వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
కనుపర్తి వరలక్ష్మమ్మ | |
---|---|
జననం | అక్టోబర్ 6, 1896 బాపట్ల |
మరణం | ఆగస్టు 13, 1978 |
సుపరిచితుడు | తెలుగు రచయిత్రి |
మతం | హిందూ |
భార్య / భర్త | కనుపర్తి హనుమంతరావు |
- పదవులు - గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలు ,
- రచనలు - శారదలేఖలు, మా ఊరు, పెన్షన్ పుచ్చుకున్ననాటి రాత్రి, కథ ఎట్లా ఉండాలి, ఉన్నవ దంపతులు
- బిరుదులు - గృహలక్ష్మీ స్వర్ణరకంకణం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి, గుడివాడ పౌరులనుండి కవితా ప్రవీణ,
రచయితగా
1919 లో ఆంగ్లానువాదా కథ అయిన సౌదామినితో రచనలు చేయడం ప్రారంభించారు . లేడీస్ క్లబ్ , రాణి మల్లమ్మ , మహిళా మహోదయం , పునః ప్రతిష్ట వంటి నాటికలు , ‘ద్రౌపది వస్త్ర సంరక్షణ ‘ అనే ద్విపద కావ్యం , ‘సత్యా ద్రౌపది సంవాదం’’ , నాదు మాట’ మొదలైన పద్య రచనలు చేసారు . ‘నమో ఆంధ్ర మాతా’ పేరుతో గేయాలు రాసారు . గాంధీ మీద దండకం కూడా రచించారు . ఇవే కాకుండా పిల్లల పాటలు , నవలలు , పిట్ట కథలు , జీవిత చరిత్రలు ,కథలు అనేక ప్రక్రియలలో రచనలు చేసారు . వరలక్ష్మమ్మ కథలు కొన్ని తమిళ , కన్నడ , హిందీ భాషలలోకి అనువాదమయ్యాయి . ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి . మద్రాసు , విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్న మొదటి మహిళ వరలక్ష్మమ్మ . 1921లో విజయవాడలో గాంధీని కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు . “ నా జీవము ధర్మము , నా మతము నీతి , నా లక్ష్యము సతీ శ్రేయము . ఈ మూడింటిని సమర్ధించుటకే నేను కలము బూనితిని “ అని చెప్పుకున్న రచయిత్రి . బాలికల అభ్యున్నతి కోసం బాపట్లలో స్త్రీ హితైషిణి మండలిని స్థాపించి స్త్రీల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవ చేసారు .మూలాలు
- తెలుగు సాహిత్య చరిత్ర - ద్వా.నా. శాస్త్రి
Namaskaram
రిప్లయితొలగించండిPlease add this webpage to your site
Thanx / Regards
Seshendra : Sahasraabdi Darshanika Kavi
http://seshendrasharma.weebly.com