తెలుగు సామెతలు "అ" కారాది "క్ష"కారాంతం
విషయ సూచిక (సామెత కథనం క్రింద చదవండి......)
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ
ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
క ఖ గ ఘ ఙ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ శ
ష స హ ళ క్ష ఱ

సామెత
ఈ మాట వినని తెలుగు వ్యక్తి ఉండడు. మన తాత
ముత్తాతల కాలం నుంచి కూడా ఈ మాట వింటున్నాం. ఆనాటికీ, ఈనాటికీ సామెతలు ఎవరు
చెప్పినా ఆనందిస్తున్నాం. సామెతలు చెప్పేవారిని అభిమానిస్తున్నాం.
సందర్భానికి తగ్గట్లుగా సామెతలు చెప్పేవారంటే మనకు అపరిమితమైన ప్రేమ. అదొక
గొప్ప విద్యని మన భావన. అది నిజం కూడ. దానికి సమయస్ఫూర్తి ఎంతో అవసరం. అసలు
ఈ సామెతలు వారికెలా వంటవడతానన్నదే మన సందేహం. మన సందేహాన్ని నివృత్తి
చేసుకొవాలంటే వాటి గురించి తెలుసుకోవాలికదా?
సామెత అంటే ?
మన మనసులోని భావాన్ని..అది ఎంత పెద్దదైనా
ముచ్చటగా మూడు ముక్కలలో చెప్పగలిగే సామాన్య భాషా ప్రక్రియ సామెత. భావాన్ని
స్పష్టంగా మనసుకి హత్తుకొనేట్లుగాను బలంగాను చాతుర్యంగాను చెప్పాలను
కొన్నప్పుడు ఒక సామ్యాన్ని అంటే ఒక పోలికను ప్రతిపాదించి చెప్పినప్పుడు ఆ
భావం సూటిగా అర్ధమవుతుంది. అందుకే మన పెద్దలు మనకు తేలిగ్గా అర్ధమవ్వడంకోసం
సామెతల రూపంలో చెబుతుంటారు. వారి భావం అర్ధమైతే మన బ్రతుకు గాడిలో
పడినట్లేగా? అందుకే అన్నారు పెద్దల మాట చద్ది మూట అని. సామెతకు చద్ది అనే
మరో పేరు కూడ ఉంది తెలుసా?
అసలు ఈ సామెతలు ఎలా పుట్టాయి?
సామెతల పుట్టుక గురించి చెప్పడం అసాధ్యం. ఏ
సామెత ఏ సందర్భంగా పుట్టిందో కొంతవరకు చెప్పగలమెమోగానీ దాని
పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం దాదాపు సాధ్యం కాదు. సాధారణంగా ఇవి
జనసామాన్యమునుండి పుట్టుకొస్తాయి. ఆయా ప్రజల స్వీయానుభవాలు, అభిరుచులు
వాటిలో ప్రతిబింబిస్తుంటాయి. ఐతె సామెత అను పదం 15వ శతాబ్ధిలోని
వరాహపురాణంలో మొదటిసారిగా ప్రయోగించబడిందని అభిప్రాయ ఉంది. ఇవి అనేక తరాల
క్రితంవైనప్పటికీ ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి.
కొన్ని సామెతలు ఆయా జాతుల, కులాల ఆచారాల వల్ల మరియు సంప్రదాయాల వల్ల ఏర్పడ్డాయి. ఇవి వారి జీవన విధానాన్ని సూచిస్తాయి. పూటకూళ్ళమ్మకు పుణ్యంతో పని లేదు, దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు, వంటివి ఈ కోవలోకి వస్తాయి. వీటిలో చక్కని సలహా ఉంటుంది.
కొన్ని గాధలు, కొన్ని ప్రపంచ ప్రఖ్యాత కథలు అనేక సామెతలకు పుట్టినిళ్ళయ్యాయి.పంచతంత్రం, కథాసతిత్సాగరం మొదలగు గాధలను సామెతల భాండాగారాలు అనవచ్చు. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినది, రెంటికీ చెడ్డ రేవడి వంతి సామెతలు ఈ కోవలోకి వస్తాయి.
నిజానికి సామెతలు ఉపయోగించడం ఒక కళ అని చెప్పాలి. కళకి, శాస్త్రానికి చక్కని సమన్వయ రూపం సామెత. కళను శాస్త్రీయంగా వ్యక్తంచేయడం, శాస్త్రాన్ని కళాత్మకంగా ప్రకటించటం సామెత చేసేపని.మానవ జాతికి భావ వ్యక్తీరణకు భాష ఎంత అవసరమో భాషలో అంతర్భాగమైన సామెతలు కూడ అంతే అవసరం. ఎవరైనా సందర్భానుసారంగా సామెతలను ఉపయోగిస్తూ మాట్లాడుతుంటే వినేవారికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. సామెతలేని మాట-ఆమెత లేని ఇల్లు అని అందుకే అన్నారు.
మానవజీవితంలో ఎదురయ్యే ఒక సన్నివేశాన్నో, సంఘటననో, వ్యాఖ్యానించడానికో, నివారించడానికో, విమర్శించడానికో బలపరచడానికో, నిరసించడానికో, నిదర్శనంగానో దృష్టాంతంగానో, ఒక భావాన్ని కుదిరిక గల మాటలలో సూత్రీకరణ పద్దతితో వాక్యంగా విన్యసింపజేయడమే సామెత ఉద్దేశ్యం.

సామెతలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా?
సందర్భాన్నిబట్టి ఏదైనా సామెతను మన ఎదుటివాళ్ళ
మీద మనం ప్రయొగించినప్పుడు అది వాళ్ళకు కోపాన్ని తెప్పించకపోవడమే.
ఆశ్చర్యంగా ఉంది కదూ? కారణమల్లా ఒక్కటే.ఆ సామెత ద్వారా ఆ ఎదుటి వ్యక్తి తన
తప్పును చాలా తెలుసుకోగలగడమే. పైగా అందులో చమత్కారం కూడా ఉంటుంది కాబట్టి
అతను నవ్వకుండా కూడా ఉండలేడు.
సామెతను 'సామ్యోక్తి ' అన్నారు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు. సామెతకు సామిత అనే రూపాంతరంకూడా ఉంది.
సామెత అనే అర్ధంలో తెలుగువారి వ్యవహారంలో ఇంకా కొన్ని పదాలుకూడా ఉన్నాయి. అవేంటంటే .లోకోక్తి, సుభాషితం, సూక్తి, నుడికారం, నానుడి, జాతీయం. చాటువ(చాటవ, సాటవ), పలుకుబళ్ళు, శాస్త్రం, సుద్ది

జాతీయం అంటే?
ఒక జాతి ప్రజ ఒకభావాన్ని ప్రకటించడంలో వ్యక్తం
చేసే భాషాపరమైన విలక్షణత. దీన్నే పలుకుబడి అని కూడా అంటారు. "ఓరంతపొద్దు,
ఓడలు బండ్లు బండ్లోడలు, గుండెరాయి చేసుకొను, చెవిలో ఇల్లుగట్టుకొనె పోరు,
కాలికి బలపం గట్టుకొని తిరుగు, కొట్టీనపిండి, కొంపముంచు, గంగిగోవు,
కత్తులునూరు, మొదలైన పదబంధాలు జాతీయాలుగాను, నుడికారాలుగాను వ్యవహృత
మవుతాయి. ఇవే సామెతరూపాన్ని కూడా సంతరించుకొనడం జరగవచ్చు.
సామెతలు, జాతీయాలు ఒకేలా అనిపిస్తాయి. కాని చిన్న తేడా ఉంది. జాతీయాలు సామాన్యంగా చిన్నవిగా అంతే చిన్న చిన్న పదాల రూపంలో ఉంటాయి. సామెతలు పెద్దవిగా వాక్యాల రూపంలో ఉంటాయి.
కొన్ని జాతీయాలు : అకాశ రామన్న, మక్కీ కి మక్కి మొదలైనవి.
పెద్దలమాట చద్దిమూట అనే ఒక సూక్తి ఇందాక చదివాం గుర్తుందా?దీనినే సుద్ది అనవచ్చు. ఇది కూడ సామెతలాంటిదె. పెద్దల సుద్ది ప్రయాణంలో అక్కరకు వచ్చే చద్దిమూట వంటిదని దీని అర్ధం. అంటే పెద్దల సుద్దులను పాటిస్తే జీవితాన్ని సుగమంగా చేసుకోవచ్చునని తాత్పర్యం. పెద్దలు అనుభవపూర్వకంగా చేసిన హితోపదేశం పాధేయంగా పనికి వస్తుంది అని దీని భావం. ఈ సుద్దులు కూడా సామెత స్వరూపాన్ని ఆయా సందర్భానుగుణంగా సంతరించుకోవచ్చు. అంతే కాదండోయ్ సూక్తులూ సుభాషితాలూ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో సామెతల స్థానాన్ని పొందుతాయి. వేమన పద్యాల్లోని సూక్తులు సామెతలుగా చలామణి అవుతున్నాయి. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, చిత్తసుద్ధి లేని శివపూజలేల అనునవి వేమన స్వీయ సూక్తులైనప్పటికీ, ఇవి సామెతలుగానే వ్యవహరింపబడుతున్నాయి.
ఏ కవిత్వంలో సామెతలు విశేషించి ఉంటాయో ఆ కవిత్వం యెక్కువ హృద్యంగా ఉంటుంది అన్నారు చెళ్ళ పిళ్ళ వేంకటశాస్త్రిగారు
ఎదుటివారి స్వభావాన్ని మనం వారి ముఖం మీద చెప్పలేనప్పుడు నర్మ గర్భంగా విమర్శించడం జరుగుతుంది. ఇందుకు మనకు దోహదపడేవి సామెతలు. పెద్దలు అనుభవపూర్వకంగా చేసిన హితోపదేశం మనకీవిధంగా పనికి వస్తుంది అని దీని భావం. ఈ సుద్దులు కూడా సామెతల వలన మాట్లాడే భాషకు నవ్యం, పరిసుష్టి కలుగుతాయి. సామెతలు భాషకు జీవనాడివంటివి కూడా.
మన మహాఋషులు ఋషితుల్యులైన మన ప్రాచీన మహాకవులు, పండితులు. యతులు, గొప్ప జ్ఞానం కలవారు. తరతరాల సుదీర్ఘ జీవిత పరిశీలనచేసి లోకానుభవంతో మానవ ప్రవృత్తి, లోకపు తీరును గూర్చి అత్యంత ఆసక్తికరమైన విషయాలను అతిరమ్యంగా చెప్పారు. ఆ రమ్యతకు సామెతే సులువని భావించి వాటి రూపంలో వివరణ ఇచ్చారు.
చిలుకూరి నారాయణ రావు గారు లక్షకు పైగా సామెతలు సేకరించినట్లు ఆయన సమకాలికులు చెబుతారు.
సామెతలు ప్రజావాక్యాలు. ప్రజాసూక్తులు ప్రజాప్రోక్తాలు వీటిని వచించిందీ, పోషించిందీ ప్రజలు వాటి కర్తలు ఎవరో, ఎప్పుడు ఎక్కడ పుట్టాయో ఎవరికీ తెలియదు మానవునిలో మేధస్సు మేల్కొని క్రొత్తయుగానికి పునాదులువేసి బాటలు నిర్మిస్తున్నప్పటినుంచీ మొదలైందీ సామెతల స్రవంతి. ఇవి రాతకోతలకు నోచుకోలేదు యుగయుగాలుగా, తరతరాలుగా, ఒక తరం మరో తరానికి అందిస్తుంటే ప్రజల నోళ్ళలో భద్రంగా నిక్షిప్తమై సమయానుకూలంగా జలపాతంలా జాలువారి జాతినీ భాషనూ ఉత్తేజపరిచే రమణీయ వాక్యాలు ఈ సామెతలు. మన భాషా సంపద ఇది. ఒక విధంగా చెప్పాలంటే అనంతమైన భావాన్ని ముచ్చటగా మూడుముక్కల్లో చెప్పగలిగే సామాన్య ప్రజా భాషా ప్రక్రియ సామెత. నిత్య జీవితంలో తారసపడే ఎన్నో అంశాలకూ, వ్యక్తిత్వాలకు ఈ సామెతలు సంకేతాలుగా నిలిచి అద్దం పడుతుంటాయి.
అందుకే మీకోసం బోలెడన్ని సామెతలు ఇచ్చాం. గడుసుదనం, వెక్కిరింత, హాస్యరసం తెలుగు సామెతలలో ఎక్కువ. వీటిని వెంటనే చదవండి. సందర్భాన్నిబట్టి ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించండి. ఇక అందరూ మీవారే.

ఇప్పుడు కొన్ని సామెతలు పైన విషయ సూచిక లో చూడండి .....................
(()
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి