Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

2, మే 2012, బుధవారం

ఆంధ్ర నాయక శతకము -కాసుల పురుషోత్తమ కవి




                             ఆంధ్ర నాయక శతకము
                                                       -కాసుల పురుషోత్తమ కవి


ఆలు నిర్వాహకురాలు భూదేవియై - యఖిలభారకుఁడను నాఖ్యఁ దెచ్చెఁ
నిష్ట సంపన్ను రాలిందిర భార్యయై - కామితార్థదుఁడన్న ఘనతఁదెచ్చెఁ
గమల గర్భుఁడు సృష్టికర్త తనూజుఁడై - బహుకుటుంబకుఁడన్న బలిమిఁదెచ్చెఁ
గలుష విధ్వంసియౌ గంగ కుమారియై - పతిత పావనుఁడన్న ప్రతిభఁదెచ్చె |సీ|
నాండ్రు బిడ్డలుఁ దెచ్చు ప్రఖ్యాతిగాని
మొదటి నుండియు నీవు దామోదరుఁడవె
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! |తే|



కవ్వడి కెంత చక్కగా బోధ చేసిన-నితర హింసాకర్మ మిష్ట పఱుప
రాయబారంబెంత రసికత నడపిన-ననికి భారతుల నాయుత్త పఱుప
విశ్వరూపంంబెంత విమలతఁ జూపిన-నోర్వని కురురాజు నులుకుపఱుప
విలుఁబట్టనని యెంతొ చెలిమిగఁ బలికిన-నవల సుయోధను నాసపఱుప |సీ|
పోరు చంపక చుట్టముల్ పోరనీల్గఁ
జూచు చుంటివి యేనాటి చుట్టమీవు?
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! |తే|



కులగురు ద్వేషి నొజ్జలుగ వెన్కొని కాచి-నిష్టుర మంత్రముల్ నేర్చినావు,
పూర్వ దేవతలు కాఁపురమున్న పురియందు-వంచించి యగ్గిబెట్టించినావు,
తాతల తరమునఁ ద్రవ్వించిన పయోధి-పేరుగాఁ గొంత పూడ్పించినావు,
మునియౌటెఱుంగక మోహించి వచ్చిన-యెలనాఁగ ముక్కు గోయించినావు, |సీ|
బళిర! నీవంటి ధార్మికుఁ బ్రస్తుతింపఁ
గొదవ లింకేమి, కైవల్య మెదుట వచ్చు!
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! |తే|



నాఁగలి రోఁకలన్నకు నిచ్చి శంఖాది-పంచాయుధములీవు పట్టినావు,
తాటి టెక్కెంబు కోల్తల పెద్ద కెత్తించి- గరుడధ్వజంబీవు గట్టినావు,
మద్యమగ్రజునకు మత్తిలఁ ద్రావించి-జున్నుపాల్పెరుగీవు జుఱ్ఱినావు
వెలరాని కఱవోని వలువ జ్యేష్ఠున కిచ్చి-కనకాంబరంబీవు గట్టినావు, |సీ|
తగవరివె యన్నదమ్ముల ధర్మమీవె
తీర్పవలెఁ గాని మఱి యొండు తీర్పఁగలఁడె
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! |తే|



పక్షంబు గలదండ్రు పాండు పుత్రులయందు -పాండవుల్ పడినట్టి పాటులేమి!
పూర్వ జన్మమునందుఁ బూజించె గజమండ్రు -గజరాజు పొందిన గాసి యేమి!
యల కుచేలునకు బాల్య స్నేహితుఁడవండ్రు -నెఱిఁ గుచేలుఁడు పడ్డ నెవ్వ లేమి!
ప్రహ్లాదుఁ డాజన్మ భక్తి యుక్తుడండ్రు -ప్రహ్లాదుడొందిన బాధలేమి! |సీ|
యెంత యాలస్యమున వారినేలినాడ
విట్టిదే నీ దయారసంబెంచి చూడ!
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! |తే|



రాజకార్య పరుండు తేజోబలాధికుఁ -డాంజనేయుఁడు భృత్యుడగుటఁ జేసి,
యమిత శౌర్యుఁడు ప్లవంగుమ కులేశుఁ డినజుఁ -డఱలేని స్నేహితుఁడగుటఁ జేసి,
విమత మర్మజ్ఞుండు విశ్వాస భరితాత్ముఁ -డల విభీషణు డాప్తుడగుటఁ జేసి,
సుమనస్సుల మనస్సులమృత వాక్యంబులన్ -బొసగ నాశీర్వదించుటను జేసి, |సీ|
లంక సాధించితివి గాని, లావు చేత
నిర్జరారుల గెలవంగ నీతరంబె?
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! |తే|




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి