Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
కుమారీ శతకము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కుమారీ శతకము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కుమారీ శతకం -100

దరఁ బక్కికులుఁడు వేంకట
నరసింహకవీంద్రు డిట్టి నడతలు దరపైఁ
దెఱ్వల తెరువు లటంచును
జిరతర సత్కీర్తి వెలయఁ జెప్పె గుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!ఇటువంటి సద్గుణములు భూమియందు ఆడవారికి ధర్మమార్గములనియు,శాశ్వతకీర్తిని సంపాదించి పెట్టుననియు పక్కి వేంకటనరశింహ కవీంద్రుడు చెప్పుచున్నాడు. 

5, సెప్టెంబర్ 2013, గురువారం

కుమారీ శతకం - 99

కొనగోళ్ళ వ్రేలువెండ్రుక
లను జాఱెడునీళ్ళు కుండ లన్ ముంతల వా
డిన వెన్న మిగులునీళ్ళును
జన దండ్రు దరిద్ర మొందు జగతి గుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!కొనగోళ్ళనుండి జాలువారిన నీరును,వెంట్రుక చివరలనుండి జారిపడేనీరును,కుండలలోను,ముంతలలోను,ఉపయోగింపగా మిగిలిన నీరును పనికిరావని పెద్దలు చెప్పుదురు.వాని వలన మన అదృష్టము చేజారును.శని పడుతుంది. 

4, సెప్టెంబర్ 2013, బుధవారం

కుమారీ శతకం - 98

దీపములనీడ మానవ
రూపంబులనీడ శని తరులనీడ సుఖ
ట్వాపాదిత మగు నీడ
నేపట్టున నిలువగూడ దెపుడు కుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ! దీపముల యొక్క నీడలందును,మనిషియొక్క నీడలందును,తాటి చెట్ల యొక్క నీడలందును,మంచము నీడల యందును,ఎన్నడును చరింపరాదు.ఆ నీడలు పడకుండా చూసుకొనవలెను.లేనిచో దరిద్రమబ్బును. 

3, సెప్టెంబర్ 2013, మంగళవారం

కుమారీ శతకం - 97

తుడుపుదుమారమ్మును జెరు
గుడుధూళియు మేషరజముఁ గూడ దెపుడె మైఁ
బడ నెఱిఁగి తిరుగ నేర్చిన
బడఁతుల మర్యాద లెఱిఁగి బ్రతుకు కుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ! తుడిచిన దుమ్ము,చేటదుమ్ము,మేకల దుమ్ము శరీరముపై పడరాదు.అట్లు పడినచో అది అనర్థహేతువు.ఆడువారు ఈ పద్దతులనెఱిఁగి నడుచుకోవలెను.

2, సెప్టెంబర్ 2013, సోమవారం

కుమారీ శతకం - 96

ఇద్దఱు గూడుక యొక చో
నొద్దిక మాటాడుచుండ నొదిగి యొదిగి యా
యొద్దకు జనగూడదు తన
పెద్దతనంబెల్ల నణఁగ బెట్టు గుమారీ! 

  భావం:-
ఓ కుమారీ!ఇద్దరు మాట్లాడుకొనునపుడు మద్యలో దూరి కల్పించుకొనరాదు.అట్టి స్థలమునకు బోగూడదు.వెళ్ళినచో తన గొప్పదనమెల్ల జెడిపోవును. 

1, సెప్టెంబర్ 2013, ఆదివారం

కుమారీ శతకం - 95

నేలన్ వ్రాలిన పత్రము
లోలిం జోసించి,మడచు చుండిన యవియున్
బోలఁగ సున్నపుటాకులు
దూలించు దరిద్రదశల దోఁచ గుమారీ! 

  భావం:-
ఓ చినదానా!నేలపై పడిన ఆకుల నేరుకొని ,మూడు నాలుగు ఆకులను క్రమముగ జోడించి మడతబెట్టి,సున్నము నుంచి తినునట్టి ఆకులను ,దరిద్రమనుభవించు విదమున కదులును. 

31, ఆగస్టు 2013, శనివారం

కుమారీ శతకం - 94

ఆకు లొకిన్నియు జేకొని
పోఁక నమలి సున్న మడుగఁ బోయిన గని యీ
లోకులు నవ్వుదురు సుమీ!
కైకొనవలె మంచినడత ఘనత గుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!ఆడువారు సద్గుణములనలవర్చుకొనవలెను.మంచి పద్దతులను,నడవడికలను అలవర్చుకొనాలి.ఆకు ,వక్క నములుతూ సున్నమడుగుట అజ్ఞానము.అట్టి వారిని జూచి జనులు నవ్వుదురు.(ఆకులను సున్నం రాసుకొని వక్కలను జోసించి నములుట మంచి పద్దతి)కావున స్త్రీలు మంచి పద్దతులను అవలంబించవలెను. 

30, ఆగస్టు 2013, శుక్రవారం

కుమారీ శతకం - 93

మఱవవలె గీసు నెన్నడు
మఱవంగారాదు మేలు మర్యాదలలో
దిరుగవలె సర్వజనములు
దరిఁ బ్రేమ మెలంగవలయు దరిణి కుమారీ! 

 భావం:-
ఓ సుకుమారీ!మేలునూ(మంచిని)మఱువరాదు.కీడు(చెడుని) విడవవలెను.ఆడవారందరితో మర్యాదగా నడుచుకొనవలెను.వారందరి పట్ల ప్రేమపూర్వకముగానుండవలయును. 

29, ఆగస్టు 2013, గురువారం

కుమారీ శతకం - 92

మును నాథుడు దరలినిచో
వెనువెంటనె పోయి యెల్ల వేల్పులు పొగడం
గని యెందు నిందు నందును
ఘనకీర్తుల బొందుచుండు గాదె కుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!ఒక వేళ తన మగడే ముందు మరణించినచో,దేవతలెల్లరు పొగడగా వెంటనే బోయి అతనిని కలుసుకొనును.ఇది పతివ్రతా లక్షణము,ఇటువంటి ఆడుది (పతివ్రత)భూలోకములోనూ,స్వర్గలోకములోనూ కీర్తిని బొందును.

28, ఆగస్టు 2013, బుధవారం

కుమారీ శతకం - 91

పెనిమిటికన్న బతివ్రత
మునుపే మృతి బొందెనేని బురుషాగమనం
బునకెదురుచూచు వచ్చిన
గనుగొని యనురాగ మేనయ గలయు కుమారీ! 

  భావం:-
ఓ చినదానా!పతివ్రతయైన స్త్రీ,పుణ్యస్త్రీగా మరణించును.అనగా భర్తకంటే తానే ముందు మరణించి,ఆ తరువాత తన భర్తరాకకై స్వర్గలోకమున వేచియుండి అతనిని ప్రీతితో స్వర్గలోకమునకు ఆహ్వానించును. 

27, ఆగస్టు 2013, మంగళవారం

కుమారీ శతకం - 90

ఎన్నాళ్ళు బ్రతుకఁ బోదురు
కొన్నాళ్ళకు మరణదశలఁ గ్రుంగుట జగమం
దున్నట్టివారి కందఱి
కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!చావుపుట్టుకలు సహజములని ఎఱుగుము.లోకమందలి ప్రజలందరూ ఎనాళ్ళో బ్రతకరు.పుట్టిన ప్రతిజీవి గిట్టుట తప్పదు.ఈ సత్యమునెఱిగి శాశ్వతమైన కీర్తిని బొందు సద్గుణములనలవర్చుకొని చరింపుము. 

26, ఆగస్టు 2013, సోమవారం

కుమారీ శతకం - 89

బహుకష్టములం బొందక
మహిలో సమకూడబోదు మానవజన్మం
బహహా!యీ జన్మంబున
నిహపరములఁ గొనెడుజాడ లెఱుగు కుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!ఈ మానవజన్మ సర్వోత్కృష్టమైనది.దీనికై పలుకష్టములు బడవలయును.ఎన్నో కష్టనష్టముల తరువాత గాని ఈ మానవజన్మ ప్రాప్తించదు.కావున ఇహలోక,పరలోక సౌఖ్యములను ఈ జన్మమందే బొందు మార్గమన్వేషింపుము.

25, ఆగస్టు 2013, ఆదివారం

కుమారీ శతకం - 88

మాత్సర్య మెదవు సత్యము
హృత్సరసీజమున లేమి నెల్లపుడుఁ దా
సత్సేవయందుఁ దిరిగిన
మాత్సర్య మణంగు దెలిసి మనుము కుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!సత్యగుణము లేకపోవుటచే మనస్సునందుద్వేషభావము పుట్టుతున్నది.ఎల్లపుడు మంచిగుణములయందు మసులుకున్నచో ద్వేషభావము నశించునని తెలిసుకొని జీవింపుము. 

24, ఆగస్టు 2013, శనివారం

కుమారీ శతకం - 87

కులమున విత్తంబున వి
ద్యలను మదం బుద్బవించు నాయా పెంపుల్
తలపోయ మరలు నిది హృ
జ్జలజంబునఁ దలఁపవలయు సతము గుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!కులము వల్లను,దనము వల్లను,చదువువల్లనూ గర్వము జనించును.కుల,దన,విద్యలెప్పుడునూ గర్వమును నేర్పవు.ఇది మనసునందు దెలిసికొమి మసలుకొనుము. 

23, ఆగస్టు 2013, శుక్రవారం

కుమారీ శతకం - 86

జనియించెడు నజ్ఞానం
బున మోహగుణంబు,దర్మమున బరికింపం
శునుమాడ బడును దీనిం
గనుఁగొని మెలఁగంగ వలయుఁ గాదె కుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!అజ్ఞానాందకారములో పుట్టే కామగుణము,దర్మ గుణముచే నశింపచేయబడును.ఈ సంగతి నెఱింగి మెలగవలయును.దర్మము నాచరింపుము. 

22, ఆగస్టు 2013, గురువారం

కుమారీ శతకం - 85

దృశ్యపదార్థము లెల్లను
నశ్యము లని తలపకుండి నను లోపంబౌ
శృద్యంబున నస్థిరత న
వశ్యము చిత్తమున దలప వలదె కుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!కనిపించే ప్రతీవస్తువూ నశించేదని తెలుసుకొనినచో వాని పట్ల వ్యామోహము తగ్గును.కనిపించునవి నిలకడ లేనివని (అశాశ్వతములని)మనస్సునందు తెలుసుకొనుము. 

21, ఆగస్టు 2013, బుధవారం

కుమారీ శతకం - 84

పరజనము లాచరించెడి
దురితంబునఁగ్రోదగుణము దోఁచెడి నదిక
స్పురణన్ క్షమ గైకొనినం
దఱగు నది యెఱింగి మెలఁగ దగును గుమారీ! 

  భావం:-
ఓ కుమారీ!ఇతరుల చెడ్డగుణములు కోపమును కలుగచేయును,కాని జ్ఞానమెరిగి శాంతమును అలవర్చుకొనుము.శాంతమువలన కోపము నశించును.ఇది తెలిడికొని ప్రవర్తించుము

20, ఆగస్టు 2013, మంగళవారం

కుమారీ శతకం - 83

కామము సంకల్పంబున
బామొందెడు దొలంగు దేహ భావము దెలియన్
వేమఱు నిది పరికించుట
క్షేమం బగు ముక్తి గని సు ఖింపు కుమారీ! 

 భావం:-
ఓ సుకుమారీ! తలంచినంతనే కోరికలు పుట్టుచున్నవి.దానివలన పాపము పుడుతొంది.శరీరము అశాశ్వతమని ఎఱింగి మసులుకొనుము.మంచి మోక్షము సిద్దించును.మంచిమార్గమున నడుచుకొని మోక్షమునంది సుఖింపుము. 

19, ఆగస్టు 2013, సోమవారం

కుమారీ శతకం - 82

ఈ రీతి దిరుగ నేర్చిన
నారీమణీ కీర్తిఁ బొందు నరలోకమునన్
దూఱులు తొలంగి పోవును
ఘోరదురితసంఘ మెల్ల గుందు గుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!ఈ విదముగా ఉండనేర్చునట్టి స్త్రీ ఎల్లెడల గౌరవ మర్యాదలనందు కొనును.కీర్తిని బొందును.నిందలు నాశనమగును.ఆమె పాపములన్నియు హరించును. 

18, ఆగస్టు 2013, ఆదివారం

కుమారీ శతకం - 81

శ్రమ యెంత సంభవించిన
క్షమ మఱువగ రాదు ధరణి చందంబున స
త్యమున బ్రవతించిన యా
రమణియె లోకంబునందు రమణీ కుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!స్త్రీలు భూదేవివలె ఓర్పును కలిగి ఉండాలి.ఎంత కష్టము కలిగిననూ ఓర్పు వీడరాదు.సత్యప్రవర్తన గల ఆడుది లోకమున కీర్తింపబడును.ఆమెయే అసలైన ఆడుది.