Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
కుమారీ శతకము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కుమారీ శతకము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2013, శనివారం

కుమారీ శతకం - 80

దానములు ధర్మకార్యము
లూనగాఁ గలిగినంత యుక్తక్రియలన్
మానవతుల కిది ధర్మము
గా నెఱిఁగి యొనర్పవలయు గాదె కుమారీ! 

భావం:-
ఓ కుమారీ!దానదర్మములు కలిగినంత మేరకే తగిన విదంగా జేయవలయును.అదియే స్త్రీలకు పరమదర్మమని తెలుసుకొనవలెను.

16, ఆగస్టు 2013, శుక్రవారం

కుమారీ శతకం - 79

పనిసేయునపుడు దాసీ
పనితవిదంబునను మేను వంపగవలయున్
ధనవంతుల సుత యైనను
ఘనత గలుగు దానివలన గాదె కుమారీ! 

  భావం:-
ఓ సుకుమారీ!తన ఇంట దాశీదానివలె శరీరమును ఒంచి పని చేయవలెను.ఎంతటి శనవంతుల కోతురైననూ భర్తకిట్టి సపర్యలు జేసినచో మహితాత్మురాలగును.(కార్యేషు దాసి). 

15, ఆగస్టు 2013, గురువారం

కుమారీ శతకం - 78

ఆలోచన యెనరించెడి
వేళలలో మంత్రిభంగి వివరింపవలెన్
కాలోచిత కృత్యంబుల
భూలోకమునందు గీర్తిఁ బొందు కుమారీ! 

 భావం:-
ఓ సుకుమారీ!మంత్రివలె మగనికి మంచి స్పూర్తినిచ్చెడి ఆలోచనా తోడ్పాటు నందివ్వవలెను.అట్లు చేసిన యాడుది లోకములో కీర్తిని బొందును.(కరణేషు మంత్రి)

14, ఆగస్టు 2013, బుధవారం

కుమారీ శతకం - 77

పవళించునపుడు రంభా
కువలయదళనేత్రభంగీ గోరినరీతిన్
ధవుని కొనఁగూర్పవలయును
దివి భువి నుతి బొందునట్టి తెఱువ కుమారీ! 

 భావం:-
ఓ కుమారీ!మగని కోరిక దీర్చుటే మగువకు పుణ్యమని ఎరింగి,అతని మనస్సుని దెలుసుకొని రంభవలె నలంకరించుకొని,అతని కోరికను ప్రియముతో నెరవేర్చవలయును.అట్లు చేసిన ఆడది ఇహపరలోకములందు ముక్తిని పోదును.(శయనేషు రంభ) 

13, ఆగస్టు 2013, మంగళవారం

కుమారీ శతకం - 76

వడ్డించునపుడు తాఁగను
బిడ్డనికిం దల్లి భంగిం బ్రేమ దలిర్పన్
వడ్డింపవలయు భర్తకు
నెడ్డెతనము మానవలయు నెందు కుమారీ! 

 భావం:-
 ఓ సౌశీల్యవతీ!కన్నతల్లి తన బిడ్డకు ప్రేమతో నెట్లు వడ్డించునో అట్లే నీవు నీ భర్తకు గూడా ప్రీతితో వడ్డింపవలెను.ఎచ్చటనైననూ రోతపుట్టునట్లు నడుచుకొనరాదు.(భోజ్యేషు మాతాః భర్తకు వడ్డించేటప్పుడు తల్లిగా)

12, ఆగస్టు 2013, సోమవారం

కుమారీ శతకం - 75

వాణియు శర్వాణియు హరి
రాణియు వాక్కునను మైను రంబున నుంటల్
రాణఁ దిలకించి మదిలో
బాణీగ్రాహియెడ నిల్పు భక్తి గుమారీ! 

  భావం:-
ఓ చినదానా!సరస్వతీ,పార్వతి,లక్ష్మీదేవులు తమదమ భర్తల నాశ్రయించుకొనియుండుట తెలుసుకొని నీ భర్తయందు గూడా అంతే బ్రీతితో మెలుగుము.(సరస్వతీ దేవి తన భర్తయైన బ్రహ్మముఖమునందును;పార్వతీదేవి తన భర్త ఈశ్వరుని శరీరమందునూ,(అర్థనారీశ్వరుడు);లక్ష్మీదేవి తన భర్తయైన విష్ణుమూర్తి వక్షస్థలమందునూ స్థిరనివాసమేర్పరుచూకొనుట ఎల్లరుకూ విదితమే గదా!) 

11, ఆగస్టు 2013, ఆదివారం

కుమారీ శతకం - 74


సుమతి యను రమణీ పతికై
శ్రమనొందుట నీచసేవ సలు పుటయు వియ
ద్గమననిరోదము భానున
కమరించుటయుం దలంపు మాత్మఁ గుమారీ! 

 భావం:-
ఓ సుకుమారీ!సుమతి తన భర్త కొఱకు పడరానిపాట్లు పడి,నీచులను గొలిచి,చివరకు తన భర్త ప్రాణము కాపాడుటకై గగనమార్గమున పోవుచున్న సూర్యభగవానుని గమనమును గూడ తన పాతివ్రత్య మహిమతో నిరోదించిన విషయం విడువకుమమ్మ! 




10, ఆగస్టు 2013, శనివారం

కుమారీ శతకం - 73

సుమతియును జంద్రమతియును
దమయంతియు జానకియును ద్రౌపదియునుబ
న్నములం బడి పతిభక్తిం
గ్రమమున నడుపుటలు తలఁప గాదె? కుమారీ!

 భావం:-
ఓ సుశీలాకుమారీ!సుమతి,చంద్రమతి,దమయంతి,సీత,ద్రౌపది మొదలగువారందరు పలు కష్టములు పడిననూ పతిభక్తి విడువలేదని మరువకుము.వారి నెల్లపుడు మనస్సున తలొంచుకొనుము. 

9, ఆగస్టు 2013, శుక్రవారం

కుమారీ శతకం - 72

గొప్పదశ వచ్చెననుచు నొ
కప్పుడయిన గర్వపడకు మదిఁ దొలఁగినచో
జప్పట్లు చరుతు రందఱు
దప్పని దండించుదండధరుఁడు కుమారీ!

 భావం:-
ఓ సుకుమారీ!దశతిరిగిందని,మంచిస్థితి వచ్చిందని విర్రవీగకుము.గర్వపడుకుము.ఎప్పుడెలా ఉంటుందో ఎవరికెరుక?అది తొలిగిననాడు అందరు నిన్ను జూచి తప్పట్లు కొట్టి ఎగతాళి చేస్తారు.యముడు కూడా నినే తప్పుబట్టి శిక్షిస్తాడు. 

8, ఆగస్టు 2013, గురువారం

కుమారీ శతకం - 71


సరుకులు బట్టలు వన్నెల
కెరపుల తేఁదగదు తెచ్చె నేని సరకు ల
క్కఱఁ దీర్చుకొనుచు వెంటనె
మరలింపకయున్న దప్పు మాట కుమారీ!

 భావం:-
ఓ సుకుమారీ!సామాగ్రినిగాని,సరకులను గాని,చేబదుళ్ళుగాని పైన వస్త్రము కప్పి దీసుకొని రావలయును.అంతేగాని అందరుకూ కనబడు విదమున దీసుకొని రాగూడదు.అప్పులు చేయదగదు.అరువు సరుకును ఉపయోగించిన తర్వాత మన అవసరము దీరిన వెంటనే ఇచ్చివేయవలెను."ఏమియు అనుకోరులే"యను భావమును విడనాడవలెను.

7, ఆగస్టు 2013, బుధవారం

కుమారీ శతకం - 70

అపకీర్తి బొందుట క
ష్టపుఁబని గా దొక్క గడియ చాలును గీర్తిన్
నిపుణత వహింపవలయును
జపలగుణములెల్లఁ బాసి చనఁగఁ గుమారీ! 

 భావం:-
ఓ కుమారీ!అపకీర్తి బొందుట కష్టము కాదు.దానికొక్క నిమిషము చాలును.కాని కీర్తిని సంపాదించవలెనన్న చెడ్డ బుద్దులను వదలి,సుగుణములతో భాసిల్లవలెను. 

6, ఆగస్టు 2013, మంగళవారం

కుమారీ శతకం - 69

గురుశుక్రవారముల మం
శిర గేహళులందు లక్ష్మీ తిరముగ నిలుచుం
గరగరిక నలకి మ్రుగ్గిడి
గురుభక్తి మెలంగఁ బాయు గొదువ కుమారీ! 

 భావం:-
ఓ సుకుమారీ!గురు,శుక్రవారములందు లక్ష్మీదేవి,ఇంటి గడపలయందు స్థిరముగా నిల్చును గాన గడపల నెప్పటికప్పుడు పసుపు కుంకుమలతో అలికి,ముగ్గులు పెట్టి శోభాయమానంగా నుంచుము.పెద్దలయెడ మర్యాద భక్తిభావములతో మెలగినచో ఆ ఇంట సిరిసంపదలు తులతూగుతాయి. 

5, ఆగస్టు 2013, సోమవారం

కుమారీ శతకం - 68

కలహపడునింట నిలువదు
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములు లేక సమ్మతి
మెలఁగంగా నేర్చనేని మేలు కుమారీ! 

 భావం:-
ఓ కుమారీ!కలహించు చోట కలిమి నిలువదు.కావున కొట్లాటలు లేని ఇంట నివశించుట శ్రేయస్కరము.ఎల్లపుడు ఎవరితోనూ కలహించక సామరస్యభావముతో నడుచుకొనుమమ్మా కుమారీ! 

4, ఆగస్టు 2013, ఆదివారం

కుమారీ శతకం - 67

కోపమున నప్పు డాడ ని
రూపించినమాట గొన్ని రోజులు చనినం
జూపెట్టుదు నని శాంతము
లోపలఁ గొనవలయు ధర్మ లోల కుమారీ! 

 భావం:-
ఓ కుమారీ!కోపము వచ్చినపుడు నిగ్రహము చూఅప్వలెను.కోపములో అనబోవు మాట తర్వాత తెలియజెప్పుదునని మనస్సును శాంతబరుచుకొనవలెను. 

3, ఆగస్టు 2013, శనివారం

కుమారీ శతకం - 66

విఱగఁబడి నడువఁ గూడదు
పరుల నడక లెన్ని తప్పు బట్టఁజనదు ని
ష్ఠములు వచింపఁగూడదు
కఱపఁగవలె మేలు మేలు గలదు కుమారీ! 

 భావం:-
ఓ సుకుమారీ!ఒద్దికగా నడవటం మంచిదిగాని,నిటారుగా మగానివలె నడుచుట మగువకు చేటు.ఇతరులను దప్పు బట్టరాదు.ఇతరుల మనస్సును నొప్పించే మాటలాడరాదు.మంచితనము నలవర్చుకొనవలెను.మూర్ఖత్వము విడనాడాలి.దీనివలన మేలు కలుగును. 

2, ఆగస్టు 2013, శుక్రవారం

కుమారీ శతకం - 65

తనకంటే భేదరాండ్రం
గని యంతకుఁ దనకు మేలు గా యనవలయున్
దనకంటె భాగ్యవంతులఁ
గని గుటకలు మ్రింగ మేలు గాదు కుమారీ! 

 భావం:-
ఓ సుకుమారీ!తనకంటే క్రిందనున్నవారిని జూచి తృప్తిపడవలెను గాని తన కన్న ఐశ్వర్యవంతులను జూచి ఈర్ష్యపడరాదు. 

1, ఆగస్టు 2013, గురువారం

కుమారీ శతకం - 64

తా నమ్ముడువడి యైనం
దీనుండగు ధవునియార్తిఁ దీర్చుగ సతికిన్
మానము చంద్రమతీ జల
జాననఁ దలపోయవలయు నాత్మ గుమారీ! 

భావం:-

 ఓ కుమారీ!మగడు భాగ్యహీనుడైనచో(డబ్బులేనివాడు)తానమ్ముడు బోయియైనను యాతని కష్టములబాపుట పతివ్రతా శిరోమణూల లక్షణము.దాని వలన మర్యాద గౌరవము హెచ్చును.హరిశ్చంద్రుని భార్యయైన చంద్రమతి శీలమును మదినందిసుకొని మసులుకొనుము. 

31, జులై 2013, బుధవారం

కుమారీ శతకం - 63

అదికారము లేనిపనుల
కదికారము సేయఁబోకు మందునఁ గోపం
బదికం బగు నీవారికి
బుదు లది విని హర్ష మొంద బోరు కుమారీ! 

భావం:-
ఓ సుకుమారీ!కాని పనులలో తల దూర్చకుము.దానివలన ఎల్లరునూ నీపై కోపగింతురు.పెద్దలు కూడా సంతోషించరు సుమీ! 

30, జులై 2013, మంగళవారం

కుమారీ శతకం - 62

ఎంతటి యాఁకలి కలిగిన
బంతిని గూర్చుండి ముందు భక్షింపకు సా
మంతులు భందువులను నిసు
మంతైనను జెల్ల దందు రమ్మ కుమారీ! 

 భావం:-
ఓ శీలవతీ!బంతిలో కూర్చొన్నపుడు ఎంతటి ఆకలితోనున్ననూ ముందు తినగూడదు.అందరితోబాటు సమానముగా దినుటనలవర్చుకొనుము.పెద్దలందరూ అట్లు చేయుట తప్పని నిందింతురు.కాదని ఎదిరించి తిన్నచో మూర్ఖురాలివగుదువు. 

29, జులై 2013, సోమవారం

కుమారీ శతకం - 61

చెప్పకు చేసినమేలు నొ
కప్పుడుయైనఁ గాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
దప్పే యని చిత్తమందు దలఁపు కుమారీ! 

 భావం:-
ఓ సుకుమారీ!నీవు జేసిన మేలు ఎన్న్డైననూ పరులకు జెప్పకు అట్లు చెప్పిన నెవ్వరునూ సంతోషింపరు.గొప్పలు చెప్పుకొనుట కూడా మంచిది కాదు.దానివల్ల సంపాదించిన పుణ్యము ఖర్చగును.