Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

14, సెప్టెంబర్ 2014, ఆదివారం

తెలుగు కవులు - గజ్జల మల్లారెడ్డి



గజ్జెల మల్లారెడ్డి

వికీపీడియా నుండి
(గజ్జల మల్లారెడ్డి నుండి దారిమార్పు చెందింది)
గజ్జెల మల్లారెడ్డి
Gajjela Mallareddy.jpg
గజ్జెల మల్లారెడ్డి
జన్మ నామం గజ్జెల మల్లారెడ్డి
జననం 1925
వైఎస్ఆర్ జిల్లా ఆంకాళమ్మ గూడూరు
ప్రాముఖ్యత అభ్యుదయ కవి
వృత్తి ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం పత్రికలకు సంపాదక వర్గ సభ్యుడు
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ

గజ్జెల మల్లారెడ్డి అభ్యుదయ కవి. వైఎస్ఆర్ జిల్లాలో గొప్ప రాజకీయ ఉపన్యాసకుడుగా ప్రసిద్ది చెందిన వాడు. వైఎస్ఆర్ జిల్లా ఆంకాళమ్మ గూడూరు లో 1925లో జన్మించారు. అభ్యుదయ, వ్యంగ్య కవి. మూఢనమ్మకాలను హేళన చేసే ఆస్తిక హేతువాది. 1943లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 1978 వరకు పలు పదవులు నిర్వహించారు. నిర్మొహమాటి. మత'మేధావుల తలలపై మూఢత్వం మేటగట్టి వజ్రజిహ్వగా మారిందంటాడు. 1956లో 'సవ్యసాచి' పక్షపత్రిక ద్వారా జర్నలిజంలో ప్రవేశించారు.1970 నుంచి 1973 వరకు 'విశాలాంధ్ర'కి సంపాదకత్వం వహించారు. కొన్ని సంవత్సరాలు 'వీచిక' అనే సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. 'ఈనాడు'లో ఆరు సంవత్సరాలపాటు పుణ్యభూమి మొదలైన వ్యంగ్య రచనలు చేశారు. 'ఆంధ్రభూమి', 'ఉదయం' వంటి పత్రికల్లో రాశారు. అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణానికి శ్రమించారు. 1993-95 లో రాష్ట్ర అధికారబాషా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. 1985లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్‌. చివరి రోజుల్లో ఆధ్యాత్మికతవైపు మొగ్గారు.
మల్లారెడ్డి గేయాలు, శంఖారావం అన్నవి ఇతని కవితా సంకలనాలు. సవ్యసాచి పత్రికలో గేయాలు ప్రచురింపబడినాయి. 1973 నుండి అరసం ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం పత్రికలకు సంపాదక వర్గ సభ్యునిగా పని చేశాడు.

చురక

  • తెలుగునాట భక్తిరసం-తెప్పలుగా పారుతోంది
డ్రెయినేజీ స్కీములేక-'డేంజరుగా మారుతోంది

రచనలు

  • 'మల్లారెడ్డిగేయాలు'
  • శంఖారావం'
  • ఇంటర్వ్యూహం
  • 'సత్యంవధ ధర్మం చెర
  • , ఎం.ఎల్.ఎ,
  • సందేహడోల,
  • పేరిగాని దర్బారు.
  • మఖ్దూం కవిత
  • మల్లారెడ్డి మాటకచేరీ,
  • అక్షింతలు,
  • దమ్మపదం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి