Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

16, నవంబర్ 2024, శనివారం

ముంగిస - పిల్లాడు కథ

మనమందరం మన తెలుగులోని ఈ అపురూప నీతి కథలని మర్చిపోతున్నాం, ఇలాంటి కథలు నర్సరీల్లో పిల్లలకు నేర్పరు. మనమే చొరవచేసుకుని మన పిల్లలకి అలనాటి నీతి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం.

ఎంతవారయినా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధ పడతుంటారు. తొందరపాటు ఎప్పడూ ప్రమాదానికి హేతువు. శివరామపుంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒక రోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగది లోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడ నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చుసి పాముని గమనించింది.

ఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తల పెట్టిందని భావించింది. విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకి పాపం మూంగిస చచ్చిపోయింది. ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్ధం చేసుకుని అనవసరంగా తొందరపడి మంగిసను చంపినందుకు బాధపడింది.

21, ఫిబ్రవరి 2022, సోమవారం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
     
 భాష.. మనం మాట్లాడే పదాల కలయిక.. భావాలను తెలపడానికి, ఎదుటివారికి మన మదిలో మాటలు చెప్పడానికి ఉపయోగపడే సాధనం. కాగా నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అన్ని భాషల్లో తెలుగు భాష స్థానం ప్రత్యేకం. మన మాతృభాష, అచ్చమైన, స్వచ్చమైన పదాల మిళితం.. అందమైన సరస్సులో విరబూసిన తామర పువ్వుల సోయగం.. తెలుగు కవుల హృదయాల నుండి జారువాలిన మన భాషను వర్ణించడం ఎవరి తరం కాదు.. అలాంటి మన దేశంలో ప్రస్తుతం తెలుగు కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చింది. ఎంతో కాలంగా మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వారు వారి ఆంగ్ల భాషను మనమీద రుద్దిపోయారు.

అభివృద్ధి అనే పేరుతో ఆంగ్లం మోజులో అమ్మ భాషను విస్మరిస్తున్న మన సమాజం ఒక్కసారి ఆలోచించాలి. ప్రపంచంలో మొత్తం 6000 భాషలు ఉన్నాయి. అందులో చాలా భాషలు కనుమరుగయ్యే స్థితికి వచ్చాయి. 1952 ఫిబ్రవరి 21 న బెంగాలీ భాష ఉద్యమ అల్లర్లలో నలుగురు యువకులు మృతి చెందడంతో ఆ రోజుకు గుర్తుగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 'అ' అక్షరం తో మొదలయ్యే తెలుగు లో అమ్మదనం, కమ్మదనం కలిపిన పదాల సమ్మేళనం మరుపులేని జ్ఞాపకం. అలాంటి తెలుగు మాట్లాడాలంటే చాలా మంది అవమానంగా భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తమ మాతృభాషా కోసం ఎంతో పరితపిస్తుంటే మనం మాత్రం వెగటుగా చూడటం భాదాకరమైన విషయం.

బ్రతకడం కోసం పరభాషను నేర్చుకోవడంలో తప్పులేదు. అలాగని మన భాషను విస్మరించడం తగదు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలను చేపట్టినా సమాజంలో సామాజిక స్పృహ లేకపోతే, ఎన్ని కార్యాలు చేసినా అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. అందుకే మనం మేల్కోవాలి... మన భాషను మాట్లాడుదాం.. తెలుగుని వెలుగుల చాటుదాం.. ఆచరిద్దాం..ఆలోచించండి.

అమ్మను ప్రేమించండి... మాతృభాషను  గౌరవించండి...

అంతర్జాతీయ   మాతృభాషా దినోత్సవ 
శుభాకాంక్షలు

11, ఏప్రిల్ 2020, శనివారం

తుమ్ముకు తమ్ముడు..దశదిశలా.,

తుమ్ముకు తమ్ముడు..దశదిశలా.,

డ్రేగన్ వుహాన్ ఉమ్మింది
ఉపద్రవం గా మారింది
హచ్-ఉచ్ఛిష్ఠ కరోనా
మందులకందని-ఆనైజం

సమస్త విశ్వం తాకింది
చైనా కరోన ఈ నా ధరాన
వెంట్రుక వాసికి వెయ్యోవంతు
అంతుబట్టని మహమ్మారిగా
కోవిడ్19 ప్రాపంచీకరణ
ముట్టుకుంటే అంటుకుంటా
చుట్ట బెడతా
చూడు నా ప్రతాపం
కట్టగీసిన గట్టుగట్టినా
చైనాగోడలనే దాటుకుంటూ
ఉనికి చాటితి ఉలికిపడగా
కర్కశ రక్కసి కరాళ హేలన

భూమిపైన గాలిలోనా
జలములందున ఉండనట్టే
పంచభూతములందు ఇమడను
పాంచభౌతిక వ్యాప్తి గలిగి

ఇంచుమించు ముంచువరకు
సంచితంబుల వ్రాలు నా చెల్లుచీటీ 
చిరునామా చెప్పను
మీసం మెలేయు మీహాసం
నాముట్టడి కట్టడి
చేయలేని ప్రబలదోషం
ముట్టుకుంటివా దిట్టగ‌రాదు

ఓ తీర్థంకరా!

కరచాలన వరమేళన నమస్కృతులు

ఒద్దిక మీర ముద్దుగబ్రతికే విశ్వంభరలో
హద్దులుచెరపి బుద్ధుల పద్దులనేమార్చి
అంటగాగుతూ ఒకటేనంటావ్ వుంటావ్
నాగరీకమై సాగనంపగా నేనొస్తావుంటే...

కరోన మహాబిరాన నీదారెటు గోదారేనా?

స్వార్థపు అర్ధమే పరమార్ధంగా
అర్థంపర్థంలేని-జావగారిన యావలతో 
ఇహపరలోకాలకు సోపానంగా
ఉఛ్ఛిష్ఠ కశ్మలంలో మనం-
జనం- నలగడమే మనుగడా?

జవాబులేని ప్రశ్నలుండవు-నిజమే గాని
ప్రశ్నార్థకమైన బ్రతుకులు నేటికీ లే వా?
 మసిలి తెలుసుకో మనీషి
 మలికితనం నీలోనే సన్నాసి 
 కరోనవైపరీత్య అస్తిమత్వ కన్నీళ్లు
 కొన్నాళ్ళే ...ఇంకొన్నాళ్ళే....
 ఆశావహ దార్శనికత్వం
 తత్వం....మానవత్వం
 సత్యం ..నిత్యగత్యం..జగత్వం

4, మే 2018, శుక్రవారం

తెలుసుకోవలసినవి

తెలుసుకోవలసినవి..
షడ్గుణాలు....
హిందూ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలుంటాయి.
అవి.
1. కామం
2. క్రోధం
3. లోభం
4. మోహం
5. మదం
6. మత్సరం...

షట్చక్రాలు...
మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే ,
దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు

1. మూలాధార చక్రము
2. స్వాధిష్ఠాన చక్రము
3. మణిపూరక చక్రము
4. అనాహత చక్రము
5. విశుద్ధ చక్రము
6. ఆజ్ఞా చక్రము

షడ్విధ రసములు......

1. ఉప్పు
2. పులుపు
3. కారం
4. తీపి
5. చేదు
6. వగరు...

షడృతువులు.....

1. వసంత ఋతువు
2. గ్రీష్మ ఋతువు
3. వర్ష ఋతువు
4. శరదృతువు
5. హేమంత ఋతువు
6. శిశిర ఋతువు.....

సప్త గిరులు...
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో
ఏడు కొండలు  సప్త గిరులు అని అంటారు.
అవి.
1 శేషాద్రి
2 నీలాద్రి
3 గరుడాద్రి
4 అంజనాద్రి
5 వృషభాద్రి
6 నారాయణాద్రి
7 వేంకటాద్రి....

సప్త స్వరాలు.....
భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు.
వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు.
అవి.
1. స = షడ్జమం (నెమలి క్రేంకారం)
2. రి = రిషభం (ఎద్దు రంకె)
3. గ = గాంధర్వం (మేక అరుపు)
4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
5. ప = పంచమం (కోయిల కూత)
6. ధ = ధైవతం (గుర్రం సకిలింత)
7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)...

సప్త ద్వీపాలు....
బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను,
భాగవతం  లోను సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది.
అవి .
1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
2. ప్లక్షద్వీపం - మేధాతిథి
3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
6. శాకద్వీపం - హవ్యుడు
7. పుష్కరద్వీపం - సేవనుడు....

సప్త నదులు.....

1. గంగ
2. యమున
3. సరస్వతి
4. గోదావరి
5. సింధు
6. నర్మద
7. కావేరి

సప్త అధొలోకములు.....
1. అతలము
2. వితలము
3. సుతలము
4. తలాతలము
5. రసాతలము
6. మహాతలము
7. పాతాళము

....సప్త ఋషులు.......
1.వశిష్టుడు
2.ఆత్రి
3.గౌతముడు
4.కశ్యపుడు
5.భరద్వాజుడు
6.జమదగ్ని
7.విశ్వామిత్రుడు

పురాణాలలో అష్టదిగ్గజాలు.....

1. ఐరావతం
2. పుండరీకం
3. వామనం
4. కుముదం
5. అంజనం
6. పుష్పదంతం
7. సార్వభౌమం
8. సుప్రతీకం

.అష్ట జన్మలు.....

1.దేవ జన్మ
2. మనుష్య జన్మ
3. రాక్షస జన్మ
4. పిచాచ జన్మ
5. పశు జన్మ
6. పక్షి జన్మ
7. జలజీవ జన్మ
8. కీటక జన్మ

అష్ట భార్యలు...
శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలును
అష్ట భార్యలు లేదా అష్టమహిషులు అని అంటారు.
వారు
1. రుక్మిణి
2. సత్యభామ
3. జాంబవతి
4. మిత్రవింద
5. భద్ర
6. సుదంత
7. కాళింది
8. లక్షణ
అష్ట కష్టములు....

1. ఋణము
2. యాచన
3. ముసలితనము
4. వ్యభిచారము
5. దొంగతనము
6. దారిద్ర్యము
7. రోగము
8. ఎంగిలి తిని బ్రతుకుట

అష్ట కర్మలు.....

1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హూమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్వేదేవము

అష్టభాషలు....
1. సంస్కృతము
2. ప్రాకృతము
3. శౌరసేని
4. మాగధి
5. పైశాచి
6. సూళికోక్తి
7. అపభ్రంశము
8. ఆంధ్రము

నవధాన్యాలు.....
మన నిత్య జీవితంలో ఉపయోగించే
9 రకాల ధాన్యాలను నవ దాన్యాలు అని పిలుస్తారు ....

గోధుమలు ,వడ్లు ,పెసలు,
శనగలు , కందులు , అలసందలు,
నువ్వులు, మినుములు ,ఉలవలు....

నవ రత్నాలు.....
1.మౌక్తికం = ముత్యము
2.మాణిక్యం = కెంపు
3.వైఢూర్యం = రత్నం
4.గోమేదికం = పసుపురంగులోని ఒక రత్నం
5.వజ్రం
6.విద్రుమం = పగడం
7.పుష్యరాగం = తెల్లటి మణి
8.మరకతం = పచ్చ
9.నీలమణి

నవధాతువులు....
1. బంగారం
2. వెండి
3.ఇత్తడి
4.సీసం
5.రాగి
6.తగరం
7.ఇనుము
8.కంచు
9.కాంతలోహం

నవబ్రహ్మలు.....
1.మరీచి
2.భరద్వాజుడు
3.అంగీరసుడు
4.పులస్త్యుడు
5.పులహుడు
6.క్రతువు
7.దక్షుడు
8.వసిష్టుడు
9.వామదేవుడు

నవదుర్గలు....

1 శైలపుత్రి దుర్గ
2 బ్రహ్మచారిణి దుర్గ
3 చంద్రఘంట దుర్గ
4 కూష్మాండ దుర్గ
5 స్కందమాత దుర్గ
6 కాత్యాయని దుర్గ
7 కాళరాత్రి దుర్గ
8 మహాగౌరి దుర్గ
9 సిద్ధిధాత్రి దుర్గ

దశ దిశలు...
1. తూర్పు
2. ఆగ్నేయం
3. దక్షిణం
4. నైఋతి
5. పడమర
6. వాయువ్యం
7. ఉత్తరం
8. ఈశాన్యం
9.భూమి (క్రింది ప్రక్క)
10.ఆకాశం (పైకి)

దశావతారాలు....
1. మత్స్యావతారము
2. కూర్మావతారము
3. వరాహావతారము
4. నృసింహావతారము లేదా నరసింహావతారము
5. వామనావతారము
6. పరశురామావతారము
7. రామావతారము
8. కృష్ణావతారము
9. బుద్ధావతారము
10. కల్క్యావతారము

దశవిధ బలములు...
1. విద్యా బలము
2.కులినితా బలము
3.స్నేహ బలము
4.బుద్ది బలము
5.ధన బలము
6.పరివార బలము
7.సత్య బలము
8. సామర్ద్య బలము
9. జ్ఞాన బలము
10. దైవ బలము

30, మే 2017, మంగళవారం

ICT TRAINING FOR TEACHERS - Matireal









































తెలుగు పదవ తరగతి ఎఫ్. ఏ మరియు ప్రాజెక్టులు

26, మే 2017, శుక్రవారం

Parakri vyakaranam telugu


Demo of HotPotatoes 6 JQuiz

తెలుగు - శాంతి కాంక్ష






తెలుగు - శాంతి కాంక్ష

తెలుగు - శాంతి కాంక్ష

Quiz

 

29, మార్చి 2017, బుధవారం

శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు

శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు







 Ugadi Rasi Phalalu/Raasi Phalalu Ugadi Predictions for the Year 2017 - 2018 Telugu New Year Sri Hevilambi Nama Samvatsara Rasi Phalalu and Telugu Astrology By Kavita Siromani,  Daivajna:  Pantula Venkata RadhaKrishna (Parakri) And Pantula Jaya Maheswari.

#teluguAstrology, #Mesham Rasiphalalu, #vrishabam Rasiphalalu, #mithunam Rasiphalalu, #karkatakam Rasiphalalu, #simha Rasiphalalu, #kanya Rasiphalalu, #tula Rasiphalalu, #vrischika Rasiphalalu, #dhanu Rasiphalalu, #makara Rasiphalalu, #kumba Rasiphalalu, #meena Rasiphalalu,

25, అక్టోబర్ 2016, మంగళవారం

దీపావళి అమావాస్య ప్రాశస్త్యం

"దీపావళి అమావాస్య ప్రాశస్త్యం

దీపావళి అమావాస్యకు వేదాంతంలో ఒక పేరు వుంది. "ప్రేతఅమవాస్య" అని పేరు. కారణం ఆరోజు పితృదేవతలందరూ వస్తారు ప్రదోషవేళకు. వచ్చి ఆకాశమార్గంలో నిలబడతారు. అందుకే ఆరోజు సాయంత్రం ముందు పూజ ఏమిటంటే 'దివిటీ' కొట్టడం. ఆడపిల్లలు కొట్టరు దివిటీ.ఇంటికి పెద్దవాళ్ళు మగపిల్లలు గోగుకర్రమీద జ్యోతులు వేసి దక్షిణదిక్కుగా చూపించాలి."నాన్నగారు ఈరోజు తిధిని జరుపుకుని అలక్ష్మిని పోగొట్టుకుంటాను. భగవదునుగ్రహాన్ని పొందుతాను. మీరు దయచేసి బయలుదేరండి, బాగా చీకటిగా ఉంది, కాబట్టి నేను మీకు వెలుతురు చూపిస్తాను" అని దివిటీ చూపిస్తాడు. జలతర్పణ చేయకుండా దివిటీ ఎత్తి పితృదేవతలకు చూపించే తిధి 'దీపావళి అమావాస్య'. ఆ తరువాత కాళ్ళుచేతులు కడుక్కుని వెళ్లి, ఆచమనం చేసి అప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు. బాణసంచా కాల్చడానికికారణం నరకాసురవధ అని లేదు. అలక్ష్మిని తరిమికొట్టి, లక్ష్మిని నిలబెట్టుకోవడానికి చేస్తారు.దీపావళి అమావాస్యనాడు నువ్వులనూనెలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.నీటిలోకి గంగ ప్రవేశిస్తుంది.ఆ రోజు ఉదయం నువ్వులనూనె వంటికి రాసుకుని, తెల్లవారుఝామున స్నానం చేస్తారు, దేనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మి పరిహారార్ధం. ఇక గంగా స్నానం చేత పాపనాశనం అవుతుంది.

*కార్తీకమాస వైభవం*
( *పుస్తకం నుండి*)

3, మే 2016, మంగళవారం

చాటు పొడుపు

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.
ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు? వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.

“ రాముడెవ్వానితో రావణు మర్దించె?
పర వాసు దేవుని పట్నమేది ?
రాజమన్నారుచే రంజిల్లు శరమేది ?
వెలయ నిమ్మ పండు విత్తునేది?
అల రంభ కొప్పులో అలరు పూదండేది?
సభవారి నవ్వించు జాణ యెవడు?
సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది?
శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు?
అన్నిటను జూడ ఐదేసి యక్షరములు
ఈవ లావాల జూచిన నేక విధము  చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి”  లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”

పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్)
మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.

ఇక జవాబుల సూచికలు-
ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి, ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).
1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?
2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?
3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)
4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?
5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?
6.సభలో నవ్వించే కవిపేరు ఏది?
7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)
8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?

ఈ క్రింది జవాబులు చూడండి.
1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.)
2.రంగనగరం! ( శ్రీరంగం )
3.లకోల కోల! ( కోల= బాణం)
4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)
5.మందార దామం! ( దామం అంటే దండ)
6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)
7.పంచాస్య చాపం! ( శివుని విల్లు)
8.నంద సదనం! ( నందుని ఇల్లు)
పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి. అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం.