భమిడిపాటి కామేశ్వరరావు
వికీపీడియా నుండి
శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు | |
భమిడిపాటి |
|
జన్మ నామం | భమిడిపాటి కామేశ్వర రావు |
---|---|
జననం | ఏప్రిల్ 28, 1897 పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు |
స్వస్థలం | ఆకివీడు |
మరణం | ఆగష్టు 28, 1958 |
నివాసం | రాజమహేంద్రవరం (రాజమండ్రి) |
ఇతర పేర్లు | హాస్య బ్రహ్మ మరియు భ కా రా |
ప్రాముఖ్యత | ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక క |
వృత్తి | ఉపాధ్యాయుడు, రచయిత |
సంతానం | భమిడిపాటి రాధాకృష్ణ |
తండ్రి | భమిడిపాటి నరసావధానులు |
తల్లి | భమిడిపాటి లచ్చమ్మ |
విషయ సూచిక
జీవిత సంగ్రహం
వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఏప్రిల్ 28, 1897 సంవత్సరంలో నరసావధానులు, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. వీరు భీమవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, ప్రతిభావంతులైన విద్యార్ధులకిచ్చే ఉపకార వేతనం సహాయంతో, పిఠాపురం మహారాజా కళాశాలలో గణితంలో పట్టా పొందారు. తరువాత కొంతకాలం నరసాపురం మరియు కాకినాడలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1922లో ఎల్.టి పరీక్షలో ఉత్తీర్ణులై రాజమండ్రి వీరేశలింగం ఆస్తిక ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర అధ్యాపక పదవిలో స్థిరపడి, అదే పాఠశాలకు రెండు సంవత్సరాలు ప్రధానోధ్యాపక బాధ్యతలను కూడా నిర్వహించారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వీరు చాలా నాటకాలు, నాటికలు, కథలు రచించారు. సమకాలీన సాంఘిక సమస్యలను వీరి రచనలలో హాస్యరసానురంజకంగా మలచిన ప్రజ్ఞాశాలి అవటం వలన పండితలోకం వీరిని హాస్య బ్రహ్మ అని కొనియాడారు. త్యాగరాజు రచనలను, జీవితాన్ని చక్కగా పరిశీలించి రాగ, తాళ, వాద్యాలను ఆ గాయకుని భావానికి అనుగుణంగా సమకుర్చునని వివరిస్తూ 'త్యాగరాజు ఆత్మ విచారం' రచన చేశారు. తన అభిప్రాయాలకు అనుగుణంగా రచించిన తన నాటకాలను వీరు రాజమండ్రి కళాశాల వార్షికోత్సవాలలో వీరే దర్శకత్వం వహించి ప్రదర్శించేవారు. వీరు స్వయంగా నటులు. ద్విజేంద్రలాల్ రచించిన 'చంద్రగుప్త'లో శక్తి సింహ పాత్రను పోషించి ఖ్యాతిని పొందారు.ఉత్తమమైన హాస్య రచనలతో ఎందరినో మనసారా నవ్వించిన వీరు 1958, ఆగష్టు 28న పరమపదించారు.
రచనలు
భమిడిపాటి కామేశ్వర రావు గారు ఎక్కువగా నాటికలు ముఖ్యంగా హాస్య ప్రధానమైనవి రచించారు. ఆయన నాటికలకు చాలాభాగం ప్రముఖ ఫ్రెంచి నాటక కర్త మోలియర్ వ్రాసిన నాటికలు ఆధారం. ఆయన అనేక విషయాల మీద వ్రాసిన వ్యాసాలు 20వ శతాబ్దపు మొదటి అర్ధ భాగములోని సామజిక పరిస్థితులను తెలియచేస్తాయి.ఆయన హాస్యం చదువరికి చురుక్కుమనినిపిస్తుంది.ఈయన వ్రాసిన వ్యాసాలన్నీ కూడ హాస్య ప్రధానమైనపట్టికీ, వాటిలో విషయ పటిమ దృఢంగా ఉండి, విషయాలను మూలాలనుండి చర్చిస్తాయి.నాటకాలు-నాటికలు
- వినయప్రభ - ప్రముఖ ఆంగ్ల రచయిత ఒలివర్ గోల్డ్ స్మిత్ రచన షి స్టూప్స్ టు కాంకర్ (She stoops to conquer) ఈ నాటకానికి మూలం
- ఇప్పుడు - ఇందులో మూడు నాటికలు ఉన్నాయి
- బాగు బాగు - మొదటి ప్రదర్శన సెప్టెంబరు 1వ తారీకు 1923, రాజమండ్రిలో
- ఎప్పుడూ ఇంతే - మొదటి ప్రదర్శన సెప్టంబరు 5వ తారీకు 1926, రాజమండ్రిలో
- క చ ట త ప లు - మొదటి ప్రదర్శన ఆగష్టు 31వ తారీకు 1927, రాజమండ్రిలో
- అప్పుడు - ఇందులో మూడు నాటికలు ఉన్నాయి
- తప్పనిసరి - మొదటి ప్రదర్శన ఆగస్టు 27వ తారీకు 1930
- వద్దంటే పెళ్ళి - మొదటి ప్రదర్శన ఆగస్టు 23వ తారీకు 1931
- ఘటన - మొదటి ప్రదర్శన మార్చి 7వ తారీకు 1932
- పై మూడు నాటికలూ ప్రముఖ ఫ్రెంచి రచయిత మోలియర్ రచనలకు తెలుగు అనువాదాలు
- వేషం తగాదా
- ఈడూ-జోడూ
కథలు
- తమ్ముడు పెళ్ళికి తరలి వెళ్ళడం
- విమానం
- దోమరాజా
- అయోమార్గం
- అభినందనం
- ధన్యజీవి
- భూతలం
కథలు, వ్యాసములు
- నిజం
- పాత బియ్యే! కొత్త బియ్యే
- బోధనాపద్ధతులు
- అద్దెకొంపలు
- కాఫీ దేవాలయం
- నామీదేనర్రోయ్ (కథ)
- ధుమాలమ్మ ఓఘాయిత్యం
- అవును
- మేష్టరీకూడా ఒక ఉద్యోగమేనా?
- ఆధ్రా యూనివర్సిటీ పట్టుదలలు
- తమ్ముడి పెళ్ళికి తరలి వెళ్ళడం (కథ)
- విమానం
- పల్లెటూరు స్కూలు తణిఖీ తంతు (కథ)
వ్యాసములు
- లోకోభిన్నరుచి: ఈ సంపుటి లో 7 వ్యాసములు ఉన్నాయి
- బస్తీ రోడ్డు
- అయోమార్గం-అభినందనం
- తిండి విశేషాలు
- లోకోభిన్నరుచి:
- స్థాయిమారినా ఓటే పాట!
- రేడియో కబుర్లు 1,2,3
- మన తెలుగు-ఈ సంపుటిలో6 వ్యాసములు ఉన్నాయి
- పరీక్షలు
- "మన" తెలుగు
- దశరూపకం
- శాస్త్రం-కళ
- 'రెండోభాష' మేష్టరు
- గ్రంధప్రచురణ
- తనలో - ఈ సంపుటిలో 9 వ్యాసాలు ఉన్నాయి
- విశ్వామిత్రరావు - తనలో
- చారుదత్తరావు ధోరణి
- తనలో
- నవ్వు
- దీపావళి
- భూతలం
- వైద్యం
- కుబేరరావు - తనలో
- బాలబోధ
- మాటవరస - ఇందులో 19 వ్యాసలున్నాయి
- చుట్టా, బీడీ, సిగరెట్
- శారదా బిల్లు
- వార్తలు
- బలరామయ్యగారి ఇంగ్లీషు తమ్ముడు
- భోజనోపదేశం
- సంగతులు
- విద్యార్ధుల ఏకాంతపు రిమార్కులు
- పాలక సంఘాల్లో ఎన్నికల మజా
- సంగతులు
- భూకంపం
- విమానం మీద పన్ను
- బస్తీ - దుమ్ము
- పదిరూపాయల టెక్కెట్టు
- కొత్త వోటు
- కోతులు
- భూమి యుద్ధాలు
- మత్రివర్గం
- రైలు - బస్సు
- తెలుగు ఇడెన్
- మేజువాణి-ఇందులో 6 వ్యాసాలు ఉన్నాయి
- వన్సు మోర్
- నాటకం-టాకీ
- గాన ప్రశంస
- వేషరాగాల మేజువాణి
- తెలుగు నటుడు
- త్యాగరాజు మాటల
- అయోమార్గ విమర్శ
- త్యాగరాజు ఆత్మ విచారం
- పెళ్ళి ట్రైనింగ్,
- అద్దె కొంపలు
- కాలక్షేపం
- అన్నీ తగాదాలే
- అవును
- నిజం
- పద్యం - అర్థం
భమిడిపాటి హాస్య గుళికలు
భమిడిపాటి కామేశ్వర రావు గారి అనేక హాస్య రచనల నుండి కొన్ని హాస్య పూరకమై, ఈనాటికి సందర్భ శుద్ధిగా ఉండేవి కొన్ని ఇక్కడ ముచ్చటించుకుందాము:- పాలక సంఘాల్లో ఎన్నికల మజా అన్న వ్యాసం నుండి-
- ఇప్పటి పరిపాలనతో సంబంధించిన ఎన్నికల పోటీల్లో నెగ్గటానికి ఎవరికేనా, నంగోరు ధనం, నంగోరు నక్కజిత్తులూ ఉండాలి. లేక ఒకవేళ హీనుడైనా పరిపూర్ణమైన నక్కజిత్తు లుండి, ఇంకోడిచేత ధనం పెట్టుబడి పెట్టంచినా చాలు.
- ఒకడు పాడు పన్లు చేస్తూవుంటే, మనంకూడా, నెగ్గాలంటే, అంతకంటే పాడుపన్లు చెయ్యవలసి వచ్చేది ఎన్నికల్లోనే.
- ఎన్నికల నిఘంటువులో అసత్యం అధర్మం, అన్యాయం, ద్రోహం క్రౌర్యం, దారుణం లాంటి మాటలుండవు.
- పదవి లాక్కోవాలని ఒకరూ, ఉంచుగోవాలని ఒకరూ రాక్షస చాణక్యుల్లాగ ఎత్తుపై ఎత్తులు వేస్తూనే ఉంటారు. పాలకసంఘం పాలించవలసిన మేరలో ఉన్న జనంసంగతి ఎవర్కీ అక్కర్లేదు. జనం పంపినమీదట పాలకసంఘంలోకి వెళ్ళి, వెంటనే ఆ జనాన్ని మరచిపోడమే ఎన్నికల్లో మజా; ఒకవేళ జ్ఞాపకం ఉంచుగున్నా, ఆ జనుల్లో మొదటి జనుడు తనేగదా అనుకోడం మరీ మజా!!
- వన్స్ మోర్ వ్యాసంలో-
- మామూలు ధోరణి మారి, వ్యాపారం ముదిరినప్పుడు, చాలా మంది తెలుగువాళ్ళు లోగడ మాట్లాడుతూన్న తెలుగు మానేసి ఎక్కువ గంభీరంగా ఉండడానికి, యధాశక్తి ఇంగ్లీషులో కోపిస్తారు.
- నాటకం - టాకీ వ్యాసంలో-(అంతకుముందు సినిమాలకు శబ్దం ఉండేదికాదు.
శబ్ద చలన చిత్రాలు ఒచ్చిన కొత్తల్లో సినిమాలను "టాకీ" అనేవారు)టాకీలలోని
కథ వగైరా గురించి-
- ".....సరి మరి కథ. అది పురాణం అవాలి. లేకపోతే అంధ(అచ్చు తప్పేమో ఆంధ్ర బదులు అంధ అని ఉన్నదనుకోవటానికి వీలులేదు. రచయిత ఉద్దేశ్యం "అంధ" అంటే "గుడ్డి" అని) జనానికి గణ్యత ఉండదు. అంధ జనం నూటికి తొంభై. వాళ్ళంతా హాజరైనప్పుడుగాని టాకీ వర్తకం కిట్టదు. వాళ్ళకి భక్తి కుదిరేందుకు దేవుళ్ళూ, భయం వేసేందుకు అడివి మృగాలూ, హుషార్ కలిగేందుకు సుందరులూ వాళ్ళ స్నానాలూ, ఆటలకి గంభీరమైన శీర్షికలూ-సర్వంగిలాబా చెయ్యడంకోసం కైంయిమంటూ మంచి పీకవాళ్ళు పాటలూ! దాంతోటి జన బాహుళ్యం మొదట తమాషాకోసమున్నూ తరువాత తోచకానూ ఎగపడడం. 'వార ప్రతిష్ఠతో' డబ్బురావడం, డబ్బొచ్చిన టాకీ గనక గొప్పదని చెప్పడం! అందువల్ల అందులో యంత్రిపబడ్డ నటులు అసమానంగా అభినయించారనిన్నీ, వాళ్ళ కీర్తి మిన్ను ముట్టడం రూఢీ గనకనే వాళ్ళని 'తార' లు అంటున్నారనిన్నీ చెప్పుగోడం."
- "...బొమ్మకి కన్ను చాలు (టాకీలో మాటలకి గణ్యత తక్కువ గనక) అందుకని, టాకీ పామరుల్ని కూడా అకర్షిస్తుంది. కాదు పామరుల్నే ఆకర్షిస్తుంది...."
- తెలుగు నటుడు వ్యాసం నుండి-
- "నటుడికి సౌష్టవమూ, బలమూగల విగ్రహమూ, అడే కాళ్ళూ, తిరిగే చేతులూ, కోటేసినట్టుండే ముక్కూ, చారెడేసి జిలజిలలాడే కళ్ళూ, హృదయభావాన్ని స్వీకరించి స్థిరం చేసుకోగల ముఖమూ, కంచుగీసినట్టూ మధురంగానూ ఉండగల గాత్రమూ, ఉచితమైన సంగీత సామగ్రీ, ఆరు వేషాలుగల తెలుగు ఉచ్చారణా, ఆంధ్ర భాషా, ఇతర సన్నిహిత భాషల్లో ప్రవేశమూ, వాటిల్లో ఉచ్చరణా పాటవమూ, అమోఘమైన ధారణా, ఉచితవేషం ధరించుకోగల తెలివీ,బోధనా శక్తీ, ఆకర్షణా, సౌశీల్యమూ, నాటకకర్త గిలికిన రచనకి మెరుగు పెట్టగల ప్రతిభా-ఇల్లాగా వీలైనన్ని శక్తులూ, సామర్ధ్యాలూ ఉంటేగాని ఎంతమాత్రము వీల్లేదని కోప్పడి శాసించారు".
- పరీక్షలు వ్యాసం నుండి-
- పరీక్షలకోసం, మార్కుల కోసం మాత్రమే బాధపడేవాడికి, విద్య అంటదు. విద్యకోసం పాటుపడేవాడికి పరీక్షవల్ల బాధే ఉండదు.
- ...జీవితం ఒక పెద్ద నిత్య పరీక్ష. జీవితపరీక్షకి ఎప్పుడో తయారు అవుతానులే అనడంకాక, అప్పటికప్పుడు తయారుగా ఉండడం మానవుడి విధి.
- మన తెలుగు వ్యాసం నుండి-
- ...నూటికి నూరుమంది పైచిలుకు మాట్టాడే తెలుగు కలగాపులగమే. ఈ పులగంలో సస్కృతం, పార్శీ, ఇంగ్లీషుమాత్రం జోరుగా పడ్డాయి. తెలుగు యొక్క మెత్తదనం వల్లనే ఇన్నిన్ని భాషల పదాలు బాణాల్లాగ హృదయం నాటేలాగ తెలుగులో గుచ్చుకుని ఉన్నాయి. తెలుగు శరీరంలో వాటిని నిల్చి ఉండనిస్తే అవి సెలలువేసి ప్రాణం తీసేస్తాయని కొందరూ, లేక వాటిని పైకిలాగిపారేస్తే వెంటనే ప్రాణపోకట అని కొందరూ!
- ఎప్పుడూ ఇంతే నాటికలో ఒక పాత్ర-
- "...చంపేస్తానని ఎంతఒపని చేయిస్తునావురా నీ తుపాకీ ఇదైపొనూ! నిన్నైనా మోస్తుం లెక్కలేకుండా!!మావాడైపోయాడు, అదీ మా విచారం, అదీ మా శిరఛ్ఛేదం. మావాణ్ణితప్ప విడిచి మరి ఇతరుణ్ణి ఎవణ్ణయినాసరే తెగ మోద్దుం చచ్చేవరకూను!...."
- "....వాడు కేవలం నాశనం అయుపోవాలి. నాకది చాలు! నే బాగు పడక్కర్లేదు. దుర్యోధునుడికి పై అంతస్థు నాది. వాడు చేతగాని వాడు. ధర్మరాజుకి ఉందనీ, తనకి లేదనీ తనకి కూడా కలగాలనీ ఏడిచాడు. నేను, నాకక్కర్లేదు, ఇంకోడికి పోతే చాలనీ....."
- క చ ట త ప లు నాటికలో-
- ..."ఈ వ్యాపారంలో ఎల్లానైనా నేనే ఓ గొప్పవాణ్ణికావాలి, కానీ ఖర్చుకాకుండా. అధమం వీణ్ణి కానియ్యకూడదు...."
- "...పంపకాలు కుదరక పారపోసుగోడం మనకి కొత్తగాదు!..."
- అద్దెకొంపలు వ్యాసం నుండి
- "....అద్దె యజమానురాలుగారు ఒక్కత్తే ఒక యెత్తూ! ఒక్కొక్క యజమానురాలి చర్య అద్భుతం! అసలు ఆవిడ గృహిణి, అందులో అద్దెకొంపల రాణీ. అందులో కాస్త స్వాతిశయంకూడా ఉంటే ఆవిడ అద్దెకొచ్చిన వాళ్ళని ఎలాచూస్తుందని తమ ఊహ? తప్పు చేసిన కోడల్ని అత్తగారు ఇంతగా రొకాయించదు! నీతితప్పిన పెళ్ళాన్ని తాళి గట్టినముగుడు ఇంతగా దండించడు! నేరంచేసిన పాపిని దండనాధికారి ఇంతగా దుయ్యబట్టడు! చవట పరిపాలన చేసే మండలేశ్వరుణ్ణి సామాజ్య మంత్రి ఇంతగా ఆజ్ఞ పెట్టడు! అద్దెల వాళ్ళ ఆచారం గర్వం, తన ఆచారం మడి. తన వస్తువు ఇంకోరి ఇంట్లో కనపడితే, వారిది దొంగతనం; ఇంకోరి వస్తువు తనింటోఉంటే "ఎక్కడికి పోతుందే! పొరపాటో" అవడం! అద్దెలవాటాల తూముల్లోంచి ప్రవహించేది అపవిత్రమైన కంపుముండానీరు, తన వాటా తూముల్లోంచి వెళ్ళేది పావనమైన అభిషేకజలం(ఇదంతా కలిపి ఒకటే తోము అయినా సరే ఆవిడ వాదన అంతే). దొడ్లో తక్కినవాళ్ళ వాటాల్లో కాసేవన్నీ కేవలం తనవే. నలుగురూ వచ్చే నూతిదగ్గర తమరి తాలూకు పిల్ల గుడ్డలు మాత్రమే జాడించవచ్చు! అద్దెలవాళ్ళుగనక ఆపనే అక్కడచేస్తే, "ఎవళ్ళకొచ్చింది ఈ వినాశకాలం! అన్నం తింటారా, గడ్డి తింటారా!" అంటో తను ఆపని చేస్తూనే, ధరీ అంచూ లేకుండా లెక్చరు పూర్వకంగా తిట్టడం........"(ఇలా ఇంకా రెండు పుటలు ఉన్నది, అప్పటి అద్దె ఇళ్ళల్లో ఉండేవారు ఎదుర్కోవలసిన బాధల చిట్ట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి