నమస్క్రియకవితామ్నాయ రహస్యముల్ దెలియగా కాంక్షించినావేని, పొ
మ్మననిన్ నీ వెవనిందలంపక తదేకాసక్తితో జేరుమా
కవిసమ్రాట్టగు విశ్వనాధు ప్రతిభా గంభీర వారాన్నిధిన్
శివకోటీర ఝరీతురీయ వచన శ్రీ సన్నిధిన్ బెన్నిధిన్.ఎవని యాకృతిమించు హిమశైల శిఖరమై
కవులలో పుడమి మానవులలోన
ఎవని భారతి వెల్గు నేకైక దీపమై
జగములం దాగామి యుగములందు
ఎవని మన్గడ యొప్పు శ్రవణపీయూషమై
కథలలో సూరి వాక్సుధలలోన
ఎవని స్థానముగ్రాలు నవనవోన్మేషమై
ఋషులలో నిఖిలానిమిషులలోనఅతడు కవియును ఋషియు దేవతయుగాడు
కవులు ఋషులును దివిజులుంగలసి మెలసి
మ్రొక్కు సాక్షాత్ పరబ్రహ్మ మూర్తిగాక
విశ్వనాధుండు కేవలావిర్భవుండె!
19, ఫిబ్రవరి 2016, శుక్రవారం
సుకవి స్తుతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి