విఱగఁబడి నడువఁ గూడదు
పరుల నడక లెన్ని తప్పు బట్టఁజనదు ని
ష్ఠములు వచింపఁగూడదు
కఱపఁగవలె మేలు మేలు గలదు కుమారీ!
భావం:-
ఓ సుకుమారీ!ఒద్దికగా నడవటం మంచిదిగాని,నిటారుగా మగానివలె నడుచుట మగువకు
చేటు.ఇతరులను దప్పు బట్టరాదు.ఇతరుల మనస్సును నొప్పించే మాటలాడరాదు.మంచితనము
నలవర్చుకొనవలెను.మూర్ఖత్వము విడనాడాలి.దీనివలన మేలు కలుగును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి