Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
సుమతీ శతకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సుమతీ శతకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, డిసెంబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 88

బలవంతుఁడ నాకేమని
బలవురతో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కిచావదె సుమతీ.

భావం:-
బలము కలిగిన పాము ఐనప్పటికినీ చలిచీమలచేత పట్టుబడి చచ్చును.అట్లే తాను బలవంతుడనేగదా అని అనేకులతో విరోధపడెనని తనకే కీడు వచ్చును.


17, డిసెంబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 87

బంగారు కుదువఁ బెట్టకు
సంగరమునఁ బాఱి పోకు,సరసుడవై తే
సంగడి వెచ్చము లాడకు,
వెంగలితఓఁ జెలిమివలదు వినరా సుమతీ.

భావం:-
బంగారము తాకట్టు పెట్టకుము, యుద్దమునందుపాఱిపోకుము, దుకాణమునందు వెచ్చములు అప్పు తీయకుము.అవివేకితో స్నేహము చేయకుము.


16, డిసెంబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 86

పొరుగునఁ పగవాడుండిన
నిరవొందగ వ్రాతకాడె యేలికయైనన్
ధరగాఁపు గొండెయైనను
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ.

భావం:-
ఇంటిపొరుగున విరోధికాపురమన్ననూ, వ్రాతలోనేర్పరియైన వాడు పాలకుడైననూ ,రైతు చాడీలు చెప్పెడివాఁడైననూ కరణములకు బ్రతుకుతెరు వుండదు.

15, డిసెంబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 85

పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములన్
బెట్టని దినములఁ గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ. 

 భావం:-
పూర్వజన్మమున తాను దానమిచ్చిన ఫలం వలన అర ణ్యమధ్యనున్నప్పటికినీ సకలపదార్దములు కలుగును.పూర్వజన్మమున దానమీయకున్నచో తాను బంగారుకొండ నెక్కినను ఏమియు లభించదు.("యద్దాతా నిజ ఫాలపట్ట లిఖితమ్"అనుశ్లోకమున కనుకరణము).

14, డిసెంబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 84

పులిపాలు దెచ్చిఇచ్చిన
నలవడఁగా గుండెగోసి యరచే నిడినన్
దలపొడుగు దనముఁబోసిన
వెలయాలికిఁగూర్మిలేదు వినరా సుమతీ. 

 భావం:-
పులిపాలు తెచ్చినను,గుండెకాయనుకోసి అరచేతిలో బెట్టినప్పటికినీ,తెలెత్తు ధనము పోసినప్పటికినీ స్త్రీకి ప్రేమ యుండదు. 

13, డిసెంబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 83

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడుజన్మించినపుడె పుట్టదు,జనులా
పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ. 

 భావం:-
తండ్రికి కుమారుడు పుట్టగానే పుత్రుడు గల్గుటవలన వచ్చు సంతోషము గలుగదు,ప్రజలు ఆ కుమారుని జూచి మెచ్చిన రోజుననే ఆ సంతోషము కలుగును. 

12, డిసెంబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 82

వురికిని బ్రాణము కోమటి,
వరికినిఁ బ్రాణంబు నీరు,వసుమతిలోనన్
కరికిని ప్రాణము తొండము
సిరికినిఁ బ్రాణంబు మగువ,సిద్దము సుమతీ. 

 భావం:-
పట్టణమునకు కోమటియు,వరిపైరునకునీరును,ఏనుగునకు తొండమును,సంపదలకు స్త్రీ యును ప్రాణము వంటివి. 

11, డిసెంబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 81

పిలువని పనులను బోవుట.
గలయని సతి రతియు,రాజు గానని కొలువున్
బిలువని పేరంటంబును,
వలవని చెలిమియును జేయ వలదుర సుమతీ. 

 భావం:-
పిలువని పనులను పోవుటయు,ఇష్టపడని స్త్రీతో భోగించుట యు,రాజు చూడని ఉద్యోగమును,పిలువని పేరంటంబును,ప్రేమించని స్నేహమును చేయరాదు. 

10, డిసెంబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 80


పాలసునకైన యాపద
జాలిబండి తీర్చతగదు సర్వజ్ఞునకున్
దే లగ్ని బడగ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ.


భావం:-
అన్నియును తెలిసినవాడయునను,తేలు నిప్పులో బడినపుడు విచారము నొంది దనిని రక్షించుటకై పట్టుకొన్నచో,అది మేలునెంచకకుట్టును.అట్లే దుర్జనుడు కీడు వచ్చినపుడు జాలితో రక్షించినచో వాడు తిరిగి కీడే చేయును.

9, డిసెంబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 79

పాలను గలిసిన జలమును
బాలవిదంబుననె యుండు బరికింపగా,
బాలచవిఁ జెరచు గావున,
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ. 

 భావం:-
పాలతో గలసిన నీరు పాలవిధముగానే యుండును.కాని శోధించి చూడగా పాలయొక్క రుచిని పోగొట్టును.అట్లే చెడ్డవారితో స్నేహము చేసిన మంచిగుణములు పోవును.కావున,చెడ్డవారితో స్నేహము వద్దు. 

8, డిసెంబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 78

పా టెరుగని పతి కొలువును,
గూటంబున కెఱుకపడని గోమలి రతియున్,
జేటెత్త జేయు జెలిమియు
నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ. 

 భావం:-
పనియొక్క కష్టసుఖములు తెలుసుకొని అధికారిసేవయును, కూటమి తెలియనటువంటి స్త్రీయొక్క సంభోగమును,కీడును కలిగింపజేయు స్నేహమును,విచారించి చూడగా-నదికి ఎదురుగా యీదు నంతటి కష్టమువలె నుండును. 

7, డిసెంబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 77

పలుశోమి సేయు విడియము
తలఁగడిగిననాటి నిద్ర,తరుణుల తోడన్
బొలయలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ. 

 భావం:-
దంతములు తోముకొనిన వెంటనే వేసుకొను తాంబూలమును,తలంటుకొని స్నానము చేసిననాటినిద్రయును,స్త్రీలతో ప్రణయకలహమునాడు కూడిన పొందును-వీటి విలువ యింతని చెప్పలేము సుమా. 

6, డిసెంబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 76

పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,
గర్వింపఁ నాలి బెంపకు
నిర్వాహము లేనిచోట నిలువకు,సుమతీ. 

 భావం:-
పుణ్యదినంబులందు స్త్రీలను పోదుకము, రాజుయొక్క శయను నమ్మి పొగకుము. గర్వించినట్లుగా భార్యను పోషింపకుము. బాగుపడ లేనిచోట యుండకుము. 

5, డిసెంబర్ 2013, గురువారం

సుమతీ శతకం - 75

పరుల కనిష్ఠము సెప్పకు,
పొరుగిండ్లకుఁ బనులు లేక పోవకు మెపుడున్
బరుఁగలిగిన సతి గవయకు
మెరిఁగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ. 

 భావం:-
ఇతరులకు యిష్టముగానిదానిని మాట్లాడబోకుము, పనిలేక ఇతరుల ఇండ్లకెన్నడునూ వెళ్ళకుము, ఇతరులు పొందిన స్త్రీని పొందకుము, పెంకితనము గలిగిన గుఱ్ఱము నెక్కకుము. 

4, డిసెంబర్ 2013, బుధవారం

సుమతీ శతకం - 74

పరునాత్మఁ దలచుసతి విడు,
మరుమాటలు పలుకు సుతుల మన్నింపకుమీ,
వెఱ పెఱుగనిఁ భటు నేలకు
తఱుచుగ సతిఁ గవయబోకు,తగదుర సుమతీ. 

 భావం:-
మనసులో పరపురుషుని కోరునట్టి భార్యను విడువవలయును,మారుమాట్లాడు కుమారుని క్షమించవలదు, భయపడని సేవకుని యుంచు కొనరాదు, పలుమారులు భార్యతో పొందు మానవలెను. 

3, డిసెంబర్ 2013, మంగళవారం

సుమతీ శతకం - 73

పరసతుల గోష్ఠినుండిన
పురుషుఁఢు గాంగేయుఁడైన భువినిందవడున్,
బరసతి సుశీలయైనను,
బరుసంగతినున్న నింద పాలగు సుమతీ. 

 భావం:-
బ్రహ్మచర్య వ్రతముగల భీష్ముడైనప్పటికినీ,పరకాంతల ప్రసంగములో నున్నచో అపకీర్తి పాలగును.అట్లే,మంచిగుణముగల స్త్రీయైననూ పరపురుషుని సహవాసము గల్గియున్నచో అపకీర్తి పాలగును. 

2, డిసెంబర్ 2013, సోమవారం

సుమతీ శతకం - 72

పరసతి కూటమిఁ గోరకు,
పరధనముల కాసపడకు,పరునెంచకుమీ,
సరిగాని గోష్టి చేయకు,
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ. 

భావం:-
పరసతుల పొందు గోరకుము,ఇతరుల భాగ్యమున కాశపడకుము,పరుల తప్పులెంచకుము.తగనటువంటి ప్రసంగముచేయుకుము. ఐశ్వర్యము కోల్పోయిన కారణముగా బంధువుల వద్దకు వెళ్ళకుము. 

1, డిసెంబర్ 2013, ఆదివారం

సుమతీ శతకం - 71

పరనారీ సోదరుఁడై
పరదనముల కాసపడక,పరులకు హితుఁడై
పరులుఁ దనుఁబొగడ నెగడకఁ,
బరు లలిగిన నలుగనతఁడు,పరముఁడు సుమతీ. 

 భావం:-
పరస్త్రీలకు సోదరునివలెనుండి,పరుల భాగ్యముల కాశింపక,పరులకు స్నేహితుడై,పరులు తన్ను కొనియాడినచో వుబ్బక,పరులు కోపించిననూ తాను కోపించని మనుష్యుడే యుత్తముడు. 

30, నవంబర్ 2013, శనివారం

సుమతీ శతకం - 70

పనిచేయు నెడల దాసియు,
ననుభవమున రంభ,మంత్రి యాలోచనలన్,
దనుభక్తి యెడలఁ దల్లియు,
యనదగు కులకాంత యుండనగురా సుమతీ. 

 భావం:-
భార్యయనునది-ఇంటిపనులు చేయునపుడు సేవకురాలగును,భోగించునపుడు రంభవలెను,సలహాలు చెప్పునపుడు మంత్రి కావలెను,భుజించునపుడు తల్లివలెను ఉండవలెను

29, నవంబర్ 2013, శుక్రవారం

సుమతీ శతకం - 69

పతికడకు,తన్నుఁగూర్చిన
సతికడకును,వేల్పుఁకడకు,సద్గురు కడకున్,
సుతుకడకు, రిక్త చేతుల
మతిమంతుల చనరు,నీతి మార్గము సుమతీ. 

 భావం:-
నీతి ప్రవర్తన గలవారు;యజమాని దగ్గరకును,తనను ప్రేమించిన భార్య యొద్దకును,దేవుని సముఖమునకును,గురువు కడకును,కుమారుని దగ్గరకును వట్టి చేతులతో వెళ్ళరు,ఇదియే నీతిమార్గము.