ్రహణం
  • తేలు మందు
  • హిందూ మతసభ
  • బహుభార్యాత్వం
  • బాల భార్యా వృద్ధ భర్తృ సంవాదం
  • మ్యునిసిపల్ నాటకము
  • కామరూప ప్రహసనము
  • కలిపురుష శనైశ్చర విలాసము - కలి, శని కలిసి దేశంలో ప్రజలను అజ్ఞానులుగా, మూఢులుగా, మధ్యపాన ప్రియులుగా చేస్తున్నారని
  • వేశ్యాప్రియ ప్రహసనం - 5 అంకాల ప్రహసనం, ఎంతో హాస్యం మిళితమైనది. ఆనాటి భోగం ఆచారాలను గురించి
  • అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనం
  • విచిత్ర వివాహ ప్రహసనం

కథలు

అధికంగా కందుకూరి కథలు స్త్రీల అభ్యుదయాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయి. కొన్ని ఆంగ్ల మూలాలనుండి అనుసరించినవి కాని అధికంగా స్వతంత్ర రచనలే. "సతీ హిత బోధిని" అనే పత్రికలో ఎక్కువగా ప్రచురించాడు. "నీతి కథా మంజరి" అనే 158 చిన్న కథల సంకలనాన్ని కూడా వెలువరించాడు.

వ్యాసాలు

వివిధ అంశాలపై వీరేశలింగం 190 దాకా వ్యాసాలు / ఉపన్యాసాలు వ్రాశాడు. సత్య వాదిని, వివేక వర్ధిని, సతీహితబోధిని, చింతామణి, సత్య సంవర్ధిని, తెలుగు జనానా నంటి పత్రికలలో ఇవి ప్రచురితమైనాయి. ఉదాహరణకు కొన్ని వ్యాసాల శీర్షికలు
  • దేశీయ మహాసభ - దాని యుద్దేశ్యములు
  • రాజ్యాంగ సంస్కరణము - కులాచార సంస్కరణము
  • ఇంగ్లీషు ప్రభుత్వము వలన లాభములు
  • నీతి, విద్య కంటె నీతి ముఖ్యము, మానుష ధర్మము, ఈశ్వరోపాసనము
  • చదువెఱుగని స్త్రీలు తమ బిడ్డలకు శత్రువులు
  • అత్తగారి కోడంటికము, భార్యా భర్తల ఐకమత్యము, స్త్రీపునర్వివాహ శాస్త్ర సంగ్రహము, స్త్రీ పునర్వివాహ విషయకోపన్యాసము

చరిత్రలు

  • ఆంధ్ర కవుల చరిత్ర - ఈ గ్రంథ రచన ఆంధ్ర వాఙ్మయ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము. సమగ్రమైన, పరిశోధనాత్మకమైన, ప్రణాళికా బద్ధమైన కవుల చరిత్ర రచనకు ఆది యత్నము. అనేక తాళపత్రాలను, శాసనాలను, ముద్రిత అముద్రిత గ్రంథాలను పరిశీలించి వెలువరించిన గ్రంథము. 1886 నుండి 1917 వరకు ఇది విస్తరింపబడింది.
  • దేశ చరిత్ర
  • నాయకుల చరిత్ర
  • ఉత్తమ స్త్రీల జీవిత చరిత్రలు

ఇతర రచనలు

  • సంగ్రహ వ్యాకరణం - లక్షణ గ్రంథం
  • కావ్య సంగ్రహం - లక్షణ గ్రంథం
  • తర్క సంగ్రహానికి ఆంధ్రీకరణం
  • ఋగ్వేదానికి తాత్పర్యం
  • శరీర శాస్త్ర సంగ్రహము
  • జ్యోతిశ్శాస్త్ర సంగ్రహము
  • జంతు స్వభావ చరితము

వీరేశలింగం నడిపిన పత్రికలు

  • వివేక వర్ధిని
  • సతీహిత బోధిని
  • సత్య సంవర్ధిని
  • సత్యదూత
  • చింతామణి
  • తెలుగు జనానా

విశిష్టత

ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు:
  • మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
  • మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
  • తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
  • తెలుగులో తొలి నవల వ్రాసింది ఆయనే
  • తెలుగులో తొలి ప్రహసనం వ్రాసింది కందుకూరి

వీరేశలింగంకు నివాళులు

రాజమండ్రి కోటిపల్లి బస్సు నిలయం కూడలిలో వీరేశలింగం విగ్రహం
కొటికెలపూడి సీతమ్మ ఇలా చెప్పింది.
ఒకయెడ స్త్రీ పునరుద్వాహమును గూర్చి
 వాదించు పండిత వరులతోడ
సరగ నింకొక దెస సంఘ సంస్కరణచే
 చెలగు సభనుపన్యసించుచుండ
పఱగ వేరొక దెస పత్రికా ప్రకటన
 భారంబు వహియించు ప్రజ్ఞ మీర
రహి నొక్క తఱి గ్రంధ రచనా విశేషంబు
 నను దెల్పు జనుల దుర్నయములెల్ల

నొక నిమేషమైన విశ్రాంతినొందకుండ
పరహితార్ధంబు కొరకునై పాటు పడుచు
కాలమెంతయో విలువగా గడుపునహహ
ఘనుడు వీరేశలింగాఖ్య కవివరుండు

ఆరుద్ర ఇలా అన్నాడు (సమగ్ర ఆంధ్ర సాహిత్యం)
" అదేం చిత్రమో గాని తాము శారీరకంగా దుర్బలులైనా జాతిని బలిష్ఠం చేసి దేశాభివృద్ధిని, భాషాభివృద్ధిని సాధించిన మనోబల భీములలో పంతులుగారు ప్రధములు. రెండోవారు గురజాడవారు. అటువంటి ఉజ్వల చారిత్రకుని ఏ బిరుదుతో వర్ణించినా అది అసమగ్రమే. అయినా నవ్యాంధ్ర నిర్మాతలనే నిర్మించినవారిగా నేను పంతులుగారిని భావిస్తున్నాను. అభినవాంధ్రకు ఆయన ఆద్య బ్రహ్మ"
అక్కిరాజు రమాపతిరావు ఇలా ఆయనను కీర్తించాడు
"వీరేశలింగం పంతులుగారు బహుయోజన శాఖా సంయుతమైన వటవృక్షము వంటి వారు. .. నేడీ దేశీయుల యొక్క సాంఘిక చైతన్యమునకు, సారస్వత వైవిద్యమునకు పంతులుగారు తమ కాలమునందు కావించిన కృషియే మూలాధారము. వారితో ఆధునిక యుగము ప్రారంభమయ్యెనని చెప్పవచ్చును."
చిలకమర్తి లక్ష్మీనరసింహం వీరేశలింగం గురించి ఇలా అన్నాడు: ఇది వీరేశలింగం సమాధి పైఈ నాటికీ కనిపిస్తుంది.
తన దేహము తన గేహము
తన కాలము తన ధనంబు తన విద్య జగ
జ్జనులకే వినియోగించిన
ఘనుడీ వీరేశలింగకవి జనులార!

వనరులు

  • అమరావతి పబ్లికేషన్సు వారి తెలుగు వెలుగులు పుస్తకం.
  • తెలుగు సాహిత్య చరిత్ర - డాక్టర్ ద్వా.నా.శాస్త్రి - ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
  • కందుకూరి వీరేశ లింగం - డాక్టర్ అక్కిరాజు ఉమాపతి రావు - "తెలుగు వైతాళికులు" లఘుగ్రంధాల పరంపరలో ముద్రింపబడినది - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు (2006)

ఇంటర్నెట్‌లో లభించే పుస్తకాలు

ఇంటర్నెట్ ఆర్చీవులలో లభిస్తున్న పుస్తకాలు

30, అక్టోబర్ 2014, గురువారం

తెలుగు కవులు - కాళోజి నారాయణరావు



కాళోజీ నారాయణరావు

వికీపీడియా నుండి
(కాళోజి నారాయణరావు నుండి దారిమార్పు చెందింది)
కాళోజి నారాయణరావు
Kaloji-1.jpg
కాళోజీ నారాయణరావు
జననం రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి-
1914 సెప్టెంబరు 9
మరణం 2002, నవంబరు13
ఇతర పేర్లు కాళోజి
సుపరిచితుడు ప్రజాకవి.,తెలుగు రచయిత
భార్య / భర్త రుక్మిణిబాయి
పిల్లలు రవికుమార్
తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి నారాయణరావు. రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజి. కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు.[1] కాళోజీ జయంతి సెప్టెంబర్ 9 ని “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు 1914, సెప్టెంబరు 9 న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.
ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ హైస్కూలు లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. 1939 లో హైదరాబాదు లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది. 1940 లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది.
మాడపాటి హనుమంతరావు , సురవరం ప్రతాపరెడ్డి , జమలాపురం కేశవరావు , బూర్గుల రామకృష్ణారావు , పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూరు విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు.
  • కాళోజి న్యాయవాద విద్య అభ్యసించినా వృత్తి ముందుకు సాగలేదు.
  • కవిత్వం రాసినా ప్రజా చైతన్య మార్గమే ఆయన లక్ష్యం. రాజకీయాలు ఆయన ప్రాణం.
  • కాళోజి రామేశ్వరరావు ఆయన అన్న, ఉర్దూ కవి. తమ్ముడికన్నా అన్న ఆరు సంవత్సరాలు పెద్ద.
  • కాళోజీ అసలు పేరు-రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి-
  • తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు.
  • కాళోజీ జన్మించిన అయిదారు నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశాడు. "నా ఏడవ నెలలో అన్నగారి భుజాలమీద ఎక్కిన నేను నా 80వ ఏట కూడా ఆ భుజాలమీద అట్లనే ఉన్న. ఆయన అట్లనే మోస్తున్నాడు!" అన్నాడు.
  • రాయ్ ను యూనివర్శల్ పర్సన్ అనేవారు. ఆంధ్రప్రదేశ్ కావాలని కోరిన కాళోజీ, 1969 లో ప్రత్యేక తెలంగాణాను సమర్ధించి, అలాగే నిలిచిపోయాడు.
  • 1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశాడు కాళోజీ. డిపాజిట్ పోయింది.
  • తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా-కాళోజీ
  • కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు. ఆయన తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ - శ్రీశ్రీ
  • ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక- కాళోజి
  • 'పుటక నీది-చావు నీది-బతుకంతా దేశానిదీ' --- జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజి
  • 1943 లోనే ఆయన కథల్ని కాళోజీ కథలు పేరుతో అప్పట్లో హైదరాబాదు లో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన అణాగ్రంథమాల సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది.
  • ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు పాములపర్తి సదాశివరావు తో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక వెలువరించాడు. విశాలాంధ్ర కావాలనీ అన్నాడు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలనీ అన్నాడు.
  • రెండేళ్లు రాష్ట్ర విధానపరిషత్తు సభ్యుడిగా ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు(1958-60).
  • విద్యార్థి దశనుంచీ మిత్రుడైన పి.వి.నరసింహారావు మాటను కాదనలేక ఆయన భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని1992 లొ స్వీకరించాడు! అయితే ప్రభుత్వం అవార్డునిచ్చిందనీ, సత్కరించిందనీ తన హక్కుల పోరాటం, తెలంగాణా రాష్ట్ర వాదం ఆయన చివరివరకూ వదులుకోలేదు.
  • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు.
  • ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థపక సభ్యుడు.
  • 2002 నవంబరు పదమూడో తేదీన కాళోజీ కన్నుమూశాడు!

నిజాం జమానాల

  • తెలంగాణనిజాం జమానాల నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసికంగా ఎదిరించిండు.
  • ఆర్యసమాజ్ సభలు, ఊరేగింపులు, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కార్యకలాపాలు, రచయితల సభలు, అన్నీ కాళోజి భాగం పంచినయి.
  • సహ యువకుల్ని చైతన్యంలకి మళ్లించేటోడు. గాంధీ అహింసామార్గాన్నే శిరసావహించినా అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించిండు.
  • నిజాం వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసిండు. నిజాం దుష్కృత్యాల్ని తన సహజ శైలిల తూర్పారబట్టిండు.
  • నిజాం ఆగ్రహించి కాళోజికి వరంగల్ నగర బహిష్కారం విధించిండు. కాళోజి మరింత తీవ్రంగా అంకితభావంతో అక్షరం సంధించిండు. 1939 ల, 1943 ల రెండుసార్లు జైలుకి పోవాల్సివచ్చింది.

రచనలు

తెలంగాణా వాదం

ఉల్లేఖన

ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె. - కాళోజీ

29, అక్టోబర్ 2014, బుధవారం

తెలుగు కవులు - జ్వాలాముఖి



వికీపీడియా నుండి
వీరవెల్లి రాఘవాచార్య
Jwalamukhi.jpg
జ్వాలాముఖి
జననం వీరవెల్లి రాఘవాచార్య
1938 ఏప్రిల్ 12
మెదక్ జిల్లా ఆకారం
మరణం 14 డిసెంబరు 2008
మరణ కారణము కాలేయ వ్యాధి, గుండెపోటు
ఇతర పేర్లు జ్వాలాముఖి
వృత్తి విరసం సభ్యుడు
ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో
సుపరిచితుడు ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు
భార్య / భర్త యామిని
జ్వాలాముఖి ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకడు. విరసం సభ్యుడు. శరత్ జీవిత చరిత్రను 'దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు' పేరుతో హిందీ నుంచి అనువదించాడు.

వ్యక్తిగత జీవితం

మెదక్ జిల్లా ఆకారం గ్రామంలో 1938 ఏప్రిల్ 12 న జన్మించిన ఆయన అసలు పేరు వీరవెల్లి రాఘవాచార్య. తల్లిదండ్రులు నరసింహాచార్యులు, వెంకటలక్ష్మీనర్సమ్మ. హైదరాబాద్‌లోని మల్లేపల్లి, నిజాం కళాశాలలో విద్యాభాస్యాన్ని పూర్తి చేసుకున్న ఆయన నిజాం కళాశాలలో ఎల్.ఎల్‌.బీ. పూర్తిచేశాడు. ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో 12 ఏళ్లు విధులు నిర్వహించాడు. తరువాత హైదరాబాద్‌లోని ఎల్.ఎన్‌.గుప్తా సైన్స్, కామర్స్ కళాశాలలో24 ఏళ్లు అధ్యాపకుడిగా పనిచేసి 1996లో పదవీ విరమణ చేశాడు. మొదట్లో నాస్తికవాదం, పిదప మానవతా వాదం, అనంతరం మార్కిస్టు ఆలోచన విధానం వైపు మొగ్గు చూపాడు. 1958లో 'మనిషి' దీర్ఘకవితకు గుంటూరు రచయితల సంఘంవారు కరుణశ్రీ చేతులమీదుగా ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందజేశారు. 1965-70 మధ్య దిగంబర కవుల పేరుతో కవితా సంపుటాలు రాశాడు. ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (ఓ.పీ.డీ.ఆర్) సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు సార్లు చైనాకు వెళ్లారు. 1971లో విరసం సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద నిఖిలేశ్వర్, చెరబండరాజులతో ముషీరాబాద్ జైల్లో యాభై రోజులున్నాడు.[1] 1975 ఎమర్జెన్సీ కాలంలో 15 రోజులు జైల్లో ఉన్నారు. ఈయన పై మఖ్దూం మొహియుద్దీన్ ప్రభావం ఉంది. 14 డిసెంబరు 2008 న కాలేయ వ్యాధి, గుండెపోటుతో మరణించాడు.

జ్వాలాముఖి రచనలు

  • 'వేలాడిన మందారం' నవల
  • హైదరా'బాధ'లు
  • 'ఓటమి తిరుగుబాటు' కవితా సంకలనం
  • 'రాంగేయ రాఘవ' జీవిత చరిత్ర హిందీ నుంచి తెలుగు అనువాదం

జ్వాలాముఖి గురించి నిఖిలేశ్వర్

కాలేజీలో జరిగే డిబేటింగ్ లో విద్యార్థుల మధ్య వాగ్వివాదాలలో జ్వాలాముఖి ఆవేశంగా మాట్లాడేవాడు. నేనేమో తడబడుతూ గందరగోళంలో పడిపోయేవాణ్ణి! 1960లలో జ్వాల ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటలకే సైకిల్‌పై బయలుదేరి మల్లేపల్లిలోని సీతారామ్ దేవాలయం నుంచి దాదాపు పదిహేను మైళ్లు ప్రయాణం చేసి సెంటర్‌కు చెమటలు కక్కుతూ ఎనిమిది గంటలకల్లా మారేడ్‌పల్లిలోని ఏ.ఓ.సి స్కూల్ కు చేరేవాడు. నేనేమో ముషీరాబాద్ నుంచి సైకిల్ తొక్కుతూ రోజు 10 మైళ్లు అదే అవస్థలో ఉద్యోగానికి హాజర్! నా ప్రేమ వివాహం 1963లో! కులాంతర వివాహం, పైగా అమ్మాయి ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది.. ఇక ఆ రహస్య వివాహానికి జ్వాలాముఖి అన్నివిధాలా తోడ్పడి యాకుత్‌పురాలోని ఆర్యసమాజ్ మందిర్‌లో వివాహం జరిపించాడు. విజయవాడ దాకా తోడు వచ్చి నన్ను-యామినిని బెంగుళూర్ హానిమూన్‌కు పంపించేసాడు. ఆ తర్వాత మా కుటుంబాల ఆత్మీయ సంబంధాలు ఎంతో ఆప్యాయంగా సాగిపోయిన దశలోనే మా పిల్లల కులాంతర వివాహాలకు ఆయన నిర్వాహకుడు. ఆయన పిల్లల కులాంతర- మతాంతర వివాహాలకు నేను నిర్వాహకుడిగా..! మమ్మల్ని కాలేజీ ఉపన్యాసాలకు పిలిస్తే బాంబులతో వస్తారని ఆర్ఎస్ఎస్ అనుయాయులు (ఎబివిపి) కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసారు. అప్పుడు జ్వాల ప్రిన్సిపాల్ సమక్షంలోనే తనదైన శైలిలో ప్రసంగిస్తూ జేబుల్లోంచి కవితలు తీస్తూ, మేము బాంబులతో వస్తే పరిణామాలు మరో విధంగా వుండేవని చమత్కరించాడు. సభలు-సమావేశాలు- ఉపన్యాసాల మూలంగా తన పుస్తక ప్రచురణను నిర్లక్ష్యం చేసాడు. 1971లో వచ్చిన 'ఓటమి తిరుగుబాటు' తర్వాత మళ్లీ మరో సంపుటిని ప్రచురించలేదు. 'వేలాడిన మందారం' నవల, హైదరాబాద్ కథలు వున్నాయి. ఆయన నిశిత వివేచనతో రాసిన సాహిత్య వ్యాసాలు సంపుటిగా రావలసి వుంది.స్నేహశీలీ, ఆర్ద్ర హృదయుడు, భోజన ప్రియుడు, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిస్పందించిన సాహితీవేత్త. సభలు - సమావేశాలు - ఉపన్యాసాల మూలంగా తన పుస్తక ప్రచురణను నిర్లక్ష్యం చేసాడు.

ఉత్ప్రేరక జ్వాలాముఖి కి అక్షర నివాళులు

స్వతహాగా తీవ్రంగా స్పందించే గుణదాముడు. కవి పండితుడిగా ఎదిగిన క్రమంలో దిగంబర కవుల్లో' దిట్ట. విరసం వ్యవస్థాపక సభ్యుల్లో విశిష్టునిగా పేరు పొందాడు. జీవనానికి తొలినాళ్ళలో స్టోర్స్ పర్చేజ్ అండ్ స్టేషనరీ డిపార్ట్ మెంటులో అతి కొద్దికాలం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసాడు. ఆ మీదట ఉపాధ్యాయునిగా, కాలేజీలో ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే ఉద్యోగ క్రాంతి అనే పత్రిక వ్యవస్థాపక సభ్యులకు సమకాలికంగా ఉద్యోగుల ఉద్యమాల్లో పాల్గొన్న ఐక్యవిప్లవోద్యమాభిలాషి.
"బాల్యానికి రక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వార్ధక్యానికి పరిరక్షణ కల్పించగల వ్యవస్తే సోషలిస్టు సమాజం" అని విశదీకరించేవాడు. కిటికీలు, తలుపులు, బార్లాగా తెరిచి వుంచిన ఇంట్లోకి చేరిన దుమ్ము, ధూళిని చీపురుతో చిమ్మి ఆరోగ్యాన్ని కాపాడుకున్న క్రమంగా చైనా తియాన్‌మీన్ స్క్వేర్ ఘటనను అభివర్ణించాడు. ఒక నాస్తికుడిగా, మార్క్సిస్ట్ మేధావిగా, 'ప్రత్యామ్నాయ సంస్కృతి'ని అభివృద్ధి చేయడానికి గాను, హైదరాబాదు వంటి నగరంలో "ప్రత్యామ్నాయ సాంస్కృతిక కేంద్రం" ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి పలుమార్లు మిత్రులతో చెప్పుతుండేవాడు.

జ్వాలాముఖి పై మార్క్సిస్టుల విమర్శలు

జ్వాలాముఖి 1975 వరకు విప్లవ రచయితల సంఘంలో పనిచేశాడు. ఆ తరువాత ఆయన విరసం నుంచి బయటకి వచ్చి జన సాహితి సంస్థలో చేరాడు. నాస్తికులలో ఎక్కువ మందికి మార్క్సిస్ట్ గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రాలు తెలియవు. కనుక జన సాహితి సంస్థ సభ్యులు నాస్తిక హేతువాద సంఘాలకి దూరంగా ఉండాలని జనసాహితి సంస్థ తీర్మానించింది. మొదట జ్వాలాముఖి అందుకు అంగీకరించాడు కానీ తరువాత జ్వాలాముఖి నాస్తిక హేతువాద కార్యక్రమాలకు వెళ్ళి నాస్తిక ఉద్యమాన్ని పొగడడం విమర్శలకి దారి తీసింది. [2] జ్వాలాముఖిని విమర్శిస్తూ రంగనాయకమ్మ రెండు పుస్తకాలలో వ్యాసాలు వ్రాసారు. ఈ ఉద్యమాలలో మార్క్సిస్ట్ వ్యతిరేక స్వభావం కూడా ఉందని రంగనాయకమ్మ వాదన. స్త్రీవాద వివాదాలు పుస్తకంలో కూడా జ్వాలాముఖి పై ఇతర మార్క్సిస్టులు చేసిన విమర్శలు ప్రచురితమయ్యాయి.

అవార్డులు

  • ఝాన్సీ హేతువాద మెమోరియల్ అవార్డు
  • దాశరథి రంగాచార్య పురస్కారం
  • హిందీలో వేమూరి ఆంజనేయ శర్మ అవార్డు

28, సెప్టెంబర్ 2014, ఆదివారం

తెలుగు కవులు - ఇల్లెందుల సరస్వతిదేవి



ఇల్లిందల సరస్వతీదేవి

వికీపీడియా నుండి
ఇల్లిందల సరస్వతీదేవి(1918-1998) ప్రముఖ తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రి.

వ్యక్తిగత జీవితం

ఇల్లిందల సరస్వతీదేవి 1918లో జన్మించారు. ఆమెకి చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యవృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో ఆమె మెట్టినింట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.

రచన రంగం

ఇల్లిందల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలు రచించారు. దరిజేరిన ప్రాణులు, ముత్యాల మనసు మొదలైన 5 వ్యాససంపుటాలు, జీవితచరిత్రలు రచించారు. బాలసాహిత్యకారిణిగా నాటికలు, రేడియో నాటికలు రచన చేశారు. కృష్ణాపత్రికలో ఇయంగేహేలక్ష్మీ, ఆంధ్రపత్రికలో వనితాలోకం శీర్షికలు నిర్వహించారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు. స్వర్ణకమలాలు, తులసీదళాలు, రాజహంసలు వంటి కథాసంకలనాలు వెలువరించారు.[1]

సామాజికరంగం

తెలుగు మహిళల కోసం 1934లో యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి 1934లో హైదరాబాదులో ఆంధ్ర యువతి మండలిని స్థాపించి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు మూడేళ్ళపాటు జైలు విజిటరుగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర సినిమా అవార్డు కమిటీల్లో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

పురస్కారాలు, గౌరవాలు

మూలాలు

  1. సామాజిక సాహిత్యవేత్త:తె.వె.బృందం:తెలుగు వెలుగు:మార్చి 2014:పే.22,23

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

తెలుగు కవులు - గుర్రం జాషువా





జాషువా

వికీపీడియా నుండి
(గుర్రం జాషువా నుండి దారిమార్పు చెందింది)
గుర్రం జాషువా
Jashuva.jpg
గుర్రం జాషువా
జననం 1895 సెప్టెంబర్ 28
గుంటూరు జిల్లా వినుకొండ
మరణం 1971 జూలై 24
గుంటూరు
నివాస ప్రాంతం గుంటూరు జిల్లా వినుకొండ
ఇతర పేర్లు జాషువా
వృత్తి రచయిత
కవి
సాహితీకారుడు
సాధించిన విజయాలు నవయుగ కవి చక్రవర్తి
మతం హిందూ
జాషువా
గబ్బిలము పుస్తకము పై పేజి
ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (1895 - 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

జీవిత విశేషాలు

జాషువా 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ లో జన్మించాడు.యాదవ తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ, ఈ ఒక్క విషయం చాలు, మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు..

అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పని చేసాడు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసాడు. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడు.
ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభ లోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే. అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు.
జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి లో సభ్యత్వం లభించింది. 1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించాడు. [1].

సాహితీ వ్యవసాయం

చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడూ, తరువాతి కాలంలో రచయితా అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం,రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు. వాటిలో ప్రముఖమైనవి:
గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.
1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.
1948 లో రాసిన బాపూజీ - మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి.
సంవత్సరాల వారీగా జాషువా రచనల జాబితా
  • 1919 - రుక్మిణీ కళ్యాణం
  • 1922 - చిదానంద ప్రభాతం, కుశలవోపాఖ్యానం
  • 1924 - కోకిల
  • 1925 - ధ్రువ విజయం, కృష్ణనాడి, సంసార సాగరం
  • 1926 - శివాజీ ప్రబంధం, వీరాబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారతమాత
  • 1927 - భారత వీరుడు, సూర్యోదయం, చంద్రోదయం, గిజిగాడు
  • 1928 - రణచ్యుతి, ఆంధ్రుడను, తుమ్మెద పెండ్లికొడుకు
  • 1929 - సఖి, బుద్ధుడు, తెలుగు తల్లి, శిశువు, బాష్ప సందేశం
  • 1930 - దీర్ఘ నిశ్వాసము, ప్రబోధము, శిల్పి, హెచ్చరిక, సాలీడు, మాతృప్రేమ
  • 1931 - భీష్ముడు, యుగంధర మంత్రి, సమదృష్టి, నేల బాలుడు, నెమలి నెలత, లోక బాంధవుడు, అనసూయ, శల్య సారథ్యము, సందేహ డోల
  • 1932 - స్వప్న కథ, అనాధ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, సింధూరము, బుద్ధ మహిమ, క్రీస్తు, గుంటూరు సీమ, వివేకానంద, చీట్లపేక, జేబున్నీసా, పశ్చాత్తాపం.
  • 1933 - అయోమయము, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, స్మశానవాటిక,
  • 1934 - ఆంధ్ర భోజుడు
  • 1941 - గబ్బిలము
  • 1945 - కాందిశీకుడు
  • 1946 - తెరచాటు
  • 1948 - చిన్న నాయకుడు, బాపూజీ, నేతాజీ
  • 1950 - స్వయంవరం
  • 1957 - కొత్తలోకం
  • 1958 - క్రీస్తు చరిత్ర
  • 1963 - రాష్ట్ర పూజ, ముసాఫిరులు
  • 1966 - నాగార్జునసాగరం, నా కథ
అవార్డులు
  • 1964లో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
  • 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నియమితుడయ్యాడు.
  • 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
  • 1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం అందజేసింది.

గుఱ్ఱం జాషువా చిత్రపటం

చెణుకులు

ఒకసారి జాషువాకు, మరో ప్రముఖ కవికి కలిపి ఒక సాహిత్య బహుమతి ఇవ్వడం జరిగింది. జాషువా అంటే అంతగా పడని ఆ కవి "గుర్రాన్నీ గాడిదనీ ఒకే గాట కట్టేశారు" అని అన్నాడు. అప్పుడు గుర్రం జాషువా "నిజమే, ఈ ఒక్కసారికి మాత్రం ఆయనతో ఏకీభవించకుండా ఉండలేకపోతున్నాను. నేను గుర్రాన్ని, మరి ఆయన ఏమిటో ఆయనే చెప్పాలి" అని అన్నాడు.
ఈ పద్యంలో కవిలోకానికి జాషువా సనముచిత స్థానం కల్పించేరు.
"రాజు మరణించెనొక తార రాలిపోయె సుకవి మరణిమంచెనొక తార గగనమెక్కె రాజు జీవించు రాతివిగ్రహములయందు సుకవి జీవించు ప్రజల నాల్కలయందు"

బిరుదులూ, పురస్కారాలూ

జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు.
ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు. పద్మభూషణ [2], ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, క్రీస్తుచరితకు 1964 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు [3],1970 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.

పుస్తకాలు

1వ సంపుటం: గబ్బిలం
2వ సంపుటం: స్వప్నకథ, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, బాపూజీ, నేతాజీ
3వ సంపుటం : స్వయంవరం, కొత్తలోకం, ,క్రీస్తు చరిత్ర, ముసాఫరులు, నా కథ రెండు భాగాలు, నాగార్జునసాగర్
4వ సంపుటం : ఖండకావ్యాలు
  • సలుపజాలినదీ నా సత్యవాణి (కవితలు)

జాషువా పై పరిశోధనలు

ఎండ్లూరి సుధాకర్ జాషువా సాహిత్యం దృక్పథం-పరిణామం అనే గ్రంథాన్ని రాశారు.

జాషువా స్మతిచిహ్మంగా పురస్కారాలు

జాషువా కుమార్తె హేమలతా లవణం నెలకొల్పిన జాషువా ఫౌండేషన్ ద్వారా భారతీయ భాషలలో మానవవిలువలతోకూడిన రచనలు చేసిన సాహిత్యకారులకు జాషువా సాహిత్య పురస్కారం అందజేయబడుతున్నది. 2002 లో ఏడవ సంచికగా స్సామీ కవి నిల్మనీ ఫుఖాన్ కు పురస్కారమివ్వబడింది. [4]
28 సెప్టెంబరు 2013 న తెలుగు అకాడమీ జాషువా పురస్కారాల సమావేశం
తెలుగు అకాడమీ లో జాషువా పరిశోధనాకేంద్రం కవులకు రచయితలకు మూడు పురస్కారాలు సెప్టెంబరు 28, 2013 న (118 వ జన్మతిథి రోజున) అందజేసింది. ఈ పురస్కారం 2 లక్షల రూపాయాల నగదు, శాలువా, ప్రశంసాపత్రంతో కూడుకున్నది. దాశరధి రంగాచార్య కు జాషువా జీవిత సాఫల్య పురస్కారము మరియు కొలకలూరి స్వరూప రాణికి జాషువా విశిష్ట మహిళా పురస్కారము బహుకరించారు. దళిత సాహిత్యములో విశేష కృషిచేసినందులకు కాలువమల్లయ్యకు జాషువా సాహిత్య విశిష్ట పురస్కారము బహుకరించారు. [5][6][7]

వనరులు

బయటి లింకులు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.