అలిశెట్టి ప్రభాకర్
వికీపీడియా నుండి
అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల
లో 1956 జనవరి 12 న పుట్టారు. అలిశెట్టికి ఏడుగురు అక్కా చెల్లెళ్ళు,
ఇద్దరు అన్నదమ్ముళ్ళు. తండ్రి పరిశ్రమల శాఖలో పని చేస్తూ ఆకస్మికంగా
మృత్యువాత పడ్డాడు. ఆయన మరణంతో 11 ఏళ్ల వయసులో ప్రభాకర్ కుటుంబ పోషణ
బాధ్యతలు స్వీకరించాడు. సిరిసిల్లలో రాం ఫోటో స్టూడియోలో ఫోటోగ్రఫీ
నేర్చుకొని, 1975 లో జగిత్యాలలోని సొంత ఇంట్లో పూర్ణిమ స్టూడియో
ప్రారంభించాడు. ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలయిన 'భాగ్యం' ను పెళ్లి
చేసుకొన్నారు. 1982 లో హైదరాబాదు లో స్థిరపడ్డారు. క్షయ బారిన పడి 1993 జనవరి 12న మరణించారు.ప్రసిద్ధ కవితలు
- తనువు పుండై... తాను పండై...తాను శవమై...వేరొకరి వశమై...తను ఎడారై ... ఎందరికో.. ఒయాసిస్సై.... (సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గురించి)
- హృదయ త్రాసు
- ఎర్ర పావురాలు
- 1979 మంటల జెండాలు
- 1981 చురకలు
- రక్త రేఖ
- సంక్షోభ గీతాలు
- ఆంధ్రజ్యోతి దినపత్రికలో సిటీలైఫ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి