Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

2, మే 2012, బుధవారం

దాశరథీ శతకము- కంచెర్ల గోపన్న



                                దాశరథీ శతకము
                                                   - కంచెర్ల గోపన్న ( రామదాసు)


కంటి నదీతటంబుఁ, బొడగంటిని భద్ర నగాధి వాసమున్,
గంటి నీలా తనూజ నురుకార్ముక మార్గణ శంఖచక్రముల్,
గంటిని మిమ్ము, లక్ష్మణునిఁ గంటిఁ, గృతార్థుడనైతి, నో జగ
త్కంటక దైత్య నిర్దళన, దాశరథీ కరుణాపయోనిధీ! |ఉ|



చక్కెరమాని వేము దినజాలిన కైవడి మానవాధముల్
పెక్కురు బక్కదైవముల వేమరుఁ గొల్చెదరట్ల కాదయా!
మ్రొక్కిన నీకు మ్రొక్కవలె, మోక్షమొసంగిన నీవ ఈవలెన్,
దక్కిన మాట లేమిటికి? దాశరథీ కరుణా పయోనిధీ! |ఉ|



చరణము సోకినట్టి శిల జవ్వని రూపగుటొక్క వింత, సు
స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింత, గాని, మీ
స్మరణ దనర్చు మానవులు సద్గతిఁ జెందిన దెంత వింత యీ
ధరను? ధరాత్మజా రమణ, దాశరథీ కరుణా పయోనిధీ! |చ|



చిక్కని పాలపై మిసిమిఁ జెందిన మీగడ పంచదారతో
మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధారసంబు నా
మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణా పయోనిధీ! |ఉ|



"పరమ దయానిధే! పతిత పావన నామ హరే!" యటంచును
స్థిరమతులై సదా భజన సేయు మాహాత్ముల పాద ధూళి నా
శిరమునఁ దాల్తు మీరటకుఁ జేరకుడనుచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ! |చ|



భండన భీము డార్తజన బాంధవు డుజ్జ్వల బాణ తూణ కో
దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి, రామ మూర్తికిన్,
రెండవ సాటి దైవ మిక లేడనుచున్, గడగట్టి, భేరికా
దాండ డడాండ డాండ నినాదంబు లజాండము నిండ, మత్తవే
దండము నెక్కి చాటెదను! దాశరథీ కరుణా పయోనిధీ! |ఉత్పల మాల మాలిక|



ముప్పునఁ గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్
గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదొ, నాటికిప్పుడే
తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధీ! |ఉ|



శ్రీ రఘురామ, చారు తులసీ దళ ధామ, శమ క్షమాది శృం
గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, దు
ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ! |ఉ|



శ్రీరమ సీత గాగ, నిజసేవక బృందము వీర వైష్ణవా
చార జనంబుగాగ, విరజానది గౌతమిగా వికుంఠము
న్నారయ భద్ర శైల శిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ! | ఉ |



సిరి గల నాడు, మైమరచి చిక్కిన నాడు, తలంచి పుణ్యముల్
పొరి పొరి చేయనైతి నని పొక్కినఁ గల్గునె? గాలి చిచ్చు పై
కెరలిన వేళ, డప్పి గొని కీడ్పడు వేళ, జలంబుఁ గోరి త
త్తరమునఁ ద్రవ్వినం గలదె? దాశరథీ కరుణాపయోనిధీ! |చ|



హలికునకున్ హలాగ్రమున నర్థము సేకురు భంగి, దప్పిచే
నలమటఁ జెందు వానికి సురాపగలో జలమబ్బినట్లు, దు
ర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్నొడఁగూర్చి నీ పయిం
దలపు ఘటింపఁ జేసితివి దాశరథీ కరుణాపయోనిధీ! |చ|



1 కామెంట్‌: