Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

2, మే 2012, బుధవారం

పారిజాతాపహరణం

                                        పారిజాతాపహరణం
                                                               - నంది తిమ్మన

ఇష్టదేవతా స్తుతి

శ్రీమదికిం బ్రియం బెసఁగఁ
జేర్చిన యుయ్యెల లీల వైజయం
తీ మిళితాచ్చ కౌస్తుభము
నిద్దపుఁ గాంతిఁ దనర్చి యాత్మ వ
క్షోమణి వేదిఁ బొల్పెసఁగఁ
జూడ్కుల పండువు సేయు వేంకట
స్వామి కృతార్థుఁ జేయు నర
స క్షితినాథుని కృష్ణరాయనిన్

పొలఁతుల్ కౌఁగిటఁ గ్రుచ్చి యెత్తి తలఁబ్రా ల్వోయించు నవ్వేళ నౌఁ
దల గంగం దన నీడఁ దాన కని మౌగ్ధ్యం బొప్ప వేఱొక్క తొ
య్యలి యంచున్మది నెంచు పార్వతి యసూయావాప్తికిన్నవ్వు క్రొ
న్నెలపూ దాలుపు కృష్ణరాయనికి సంధించు న్మహైశ్వర్యముల్ |మ| [2]

తన దంతాగ్రముచేతఁ దీక్ష్ణమతి, నుద్య త్కుంభయుగ్మంబుచే
త నితాంతోన్నతి, దాన విస్ఫురణ నుత్సాహంబు, శుండా ముఖం
బున దీర్ఘాయువు నిచ్చుఁ గావుత గుణాంభోరాశికిం గృష్ణరా
యనికి న్వారణ రాజ వక్తృఁడు కృపాయత్తైక చిత్తాబ్జుఁడై |మ| [3]

సరసపు టల్కఁ దీర్చుతఱి శార్ఙ్గ సుదర్శన నంద కాబ్జ సం
భరణ గుణాప్తి నెన్నడుముపైఁ గటిపై జడపై గళంబుపై
హరి నలుగేలుఁ బైకొన సుఖాంబుది నిచ్చలు నోలలాడు నిం
దిరి కృపఁ జూచుఁ గాత నర దేవ శిఖా మణిఁ గృష్ణరాయనిన్ |చ| [4]

తన మృదు గీతికా పరిణత ధ్వని వైఖరిఁ బల్కు మంచు నిం
చిన రహిఁ జేతివీణియకుఁ జెక్కులు గీఁటుచు నేర్పు లీల నొ
య్యన నఖరాంకురంబుల నయమ్మునఁ దంత్రులు మీటి గాన మిం
పొనరఁగఁ జేయు వాణి ప్రతిభోన్నతుఁ జేయుతఁ గృష్ణరాయనిన్ |చ| [5]

వలిమల యల్లువాఁడు తలవాఁక ధరించిన పూవుగుత్తి, వే
ల్పులగమి జీవ గఱ్ఱ, యుడివోవని చల్వల టెంకి, వెన్నెల
ల్మొలచిన పాదు, పాల్కడలి ముద్దులపట్టి నృసింహ కృష్ణరా
యలఁ గరుణారసంబు నినుపారెడి చూపులఁ జూచుఁ గావుతన్ |చ| [6]

 కృతిపతి వంశ ప్రశస్తి, శౌర్య ప్రతాపములు, షష్ట్యంతములు, వగైరా….

అవతారిక

జనమేజయ జనవల్లభుఁ
డను దినమును హరికథా సుధాస్వాదనమునం
దనివి సనక వైశం
పాయన మునికిట్లనియెఁ, గౌతుకాయత్త మతిన్ |క| [35]

హరివంశ కథ లెల్ల నానుపూర్విగ నిట్టు
-విని కృతార్థుఁడ నైతి మునివరేణ్య!
యాదానవారాతి యమరులఁ బ్రోవంగఁ
-బూని యా యదువంశమున జనించె
నతఁడు గ్రమ్మఱ వారి కాధార మగు పారి
-జాతంబు పుడమి కేరీతిఁ దెచ్చె?
ననుమతి నిచ్చిరో! యా వేల్పు, లొండేని,
-బలిమిఁ జేకొనియెనో! పాడి దొఱఁగి, |సీ|
తెలియ నానతి యిమ్ము సందియము దీఱ
వినఁగ వేడుక యయ్యె సవిస్తరముగ
ననిన నా వ్యాసముని శిష్యుఁడతనితోడ
నధిప! విను మని పలికె నత్యాదరమున |తే| [36]

శ్రీ కృష్ణుని సంసార విభూతి

హరి నరకాసురుం గెలిచి యద్దనుజేంద్రుని యింట నున్న య
చ్చరల కొలంబు వారి, నెలజవ్వనముం బొలివోని వారిఁ, ద
న్వరునిఁగఁ గోరు వారి, లలనామణులం బదియాఱు వేవురం
బరిణయ మయ్యె నారదుని పంపున సౌఖ్య రసైక లోలుఁడై |చ| [38]

మఱియు రుక్మిణి, సత్య, జాంబవతి, మిత్ర
వింద, భద్ర, సుదంత, కాళింది, లక్ష
ణ యనఁగా మున్న కల రబ్జనాభునకును
మహిషు లెనమండ్రు సమతాభిమానవతులు |తే| [38]

ఆ రమణీ లలామల నందఱఁ గూడి యదూద్వహుండు త
ద్ద్వారవతీ పురోపవన వాటికలం, గ్భతకాద్రి సీమల
న్వారిధి తీర కుంజ నద నదంబులఁ, గేళి తరంగిణీ తటీ
కైరవిణీ సహాయ మణికల్పిత సౌధముల న్వసించుచున్ |ఉ| [39]

ఏయేవేళల నేసరోజముఖి యేయేలీలలం గోరుఁ దా
నాయావేళల నాసరోజముఖి నాయాలీలలం దేల్చి, యే
చాయం జూచినఁ దానయై మెలఁగుచున్ సౌఖ్యాబ్ధి నోలాడు భో
గాయత్తుండయి పెక్కు రూపముల మాయా కల్పనా చాతురిన్ |శా| [40]

హరి యిట్లు సతుల నందఱ
సరిగాఁ జూచియును, భోజ జనపాల సుతం,
దరుణీమణి సాత్రాజితి
నిరువుర మన్నించి మిగుల నిచ్చుం జనవుల్ |క| [41]

కులమును రూపము న్మగని కూరిమియుం గలదాన నంచునీ
వల నల రుక్మిణీ రమణి వాసిఁ బెనంగఁగ, సత్యభామయుం
గులమును రూపము న్మగని కూరిమియుం గలదాన నంచునా
వలఁ బచరింపఁగా, రవరవ ల్వొడమె న్మది వారి కెంతయున్ |చ| [42]

అంతట నొక్కనాఁడు ధవళాంబుజ నేత్రుఁడు వచ్చి రుక్మిణీ
కాంత గృహంబులోన శశికాంత శిలామయ వేదిక మీఁద నే
కాంతమునందుఁ గొందఱు మృగాయతనేత్రలు గొల్వ, జూద మ
త్యంత వినోద కేళిమెయి నాడుచు నుండఁగ నద్భుతంగన్, |ఉ| [43]

నారదాగమన వర్ణనము

స రి గ మ ప ద ని స సంజ్ఞస్వరంబుల
-మహతి నభో వాయు నిహతి మొఱయ,
భాగీరథీ పయః పరిపూర్ణ మణి కమం
-డలువు హస్తంబునఁ జెలువు మిగులఁ,
బ్రణవ మంత్రావృత్తి పావన స్ఫటికాక్ష
-వలయంబు కర్ణ శష్కులిక వ్రేల,
సమర నృత్యోచిత చమరవాలంబును
-గక్షపాలయు భుజాగ్రమున మొఱయ, |సీ|

దేహకాంతు లకాల చంద్రికల నీన,
జడలు మోక్షద్రు పల్లవ శంక సేయ,
గగనమున నుండి వచ్చె నాకస్మికముగ
నారివేరంపుఁ దపసి దైత్యారికడకు |తే| [44]

నారదునకు రుక్మిణీ కృష్ణుల యాతిథ్యము

వచ్చిన మునిపతి కెదురుగ
వచ్చి, నమస్కృతి యొనర్చి, వనితయుఁ దానుం
బొచ్చెంబులేని భక్తి వి
యచ్చర రిపు భేది సలిపె నాతిథ్యంబున్ |క| [45]

అపుడు రుక్మిణి కనుసన్న నబ్జముఖులు
రత్న సింహాసనంబు నారదున కిడిరి,
హరియు నమ్మౌని యనుమతి నర్హ పీఠ
మున సుఖాసీనుఁడై కరంబులు మొగిడ్చి |తే| [46]

సురసంయమివర! ంఈరిట
కరుదేరఁగ నిప్పుడేఁ గృతార్థుఁడ నయితిన్
నిరతంబు మీరు నాపయిఁ
గరుణ గలిగి యునికి యిది యకారణము సుఁడీ |క| [47]

నావుడు శౌరికి నిట్లను
నా వేలుపుఁ దపసి "మర్త్యుఁ డాడెడి రీతిన్
నీవిట్లు పలుక నుచితమె!
ఏ విశ్వజనీన చరిత! Yఎఱుఁగనె నిన్నున్! |క| [48]

నారదుఁడు శ్రీకృష్ణుని
దశావతారముల నుతించుట

ప్రామినుకుల దొంగఁ బాతాళ కుహరంబుఁ
-జొరఁ బాఱి చీఱిన చోఱ వీవ,
తరిగొండ వెన్నుపైఁ దాల్చి వేల్పులఁ గూటి
-చవి దేల్చినట్టి కచ్చపమ వీవ,
నీటిలో మునిగిన నేలచేడియఁ గొమ్ము
కొన నుబ్బ నెత్తిన ఘోణివీవ,
మునిమాపు బలు గంబమునఁ ముట్టి బంటు న
-క్కఱఁ గాచినట్టి సింగంబ వీవ, |సీ|

దితిజు మెట్టిన యా పొట్టి దిట్ట వీవ,
పుడమిఱేఁడుల నడఁచిన ప్రోడ వీవ,
కడలిఁ గోలకుఁ దెచ్చిన గబ్బి వీవ,
యిపుడు ద్వారక వసియించు నీవు నీవ! |తే| [49]

రక్కసిమగువల యీలువు
మొక్కపఱిచె దీవ, పాపముల గమి కాలం
ద్రొక్కెదవు నీవ, యింకిట
నిక్కముగా నిన్నుఁ బొగడ నేర్తునె! కృష్ణా! |క| [50]

ద్వారక వైకుంఠపురం,
బీ రుక్మిణి లక్ష్మి, మీర లిచ్చట నునికిన్
సారెకుఁ గొల్వఁగ వత్తును
గోరికతోఁ గంసహర! ముకుంద! మురారీ!" |క| [51]

నారదుఁడు పారిజాత ప్రసూనమును
శ్రీ కృష్ణున కర్పించుట

అని యిట్లు బహు ప్రకారంబులం బ్రశంసించి యవ్విరించి నందనుం డమందానందంబు డెందంబునం గ్రందుకొన నిజ వాసనా బిరుద గాథా కథన వందిబృందాయమా నేందిందిరంబును, నుచితోపయోగ జని తానంద బాష్ప సందోహ శంకావహ మకరంద బిందు తుందిలంబును, నపూర్వకంబును, నిఖిల మనోరథ ప్రదాన కీర్తి శంకాకర విశద ప్రభా నిచుళితంబును నగు పారిజాతంపుఁ గ్రొన్నన మిన్నేటి పసిండి నెత్తమ్మి చిగురుటాకునం బొదివి యిచ్చిన, |వ| [52]

వినయంబు విస్మయంబును
మనమునఁ బెనఁగొనఁగ నపుడు మాధవుఁ డా క్రొ
న్ననఁ గయికొని భీష్మక నం
దనఁ గనుగొని సత్యభామ తలఁపున నిలువన్ |క| [53]

"యిది భోజాత్మజ కిచ్చినం, గినుకతో నేమంచు నూహించునో
మది సాత్రాజితి; దాని కే నిపుడు ప్రేమం బంపినన్ దీని నె
ల్లిదముం జేసినజాడ దోఁచునొకొ! యౌలె మ్మిందు నేనున్కిఁ జె
లాదువో యేరికిఁ బంపగా" ననుచు లీలన్ రుక్మిణీ కాంతకున్ |మ| [54]

కృష్ణుఁడు పారిజాతమును రుక్మిణి కొసఁగుట

కనుగవఁ బిన్న నవ్వు దొలఁక, న్మునినాథుని కన్ను సన్న ని
చ్చినఁ, దగ భోజనందనయుఁ జేకొని మౌనికి మ్రొక్కి యవ్విరిం
దన నెఱి కొప్పునం జెరివిన న్వలిగుబ్బలి ముద్దుపట్టి లేఁ
త నెల ధరించిన ట్లమరెఁ దద్దయు మోహన కాంతి సంపదన్ |చ| [55]

మగమీల నగఁజాలు తెగఁ గీలుకొను వాలుఁ
గనుఁగవ కొక వింత కాంతి యొదవె,
వలిజక్కువల పెక్కువలు దక్కువగ నిక్కు
చనుదోయి కొక వింతచాయ దోఁచె,
నెల తుమ్మెదల దిమ్ము వెలిఁజిమ్ము చెలువమ్ము
గల వేణి కొక వింత నలుపు మీఱె,
నల చెందొవల విందు చెలువెందు వెద చిందు
మొగమున కొక వింత జిగి దొలంకెఁ, |సీ|

జక్కఁదనమున కొక వింత చక్కఁదనము,
జవ్వనంబున కొక వింత జవ్వనంబు,
విభ్రమంబున కొక వింత విభ్రమంబు
గలిగె నద్దివ్య కుసుమంబు కతన సతికి| |తే| [56]

కలకంఠకంఠి యీగతిఁ
బులుగడిగిన ముత్తియంపుఁ బొలు పొందంగా
నెల నవ్వొలయఁగఁ బలికెను
జలజాసను పట్టి కలహ సంభ్రమ పరుఁడై| |క| [57]

నారదుఁడు పారిజాతమహిమను వివరించుట

జలజాక్షి! యిది పారిజాత ప్రసూనంబు
నరులకు ధరియింప నరిది సూవె!
పౌలోమి పార్వతి పద్మ పద్మజురాణి
యును శిరంబునఁ దాల్తు రనుదినంబు,
హరి బహిః ప్రాణంబ వగుట నేఁ డెఱుఁగంగ
వచ్చె, నీకిపు డిది యిచ్చెఁ గాన,
వెలఁదులు పదియాఱు వేవురలో నెన్న
సరిలేరు సౌభాగ్య గరిమ నీకు, |సీ|

నీవు దాల్చిన కతన నీపూవు నేఁడు
భాగ్యము వహించె నుచితోప యోగ్య లీల
నీప్సితార్థంబు లొడఁ గూర్చు నిది లతాంగి!
దీని మహిమంబు చెప్పెదఁ దెలియ వినుము| |తే| [58]

పరిమళము సెడదు, వాడదు,
పరువము తప్పదు, పరాగ భర భరితంబై
నిరతము జగదేక మనో
హర మగు నీ కుసుమరాజ మంబుజ వదనా! |క| [59]

అళి నీలాలక! నీవు నీపతి రహస్య క్రీడ వర్తించు వే
ళలతాంతాయుధు సంగరంబునకు నుల్లాసంబు గల్పించు ను
జ్జ్వల దీపాంకురమై, రతి శ్రమ తనూ సంజాత ధారాళ ఘ
ర్మ లవంబు ల్దొలఁగింపఁగా సురటియై రంజిల్లు, నిచ్చాగతిన్| |మ| [60]

అడిగిన యంతలోన సరసాన్నములన్ సమకూర్చు నాఁకటన్
బడలికఁ జెందనీక; యశుభంబులడంచు; జగత్త్రయంబునం
బడయఁగరాని సర్వగుణ భవ్యము సుమ్మిది; దీనిఁ దాల్చి యి
ప్పడఁతులలోఁ గనుంగొను మపార మహా మహి మానుభావముల్| |చ| [61]

కువలయ పత్ర నేత్ర! నెఱికొప్పున నీ కుసుమంబు దాల్చుటన్
సవతులు వచ్చి నీచరణ సారస యుగ్మము నాశ్రయింపగా,
ధవుఁ డఱిలేని కూర్మి జవదాఁటక నీపలు కాదరింపఁగా,
నవిరళ భోగభాగ్య మహిమాన్వితవై విహరింతు గావుతన్ |చ| [62]

నెలకొని వేసవిఁ జలువయుఁ,
జలివేళల నుష్ణగుణము, సముచిత భంగిన్
గలిగించు నీలతాంతము,
కొలఁదులు చెప్పంగ నిచ్చ క్రొత్తలు సుమ్మీ! |క| [63]

అలరుంబోఁడుల లోపల
నలరుం బోఁడుములు నీకు నగ్గల మగుచున్,
దలపూవాడక యుండుము
తలపూవు ధరించి వికచ తామరసాక్షీ! |క| [64]

రుక్మిణిపైఁ గృష్ణ ప్రేమాతిశయ ప్రశంస

ఇన్ని దినంబులున్ సవతు లిందఱలో నల సత్యభామ కన్
సన్నలఁ ద్రిమ్మరున్ హరి వశంవదుఁడై యన విందుఁ; గాని యో
కన్నియ! నీయెడం గలుగు గారవ మెయ్యెడఁ జూచి కాన; లే
కున్న ననర్ఘ కుసుమోత్తమ మేరికైన నిచ్చెనే! |ఉ| [65]

చక్కనిదాన నంచు, నెలజవ్వని నంచు, జగంబులోనఁ బే
రెక్కినదాన నంచు, బతి యెంతయు నా కనురక్తుఁడంచుఁ దా
నిక్కుచు విఱ్ఱవీఁగుచు గణింపదు కాంతల సత్య; యింతకున్
స్రుక్కక యున్నె! నీ మహిమ సూచిన బోటులు విన్నవించినన్ |ఉ| [66]

ధరియించిన మొదలొక వ
త్సర మాత్రము తావకీన ధమ్మిల్లములో
నిరవుకొని మగుడ నివ్విరి
తరుణీ! యల పారిజాత తరువున కరుగున్ |క| [67]

అనుచు నారదుఁ డాడిన యట్టి పలుకు
లచటి వృత్తాంత మంతయు నరసి పోయి
వేఱు వేఱన సఖులు దేవేరులకును
విన్నవించిన వారును జిన్నవోయి| |తే| [68]

అందరలోనఁ బెద్ద, మహిమాన్విత రుక్మిణి; గానఁ బూవు గో
విందుఁడు దానికిచ్చెఁ దగవేయని లక్షణ యోర్చె; సైఁచెఁ గా
ళింది; శమించె భద్ర; యవులెమ్మని యూరడిలెన్ సుదంత; లోఁ
గుందుట మానె జాంబవతి; కోప మడంచెను మిత్రవిందయున్ |ఉ| [69]

వారిలోపల సౌందర్యవతియు మాన
వతియు మహనీయ సౌభాగ్యవతియు నైన
సత్య యంతట నేమొకో? శౌరి కడకుఁ
బోయి రాదయ్యెఁ జెలి, ప్రొద్దువోయె ననుచు |తే| [70]

తన శృంగార వనంబులోన గిరి [నగరి]పొంతం, జక్కఁగా దిద్ది తీ
ర్చిన పూఁదేనియ యేటి కాలువ దరిం, జెంగల్వ పుప్పొళ్ళు నిం
చిన చంద్రోపల వేదిపై సరస గోష్ఠిన్ బోటియందాను న
వ్వనజా తాయత నేత్ర శౌరిగుణముల్ వాక్రుచ్చి వర్ణించుచున్ |మ| [71]

అలికుల రావముల్ కిసల యాకుల కోకిల కాకు కాకలీ
కలకల నాదముల్ సెలఁగఁ, గమ్మని తమ్మికొలంకు తెమ్మెరల్
వొలయఁగఁ, దొంటి చందమున బుద్ధికి నేమియు నింపు గామికిం
గలఁగుచు సత్యభామ చెలిఁ గన్గొని యించుక సంశయించుచున్ |చ| [72]

అకట! యిదేమియో యెఱుఁగ నయ్యెడుఁ దొయ్యలి! దక్షిణాంస చూ
చుక నయన ప్రకంపగుణ సూచన లేమియు వల్లగావు; సా
రెకు మది జాలి వొంది యొక రీతిఁ దలంకెడుఁ; బ్రాణనాయకుం
డొక చపలాక్షిఁ గూడి నను నొల్లని చెయ్దము లేమి చేసెనో! |చ| [73]

అని సత్యభామ తనవిధ
మునుఁగుం దొయ్యలికిఁ జెప్పు నవసరమునఁ జ
య్యన వచ్చి యొక్క నెచ్చెలి
కనుఁగవ నెఱసంజ వొడమఁగా నిట్లనియెన్ |క| [74]

సత్యకుఁ జెలికత్తె పారిజాత వృతాంతము సెప్పుట

అమ్మా! యేమని చెప్పుదు,
నెమ్మి న్నీ విభుఁడు రుక్మిణీసతి మణి సౌ
దమ్మున నుండఁగ సురముని
క్రమ్మఱ నాకస్మికమ్ముగా నచ్చటికిన్ |క| [75]

చనుదెంచి యమ్మురారికి
ననఘమ్మమరైక యోగ్య మతి సౌఖ్య కర
మ్మనితర సులభ మ్మిది యని
కొనియాడుచు నొక్క దివ్య కుసుమ మ్మొసఁగెన్ |క| [76]

మిన్నంది వేగఁ గైకొని
కన్నుల నొత్తికొని మ్రొక్కి గారవ మెసఁగన్
వెన్నుఁడు రుక్మిణి కొసఁగిన;
నన్నెలఁతయుఁ గొప్పులోన నవ్విరిఁ దాల్చెన్ |క| [77]

అంతలోనన యద్భుతం బావహిల్లఁ
గొలఁది యిడరాని యొక వింత చెలువు గలిగి
రాజ బింబాస్య రుక్మిణి తేజరిల్లె
సాన పట్టిన మకురాంకు శస్త్రమనఁగ |తే| [78]

ఆ కుసుమంబు దాల్చిన మహా మహిమంబునఁ దోడి కామినీ
లోకము మచ్చరంబు మదిలోనఁ దొఱంగి భజించుచుండ, న
స్తోక నిజ ప్రభావములు సూపెడు గద్దియ మీద నెక్కి ము
ల్లోకము దాన యేలు గతి లోలవిలోచన! యేమి సెప్పుదున్ |ఉ| [79]

ఎంతకు లేఁడు నారదమునీంద్రుఁడు; శౌరి వినంగ, రుక్మిణీ
కాంత వినంగ, నేను వినఁగాఁ, బలికెం "బతిఁ గూర్చుదాన నా
యంతటి వారు లేరని యహంకృతి నెప్పుడు విఱ్ఱ వీఁగుచున్
వంతున వచ్చు సత్య గరువంబిఁకఁ జెల్ల" దటంచు మానినీ! |ఉ| [80]

ఆ రణభోజను మతకము,
లా రుక్మిణి నటన, లా మురాంతకు చెయ్వుల్
చేరి కనుంగొనుచో నె
వ్వారికిఁ గోపంబు రాదు! వారిజనేత్రా! |క| [81]

సత్యభామ యాగ్రహోదగ్రత

అనవిని వ్రేటు వడ్డ యురగాంగనయుం బలె, నేయి వోయ భ
గ్గున దరి కొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి, హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కులఁ గుంకుమ పత్ర భంగ సం
జనిత నవీన కాంతి వెదచల్లఁగ గద్గద ఖిన్న కంఠియై |చ| [82]

ఏమేమీ! కలహాశనుం డచటికై యేతెంచి యిట్లాడెనా!
యామాట ల్చెవియొగ్గి తా వినియెనా యాగోపికావల్లభుం
డేమే మాడెను రుక్మిణీ సతియు? నీ వింకేటికిన్ దాఁచెదే!
నీ మోమోటలు మాని నీరజముఖీ! నిక్కం బెఱింగింపవే! |శా| [83]

అతుల మహానుభావ మని యవ్విరిఁ దానొక పెద్ద సేసి య
చ్యుతునకు నిచ్చకంబొదవ సూడిద యిచ్చిన నిచ్చెఁగాక తా,
నతఁడు ప్రియంబు గల్గునెడ కర్పణ సేసినఁ జేసెఁగాక, యా
మతకరి వేలుపుం దపసి మమ్ముఁ దలంపఁగ నేల యచ్చటన్? |చ| [84]

పలు దెఱఁగు ముళ్ళ మాటలు
కలహమె కల్యాణ మని జగంబుల వెంటన్
మెలఁగెడు మౌనికి సహజము;
వలదని వారింపవలదె వల్లభుఁ డతనిన్? |క| [85]

ముని యేమి సేయు! రుక్మిణిఙ్
గొనఁ గారణ మేమి! ధూర్త గోపాలుఁడు సే
సిన చెయిద మేమి చెప్పుదు!
మన మెరియదె! ప్రాణమైన మగఁడిట్లయినన్ |క| [86]

పరికింపరు తమజాడలు,
తరుణుల తగులములు నమ్మఁ దగ దండ్రు మదిన్
శర దంబుద చలచిత్తులు
పురుషులె పో; వారి నమ్మఁ బోలునె! చెలియా! |క| [87]

ఇన్ని దినంబులున్ సవతు లిందఱలోఁ గడు గారవంబునం
గన్నియ! నన్ను వల్లభుఁడు కన్నులఁ గప్పుకొనంగ నుండి యా
వన్నెయు వాసియుం దొలఁగి వారు ననుం దల లెత్తి చూడఁగా
సన్నలఁ జాయలం బలుక సైఁతునె! ప్రాణము లెంత తీపొకో! |ఉ| [88]

నామొగ మోటకై వలసి నాటకముల్ ఘటియించి, రుక్మిణీ
కామిని మీఁదటం గలుగు గౌరవముం గృపయుం బ్రియంబుఁ దా
నేమియుఁ గాననీక, యిట నిన్ని దినంబులు నన్నుఁ దేల్చెనో
తామరసాక్షి! మెచ్చవలదా! మురదానవ భేది కృత్యముల్ |ఉ| [89]

ఓ చెలి! శౌరి కిచ్చెనఁట యొక్కలతాంతముఁ దెచ్చి నారదుం
డా చపలాక్షి కిచ్చెనఁట యాతఁడు నవ్విరి, యిట్టిమాట లా
హా! చెవుల న్వినఁబడియుఁ బ్రాణము దాల్చెద మేన; నింతగా
నోఁచితి, నింక నెట్టివి కనుంగొన నెమ్మెయి నున్న దాననో! |ఉ| [90]

పూనుకొని మేలు గీళ్ళకు
లోనయి విహరించువారి లోక మెఱుఁగదో!
యా నరకాసుర దమనుఁడు
తా నెఱుఁగఁడొ! భోజకన్య తా నెఱుఁగదొకో! |క| [91]

ఆ సరసీరుహాక్షి నిలయంబునఁ బంకజనాభుఁ డుండుటం
జేసి యొసంగెఁబో! చనవు సేకొని యొక్క లతాంత, మింతలో
వాసియు వన్నెయుం దగవు వైభవముం జలము న్వివేకమున్
బో సవతు ల్భజించుటకుఁబో వెఱఁగయ్యెడు, నేమి సెప్పుదున్! |ఉ| [92]

కలకాల మొక్కగతిఁ బూ
సలలో దారంబు మాడ్కి సతి మదిలోనన్
మెలఁగెడు పురుషుఁడు గలుగుట
తొలుజన్మము నోముఫలము తోయజనేత్రా! |క| [93]

కలలోన నైన నవ్వుల కైన నామాట
జవదాఁట వెఱచు నో చంద్రవదన!
యేపదార్థంబు నాయెదుటఁ బెట్టక మున్న
యెవ్వారి కొసఁగఁడో యిగురుఁబోఁడి!
చెలులు నాతో నేమి చెప్పుదురో యని
లంచంబు లిచ్చు నో చంచలాక్షి!
తోడిచేడియలు నాతోడి వంతులకు రా
సయిరింపఁ జాలఁడో సన్నుతాంగి! |సీ|

యరమరలు లేని కూరిమి ననఁగి పెనఁగి
కొదలు తీఱని కోర్కులఁ గూడి మాడి
కపట మెఱుఁగని మమతలఁ గలసి మెలసి
యున్న విభుఁడిట్లు సేయునే యో లతాంగి! |తే| [94]

కృత కాద్రి కందరా కేళీ నిగూహన
వేళా పరస్పరా న్వేషణములు,
పోషిత మాధవీ పున్నాగ పరిణయో
త్సవ కల్పి తానేక సంభ్రమములు,
చాతురీ నిర్జిత ద్యూత పణాదాన
కలిత చేలంచలా కర్షణములు,
సాయం సమారంభ చక్రవాక ద్వంద్వ
విర హావలోకన విభ్రమములు, |సీ|

సాంద్రతర చంద్రికా కేశి చంక్రమములు,
విధు శిలామయ వేదికా విశ్రమములు,
ఫలక చిత్రిత నిజరూప భావనములు,
మఱచెనో కాక! రుక్మిణి మాయఁ దగిలి |తే| [95]

పతి ప్రాణ సదృశ బంధువు,
పతి దైవం, బేడుగడయుఁ బతి సతులకు, న
ప్పతియె కడు మేర తప్పిన
గతి కులకాంతలకు వేఱు గలదే చెపుమా! |క| [96]

ధనమిచ్చి పుచ్చుకొన్నను
మనమున నోర్వంగ వచ్చు; మగఁ డింతులకున్
జన విచ్చి పుచ్చుకొన్నను
మన వచ్చునె? యింక నేటి మాటలు చెలియా! |క| [97]

సత్య కోప గృహ ప్రవేశము

అని వగల మిగులఁ బొగులుచు
జని తామర్షమునఁ గోప సదనంబునకున్
జనియెను లతాంగి హరిచం
దన కోటరమునకు నాగ తరుణియుఁ బోలెన్ |క| [98]

మాసిన చీర కట్టుకొని మౌనము తోడ నిరస్త భూషయై
వాసెన కట్టు కట్టి నిడువాలిక కస్తురి పట్టు పెట్టి లో
గాసిలి చీఁకటింటికడఁ గంకటి పై జలదాంత చంద్ర రే
ఖా సదృశాంగియై పొరలె గాఢ మనోజ విషాద వేదనన్ |ఉ| [99]

బిసరుహ పత్ర లోచనకుఁ బెల్లగు మోహము సంఘటిల్లె, వె
క్కసమగు నెవ్వగ ల్వొడమెఁ, గంపము పుట్టెఁ, జెమర్చె మేను, మా
నసమున విన్నఁబాటొదవె, నాటెఁ గడుం బరితాపవేదనల్,
మసకపుఁ బాము కాటు గతి మచ్చరమ న్విస మగ్గలింపఁగన్ |చ| [100]

వెడ వెడ కన్ను మూయుఁ, గను విచ్చు, నగుం, దలయూఁచుఁ, బాన్పు పైఁ
బడు, నుసురంచు లేచుఁ, దడఁబాటును దత్తఱముం జలంబు లో
నడరఁగఁ గోపవేగమున నగ్గలమైన మనోజుబాధలం
బడి మద హస్తి హస్తగత పద్మినియుం బలె సొంపు పెంపగన్ (పెంపఱన్) |చ| [101]

ఈ పగిదిన్ సాత్రాజితి
కోపోద్వేగమున వగల కుందుచు ఘన సం
తాపంబు పేర్మి నితర
వ్యాపారము మాని యుండె హరియును యటచన్ |క| [102]

శ్రీ కృష్ణుఁడు సత్య సౌధమున కరుగుట

ముని నాకిచ్చిన పూవు చందమును నే మున్నాడి యా భోజ నం
దనకర్పించిన జాడయున్ దెలియ చెంతన్నిల్చి వీక్షించి పో
యిన సాత్రాజితి బోటి నా వలన తా నేమేమి కల్పించెనో
యని ప్రద్యుమ్నుని మౌని దండ నిడి చింతాయత్త చిత్తంబుతోన్ |మ| [103]

అరదము నెక్కి కేతన పటాంచల చంచల మైన తాల్మితోన్
తురగ జవంబు ముంగడవ త్రోచి కడంగెడు తత్తరంబుతోన్
తిరిగెడు బండి కండ్ల పగిదిన్ భ్రమియించు మనంబు తోడ శ్రీ
హరి సనుదెంచె సత్య సముదంచిత కాంచన సౌధ వీధికిన్ [104]

వచ్చి యరదంబు డిగ్గి తద్ద్వార సీమ
దారకుని నియమించి __ తాన యొకడు
కమలనాభుండు కక్ష్యాంతరములు కడచి
యలబలము లేని నగరెల్ల యరసి చూచి |తే| [105]

కనక పంజర శారికలకుఁ జక్కెర వెట్టి
చదివింప రేలకో సకియ లిపుడు!
కరతాళ గతుల మందిర మయూరంబుల
నాడింప రేలకో యతివ లిపుడు!
క్రొవ్వాఁడి గోళ్ళఁ దంత్రులు మీటి వీణియ
ల్వలికింప రేలకో భామ లిపుడు!
కలికి రాయంచ బోదల నల్ల నెలయించి
నడిపింప రేలకో పడఁతు లిపుడు! |సీ|

ఇన్ని దినముల వలె నుండ దేమి నేఁడు!
చిన్నవోయిన దీ మేడ చెన్ను తఱిఁగి;
పద్మ ముఖి తోడ నెవ్వరేఁ బారిజాత
పుష్ప వృత్తాంత మెఱిగింపఁ బోలు నొక్కొ! |తే| [106]

అని యనుమానించుచు నొ
య్యన కోప గృహంబు జేరి యా సాత్రాజిత్
తనయ ముసుంగిడి యుండగ
అనువు మెరయ జొచ్చి మాయ యచ్చు పడంగన్ |క| [107]

కొందర మంతనంబులను కొందర జంకెన వాడి చూపులన్
కొందర చేతి సన్నల దగుల్బడ జేయుచు మీర బోయి మ
ధ్యందిన భాను మండల కరావళి హావళి వాడి యున్న తీ
గందలపించు నమ్ముగువ కన్గొని యెంతయు విస్మితాత్ముడై |ఉ| [108]

శ్రీ కృష్ణుఁడు సత్యభామ ననునయించుట

ఈ లలితాంగి చంద మొక యించుక జూచెద నంచు ధూర్త గో
పాలుడు తాలవృంత __ భామిని సత్య పిరుంద నుండి మం
దాలస లీలమై విసరె నాదట గైకొని వీచె తద్వపుః
కీలిత పంచశాయక శిఖిన్ దరి కొట్టుచు నున్న కైవడిన్ |ఉ| [109]

అంతట పారిజాత కుసుమాగత నూతన దివ్య వాసనల్
వింతలు సేయ తావి యిది విస్మయమంచు ముసుంగు త్రోచి య
క్కాంత గృహంబు నల్గడలు కన్గొని సంభృత తాలవృంతునిన్
కాంతుని జూచి బాష్ప కణికా తరళీకృత లోచనాంతయై |ఉ| [110]

తలవంచి మగుడ ముసిగిడి
కొలకుల డిగజార జాలుకొను బాష్పంబుల్
పలుచని చెక్కుల లవలీ
దళ పతిత మరంద బిందు తతి పురుడింపన్ |క| [111]

ఓర్పొకయింత లేని విక చోత్పల లోచన చిత్త వీథిఁ జ
ల్లార్పఁగ నీల నీరద శుభాంగుఁడు వే చనుదెంచె నంచుఁ గం
దర్ప హుతాశను న్వెలికిఁ దార్చు సఖుండును బోలె వేఁడి ని
ట్టూర్పు దళంబుగా నిగిడె నున్నమి తావర ణాంశు కాంతమై |ఉ| [112]

వనిత కుచద్వయంబు పయి వ్రాసిన కుంకుమ పత్ర భంగముల్
జనిత నితాంత ఘర్మ కణజాలముచేతఁ గరంగి మెల్ల మె
ల్లన వెలిపట్టు పయ్యెద కెలంకుల జాఱుట యొప్పె మానసం
బున నెలకొన్న క్రోధరసము న్వడవెట్టుచు నున్న కైవడిన్ |చ| [113]

మానవతి ఇట్లు మానని
మాన క్రోధములచే కుమారిలి చింతా
ధీన గతి నుండ మదిలో
నూనిన ప్రేమమున నంబుజోదరుడనియెన్ |క| [114]

ఇందునిభాస్య మైతొడవులేల ధరింపవు నున్న కావులీ
వెందును మాన లేవు తెలుపేటికి కట్టితి వీటికా రుచుల్
కెందలిరాకు మోవి తులకింపగ జేయక నున్కి యేమి నీ
చందము వింత యయ్యెడు నిజంబుగ నాకు నెఱుంగ జెప్పుమా |ఉ| [115]

మనమరయన్ దలంచి యొక మార్గము పన్నితొ నవ్వులాటకున్
నను వెరపించెదో యకట నా యెడ నిక్కము తప్పు గల్గెనో
వనజ దళాయతాక్షి పగ వాడనె నన్నిటు యేల జూడ వొ
క్క నిమిషమైన నీవు దయ కన్గొన కుండిన నిల్వ నేర్తునే |చ| [116]

పలుకులఁ దేనె లుట్టిపడఁ బల్కవు నేఁ డిదియేమి? వాలుఁ గ
న్నుల నునుసిగ్గు నూల్కొనఁ గనుంగొన వేల? యురః స్థలంబుఁ జ
న్నుల నెదురొత్తి మక్కువ ననుం బిగికౌఁగిటఁ జేర్ప వేటికే?
చిలకల కొల్కి! యెవ్వ రెడ సేసిరి? నీకిటు లేల చింతిలన్ |చ| [117]

మనమున మాటలం గ్రియల మన్నన లీ నొకనాఁదు నెట్టి కా
మినులకు, గారవంబు మెఱమెచ్చులకై పచరింతుఁ గాని, పా
యని యనురక్తి నీ యెడనె యగ్గలమై కను పట్టు నాకు నీ
పనిచిన పంపు చేయుటయ ప్రాభవమౌటది నీవెరుంగవే ? |చ| [118]

పడతీ నీ మధురాధరామృతము నీ బహా పరీరంభమున్
పడయన్ ధన్యుడ కాక యుండిన ననున్ పాటించి యొక్కింత నీ
నిడువాలున్ కడ కంట చూడుమనుచున్ నిల్వోపమిన్ పైచెరం
గొడియన్ చేవిరి దమ్మి వేయుటకునై యుంకించి జంకించినన్ |మ| [119]

పాటల గంధి చిత్తమున పాటిలు కోప భరంబు దీర్ప నె
ప్పాటును పాటు గామి మృదు పల్లవ కోమల తత్పద ద్వయీ
పాటల కాంతి మౌళి మణి పంక్తికి వన్నియ వెట్టఁ నా జగ
న్నాటక సూత్ర ధారి యదు నందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్ |ఉ| [120]

సత్య తనకు మ్రొక్కెడు పతి శిరమును
బాదమునఁ దొలఁగఁ ద్రోయుట

జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి సిరమచ్చో వామ పాదంబునన్
తొలగన్ ద్రోచె లతాంగి ! యట్ల యగు నాధుల్ నేరముల్ సేయ పే
రలుకన్ జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే? |మ| [121]

కోపన పద హతి కుహనా
గోపాలుడు కాంచి మెయి గగుర్పొడవగ ను
ద్దీపిత మన్మధ రాజ్య
ప్రాపితుడై పలికె కూర్మి బయట పడంగన్ |క| [122]

రసికావతంసుఁడగు శ్రీ కృష్ణుని లాలనము

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్క బూని తా
చిన యది నాకు మన్ననయ ! చెల్వగు నీ పద పల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
నని యెద నల్క మానవు గదా యికనైన నరాళ కుంతలా! |చ| [123]

అన విని మానినీ తిలక మప్పుడు మెయ్యర తోప నిక్కి వీ
డిన కచ పంక్తి పల్మరు ముడిన్ పెడ త్రోపుచు పై చెరంగు గ్ర
క్కన చను దోయి చేర్చుచు మొగంబున లేఁజెమటంకురింప జం
కెన నెఱ జూపు జూచి పలికెం జలితాధర పల్లవాగ్రయై |చ| [124]

కోప వివశయై సత్య శ్రీ కృష్ణుని బరుషోక్తులాడుట

ఈ నయగారపున్ బ్రియములీ పస లీ మెర మెచ్చు మాటలే
లా నిను నమ్మి యుండిన ఫలంబిదె తోడన నాకు గల్గె నీ
యాన జుమా ననుంజెనకి యారడి బెట్టిన నవ్వు వారలన్
గానవెరుంగునే పసుల కాపరి భావజ మర్మ కర్మముల్? |ఉ| [125]

ఇంకిటు నిన్ను నమ్మ నను యేమిటికిన్ కెరలించెదెంతయున్
పొంకము కాని ఈ వలని బొంకులు మా చవి గావు రుక్మిణీ
పంకజ పత్ర నేత్రకవి ప్రాణ పదంబులు గాని వల్లకీ
కింకర చాలుజాలు యుడికింపకు నింపకు లేని కూరుముల్ |ఉ| [126]

గట్టివ చేతలున్ పసలు కల్ల తనంబులు నీవు పుట్టగా
పుట్టినవెందు లేని పలు పోకల మాయలు నీకు వెన్నతో
పెట్టినవౌ టెరింగియును బేల తనంబున నిన్ను నమ్మి నా
గుట్టును తేజమున్ మిగుల కోల్పడి పోయితినేమి జేయుదున్ |ఉ| [127]

మునిపతి వచ్చి పూవొసగి మోదము తోడ భవత్ప్రియాంగనన్
వినుతి యొనర్పగా వినిన వీనులు మా చవిగాని మాటలన్
విన వలసెంగదా యిపుడు నీవిట వచ్చుట పారిజాత వా
సన ప్రకటించి నాకు నెకసక్కెము చేయన కాదె జెప్పుమా? |చ| [128]

మానంబె తొడవు సతులకు
మానమె ప్రాణాధికంబు మానమఖిల స
మ్మానములకు మూలంబగు
మాన రహితమైన బ్రతుకు మానిని కేలా? |క| [129]

తనదు కోడండ్రలోనఁ బెద్దయుఁగ నన్ను
దేవకీ దేవి మన్నించు; నీవు నాకుఁ
జనవు లిచ్చుటఁజేసి; యా సాధ్వి సేవ
సేయఁ బోవంగ నా కింక సిగ్గు కాదె! |తే| [130]

ఉవిద యెవ్వతె నోఁచి యున్నదో! యీ శమం
తక రత్న మింక నౌఁదల ధరింప?
నీ రైవతక శైల చారు కూట విటంక
కేళి కిం కెవ్వతె పాలుపడునొ?
యెవ్వతె కబ్బునో! యీ వసంతారామ
కర్పూర కదళి కాగార వసతి?
లీల నీ మణి సౌధ జాలకంబుల నిన్నుఁ
గూడి యెవ్వతె వార్ధిఁ జూడఁ గలదొ? |సీ|

యకట! నేఁ బెంపఁ బెరిఁగిన శుక మయూర
శారికా బృంద మెవ్వతెఁ జేరునొక్కొ!
నన్ను నాతోడి సవతులు నగక మున్న
పంత మలరంగ నిన్ను మెప్పింతుఁ గాన |తే| [131]

నను యెవ్వెత గాఁ జూచితి
వని యంతర్బాష్ప యగుచు యవనత ముఖియై
ఘనతర గద్గదికా ని
స్వనమున మరి మాటలాడ శక్యము కామిన్ |క| [132]

సత్య విలాప మోహనత

ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోక దవానలంబుచేఁ
గాసిలి యేడ్చె ప్రాణ విభు కట్టెదుటన్ లలితాంగి పంకజ
శ్రీ సఖమైన మోము పయి చేల చెరంగిడి బాలపల్లవ
గ్రాస కషాయ కంఠ కల కంఠ వధూ కల కాకలీ ధ్వనిన్ |ఉ| [133]

ఆ రమణీ లలామ మదినంటిన కోపభరంబు నిల్పగా
నేరక నెవ్వగన్ బొగుల నీరజ నాభుడు నిండు కౌగిటన్
జేరిచి బుజ్జగించి నును జెక్కుల జాలుకొనంగ జారు క
న్నీరు కరంబునన్ దుడిచి నెయ్యము తియ్యము దోప యిట్లనెన్ |ఉ| [134]

పారిజాత వృక్షమునే తెచ్చియిచ్చెదనని
కృసత్య విలాప మోహనతష్ణుని ప్రతిన

ఓలలితేంద్రనీల శక లోపమ కైశిక! యింత వంత నీ
కేల లతాంతమాత్రమున కేఁ గలుగ న్విను: నీకు దేవతా
కేళి వనంబు సొచ్చి, యనికి న్బలసూదనుఁడెత్తి వచ్చినన్
డీలు పడంగఁ దోలి, యిటఁ దెచ్చెద నిచ్చెదఁ బారిజాతమున్ |ఉ| [135]

వామలోచన నీ కేలి వనములోన
చలువ వెదజల్లు చెంగల్వ కొలని కెలన
సరస కర్పూర కదళికా తరుల నడుమ
పెరటి జెట్టుగ నాటింతు పెంపు గనుమ |తే| [136]

సత్య యూరడిల్లుట

అని పలుకు నంబుదశ్యా
ముని గర్జిత మధుర వాక్యముల సత్యమా
నిని నీప లతిక వోలెం
గనుపట్టె సఖీ మయూరికలు సెలరేఁగన్ |క| [137]

ఆశ్వాసాంతము

దమయా నాక్షివిలోక! లోక హితకృత్ప్రారంభ! రంభా కుచ
ద్వయ దుర్గాధిపతి ద్విష తృఠిత గాథా వ్యక్త దోస్సార! సా
రయశ స్సాంద్ర దిశాంత! శాంత హృదయారజ్యన్న యాచార; చా
రయుతోపాయ విచార! చారణ గణ ప్రస్తూయమానోదయా! |మ| [138]

ప్రతివర్ష వసంతోత్సవ
కుతు కాగత సుకవి నికర గుంభిత కావ్య
స్మృతి రోమాంచ విశంకిత
చతురాంతఃపుర వధూ ప్రసాదన రసికా! |క| [139]

ప్రసృతి విలోచనా కుసుమబాణ! దిశా లలనా
ఘుసృణ పటీర లేపకృతి కోవిద! బాహుతటీ
విసృమర కీర్తిజాల! రణ వీక్షిత వైరినృప
త్యసృ గతిపంకి లాసిముఖ! యైందవ {యాదవ} వంశ మణీ! |నర్కుటము| [140]

గద్యము

ఇది శ్రీమదుమామహేశ్వర వర ప్రసాద లబ్ధ సార సారస్వతాభినంది నంది సింగయామాత్య పుత్త్ర కౌశిక గోత్ర పవిత్ర సుజన విధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన పారిజాతాపహరణంబను మహా ప్రబంధమునందుఁ బ్రథమాశ్వాసము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి