Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

26, ఆగస్టు 2014, మంగళవారం

తెలుగు కవులు - దేవరకొండ బాలగంగాధర తిలక్


http://prasthanam.com/sahithivettalu

దేవరకొండ బాలగంగాధర తిలక్

వికీపీడియా నుండి
దేవరకొండ బాలగంగాధర తిలక్
Devarakonda balagangadhara tilak.jpg
దేవరకొండ బాలగంగాధర తిలక్
జన్మ నామం దేవరకొండ బాలగంగాధర తిలక్
జననం 1921 ఆగష్టు 1
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక
మరణం 1966 జూలై 1
ప్రాముఖ్యత ఆధునిక తెలుగు కవి.

దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921-1966) ఒక ఆధునిక తెలుగు కవి. భావుకత, అభ్యుదయం ఇతని కవిత్వంలో ముఖ్య లక్షణాలు.

పద్యాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
అంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న, భావ కవులలొ అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్ . ఇతను కవి, కథకుడు, నాటక కర్త.
సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు
అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు
చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి..
అంటూ బలమైన కంఠంతో విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడమే ధ్యేయంగా, కరుణ కలికితురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ, అమృతమయమైన కవితా ఝురిని ప్రవహింపజేసిన కవితా తపస్వి శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ [1]

జీవితం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న తిలక్ జన్మించాడు.
తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో , సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం వుంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం. అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతోబాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడాని వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.
మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడాని ఆయన కవితను , కథలను, నాటికా ప్రక్రియను సమనంగా ఉపయోగించుకున్నాడు. మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు- బిచ్చగాళ్ళు, అనాధులు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుగత్తేలు, చీకటిబజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలుగా తీసుకుని అసలు వేషాలలో మన ముందు నిలబెట్టాడు.
మొదట కృష్ణశాస్త్రి ప్రభావంతోనూ , తరువాత శ్రీశ్రీ ప్రభావంతోనూ , కవిత్వం రాశినా, వచన కవితా ప్రక్రియని తన అసమాన ప్రతిభాసంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ప్రముఖుడు. వచన కవితలకు అప్పజెప్పే లక్షణాన్ని తెచ్చినవాడు తిలక్. భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కళనేత.

తిలక్, సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లెపువ్వులా వుండే తిలక్ వాడకుండానే, వాసన వీడకుండానే నలబై అయిదేళ్ల నడిప్రాయాన 1966 జూలై 1 న అనారోగ్యంతో రాలిపోయాడు.

ప్రశంసలు

రా.రా.: తిలక్ కవిత్వంలోని కొన్ని అనభ్యుదయకర ధోరణులను ఎత్తిచూపి విమర్శించినా, భావుకత్వం ముఖ్యమైన లక్షణంగా ఉండేది. తిలక్ లోని ప్రముఖమైన గుణం భావుకత్వం - కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. ఈ భావుకత్వానికి తోడు, తన హృదయంలోని అనుభూతిని వ్యక్తం చేయగల శబ్దశక్తీ, అలంకారపుష్టీ, కలసి రావడంతో తిలక్ ఉత్తమశ్రేణి కవి కాగలిగినాడు అంటూ ప్రముఖ మార్కిస్టు విమర్శకుడు రా.రా ప్రశంసించాడు.
దేవుడా
రక్షించు నాదేశాన్ని
పవిత్రులనుండి, పతివ్రతలనుండి
పెద్దమనుషుల నుండి, పెద్దపులులనుండి
నీతుల రెండునాల్కలు సాచి బుసలుకొట్టే
నిర్హేతుక కృపా సర్పాలనుండి
లక్షలాది దేవుళ్లనుండి వారి పూజారులనుండి
వారి వారి ప్రతినిధుల నుండి
సిద్ధాంత కేసరులనుండి
శ్రీమన్మద్గురు పరంపరనుండి...
చీకోలు సుందరయ్య : వీళ్లందరినుంచీ ఈ సమాజాన్ని కాపాడమని వేడుకొన్న కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన అమ్మాయిలు అని పేర్కొన్న ఈ కవి కవిత్వంలోనే కాదు, కథా రచనలోను బలమైన ముద్రవేశారు. తన కత్తికి రెండువైపులా పదునే అని నిరూపించుకొన్నారు. ఆయన కథలు సమాజపు ఆనవాళ్లు - [2]
యువ కవి లోక ప్రతి నిధి
నవభావామృత రసధుని
కవితాసతి నొసట నిత్య
రసగంగాధర తిలకం
సమకాలిక సమస్యలకు
స్వచ్చ స్పాటికా ఫలకం
అంటూ తన ఎలిజీలో (జవాబు రాని ప్రశ్న) శ్రీశ్రీ అభివర్ణించాడు.
గిరిజా మనోహర్ బాబు : కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్ధకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపధ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు. [1]

వేలూరి వేంకటేశ్వరరావు : .. తిలక్‌ మనకి ఆరోజులనాటి (60 ల్లో) వీర అభ్యుదయవాది (ultra progressive) గా ముందుకొస్తాడు. .. తిలక్‌, కృష్ణశాస్త్రి గారి romanticism కి, అభ్యుదయవాదం అందంగా పెనవేసి, ఆనాటి కవిత్వాన్ని, ఒక రెండుమెట్లు పైకి తీసికెళ్ళిన గొప్ప కవి. కాకుంటే “రహస్యసృష్టి సానువులనుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు, మమ్మల్ని కనికరించు,” అని రాయలేడు. “మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం,” అని ఇంకే కవి రాయగలడు? . ..తను ప్రార్థిస్తున్న దేవుడు, ఆ దేవుడు ఎవరైతేనేం, తన కోరికలు తీర్చలేడని తిలక్‌ కి తెలుసు. నాకు చందమామలో జింక కావాలంటే, ఏ దేవుడు ఇవ్వగలడు? తిలక్‌ ప్రగతి శీలుడైన మానవతావాది. అంటే, ఎప్పటికైనా తన కోరికలు ఏదోరకంగా నెరవేరుతాయని నమ్మిన కవి. మనిషిలో మంచిని నమ్మిన కవి. [3]

కొట్టెకోల విజయ్‌కుమార్‌ : కవిత్వం మనస్సుకీ ఉద్రేకాలకీ సంబంధించింది. ఈ మనస్సునీ ఉద్రేకాల్ని కొలిచే సరైన మానం ఇదివరకు లేదు. ఇకముందు రాదు అని చెప్పవచ్చును. అంతవరకు కవిత్వానికి సరైన నిర్వచనం రాదు. మన లోపల్లోపల జరిగే ఒకానొక అనుభూతి విశిష్టత కవిత్వానికి ఆధారం అని తిలక్‌ ప్రకటించినాడు, కవితాజ్ఞాని అయినాడు. తిలక్‌ కవిత్వానికి అసలు రూపం అమృతం కురిసిన రాత్రి దీనిలోని ప్రతి కవిత కొత్త శిల్పంతో కొత్త భావంతో రక్తి కడుతుంది. హృదయాన్ని కదిలిస్తుంది. మెదడుకి పదును పెడుతుంది. భావ తీవ్రతతో పాఠకులలో ఒకవిధమైన మానసికావస్థను కలిగించినాడు. వచన కవితా నిర్మాణ శిల్పరహస్యవేది అయిన తిలక్‌ చిన్నవయస్సులోని జులై 2న 45 సంవత్సరములకే మరణించాడు. 'తిలక్‌ మంచి అందగాడు, మానసికంగా మెత్తనివాడు, స్నేహశీలి కవి, రసజ్ఞుడు' అని కుందుర్తి అమృతం కురిసిన రాత్రి పీఠికలో అన్నాడు. [4]

శ్రీశ్రీ :
గాలి మూగదయి పోయింది
పాట బూడిదయి పోయింది
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
నభీస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి

తిలక్ రచనలు

కవితా సంపుటాలు
కథానికా సంపుటాలు
  • తిలక్ కథలు
  • సుందరీ-సుబ్బారావు
  • ఊరి చివరి యిల్లు
నాటకాలు
  • సుశీల పెళ్లి
  • సుప్త శిల
  • సాలె పురుగు
నాటిక
  • సుచిత్ర ప్రణయం
  • "తిలక్ లేఖలు"
  • "తిలక్ కథలు " (కథా సంపుటం)

పురస్కారం

తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి