తెలుగు సామెతలు - "అ"
|
అఆలు రావు గాని
అగ్రతాంబూలం నాకే అన్నాడంట
|
అక్క మనదైతే బావ మనవాడా?
|
అక్కర ఉన్నంతవరకు
ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ
|
అగడ్తలో పడ్డ పిల్లికి అదే
వైకుంఠం
|
అగ్నికి వాయువు తోడైనట్లు
|
అగ్రహారాలన్నీ పోతే పోయాయి
గానీ, ఆక్టు బాగా తెలిసిందన్నాడు
|
అచట పుట్టిన చిగురుకొమ్మైన
చేవ
|
అటునుండి నరుక్కు రా
|
అడకత్తెరలో పోకచెక్క
|
అడగందే అమ్మ అయినా పెట్టదు
|
అడవిలో పెళ్ళికి జంతువులే
పురోహితులు
|
అడిగేవాడికి చేప్పేవాడు
లోకువ
|
అడుక్కుతినేవాడికి
అర్ధరాజ్యమిచ్చినా అడుక్కుతినేచిప్ప కడుక్కుదాచుకున్నడట
|
అడుక్కునేవాడికి అరవైఆరు
కూరలు
|
అడుక్కునేవాడిదగ్గర
గీక్కునేవాడు
|
అడుక్కున్నమ్మకు అరవై
కూరలట, వండుకున్నమ్మకు ఒకటే కూరట
|
అడుసు తొక్కనేల కాలు
కడగనేల
|
అడ్డాల నాడు బిడ్డలు కానీ
గడ్డాల నాడు కాదు
|
అతగాడే ఉంటే మంగలెందుకు
|
అతని కంటే ఘనుడు ఆచంట
మల్లన్న
|
24, ఆగస్టు 2014, ఆదివారం
తెలుగు సామెతలు - అ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి