పావన నాగావళీ వంశధారలు సీమత దామ సుశ్రి నహింప
నిఖిల పుణ్యపగా నిలయ గోదావరి మరకత హార విస్పురణ
నెరవ శోభన కృష్ణవేణీ భద్రగామిని మణిహేమ కాంబికా
మహిమ నింప విమల పెన్నా నదీ వీలుకా బిభవమ్ము
చరణ మంజీర నైఖలి భజింప దివ్యమోహన కళలతో తేజరిల్లి
దెసలు దెసెలెల్ల దీపింప తెలుగు తల్లి ప్రాజ్య సువిశాల సుప్రజా
రాజ్య వీధి నిండు కొలువుండె కన్నుల పండువగుచు పుడమికి
పండుగయ్యె విరబూచెను భూ జన హత్సుమావశుల్ బడుగుల
ఝీవితాల చిర భాబ్య శుభోదయ దోచి దోచె సం దడిగ జనావళీ
హృదయ తంత్రులు తీయగ మ్రోగ సాగి లే వరులను సోలు జీవికల
వైభవముల్ విలసిల్లె కొల్లగా లేవోయీ నలుదిక్కులందు జయభేరి
నాద ముప్పొంగ రా రావోయీ హృదయాంతరాన శుభ సమ్రంభంబు
జృంభించె లే లే వోయీ కనుగోనలందు మనసేలే కాంక్ష రూపించెరా
రావోయీ ప్రియ బాంధవా ప్రియ సఖా రా!మానవోత్తంసమా!
శ్రీనాధ కవిరాజ చిత్రవర్ణా కీర్ణ భవ్య ప్రభంధాల భావమంచి
రాగ రంజిత త్యాగరాజ సంకీర్తనా రమణీయకముతో రాగమంచి
కృష్ణవేణీ సముతృక్ష్ణ నర్తన కళా కేళీ తరంగిణిన్ తాళమంచి
ఆంధ్ర ప్రదేశోదయానంద వేళా స మారంభ సంగీత మంచుకొసగ
కావ్యగానము సేయు సత్కవులు వెలయ మాపదాంధ్ర ప్రతిభ
మన భాని నిలువ పుడమి నిడె ఎర్ర మందారపూవు పగిది
పరిమళీంచెను బ్రతుకు సంపంగి కరణి నన్నయ్య మొదలుగా
నాబోటి కవిదాక గలయాంధ్ర సుకవితా కౌశలమ్ము భారతమ్మాదిగా
చిడి పాత్తముల దాక గలయాంధ్ర సాహితీ గౌరవమ్ము శ్రీకాకుళము
మొదల్ చిత్తూర్ కడదాక గల యాంధ్ర దేశీయ ఎలననమ్ము ముసలి
వొగ్గుల మొదల్ ముద్దుబిడ్డల దాక గల యాంధ్ర జాతీయ కలకలమ్ము
గొంతు గొంతున గాన స్రవంతి గాగ పుటపుతాంతర్గత పురాణ భోధ గాగ
దిక్కుదిక్కుల ధ్వనియించు బుక్కుగాగ పొడిచె నిపుడిప్పుడె తెంగు
ప్రొద్దుపొడుపు బ్రతుకు బ్రతుకున తీయని పాట రేగి గొంతు గొంతున
గనస్రవంతు లురలి దేశదేశాల తెలుగుల దీప్తి వెలుగ పాడుచు
మెల్లమెల్లగా తెంగు ప్రొద్దుపొడుపు ప్రాబాతోత్సనమయ్యె ప్రాగ్గిశ మఫారాజీవ
రాగంశువుల్ శోభారామముగాగ జేసె ప్రకృతిన్ సుతాలచలాలంకృతిన్
భూభాగసమ్ము వసంత గార రస సంఫూర్ణంబు గాదోచె జ్ రా! భవ్యాశయ
దివ్య దీప్తులలమెన్ త్రైలింగ దేశమ్మునన్!
42.పురాతన భరత భూమిని
నేను పుట్టిన నేల తల్లికి
నిండుగా కై దండ లిడుదుము
తల్లి గుండెల పరిమళములను
తమ్ము అందరి కందజేతును
భరతమాతను చెరుపు చేసి
దుష్టులను దునుమాడి గెలుతును
దేశమాత సమగ్ర సౌష్టవ
రూపమును కాపాడ నిలుతును
మానవతనీ మంట కలిపే
మత దురంతము నతికరింతును
వర్తమాన చరిత్ర తలపై
గత పిశాచిని తొలగ ద్రోతును
నేలతల్లి తనూజలందరు
అన్నతమ్ముల ఆత్మబంధము
పెనచి ఒకటై సంపదల సృజి
యించు మంచికి పోరెదన్
లేమి నలిగే రేదలను ధన
బలము గల పీడకులు దోచని
సర్వ స్వతంత్ర సమాన ధర్మము
విలసిలగ పోరాడెదన్
శ్రామికుల హాలికుల నొక్కటి
చేసి నూతన జన స్వామ్యము
ఈ పురాతన భరత భూమిని
స్వర్గ తుల్య మొనర్చెదన్
43.ప్రజకూర్చిన రాజ్యాంగం
తరగలించె కాంతిరేఖ
భరతజాతి మస్తకమున
పరిమళించె విశ్వంభర
ఇరువది ఆరవ జనవరి
||తర||
పెదరాచరికపు చాయలు
చిరిగి చిరిగి చెరగిపోయె
తరిగిన మన భారతమ్మె
పరిపుష్టమై నిలచెను
||తర||
ఎలుగెత్తెను భారతమ్ము
వెలుగుల శంఖాలు నొత్తి
విజయ దుంధుభులే మ్రోగెను
ప్రజకూర్చిన రాజ్యాంగం
||తర||
44.పండుగరోజు
ఏడు కోట్ల పూలువిరిసి మురిసిన పండుగరోజు
విరుల తావు లచ్చరలై వియచ్చరలైన రోజు
నెల బాలుడు మిన్నులు దిగి నేలకు వచ్చినరోజు
కొమ్మల్లో కోయిలవై కుహుకుహు అన్నను
నదుల మతులు పులకరించి నాట్యం చేసిన రోజు
గట్లు త్రంచి సముద్రాల కౌగిలించుకున్న రోజు
ప్రభాత ప్రదోషాలు పసుపు కుంకుమలు చల్లిన రోజు
భావాలు రంగుల తోర్ణాలై ద్యోవా పృధుల మధ్య ఎగిరిన రోజు
మమత విశాల మానవతకు కర్పూర నీరాజన మిచ్చిన రోజు
ఉల్లిపార కాగితాన్నై ఊదా రంగు పులుముకొని
ఒక ఉజ్వల పతాంగాన్నై అనంత నీలిమలో విహరంచాను
ధరిత్రి తిరిగెను చరిత్రలో ఒక పేజీ పెరిగెను
చైత్రం విరిసిన తోటకు ఝంఝూ మరత్తు వచ్చెను
పూల గుండెలను హొలాహొల పూరితాలు చేశారు
వెన్నెలలు వెలార్చు విషజ్వాల రగిల్చారు
విరులు రాలి తరులు కూలి ఝరుల నీరు జారిపోయి
జీవకాంత లారిపోయి సుందర వందర లైతే
ఏ కొమ్మలు చేరి నేను ఏ గీతిక పాడతాను
ప్రపంచ విపంచి పంచమ స్థాయి నెట్లు చేరుతాను
రెండు యెదలు కలియు మాట రెండు య్దలు కలుపు చేత
పొదలించుము సోదరుడా చదలందున నీ చరిత్ర
రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైనా
లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా?
మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలనీకుంటే
ధరాగమన మతటితో తలక్రిందై పోతుందా?
కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలం జయముస్తే
విశ్వసృష్టి పరిణామం విచ్చిన్నం అవుతుందా?
దనుజలోక మేకంగా దారినడ్డు నిల్చుంటే
నరజాతి ప్రస్థానం పరిసమాప్త మవుతుందా?
45.ఒక్కటేరా! తెలుగుదేశం
ఒక్కటేరా!తెలుగుదేశం ఒక్కటేరా! తెలుగుదేశం
ఒకటేరా!తెలుగు భాష ఎక్కడున్నా తెలుగులందరు
ఒక్కటేరా! ఒక్కటేరా! ఒక్కటే గోదావరీ నది
ఒక్కటే కృష్ణానది రెండు నదులూ తెలుగు జాతి
గుండెలో ఒకటైనవి ||ఒక్కటే రా||
అరకు లోయల గలికొండ హైదరాబాద్ గోల్కొండ
కలిసి కట్టెను తెలుగుతల్లి కంఠసీమను పూలదండ
||ఒక్కటే రా||
సాగరమ్ముక వైపున నిజాం సాగరమ్ముక వైపున
తెలుగు తల్లిని వీచు చల్లని అలల వీనన అదముప్పగ
||ఒక్కటేరా||
ఎదలు ఎదలు కూర్చి కట్టిన ఏకతా సేతువుల మీద
కదలివచ్చీ అభ్యుదయ చక్రాల నడ్డుట చేటుగదా?
||ఒక్కటేరా||
నలుగు రెవరో తప్పుచేసిన ఏడు కోట్లకు శిక్ష తగునా
ఎలుగ లేవో దూరినాయని ఇంటినే తగలేయ తగునా
||ఒక్కటేరా||
పాడి తప్పక పాటు పడదాం పంటలు పరిశ్రమలు పెడదాం
మెండుగా ఉత్పత్తి పెంచి దండిగా అందరము ఉందాం
||ఒక్కటేరా||
పేదవోయిన తెలంగాణను సెలవయిన సర్కారు ప్రాంతము
మధ్య రాయలసీమ తమ్ముల మధ్య భేధము మానివేద్దం
||ఒక్కటేరా||
ఆకలికి ఆవేశమునకు అహంకృతికి ద్వేషమునకు
మంచి చెడ్డలు కానుపించవు మంచి మాటలు వినుపుంచవు
||ఒక్కటేరా||
ఒక్క జాతిని రెండు ముక్కలు ఒక్క గుండెకు రెండు చెక్కలు
చేయువాదెవడైన ద్రోహము చేయువాడే తెలుగు తల్లికి
||ఒక్కటేరా||
గోదావరి కృష్న నేడు కూడి సాగగా ప్రతి ఆంధ్రుని ఎద
సమైక్య భావమాడెగా!
||ఒక్కటేరా||
జాతిని చీల్చిన గోడల జాడ మానెరా మూగపడ్డ వీణ తిరిగి
మ్రోయ సాగెరా! కలలు నిజములై కన్నుల
||ఒక్కటేరా||
కాంతి నించగా చరిత్రలో స్వర్ణ యుగం
తిరిగి మొలిచెరా!
||ఒక్కటేరా||
గతమునుండి గుణపాఠము గరచి మెలగరా
ద్వేషానైక్యతలు సమాధిలో పూడ్చరా!
||ఒక్కటేరా||
పేవవనం నాటు యద శ్రీలు పూయగా
శ్ర్మామృతము చల్లు సుఖం జాలు వారగా!
||ఒక్కటేరా||
పగిలిన ప్రతిశీతి గుండె పదిల పడెనురా
ప్రతి జాతియు స్వీయ గృహము ప్రవేశించెరా!
||ఒక్కటేరా||
జాతి జాతి కల భారతి జాతి మనదిర
శాంతి క్రాంతి కోరు తెలుగు జాతి మనదిరా
||ఒక్కటేరా||
సమైక్యత విశ్వప్రేమ గీత పాడరా
నవ్య జీవితభ్యుదయో త్సవము సేయరా
||ఒక్కటేరా||
గోదావరి కృష్ణ నేడు కూడి పాడగా
మహొంధ్రోందయ సౌభాగ్య మహిమ పాడరా!
||ఒక్కటేరా||
46.నీ చిన్ని నవ్వులో
ఓ తెలుగు తల్లీ శ్రీ కల్పవల్లీ వందనము
చేకొమ్ము వందనం హృదయ పూర్వక
వందనం మధుర కవనాలలో మహిత
శిల్పాలలో మృదుల గానములలో
ప్రతిపదంబు కళా రాజ్యాలు సృష్టించు
ప్రతిలేని బంగారు బంగారు తల్లీ!
నీ చిన్ని నవ్వులో నుప్పొంగు నదులన్నీ
నీ పలకరింపుతో పులకీంచు మాగాణి
నీకంటి చలువకై దివి నుండి దేవతలె
నిండు వేడుకలతో వేం చేసినారు
వీరమాతల ధాత్రి త్యాగయోగుల నేత్రి!
భవ్య జనయిత్రీ!
47.నవభారతదేశం
ఇది సుందర దేశం నవభారత దేశం
మృదు మంజులనాదం పురిగొల్పిన వేదం ||ఇది||
గల గల గల సవ్వడి గమకాలకు పల్లవి
అలనురగల వెల్లుడి పలికించిన అల్లరి
జ్వనదులె సంగమ సారాలకు తేటని
ప్రేమ ఎదల కలయికయే వెలుగొందిన జీవని ||ఇది||
కులమతమను భదము మనకెందుకు మిత్రుడా!
మతమౌధ్యాలెందుకు? భరతజాతి పుత్రుడా!
భాషలు వేరైనను భావమొకటి కనుమరా
భేదము లెంచకురా భారతికే మొప్పరా ||ఇది||
మారణ హొమాలను రగిలించుట తగదని
మానసదీపాలను వెలిగించుట సుఖమని
నడవడు లొకటైతే కలదందున రసధుని
కులమతమను తేడాలను వీడితే శుభశశి ||ఇది||
48.కోటి కోటి నరనారీ!
జయము జయము భరతావని!
సకల భువన పావనీ!
జయము జయము స్వేచ్చాప్రియ
జనతా సంజీవనీ!
అరుణారుణ చరణ కిరణ
కరుణా రసవాహినీ!
క్షమతాప్రియ మమతామయ
సమతా సమ్మోహినీ!
ధర్మవీర సమరధీర
దానశూర జనయిత్రీ!
నిర్మల విజ్ఞాన ధాత్రి!
కార్మిక కర్షక సవిత్రి!
మలయ పవన చలమపవన
కలిత లలిత హరితాంబర!
అతి సుందర సరిదంతర
ప్రతి బింబిత నీలాంబర!
పాటల సుమ సుకుమారీ!
కోటి కోటి నరనారీ!
గళమంగల విజయవాణి!
లలితకళా కల్యాణీ!
49.ఇదే ఇదే నా దేశం - ఇదే ఆంధ్రదేశం
తరతరాల చరిత్రలో తడిసిన సందేశం
శాతవాహనుల నాటి శౌర్యము ఊపిరిగా
కాకతీయ రాజుల సంగ్రామ దీక్ష సిరిగా
త్యాగరాజు గానసుధ ధారలు సంపదగా
పోతరాజు భాగవతపు గాధలు నా ఎదగా
హంసి అమరావతి నాకమరినని శ్రీకళలై
గోదానది కృష్ణవేణి కూరిమి నిచ్చెలులై
కూచిపూడి నాట్యము నా గొప్పను పెన్నిధిగా
విలసిల్లిన వికసించిన సంస్కృతి సన్నిధిగా
అంధ్రత్వం అన్ని దిశల ఆలోచన రేపగా
తెలుగుల అభిమాన ధనం దిక్కుల వ్యాపించగా
ఇది కోస్తా తెలంగాణా ఇది రాయలసీమగా
ఏడు కోట్ల గొంతులచే రాగము వినిపించగా
50. గురువులకిదే మా వందనం
చదువు నేర్పే గురులకిదె మా వందనం
జ్ఞాన దాతల చరనధూళికి వందనం
శాంతమూర్తులు స్వచ్చకీర్తులు
సుజన చంద్రులు - సుగుణసాంద్రులు
గురులు - సుతరులు
||చదువు||
రామునికి - విలువిద్య నేర్పెను
మౌని విశ్వామిత్రుడు
కృష్ణునే చదివించే
సాందీప జ్ఞాని పవిత్రుడు
ఎంత ఘనులకునైన గాని
గురువులే ప్రత్యక్ష దేవులు
||చదువు||
రాధాకృష్ణులు - రామకృష్ణులు
విశ్వకవులు - వివేకానందులు
శంకరులు - వేదవ్యాసులు
ఎందరెందరో జగద్గురువులు
||చదువు||
కోటి సూర్యులున్న - కోటి చంద్రులున్న
గురువు మాట లేకుండా - ఎద చీకటి పోతుందా?
జ్ఞానజ్యోతి వెలిగించి మము ప్రగతికి నడిపించె
గురువే బ్రహ్మ గురువే విష్ణువు - గురువే మహేశ్వరుడు
ఆ త్రిమూత్రి రూపునకిదె వందనం
ఆ దరుంతరంగున కిదె వందనం
||చదువు||
Nice poems but they very large
రిప్లయితొలగించండి