Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

24, ఆగస్టు 2014, ఆదివారం

తెలుగు కవులు - అనిసెట్టి సుబ్బారావు



అనిసెట్టి సుబ్బారావు

వికీపీడియా నుండి
అనిసెట్టి సుబ్బారావు
జననం 1922
మరణం 1979
ప్రాముఖ్యత స్వాతంత్ర్య సమరయోధుడు
వృత్తి తెలుగు సినిమా రచయిత మరియు ప్రగతిశీల కవి, నాటక కర్త.
అనిసెట్టి సుబ్బారావు (1922-1981), స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా రచయిత మరియు ప్రగతిశీల కవి, నాటక కర్త.
ఈయన రచనలలో అగ్నివీణ (1949), బిచ్చగాళ్ల పదాలు ప్రముఖమైనవి. ఈయన ప్రముఖ నాటకాల్లో రక్తాక్షరాలు (1943), అనిశెట్టి నాటికలు (1945), శాంతి (1951), మా ఊరు (1954) చెప్పుకోదగినవి. సుబ్బారావు కొన్నాళ్ళు ప్రజాశక్తి, అభ్యుదయ పత్రికలకు సంపాదకునిగా పనిచేశాడు. 1942లో మరియు 1944లో సాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళాడు. కమ్యూనిజం వైపు ఆకర్షితుడై తన నాటకాల ద్వారా ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. 1955లో రచయితగా తెలుగు సినీరంగంలో అడుగుపెట్టాడు.
సుబ్బారావు, మహాకవి శ్రీశ్రీకి బాగా సన్నిహితుడు. సుబ్బారావు మరణించిన తర్వాత మద్రాసులోని సంతాప సభలో శ్రీశ్రీ 'నాకు అనిశెట్టి, ఆరుద్ర అ-ఆ’ లాంటివారు. అ-పోయింది. ఆ- మిగిలింది’ అని చెప్పి క్లుప్తంగా తమ అనుబంధాన్ని తెలిపి ముగించాడు.[1]
అనిసెట్టి పుట్టింది ఆగర్భ శ్రీమంతుల ఇంట్లోనే గాని అతడు తన చుట్టూ వున్న ఆగర్భ దరిద్రుల ఆర్తనాదాలనే విన్నాడు. తండ్రి కోటి లింగం కోటికి పడగెత్తగల శ్రీమంతులు. నరసరావుపేటలోనూ, చిలకలూరిపేటలోనూ ఆయిల్‌ మిల్లులు, ఇరవై లారీలు ఉండేవి. తండ్రికి మిల్లులోని పనివాళ్ళు ఒకసారి సమ్మె చేస్తే అనిసెట్టి ఆ కార్మికుల పక్షమే వహించి తండ్రికి కోపం తెప్పించాడు. 1941 నాటికి గుంటూరు హిందూ కళాశాలలో బి.ఎ. పట్టా పుచ్చుకొన్న అనిసెట్టిని అతని తండ్రి 'లా' చదవడానికి మద్రాసు పంపించాడు.[2]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి