Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

27, ఆగస్టు 2014, బుధవారం

తెలుగు కవులు - బండారు అచ్చమాంబ



భండారు అచ్చమాంబ

వికీపీడియా నుండి
(బండారు అచ్చమాంబ నుండి దారిమార్పు చెందింది)
Bandaru Acchamamba.JPG
భండారు అచ్చమాంబ (1874 - 1905) తొలి తెలుగు కథా రచయిత్రి. ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావుకు అక్క.

జీవిత విశేషాలు

అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రధమ స్త్రీవాద చరిత్ర కారణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది. అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలు లో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. అనాధ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు. 1905 జనవరి 18వ తేదీన ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది.
కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, ఆయన అక్క భండారు అచ్చమాంబల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్రమాల అనే గ్రంధాన్ని రచించింది. ఇందులో షుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంధాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.

అచ్చమాంబ భావాలు

  1. స్త్రీల బుద్ధి పురుష బుద్ధి కన్న మందమనియు, స్త్రీల మెదడు మస్తిష్కము, పురుషుల మస్తిష్కము మెదడు కన్న బలహీనమగుటచే దక్కువ తూగుననియు వ్రాయు వ్రాత బక్షపాతము కలదనుట నిర్వివాదమే- స్త్రీలు నైసర్గిక మూఢురాండ్రనుటకంటె బాల్యము నుండియు వారికి విద్యాగంధమే సోకనియ్యనందున మూఢురాండ్రుగా నున్నారనుట మంచిది- చిన్నతనమున బాలురు బాలికలు సమబుద్ది కలవారుగా నున్నను శాస్త్ర విషయముల బ్రవేశ పెట్టనందున బురుషులు జ్ఞానాధికులును ఎట్టి తెలివిగలదైనను కన్న తల్లిదండ్రులే యామెను పైకి రానీయక మూల మూలల నణగదొక్కుటచే బాలిక మూర్ఖురాలును అగుచున్నవారు. స్త్రీ యభివృద్ధి లేకుండుటకిట్లు మగవారి పక్షపాతమే మూలం కాని మరొకటి కాదు. పురుషులా పక్షపాతమును విడిచిరేని స్త్రీలు విద్యావతులయి భర్తలకర్ధాంగులన్న నామును సార్దకము జేతురు.
  2. స్త్రీలు అబలలనియు, బుద్ధి హీనులనియు వివేకశూన్యులనియు, సకల దుర్గుణములకు -నివాస స్థలమనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన ఈ దోషారోపణములన్నియు నబద్ధములనియు స్త్రీలలో నత్యంత శౌర్యధైర్యవతులును, అసామాన్య విద్యావిభూషితులునూ… బూర్యముండిరనియు, నిపుడున్నారు.
  3. స్త్రీలకు విద్య నేర్పిన యెడలను, వారికి స్వాతంత్య్రమోసగిన యెడలను, వారు చెడిపోవుదురనియు, బతుల నవమానించెదరనియు, గుటుంబ సౌఖ్యమును నాశనము చేసేదరనియు గొందరు మహానుభావులు వక్కాణించెదరు. ఈ యారోపణములన్నియు నిరర్థకములనియు, స్త్రీవిద్య దురాచార ప్రతీకారానుకూలమగునే కాని దురాచార ప్రవృత్త్యనుకూలము గానేరదనియు స్త్రీ విద్యా స్వాతంత్య్రముల వలన దేశమునకు లాభమే గాని నష్టముంగలుగనేరదనియు, స్త్రీ విద్య యత్యంతావశ్యకం.
  4. బాలుడు చిన్నతనమునందెంత మందబుద్దియైనను వానికైదేండ్లు రాగానే తల్లి దండ్రులు విద్య నేర్పి వానికిగల మాంద్యమును వదిలించి జ్ఞానాభివృద్ధికొరకనేక శాస్త్రములను జదివింతురు…చిన్ననాడు వానికంటే విశేష ప్రజ్ఞ గల వాని యక్క మాత్రము విద్యాగంధమేమియు లేనందున మహా మూర్ఖశిరోమణియై యుండును. ఇట్లు తల్లిదండ్రులు పక్షపాతముచే బురుష సంతతిలోను స్త్రీ సంతతిలోను జ్ఞానమును గురించి మహదంతరము పడినదే గాని స్త్రీల స్వాభావిక మౌర్ఖ్యము వలన కాదు
  5. మానవ దేహమున కలంకారమయిన విద్యభూషణము వారికి లేకుండ చేసి లోహపు నగలను మాత్రము పెట్టి తమ వేడుక నిమిత్తమయి వారిని తోలుబొమ్మల వలె జేయుచున్నారు. వారిని గృహ యజమానురాండ్రుగా జూడక తమ యుపచారము నిమిత్తమయి దాసులనుగా జేయుచున్నారు. పురుషులు స్త్రీల విషయమున జేసినయిట్టి యన్యాయము వలన స్త్రీలను మూఢురాండ్రనుగా జేసి చెడగొట్టుటయే కాక తామును వారికి తోడిపాటుగా మూర్ఖ శిరోమణులయి జెడిపోవుచున్నారు. ఈ స్థితి యంతయు పురుషుల లోపమువలనను, స్వప్రయోజనపరత్వం వలనను గలుచు చున్నదే కాని స్త్రీల దోషము వలనను మాత్రము గాదు.

విశేషాలు

  • 'భండారు అచ్చమాంబ తొలి తెలుగు కథా రచయిత్రి
  • ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావుకు అక్క.
  • అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు.
  • ప్రధమ స్త్రీవాద చరిత్ర కారణి.అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది మహిళాభ్యుదయానికి తొలి విదూషీణి
  • అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలు లో కొమర్రాజు వెంకటప్పయ్య,గంగమ్మ దంపతులకు పుట్టింది
  • 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది.
  • 1905 జనవరి 18వ తేదీన మధ్యప్రదేశ్ బిలాస్పూర్ లో ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది
  • తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంధాన్ని రచించింది.
  • ఇందులో షుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంధాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.

రచనలు [1]

కథలు
  • గుణవతియగు స్త్రీ (తెలుగుజనానా, 1901 మే)
  • లలితా శారదులు
  • జానకమ్మ (తెలుగు జనానా, 1902 మే)
  • దంపతుల ప్రథమ కలహము (హిందూసుందరి, 1902 జూన్)
  • సత్పాత్ర దానము (హిందూసుందరి, 1902)
  • స్త్రీవిద్య (హిందూసుందరి, 1902)
  • భార్యా భర్తల సంవాదము (హిందూసుందరి, 1903 జులై)
  • అద్దమును సత్యవతియును (హిందూసుందరి, 1903)
  • బీద కుటుంబము (సావిత్రి, 1904)
  • ప్రేమ పరీక్షణము (1898 - అలభ్యం)
  • ఎరువుసొమ్ము పరువు చేటు (1898 - అలభ్యం) ఇంతదాకా అలభ్యంగా వుండిన 'ప్రేమా పరీక్షణము', 'ఎఱువుల సొమ్ము బఱువుల చేటు' అనే రెండు కథలు సంగిశెట్టి శ్రీనివాస్ కు లభించాయి.[2]
ఇతర పుస్తకాలు
  • అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు)(చారిత్రక మహిళల జీవితాలు మృధుమధుర శైలిలో వర్ణితాలు ఇందులో ఉన్నయి.)
  • క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
  • ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
  • ఒక శతకం కూడా రాసారని అంటారు (అలభ్యం)
ఇతర పుస్తకాలు
  • అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు)
  • క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
  • ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
  • ఒక శతకం కూడా రాసారని అంటారు (అలభ్యం)

1 కామెంట్‌: