వికీపీడియా నుండి
కుసుమ ధర్మన్న తొలి దళిత కవి, వ్యాసకర్త, వక్త. జయభేరి
పత్రిక సంపాదకుడు. ఉద్యమకారుడు. వృత్తి రీత్యా ఆయుర్వేద వైద్యుడు. సాహితీ
కోవిదుడు. ఆంగ్ల-ఆంధ్ర భాషల్లో పండితుడు. "మాకొద్దీ నల్లదొరతనం" గేయరచయితగా
ప్రసిద్ధుడు."దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమ ధర్మన్న కవీంద్రుడు" అనే పుస్తకం లో సి.వి. గారు కూడా ఈయన గురించిన సమాచారం తనవద్ద లేదని రాశాడు. 1921లో కుసుమ ధర్మన్న మాకొద్దీ నల్ల దొరతనము రాశారు. దళిత వర్గం నుంచి అతి కష్టంమీద చదువుకుని పైకొచ్చి, తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతికొద్ది మంది దళిత విద్యావంతుల్లో 'కుసుమ ధర్మన్న కవి' ఒకరు. దళితులు, బ్రిటీషు పాలనలో కంటే, స్థానిక అగ్రవర్ణాల పాలనలో మరింత నలిగిపోతారని మొట్టమొదటగా చాటింది కుసుమ ధర్మన్నే. కాంగ్రెస్‌లో ఉంటూనే 'మాకొద్దీ నల్లదొరతనము' అంటూ గళం విప్పిన ధైర్యశాలి. రాజమండ్రి తాలూకా బోర్డుకు కాంగ్రేసు పార్టీ తరఫున సభ్యునిగా ఎన్నికై కూడా బోర్డు ప్రెసిడెంటు ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థికి వోటు వేయని స్వతంత్రుడు ఆయన.
ధర్మన్నఅంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితుడై అంబేద్కర్ గురించి ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆంధ్రదేశానికి అంబేద్కరును తొలిగా పరిచయం చేసింది ఈయనే.[1] అణాగారిన జాతులకు గొంతుకనిస్తూ, అంబేద్కర్ భావాలను ప్రచారం చేయటానికి జయభేరి అనే పక్ష పత్రికను స్థాపించాడు.
1930వ దశకంలో కాంగ్రేసు పార్టీ చొరవతీసుకొని హరిజన సేవా సంఘం యొక్క ఆంధ్ర విభాగాన్ని ప్రారంభించింది. మహాత్మా గాంధీ అంటరాని కులాల ప్రజలకు హరిజనులు అని పేరుపెట్టడంతో అది ప్రాచుర్యం పొందింది. క్రమేణా ఆది ఆంధ్ర నాయకులంతా కాంగ్రేసు స్థాపించిన హరిజన సేవా సంఘంలో భాగమైనా కుసుమ ధర్మన్న వంటి కట్టుబడిన నాయకులు మాత్రం దాన్ని వ్యతిరేకించారు. నిమ్న జాతుల అభివృద్ధి విషయంలో మహాత్మా గాంధీ ఆశయాలను నమ్మి గౌరవించినా, ఆచరణలో లోపాలను ధర్మన్న సహించలేదు. గాంధీ యొక్క ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమండ్రి వచ్చి హరిజన నాయకులతో సమావేశం నిర్వహించిన సందర్భంలో, ధర్మన్న ఆ సమావేశాన్ని బహిష్కరించాడు. 'హరిజన నాయకులైతే మా పేటలకు వచ్చి యిక్కడ మాట్లాడాలని' కబురుపెట్టి గాంధీని, ఇతర కాంగ్రెస్ నాయకులను తమ పేటకు రప్పించి, ఆతిథ్యమిచ్చి దళితుల గౌరవాన్ని చాటాడు.
దళిత చైతన్యం కోసం ధర్మన్న పడిన తపన ఈయన 1933లో వ్రాసిన హరిజన శతకంలో చూడవచ్చు. "ఆత్మ గౌరవంబు నలరంగ చాటరా" అని ఉద్బోధించిన ధర్మన్న కవిగారు వర్ణధర్మం పేరిట భారతీయ సమాజంలో నెలకొని ఉన్న హెచ్చు తగ్గులను నిరసించిన జాతీయ వాది. సమకాలికులు ఆయనను 'ఆది ఆంధ్ర కవి సార్వభౌమ'గా పేర్కొన్నారు.
1936లో విజయనగరంలో జరిగిన ఆది ఆంధ్ర మహాసభ సమావేశానికి కుసుమ ధర్మన్న అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో అధ్యక్ష ప్రసంగం చేస్తూ సామ్యవాదాన్ని సహించని హిందూమతం అనే శీర్షికన ప్రసంగం వెలువరించాడు. ఈయన నిమ్నజాతి విముక్తి తరంగిణి, వాళ్ళు అంటరాని వాళ్లా, హరిజన చరిత్ర మొదలైన రచనలు చేశాడు.
పైన ఉటంకించిన ధర్మన్న గారి గేయం ' మాకొద్దీ నల్ల దొరతనము ' కు బదులుగా -- మా కొద్దీ తెల్లదొరతనము , అని వున్నది. సరిచేయగలరు.. రాజేంద్ర ప్రసాద్ మహేశ్వరం . హైదరాబాద్
రిప్లయితొలగించండి