Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
సుమతీ శతకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సుమతీ శతకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, నవంబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 68

పగవల దెవ్వరితోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగనాడవలదు సభలను,
మగువకు మన సియ్యవలదు మహిలో సుమతీ. 

 భావం:-
ఎటువంటి వారితోడను పగ పెట్టుకొనరాదు.బీదతనము సంభవించిన తరువాత విచారింపరాదు.సభలలో మోమాటము లేకుండా మాట్లాడరాదు.స్త్రీకి మనసులోని వలపు తెలుపరాదు. 

27, నవంబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 67

నీరే ప్రాణాఅదారము,
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్,
నారే నరులకు రత్నము,
చీరే శృంగార మండ్రు,సిద్దము సుమతీ. 

భావం:-
నీరే అన్ని జీవులకు బ్రతుకుటకు ఆధారము.నోరే రసవంతమైన సమస్తమైన మాటలు పల్కుటకు స్థానము. స్త్రీయే సర్వజనులకు రత్నము.వస్త్రమే సింగారమునకు ముఖ్యము. 

26, నవంబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 66

నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్,
నవ్వకుమీ పరసతులతో,
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ. 

 భావం:-
సభలోపలను, తల్లిదండ్రులతోను, అధికారులతోడను, పరస్త్రీలతోడను, బ్రాహ్మణ శ్రేష్ఠులతోడను పరిహాసములాడకుము. 

25, నవంబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 65

నవరస భావాలంకృత
కవితా గోష్టియును,మధుర గానంబును,దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్దము సుమతీ. 

 భావం:-
శృంగారాది నవరసములతోడను భావముల్తోడను అలంకరింపబడిన కవిత్వ ప్రసంగమును,మనోహరమగు పాటయును,తెలివిలేనివారికెంత తెలియజేసినను,చెవిటివాడికి శంఖమునూదినట్లే నిరర్థకమగును. 

24, నవంబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 64

నరపతులు మేరదప్పిన,
దిరమొప్పగ విధవ యింట దీర్పరియైనన్.
గరణము వైదికుఁడైనను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ. 

 భావం:-
రాజులు ధర్మము యొక్క హద్దు తప్పినను,విధవ స్త్రీ ఇంటి యందెల్లకాలము పెత్తనము చేసినను,గ్రామ కరణము వైదిక వృత్తి గలవడైనను ప్రాణము పోవునంతటి కష్టము తప్పకుండా సంభవించును. 

23, నవంబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 63

నయమున బాలుం ద్రావరు
భయమున విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియొ
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ. 

 భావం:-
మంచి తనము వల్ల పాలునుసహితము తాగరు.భయపెట్టుట చేత విషమునైనను తిందురు. కావున భయమును చక్కగా చూపించవలయును. 

22, నవంబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 62

నమ్మకు సుంకరి,జూదరి,
నమ్మకు మగసాలివాని,నటు వెలయాలిన్,
నమ్మకు మంగలివానిని,
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ.

 భావం:-
పన్నులు వసూలు చేయువానిని, జూదమాడువానిని, కంసాలిని, భోగముస్త్రీని, సరుకలమ్మవారిని,ఎడ్డమచేతితో పనిచేయు వారిని, నమ్మకుము. 

21, నవంబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 61

నడవకుమీ తెరువొక్కుటఁ
గడుపకుమీ శత్రునింట గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ. 

 భావం:-
మార్గమునందు యొంటరిగా నడువకుము,పగవాని ఇంటియందు స్నేహముగా భుజింపకుము,ఇతరుల ధనమును మూటగట్టకుము,ఇతరుల మనస్సు నొచ్చునట్లు మాటలాడకుము. 

20, నవంబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 60

ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీఁదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ. 

 భావం:-
కొబ్బరిచెట్టుకు నీరుపోసినచో శ్రేష్టమైన నీరుగలకాయలను యిచ్చును.అట్లే బుద్ధిమంతులకు జేసిన యుపకారము మర్యాదయును,తరువాత మిక్కిలి సుఖములను గల్గించును. 

19, నవంబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 59

ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్ష మెత్త వలసెన్
దన్వారి కెంత గలిగిన
తనభాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ. 

 భావం:-
ధనవంతుడైన కుబేరుడు స్నేహితుడైనప్పటికినీ ఈశ్వరుడు బిచ్చమెత్తుట సంభవించెను.కాబట్టి,తనవారి కెంత సంపదయున్నను,తన కుపయోగపడదు,తన భాగ్యమే తనకు ఉపయోగించును. 

18, నవంబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 58

తాననుభవింప నర్దము
మానపపతిజేయు గొంత మఱి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ. 

 భావం:-
తేనెటీగలు అడవులలో చేర్చియుంచిన తేనె యితరులకు చేరునట్లు,తాము భోగింపక దాచిన ధనము కొంత రాజులపాలు ,మరికొంత భూమిపాలు యగును. 

17, నవంబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 57

దగ్గర కొండెము చెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మఱి తా
నెగ్గు బ్రజ కాచ్రించుట
బొగ్గులకై కల్పతరువు బొసుచుట సుమతీ. 

 భావం:-
మంత్రి చెప్పు చాడీలను విని,రాజు ప్రజలకు కీడుచేయుట-కోరిన కోరికలనిచ్చు చెట్టును బొగ్గులకై నరుకుటతో సమానము. 

16, నవంబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 56

తలమాసిన,వొలు మాసినఁ,
వలువలు మాసిననుఁ బ్రాణవల్లభు నైనన్
కులకాంతలైన రోఁతురు,
తిలకింపగ భూమిలోన దిరముగ సుమతీ. 

 భావం:-
ఆలోచింపగా,భూమియందు-తలయు,శరీరమును,బట్టలు మాసినచో పెనిమిటినైననూ,(మంచి స్త్రీలైనప్పటికిన్ని) అసహ్యపడుట నిజము. 

15, నవంబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 55

తలపొడగు ధనము బోసిన
వెలయాలికి నిజములేదు వివరింపంగా
దలఁదడివి బాసఁజేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ. 

 భావం:-
తలపొడగు, ధనము పోసినప్పటికిన్ని వేశ్యాస్త్రీకి సత్యమాడుట లేదు.తలమీద చెయి వేసుకొని ప్రమాణము చేసినను వారకాంతను నమ్మరాదు. 

14, నవంబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 54

తలనుండు విషము ఫణీకిని
వెలయంగాఁ దోకనుండు వృశ్చికమునకున్
దల దోఁక యనకనుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ. 

భావం:-
తలయందు పామునకు,తోకయందు తేలునకును,విషముంటుంది,కాని దుర్మార్గునికితల ,తోకయును నియమము లేక,శరీరమంతయు విషముండును. 

13, నవంబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 53

తమలము వేయని నోరును
విమతులతోఁ జెలిమి జేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలఁకును
హిమధాముఁఢులేనిరాత్రి హీనము సుమతీ. 

 భావం:-
తాంబూలము వేసుకోనినోరును,విరుద్ధమైనతనము గలవారితో స్నేహము చేసి విచారించు వివేకమును,తామరలు లేని సరస్సును,చంద్రుడు లేని రాత్రియును నీచమైనవే. 

12, నవంబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 52

తనవారు లేనిచోటును
జనమించుక లేనిచోట జగడము చోటన్,
అనుమానమయిన చోటను,
మనజున కట నిలువఁదగదుఁ మహిలో సుమతీ. 

 భావం:-
తన బంధువులు లేని తావునను,తనకు మచ్చికలేని తావునను,తనపై ననుమానమయిన తావునను మనుష్యుడు నిలవక్కూడదు. 

10, నవంబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 51

తన కలిమి యింద్రభోగము,
తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్,
తన చావు జగత్ప్రళయము
తను వలచిన యదియెరంభ తథ్యము సుమతీ.

 భావం:-
తనభాగ్యము ఇంద్రవైభవము వంటిదిగాను,తన పేదరికమే ప్రపంచమున గొప్ప దారిద్ర్యము వంటిదిగాను,తన చావే యుగాంత ప్రళయము వంటిదిగాను,తాను వలచిన స్త్రీయే చక్కదనము గలిగినటువంటిదుగాను మనుజులెంచుదురు.

9, నవంబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 50

తనయూరి తపసితనమును
దనబుత్రుని విద్యపెంపుఁ,దన సతి రోపున్,
దన పెరటిచెట్టు మందును,
మనసున వర్ణీంపరెట్టి మనుజులు సుమతీ. 

 భావం:-
తన గ్రామములో జేయు తపోనిష్ఠయు,తన కుమారుని విద్యావైభోగమును,తన భార్య యొక్క సౌందర్యమును,తన పెరటి లోని చెట్టు మందును,యెటువంటి మనుజులైనను పొగడరు.

8, నవంబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 49

తనకోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష,దయ చుట్టంబౌఁ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు,తథ్యము సుమతీ.

 భావం:-
తనయొక్క కోపము శత్రువు వలె బాధయును.నెమ్మదితనము రక్షకునివలె రక్షణయును,కరుణ చుట్టమువలె ఆదరమును, సంతోషము స్వర్గమువలె సుఖమును,దుఃఖము నరకము వలె వేదనను కల్గించునని చెప్పుదురు.