Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

24, జూన్ 2012, ఆదివారం

గురజాడ పద్యాలు



మహాకవి గురజాడ పద్యాలు

కొత్తపాతల మేలు కలయిక

గుత్తునా ముత్యాల సరములు
కూర్చుకొని తేటైన మాటల
కొత్తపాతల మేలు కలయిక
క్రొమ్మెరుంగులు జిమ్మగా

మెచ్చనంటా వీవు; నీవిక
మెచ్చకుంటే మించిపాయను;
కొయ్యబొమ్మలె మెచ్చు కళ్ళకు
కోమలులు సౌరెక్కునా ?

తూర్పు బలబల తెల్లవారెను;
తోకచుక్కయు వేగుచుక్కయు
ఒడయు డౌ వేవెల్గు కొలువుకు
వెడలి మెరసిరి మిన్ను వీధిని

వెలుగు నీటను గ్రుంకె చుక్కలు;
చదల చీకటి కదలబారెను
యెక్కడనొ వొక చెట్టు మాటున
నొక్క కోకిల పలుకసాగెను

మేలుకొలుపులు కోడి కూసెను;
విరులు కన్నులు విచ్చి చూసెను;
ఉండి, ఉడిగియు, ఆకులాడగ
కొసరెనోయన గాలి వీచెను

పట్టమున పదినాళు లుంటిని
కార్యవశమున పోయి; యచ్చట
సంఘ సంస్కరణ ప్రవీణుల
సంగతుల మెలగి,

యిల్లుజేరితి నాటి వేకువ;
జేరి, ప్రేయసి నిదుర లేపితి;
"కంటివే" నేనంటి, "మింటను"
కాముబాణం బమరియున్నది"

   

తెలిసి, దిగ్గున లేచి, ప్రేయసి
నన్ను గానక, మిన్ను గానక,
కురులు సరులును కుదురు జేయుచు
ఓర మోమిడ, బల్కితిన్

"ధూమకేతువు కేతువనియో
మోము చందురు డలిగి చూడడు?
కేతువా యది? వేల్పులలనల
కేలి వెలితొగ కాంచుమా !

అరుదుగా మిను చప్పరంబున
చొప్పు తెలియని వింత పొడముగ,
చన్నకాలపు చిన్నబుద్ధులు
బెదరి యెంచిరి కీడుగా

అంతెకాని రవంతయైనను
వంత నేగతి కూర్చ నేర్చునె ?
నలువ నేరిమి కంతు యిది యన
నింగి తొడవయి వ్రేలుచున్--

కవుల కల్పన కలిమినెన్నో
వన్నె చిన్నెలు గాంచు వస్తువు
లందు, వెర్రి పురాణ గాథలు
నమ్మజెల్లునె పండితుల్ ?

కన్ను కానని వస్తుతత్వము
కాంచ నేర్పరు లింగిరీజులు;
కల్ల నొల్లరు; వారి విద్యల
కరచి సత్యము నరసితిన్

దూరబంధువు యితడు భూమికి;
దారి బోవుచు చూడవచ్చెను --
డెబ్బ దెనుబది యేండ్ల కొకతరి
నరుల కన్నుల పండువై

ముత్యాల సరాలు

తెగులు కిరవని కతల పన్నుచు
దిగులుజెందు టదేటి కార్యము ?
తలతు నేనిది సంఘసంస్కర
ణ ప్రయాణ పతాకగాన్

చూడు మునుమును మేటివారల
మాట లనియెడు మంత్రమహిమను
జాతి బంధములన్న గొలుసులు
జారి సంపద లుబ్బెడన్

యెల్ల లోకము వొక్కయిల్లై,
వర్ణ భేదములెల్ల కల్లై
వేల నెరుగని ప్రేమబంధము
వేడుకలు కురియ

మతము లన్నియు మాసిపోవును;
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును;
అంత స్వర్గ సుఖంబు లన్నవి
యవని విలసిల్లున్

మొన్న పట్ణమునందు ప్రాజ్ఞులు
మొట్టమొదటిది మెట్టు యిదియని,
పెట్టినారొక విందు జాతుల
జేర్చి; వినవైతొ?"

అంటి నే నిట్లంత ప్రియసఖి
యేమి పలుకకయుండి యొకతరి,
పిదప కన్నుల నీరు కారుచు
పలికె నీరీతిన్

"వింటి, మీపోకిళ్ళు వింటిని,
కంట నిద్దుర కానకుంటిని;
(యీ) చిన్న మనసును చిన్నబుచ్చుట
యెన్నికని యోచించిరో?

తోటికోడలు దెప్పె, పోనీ;
సాటివా రోదార్చె, పోనీ;
మాటలాడక చూచి నవ్వెడి
మగువ కేమందున్ !

   

తోడుదొంగని అత్తగారికి
తోచెనేమో యనుచు గుందితి;
కాలగతి యని మామలెంతో
కలగ, సిగ్గరినై

చాలునహ ! మీ చాకచక్యము
చదువుకిదె కాబోలు ఫలితము !
ఇంత యగువని పెద్ద లెరిగిన
యింగిలీషులు చెపుదురా ?

కోట పేటలు నేల గలరని
కోటి విద్యలు మీకు కరపిరి;
పొట్ట కూటికి నేర్చు విద్యలు
పుట్టకెట్లు కదల్చెనా ?

కట్టుకున్నది యేమికాని;
పెట్టి పొయ్యక పోతె, పోనీ;
కాంచి పెంచిన తల్లిదండ్రుల
నైన కనవలదో ?

కలసి మెసగిన యంత మాత్రనె
కలుగబోదీ యైకమత్యము;
మాల మాదిగ కన్నె నెవతెనొ
మరులుకొనరాదో ?"

అనుచు కోపము నాపజాలక
జీవితేశ్వరి సరుల నామై
చరచి, చనె క్రొమ్మెరుగు చాడ్పున
మనసు వికలముగాన్

తూర్పు బల్లున తెల్లవారెను;
తోకచుక్క యదృశ్యమాయెను;
లోకమందలి మంచి చెడ్డలు
లోకు లెరుగుదురా ?

దేశ భక్తి

దేశమును ప్రేమించు మన్నా,
మంచి యన్నది పెంచు మన్నా;
వట్టి మాటలుకట్టి పెట్టోయ్
గట్టి మేల్ తల పెట్ట వోయ్!

పాడి పంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్ ;
తిండి కలిగితెకండ గలదోయ్
కండ గల వాడేను మనిషోయ్ !

ఈసురో మని మనుషు లుంతే
దేశ మేగతి బాగు పడునోయ్ ?
జల్దు కొని కళ లెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్!

అన్ని దేశాల్ క్రమ్మ వలెనోయ్
దేశి సరుకుల నమ్మ వలెనోయ్ ;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !

వెనక చూసినకార్య మేమోయ్ ?
మంచి గతమున కొంచెమేనోయ్
మంద గించక ముందు అడుగేయ్ !
వెనక పడితే వెనకెనోయ్ !

పూనుస్పర్ధను విద్య లందే
వైరములు వాణిజ్య మందే ;
వ్యర్ధ కలహం పెంచ బోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్ !

దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పు కోకోయ్
పూని యేదై నాను వొక మేల్
కూర్చి జనులకుచూపవోయ్ !

   

ఓర్వలేమి పిశాచి, దేశం
మూలుగులు పీల్చేసెనోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్ !

పరుల కలిమికి పొరలి యేడ్చే
పాపికెక్కడ సుఖం కద్దోయ్ ?
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్ !

స్వంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడు పడవోయ్ !
దేశ మంటే మట్టి కాదోయ్,
దేశ మంటే మనుషులోయ్ !

చెట్ట పట్టాల్ పట్టుకొని
దేశస్థు లంతా నడవ వలెనోయ్,
అన్న దమ్ముల వలెను జాతులు
మతము లన్నీ మెలగ వలెనోయ్ !

మతం వేరై తేను యేమోయ్ ?
మనసు లొకటై మనుషులుంటే
జాతి యన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్ !

దేశ మనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్త వలెనోయ్,
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండ వలెనోయ్ !

ఆకు లందున అణగి మణగీ
కవిత కోయిలపలుక వలెనోయ్
పలుకులను విని దేశమం దభి
మానములు మొలకెత్త వలెనోయ్ !!


మిణుగురులు

అరటికాయ బజ్జి
మినప్పప్పు సొజ్జి
కలసి మెలసి తిందాం
కధలు విధలు విందాం

ఏనుగు ఎక్కి మనము
ఏ వూరెళదాము?
ఏనుగు ఎక్కి మనము
ఏలూరెళదాము!

గుఋఋఅం ఎక్కి మనము
ఏ వూరెళదాము?
గుఋఋఅం ఎక్కి మనము
గుంటూరెళదాము!

   

మోటారెక్కి మనము
ఏ వూరెళదాము?
మోటారెక్కి మనము
మోటూరెళదాము!

వెన్నుని ఎక్కి మనము
ఏ వూరెళదాము?
వెన్నుని ఎక్కి మనము
వెయ్యూళ్ చూద్దాము!

   (భరతి 1930).

కన్యా శుల్కం లో గిరీశం చెప్పిన పద్యం, పోం , కొన్ని "qఉఒతతిఒన్" లు

గిరీశం :
ఖగపతి యంఋతము తేగా
భుగ భుగ మని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగ చెట్టై జన్మించెను
పొగ త్రాగని వాడు దున్న పోతై పుట్టునూ !!

ఇది బృహన్నరదీయం నాలుగో ఆశ్వాశంలో ఉంది.
అదల ఉణ్ణీగాని ...!



             ఠె విదౌ

    షె లేవెస్ హెర్ బెద్ అత్ ఆ.ం. ఫౌర్,
    ఆంద్ స్వీప్స్ థె దుస్త్ ఫ్రొం ఒఫ్ఫ్ థె ఫ్లూర్,
    ఆంద్ హేప్స్ ఇత్ అల్ల్ బెహింద్ థె దూర్,
                    ఠె విదౌ !

    ఓఫ్ వొండ్రౌస్ సిజె షె మకెస్ థె చకె,
    ఆంద్ తకెస్ ముచ్ పైన్స్ తొ బొఇల్ అంద్ బకె,
    ఆంద్ ఏత్స్ ఇత్ అల్ల్ విథౌత్ మిస్తకె,
                    ఠె విదౌ !

    ఠ్రౌఘ్ ఫస్త్స్ అంద్ ఫేస్త్స్ షె కీప్స్ హెర్ హేల్థ్,
    ఆంద్ పిఎ ఒన్ పిఎ, షె స్తొరెస్ బ్య్ స్తేల్థ్,
    టిల్ల్ అల్ల్ థె తౌన్ తల్క్ ఒఫ్ హెర్ వేల్థ్,
                    ఠె విదౌ !

    ఆంద్ నౌ అంద్ థెన్ షె తకెస్ అ మతె,
    ఆంద్ లెత్స్ హెర్ హైర్ గ్రౌ ఒన్ హెర్ పతె,
    ఆంద్ చరెస్ అ జొత్ వ్హత్ పెఒప్లె ప్రతె,
                    ఠె విదౌ !

    ఈ లొవె థె విదౌ - హౌఎవెర్ షె బె,
    ంఅర్రిఎద్ అగైన్ - ఒర్ సింగ్లె ఫ్రీ,
    భథింగ్ అంద్ ప్రయింగ్,
    ఓర్ ఫ్రిస్కింగ్ అంద్ ప్లయింగ్,
    ఆ మొదెల్ ఒఫ్ సైంత్లినెస్స్,
    ఓర్ అ మొదెల్ ఒఫ్ చొమెలినెస్స్,
    వ్హత్ వెరె థె ఏర్థ్
    భుత్ ఫొర్ హెర్ బిర్థ్ ?
                 ఠె విదౌ !


    ఇలాంటివే మరి కొన్ని:

1.    వ్హెన్ లొవెల్య్ వొమన్ స్తూప్స్ తొ ఫొల్ల్య్,
    ఆంద్ ఫింద్స్ తూ లతె థత్ మెన్ బెత్రయ్,
    వ్హత్ చరంస్ చన్ సూథె హెర్ మెలంచొల్య్,
    వ్హత్ అర్త్స్ చన్ వష్ హెర్ గుఇల్త్య్ అవయ్?

2.    ఛన్ లొవె బె చొంత్రొళ్ద్ బ్య్ అద్విచె?
    విల్ల్ చుపిద్ ఔర్ మొథెర్స్ ఒబెయ్?

3.    ఈత్ ఇస్ వొమెన్ థత్ సెదుచె అల్ల్ మంకింద్.

4.    ఓహ్! వ్హిస్త్లె తొ మె అంద్ ఈ విల్ల్ చొమె అవయ్,
    ఠౌఘ్ ఫథెర్ మొథెర్ అంద్ గ్రంద్మొథెర్
    షౌల్ద్ గొ మద్.



( "పొటిగరాప్పంతులు" నౌకరు వద్ద చెవిటి వేషం వేస్తున్నప్పుడు )

    నీ సైటునా డిలైటు
    నిన్ను మిన్నకాన కున్న

    క్వైటు రెచడ్ ప్లైటు
    మూను లేని నైటు

    ఫుల్లు మూను నైటటా
    జాసుమిన్ను వైటటా
    మూను కన్న మొల్ల కన్న
    నీదు మోము బ్రైటటాటా టా టా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి