కలహపడునింట నిలువదు
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములు లేక సమ్మతి
మెలఁగంగా నేర్చనేని మేలు కుమారీ!
భావం:-
ఓ కుమారీ!కలహించు చోట కలిమి నిలువదు.కావున కొట్లాటలు లేని ఇంట నివశించుట
శ్రేయస్కరము.ఎల్లపుడు ఎవరితోనూ కలహించక సామరస్యభావముతో నడుచుకొనుమమ్మా
కుమారీ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి