Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

11, సెప్టెంబర్ 2014, గురువారం

తెలుగు కవులు - దాశరధి కృష్ణమాచార్యులు





దాశరథి కృష్ణమాచార్య

దాశరథి కృష్ణమాచార్య
Dasaradhi-Krishnamacharyulu.jpg
దాశరథి కృష్ణమాచార్య
జననం 1925 జూలై 22
వరంగల్ జిల్లా గూడూరు గ్రామం
మరణం 1987 నవంబర్ 5
ఇతర పేర్లు దాశరథి
ప్రాముఖ్యత కవి, రచయిత

తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య (Dasaradhi Krishnamacharya). దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.

జీవిత విశేషాలు

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ అభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి[1] హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.
ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు.

నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు.
రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు. దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్
అని నిజాము ను సూటిగా గద్దిస్తూ రచనలు చేసాడు.

ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953 లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించాడు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.
1987 నవంబరు 5 న దాశరథి మరణించాడు.

రచనలు

కవితా సంపుటాలు

    • అగ్నిధార
    • మహాంధ్రోదయం
    • రుద్రవీణ
    • మార్పు నా తీర్పు
    • ఆలోచనాలోచనాలు
    • ధ్వజమెత్తిన ప్రజ
    • కవితా పుష్పకం: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
    • తిమిరంతో సమరం: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత

మచ్చుకు కొన్ని దాశరథి రచనలు

తెలుగుజాతి ఆత్మకథ లాగా ఉంటుంది కింది పద్యం..
ఎవరు కాకతి ! ఎవరు రుద్రమ !
ఎవరు రాయలు ! ఎవరు సింగన !
అంతా నేనే ! అన్నీ నేనే !
అలుగు నేనే ! పులుగు నేనే !
వెలుగు నేనే ! తెలుగు నేనే !

నిరంకుశ నిజాము పాలన గురించి..
ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ
ఎముకల్ మసిచేసి పొలాలు దున్ని
భోషాణములన్ నవాబునకు
స్వర్ణము నింపిన రైతుదే
తెలంగాణము రైతుదే
1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా..
ఆంధ్ర రాష్ట్రము వచ్చె
మహాంధ్ర రాష్ట్రమేరుపడువేళ
పొలిమేర చేరపిలిచె

సినీ గీతాలు

దాశరథి సినిమా రచనలు
1961లో ఇద్దరు మిత్రులు సినిమాలో పాటలు రాయడంతో ఆయన సినీరంగ ప్రవేశం చేసాడు. ఇంచుమించుగా కొన్ని వందల పాటలను రచించి తెలుగు సినీ సాహిత్యానికి సేవచేశారు.[2]
  • ఇద్దరు మిత్రులు (1961) : ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
  • వాగ్దానం (1961) : నా కంటిపాపలో నిలిచిపోరా...నీవెంట లోకాల గెలవనీరా
  • అమరశిల్పి జక్కన (1964) : అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈరేయి నీదోయి స్వామి
  • డాక్టర్ చక్రవర్తి (1964) : ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర
  • దాగుడు మూతలు (1964) : గోరంక గూటికే చేరావు చిలకా ; గోరొంక కెందుకో కొండంత అలక
  • మంచి మనసులు (1964) : గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది
  • నాదీ ఆడజన్మే (1964) : కన్నయ్యా నల్లని కన్నయ్యా నిను కనలేని కనులుండునా
  • ప్రేమించి చూడు (1965) :
  • ఆత్మగౌరవం (1966) : ఒక పూలబాణం తగిలింది మదిలో తొలిప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే
  • నవరాత్రి (1966) : నిషాలేని నాడు హుషారేమి లేదు ఖుషీ లేని నాడు మజాలేనే లేదు
  • శ్రీకృష్ణ తులాభారం (1966) : ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నేతాళజాల
  • వసంత సేన (1967) : కిలకిల నగవుల నవమోహిని ప్రియకామినీ సాటిలేని సొగసుల గజగామినీ
  • పూల రంగడు (1967) : నీవు రావు నిదురరాదు, నిలిచిపోయె యీ రేయి
  • నిండు మనసులు (1967) : నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో
  • కంచుకోట (1967) : ఈ పుట్టినరోజు, నీ నోములు పండినరోజు, దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు
  • పట్టుకుంటే పదివేలు (1967) : తల్లివి తండ్రివి నీవే మమ్ము లాలించి పాలించ రావా దేవా
  • రంగులరాట్నం (1967) : కనరాని దేవుడే కనిపించినాడే ; నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో
  • బంగారు గాజులు (1968) : విన్నవించుకోనా చిన్నకోరికా ఇన్నాళ్ళు నామదిలో వున్న కోరిక
  • రాము (1968) : రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
  • బందిపోటు దొంగలు (1968) : విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
  • ఆత్మీయులు (1969) : మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నొ చెలరేగె కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడె
  • బుద్ధిమంతుడు (1969) : నను పాలింపగ నడచీ వచ్చితివా, మొర లాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
  • భలే రంగడు (1969) : నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే ఎవరేమన్నా ఎన్నటికైనా గెలుపు నాదేలే
  • మాతృ దేవత (1969) : మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా
  • మూగ నోము (1969) : ఈవేళ నాలో ఎందుకో ఆశలు ; నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే
  • ఇద్దరు అమ్మాయిలు (1970) : పువ్వులో గువ్వలో వాగులో తీవెలో అంతట నీవేనమ్మా అన్నిట నీవేనమ్మా
  • చిట్టి చెల్లెలు (1970) : మంగళగౌరి మముగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మా
  • అమాయకురాలు (1971) : పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ రూపమేరా
  • మనసు మాంగల్యం (1971) : ఆవేశం రావాలి ఆవేదన కావాలి ; ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
  • శ్రీమంతుడు (1971) :

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

దేశ ప్రముఖులు - సర్వేపల్లి రాధాకృష్ణన్




వికీపీడియా నుండి
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
జననం: సెప్టెంబర్ 5, 1888
మరణం: ఏప్రిల్ 17, 1975
భారత దేశపు రెండవ రాష్ట్రపతి
భారత దేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (Dr. Sarvepalli Radhakrishnan) (సెప్టెంబర్ 5, 1888ఏప్రిల్ 17, 1975) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో(చైనా, పాకిస్తానులతో యుద్ద సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.

బాల్యం విద్యాభ్యాసం

సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు[1]. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. 1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు.

ఉద్యోగం

21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్ గా నియమించింది. ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. దాంతో ఆయన కలకత్తా వెళ్ళాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన 'భారతీయ తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది. 1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్‌గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.
1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు.
1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగష్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.
1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.
డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.
1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతి అయిన తరువాత కొందరు శిష్యులు మరియు మిత్రులు, పుట్టిన రోజు జరపటానికి అతనివద్దకు వచ్చినప్పుడు, "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను", అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారు. అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.[2]
ఈయన పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించారు. అతని దృష్టిలో తత్వము అనేది జీవితాన్ని అర్ధంచేసుకోవటానికి ఒక మార్గము, భారతీయ తత్వమును అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. [3]

చేపట్టిన పదవులు

ట్యాంకు బండ్ పైన ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహము
  • మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను అలంకరించారు.
  • 1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసారు.
  • 1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్‌ను నియమించారు.
  • 1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు.
  • 1929లో, ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు ఆయనను ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులకు "తులనాత్మక మతము"(Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసము ఇవ్వగలిగే అవకాశము వచ్చింది.
  • 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపసంచాలకునిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.
  • 1936లో, స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు.
  • 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి కులపతిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.
  • 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసారు.
  • 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు.
  • 1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమీషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.
  • 1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు.
  • 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు.
  • 1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు.

గౌరవములు

మూర్తీభూత సమగ్ర భారతీయ సంస్కృతి వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి
  • ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
  • 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది.
  • 1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.
  • 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం (Peace Prize of the German Book Trade) పొందారు.
  • 1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
  • ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరేటులు సంపాదించారు.
  • ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయము సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్ను ప్రకటించింది.

ఉల్లేఖనములు (Quotes)

  • "It is not God that is worshipped but the group or authority that claims to speak in His name. Sin becomes disobedience to authority not violation of integrity." [4]తెలుగు అనువాదము: దేవుడు కాదు పూజింపబడేది, కానీ అతని తరుపున వకాల్తా పుచ్చుకున్న కొంతమంది పెద్దవారు పూజింపబడుతున్నారు. అలాంటప్పుడు, పాపం అనేది ఈ పెద్దవారిని ధికరించటమేగానీ, న్యాయవర్తనను నాశనంచేయటం పాపం అవ్వదు.

రచనలు

  • The Ethics of the Vedanta and Its Material Presupposition (వేదాంతాలలోని నియమాలు మరియు వాటి ఉపయోగము ఒక తలంపు)(1908) - ఎం.ఏ. పరిశోధనా వ్యాసం.
  • The Philosophy of Rabindranath Tagore (రవీంద్రుని తత్వము)(1918).
  • The Reign of Religion in Contemporary Philosophy (సమకాలీన తత్వముపై మతము యొక్క ఏలుబడి)(1920).
  • Indian Philosophy (భారతీయ తత్వము)(2 సంపుటాలు) (1923 మరియు 1927).
  • The Hindu View of Life (హిందూ జీవిత ధృక్కోణము)(1926).
  • The Religion We Need (మనకు కావలిసిన మతము)(1928).
  • Kalki or The Future of Civilisation (కల్కి లేదా నాగరికత యొక్క భవిష్యత్తు)(1929).
  • An Idealist View of Life (ఆదర్శవాది యొక్క జీవిత ధృక్కోణము)(1932).
  • East and West in Religion (ప్రాక్‌ పశ్చిమాలలో మతము)(1933).
  • Freedom and Culture (స్వాతంత్ర్యం మరియు సంస్కృతి)(1936).
  • The Heart of Hindusthan (భారతీయ హృదయము)(1936).
  • My Search for Truth (Autobiography)(నా సత్యశోధన(ఆత్మకథ))(1937).
  • Gautama, The Buddha (గౌతమ బుద్ధుడు)(1938).
  • Eastern Religions and Western Thought (తూర్పు మతాలు మరియు పాశ్చాత్య చింతన) (1939, రెండవ కూర్పు 1969).
  • Mahatma Gandhi (మహాత్మా గాంధీ)(1939).
  • India and China (భారత దేశము మరియు చైనా)(1944).
  • Education, Politics and War (విద్య, రాజకీయం మరియు యుద్దము)(1944).
  • Is this Peace (ఇది శాంతేనా)(1945).
  • The Religion and Society (మతము మరియు సంఘము)(1947).
  • The Bhagwadgita (భగవధ్గీత)(1948).
  • Great Indians (భారతీయ మహానీయులు)(1949).
  • East and West: Some Reflections (తూర్పు మరియు పడమర: కొన్ని చింతనలు)(1955).
  • Religion in a Changing World (మారుతున్న ప్రపంచంలో మతము)(1967).



4, సెప్టెంబర్ 2014, గురువారం

తెలుగు కవులు - చిలకమర్తి లక్ష్మీ నరసింహం


వికీపీడియా నుండి
చిలకమర్తి లక్ష్మీనరసింహం(1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవాడు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం
చిలకమర్తి లక్ష్మీనరసింహం
జననం సెప్టెంబరు 26, 1867
ఖండవల్లి, పెరవలి మండలం
మరణం జూన్ 17, 1946
ప్రాముఖ్యత తెలుగు రచయిత,
నాటక కర్త,
విద్యావేత్త,
సంఘ సంస్కర్త
తండ్రి వెంకన్న
తల్లి రత్నమ్మ
లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26[1]పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.

విద్య, బోధన

రాజమండ్రి కోటిపల్లి బస్టాండు దగ్గరలో స్వాతంత్ర సమరయోధుల పార్కులో చిలకమర్తి లక్ష్మీనరసింహం
ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889 లో రాజమండ్రి హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు. 1889 లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ఇన్నీసు పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం హైస్కూల్ గా మార్చబడింది.
30వ ఏటనుండి రేచీకటి వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించాడు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. 1943 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది.
1946, జూన్ 17[2] న లక్ష్మీనరసింహం మరణించాడు.

రచనా పరంపర

ఆత్మకథ ముఖపత్రం
పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు వ్రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశాడు. కీచక వధ ఆయన మొదటి నాటకం. తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించాడు. ఆయన వ్రాసిన నవలలలో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవి. సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నపుడు సౌందర్య తిలక, పార్వతీ పరిణయం వ్రాశాడు. ఇంకా అనేక రచనలు చేశాడు.

1908లో ఒక ప్రెస్ స్థాపించాడు. 1916 లో మనోరమ, పత్రిక అనే పత్రిక స్థాపించాడు. దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించాడు.

సంస్కరణ కార్యక్రమాలు

లక్ష్మీ నరసింహం మొదటి తరం సంఘ సంస్కర్త. 1909 లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకోసం ఒక పాఠశాల ప్రారంభించి 13 సంవత్సరాలు నడిపాడు. బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నాడు. దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశాడు.

విశేషాలు

  • ఆయన మొదటి నాటకం కీచక వధ 1889 జూన్ 15 రాత్రి ప్రదర్శింపబడింది.
  • కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిత శివానంద శాస్త్రి లోకల్ షేక్స్‌పియర్ అని లక్ష్మీనరసింహాన్ని ప్రశంసించాడు.
  • అనేక మార్లు ప్రదర్శింపబడిన గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఇది రికార్డు (సరి చూడాలి)
  • 1894లో ఆయన వ్రాసిన రామచంద్రవిజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు.
  • కొద్దికాలం ఆయన అష్టావధానాలు చేశాడు.
  • 1897 లో వ్రాసిన పృథ్వీరాజీయం అనే గేయ సంపుటి వ్రాతప్రతి ప్రమాదవశాత్తు చిరిగి పోయింది కనుక ప్రచురణకు నోచుకోలేదు.
  • మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరిజనులకోసం ఒక పాఠశాలను ఆరంభించాడు.
  • చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. వాసురాయకవి ఆయనది "ఫొటోజెనిక్ మెమరీ" అని వర్ణించాడు.
  • ఆయన మంచి వక్త. శ్రోతలను బాగా ఆకట్టుకొనేవాడు.
  • భారత జాతీయ కాంగ్రెసు కార్య కలాపాలలో ఆయన చురుకుగా పాల్గొనేవాడు.
  • ఆయన రచన గణపతి నవల హాస్యరచనలలో ఎన్నదగినది.

రచనలు

నాటకాలు

  1. కీచక వధ -1889
  2. ద్రౌపదీ పరిణయం -1889-1890
  3. శ్రీరామ జననం -1889-1890
  4. పారిజాతాపహరణం -1889-1890
  5. సీతా కళ్యాణం -1889-1890
  6. గయోపాఖ్యానం -1889-1890
  7. నల చరిత్రం -1892
  8. ప్రసన్నయాదవం - 1906 (ప్రదర్శింప బడింది, కాని ప్రచురింపబడలేదు)
  9. నవనాటకము

నవలలు

  1. రామచంద్ర విజయము - 1894 (ధారావాహిక)
  2. హేమలత -1896 (చారిత్రిక నవల)
  3. అహల్యాబాయి - 1897
  4. సౌందర్య తిలక - 1898 - 1900
  5. పార్వతీపరిణయము
  6. గణపతి
  7. కీచక వధ -1889
  8. ద్రౌపదీ పరిణయం -1889-1890
  9. శ్రీరామ జననం -1889-1890
  10. పారిజాతాపహరణం -1889-1890

కవితలు

  1. పృథ్వీరాజీయము (అముద్రితం)

అనువాదాలు

  1. పారిజాతాపహరణము (సంస్కృత నాటకం నుండి)
  2. అభిషేక నాటకం (భాసుని సంస్కృత నాటకం నుండి)
  3. స్వప్న వాసవదత్త (భాసుని సంస్కృత నాటకం నుండి)
  4. మధ్యమ వ్యాయోగము (భాసుని సంస్కృత నాటకం నుండి)
  5. ఋగ్వేదం (ఒక మండలం)
  6. ధర్మ విజయం (పి. ఆనందాచార్యులు మహాభారత కథ ఆధారంగా ఆంగ్లంలో రచించిన నవల)
  7. సుధా శరచ్చంద్రము - (బంకించంద్ర ఛటర్జీ ఆంగ్ల నవల "LAKE OF PALMS")
  8. వాల్మీకి రామాయణం (కృష్ణమూర్తి అయ్యర్ రచన)
  9. రఘుకుల చరిత్ర (కాళిదాసుని రఘువంశం నుంచి)

ఇతర రచనలు

  1. రాజస్థాన కథావళి
  2. మహాపురుషుల జీవిత చరిత్రలు
  3. కృపాంబోనిధి
  4. చిత్రకథాగుచ్ఛ
  5. సమర్థ రామదాసు
  6. భల్లాట శతకం
  7. స్వీయ చరిత్రము
  8. ప్రకాశములు (4 సంపుటములు)
  9. భాగవత కథా మంజరి
  10. రామకృష్ణ పరమహంస చరిత్ర
  11. కాళిదాస చరిత్ర
  12. చంద్రహాసుడు
  13. సిద్ధార్థ చరిత్ర

ప్రాచుర్యం

చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన గణపతి నవల బహుళ ప్రచారం పొందింది. ఆకాశవాణిలో శ్రవ్యనాటికగా పలుమార్లు ప్రసారమైంది. చిలకమర్తి ఆశువుగా చెప్పిన భరతఖండంబు చక్కని పాడియావు పద్యం స్వాతంత్ర సమరంలో ప్రముఖ స్థానం పొందింది. గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడుపోయి ఆంధ్రదేశంలో అసంఖ్యాకమైన ప్రదర్శనలు పొందింది. ఆత్మకథలోని పలుభాగాలు విద్యార్థులకు తెలుగువాచకంలో పాఠంగా నిర్దేశించారు.

రచనల నుండి ఉదాహరణలు

బ్రిటిష్ పాలనను నిరసిస్తూ చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ప్రసిద్ధమైన పద్యం:ఈ పద్యం చెన్నాప్రగడ భానుమూర్తి (1905) వ్రాశాడని కొందరివాదన [1]. ఈ వాదన సహేతుకంగా లేదని ప్రతివాదన [2].
భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి

గయోపాఖ్యానంలో కృష్ణార్జునుల మధ్య పోరును ఆపడానికి సుభద్ర మగని దగ్గరకూ, అన్న దగ్గరకూ వెళ్ళినపుడు వారు ఆమెను దెప్పిన విధం:
ఎంతయినా ఆడువారికి పుట్టింటి పైనే అభిమానం ఉంటుందంటూ అర్జునుడిలా అన్నాడు
మగువ మీదను పతికింత మక్కువైన
మగువ మీదను పతికింత మమతయున్న
పుట్టినింటికి కడుగూర్చు పొలతి యెపుడు
పుట్టింటి సొమ్ములెన్ని తీసుకొన్నా ఆడువారు మెట్టింటివైపే మాట్లాడుతారంటూ కృష్ణుడు పలికిన విధం
సార చీరెలు నగలును చాలగొనుచు
పుట్టినిండ్ల గుల్లలు జేసిపోయి సతులు
తుదకు మగని పక్షము చేరి ఎదురగుదురు
మగనిపై కూర్మి అధికము మగువకెపుడు
చతుర చంద్రహాసం నాటకంలో - పాండవులను వారణావతానికి పంపమని దుర్యోధనుడు పట్టుబట్టినపుడు ధృతరాష్ట్రుడు పడిన ఆవేదన
కొడుకు నుడువులు వింటినా కులము సెడును
కులము మేలెంచుకొంటినా కొడుకు సెడును
కొడుకు కులమును జెడకుండ నడువ వలయు
లేనిచో వంశమున కెల్ల హాని గల్గు
"పకోడి" గురించి
ఓ సాయంకాలం స్నేహితులంతా కూర్చున్నాక పకోడీలు తెప్పించారు. అక్కడే వున్న చిలకమర్తివారిని వారి స్నేహితులు పద్యాలు చెప్పమని కోరారు. "కవులకు అక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది. పద్యమునకు పకోడినిచ్చెడి దుర్దినములు వచ్చినవి" అని హాస్యోక్తులు విసరి ఆయన పకోడిపై చెప్పిన పద్యాలలో కొన్ని:
వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటె గాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!
ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ మా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందు లేవు నిజము పకోడీ!
కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడి వలదా బదులుగ ప
కోడిం దినుమనుచు జెప్పె కూర్మి పకోడీ!
"గీత మంజరి" లోని నీతి పద్యం
సరి యయిన మార్గమును బట్టి సంచరించు
నతడు చేరు గమ్యస్థానమశ్రమమున
ఇనుప పట్టీలపై నుండి యేగునట్టి
ధూమ శకటంబు వలె శ్రేణి దొలగకుండ


3, సెప్టెంబర్ 2014, బుధవారం

తెలుగు కవులు - చెరబండరాజు


వికీపీడియా నుండి
బద్దం భాస్కరరెడ్డి
Cherabanda raju.jpg
చెరబండరాజు
జన్మ నామం చెరబండరాజు
జననం 1944
మరణం 1982 జూలై 2
మెదడు కాన్సర్‌
ఇతర పేర్లు చెరబండరాజు
ప్రాముఖ్యత విప్లవ కవి
వృత్తి హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా
ప్రపంచ పురోగతి సాంతం శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుందని గాఢంగా నమ్మిన చెరబండరాజూ, ' ఆలోచన, అక్షరం , ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి ' ఈ కలం యోధుడికి ఆది విప్లవకవి, ' మహాకవి శ్రీశ్రీ తన ' మరో ప్రస్థానం ' కావ్యాన్ని అంకితమిచ్చాడు.

జీవితం

చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కరరెడ్డి. పేద రైతు కుటుంబంలో 1944లో పుట్టాడు. హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆరుగురు దిగంబరకవులలో ఒకడు. నన్నెక్కనివ్వండి బోను ' అనే కవితతో కవితాలోకంలో సూర్యుడిలా ఉదయించాడు. దిగంబర కవిత్వంలో గొప్ప కవితగా చెరబండరాజు " వందేమాతరం ' గేయం పలువురి ప్రశంసలు పొందింది. విరసం వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు, కార్యదర్శిగా 1971-1972 లో పనిచేసాడు. దిగంబరకవి నుండి విప్లవకవిగా మారాక విప్లవ సాహిత్యానికి పాట అవసరాన్ని గుర్తించి విరివిగా పాటలు రాశాడు. 1975 ఏప్రియల్‌లో ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరించిన సందర్భంలో మహాకవి శ్రీశ్రీతో పాటు అరెస్టు అయ్యాడు.
1971 నుండి 1977 మధ్యకాలములో మూడేళ్ల పాటు జైళ్లో గడపడమువలన ఈయన ఆరోగ్యము క్షీణించింది. జైళ్లో మొదలైన తీవ్ర తలనొప్పి మెదడు క్యాన్సర్ గా పరిణమించింది. 1977 నుండి 1981 మధ్యలో ఈయనకు మూడుసార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈయన అనారోగ్యముతో ఉండగానే ప్రభుత్వము ఉద్యోగము నుండి తొలగించినది. అయితే ప్రజాందోళన వల్ల తిరిగి చేర్చుకోవలసి వచ్చింది.
అనారోగ్య బాధితుణ్నే
అయితేనేం యోధుణ్నే
పోరాటం డైరెక్షన్
పాట నాకు అక్సిజన్
అంటూ కలవరిస్తూ, పలవరిస్తూ కన్నుమూసిన చెరబండరాజు నిబద్దతకు మరోపేరు.
అనారోగ్యానికి గురైన చెరబండరాజు మెదడు కాన్సర్‌తో 1982 జూలై 2న మరణించాడు.
ఏరోజైనా
ప్రజాపోరాటాల విజయాల్ని రచించకపోతే
ఆరోజు జీవించినట్టుండదు
అని చెప్పుకున్న చెరబండరాజు చరిత్ర తెలుగు సాహిత్య చరిత్రలో ఎర్ర అక్షరాలతో లిఖించబడింది.

చెరబండరాజు రచనలు

కవిత్వం

  • దిగంబర కవితా సంకలనాలు (1965,1966,1968)
  • దిక్చూచి (1970)
  • ముట్టడి ( 1972
  • గమ్యం (1973)
  • కాంతి యుద్ధం (1973)
  • గౌరమ్మ కలలు (1975)
  • జన్మహక్కు (1978)
  • పల్లవి (1980)
  • చెరబండరాజు కవితలు (1982)
  • కత్తి పాట (1983)
చెరబండరాజు రాసిన కొన్ని కవితలు, పాటలు ఇక్కడ ప్రచురిస్తే పాఠకులకు ప్రయోజనకరంగా వుంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి ఒక రెండు చదవండి:
వందే మాతరం ఓ నా ప్రియమైన మాతృదేశమా తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందం నీది సంపన్నుల చేతుల్లో మైమరిచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తిపోసినా చలనంలేని మైకం నీది కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న 'భారతి' వమ్మా నోటికందని సస్యశ్యామల సీమవమ్మా వందే మాతరం వందే మాతరం
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని శోకం నీది ఆకలికి ఎండి ఎండి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ వందే మాతరం వందే మాతరం
దిక్‌సూచి, చెరబండరాజు, ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970, హైదరాబాదు నుండి...

కొండలు పగలేసినం కొండలు పగిలేసినం, బండలనూ పిండినం మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినం శ్రమ ఎవడిదిరో, సిరి ఎవడిదిరో బంజర్లను నరికినం, పొలాలనూ దున్నినం మా చెమటలు ఏరులుగా పంటలు పండించినం గింజెవడిదిరో, గంజెవడిదిరో మగ్గాలను పెట్టినం, పోగు పోగు వడికినం మా నరాలె దారాలుగ గుడ్డలెన్నొ నేసినం ఉడుకెవడిదిరో, వణుకెవడిదిరో యంత్రాలను తిప్పినం, ఉత్పత్తులు పెంచినం మా శక్తే విద్యుత్తుగ ఫ్యాక్టరీలు నడిపినం మేడెవడిదిరో గుడిసెవడిదిరో కారణాలు తెలిసినం, ఆయుధాలు పట్టినం మా యుద్ధం ఆపకుండ విప్లవాలు నడిపెదం చావు మీదిరో, గెలుపు మాదిరో
జన్మహక్కు, చెరబండరాజు పాటలు, ప్రథమ ముద్రణ, ఏప్రిల్ 1978, హైదరాబాదు, నుండి...

దిక్‌సూచి చెరబండరాజు "ఏటికేతం బెట్టి ఎయిపుట్లు పండించి గంజిలో మెతుకెరగనన్నా – నేను కూటిలో మెతుకెరగనన్నా" అంటూ డెబ్భై ఏళ్ల కర్షక జీవితంలో ఈ పాటే పాడుకుంటూ కన్ను మూసిన నాన్న కి ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970 1. వందే మాతరం ఓ నా ప్రియమైన మాతృదేశమా తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందం నీది సంపన్నుల చేతుల్లో మైమరిచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తిపోసినా చలనంలేని మైకం నీది కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న 'భారతి' వమ్మా నోటికందని సస్యశ్యామల సీమవమ్మా వందే మాతరం వందే మాతరం
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని శోకం నీది ఆకలికి ఎండి ఎండి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ వందే మాతరం వందే మాతరం
దిక్‌సూచి, చెరబండరాజు, ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970, హైదరాబాదు నుండి... 2. నన్నెక్కనివ్వండి బోను
నల్లకోట్లు నీలిరంగు నోట్లతో ఒక దేశం ఒక కోర్టులో ఫైసలా అయ్యే కేసు కాదు నాది నన్నెక్కనివ్వండి బోను
నలుగురి నమ్మికతో 'అమ్మా ' అని పిలవడం తప్ప నవమోసాలు మోసిందెవరో ఎవరికైనా ఏమి తెలుసంటున్నాను సృష్టికర్తనే వెక్కిరిస్తోన్న పాపిష్టిని మీలో మిమ్మల్ని ప్రశ్నించుకొమ్మంటున్నాను అంటున్నాను అంటాను అనుకుంటూనే వస్తున్నాను
మనిషిమీద నమ్మకం పోగొడుతున్న మీరు దేవుడిమీద ప్రమాణం చేయమంటారెందుకు? దోషికి నిర్దోషికి ఒకటే సూత్రం వల్లించిందే వల్లించి వాదిస్తారు ఫీజు కుడితి కుండలో న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు మీ ఉద్యోగాలకు ప్రమాణాలేమిటి? ఎక్కనివ్వండి నన్ను బోను కలాలు కాగితాలు సర్దుకోండి లా బుక్కుల్లో నా సందేహాలు వ్రాసుకోండి న్యాయానికి దేశాలేమిటి? యెల్లలేమిటి? మనిషీ, రక్తం ప్రాణం ముఖ్యం లింగ భేదాలు వాదాలు తప్పితే మందిర్, మస్జిద్, చర్చి, మతాధికారుల మతాలు యెందుకు? ఆకలి, కామం, కలలూ, కన్నీళ్లు మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే అమ్మ యెవరైతేనేం? చనుబాల తీపంతా ఒక్కటే బిక్కముఖాలతో చూస్తారేం? పిచ్చివాణ్ణిగా కేసు పుటప్ చెయ్యండి నన్నెక్కనివ్వండి బోను
తిన్నయింటి మర్యాదెంచని నాకు బుద్ధుల్లో పెద్దల సహజాతాలేమై యుంటాయ్? మంచి మనసు పరిమళాలు విశ్వవ్యాప్తి కాకపోవు భావితరం గుర్తించకపోదు జగత్ప్రళయ కావ్యంలో తపనాగ్ని జ్వాల నిలుస్తోంది అణువణువున అగ్ని కణం చల్లారక రగులుతోంది నన్నెక్కనివ్వండి బోను
తీర్పు మీది జైలు మీది భయపడతారెందుకు మీ మనస్సౌధాల నిండా తరగని తరతరాల బూజు అనుక్షణం చచ్చే ప్రియత్వం కాపురాల గోపురాలలో తిరిగే పావురాళ్ళారా! నరుక్కోరెందుకు తలలు గది నాల్గు గోడలు కూల్చివేసి దిశలు నాల్గుగా మార్చుకోండి ప్రపంచ పౌరులు కారెందుకు అప్పుడు? నాకు తెలుసు మీ రాత్రి చొక్కాలు పగళ్ళు నిలవవు పగటి చొక్కాలు రాత్రుళ్లుండవు మీ పెళ్ళాలు పిచ్చివాళ్ళు పాతికచీరతో స్వర్గాన్ని కప్పుకొని వంటగది ఆలోచనలకు ఎసర్లు పెడుతున్న వాళ్ళు మీ వాగ్దానాలు పుచ్చుగింజలు మీ బిడ్డలు కృత్రిమ నాగరికత షో లో మోడల్‌గా పనికొస్తున్న వాళ్లు
ఛీ, ఛీ యెవరు మీరు? నవ్వుతా రెందుకు? నీవు నేను కలిసి యెదుటివాని పిలుపుకు 'మీరు ' గాక ఏమౌతాం? నీ గుండెలు, నా గుండెలు మూతబడిన కొండగుహలు ఎక్కనివ్వండి నన్ను బోను
ఈ సువిశాలప్రపంచ జీవశాలలో సిసలైన న్యాయస్థానం ఎక్కడైనా వుంటే నన్నెక్కనివ్వండి బోను
నా గుండెలు పిండుకునే కొండల్లాంటి సందేహాలు... విశ్వశాంతి మన ధ్యేయం యుద్ధాలకు పరిమితమా? అబద్ధమా యీ వేదన? మాంసం ముద్దలుగా మనుషులు శిశువులుగా జన్మించుట ఏ దేశంలో లేదు ఏ దేశంలో నైతేనేమి? అర్ధరాత్రి పడగ్గదుల అంతరార్థమొకటే గద! ప్రపంచ మొక నగ్నశిలా ఫలకము వలె కనిపిస్తున్నది భగవంతుడి అసలు పేరు నగ్నప్రియుడంటాను అంటాను అంటున్నాను అనుకుంటూనే వస్తున్నాను అందుకే నన్నెక్కనివ్వండి బోను
  • * * * *
3. చితి పేర్చుకుందాం 4. చూడలేను 5. ఇంకా నువ్వింకా బానిసవే 6. నీరో సంతతి 7. జవాబు 8. ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది 9. ఊబి 10. కో 11. నా మనుష్య ప్రపంచంలోకి 12. ఫో 13. అన్నీ మరణాలే 14. కాంతి పాదాలు 15. ఆత్మ దిక్ 16. నా ఆకాశం 17. రా! 18. దిగంబర సమాజంకోసం దిగంబర సమాజం కోసం భుజాలు జార్చుకొని మర్రి ఊడల్లా చేతులు వేలాడేసి ఒంగి ఒంగి మట్టి కరుస్తూ నడుస్తోన్న కుంటి వ్యవస్థను నిలబడిన చోటే గొయ్యి తవ్వి పాతెయ్యమంటున్నా చాకులా వెన్నెముక ఉంటే కంఠ కంఠాలలో నిప్పు రగల్చమంటున్నా
నపుంసక మానసిక అంటువ్యాధి ముందు తరాలకు అంటకుండా తలవంచుక వెళ్ళిపోదామనే తార్పుల అగ్ని కీలలలో తలకిందులుగా నిలెయ్యమంటున్నా
ఈ అవ్యవస్థ వ్యవస్థాపకుల్ని ఇంకా ఇంకా బజార్ల కీడ్చి చౌరస్తాలోకి వీలుగా చేరెయ్యమంటున్నా పొద్దుపొడుపుతో మోసగించి మతాలు గానుగెద్దులుగా మార్చిన రాజకీయాలు పశుత్వం మిగిల్చిన జాతిద్వేషాలు దుర్గంధం కక్కిన సిద్ధాంతాలు నిన్నూ నన్నూ ఇన్నాళ్లూ కమ్ముకున్నాయ్ వ్యవస్థేదీ మిగల్లేదు
అందుకే ఈ కుంటి జీవచ్ఛవాన్ని నిలబడిన చోటే గొయ్యి తవ్వి పాతెయ్యమంటున్నా
  • * * * *
19. నిమిషం నిమిషం ఒక నిమిషం 20. కుక్కల మేళం 21. యాభై కోట్ల మంటలు యాభై కోట్ల మంటలు
యాభై కోట్ల కంఠాలు తిరుగుబాటు మంటలుగా మారాలి
వాస్తవ జీవితాన్ని వేల మైళ్ల దూరంలో విసిరేసిన విద్యాలయాలు వదిలి జట్లు జట్లుగా మెట్లు మెట్లుగా యువకులు నడిరోడ్డుకు పరుగెత్తుకు రావాలి
మూఢనమ్మకాల ఉక్కు కౌగిళ్లలో నంగనాచి నాయకుల దొంగ వేషాల్లో నలిగే కృంగే జనం కళ్లగంతలు చించుకొని బయటికి రావాలి మహావ్యవస్థ రూపొందించని నాయకులు జనాన్ని జేజమ్మలుగా వాజమ్మలుగా పురుగులుగా వెధవలుగా ఎట్లా దిగజార్చారో ఒక్కసారి వెన్నుతట్టి కళ్ళారా చూపించాలి
యాభై కోట్ల కంఠాలు తిరుగుబాటు మంటలుగా మారాలి
  • * * * *
22. నేనే మీ ఊపిరి 23. మంటలెప్పుడోగాని అంటుకోవు 24. రక్త ఘోష 25. చిలుం 26. కన్నీళ్లేనా 27. జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త
పల్లకీలలో తప్ప ప్రయాణం చేయరు ధనవంతుల మేడల్లోతప్ప పూరిగుడిశెల ఊసెత్తరు కాళ్లుండీ కుంటివాళ్లు మనుషుల బుజాల్ని తప్ప యింకేమీ ఎక్కరు కాషాయాంబరాలు మానరు ఆధ్యాత్మిక చింత పేర నవీన పతివ్రతల్ని పావనం చెయ్యందే వదలరు
ఎవరయ్యా ఎవరీ రసరాట్టులు బతుకంతా మోసంతో గతికి గతికి జనాన్నీ జాతి నరనరాన్నీ మతమౌఢ్యానికి తీర్చితీర్చి వయసులో నానాపాయసాలూ మరిగి మరిగి కొవ్వెక్కిన పిట్టగూళ్ళ తలబుట్టల బాబాలే చక్రవర్తుల్లా ఊరేగే జగద్గురు సాముల్లారే ఈ కుష్ఠు వ్యవస్థకు మూలవిరాట్టులు
చీకటి బజారు జలగల్ని రాజకీయ బొద్దింకల్ని పదవీ మదాంధుల్ని సాహిత్య వందిమాగధుల్ని అభయహస్తంతో కాపాడే కంకణం కత్తుకున్నారు నిర్వీర్యాన్ని దేశం నలుమూలలా కాలవలనిండా పారిస్తున్నారు భయంకర కుష్ఠు సంస్కృతిని దేశమంతా పంచుతున్నారు నమ్మకు ఈ మతాల సుఖరోగుల్ని వర్ణాశ్రమధర్మ ద్వేషాలు రేపే అడ్డగాడిదల్ని బహిరంగంగా సభల్లో వ్యభిచరించే ఆబోతుల్ని రంకూ బొంకూ పురాణాల బంకును వేదికలెక్కి కుక్కల్లా కక్కే వెధవల్ని మన్నించకు
మనిషిని ఏనాడో మరచిపోయి మంచితనాన్ని అంటరానితనంగా ఎంచే తుచ్ఛులకు చిలకజోస్యాల పిలకగుళ్ళు వంటింటి కుందేళ్ళు పట్టెనామాల పొట్టేళ్ళు బిళ్ళగోచీ బల్లులు జందెంపోగుల పందులు బ్రహ్మరథం పడుతుంటే కళ్ళుండీ కంటూనే చెవులు పోటెక్కేట్టు వింటూనే కదలకుండా మౌనంగా నిలబడకు.
దేవుళ్ల దేవులాటలో మహామహా మాయల నాయాళ్ళ సన్నాసుల జోగుల మోజుల్లో పడిపోయిన దేశాన్ని భవిష్యత్కాలాన్ని కాపాడడానికి నడుంకట్టు
పాతిపెట్టు మైలురాయివేకాదు మంచికి పతాకాన్నెత్తే మనిషినని మరోసారి రుజువు చెయ్యి
  • * * * *
28. ప్రపంచం నిండా
29. చరిత్ర ద్రోహం
30. వ్రణం
31. "దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ " "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ "*
ప్రజా జీవనాడి స్పందన పసిగట్టలేని సమన్వయ మేధావుల అంచనాల వంచనలో నిలువల్లా మునిగిన దేశం
ప్రణాళికల తాటిచెట్ల నీడల్లో పడిగాపులుగాచే ప్రజల దేశం స్వదేశీమార్కు విదేశీయ మార్కెట్టు మనస్తత్వపు మంది దేశం కట్టుకో గుడ్డలేని దేశం దేశి సరుకు ధాన్యానికైనా నోచుకోని దేశం రెండు దశాబ్దాలు దాటినా కోట్లాది ప్రజల నోటికందని దేశం నాదేశం నా ప్రాణం అంటూ గర్వించే రేబవళ్లు శ్రమించే శ్రమజీవుల భవిష్యత్తు యావత్తూ అప్పుల్లో కుక్కబడ్డ దేశం పిడికెడు సుఖరోగుల చెప్పుచేతల్లో పడిపోయిన ప్రజాస్వామ్య దేశం చమటోడ్చి పాటుపడే శ్రమజీవికి కడుపునిండ తిండెక్కడ కండెక్కడ పెంచిన మంచి కొన్ని సంచుల్లోకెళ్ళుతోంది తలపెట్టిన మేలుకు తలలే తాకట్టు పడ్డాయ్
డబ్బు తెచ్చే కీర్తిసంపదల దోపిడి కిరీటాల తురాయీలొద్దు
కలహాల కారణాలు వెతకని చరిత్ర పరిణామం యెరుగని ఘనులకు కత్తివైరాన్ని నిరసించే హక్కు లేదు
ఒరుల మేలుకు సంతసించమనే కుహనా ఆదర్శవాద ఐకమత్యాని కర్థం లేదు వొట్టి కడుపులతో మలమల మాడే అస్థిపంజరాల ఐకమత్యపు సత్యం వేరు
పరులెవరో కలిమివాళ్ల కెక్కడిదో యోచించక దు:ఖం అసూయ చిహ్నమనే సామాన్యులు పాపులనే సాహసాలు చాలు చాలు
చిక్కని పాలవంటి దేశాన్ని కొల్లగొట్టే మేలి బతుగ్గాళ్ల మేలును నా మేలని యెంచే నిర్వీర్యపు నేర్పరితనం నా ఛాయలకే వద్దు
లాభాల్లో వాటాలు పెంచుకునే వ్యాపారసరళి దేశభక్తి అక్కర్లేదు శ్రమఫలితం కాజేసే పొరుగువాడికి తోడు పడే వర్గసామరస్య మార్గం వద్దు
మహోన్నత మానవత్వపు సూర్యోదయాన్ని ఆదిలోనే అడ్డుకొనే మానవ చరిత్రనిండా మారణహోమాలు రేపిన మనిషి మనిషిని క్రూరంగా విడదీసిన హేతురహిత అశాస్త్రీయ జాతిమతాల్నొప్పుకునే విషపానీయ సేవ్యం వద్దు అక్కడ అన్నదమ్ముల ప్రసక్తి వద్దు
సంఘానికి దూరంగా అణగిమణగి వర్తమానం గుర్తించక రుతుచక్రం మలుపుల్లో గొంతెత్తే కోయిల కవితలొద్దు రచనలొద్దు
ఆస్తిహక్కు రక్షణకై తపనపడే నక్కల తోడేళ్ల కెదురుతిరిగి ప్రాణాలను మానాలను అర్పించే హెచ్చు తగ్గులసలులేని దేశభక్తి నిర్వచనం రక్తతర్పణాలతో రచిస్తోంది నా తరం
  • * * * *

32. రాజధాని లేఖ
33. స్వీయచరిత్ర
34. మరోసారి ఈ దేశం మోసపోగూడదు మరోసారి ఈ దేశం మోసపోగూడదు మరోసారి ఈ దేశం మోసపోగూడదు బిర్లాభవనంలో వైభవంగా ప్రార్థనలు జరుపుకునే హరేరాం బికారులు మళ్లీ పుట్టగూడదు గీతాధ్యయన నేతలు ఈ జాతికి ఇంకా అక్కర్లేదు బుద్ధుని యిమిటేషన్ ప్రబుద్ధుని సంతతి పలికే ప్రగల్భాలతోనే ఇరవై రెండేళ్లూ నీరుగారిపోయాయ్ శాంతిసహనాలతో ఇన్నాళ్లూ మిన్నకున్నందుకు చరిత్రలో నా తరం చాలాచాలా పోగొట్టుకుంది సామాన్యుడు సంఘబహిష్కృతుడిగా సంక్షేమరాజ్యంలో రోజూ చస్తూనే వున్నాడు పెంకుటిండ్లు పూరిండ్లై పూరిండ్లు నేలమట్టమవుతుంటే ఉన్నవాడు దేశాన్ని పిండిపిండి మరింత ఉన్నతంగా ఆకాశాన్నందుకుంటున్నాడు గ్రామాలు కుళ్ళి కుళ్ళి అజ్ఞాన తమస్సులో కుళ్ళుచూళ్ళేనంత దుర్భర దారిద్ర్యంతో పగిలి పగిలి ఏడుస్తున్నాయ్ ఇవాళ శిష్యుల గొప్పతనంగురించి వివరంగా చెబితే హంతకునిలా నేరస్థునిలా తలవంచుకుని నించున్నాడు అస్థిపంజరాల బోనులో అన్నార్తుల కన్నుల్లో ఆశాకిరణం ఎడారిదారిలా చీలిపోయింది విశ్వాసపు గుడారాలెగి రెగిరి గాలిలో ఏనాడో శిథిలమయ్యాయి సహనం చచ్చిన కంకాళాలు కలిసికట్టుగా గండ్రగొడ్డళ్ళతో ఈటెలతో ఈ చీకటి వృక్షాన్ని పెల్లగించక తప్పదింక అరచి అరచి ఇరవైరెండేళ్ల చరిత్ర అలసిపోయింది అతడు పీడితుల మనిషికాడని చెప్పకనే చెబుతోంది వర్గచైతన్యం గుండెలో మెత్తమెత్తగా బాకులుదూసి పోరాటశక్తిని నాశనం చేసిన పచ్చి సామరస్యవాది ప్రపంచానికిచ్చిందేమిటి? అధికారానికి అంగరక్షకుడిలా లంచగొండి ప్రభుత్వానికి కవచంగా మనమధ్య మనుగడ సాగించడమేమిటి? ఖద్దరు బట్ట తప్ప దేశానికి మిగిల్చిందేమిటి? అమాయక ప్రజల భుజాలనెక్కి భగవద్గీత పారాయణ అభయహస్తంతో మతమౌఢ్యపు పిచ్చికుక్కలకి ఎద్దుముఖం పెద్దపులులకి దేశాన్ని బలియిచ్చినవాడికి ఈ నేలమీద ఇంకా నామరూపాలుండడమేమిటి? ప్రజాస్వామ్యపు బ్రోతల్ హౌసులో ఈ రాజకీయాల రంకు కథలు అతని బిక్షగాక మరేమిటి? అతని పేరెత్తిన [లేక 'పేరెత్తని ' యా?] నాయకుడు ఏడి? అతని విగ్రహం లేని వీధులు ఏవి? ఈ అస్తవ్యస్తపు మస్తిష్కపు మహాత్ముడికి ఆరాధనేమిటి ఆర్భాటాలేమిటి? తారలేమిటి రాగాల భోగాలేమిటి? పర్వతాలేమిటి? పూజామందిరాలేమిటి? ఇదంతా మన అజ్ఞానానికి చిహ్నం కాదా! సబర్మతీ ఆశ్రమవాసి సన్యాసీ కాదు సంసారీ కాదు విజ్ఞానదాత కాదు విద్యావేత్త కాదు రాజకీయవేత్త కాదు రాజూ కాదు వేదాంతి కాదు వెర్రివాడూ కాదు ప్రజల్ని పట్టించుకున్నదీ లేదు పట్టించుకోనిదీ లేదు అన్నీ తానేగా తానే అన్నీగా పెరిగి భ్రమల సాలెగూళ్ళలోకి నినాదాల గాలిలోకీ పుక్కిటిపురాణాల ఆదిమసంస్కృతిలోకి మనుషుల్ని తోసి నిజావగాహనలేని ప్రజాద్రోహిగా మోసం చేసి దూదిపింజల్లాంటి సిద్ధాంతాలు వల్లించి నా తరానికి సున్నాలు చుట్టి వెళ్ళిపోయాడు మరోసారి ఈ దేశం మోసపోగూడదు
  • * * * *

35. పీడితలోకం పిడికిలి బిగించి పిలుస్తోంది
36. యువతరానికి
37. దిక్‌సూచి

దిక్‌సూచి ప్రజారక్త వ్యాపారులు లిప్తపాటులో మండి మసి అయిపోయే తరుణం ఇదే పదవుల పోరాటపు కుటిలనీతి మంతనాల మంత్రుల్నీ అంతరాత్మల్నీ సజీవంగా స్మశానానికి పంపే సమయమూ ఇదే డబ్బు రాజ్యాన్ని కూలద్రోసి కోట్లాది ప్రజల కూడుగుడ్డకోసం అడుగడుగునా అధికారపు నడ్డి విరగదన్నాల్సిందే ఒకటికి పది సున్నాలు చేరుస్తూ ఉన్నవాడు ఉన్నతుడై సంఘానికి న్యాయాలయమై సామాన్యుల శాసించే ధర్మానికి తలవొగ్గక ఆ వర్గపు కంచుకోట కొల్లగొట్టి ప్రజాధనం అందరి కందుబాటులో ఉంచాల్సిందే
ఏ దేశపు సంపదైనా పుట్టిన పుట్టబోయే బిడ్డల జన్మహక్కుగా సమ సమానంగా వితరణ చెందాల్సిందే ఒక్కొక్కడూ ఒక్కో మృగరాజై నక్కల తోడేళ్ళ డొక్కలు చీల్చి రక్తంలో త్రివర్ణపతాకం ఆసాంతం ముంచి రంగు మార్చాల్సిందే
  • * *
[దిక్‌సూచి, చెరబండరాజు, ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970,
హైదరాబాదు నుండి] 
  • * * * *
ముట్టడి చెరబండరాజు
ప్రథమ ముద్రణ, జూన్ 1972, హైదరాబాదు
1. కొలిమంటుకున్నాది కొలిమంటుకున్నాది తిత్తినిండా గాలి పొత్తంగ ఉన్నాది నిప్పారి పోనీకు - రామన్నా పొద్దెక్కి పోనీకు - లేవన్నా నీ పక్క పొలమోడు దుక్కి సాగిండన్న కాల్జాపి కూకోకు – రామన్నా కార్తె పోతే రాదు - యినుమన్నా ఎరువు కావాలింక గుడిసేసుకోవాల నీ బండి పట్టాలు – రామన్నా కొత్తయే కావాల - యినుమన్నా ఉత్తరానురిమింది రోజు మొగులవుతూంది ఎర్ర మెరుపూ సూడు – రామన్నా కర్రు పారా సాన - రామన్నా కంచాన గంజికీ గద్దలూ కాకులూ వడిసేల పేనుకో – రామన్నా వడి వడిగ రాళ్లేసి - కొట్టన్నా ఇనుపముక్కలు కొడుకు [కుడుకు?] లుండి ఫలమేముంది పగటి నిద్రలు మాని – రామన్నా పనిముట్లు చేసుకో - వేలన్నా [మేలన్నా?] ఓటుకెదిగిన బిడ్డ పెళ్ళి లేకున్నాది కూలో నాలో చేసి – రామన్నా కూడబెట్టిందేమి - లేదన్నా చట్టాలు అన్నారు పట్టాలు అన్నారు పొలములో కాలిడితె – రామన్నా పోలీసులొచ్చేరు - ఏలన్నా కౌలు కిచ్చీనోడు కన్నెర్ర సేసేడు అప్పులిచ్చీనోడు ఆలినే సూసేడు దయగల్ల సర్కారు దాదాలె అయ్యేరు నీ దారి గోదారి – రామన్నా కానీన కదనాన - నిలువన్నా కొలిమంటుకున్నాది తిత్తినిండా గాలి పొత్తంగ ఉన్నాది నిప్పారి పోనీకు – రామన్నా సందేల కానీకు – లేవన్నా కర్రు పారా సాన – బెట్టన్నా బతుకు యుద్ధములోన - నిలుమన్నా
  • * * * *
2. నేడైనా రేపైనా 3. మాలోని మనిషివే మాలోని మనిషివే పోలీసు పాట మాలోని మనిషివే మా మనిషివే నీవు పొట్టకూటికి నీవు పోలీసువైనావు ప్రాణాలు బలిపెట్టి పోరాడు సోదరుల గుండెలకు తూటాలు గురిపెట్టినావేమి
మాలోని మనిషివే మా మనిషివే నీవు పొట్టకూటికి నీవు పోలీసువైనావు అన్నన్న ఆ బతుకు బతుకు బతుకే గాదు
కాటికీ కాల్జాపి కూర్చున్న కన్నోళ్లు రాళ్లుమోసే చిన్న తమ్ముళ్లు చెల్లెళ్లు పేగు లెండుకుపోయి చచ్చిపోయినగాని దేశానికే అసువు లర్పించు సోదరుల గుండెలకు తూటాలు గురిపెట్టినావేమి //మాలోని //
భోగాలు ఆనందయోగాలు కొందరివి రోగాలు నొప్పులూ కోట్లాది ప్రజలవీ అందుకే పేదోళ్లు తిరగబడుతున్నారు నిన్నుగూడా తోడు ఉండ మంటున్నారు //మాలోని //
మనిషన్న కాడికీ మనసంటు ఉంటాది పల్లెత్తి ఒక మాట పలకనీ నీ కొలువు చావనా బతకనా సత్తెమాలోచించు దొంగసర్కారులో పాలు పంచూకోకు //మాలోని //
రాకాసిమూకలు రాజ్యమేలే నేడు నీ గుండె చెరువయ్యె కరువులో బతుకుతూ ఇల్లు ముంగిలి లేక తల్లడిల్లే నీవు నిరుపేదవేగాని మరబొమ్మవై పోకు నీవాళ్ల ప్రాణాలు తీయకో తీయకో //మాలోని //
దీన బంధువులంత అడవిపాలైనారు రాబందు లందరూ గద్దెలెక్కీనారు బందూకు నీచేత పట్టించి నోళ్లంత ప్రజల శత్రువులన్న మాట మరిచీ పోకు //మాలోని //
  • * * * *
4. అమ్మమ్మ ఇందిరమ్మా
5. దేశమేదైనా
6. కలుపు తీసే కాడ
7. కామ్రే డ్!
8. ఒళ్ళు మరిచి
9. రాయిరప్పకు సెప్పనా... రాయిరప్పకు సెప్పనా... కూలికోసం తాను ఎదురు తిరిగీతేను నక్సలైటూవని సంపేసిపోనారు
రాయిరప్పకు సెప్పనా - నా గోడు నేనె రాయైపోదునా
సదువుకుంటే బతుకు బాగవుతదంటారు బడికెల్లితే కొడుకు కూడెవడు పెడతాడు
రాయిరప్పకు సెప్పనా - నా గోడు నేనె రాయైపోదునా
ఇంటిల్లిపాదిమీ రెక్కలిరుచూకున్న ఏపూట కా పూట గంజి కరువేనాయె
రాయిరప్పకు సెప్పనా - నా గోడు నేనె రాయైపోదునా
అప్పు ముప్పంటారు తప్పు తప్పంటారు అప్పు సేయకపోతె పొద్దు పొడవాదాయె
రాయిరప్పకు సెప్పనా - నా గోడు నేనె రాయైపోదునా
ఆనకాలం వస్తే ఇల్లు చెరువై పాయె కప్పలూ పాములూ మా పక్కలో నాయె
రాయిరప్పకు సెప్పనా - నా గోడు నేనె రాయైపోదునా
పెద్దమనిషై బిడ్డ ఇంట్ల ఉన్నాదంటె ఊరిపెద్ద చీర రైకలిస్తాననె
రాయిరప్పకు సెప్పనా - నా గోడు నేనె రాయైపోదునా
చెరువులో దూకనా చెరువయ్యి పోదునా ఉరిపోసుకుందునా ఉరితాడు అవుదునా
రాయిరప్పకు సెప్పనా - నా గోడు నేనె రాయైపోదునా 1-3-1972.
10. మరణానికి మారుపేరు
11. అశోకచిహ్నం
12. వినండి వినిపించండి
13. "సకలార్థ సాధకు లెవరు "
14. విష వృక్షం
15. నిలయ విద్వాంసులారా
16. కుగ్రామం
17. మళ్లీ వస్తున్నాయి మన ఊరికి
18. అరుణ తరం
19. ఎత్తండి చేతులు
20. సాధన
21. ముట్టడి
22. ప్రజ
23. సరికొత్త రజాకార్లు
24. కాలజ్ఞానం
25. అగ్నిపుత్రులు
26. ఈ తరానికి తీరం
27. బాంగ్లా ప్రజలకు బహిరంగ లేఖ
28. అంకితం
అంకితం ప్రపంచం నాకివ్వాళ మా పల్లెటూరి కన్నా చిన్నదిగా నా షెల్ఫులోని పుస్తకాల్లా నా చేతి వేళ్లలా మరీ మరీ దగ్గరై కనిపిస్తున్నది
భూగోళం మీది ప్రతి అంగుళం అందని నక్షత్ర సముద్రంలా లేదు నా చేర్చిన ఓనమాలలా నా కంఠంలో వేలాడుతున్నది పిలిస్తే పలుకుతున్నది
నన్నీ దృష్టికి నడిపించినవాళ్లు ఎక్కడోలేరు ఎవరో కారు వాళ్లు చరిత్ర రహస్యాల్ని ఛేదించిన వీరులు నా గురువులు నావాళ్లు
అహం చచ్చిపోతున్నది ఆడంబరాలమీది మోజు మంచులా కరిగిపోతున్నది స్వీయసుఖాలంటూ మధురపానీయాలంటూ ఏమీ నాకోసం లేదంటూ వుండాలనుకోవడమే అన్ని అనర్థాలకు తిరోగమనవాదాలకూ భయాలకూ ప్రత్యేకించి సాహిత్యోపజీవి ప్రత్యేకతలంటూ పడిచచ్చే ముడిపడని జ్ఞానం అంతా శూన్యం అంటూ చెపుతున్న వాళ్లు ఎక్కడో లేరు ఎవరో కారు వాళ్లు చరిత్రకు యవ్వనం ప్రసాదించిన వైద్యులు నా పంచప్రాణాలు నావాళ్ళు
ఇష్టానిష్టాలు క్రుంగిపోతున్నవి ప్రేమవాత్సల్యాలతో హృదయం అద్దంలా రూపుదిద్దుకుంటోంది
దేశాలమధ్య సరిహద్దులు మనిషి కో ధర్మం వద్దంటూ నాకు శాసించే విలపించే హక్కు లేదంటూ శ్రమశక్తికి రచనాశక్తిని విముక్తికోసం జోడించమని పుస్తకాలు వదిలి వాస్తవ జీవితాల్ని నగరాల గాయాల్ని పల్లెల్లోని ముళ్ళబాటల్ని శాస్త్రీయ దృక్పథంతో ఆవాహన చెయ్యమని
నాకు పాఠాలు చెపుతున్నవాళ్ళు ఎక్కడో లేరు ఎవరోకారు వాళ్లు దొంగల చరిత్రనుండి నిజాన్ని కైజారులా వెలికి లాగినవాళ్లు నిత్యచైతన్యమూర్తులు ఆర్తులు నాకు నేతృత్వం వహిస్తున్న నేతలు
దూరభారాలు నశిస్తున్నవి మనసుమీంచి నిరాశా నిస్పృహల గూళ్ళు ధూళిలా ఎగిరిపోతున్నవి
దాతలకోసం చేతులు చాచినంతకాలం మాన్వజాతికి మంచిరోజులు రానేరావంటూ ఈ చేతులు అగాధాల్ని పూడ్చడంలో రక్తాలు కారి చితికినా చింతే లేదని ఈ కాళ్లు అన్యాయాల్ని అణగద్రొక్కడంలో కీళ్ళు సళ్ళినా విరిగినా ఆగేదే లేదని ఈ కంఠాలు గంటల్లా మోగుతూ నిజాన్ని నిప్పులా మండిస్తూ శత్రుదుర్గాల్లో ఉరికంబాలెక్కినా వెనక్కి తిరిగేదిలేదని సమున్నత సమతా సమాజ నిర్మాణానికి నాకు ఊపిరి పోస్తున్న వాళ్ళు ఎక్కడో లేరు ఎవరో కారు వాళ్లు చరిత్ర శరీరంలో స్పందిస్తున్న ఎదలు నడుస్తున్న సముద్రాలు నలగని కాంతిదీపాలు వాళ్ళు
దోపిడీ శిఖరాలు కూలుతున్నవి నేలనేలంతా ఎరుపెక్కుతుంది ప్రపంచంలో ఏమూల పూరిగుడిసెలో చూసినా త్యాగానికి కొదువ లేదు ఆయుధాల భయం లేదు రక్తనాళాలు జ్వలిస్తూ పురోగమిస్తూనే వున్నై
మేల్కొన్నవాడిదే భవిష్యత్తు అంటూ లోకంలో వేకువలెన్నో గళాలెత్తి పిలుస్తున్నై త్వరపడండని అమరవాణిని వినిపిస్తున్నవాళ్లు
ఎక్కడో లేరు ఎవరో కారు
వాళ్ళు పోరాటాలకు పర్యాయపదాలు కాలం ప్రాణవాయువులు వర్గదృష్టి నిశితంకానిదే కనబడనివాళ్లు అహం చంపుకుంటేకాని అర్థంకానివాళ్లు
నేను నా గీతం వాళ్లకే అంకితం
11-2-1972.
  • * * * *
గమ్యం చెరబండరాజు ప్రథమ ముద్రణ, సెప్టెంబర్ 1973
చాటండి గళమెత్తి చారూ మజుందారు చచ్చి పోలేదనీ చంపబడ్డాడనీ
ఇరవైయారేళ్లకే నూరేళ్లు నిండి మార్గమధ్యంలో మమ్మల్ని వీడిపోయిన ఎన్. ఎస్. ప్రకాశరావుకు అంకితం.
1. నేను భారత విప్లవాన్ని నేను భారత విప్లవాన్ని చిగురుటాకూ చెప్పు నాకూ గాయపడి నీ చెంత చేరిన వీరపుత్రుని కెంత గాలీ దాచకుండా వీచగలవూ మబ్బుతునకా చెప్పు చెప్పూ నాలుకెండిన నేలబిడ్డల ఏడ్పు మాన్పుట కెంత నీరూ నేరుగా కరు ణించ గలవూ శత్రు దాడికి జాడలివ్వక అడవి అన్నల గుహల చేర్చుము చందమామా చెప్పు తండ్రీ రైతుబిడ్డలు జతలు కట్టగ పరుగు పందెం కర్ర సాముల కెన్ని గంటలు విడిది చేసేవ్ పొదలు మీరూ పలక రేమీ మీరె కవచాల్ మీరె డాళ్లూ ఎర్ర సేనల గుర్తు లడిగీ నరికినా మొల కెత్తి రండీ పిల్ల బాటా మాట మార్చకు ఏటి దాకా కాకి దుస్తుల తోలు కొచ్చీ నీట ముంచీ కుక్క జాతిని తిప్పి కొట్టుము జింక తల్లీ ఒక్క మాట వేటగాడికి దొరికె కన్నా వీరయోధుని వింట నారిగ అమర జీవిగ రాలి పొమ్మూ బతుకు దోపిడి గాళ్ల నుండి పోరు సలుపుతు దారి నున్నా కష్ట జీవుల స్వర్గ సీమను నేను భారత విప్లవాన్ని అదను ఇదే సాయుధంగా ఆదుకోండి ఆదుకోండి
  • * * * *
2. నిప్పురవ్వలు నిద్రపోవు
3. పేదవాళ్ళం
4. 'నేడు ' అస్తమించాలి
5. పాలేరు పాట
6. అమెరికా ప్రజలకు
7. కొరియర్
8. మారలేదన్నా
9. చెట్లు
10. అటుగాదు ఇటు నడూ...
11. దీప సందేశం
12. ఏకైక మార్గం
13. అందుకోండి ఆయుధాలు
14. ఒక మిత్రుని ఉత్తరం
15. ఏమిటి?
16. గడ్డిపోచలు గర్జించాలి
17. 47 లో నా వయస్సు 25
18. వధ్యశిల వధ్యశిల వధ్యశిల రజతోత్సవమ్మట బందిఖానలు ప్రజల సొమ్మట న్యాయమే వర్ధిల్లుతుందట నాయకుల ఆరాధనాలట పూలుగోయర తమ్ముడా మాల గట్టవె చెల్లెలా కొత్త సంకెళ్లేమి లేవట తెల్లదొరలను దించినారట దేశదేశములోన భారతి బిచ్చ మెత్తుట మాన్పినారట గర్వపడరా తమ్ముడా పరవశింపవె చెల్లెలా ఆనకట్టలు కట్టినారట భూమి పేదల కిచ్చినారట ఆకలెత్తిన ఆయుధాలను అణచి మేల్ సమకూర్చినారట భయము లేదుర తమ్ముడా శీలవతివే చెల్లెలా గ్రామ పంచాయతులు పెట్టి పేదలకు నిధి పంచినారట పల్లెనుండి ఢిల్లి దాకా సోషలిజమే పారుతుందట వంత పాడర తమ్ముడా గొంతు కలపవె చెల్లెలా పదవికయినా కొలువుకయినా తెలివి ఒక్కటె గీటురాయట కులమతాలను చంపినారట రామరాజ్యము తెచ్చినారట అందుకొనరా తమ్ముడా ఆడిపాడవె చెల్లెలా అధిక ధరలను ఆపినారట దోచువారికి జైలుశిక్షట మంత్రులైనా తప్పుకోరట ధర్మచక్రము తిప్పుతారట పాడు జనగణ తమ్ముడా పల్లవెత్తవె చెల్లెలా పాఠశాలలు పెంచినారట జ్ఞాన జ్యోతులు పంచినారట దేవళమ్ములు నిలిపినారట ముక్తిమార్గం చూపినారట పూజ సలపర తమ్ముడా పున్నె మొచ్చునె చెల్లెలా ప్రణాళికల పరిమళాలట ప్రతి గృహానికి పాకినాయట నిరుద్యోగమ పొమ్ము పొమ్మని కొత్తగొంతుక విప్పుతారట సహనముంచర తమ్ముడా ఆలకించవె చెల్లెలా ఎవరి ప్రాణము తీయలేదట పౌరహక్కుల గాచినారట పార్లమెంట్లో అడిగినారట ప్రజాస్వామ్యం నిలిపినారట విప్లవించకు తమ్ముడా విన్నవించవె చెల్లెలా 26-7-1972
  • * * * *
19. గమ్యం గమ్యం నేనొక్కణ్నే ఇక్కడ రెక్కలు తెగిన పక్షినికాను దాని పయనం గగనం గమనార్హం నేనొక్కడ ఇక్కడ దాహంగొన్న ఒంటెనుగాను ఒయాసిస్సుకై తపస్సు చేయను నేనొక్కణ్నే ఇక్కడ రాత్రికై నిరీక్షించే నక్షత్రాన్ని కాను నెలరాజు వెలుగులో వెలవెలాబోను నేనొక్కడ ఇక్కడ విరిగిన చుక్కాని పడవను కాను ఓ సాగర తీరం చేర్చమని ప్రార్థించను అయితే నేనెవరిని పేరేమిటి ఊరేమిటి ఊపిరేమిటి ఉనికేమిటి నా పేరు ఆకలి సాయుధం నా శరీరం ఆక్రమణ నా ఉనికి ఉద్యమం నా ఊపిరి విప్లవం మా ఊరు
  • * * * *
20. జన సంగీతం
21. ప్రత్యేక తెలంగాణా/ఆంధ్ర లో ప్రజారాజ్యం
22. విప్లవ గ్రామం
23. ఎర్రగడ్డ
24. అగ్ని వర్షం
25. ప్రభుకంఠం - ప్రజాకంఠం 26. కార్మికుడు 27. నిర్జిస్తూ - ఓడిస్తూ 28. ఊపిరి ఊపిరి కష్టజీవుల నెత్తురెరుపూ కమ్యూనిస్టు జెండ ఎరుపూ దోపిడీ లేనట్టి బతుకుల కెవడు ఆయుధమెత్తినాడో వాడి మాటలు ఎరుపు ఎరుపూ వాడి చేతలు ఎరుపు ఎరుపూ ఎరుపుబాటల నడిచి మనమూ ఎర్రరాజ్యము నిలుపుదామూ కాదు తమ్ముడు కాదు చెల్లెల బొంగరాల ఆట గాదూ చేరడేసీ మొగ్గగాదూ వొట్టిమాటల మూటగాదూ ఫ్యాక్టరీలూ పంటపొలములు సొంతమయ్యేదాక మనము ఎర్రజెండా విడువకుండా ఆయుధాలు దించకుండా ప్రజా గర్జన జేసుకుంటూ ఎరుపు పాటలు పాడుకుంటూ ఏరులెన్నో దాటుకుంటూ పార్టికోసం ప్రాణమిచ్చీ గుండె చెదరక గుండ్లకదరక వర్గశత్రువు నెత్తుటేర్లతో వసంతాలే ఆడుకుంటూ ఊళ్ల కూళ్లే గెలుచుకుంటూ చైన వోలె భారతావని శాంతి ఖండము అయ్యెదాక పోరు ఊపిరి జేసుకుందాం రండి సోదరులార రండి ఎర్రజండా విడువకండి ఆయుధాలూ దించకండి 31-8-1973
  • * * * *

కాంతి యుద్ధం చెరబండరాజు ప్రథమ ముద్రణ డిసెంబరు 1973 "అన్నం వండిపెట్టి ఏ పూట కా పూట నా నోట ఈ పాటలు పాడించుకొని నన్ను సవరించిన జైల్లోని తోడి ఖైదీలకు" [ఇందులోని "చెట్టూ నీ పేరు చెప్పి... " అనేది తప్ప మిగిలినవి హైదరాబాదు సెంట్రల్ జైల్లో రాశాను" అని చెరబండరాజు తన "ఒక మాట" లో చెప్పాడు.]

1. ఊరు మేలుకుంది ఊరు మేలుకుంది ఊరు మేలు కొన్నదీ ఏరు మేలు కొన్నదీ ఊరులోని కూలిజనం చుక్కపొద్దు లేచినదీ సూర్యునితో నడిచినదీ ఊరు మేలు కొన్నదీ ఏరు మేలు కొన్నదీ ఏటిలోని కోటి అలలు గల గల గల నవ్వినవీ పాపలవలె నడిచినవీ ఊరు మేలు కొన్నదీ ఏరు మేలు కొన్నదీ పసులు దొడ్లు వీడినవీ అడవి దారి పట్టినవీ చెట్లు గట్లు విడిచినవీ పక్షులెటకొ పోయినవీ దినవెచ్చము కొరకుగదా జీవరాశి కదిలినదీ ఊరు మేలు కొన్నదీ ఏరు మేలు కొన్నదీ ........................... ఏటిలోని కోటి అలలు కిలకిలకిల నవ్వినవి గలగలగల పారినవి నవ్వుల నురుగుళ్లు చిమ్మి పరుగులెత్తి మురిసినవి గుండె పొంగి ఆడినవి కొత్త పాట పాడినవి ఊరు మేలు కొన్నదీ ఏరు మేలు కొన్నదీ [చాల పెద్ద పాట గనుక కొన్ని చరణాలే ఇక్కడ యిచ్చాము]
  • * * * *
2. చెట్టూ నీ పేరు చెప్పి …… 3. పాపా! 4. కాంతి యుద్ధం కాంతి యుద్ధం ఆ రాత్రి: నగరం నడిగడ్డ మీద రోడ్డు చివర చౌరాస్తాలో దశదిశలా నిశికమ్మిన పోలీసుల పహరాలో అటచేరిన కార్మికులూ ఆ రాత్రిని ఛేదిస్తూ మంటలతో మంటలవలె నినాదాలు మండిస్తూ నిషేధాజ్ఞ లన్నింటినీ చుక్కలవలె ధిక్కరించి మసక మసక వెల్తురులో మరణించిన కార్మికవీరుని శవజాగరణ చేస్తున్నరు ………………………. ………………………. మన బతుకుల లోతేమిటొ " మాతృభూమి " కథ వినండి ఇంటింట చీకటే ప్రతికంట కన్నీరె రాజ్యమెవరికి వచ్చెనో – రాజన్న సుఖములెవరికి దక్కెనో వొళ్ళొంచి కష్టించి రాజనాల్ పండించ కరువులెందుకు వచ్చెనో – కనకయ్య గరిసె లెవరివి నిండెనో పాతికేండ్లైపాయె భారతీయుని బ్రతుకు అంగట్ల సరుకాయెనో – రంగయ్య అట్లెందుకైపాయెనో ఓట్లేసి గెలిపించి పట్నాని కంపితే సీట్ల కుక్కాలాయిరో – కోటయ్య కొలువు లెందుకు దొరకవో పేర్లేమొ పెద్దలవి వేసేవి గుడిశెలు లక్షలేమైపాయెనో – అచ్చయ్య లెక్కలెవరికి చెప్పిరో ఉన్నోడు ఉన్నతికి లేనోడు కాటికి దేశోన్నతిదె అందురో – మైసయ్య పేదదేశంబందురో ఆసేతు హిమగిరీ పోలీసు కాపలా దేశమే జైలాయెనో – జానయ్య నాజీల పాలాయెనో నోరెత్తితే ప్రజలు చట్టాల జేజేలు పిచ్చి పట్టిందెవరికో – మంకయ్య మందు వుందని తెలియరో కూడడిగితే జైళ్లు, జైళ్లలో కాల్పులు ఇది ప్రజాస్వామ్యమగునో – సాంబయ్య పోలీసుస్వామ్యమగునో గిరిజనులు హరిజనులు ఏ రోజు కా రోజు బలిపశువు లెట్లయ్యిరో – పాపయ్య బందూ కెందుకు పట్టిరో పాలుతాపిన తల్లి ప్రతి మనిషి కున్నట్లు పోరాట స్థలం తల్లీవంటిదో – సత్తెయ్య శ్రీకాకుళం ప్రజలతల్లి మనకందరికిరో మనమొక్కరమే లేము నలుదిక్కుల బిగిపిడికిళ్ళే ............................ ............................ తెల్లవారెను తూర్పుదిక్కున అరుణకాంతులు ప్రాకసాగెను మేలుకొనరా కార్మికా మేలుకొనరా కర్షకా మేలు కొండయ్యా కొత్త ఉదయం కాంతి యుద్ధం మేదినోత్సవ శుభం పూసెను మేలుకొనరా కార్మికా మేలుకొనరా కర్షకా మేలు కొండయ్యా ............................... ............................... "ప్రపంచ కార్మికులారా ఏకం కండి" ఆకాశం మార్మ్రోగింది "విప్లవం వర్ధిల్లాలి" ధరణి ప్రతిధ్వనించింది ఒక కామ్రేడ్ గొంతెత్తీ విశ్వగీతి పాడినాడు "ఆకలిమంటల మలమలలాడే అనాథులందరు లేవండోయ్ హింసారతినీ సహించగలేక ఈసడించినది ఎల్ల ధర్మమూ మంచిదినాలూ రానున్నాయీ మనకందరకును లేవండోయ్" ............................. ............................. కొత్త ఉదయం కాంతియుద్ధం రక్తకేతన మెత్తవలెరా అమరవీరుల ఆశయాన్ని కొనసాగిద్దాం ఐక్యం కావాలి మనం చీలి రాలి పోవద్దు ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఆచరించు మార్క్సిజం కాదుకాదు రివిజనిజం వర్ధిల్లును వర్ధిల్లును నక్సల్‌బరి పోరాటం నిష్కాపట్యంగా నిర్మలంగా సాగుదాం రైతాంగ సాయుధ పోరాటం వర్ధిల్లాలి కుట్రలు కూహకాలు వద్దు ప్రజాయుద్ధ పంథా వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి
  • * * * *
5. ఓ నేస్తగాడా!
  • * * * *

గౌరమ్మ కలలు చెరబండరాజు
ప్రథమ ముద్రణ మార్చ్ 1973
అంకితం: "జనాభాలో సగం మంది మహిళ లున్న సమాజంలో స్త్రీలోకం ముందురాక జనవిముక్తి జరగదనీ" పోరాడుతున్న చెల్లెళ్లకు ......
  • * * * *
చెరబండరాజు పాటలు జన్మహక్కు ప్రథమ ముద్రణ: ఏప్రిల్ 1978 ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్, హైదరాబాదు. [అంకితం:] ప్రాణంలో ప్రాణమైన "జన నాట్య మండలి" [కి] 1. కొండలు పగలేసినం కొండలు పగలేసినం కొండలు పగిలేసినం, బండలనూ పిండినం మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినం శ్రమ ఎవడిదిరో, సిరి ఎవడిదిరో బంజర్లను నరికినం, పొలాలనూ దున్నినం మా చెమటలు ఏరులుగా పంటలు పండించినం గింజెవడిదిరో, గంజెవడిదిరో మగ్గాలను పెట్టినం, పోగు పోగు వడికినం మా నరాలె దారాలుగ గుడ్డలెన్నొ నేసినం ఉడుకెవడిదిరో, వణుకెవడిదిరో యంత్రాలను తిప్పినం, ఉత్పత్తులు పెంచినం మా శక్తే విద్యుత్తుగ ఫ్యాక్టరీలు నడిపినం మేడెవడిదిరో గుడిసెవడిదిరో కారణాలు తెలిసినం, ఆయుధాలు పట్టినం మా యుద్ధం ఆపకుండ విప్లవాలు నడిపెదం చావు మీదిరో, గెలుపు మాదిరో
  • * * * *
2. రాజుల సంస్కృతి 3. లాల్ సలాం లాల్ సలాం కమ్యూనిస్టు కిష్ట గౌడ కామ్రేడా భూమయ్యా అందుకొండి పేదప్రజల ఆరాటపు లాల్ సలాం పోరాటపు లాల్ సలాం గుండె గుండె లాల్ సలాం, కొండ కొండ లాల్ సలాం
వీరగెరిల్లాలు మీరు చారు దారి పోరినారు అందుకొండి నవయువకుల భయంలేని లాల్ సలాం బందూకుల లాల్ సలాం పసి పాపల లాల్ సలాం పంట చేల లాల్ సలాం
ఎర్ర జెండ విడువ లేదు వర్గపోరు మరవలేదు అందుకొండి రైతాంగపు అన్నయ్యల లాల్ సలాం చెల్లెమ్మల లాల్ సలాం తెలుగునేల కూలి రైతు గెరిల్లాల లాల్ సలాం
జైలుగోడ నీడలకు చిరునవ్వులు నేర్పినారు అందుకొండి విద్యార్థుల మొక్కవోని లాల్ సలాం బిగిపిడికిలి లాల్ సలాం అడుగడుగున లాల్ సలాం అడవిపూల లాల్ సలాం
మీ ప్రాణం తియ్యలేక వణుకుతుంది ఉరికంబం (మీ ప్రాణం తీసి ఇంక బతుకలేదు ఈ ప్రభుతా) అందుకొండి అన్నలార పల్లె పల్లె లాల్ సలాం ప్రజాయుద్ధ లాల్ సలాం నక్సల్‌బరి శ్రీకాకుళ తెలంగాణ లాల్ సలాం ఎర్రజెండ లాల్ సలాం!
  • * * * *
4. ఓ భారత కార్మికుడా 5. మతపిచ్చి 6. ఊరూ మీది... 7. మొదనష్టపు సంఘంలో 8. చైనా గీతం 9. నియంతృత్వం 10. ప్రజాస్వామ్య బండి 11. మా పల్లె 12. మతమేదైనా 13. కష్టజీవి 14. సారూ! మనమూ! సారూ! మనమూ! సారూ! మనమూ పొలలకెళ్దాం శ్రమజీవులతో స్నేహం చేద్దాం //సారూ// కూలిపిల్లలతొ చేతులు కలిపీ చెమటతొ నేలను తడి తడి చేద్దాం //సారూ// పరుగుతొ నీటికి స్వచ్ఛత వలెనే పనితో మా చై తన్యం పెరుగును //సారూ// భట్టీయంతొ బండలమవుతాం పనితో తెలివీ తెలివితొ పనులూ //సారూ// ఈ రోజుతొ ఈ పాఠాలొద్దూ మార్కుల చదువులు మా కసలొద్దూ //సారూ//
  • * * * *
15. వారసులం వారసులం బోల్షివిక్కు వారసులం నక్సల్‌బరి బిడ్డలం జనచైనా వెలుగులలో నడుస్తున్న వారలం పీడితజన ముక్తికొరకు పోరుతున్న పేదలం శ్రీకాకుళ రైతాంగం చేతిలోని కత్తులం అమరజీవి పాణిగ్రాహి అన్నయ్యకు తమ్ములం ప్రజాయుద్ధ పల్లవిని పాడుతున్న రచయితలం పాలకవర్గాలబట్టి సాయుధంగ గూల్చెదం విప్లవాన్ని కుట్ర అనే శత్రుగోరి కట్టెదం (1974 అండర్‌ట్రయల్ కాలంలో)
  • * * * *
16. విప్లవాల యుగం మనది విప్లవాల యుగం మనది విప్లవాల యుగం మనది విప్లవిస్తె జయం మనదె //విప్లవాల// కష్టజీవులార మీరు కనలి కనలి చావకండి సాయుధ పోరాట ప్రజా సైనికులై కదలిరండి //విప్లవాల// ప్రజాయుద్ధ జలపాతం దోపిడిపై విరుచుకుపడి బూర్జువాల రాజ్యాంగం మట్టిపాలు కానున్నది //విప్లవాల// త్యాగాలకు వెనుదీయని వాడే మన సహచరుడు శత్రువుపై జాలిలేని వాడే మన స్నేహితుడు //విప్లవాల// పోలీసుల రాజ్యంలో పౌరహక్కు లడుగంటెను కోర్టులలో జనన్యాయం గొంతునులిమి చంపబడెను //విప్లవాల// చెరసాలలు ఉరికొయ్యలు వెలుగును బంధించలేవు ప్రతి నిమిషం పోరాడే ప్రజలను భయపెట్టలేవు //విప్లవాల// రాక్షస సామ్రాజ్యవాద పర్వతాలె కూలుతుంటె శ్రమజీవుల శక్తిముందు ఏ శక్తులు నిలువ గలవు //విప్లవాల//
  • * * * *
17. జన్మహక్కు 18. అన్నరారా… 19. ఓ గులాబి 20. శ్రామికవర్గం 21. పాడుతాం పాడుతాం పాడుతాం పాడుతాం ప్రజలే మా నేతలనీ ప్రజాశక్తి గెలుచుననీ పాడుతాం పాడుతాం //పా// నక్సల్‌బరి విరచించిన జనవిముక్తి గీతాలను ప్రతికంఠం నినదించగ పాడుతాం పాడుతాం //పా// జనపదాల విషాదాల తొలగించే నిప్పురవ్వ పెనుమంటలు రగిలించగ పాడుతాం పాడుతాం //పా// దోపిడిపై ధ్వజమెత్తిన భూమిలేని నిరుపేదల బాధలింక వుండవనీ పాడుతాం పాడుతాం //పా// పీడనలో పడినలిగిన జనజీవన శ్రమఫలాలు శ్రామికులకె చెందాలని పాడుతాం పాడుతాం //పా// ఈ దొంగల రాజ్యాంగం రచనే ఒక కుట్ర అనీ శ్రమజీవుల శ్వాసలతో పాడుతాం పాడుతాం //పా// గజం గజం నడిచైనా ప్రజాసేన వడివడిగా కెరటాలుగ పొంగుననీ పాడుతాం పాడుతాం //పా// శ్రీకాకుళ మెగరేసిన సాయుధపోరాట జండ చిరకాలం ఎగురుననీ పాడుతాం పాడుతాం //పా// మృతవీరులు చిందించిన రక్తంలో ప్రభవించిన అగ్నిజ్వాల లారవనీ పాడుతాం పాడుతాం //పా//
  • * * * *
22. ఇది నూతన… 23. చందమామా 24. ఏరూ - పడవ 25. ఏమిటుద్ధరిస్తారండీ... 26. ముంచుకొచ్చిందీ... 27. అన్నా అన్నా 28. వియత్నాం 29. జాతరోళ్లొస్తుండ్రు 30. మానండర్రో 31. ఓట్ల చెట్లు 32. ఓరయో నారయో... 33. మార్క్సిస్టు - లెనినిస్టు 34. నిన్న మనం 35. ఎర్రెర్రని తెలంగాణ ఎర్రెర్రని తెలంగాణ ఇదేనండి ఇదేనండి ఎర్రెర్రని తెలంగాణ కమ్యూనిస్టు గుండెకాయ కష్టజీవి కలలకోన //ఇదే// ఆనాడూ నైజామును మెడలు పట్టి విరచినట్టి కాంగిరేసు సర్కారును గడగడలాడించినట్టి రైతుకూలి పేదజనం చీమలవలె కదిలొచ్చిన //ఇదే// లక్షలాది ఎకరాలను హస్తగతం చేసుకొనీ మూడువేల గ్రామాలలో ఎర్రజెండ నెగురవేసి పీడితులను నిద్రలేపి యుద్ధానికి నడిపించిన //ఇదే// బయటపడ్డ పేగులనూ పైపంచెతో అదిమికట్టి పగతురపై పగబట్టీ ప్రాణాలను దీసినట్టి గొటిముకుల గోపాలరెడ్డి జన్మించిన జీవగడ్డ //ఇదే// చెయ్యం మేం చెయ్యమనీ చిన్న పెద్ద ఒక్కటయ్యి సంఘాన్నే నమ్ముకొనీ దొరల చావగొట్టి వెట్టి చాకిరులను విడిచిపెట్టి కత్తిపట్టి పోరినట్టి //ఇదే// ఏ ఇంట్లో ఏ బిడ్డడు ఎందుకొరకు చచ్చెననీ అడగండీ ప్రతి పల్లెను ప్రతి చెట్టును ప్రతి గుట్టను ఆత్మకథలు చెప్పునవీ దోపిడింక పోలేదని //ఇదే// పోరాటం నడిపించిన పుచ్చలపలి సుందరయ్య కంటనిప్పులను చెరిగిన చండ్ర రాజేశ్వరయ్య ఎన్నికలని కొంపార్చిరి ఇంకెప్పుడు నమ్మకండి //ఇదే// నాటి తెలంగాణ నుండి శ్రీకాకుళ గిరిజనుడు శ్రీకాకుళ పోరునుండి తెలంగాణ రైతు నేడు భూమి భుక్తి ముక్తి కొరకు విప్లవించినారు చూడు //ఇదే// కొమరన్నకు వారసులూ కోరన్నలు మంగన్నలు మేలుకొనే ఉన్నారు తెలంగాణ పల్లెల్లో కోయంటే కోయంటరు సైయంటే సైయంటరు //ఇదే// చల్లబడదు చల్లబడదు తెలంగాణ విప్లవాగ్ని మళ్ళీ చెలరేగుతుంది ఆగకుండ పోరుతుంది నక్సల్‌బరి అడుగులోన అడుగువేసి నడుస్తోంది //ఇదే//
  • * * * *
36. ఏ కులమబ్బీ ఏ కులమబ్బీ ఏ కులమబ్బీ మాదే మతమబ్బీ //ఏ// మట్టిపిసికి ఇటుకచేసి ఇల్లుకట్టి పెట్టినపుడు డొక్కలెండి కొండ్రలేసి ధాన్యరాసు లెత్తినప్పుడు //ఏ// పొగగొట్టాలై పేగులు కొలిమిసెగలు చిమ్మినపుడు దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు త్రవ్వినపుడు //ఏ// మాడుచెక్కలే తింటూ మాగాణం దున్నినపుడు ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినపుడు //ఏ// పూజకు అందిచ్చు పూల బుట్టలల్లి ఇచ్చినపుడు రామకోటి రాసుకునే కాగితాలు చేసినపుడు //ఏ// పశువుగొంతు కోసి మీకు చెప్పులు కుట్టిచ్చినపుడు కూటికింత కూడులేక కుండలు జేసిచ్చినప్పుడు //ఏ// సన్యాసుళ్లై వస్తే క్షవరాలు చేసినపుడు మురికిగుడ్డ లుతికి మల్లె పూలు చేసి ఇచ్చినపుడు //ఏ// చెల్లవు మీ కల్లబొల్లి కబుర్లని చెదలుపట్టె సాగదు మీ పాతరోత రథం విరిగిపోయినది //ఏ// కులాలనీ కులంలోని శాఖలనీ వేరుజేస్తే చెమటోడ్చే మనుషులమూ చేయికలిపి నిలబడితే //ఏ//
                              1 సెప్టెంబరు 1975 
  • * * * *
37. పునర్జన్మ 38. ఆపలేరు 27. ఆపలేరు ఆపలేరు ఆపలేరు ఇంకమీరు ఆపలేరు ఈ మట్టిని తొలుచుకొనీ విప్లవాలు లేస్తున్నై ఎరుపెక్కిన ఈ మట్టికి మా నెత్తుటి స్వాగతాలు //ఆపలేరు// మీ చీకటికొట్టానికి నిప్పులంటుకుంటున్నై మా ఊపిరితిత్తులతో ఊది ఊది మండిస్తాం //ఆపలేరు// బంధనాలు తెంచుకొనీ పల్లెలు వడిలేస్తున్నై మేలుకొన్న నిరుపేదకు మా నెత్తుటి అభివాదం //ఆపలేరు// విముక్తికై శ్రమశక్తులు రక్తార్పణ జేస్తున్నై పోరాడే యోధులకు మా నెత్తుటి జేజేలు //ఆపలేరు// భూమిమీద సామ్యవాద బావుటాలు లేస్తున్నై ఎదురుతిరుగు మానవుడికి మా నెత్తుటి లాల్ సలాం //ఆపలేరు//
  • * * * *
పల్లవి చెరబండరాజు అంకితం "నేలతల్లికి " ఈ మట్టి నాకు పట్టెడన్నం పెట్టి పాలు తాపింది
1. యువతరమా...... 2. దీపం 3. పల్లవి 4. నడవాలి నడవాలి 5. ఒకే చెట్టుకొమ్మలు 6. ఎండావానలలోన 7. ప్రవాహం 8. కత్తిపాట 9. చరిత్రపుష్పం చరిత్ర పుష్పం పనిచేయని పైతరగతి పద్మాసనం వేసుక్కూర్చున్న ప్రభు సంతతి అదే పనిగా జనం పేరు జపిస్తోంది గరీబీ హఠావో అంటోంది శూన్య కమండలం ఒయ్యారంగా వొంచి గాలిని చిలకరించి అది రాజనీతి విభూతి పెట్టకమానదు అవసరాన్నిబట్టి కన్నీరూ పెట్టుకుంటుంది మంగముళ్ల మార్గాలేవో మొసళ్ల మోసాలేవో కనిపెట్టి మసలుకోవడం కళ్లున్న వాళ్లు చేసే పని ఇంటింటికీ మట్టిపోయ్యే అనే నానుడి మరీ పాతది నిన్నటిదీ నిజంలేనిది గ్యాస్ స్టౌ లొచ్చేసాయి ఆ తరగతి వాళ్లు ఒక మెట్టు పైనున్న వాళ్లు ఎక్కిన నిచ్చెన తన్నేసిన వాళ్లు మాటల్తో కోటలు దాటే సమాజంలో వొట్టి గ్యాస్ కొట్టేవాడే సామ్రాట్టు పద్మాసనం కొంగజపం పనివాడికి అన్నం పెట్టదు వాడు రెక్కల్ని నమ్ముకొని అమ్ముకుంటాడు పనివ్వండి పనికి తగిన ప్రతిఫలమివ్వండనీ ఉగ్రుడవుతాడు ఉద్యమిస్తాడు వాడి పొట్ట గొట్టినవాడు అట్టడుగు వర్గాల కోపాగ్నిజ్వాలల్లో భగ్గున మండి బుగ్గి అవుతాడు కాలంతో కష్టజీవి చరిత్ర సారథి వాడే వాడికెపుడు తిరుగులేదు
  • * * * *
10. పోనీ 11. ఆరో ప్రాణం 12. చెట్టుతో 13. తనూ - నేను 14. దుర్గం 15. అలలు 16. మా పాప మాట్లాడుతోంది 17. ప్రభాతం 18. హక్కు హక్కు చెట్లలో ప్రాణం వుందని నరకొద్దనను ప్రకృతి కందమని ఆకులు కొయ్యొద్దనను కొమ్మలు చెట్లచేతులని విరవొద్దనను ఎందుకంటే నాకు గుడిసె కావాలి
  • * * * *
19. గుడిసె బిడ్డ 20. ఏమిటది? 21. ఓ నా మేకా ! 22. జూన్ 26 23. ప్రవేశం 24. వెయ్యి పూలు వెయ్యి పూలు ఉదయాస్తమయాలలో ఖైదీల కన్నీటితో పూసిన ఎర్రగన్నేరు పూలు నిర్మలంగా మెరుస్తున్నాయి తెంచకండి ఎందరు నిరపరాధుల జీవితాలు ఈ బందిఖానాలో సమాధి చేయబడ్డాయో మల్లెలు పరిమళాల అంజలి ఘటిస్తూ తెల్లగా విచ్చుకుంటున్నాయి మలిన పరచకండి సమతాస్వాతంత్ర్యాల కోసం పోరాడిన వీరులు ఎందరిక్కడ నరకబడ్డారో పిరికితనంతో రాజీపడకండి వీరవారసత్వాన్ని నిలపండి నేరవ్యవస్థ మీద తీవ్రంగా ప్రతి ఖైదీ హృదయం ప్రతీకారం పునాదిగా జ్వాలాపుష్పమై విప్పారుతోంది అనుమానించకండి వెయ్యిపూలు వికసించనీండి వెయ్యి ఆలోచనల ఘర్షణ పడనీండి
  • * * * *
25. నేతి బీరకాయ నేస్తం 26. హమాలన్నా - కూలన్నా 27. అర్జీ 28. గోదావరి పొరలుతుంది
  • * * * *

నవలలు

  • మాపల్లె (1978)
  • ప్రస్థానం (1981)
  • నిప్పులరాళ్లు (1983)
  • గంజినీళ్లు (1983)

కథలు

  • చిరంజీవి చెరబండరాజు కథలు (1985)

పురస్కారం

  • 1970లో దిక్సూచి కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది.



2, సెప్టెంబర్ 2014, మంగళవారం

తెలుగు కవులు - చలసాని ప్రసాదరావు

http://prasthanam.com/sahithivettalu
వికీపీడియా నుండి
చలసాని ప్రసాదరావు
Chalasani prasadarao.jpg
చలసాని ప్రసాదరావు
జన్మ నామం చలసాని ప్రసాదరావు
జననం అక్టోబరు 27 1939
కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు
మరణం జూన్ 12 2002
వరంగల్లు జిల్లా
ఇతర పేర్లు చలసాని ప్రసాదరావు
ప్రాముఖ్యత ప్రముఖ రచయిత,చిత్రకారుడు
చలసాని ప్రసాదరావు ప్రముఖ రచయిత,చిత్రకారుడు.కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలోఅక్టోబరు 27 1939 న జన్మించారు. జూన్ 12 2002 న వరంగల్లు జిల్లాలో మరణించారు.ఈనాడు దినపత్రికలో వారం వారం వెయ్యికి పైగా "కబుర్లు " చెప్పారు.

రచనలు

  • కాకతీయ శిల్పకళా వైభవం
  • ఆధునిక చిత్రకళ
  • రష్యన్ చిత్రకళ
  • కథలూ కాకరకాయలు
  • మాస్టర్ పీచు