Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

30, నవంబర్ 2014, ఆదివారం

తెలుగు కవులు - రాచకొండ విశ్వనాథ శాస్ర్తి




వికీపీడియా నుండి
(రాచకొండ విశ్వనాథ శాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
రాచకొండ విశ్వనాధశాస్త్రి
రాచకొండ విశ్వనాధశాస్త్రి వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు.

తొలి జీవితము

రావి శాస్త్రి, నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922 జూలై 30న శ్రీకాకుళంలో జన్మించాడు. ఈయన స్వస్థలము అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామము. ఈయన తండ్రి, న్యాయవాది తల్లి, సహితీకారిణి.

రావి శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (ఆనర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి 1946 లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని 1950లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు. ఆరంభములో కఠోర కాంగ్రేసువాది అయినా 1960లలో మార్క్సిష్టు సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు.

1947 ప్రాంతంలో లో న్యాయవాది వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం , విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగాడు. పట్టణ జీవితంలో వస్తున్న పెనుమార్పులను గమనించాడు. గురజాడ అప్పారావు, శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న నమాజంలో గిలగిలలాడే వారి ఆరాటాలను తన రచనలలో చిత్రించాడు. రావిశాస్త్రి కథా కథన పద్థతి చాలా పదునైనది, కాపీ చేస్తే తప్ప అనితరసాథ్యం.

రచనలు

తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. జేమస్ జాయిస్ "చైతన్య స్రవంతి" ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది. జేమస్ జాయిస్ రచనా పద్థతిని మొదటిసారిగా తెలుగు కథలకు అన్వయించినది కూడా రావిశాస్త్రినే. ఇది ఆయన మొట్టమొదటి నవల.

ఈ నవలను ఆయన 1952 లో రచించాడు. తరువాత రాజు మహిషీ,రత్తాలు-రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించిచాడు. ఈయన జీవిత చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా ఈ అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే.

ఆంధ్రలో మధ్యపాన నిషేధ చట్టం తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ఆరుసారా కథలు తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేసాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఆయన నిజం నాటకంలో వ్యక్తం చేసాడు.

రచనల జాబితా

విశాఖపట్నం బీచ్ రోడ్ లో రావిశాస్త్రి విగ్రహం.
  • కథాసాగరం(1955)
  • ఆరుసారా కథలు (1961)
  • రాచకొండ కథలు (1966)
  • ఆరుసారో కథలు (1967)
  • రాజు మహిషి (1968)
  • కలకంఠి (1969)
  • బానిస కథలు (1972)
  • ఋక్కులు (1973)
  • రత్తాలు-రాంబాబు (1975)
  • సొమ్ములు పోనాయండి
  • గోవులోస్తున్నాయి జాగ్రత్త
  • బంగారం
  • ఇల్లు
నాటకం / నాటికలు
  • నిజం నాటకం
  • తిరస్కృతి నాటిక
  • విషాదం నాటిక

రావిశాస్త్రి విశిష్టత

1983లో ఆంథ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణను ప్రకటిస్తే దానిని తిరస్కరించాడు. అంతే కాకుండా 1966 లో తీసుకున్న సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చివేసాడు. కేంద్ర సాహిత్య అకాడమీ

ఆయన కథకుడే కాదు నటుడు కూడా . ఆయన వ్రాసిన నిజం నాటకంలోను, గురజాడ కన్యాశుల్కం నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆరోజుల్లోనే, అంటే 1962 ప్రాంతంలో, వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.

"రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చేడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను" అన్నాడు రావిశాస్త్రి. 1922 జూలై 30న పుట్టి, పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాల నెదిరించి నెలల తరబడి జైలుపాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం.. తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993 నవంబర్ 10 న రావిశాస్త్రి పెన్ను, కన్నుమూశాడు.

బయటి లింకులు

29, నవంబర్ 2014, శనివారం

తెలుగు కవులు - పుట్టపర్తి నారాయణాచార్యులు




వికీపీడియా నుండి
పుట్టపర్తి నారాయణాచార్యులు
Puttaparti.jpg
పుట్టపర్తి నారాయణాచార్యులు
జననం పుట్టపర్తి నారాయణాచార్యులు
1914, మార్చి 28
అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు
మరణం 1990 సెప్టెంబర్ 1
ఇతర పేర్లు పుట్టపర్తి నారాయణాచార్యులు
సుపరిచితుడు తెలుగు కవి.
మతం హిందూమతం
పిల్లలు 6; 5 కుమార్తెలు; 1 కుమారుడు
ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట
పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.

జీవిత విశేషాలు

పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి(ķóndamma) గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. [[శ్రీకృష్ణదేవరాయలరాజగురువు) తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది.
నారాయణాచార్యులు చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆయన తిరుపతి సంస్కృత కళాశాలలో సంస్కృతం నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డి.టి. తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం, ఛందస్సు, తదితరాలు నేర్చుకున్నారు. పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరత నాట్యం నేర్చుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం ఆయనలో త్రివేణీ సంగమంలా మిళితమయ్యయి. చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేయడమే గాక సన్నివేశాల మధ్య తెర లేచేలోపు నాట్యం చేసే వారు.
ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. మొదట ఆయన పని చేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివితీరా పొగడడం, గాంధీ వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి ఆయనతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరు లోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది.
ఆయన బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు. తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. హృషీకేశ్ లో ఆయన పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి ఆయనకు "సరస్వతీపుత్ర" బిరుదునిచ్చారు. ఆయనకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి ఆయన ఉంచుకున్నారు.
పుట్టపర్తి ఆనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ కావ్యాలను తెలుగులోనికి అనువదించారు."లీవ్స్ ఇన్ ది విండ్", దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన "ది హీరో" ఆంగ్లంలో ఆయన స్వంత రచనలు. ఆయన ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే. ఆయనకు ఆంగ్లం నేర్పిన వి.జె. పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది. అప్పట్లోనే ఈయన వ్రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ కావ్యం చూసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు.
అయితే పిట్ దొరసాని మాత్రం "ఇంగ్లీషులో వ్రాయడానికి అనేక మంది ఇండియన్స్ ప్రయత్నించి ఫెయిలైనారు. మీరెంత కష్టపడినా మిమ్మల్ని క్లాసికల్ రైటర్స్ ఎవరూ గౌరవించరు. అందుకే బాగా చదువుకో. కానీ ఇంగ్లీషులో వ్రాసే చాపల్యం పెంచుకోవద్దు." అని చెప్పింది. దాంతో ఆయన చాలా రోజులు ఆ ప్రయత్నమే చేయలేదు. అయితే ఆ తర్వాత చాలా కాలానికి భాగవతాన్ని ఇంగ్లీషులోకి అనువదించడంతో బాటు ది హీరో నాటకాన్ని వ్రాశారు. కథంతా స్వీయ కల్పితమే.
ఆయన చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే చరిత్రకారులకు ఆయన్ను పట్ల గొప్ప గౌరవముండేది. ఒకసారి ఆయనకు కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశమున్న మల్లంపల్లి సోమశేఖరశర్మ "ఆయన్ను కవిగా కంటే చారిత్రకునిగా గౌరవిస్తానని" సందేశం పంపాడు. తర్వాత పుట్టపర్తి చారిత్రకులను ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ "సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?" అని అడిగి, ఆయన దిగ్భ్రాంతుడై నిలబడి పోతే, తనే సమాధానం చెప్పాడు~: "కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్ళూ" అని.
భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది. ఆయితే ఆయన నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్నివిధాలా అర్హులనీ, ఆయనకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమనీ పలువురు పండితులు భావిస్తారు. గుర్రం జాషువా "పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు?" అని ప్రశ్నించాడు. దేశంలోని అన్ని ప్రాంతాలలో, హైదరాబాదు, చెన్నై, కలకత్తా లాంటి అన్ని నగరాలలో ఆయన సత్కారాలు పొందారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి. ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పని చేసి 1990 సెప్టెంబర్ 1న స్వర్గస్థులయ్యారు.
వీరి కాంశ్య విగ్రహం ప్రొద్దుటూరు పట్టణంలో 2007 సంవత్సరంలో ప్రతిష్టించబడినది.[1]
పుట్టపర్తి నారాయణాచార్యులు
'సాధనా సంపత్తి.. పుట్టపర్తి సాహితీ సుధ'బొద్దు పాఠ్యం
సాహిత్యాకాశంలో పుట్టపర్తి ధృవతారగా ఎలా నిలిచారో సాధనాపరంగానూ వారిస్థాయి అంతే ఎత్తులో వుంది..కేవలం యే ఆధ్యాత్మిక అనుభూతి కలగలేదని సంసారాన్ని విడచి సాధువులను వెతుక్కుంటూ హిమాలయాల దారి పట్టి అక్కడ స్వామి శివానంద సరస్వతిని భగవత్సంకల్పితంగా కలిసి వారిచే సరస్వతీ పుత్రా అనిపించుకుని నడిచేదైవం కంచి పరమాచార్యులు చంద్రశేఖరులచే అమితంగా ప్రేమింపబడి నీ అంత్యకాలంలో కృష్ణ దర్శనమౌతుంది అని వారిచే ఆశీర్వాదమందిన పుణ్య చరితులు పుట్టపర్తి..
నా గత జన్మ యేమిటి
ఈ జన్మలో నా స్థితి యేమి కృష్ణ సాక్షాత్కారం అవుతుందా..ఇదే ప్రశ్న పుట్టపర్తి తోటే పుట్టి పెరిగి పుట్టపర్తిని నడిపించి చివరికి తనలోనే కలిపేసుకుంది.. ఈ వివరాలు భవిష్యత్తులో పుట్టపర్తిపై పరిశోధన చేసేవారికీ,ఆరాధించేవారికీ, ఎంతో మార్గదర్శకంగా ఉంటాయి ఎవ్వరి జేవితం లోనూ కనిపించని వైవిధ్యాలు పుట్టపర్తి లో ఉన్నాయి జ్యోతిష్య పండితులు పుట్టపర్తి పాండిత్యానికీ 'సంగీత నాట్య సాహిత్య ఇవే కాక మరెన్నో కళలలో అభినివేశానికీ ముఖ్యంగా వారి జీవన సూత్రమైన సాధనమయ ప్రపంచంలోని రహస్యాలను కనుగొనడానికి శ్రీవారి జాతకం బయల్పరచటం జరిగింది పుట్టపర్తి వారి జాతక వివరాల కోసం మీరు ఈ లింక్ ను దర్శించవలసి వుంటుంది..
http://puttaparthisaahitisudha.blogspot.in/2013/10/blog-post_8836.html
తప్పకుండా వారు వారి గమ్యాన్ని చేరారని మేము వారి ప్రియ శిష్యులూ భావిస్తున్నాము వారి నిర్యాణ సమయంలో దగ్గరున్న గోవిందు అనే శిష్యుడు అయ్య ఇచ్చామరణం పొందినట్లు మాకనిపించిందమ్మా..వారి సహస్రారం నుంచీ ఆత్మ నిర్గమించిందనిమేము కనుగొన్నాము అని వివరించాడు..ముఖ్యంగా ఇంకో విషయం పుట్టపర్తి అంత్య సమయంలో వారి ఆధ్యాత్మ శిష్యులు మాత్రమే చుట్టూ వుండటం..భాగవతం దశమ స్కందం తీయమని బాబయ్య తదితరులకు చెప్పి వ్యాఖ్యానిస్తూ దాదాపు అరగంట గంట పాటు తెల్లవారి నాలుగ్గంటల నుంచీ.. ఏకాదశీ తిధి నాడు' ' 'శ్రీనివాసా..' అని పడకపై ఒరిగిపోవటం యేవో రహస్యాలను విప్పీ విప్పక చెప్పటం లేదూ..
పుట్టపర్తి జాతకం వారి స్వహస్తాలతో
సేకరణ : శ్రీ రామావఝుల శ్రీశైలం సమర్పణ : పుట్టపర్తి అనూరాధ

రచనలు

కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా "పెనుగొండ లక్ష్మి" అనే గేయ కావ్యం రాశాడు. చిత్రంగా తర్వాత ఆయన విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం "పెనుగొండ లక్ష్మి" కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు "పూర్తి" మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో ఆయన పాస్ కాలేకపోయారు. ఆయన బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.
తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ నవల ఏకవీర ను మలయాళం లోనికి అనువదించాడు. పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు. కాని పుట్టపర్తివారి విషయంలో మాత్రం దీనికి విరుద్దం. ఒక సారి విజయవాడలో పుట్టపర్తి తన "శివతాండవం" గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై ఆయనను భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరాడు. ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం ఐపోయాక ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు.
తెలుగులో ఆయన వ్రాసిన "శివతాండవం" ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. దీనిని అనేకమంది పండితులు ఆధునిక మహా కావ్యంగా అభివర్ణిస్తారు. ఇది ఆరు భాగాలుగా ఉంది. దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం చేయమనే వారు. తెలుగు అర్థం కాని వారు సైతం ఆ మాత్రాచ్ఛందస్సు లోని శబ్దసౌందర్యానికి పరవశులయ్యేవారు. ఆయన గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని ఆయన స్వయంగా గానం చేయగా విన్న వాళ్ళు "ఆ శివుడు ఆడితే చూడాలి-ఆచార్యులవారు పాడితే వినాలి" అని భావించేవారు.
మచ్చుకు :
కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!
ఆయన 140 పైగా గ్రంధాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల ఆయన రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మ తో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.

ఆయన వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.
తెలుగులో స్వతంత్ర రచనలు.
పెనుగొండ లక్ష్మి, షాజీ, మేఘదూతము, సాక్షాత్కారము, పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్), శ్రీనివాస ప్రబంధమ్, ఆగ్నివీణ, ప్రబంధ నాయకులు, పాద్యము, సిపాయి పితూరీ, గాంధీ ప్రస్థానం, క్రాంతి సందేశం, అనురాగం, ఆశ, స్మృతి, ఓదార్పు, ఎడబాటు, వీడుకోలు, ఆంధ్ర భారతోపన్యాసాలు, భాగవతోపన్యాసాలు, రామకృష్ణుని రచనా వైఖరి, వసుచరిత్ర విమర్శనమ్, విజయనగర రాజ్య సాంఘిక చరిత్ర, మొదలైనవి 7,000 కృతులు
ఆంగ్లంలో స్వతంత్ర రచనలు
  • లీవ్స్ ఇన్ ది విండ్.
  • ది హీరో
మలయాళంలో స్వతంత్ర రచనలు
  • మలయాళ నిఘంటువు
సంస్కృతంలో స్వతంత్ర రచనలు
  • త్యాగరాజ స్వామి సుప్రభాతం.
  • చెన్నకేశవ సుప్రభాతం.
  • శివకర్ణామృతం

అనువాదాలు

  • హిందీ నుండి:కబీర్ గీతాలు(కబీర్ వచనావళి,ఎన్.బి.టి ప్రచురణ)
  • మరాఠీ నుండి:భగవాన్ బుద్ధ
  • మలయాళం నుండి:స్మశానదీపం
  • మలయాళం లోకి:ఏకవీర
  • ఇంగ్లిషు లోకి:భాగవతం

వ్యక్తిత్వం

నారాయణాచార్యులు అహంభావిగా కనిపించే ఆత్మాభిమాని. తన కవిత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే నేను వ్రాసే తరహా కవిత్వం వారికి నచ్చ లేదు అనుకుని ఊరుకునే వాడు. కానీ తనకు పాండిత్యం తక్కువంటే మాత్రం సహించే వాడు కాదు. నిజంగా తన సాహితీ కృషికి అవసరమైన అంశాల్లో తనకు తెలియనిదేదైనా ఉంటే పట్టుదలతో నేర్చుకునే వాడు. అందుకే "నేను పెద్ద పండితుణ్ణి. ఇందులో సందేహం లేదు. నేను ఏ పరీక్షకు నిలబడడానికైనా తయారే. అయితే వినయపరుణ్ణి. నన్ను రెచ్చగొడితే మాత్రం భయంకరుణ్ణౌతా." అనేవాడు.
ఒకసారి ఆయన అనంతపురంలో జరిగిన సాహిత్యోపన్యాసాలకు వెళ్ళినప్పుడు కడపలో ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ జరిగింది. గంటి జోగి సోమయాజి సభాధ్యక్షుడు. ఆ సభలో పుట్టపర్తి గురించి "ఆయనకు తెలుగు తప్ప ఏ భాషా రాదు. పధ్నాలుగు భాషలు వచ్చని ప్రచారం చేసుకుంటాడు." అని విమర్శలు చేశారు. ఆ రాత్రే తిరిగి వచ్చిన ఆయన మరునాడు సభకు వెళ్ళి "14 భాషల్లో ఎవరు ఏ భాషలో నైనా ఏ ప్రశ్నైనా వేయవచ్చు.మీరు అడగండి. ఏ భాషలోనైనా సరే ఆశు కవిత్వం చెబుతాను." అని సాహిత్యంలో అహంకారం అనే విషయం మీద రెండున్నర గంటలు మాట్లాడి "నాకు అహంకారముంది. దీంట్లో న్యాయముంది." అన్నారు.

ప్రముఖుల అభిప్రాయాలు

  • పుట్టపర్తి వారిలాగ బహుభాషల్లో, బహుశాస్త్రాల్లో పండితులైన వారు, కవిత్వంతో బాటు విమర్శనారంగంలో కూడా అనన్యమైన ప్రతిభ చూపిన వారు నేటితరంలో కనిపించరు. జ్ఞానపీఠం వంటి గౌరవానికి వారు నిజంగా అర్హులు. కానీ అది తెలుగువారి దురదృష్టం వల్ల వారికి లభించలేదు. -భద్రిరాజు కృష్ణమూర్తి
  • శివతాండవం విన్నప్పుడు తుంగభద్రాప్రవాహంలో కొట్టుకు పోతున్నట్లనిపించింది. తర్వాత మేఘదూతం చదివాను. ఇది నా దృష్టిలో శివతాండవం కంటే గొప్ప రచన. -రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
  • ఆధునిక సారస్వతమున శివతాండవం వంటి గేయకృతి ఇంకొకటి లేదు. -తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి
  • కవిత్వాన్నీ, పాండిత్యాన్నీ కలగలిపి ఔపోశన పట్టిన అగస్త్యుడు. -సి. నారాయణ రెడ్డి
  • ఎవని పదమ్ములు శివ తాండవ లయాధిరూపమ్ములు
ఎవని భావమ్ములు సుందర శివాలాస్య రూపమ్ములు
అతడు పుట్టపర్తి సూరి! అభినవ కవితా మురారి!!
...
పుట్టపర్తి ధిషణకు జైకొట్టగ మనసాయె నాకు.
కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు
వెలితి ఎరుగలేని కడలి పొలుపు తెలుపు అతని తలపు
వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు
రక్తికి భక్తికి సేతువు రచియించిన రసికుడతడు!!! -సి. నారాయణ రెడ్డి

మూలాలు

బయటి లింకులు


28, నవంబర్ 2014, శుక్రవారం

తెలుగు కవులు - పింగళి నాగేంద్రరావు




వికీపీడియా నుండి
పింగళి నాగేంద్రరావు
Pingali Nagendra Rao.jpg
పింగళి నాగేంద్రరావు
జననం పింగళి నాగేంద్రరావు
1901 డిసెంబర్ 29
శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాం
మరణం 1971 మే 6
వృత్తి కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడు
మతం హిందూ
పింగళి నాగేంద్రరావు (ఆంగ్లం: Pingali Nagendrarao) (1901 - 1971) ఒక తెలుగు సినిమా రచయిత. పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా రచయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రాసినవే.

బాల్యం

నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29 న శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాంలో జన్మించాడు. ఆయన తండ్రి గోపాల క్రిష్ణయ్య యార్లగడ్డ గ్రామానికి కరణంగా ఉంటూ నాగేంద్రరావు జననానికి పూర్వమే కరణీకాన్ని వదులుకుని విశాఖలో ఉన్న ఆయన తమ్ముళ్ల దగ్గరికి వచ్చేశారు. నాగేంద్రరావు పినతండ్రులలో ఒకరు డిప్యూటీ కలెక్టర్ మరొకరు ప్లీడర్. నాగేంద్రరావు అన్న శ్రీరాములు 1913 లోనే భారతదేశాన్ని వదిలి 1926 నుంచి ఆస్ట్రేలియాలో పంచదార ఎగుమతి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. పింగళికి రెండేళ్ళ వయసులో ఆయన కుటుంబం బందరుకు వలస వెళ్లింది.

విద్యాభ్యాసం

నాగేంద్రరావు తల్లి మహాలక్ష్మమ్మది దివి తాలూకా. ఆయన చిన్నతనం నుంచీ కృష్ణా జిల్లాలోనే ఉంటూ ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కోపల్లె హనుమంతరావు ప్రభృతులు స్థాపించిన ఈ కళాశాలలో తొలి విద్యార్థుల బృందంలో నాగేంద్రరావు ఒకడు. మంగినపూడి పురుషోత్తమ శర్మ అనే సుప్రసిద్ధ కవీ, మాధవపెద్ది వెంకట్రామయ్య అనే ప్రఖ్యాత స్టేజీ నటుడు ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళే. ఆంధ్రకంతటికీ గర్వకారణంగా వెలసిన ఆంధ్ర జాతీయ కళాశాల యొక్క తొలి విద్యార్థులలో ఒకడైన కారణం చేత కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మొదలైన వారి పరిచయం లభించింది.

ఉద్యోగం

1918లో చదువు పూర్తి చేసి నాగేంద్ర రావు ఖరగ్‌పూర్లోని రైల్వే వర్క్‌షాపు లో అప్రెంటీస్ గా చేరాడు. వర్క్‌షాప్ లో పనిచేసేందుకు ఆయన ఆరోగ్యం సహకరించదని ఆయన్ను ఆఫీసు పనికి మార్చారు. ఆయన ఉండగానే బి.ఎన్ రైల్వే కార్మికుల తొలి యూనియన్ ఏర్పాటు అయింది. నాగేంద్రరావు తన బావమరిది యైన దండపాణితో కలిసి ఈ యూనియన్ స్థాపనకు విశేషంగా కృషి చేశాడు. దండపాణి ఆ యూనియన్ కు అధ్యక్షుడు. అదే సమయంలో చిత్తరంజన్ దాస్ రైల్వే ఫెడరేషన్ కు అధ్యక్షుడు.
ఇట్లావుండగా ప్రసిద్ధ యోగవ్యాయామవేత్త అయిన రామజోగారావుగారు ఖర్గపూరులో జాతీయోత్సాహం రేకెత్తించే ఉపన్యాసాలివ్వసాగారు. ఈ ఉపన్యాసాల ఫలితంగా 1920లో నాగేంద్రరావు తన ఉద్యోగానికి ఉద్వాసన చెప్పి ఉత్తరదేశయాత్ర ప్రారంభించాడు. ఖర్గపూరులో వుండగానే ఆయన దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) సభ్యుడుకావటం జరిగింది. దివ్యజ్ఞాన సమాజంవారి మకాములలో బసచేస్తూ ఆయన ఉత్తరదేశం పర్యటించి చివరకు సబర్మతీ ఆశ్రమం చేరుకున్నాడు. అసలే బ్రహ్మచారి , అందులో వైరాగ్యం కుదిరింది. కాని ఆశ్రమం వారు అనుమతించలేదు. నాగేంద్రరావు ఆశ్రమవాసిగా వుండేకన్న కాంగ్రెసు సంస్థలో చేరి ఎక్కువ దేశసేవ చేయగలుగుతాడన్నారు.
సబర్మతీలో పదిహేనురోజులున్న తరువాత ఈ నిర్ణయం జరిగింది. దీన్ని అమలు చేయగలందులకు కాకా కలేల్కర్ గారు, అప్పట్లో కృష్ణాజిల్లా కాంగ్రెసు అధ్యక్షులుగా వుంటూవుండిన ధన్వాడ రామచంద్రరావు గారికి ఒక లేఖ వ్రాసియిచ్చారు. దానిసహాయంతో నాగేంద్రరావుకు కాంగ్రెసు ఆర్గనైజరు వుద్యోగం, వేతనంతోసహా లభించింది. ఈ ఉద్యోగం చేస్తూ ఆయన కొన్ని దేశభక్తి పద్యాలు రచించి "జన్మభూమి " అనే పుస్తకంగా ప్రచురించాడు. ఈ పని చేసినందుకు నాగేంద్రరావును బెజవాడలో అరెస్టు చేశారు. అయితే జిల్లా కలెక్టరుగారు "వార్నింగ్" ఇచ్చి ఆయనను విడిచిపెట్టారు.
ఒకనాడు పట్టాభి సీతారామయ్య కాంగ్రేసు ఆఫీసుకొచ్చి అక్కడ నాగేంద్రరావును చూసి, ఆర్థిక స్తోమత కలవాళ్ళే కాంగ్రేసు సంస్థకు సేవచేయగలరనీ, బ్రతుకు తెరువుకు కాంగ్రేసుపై ఆధారపడేవారు భారమనీ, నాగేంద్రరావు లోగడ చేస్తూవుండిన ఉద్యోగం మానడం పొరపాటనీ సలహా ఇవ్వగా, దాన్ని గురూపదేశంగా భావించి నాగేంద్రరావు కాంగ్రేసుకు రాజీనామా యిచ్చాడు.

రచనా వ్యాసంగం

ఈ సమయంలో బందరులో కౌతా శ్రీరామశాస్త్రి మోడరన్ రివ్యూ, ప్రవాసి పత్రికల పద్ధతిలో ఉత్తమ సాహిత్య పత్రికను ప్రారంభించాలని యత్నం చెయ్యసాగాడు. ఆ పత్రికలో పనిచేయటానికి డాక్టర్ పట్టాభి నాగేంద్రరావుని సిఫార్సు చేశారు. 1923లో శారద అనే పేరుతో ఈ పత్రిక వెలువడింది. శ్రీరామశాస్త్రికి సహాయంగా వుంటూ నాగేంద్రరావు ఆ పత్రికను నడపసాగాడు. 1924లో ఈ పత్రిక నిలిచిపోయే పర్యంతమూ ఆ పనిలోనేవుంటూ ఆ పత్రికమూలంగా డాక్టర్ అహోబలరావు వంటి పెద్దల మైత్రికూడా సంపాదించుకున్నాడు నాగేంద్రరావు.
చిన్నతనం నుంచీ విద్యార్థిదశలోకూడా, నాగేంద్రరావుకు రచనలుచేసే అభ్యాసం వుండేది. ముఖ్యంగా నాటకాలమీద ఆయనకు ఎక్కువమక్కువ. శారద పత్రికను నడిపేరోజులలోనే ఆయన ద్విజేంద్రలాల్ రాయ్ బెంగాళీ నాటకాలు "మేవాడ్ పతన్", "పాషాణి" తర్జుమాచేసి కృష్ణా పత్రికలో ప్రచురించారు. ఆయన సొంతనాటకాలు "జేబున్నీసా" (1923), "వింధ్యరాణి" కృష్ణా పత్రికలో ధారావాహికగానూ,[1] "నా రాజు"(1929) భారతిలోనూ పడ్డాయి. జేబున్నీసా నాటకాన్ని ప్రదర్శించకుండా ఆపడానికి మహమ్మదీయులు ఈ నాటకానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. తత్ఫలితంగా, హిందూ-ముస్లిం ఘర్షణలకు దారితీస్తుందనే నెపంతో మద్రాసు ప్రభుత్వం 1923లో ఈ నాటక ప్రదర్శనను నిషేధించింది.[2]
శారద పత్రిక నిలిచిపోక పూర్వమే బందరులోని డి.వి. సుబ్బారావు నాగేంద్రరావు రచించిన నాటకాలను కొన్నిటిని ఆడటం జరిగింది. ఆకారణంగా శారద నిలిచిపోగానే, నాగేంద్రరావుకు డి.వి.సుబ్బారావు యొక్క ఇండియన్ డ్రామెటిక్ కంపెనీలో సెక్రెటరీ పదవి లభించింది. 1946 దాకా నాగేంద్రరావు ఆ కంపెనీలోనేవుంటూ, వారి కార్యక్రమాలను నిర్వహిస్తూ, నాటకాలాడిస్తూ, నాటక రచనగురించీ ప్రేక్షకుల అభిరుచులను గురించీ, ప్రదర్శనంలో మెళుకువలను గురించీ అపారంగా నేర్చుకున్నాడు. దీనిమూలంగా డి. వి. సుబ్బారావు "నారాజు", "వింధ్యరాణి" నాటకాలు అద్భుతమైన విజయం సంపాదించాయి. ఆ తరువాత 1956లో క్షాత్రహిందూ అనే మరో చారిత్రక నాటకాన్ని వ్రాశాడు.[3] ఈ నాటకాలు అన్నీ పింగళీయం పేరుతో ఇటీవల విడుదలయాయి.

వింధ్యరాణి

వింధ్యరాణి నాటకం యొక్క విజయం ఎంతదాకా వెళ్ళిందంటే, బందరులో డాక్టర్ వి. దుర్గా నాగేశ్వరరావు ఆ నాటకాన్ని డి. వి. సుబ్బారావుతో సహా సినిమాగా తీయటానికి వైజయంతి ఫిలింస్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ స్థాపించిన కొద్ది రోజులకే ఎన్. జగన్నాధ్ బందరు వచ్చాడు. జగన్నాధ్‌కు అంతకు పూర్వం తారుమారు అన్న ఆరు రీల్ల చిత్రాన్ని తీసిన అనుభవం ఉంది. మరో పదివేల అడుగుల చిత్రంతీసి రెంటినీ కలిపి విడుదల చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ రెండో చిత్రం తీయటంలో వైజయంతి ఫిలింస్ వారు తమకు భాగస్వాములుగా ఉండాలని కోరటానికి జగన్నాధ్ బందరు వచ్చి, ఇప్పుడీ రెండవ చిన్న చిత్రం తీసి, ఆ అనుభవంతో వింధ్యరాణి తీస్తే బాగుంటుందని దుర్గా నాగేశ్వరరావుని ఒప్పించాడు. జగన్నాథ్ తీయదలచినది మోలియర్ నాటకానికి అనుసరణ "భలే పెళ్ళి". ఈ చిత్రానికి రచయితగా పనిచేసే భాధ్యత వింధ్యరాణి కర్తయిన నాగేంద్రరావు మీదనే పడింది.

సినిమా కెరీర్

ఇది నాగేంద్రరావుకు తొలి సినిమా అనుభవం. భలే పెళ్ళి సినిమాకి పాటలూ, మాటలూ ఆయనవే. ఈ చిత్రంలో డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య, జయంతి గంగన్న, ఇటీవలే పుట్టిల్లు సినిమా తీసి ఉన్న గరికపాటి రాజారావు, సురభి గోవిందరావు కూతుళ్ళూ, తదితరులు నటించారు. అయితే భలే పెళ్ళి నాగేంద్రరావును సినిమా ప్రపంచంలో నిలబెట్టలేకపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో, సినిమాలు తీయటానికి ఫిల్ము కూడా కరువైన ఆ రోజుల్లో మద్రాసు అంతా ఖాళీ అయ్యి సినిమా చిత్రనిర్మాణం బాగా కుంటుపడగా, నాగేంద్రరావు తిరిగి నాటకాలాడించుకోవటానికి బందరు వెళ్ళిపోవలసివచ్చింది.
వింధ్యరాణి చిత్రంగా తయారయ్యే రోజు 1946లో వచ్చింది. జెమిని స్టూడియో సహకారంతో వైజయంతి ఫిలింస్ సంస్థ ఈ చిత్రం తయారు చేయబూనుకున్నది. దీనికి సి. పుల్లయ్యగారి దర్శకత్వం. ఇందులో డి. వి. సుబ్బారావు, పుష్పవల్లి, రేలంగి, జి. వరలక్ష్మి, పండిట్ రావు ప్రభృతులు పాత్రధారులు. నాగేంద్రరావు తిరిగి సినిమా రంగానికి వచ్చి సి. పుల్లయ్యగారి పర్యవేక్షణలో వింధ్యరాణి స్క్రిప్టు తయారుచేసాడు.

విజయా సంస్థలో

వింధ్యరాణి తయారవుతున్న సమయంలో నాగేంద్రరావుకు వాహినీ నిర్మాతా, దర్శకుడూ ఐన కె.వి.రెడ్డితో పరిచయం లభించింది. వాహినీ సంస్థ ప్రారంభం నుంచీ ఆ సంస్థలో పని చేస్తూ యోగి వేమనలో కె.వి.రెడ్డికి సహాయదర్శకుడుగా పనిచేసిన కమలాకర కామేశ్వరరావు కూడా బందరు వాసే కావడంతో నాగేంద్రరావును కె.వి.రెడ్డికి పరిచయం చేసాడు. ఈ పరిచయం ఫలితంగా కె. వి. రెడ్డి తాను తీయబోతున్న గుణసుందరికథ సినిమాకి పాటలు మాటలు రాయటానికి నాగేంద్రరావును ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు కె. వి.రెడ్డికీ, నాగేంద్రరావుకూ, ఆంధ్రా సినిమా ప్రేక్షకులకుకూడా లాభించిందని చెప్పాలి. కె.వి.రెడ్డికి మరొక రచయిత హంమతి, కాలమతి వగైరా అరడజను హాస్యపాత్రలను యివ్వగలిగి ఉండడు. దర్శకుడు కె. వి. రెడ్డి కానట్టయితే నాగేంద్రరావు సినిమా రచన భలేపెళ్ళి, వింధ్యరాణికి మించి ఎంతో పైకి వెళ్ళలేక పోయివుండవచ్చు. ఈ ఇద్దరి సమ్మేళంతో తయారైన గుణసుందరి కథ అంతకు పూర్వం ఏ తెలుగుచిత్రమూ ఎరగనంత గొప్పవిజయాన్ని సాధించింది.
గుణసుందరి కథ నిర్మాణం నాటికి వాహినీ స్టూడియో తయారై, విజయావారి నిర్వహణ కిందికి వచ్చింది. వాహినీలో మొట్టమొదటి కాల్షీట్ కూడా గుణసుందరి కథదే. గుణసుందరి కథ పూర్తి అయేలోగా విజయా వారు భవిష్యత్తు చిత్రనిర్మాణం ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏర్పాట్ల ప్రకారం నాగేంద్రరావు, కామేశ్వరరావుగారు మొదలైనవారు విజయాసంస్థలోకి తీసుకోబడ్డారు.
అయితే కె.వి.రెడ్డి విజయావారి ద్వితీయచిత్రం "పాతాళభైరవి" దర్శకత్వం చేయటానికి ఒప్పుకున్నప్పుడు నాగేంద్రరావుకు కె.వి.రెడ్డితో కలిసి పనిచెయ్యటానికి మరొక అవకాశం లభించింది. దీని ఫలితమే పాతాళభైరవి. ఈ సినిమా చాలా విజయవంతంగా నడవటమేగాక చిత్రనిర్మాణంలో గొప్ప ప్రమాణాలను సాధించింది. కనుకనే దీనిని ఇండియాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవంలో ప్రదర్శించటానికి ఎన్నుకున్నారు. పాతాళభైరవిలో సీను, అంజి, డింగరి పాత్రల విజయమూ, నేపాళమాంత్రికుడి పాత్ర యొక్క అపురూపకల్పన, నాగేంద్రరావు ప్రతిభకు తార్కాణాలు.
ఆ తర్వాత నాగేంద్రరావు తనను సినిమాలోకి తీసుకురావటానికి తోడ్పడిన కామేశ్వరరావుతో కలిసి విజయవారి నాలుగో చిత్రం చంద్రహారంకు పనిచేశాడు. ఈ చిత్రంలో ధూమకేతు, నిక్షేపరాయడు, "ఎంతచెబితే అంతేగాళ్ళు", బుజ్జాయి, చిన్ని మొదలైనపాత్రలు అంతవరకు సినిమాప్రేక్షకులు చూసిన ఏపాత్రకూ తీసిపోవు. ఇవి ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని ఇవ్వగలవు.
పింగళి నాగేంద్రరావు 1971 మే 6న కన్నుమూశాడు[4]

చిత్ర సమాహారం

  1. రాజకోట రహస్యం (1971) గీతరచన
  2. అగ్గిమీద గుగ్గిలం (1968) (కథ, సంభాషణలు, గీతాలు)
  3. సి.ఐ.డి (1965) (రచయిత)
  4. శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) (చిత్రానువాదం)
  5. మహామంత్రి తిమ్మరుసు (1962) (రచయిత)
  6. గుండమ్మ కథ (1962) (చిత్రానువాదం)
  7. జగదేకవీరుని కథ (1961) (రచయిత)
  8. మహాకవి కాళిదాసు (1960/I) (సంభాషణలు) (చిత్రానువాదం)
  9. అప్పు చేసి పప్పు కూడు (1959) (గీతరచన)
  10. పెళ్ళినాటి ప్రమాణాలు (1958) (సంభాషణలు) (కథ)
  11. మాయా బజార్ (1957/I) (సంభాషణలు) (కథ) (చిత్రానువాదం)
  12. మిస్సమ్మ (1955) (రచయిత)
  13. చంద్రహారం (1954) (రచయిత)
  14. పాతాళ భైరవి (1951) (సంభాషణలు) (కథ)
  15. గుణసుందరి కథ (1949) (సంభాషణలు)
  16. వింధ్యరాణి (1948) (సంభాషణలు) (కథ)
  17. భలే పెళ్లి (1941) (గీతరచన)
  18. శ్రీకృష్ణ లీలలు (1935) (సంభాషణలు).

మూలాలు

  • Pingali Nagendrarao

బయటి లింకులు

27, నవంబర్ 2014, గురువారం

తెలుగు కవులు - పాలగుమ్మి పద్మరాజు



వికీపీడియా నుండి
పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి పొందిన గాలివాన కథా రచయిత.హేతువాది .ఎం.ఎన్.రాయ్ భావాల ప్రచారకుడు.
పద్మరాజు జూన్ 24, 1915పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలములోని తిరుపతిపురంలో జన్మించాడు. ఈయన 1939 నుండి 1952 వరకు కాకినాడలోని పీ.ఆర్.ప్రభుత్వ కళాశాలలో సైన్సు లెక్చరర్‌గా పనిచేశాడు.
తన జీవిత కాలములో ఈయన 60 కథలు, ఎనిమిది నవలలు, ముప్పై కవితలు ఇంకా ఎన్నెన్నో నాటికలు మరియు నాటకాలు రచించాడు. ఈయన వ్రాసిన 60 కథలు గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. పద్మరాజు 23 యేళ్ళ వయసులో తన మొదటి కథ సుబ్బిని వ్రాశాడు. ఈయన ఎన్నో కథలు వ్రాసినా వాటిలో బాగా పేరుతెచ్చిన కథ గాలివాన. ఈ కథ 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతిని గెలుచుకుంది. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు ఎంపికయిన ఈ పోటీలో భారత్ నుండి మూడు కథలు ఎంపికయ్యాయి. గాలివాన ప్రపంచములోని అనేక భాషాలలోకి అనువదించబడింది. ఈ విధముగా తెలుగు కథను ప్రపంచ సాహితీ పటములో నిలిపిన ఘనత ఈయనకే దక్కినది. పాలగుమ్మి రచించిన నవలలో బతికిన కాలేజి, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన ముఖ్యమైనవి.
1954 లో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి వాహినీ ప్రొడక్షన్స్ పతాకము కింద నిర్మించిన బంగారు పాప సినిమాకు మాటలు రాయమని పద్మరాజును కోరాడు. దీనితో మొదలుపెట్టి, పద్మరాజు సినీ రంగములో మూడు దశాబ్దాల పాటు పలు సినిమాలకు కథలు, పాటలు సమకూర్చాడు. ఈయన భక్త శబరి, బంగారు పంజరం వంటి అనేక సినిమాలలో పనిచేశాడు. ఈయన సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందినా వ్యాపారపరంగా విజయవంతము కాలేదు. దర్శకుడిగా బికారి రాముడు అనే చిత్రం తీశారు కానీ చిత్రం విజయవంతం కాలేదు. ఈయన నవల నల్లరేగడి ని 'మన (మా) వూరి కథ ' పేరుతో సినిమా తీశారు (కృష్ణ కథానాయకుడుగా). పడవ ప్రయాణం కథ ను 'స్త్రీ' పేరు తో చిత్రంగా నిర్మించారు (పా.ప. మరణానంతరం). రోహిణి కథానాయిక గా నటించిన చిత్రం వ్యాపార పరంగా విడుదల కాలేదు. ఈయన అనేక దాసరి నారాయణరావు సినిమాలకు ఘోష్టు రైటరుగా పనిచేశాడని వినికిడి.[1]
పాలగుమ్మి వారి మహత్తర సృష్టి గాలి వాన. గాలి వాన కథకు వెనుక ఓ వాస్తవ కథ వున్నది.
ఆ రోజుల్లో శ్రీ మామిడిపూడి వేంకట రంగయ్య, శ్రీ నండూరి రామక్రిష్ణాచార్యులు మొదలగు వారికి తమ కాలేజీలొ వుద్వోగాలిచ్చి వాళ్లెవరు కాలేజి వదలి వెళ్లి పోకుండా వుండటానికి, చిన్న చిన్న ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి, ఇళ్లు కట్టు కొమ్మని కాలేజి అధికారులు అన్నారు. నండూరి వారింటి ప్రక్కనే పాలగుమ్మి వారు ఇల్లు కట్టుకున్నారు . అయితే చేతిలో అంతగా డబ్బు లేక పోవడం వల్ల పక్కా ఇల్లు నిర్మిచుకోలేదు, పాల గుమ్మి వారు. నాలుగైదు ఆదుగుల ఈటుక గోడ పైనా తాటాకుల పాక., ఆపాకనే గది, హాలు, వంటిల్లుగా విబజించు కున్నారు.
ఇలా వుండగా ఓ అర్థ రాత్రి భయంకరమైన గాలి వాన వచ్చింది. ఇళ్ల పైకప్పులు ఎగిరి పోతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు సైతం కూలి పోతున్నాయి. కరెంటు లేదు. ఇంటి పైకప్పు మీద తాటాకులు ఎగిరి పోతున్నాయి. ఇటుక గోడలు కూడ వూగి పోతున్నది. . ఇంట్లో ప్రమాదమని పద్మరాజు గారు భార్యని హెచ్చరించి బయటికి వెళ్లి పోదాం అన్నారు. ఇద్దరు బయలు దేరారు. ఆయన బైట పడ్డారు. ఆమె మాత్రం అక్కడ చిక్కుక పోయారు. ఇంతలో ఇటుకల గోడలు, ఇంటి పైకప్పు మొత్తం అంతా పెళ పెళ మంటూ కూలి పోయింది. ఆశిధిలాల క్రింద అమె ఇరుక్కు పోయారు. పద్మ రజుగారి గుండెల్లో పిడుగు పాటు. కొడలా పడి వున్న ఆ శిధిలాల క్రింద తన భార్య ఏమయిందో.... ఆశిధిలాలను తియ్యడం తన ఒక్కడి వల్లనేమౌతుంది. చుట్టు చీకటి, భయంకరమైన తుపాను ఎవ్వరు కని పించ లేదు. తనొక్కడే నిస్సహాయంగా నిలబడి వున్నాడు. భార్యబతికి వుండా ప్ ఈ పాటికి చనిపోయిందా... ఇలాంటి భయంకరమైన ఆలోచనలతో స్థాణువుఇలా నిలబడి పోయాడ్రు పద్మారాజుగారు. ఈలోగా పేళ పెళ మనిశబ్దం విని అటు చూసారు. చేతిలో టార్చి లైటు పుచ్చుకుని హాస్టలు లోని విద్యార్తులు, తోటి లెక్చరర్లు పరుగెత్తుకొని వచ్చారు వచ్చి చూస్తే ఏముంది. స్తాణువులా నిలబడి వున్న పద్మరాజు. కొండలా పడి వున్న ఇంటి శిధిలాలు. ఎమయిందో అర్థమైంది అందరికి. ఓ గంట అయ్యే సరికల్లా ఆ ఇటుకలు, ఆకులు తీసి పద్మ రాజు గారి భార్య శరీరాన్ని బయటకు తీసారు. తీసారు గాని అమె బ్రతికి వుందో లేదో తెల్లవారితే గాని తెలియదు.
ఈ లోగా ఆయన పొందిన అవెదనా, పడిన ఆందోళనా, గుండెని, మనసుని కలచి వేసిన ఆ అనుభవము చాల భంకరమైనది, తీవ్రమైనది..... భలమైనదీను.....
అంత భలమైన అనుభూతిలోంచి వచ్చింది గనుకే గాలి వాన కథ అంత గొప్పగా రూపు దిద్దుకుంది. పద్మరాజు 1983లో మరణించాడు.

మూలాలు

బయటి లింకులు

26, నవంబర్ 2014, బుధవారం

తెలుగు కవులు - నార్ల చిరంజీవి



వికీపీడియా నుండి
నార్ల చిరంజీవి (1925-1971) ఒక ప్రముఖ కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు మరియు సినీ గీత రచయిత[1]. కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, అభ్యుదయ రచయితల ఉద్యమంలోనూ ఇతర ప్రజా ఉద్యమాలలోనూ పని చేశాడు. విశాలాంధ్ర దినపత్రికలో కొంత కాలం పాటు చిన్నారి లోకం అనే బాలల శీర్షికను నిర్వహించాడు. 1949-50 లలో విజయవాడ ఆకాశ వాణి కేంద్రంలో పని చేశాడు.

బాల్యం

నార్ల చిరంజీవి 1925 మే 1 న కృష్ణా జిల్లా, గన్నవరం తాలూకా, కాటూరు గ్రామంలో జన్మించాడు. ఈయన పెద్దగా చదువుకోక పోయినా, సంస్కృతం, తెలుగు, హిందీ భాషల్లో పట్టు సంపాదించుకున్నాడు.

రచనలు

  • ఎర్రగులాబీ
  • తెలుగు పూలు
  • కర్రా-చెప్పులు
  • పేనూ-పెసర చేను
భాగ్య నగరం అనే గేయనాటిక బాగా ప్రాచుర్యం పొందింది. సినిమా రంగంలో ప్రవేశించి కొన్ని చలన చిత్రాలకు స్క్రిప్టు రచయిత గా , కొన్ని సినిమాలకు పాటలు రాశాడు. వీనిలో ఆరాధన (1962 సినిమా) ఒక సినిమా.[2]
ఆయన జీవిత చరిత్ర అగ్ని సరస్సున వికసించిన వజ్రం నార్ల చిరంజీవి అనే పుస్తకంగా ప్రచురితమైంది.

మరణం

1971, అక్టోబరు 16న అనారోగ్యంతో మరణించాడు.

మూలాలు


25, నవంబర్ 2014, మంగళవారం

తెలుగు కవులు - ముట్నూరి కృష్ణారావు



వికీపీడియా నుండి
ముట్నూరి కృష్ణారావు
ముట్నూరి కృష్ణారావు
ముట్నూరి కృష్ణారావు (1879 - 1945) ప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, కృష్ణా పత్రిక సంపాదకుడు. ఈయన 1907 నుండి 1945లో మరణించేవరకు నాలుగు దశాబ్దాల పాటు కృష్ణా పత్రిక సంపాదకునిగా తెలుగు సాహితీ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు.

జీవిత విశేషాలు

మట్నూరి కృష్ణారావు చిత్రపటం
"కృష్ణా పత్రిక" సంపాదకులు గా తెలుగు ప్రజలను చైతన్యవంతం చేసిన ప్రముఖ పాత్రికేయులు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు 1879 లో కృష్ణా జిల్లా దివి తాలూకా ముట్నూరుగ్రామం లో జన్మించారు. ఈయన పుట్టగానే తల్లి గతించింది. బాల్యంలోనే తండ్రి పరిమపదించడం వళ్ల పినతండ్రి ప్రాపకములో పెరిగాడు. ఈయన ప్రాధమిక విద్యాభ్యాసం బందరులోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత బందరులోనే నోబుల్ కళాశాలలో ఎఫ్.ఏ కోర్సులో చేరాడు. ఇక్కడే ఈయనకు రఘుపతి వెంకటరత్నంనాయుడు యొక్క శిష్యుడయ్యే అవకాశం కలిగింది. నాయుడు యొక్క సంఘసంస్కరణశీలన, మూఢాచార నిర్మూలణ వంటి ఉద్యమాలు కృష్ణారావును ప్రభావితం చేశాయి. గురువుతో కలిసి బ్రహ్మసమాజములో ధార్మిక ఉపన్యాసాలు ఇవ్వటం అలవాటయ్యింది. నాయుడు కృష్ణారావును ఆదర్శ విద్యార్ధిగా తీర్చిదిద్దటమే కాక, బ్రహ్మసమాజ ప్రచారకునిగా మలచాలని ప్రయత్నించాడు. అదే సమయంలో ఆంధ్ర పత్రిక సంపాదకుడు కాశీనాథుని నాగేశ్వరరావు ఐదువందల రూపాయల వేతనం ఆశచూపి కృష్ణాపత్రికనుండి తమపత్రికకు ఆకర్షించ ప్రయత్నించాడు. మరోవైపు పట్టాభి సీతారామయ్య కృష్ణారావును రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేశాడు. కానీ కృష్ణారావు వీటన్నింటికీ లొంగక జీవితాంతము కృష్ణాపత్రికలోనే పనిచేస్తూ తెలుగు భాషకు సేవ చేశాడు.
బందులో విద్యాభ్యాసము తర్వాత కృష్ణారావు మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో బి.ఎ. చేరాడు. ఇక్కడే ఈయనకు పట్టాభి సీతారామయ్య సహాధ్యాయిగా పరిచయమయ్యాడు. కృష్ణారావు సంస్కృత సాహిత్యంతో పాటు ఆధునిక ఆంగ్ల సాహిత్యాన్ని కూడా అభ్యసించాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఎమర్సన్, వాల్ట్ విట్మన్, షెల్లీ, కూపర్ ల వంటి పాశ్చ్యాత్య రచయితల రచనలు చదివేవాడు. కానీ బి.ఎ ఉత్తీర్ణులు కాలేదు. కృష్ణారావుగారు మద్రాసులో ఎఫ్.ఎ చదువుతున్నరోజులలో వంగనాయకుడు బిపిన్ చంద్రపాల్ గారు బ్రహ్మ సమాజం ఉపన్యాసములు ఇవ్వ్వటానికి మద్రాసు విచ్చేసినప్పుడు కృష్ణారావు గారికి ఆయన మీద గురి కుదిరి, ఆయనకి శిష్యులు అయినారు. అటుపై వంగవీరునితో బెంగాలు వెళ్ళారు. దాదాపు సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన తరువాత ఇంటికి తిరిగివచ్చి కలకత్తాలో బిపిన్ పాలు, అరవింద ఘోష్,ఠాగూర్ వార్ల పరిచయము వలన వచ్చిన అనుభవముతో 1903లో బందరు తిరిగివచ్చి కృష్ణాపత్రికలో సహాయ సంపాదకునిగా చేరి, 1907లో సంపాదకుడైనాడు. అప్పటినుండి 1945లో మరణించేవరకు ఆ పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. తెలుగులోనే కాక మరే భాషలోనూ అన్ని సంవత్సరాలు ఒకే పత్రికకు సంపాదకత్వం వహించిన ఘనత కృష్ణారావుదే. మట్నూరి కొంతకాలం ఆంధ్ర భారతి అనే సాహిత్య పత్రికను కూడా నిర్వహించాడు.
తరువాతి కాలం లో బందరు (మచిలీ పట్నం) లో స్థిరపడి ఆంగ్ల భాషలో గొప్ప వక్తగా పేరొందారు. కృష్ణా పత్రిక కార్యాలయం లో వీరి గోష్టి ని సాహితీ వేత్తలు " దర్బారు" గా వ్యవహరించేవారట. కృష్ణా పత్రిక జాతీయోద్యమ కాలం లో చురుకుగా వ్యవగహరించేది. ఆ రోజుల్లో పత్రిక కార్యాలయలం లో రాజకీయ, కళా, సాంస్కృతిక, సాంఘీక విషయాలపై పలు చర్చలు జరిగేవట. ఈ పత్రిక సంపాదకత్వ బాధ్యత ను సమర్ధవంతంగా నిర్వహించిన శ్రీ ముట్నూరి ఒక కళగా, తపస్సుగా పరిగణిస్తూ పత్రిక నడిపేవారని పత్రికారంగ ప్రముఖులు చెబుతుంటారు. కృష్ణా పత్రిక లో వచ్చే వార్తల పై ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉండేదట.

మూలాలు

  • ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయాలు - ఎం.దత్తాత్రేయశ్రర్మ, శ్రీరామ సిద్ధాంతి ప్రచురణలు, (1992) పేజీ.5-6 [1]

24, నవంబర్ 2014, సోమవారం

తెలుగు కవులు - మునిమాణిక్యం నరసింహారావు





వికీపీడియా నుండి
Munimanikyam narasimharao.jpg
జననం మార్చి 15, 1898
తెనాలి తాలూకా, సంగం జాగర్లమూడి
మరణం ఫిబ్రవరి 4, 1973
నివాస ప్రాంతం తెనాలి తాలూకా, సంగం జాగర్లమూడి
వృత్తి కథకుడు,
భార్య / భర్త కాంతం
రాజ్యలక్ష్మి
పిల్లలు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు
మునిమాణిక్యం నరసింహారావు ఇరవైయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది.

జీవిత విశేషాలు

మునిమాణిక్యం నరసింహారావు తెనాలి తాలూకా, సంగం జాగర్లమూడిలో మార్చి 15, 1898 న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వెంకాయమ్మ, సూర్యనారాయణ. ఈయన తెనాలిలో ఇంటర్మీడియెట్ చదివారు. డిగ్రీ చదవడానికి తాహతు లేకపోతే కొండా వెంకటప్పయ్య గారి ఆయన సహాయం వల్ల బిఎ చదివారు.ఆయన భార్య కాంతం.[1] ఆయనకు బందరు హిందూ హైస్కూలులో ఉద్యోగం వచ్చింది. ఆయనకు ఇద్దరు మగపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఉపాధ్యాయుడిగా, ఆకాశవాణిలో పనిచేశారు. ఆయన రాసిన మొదటి నవల ‘టీకప్పులో తుఫాను’. ఇందులోనే మొట్టమొదటిగా కాంతం పాత్ర కనపడుతుంది. కాంతం కుటుంబం పేద కుటుంబం. కాంతం కథలలో ఒకటి ఆయన రేడియో నాటకంగా రాస్తే ఆయన కుమార్తె కాంతంగా వేసి అందరినీ మెప్పించింది.ఆయన "కాంతం కథల" కి ఆయన భార్యే ప్రేరణ, స్ఫూర్తి. నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్య నూతనమనిపిస్తాయి. ఇటువంటి ‘కాంతం’ చనిపోగానే ఆయన చాలా దిగులు చెందారు. వెంటనే ఎక్కువగానే ప్రేమించే పెద్దమ్మాయి రుక్కుతల్లి మరణించింది. దాన్ని తట్టుకోవడానికి రచనలు చేసేవారనిపిస్తుంది. కొంతకాలానికి రాజ్యలక్ష్మిని రెండవ భార్యగా చేసుకున్నారు.
తన రచనల ద్వారా మధ్యతరగతి సంసారంలోని సరిగమల్ని ఎన్నింటినో వినిపించాడు మునిమాణిక్యం.తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది. మునిమాణిక్యం కేవలం హాస్యరచయిత మాత్రమే కాదు. మంచి హాస్యోపాసకులు కూడా. విభిన్న వ్యక్తుల మనసులను అలరించే హాస్యోక్తులుహాస్య సన్నివేశాలు ఎక్కడ ఆయన దృష్టికి తెచ్చినా వాటిమీద మక్కువతో అనువదించి గాని, అనుసరించిగాని, భాషను కొంచెం తమాషాగా, మార్చి తెలుగుపాఠకులకు అందజేసేవారు.

రచనలు

మూలాలు