24. కడుపారఁ గూడుఁ గూరలు
దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచుం దా
వడితనమునఁ బెనిమిటితో
నెడఁ బాసి చరింపఁ గూడ దెపుడు కుమారీ!
భావం:-దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచుం దా
వడితనమునఁ బెనిమిటితో
నెడఁ బాసి చరింపఁ గూడ దెపుడు కుమారీ!
ఓ కుమారీ! మగని వద్ద దన కోరికలు దీరవని,అతని వద్ద పంచభక్ష్య పరమాన్నములతో కడుపు నిండదని,కావలసిన రంగురంగుల వస్త్రములు లభింపవని, గూడుదొరకదని అనుకొని తొందరపడి యాతనిని వదలివేసి జీవించుట మగువకు మర్యాద కాదు. సమాజంలో చిన్న చూపుతో చూడబడుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి