Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

5, జులై 2012, గురువారం

తిక్కన భారతం లోని పద్యాలు



తిక్కన భారతం లోని పద్యాలు
ద్రౌపది భీముడితో సహదేవుడి గురించి

ఏనును మీరు కానలకు నేగు నెడన్ నను జేరి యెంతయున్
దీనత దోప కుంతి సహదేవుని నిల్లడ వెట్టి నాకు నమ్మా
నిను నమ్మి చాల విషమంబగు నివ్వన వాస మీతడున్
పూనగ నియ్యకొంటి ననె బోరన నశ్రులు క్రమ్ముచుండగాన్

ఆ రూపంబవికార మా భుజబలం బత్యంత నిర్గర్వ మా
శూరత్వంబు దయా రసానుగత మా శుంభత్క్రియా జ్ఞానమా
ర్యారంభ ప్రతికూల వాద రహితం బా యీగి సన్మాన వి
స్తారోదాత్తము మాద్రి పిన్న కొడుకేతన్మాత్రుడే చూడగన్ ?!

సుకుమారుడతడు గోపా
లక వృత్తి వహించి యడవులన్ గ్రుమ్మరుచు
న్కికి నాక కాదు పగ వా
రికి నైనను యకట మనమురియదే వగలన్ !

ఒల్లరు రాజు దేవులును ఒడ్డులు రాసిన చందనంబు మే
నెల్ల చెమర్పగా నలయకేను శ్రమంబడి నిల్చి నిల్చి య
ల్లల్లన ............................................
.................................... బ్రహ్మ దిట్టుదున్ !


ధర్మరాజు తమ్ములతో కలిసి కృష్ణుడిని రాయబారానికి వెళ్ళమని అడగడం

మనము జనార్దను పాలికి
చని కౌరవ సభకు నతని చనుమని ప్రార్ధిం
చిన మేలు బంధు హిత గురు
జనములతో రణము కాక సంప్రీతి యగున్ !

ఇచ్చటి బంధులు నీవును
యచ్చెరు వడి వినుచు నుండ నైదూళ్ళును మా
కిచ్చినను చాలు నంటిని
పొచ్చెము గాదింత వట్టు పూర్ణము సుమ్మీ !

ఆ దుర్యోధను డంత మాత్రయును చేయంజాలడో గాని పెం
పేదం గౄరత కోర్వ రాదు సిరి నాకేలందునే గ్రాస వా
సో దైన్యంబులు వచ్చు నా యరయు నీ చుట్టాలకుం గావునన్
మోదంబందుట గల్గు కౌరవులు నేముం బొంది శ్రీనొందినన్

అక్కట లాతులైన పగఱైనను చంపన గోరనేల యొం
డొక్క తెఱంగు లేదె యది యొప్పదె బంధు సుహృజ్జనంబు లా
దిక్కున నున్న వారు గణుతింపక సంపదకై వధించి దూ
రెక్కుట దోష మందుటను ఈ దురవస్థల కోర్వ వచ్చునే !

క్షత్ర ధర్మ మింత కష్ట మగునె పర
ధర్మ మాచరింప దగద యండ్రు
కాన శస్త్ర జీవికయ తగి యున్నది
యైన వంశ నాశ మనభిమతము !

పగయ గల్గెనేని పామున్న యింటిలో
యున్న యట్లు కాక యూరడిల్లి
యుండునెట్లు చిత్త మొక మాటు గావున
వలవ దధిక దీర్ఘ వైర వృత్తి

జయమగు నోడుదు మను ని
శ్చయ మొక్కడు లేదు వినుము సమరమున పరా
జయము మరణంబు కంటె హృ
దయ పుట భేదనము సేయు తథ్యంబనఘా

...............................
...............................
పలువురొకని కోడి పాఱుట బల్లిదు
లనద చేత జెడుట యును ఘటించు

కాన యవశ్యముఁ బెనకువ
కాని యుపాయమున పగఱ కడ తేర్చి ధృతిం
పూని నడచు నెవ్వడు డెం
దానం జెయి వెట్టుకొని యతడు నిద్రించున్ !


ద్రౌపది కృష్ణుడి తో రాయబారం ముందు ఆడిన మాటలు

నెట్టన యిట్టి యల్క మది నిల్పితి రక్కెస తాల్మి చిచ్చొడిం
గట్టిన యట్లు  పెద్దయును గాలము దీనికి నారుటెన్నడున్
పుట్టదు దుష్ట నిగ్రహము పూని జగంబులు గాచునట్టి తో
బుట్టువు నీవు తేజమున బొల్చిన భర్తలు గల్గ నచ్యుతా!

పెంపేదం దమకిట్టి తక్కువలు రూపింపంగ నేలా ? విచా
రింపన్ వారిక మేలు సంధి. తము వారిం జూచినన్ తారు సా
ధింపన్ జాలరొ ? కాక పోరఁ దగ మర్దింపన్ దలంపేని శం
కింపన్ బట్టొకొ ? వారు బ్రాహ్మణులె యే కీడైన సైరింపగాన్

వరమున బుట్టితిన్, భరత వం శము జొచ్చితి నందు పాండు భూ
వరునకు కోదలైతి జన వంద్యుల బొందితి నీతి విక్రమ
స్థిరులగు పుత్రులన్ బడసితిన్ సహ జన్ముల ప్రాపు గాంచితిన్
సరసిజ నాభ ! యిన్నిట బ్రశస్తికి నెక్కిన దాన నెంతయున్ !

నీవు సుభద్ర కంటె కడు నెయ్యము గారవంఉందలిర్ప సం
భావన్ సేయుదిట్టి నను పంకజ నాభ యొకండు రాజసూ
యావ భృదంబునందు శుచియై పెను పొందిన వేణి వట్టి యీ
యేవురు చూడగాఁ సభకు నీడ్చె కులాంగన నిట్లొనర్తురే ?!

ఇవి దుస్సశేను వ్రేళ్ళం
దవిలి సగము త్రెవ్వి పోయి తక్కిన యవి కౌ
రవుల కడ తీరు మాటల
యవసరమున తలప వలయు నచ్యుత వీనిన్ !


మిస్చెల్లనెఔస్ ...

ద్రౌపది కీచకునితో:
దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతు
ల్గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం
ధర్వుల్ మానము బ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా !

ద్రౌపది భీమునితో:
నీ వలమూపు లావు మును నేల వహించిన నాగ కూర్మ గో
త్రావని బృద్ధి శాకరుల కారయ నూరటపట్టు గాదె సం
భావన భూజనంబులకు బండువు గాదె మహోగ్ర కోప రే
ఖా విభవంబు వైరులకు గాలము చేరువగాదె పావనీ !

భీస్ముడు కర్ణుడితో:
చిక్కని పోటుమానిసి విసీ! వినువారలు నవ్వెనేమిగా
నెక్కుడు మాటలాడెద వహీన పరాక్రమ శాలి, యర్జునుం
డొక్కడ యార్వురన్ మనల నుగ్ర రణంబున గెల్చె నిన్న, నే
డిక్కడ బల్కులన్ గెలిచె దీవతనిన్ మనరాజు కొల్వునన్ !

సంజయుడు ధృతరాష్ట్రునితో ధర్మరాజు గురించి:
అనయము పుట్టె జూదమున యప్పుడు యెంతయు జిచ్చుపెట్టి కా
ల్చినయది నీ యుపేక్షయ, వశీకృత చిత్తుడు ధర్మ సూతి మె
త్తని పులి, యెల్లవారలు నధర్మము నీపయి బెట్టు నంతకు
న్వినడును గానడున్ బిదప నీకును నాకు మనల్ప వచ్చునే

సారపు ధర్మమున్, విమల సత్యము, పాపము చేత, బొంకుచే
పారము పొందలేక, చెడబారినదైన యవస్థ దక్షు లెవ్-
వార లుపేక్ష సేసిరది వారల చేటగు గాని, ధర్మ నిస్-
తారక మయ్యు, సత్య శుభ దాయకమయ్యును దైవ ముండెడిన్

ద్రోణుడు ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుని గురించి:
సింగంబాకటితో గుహాంతరమున్ జేడ్పాటుమై నుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ
చ్చెం గుంతీ సుత మధముండు సమర స్థేమాభిరామాకృతిన్

"ఖడ్గ" తిక్కన కి సంబంధించిన చాటువులు

పగఱకు వెన్నిచ్చిన చో
నగరే నిను మగ తనంపు నాయకులెల్లన్
ముగురాడ వార మైతిమి
వగ పేటికి జలక మాడ వచ్చిన వేళన్

అసదృశముగ నరివీరుల
పసమీరగ గెలువ లేక పంద క్రియన్నీ
వసివైచి తిరిగి వచ్చిన
పసులున్ విఱిగినవి తిక్క పాలున్ విఱిగెన్

ంఅకె యౌర్ ఔన్ ఫ్రీ వెబ్సితె ఒన్ ట్రిపొద్.చొం
ంఅకె యౌర్ ఔన్ ఫ్రీ వెబ్సితె ఒన్ ట్రిపొద్.చొం

1 కామెంట్‌: