Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

19, నవంబర్ 2014, బుధవారం

తెలుగు కవులు - మాడపాటి హనుమంతరావు



వికీపీడియా నుండి
మాడపాటి హనుమంతరావు
Madapati Hanumantha Rao.jpg
మాడపాటి హనుమంతరావు చిత్రపటం
జననం మాడపాటి హనుమంతరావు
జనవరి 22, 1885
కృష్ణ జిల్లా నందిగామ
మరణం నవంబరు 11, 1970
వృత్తి రాష్ట్ర విధాన పరిషత్ మొదటి అధ్యక్షులు
సుపరిచితుడు కవి, రచయిత
మతం హిందూమతం
భార్య / భర్త అన్నపూర్ణమ్మ
మాణిక్యమ్మ
పిల్లలు లక్ష్మిబాయి
సుకుమార్
Notes
ఆంధ్ర పితామహునిగా పేరుగాంచారు.
ఆంధ్ర పితామహునిగా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత.

వ్యక్తిగత జీవితం

వీరు 1885 జనవరి 22 (తారణ సంవత్సర మాఖ శుద్ధ షష్ఠి) న కృష్ణ జిల్లా నందిగామ తాలూకా పొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఆరువేల నియోగి బ్రాహ్మణులు. ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవాడు. 1904 లో మాడపాటి వారికి తమ చిన మేన మామ గారి కుమార్తె అన్నపూర్ణమ్మతో వివాహమైంది. వీరిరువురికి లక్ష్మిబాయి అనే కుమార్తె జన్మించింది. దురదృష్ట వశాత్తూ అన్నపూర్ణమ్మ అకాలమరణం చెందారు. తదనంతరం, 1918 లో గొల్లమూడి హనుమంతరావు కుమార్తె మాణిక్యమ్మను వివాహమాడారు. మాడపాటివారికి, మాణిక్యమ్మకు సుకుమార్ జన్మించాడు. 1964 లో సుకుమార్ కు సుచేతతో వివాహమైంది. సుచేత, వరంగల్ వాస్తవ్యులు ఎర్ర జగన్మోహన్ రావు, పద్మావతిల పెద్ద కుమార్తె. దురదృష్టవశాత్తూ సుకుమార్ అకాలమరణం చెందారు. శ్రీమతి సుచేత మాత్రం మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలకు తమ సేవలను అర్పితం చేసారు.[1]

రచనారంగం

మాడపాటివారు గొప్ప కవి, రచయిత. మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధి ప్రేరణం అనే కథలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తక రూపం దాల్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'. మాడపాటి హనుమంతరావు గారు బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త. తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకముగా ప్రజలను మేల్కొలిపి సంఘటితం చేసి ఆంధ్ర మహాసభను నెలకొల్పాడు. హైదరాబాదు నగర తొలి మేయర్. అంతే కాదు, మన రాష్ట్ర్ర విధాన పరిషత్ కు మొదటి అధ్యక్షులు వీరే కావడం, ఆయన రాజకీయ దక్షతకు నిదర్శనం. భారతదేశములో ప్రప్రథమ బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు.
రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి?’ రచించిన మాడపాటి హనుమంతరావు జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన తన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. కృష్ణాజిల్లా ఒక్కనూరు గ్రామం లో 1885, జనవరి 22న జన్మించిన మాడపాటి ఆంధ్రమహాసభ నేతృత్వంలో సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాడపాటి గ్రంథాలయోద్యమంలో నిర్వహిం చిన భూమిక ఎన్నదగినది.
పాత్రికేయునిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. బాలికల కోసం ఆయన ఎన్నో పాఠశాలలను నెలకొల్పారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో ప్రసిద్ధ పాఠశాల మనుగడలో ఉంది. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాల యం మాడపాటి చల్లని నీడన ఎదిగినవే. 1951లో ఆయన హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1958లో శాసనమండలి తొలి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. మాడపాటి 1970, నవంబర్ 11న 85వ ఏట కన్నుమూశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో, భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ బిరుదుతో గౌరవించాయి. ‘ఆంధ్ర పితామహ’గా ఖ్యాతినొందిన మాడపాటి తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు.

మూలాలు

  1. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు (జీవిత చరిత్ర) - డి.రామలింగం (1985) ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు శతజయంతి ఉత్సవ కమిటీ.


1 కామెంట్‌: