ఇల్లిందల సరస్వతీదేవి
వికీపీడియా నుండి
ఇల్లిందల సరస్వతీదేవి(1918-1998) ప్రముఖ తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రి.వ్యక్తిగత జీవితం
ఇల్లిందల సరస్వతీదేవి 1918లో జన్మించారు. ఆమెకి చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యవృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో ఆమె మెట్టినింట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.రచన రంగం
ఇల్లిందల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలు రచించారు. దరిజేరిన ప్రాణులు, ముత్యాల మనసు మొదలైన 5 వ్యాససంపుటాలు, జీవితచరిత్రలు రచించారు. బాలసాహిత్యకారిణిగా నాటికలు, రేడియో నాటికలు రచన చేశారు. కృష్ణాపత్రికలో ఇయంగేహేలక్ష్మీ, ఆంధ్రపత్రికలో వనితాలోకం శీర్షికలు నిర్వహించారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు. స్వర్ణకమలాలు, తులసీదళాలు, రాజహంసలు వంటి కథాసంకలనాలు వెలువరించారు.[1]సామాజికరంగం
తెలుగు మహిళల కోసం 1934లో యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి 1934లో హైదరాబాదులో ఆంధ్ర యువతి మండలిని స్థాపించి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు మూడేళ్ళపాటు జైలు విజిటరుగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర సినిమా అవార్డు కమిటీల్లో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.పురస్కారాలు, గౌరవాలు
- 1982లో స్వర్ణకమలాలు కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.
- స్వర్ణకమలాలు కథాసంకలనానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
- 1958లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి లభించింది.
మూలాలు
- సామాజిక సాహిత్యవేత్త:తె.వె.బృందం:తెలుగు వెలుగు:మార్చి 2014:పే.22,23
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి