Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

20, నవంబర్ 2014, గురువారం

తెలుగు కవులు - మహీధర రామమోహనరావు



వికీపీడియా నుండి
కొల్లాయిగట్టితేనేమి?
Maheedhara ramamohanarao novel cover page kollayi kattitenemi 001.jpg
కొల్లాయిగట్టితేనేమి? పుస్తక ముఖచిత్రం
కృతికర్త: మహీధర రామమోహనరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): తెలుగుప్రాంతంలో జాతీయోద్యమం
ప్రచురణ: నవోదయ, కారల్ మార్క్ రోడ్, విజయవాడ
విడుదల: 1965
పేజీలు: 364

"కొల్లాయిగట్టితేనేమి ?" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల. రచయిత మహీధర రామమోహనరావు. ముద్రణ కాలం 1964 అయినా ఇతివృత్తం మాత్రం 1920 నుండి రెండు మూడేళ్ళలో భారత దేశంలో జరిగిన మార్పుల అనుసరణతో రాసాడు రచయిత. 1920 మరియు 1945 మధ్య కాలం చాలా ప్రాముఖ్యత కలిగినది. క్విట్ ఇండియా, సత్యాగ్రహ ఉద్యమాలు, కందుకూరి వీరేశలింగం వంటి వారి వలన ఆంధ్రదేశంలో మారుతున్న పరిస్థితుల ప్రభావాలను, తెలుగు ప్రాంతంలో జాతీయోద్యమ చరిత్రను శాస్త్రీయమైన అవగాహనతో, అన్ని వైపుల నుంచీ అధ్యయనం చేసి వ్రాసిన రచన.

కథ,పాత్రలు

కథ దాదాపుగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోనూ, ఎక్కువగా కోనసీమలోని ముంగండ (పి.గన్నవరం మండలంలోని) ప్రాంతాన్ని వేదికగా చేసుకొని సాగుతుంది. శంకరశాస్త్రి అనే ఒక బ్రాహ్మణకుటుంబంలోని కథానాయకుడి ద్వారా అప్పటి కాలంలో కల అనేక దురాచారాలను, సాంఘిక అసమానతలను కథలో చూపారు.

పాత్రలు

  • రామనాథం (కథానాయకుడు)
  • శంకరశాస్త్రి (కథానాయకుడి తండ్రి)
  • స్వరాజ్యం

ఇతర విశేషాలు

  • ఈ నవల ప్రధమ విశేషం ఏమంటే ఈ రచన చేసి కొల్లాయిగట్టితేనేమి అని పేరుపెట్టిన ఆరు నెలల తరువాత గాంధీజీ కొల్లాయి కట్టటం ఆరంభించడం.(రచయిత వాఖ్యలో)
  • ఈ రచన లోని పాత్రలే రచయిత తరువాతి నవలలైన దేశం కోసం, జ్వాలాతోరణం లలో కొనసాగుతాయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి