Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
సుమతీ శతకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సుమతీ శతకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, నవంబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 48

తడవోర్వక యొడలోర్వక
కడువేగం బడచిపడిన గార్యంబుగానే
తడవోర్చిన నొడ లోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్లఁ జేకురు సుమతీ.

భావం:-
ఆలస్యమును,శ్రమను సహింపక,వెంటనే త్వరపడినచో ఏ కార్యమును కానేరదు.ఆలస్యమును,శ్రమను సహించి ఓపికపట్టినచో చెడిపోయిన కార్యమంతయును సమకూరును.

6, నవంబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 47

చేతులకు తొడవు దానము
భూతలనాథులకుఁదొడవు బొంకమి,ఠఃఅరలో,
నీతియే తొడ వెవారికి.
నాతికి మానంబు తొడవు,నయముగ సుమతీ.

భావం:-
చేతులకు దానమును,రాజుల కబద్ధమాడకుండుటయును,ధరణిలో నెవ్వరికయినని న్యాయమును,స్త్రీకి పాతివ్రత్యమును అలంకారము.

5, నవంబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 46

చుట్టములు గానివారలు
చుట్టములముఁ నీకటంచు సొంపుదలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ. 

భావం:-
బంధువులు కానివారు సహితము ధనము కలిగినపుడు నీకు మేము చుట్టాలమని ఉల్లాసముతో బలాత్కారముగా వచ్చి మిగుల ధృడముగా నాశ్రయింతురు. 

4, నవంబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 45

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుఁడుదగన్
హేమంబుఁ గూడఁ బెట్టిన
భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీ. 

భావం:-
చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైన విధముగానే,లోభి దాచిపెట్టిన ధనము రాజులపాలగును. 

3, నవంబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 44

చింతింపకు కడచినపని
కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో
నంతఃపుర కాంతులతో
మంతనములు మానుమిదియే మతముర సుమతీ. 

 భావం:-
జరిగిపోయిన పనికి విచారింపకుము,స్త్రీలు ప్రేమింతురని నమ్మకుము.రాణివాస స్త్రీలతో రహస్యాలోచనములు చేయుకుము.ఇదియే మంచి నడవడి సుమా. 

2, నవంబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 43

గడనగల మగనిఁ జూచిన
నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలోఁ
గడనుడుగు మగనిఁజూచిన
నడపీనుగు వచ్చెననుచు నగుదురు సుమతీ. 

భావం:-
స్త్రీలు సంపాదన గల పతిని జూచి యడగలకు క్రింద వస్త్రపు మడతలు వేసినట్లు తమలో భావించుచూ గౌరవింతురు.సంపాదన లేని పతిని జూచిన నడచెడు పీనుగుగా తమలో భావించుచూ పరిహాసము చేయుదురు. 

1, నవంబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 42

కోమలి విశ్వాసం బునూ
బాములతో జెలిమిఁ యన్య భామల వలపున్,
వేముల తియ్యదనంబును,
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ.

భావం:-
స్త్రీలయొక్క నమ్మకమును,పాములతో స్నేహమును,పర్సస్త్రీల యొక్క మోహమును,వేపచెట్టు తియ్యదనమును,రాజుల విశ్వాసమునకు కల్లలు.

31, అక్టోబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 41

కొఱగాని కొడుకు పుట్టినఁ
గొఱగామియెగాదు తండ్రి గుణములఁజెఱచున్
జెఱకుతుద వెన్ను పుట్టినఁ
జెఱ్కునఁ తీపెల్ల జెరచు సిద్దము సుమతీ. 

భావం:-
చెఱకుకొనయందు వెన్నుపుట్టి ఆ చెఱకునందలి తియ్యదనమెల్ల యెట్లుపాడుచేయునో అట్లే నిష్ప్రయోజకుండగు కొడుకు పుట్టినచో వాడు నిష్ప్రయోజకుడగుటయేగాక తండ్రి యొక్క మంచి గుణములు గూడ చెఱచును. 

30, అక్టోబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 40

కొక్కోక మెల్ల జదివిన
చక్కనివాఁసైన రాజ చంద్రుండైనన్
మిక్కిలి రొక్కము నీయక
చిక్కదురా వారకాంత సిద్దము సుమతీ.

భావం:-
రతిశాస్త్రమంతయు చదివినవాడనైనను,అందము గలవడైనను,రాజులలొ శ్రేష్టుడైనను,మిక్కిలి ధనమీయకుండా వేశ్య లభించదు.

29, అక్టోబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 39

కొంచెపు నరుసంగతిచే
నంచితముఁగ గీడువచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి కఱచిన
మంచమునకుఁ బెట్లువచ్చు మహిలో సుమతీ. 

 భావం:-
చిన్ననల్లి కఱచినచో మంచమునకే విధముగా దెబ్బలు తగులునో అట్లే నీచునితో స్నేహము చేసినవాడికి కీడు కలుగును. 

28, అక్టోబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 38

కూరిమిగల దినములలో
నేరములెన్నఁడునుఁ గలుగ నేరవు మఱి యా
కోరిమి విరిసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ. 

భావం:-
స్నేహముగల దినములలో యెప్పుడునూ తప్పులు కనబడవు.ఆ స్నేహము విరోధమైనచో ఒప్పులే తప్పులుగా నగపడుచుండును. 

27, అక్టోబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 37

కులకాంతతోడ నెప్పుడుఁ
గలహింపకుఁ వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంటి కన్నీ
రొలికిన సిరి యింటనుండ దొల్ల దు సుమతీ.

 భావం:-
భార్యతో ఎప్పుడును జగడమాడరాదు.లేనితప్పులు మోపరాదు.పతివ్రతయైన స్త్రీయొక్క కంటినీరు పడినచో ఇంటి యందు సంపద ఉండదు.

26, అక్టోబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 36

కారణము లేని నగవునుఁ
బేరణములేని లేమ పృథివీస్థలిలోఁ
బూరణము లేని బూరెయు
వీరణాములు లేని పెండ్లి వృధరా సుమతీ.

భావం:-
కారణములేని నవ్వును,రవికెలేని స్త్రీయును,పూరణములేని బూరెయను,వాద్యములులేని పెండ్లియును,గౌరవములేక యుండును.

25, అక్టోబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 35

కాముకుడు దనిసి విడిచినఁ
కోమలిఁ బరవిటుఁడు గవయఁ గోరుటయెల్లన్
బ్రేమమునఁ జెఱుకు పిప్పికిఁ
జీమలు వెస మూగినట్లు సిద్దము సుమతీ.

భావం:-
కాముకుడు తాను తృప్తియగునంతువరకుననుభవించి విడిచిన స్త్రీని మఱియొకవిటగాడనుభవింపగోరుట చెరుకురసము పీలిచికొనగా మిగిలిన పిప్పిని చీమలాసతో ముసురుకొన్నట్లుపయోగములేనిదిగా నుండును.



24, అక్టోబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 34

కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తి కాంత పొందిన పిదపన్
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ. 

భావం:-
 దుర్జన స్నేహము కూడదు.కీర్తి సంపాదించిన తరువాత తొలగిఁపోదు.అప్పునిచ్చుట కలహముకు మూలము.స్త్రీలకు ప్రేమ కోంచమైనను యుండదు.

23, అక్టోబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 33

కవి గానివాని వ్రాతయు
నవరసభావములు లేని నాతులవలపున్
దవిలి చని పంది నేయని
విధధాయుధకౌశలంబు వృధరా సుమతీ.

 భావం:-
కవిత్వ శక్తిలేనివాడు వ్రాసిన వ్రాతయు,తొమ్మిదిరసముల యొక్క అనుభవములేని స్త్రీలయొక్క మోహమును,వెంబడించి పరుగెత్తి పందిని కొట్టలేనటువంటివాని నానా విధాయుధముల నేర్పరితనమును వ్యర్థములు.


22, అక్టోబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 32

కసుగాయఁ గఱాచి చూచిన
మసలకఁతగు యొగరుఁగాక మదురంబగునా?
పస గలుగు యువతులుండగఁ
బసిబాలలఁబొందువాడు పశువుర సుమతీ.

భావం:-
పండినపండు తినక పచ్చికాయ కొరికినచో వెంటనే వగరు రుచితోచునుగాని మధురమెట్లుగలుగదో,అట్లే యౌవనముగల స్త్రీలుండగా పసిబాలికలతో గూడినచో వికటముగా నుండును.చిన్న బాలిక పొందు గూడినవాడు పశువుతో సమానుడు.


21, అక్టోబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 31

కరణము సాదైయున్ననుఁ
గరి మదముడిగిననుఁ,బాము గఱవకయున్నన్
ధరఁ దేలు మీటకున్ననుఁ
గరమరుదుగ లెక్కగొనరు గదరా సుమతీ. 

 భావం:-
 కరణము మెత్తని తనమును గలిగియుండినను,ఏనుగుమదము విడిచినను,పాము కఱవకుండిన,తేలు కుట్టకుండినను జనులు లక్ష్యము చేయరు.

20, అక్టోబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 30

కరణముల ననుసరింపక
విరసంబునఁ దిన్నతిండి వికటించుఁజుమీ,
యిరుసునఁ గందెన బెట్టక
పరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ.

భావం:-
పరమేశ్వరునిబండి యయినప్పటికిని యిరుసులో కందెనను బెట్టనిదే పరుగెత్తనియట్లే,కరణ్మతో నౌసరింపక యున్నయెడల కష్టములు సంభవించును.

19, అక్టోబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 29

కరణముఁగరణము నమ్మిన
మరణామ్తక మౌనుగాని మనలేడు సుమీ
కరణము దనసరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ.

భావం:-
కరణము మరియొక కరణమును నమ్మిన యెడల ప్రాణాపాయమైన యాపదగల్గును గాని బ్రతుకఁలేడు.కావున కరణము,తనతో సాటియైన కరణమును నమ్మక,మఱియు,రహస్యమును దెలుపక జీవించవలయును.