Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
సుమతీ శతకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సుమతీ శతకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2014, మంగళవారం

సుమతీ శతకం - 108

స్త్రీ ల్యెడ వాదులాడకు
బాలురతోఁ జెలిమి చేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయు కెన్నడు సుమతీ. 

భావం:-
ఎన్నడును స్త్రీలతో వివాదము లాడకుము, బాలుర స్నేహము చేసి మాటలాడకుము,మంచి గుణములు వదలకుము.పాలించు యజమానుని దూషింపకుము. 

6, జనవరి 2014, సోమవారం

సుమతీ శతకం - 107

సిరిదా వచ్చిన వచ్చును
సలిలతముగ నారికేళ సలిలము భంగిన్
సిరిదాఁబోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు కరిణిని సుమతీ. 

భావం:-
సంపద కలుగునపుడు కొబ్బరికాయలోనికి నీరువచ్చు విధముగానే రమ్యముగా కలుగును.సంపదపోవునపుడు ఏనుగు మ్రింగిన వెలగ పండులోని గుజ్జు మాయమగు విధముగానే మాయమయిపోవును. 

5, జనవరి 2014, ఆదివారం

సుమతీ శతకం - 106

సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లదిక భాదల కొరహే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొఱకే తథ్యము సుమతీ. 

భావం:-
హాస్యము లాడుట విరోధ ము గల్గుటకు,మిక్కిలి సౌఖ్యములనుభవించుట పెక్కు కష్టముల నొందుటకుతిన్నగా పెరుగుట విరుగుట కొఱకు, ధర తగ్గుట యధికమగుటకు-నిజమగు కారణము లగును. 

4, జనవరి 2014, శనివారం

సుమతీ శతకం - 105

శుభముల నొందని చదువును,
నభినయమును రాగరసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి,
సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ. 

భావం:-
మంగళములు పొందని విద్యయును.అభినయము రాగరసములులేని పాటయును, సందడులులేని రతియును,సభయందు మెచ్చని మాటలును ఇవన్నియును సారము లేనివి. 

3, జనవరి 2014, శుక్రవారం

సుమతీ శతకం - 104

వేసరపు జాతి గానీ
వీసముఁదా చేయనట్టి వ్యర్థుడు గానీ
దాడి కొడుకైన గానీ
కాసులు గలవాఁడె రాజు గదరా సుమతీ. 

భావం:-
నీచజాతివడైనను,కొంచమైనను చేయజాలమని నిష్ప్రయోజకుడైనను,దాసీపుత్రుడైనను-ధనముగలవాడే యధిపతి. 

2, జనవరి 2014, గురువారం

సుమతీ శతకం - 103

వెలయాలు సేయు బానలు
వెలయఁగ నగసాలి పొందు,వెలముల చెలిమిన్,
గలలోనఁ గన్న కలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ. 

భావం:-
వేశ్యా ప్రమాణములును,విశ్వ బ్రాహ్మణుని స్నేహమును,వెలమదొరల జతయు,కలలో చూచిన సంపదయు స్పష్టముగా నమ్మరాదు. 

1, జనవరి 2014, బుధవారం

సుమతీ శతకం - 102

వెలయాలి వలనిఁ గూరిమి
గలుఁగదు మఱీఁ గలిఁగెనేనిఁ కడతేరదుగాఁ
బలువురు నడచెడు తెరవునఁ
బులు మొలవదు మొలచెనేనిఁబొద్లదు సుమతీ. 

భావం:-
నలుగురూ నడిచేదారిలో గడ్డి మొలవనే మొలవదు.ఒకవేళ మొలిచినా అది సమృద్దిని చెందదు.అలాగుననే వేశ్య ప్రేమించదు.ప్రేమించినా అది చివరి దాకా నిలువదు.

31, డిసెంబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 101

వీడెము చేయని నోరును
నాడియు మఱి లేదటంచు నాడెడి నోరున్
బాడంగరాని నోరును
బూడిద కిరువైన పాడు,బొందర,సుమతీ.

భావం:-
తాంబూలము వేసికొనినట్టియు,చెప్పిన మాటనే మరలా,లేదని పల్కునట్టియు,పాటపాడుట తెలియనట్టిదియు. అగునోరు, బూడిదమన్ను పోయునట్టి గుంటతో సమానము. 

30, డిసెంబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 100

వినదగు నెవ్వరు చెప్పిన
వివ్నినంతనె వేగపడక వివరింపఁదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుఁజుడెపో నీథిపరుడు మహిలో సుమతీ. 

భావం:-
ఎవ్వరు చెప్పిననూ వినవచ్చును.వినగానే తొందరపడక నిజమో-అబద్దమో వివరించి తెలిసికొనినవాడే న్యాయము తెలిసినవాడు. 

29, డిసెంబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 99

వరిపంటలేణి యూరును,
దొరయుండని యూరు,తోడు దొరకని తెరువున్,
ధరను బతిలేని గృహమును,
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ. 

భావం:-
వరిపంట లేని యూరును,అదికారియుండని గ్రామమును,తోడు దొరకని మార్గమును,యజమానుడులేని ఇల్లును వల్లకాడుతో సమానము. 

28, డిసెంబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 98

వఱదైన చేన్ము దున్నకు
కరువైనను బంధుజనులకేడ కేగకుమీ,
పరులకు మర్మము డెప్పకు,
పిఱిపికి దళవాయితనము బెట్టకు సుమతీ.

భావం:-
వరద వచ్చినచో పొలమున వ్యవసాయము చేయకుము కరువు వచ్చినచో చుట్టములకడ కరుగకుము,ఇతరులకు రహస్యము చెప్పకుము.భయము గలవాడికి సేనా నాయకత్వము నీయకుము.

27, డిసెంబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 97

లావుగల వానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁ డెక్కినట్లు మహిలో సుమతీ. 

భావం:-
 కొండ అంతటి ఏనుగును మావటివాడెక్కి లోబఱచు కొనునట్లే,లావుగలిగిన వాడికంటెను,నీతి గల్గినవాఁడు బలవంతుడగును.

26, డిసెంబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 96

రూపించి పలికి బొకకు,
ప్రాపగు చుట్టంబు కెగ్గు పలుకకు మదిలో
గోపించు రాజుఁ గొల్వకు
పాపపు దేశంబు సొరకు,పదిలము సుమతీ. 

భావం:-
 రూఢి చేసి మాట్లాడినతరువాత అబద్దమాడకుము.సహాయముగా నుండు బంధువులకు కీడు చేయకుము.కోపించే రాజును సేవింపకుము.పాపాత్ములుండెడి దేశమునకు వెళ్ళకుము.

25, డిసెంబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 95

'రా,పొ'మ్మని పిలువని యా
భూపాలునిఁగొల్వ భుక్తిముక్తులు గలవే?
దీపంబులేని యింటనుఁ
జే పుణికి ళ్ళాడినట్లు సిద్దము సుమతీ.

భావం:-
దీపము లేని ఇంటిలో చేతులతో యెంత తడుములాడిననూ పట్టు దొరకని యట్లే'రమ్ము పొమ్ము'అని యాదరింపని రాజును సేవించుట వలన భుక్తిముక్తులు గల్గవు. 

24, డిసెంబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 94

మేలెంచని మాలిన్యుని,
మాలను,నగసాలెవాని,మంగలిహితుగా
నేలిన నరపతి రాజ్యము
నేల గలసిపోవుగాని నెగడుదు సుమతీ. 

భావం:-
ఉపకారము తలపోయని పాపాత్ముని, మాలను,కంసాలిని,మంగలిని-వీరలను స్నేహితులుగా జేసుకొన్న రాజుయొక్క రాజ్యము నశించునేగాని వృద్ది పొందదు. 

23, డిసెంబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 93

మది నొకని వలచియుండగ,
మదిచెడి యొక కౄరత్రుగన్
బొది జిలుక పిల్లి పట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ.

భావం:-
పిల్లిని పంజరములో పెట్టిన,పంజరము మధ్యనున్న చిలుక మాట్లాడునా?అట్లే మనసునందొకని ప్రేమించిన స్త్రీ మరియొక విటుడెంత బ్రతిమాలినను ప్రేమించదు.

22, డిసెంబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 92

మానధను డాత్మదృతి చెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెఁడు జలముల లోపల
నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ.

భావం:-
అభిమానవంతుడు 
ధైర్యమును తొలగి నీచుని సేవించుట, కొంచెము నీళ్ళలో ఏనుగు శరీరమును దాచ్కొను విధముగా నుండును.

21, డిసెంబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 91

మాటకుఁ బ్రాణము సత్యము,
కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము,
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్దము సుమతీ.

భావం:-
మాటకు సత్యమును,కోటకు మంచి భటుల సమూహమును,స్త్రీకి శీలమును,ఉత్తరమునకు చేవ్రాలు(సంతకము)ను ప్రాణములై యున్నవి.

20, డిసెంబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 90

మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచుఁదరుచుగ దరలో
మంత్రివిహీనుని రాజ్యము
జంత్రపు గీ లూడినట్లుజరుగదు సుమతీ. 

 భావం:-
మంత్రి యున్న రాజుయొక్క రాజ్యము,కట్టుబాటు చెడిపోకుండా జరుగును.మంత్రిలేని రాజుయొక్క రాజ్యము కీలూడిన యంత్రము వలె నడవదు. 

19, డిసెంబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 89

మండలపతి సముఖంబున
మెండైన ప్ర్దానిలేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుఁగు
తొండము లేకుండినట్లు తోచుట సుమతీ.

భావం:-
కొండంత ఏనుగునఁకు తొండము లేనిచో ఎట్లు నిరర్దకమో,అట్లే రాజుయొక్క సముఖమున సమర్దత గల మంత్రి లేనిచో రాజ్యము నిరర్ధకము